నారద మహా పురాణము - పూర్వార్థము
49 - బృహదుపాఖ్యానమ్
సనందన మహర్షి పలి కెను :- రొజు ఇట్లు పరమార్ధమైన బ్రాహ్మణుని మాటలను విని వినయముచే వినమ్రుడై ఇట్లు పలికెను.
రాజు పలికెను :- ఓ మహానుభావో ! మీరు చెప్పిన పరమార్థమయమైన మాటను వినిన తరువాత నా మానసిక ప్రవృత్తులు భ్రాంతి చెందుతున్నట్టుగా తోచుచున్నవి. మిగిలి ప్రాణిజాతములలో ఈ వివేకము విజ్ఞానము కానరాదు. మీరు చూపిన విజ్ఞానము ప్రకృతికి అతీతమైనది. నేను పల్లకిని మోయుట లేదు. పల్లకి నా మీద లేదు. పల్లకిని మోయు శరీరము నాకంటే భిన్నమైనది. ప్రాణుల గుణప్రవృత్తి కర్మచే ప్రేరేపించబడును. ఇట్లు గుణములు ప్రవర్తించునపుడు నాదేది? అని మీరంటీరి. ఓ పరమార్ధ జ్ఞానము కలవాడా; మీ మాటలు నా చెవిన పడినపుడు సంపూర్ణముగా పరమార్ధము తెలియనందున నా మనసు వ్యాకులమగుచున్నది. ఈ సంశయగ్రస్తమగు సంసారమునందు హితమును కలిగించునదేది? అని కపిలమహర్షిని అడుగుటకే నేను బయలుదేరి యుంటిని. ఈ మధ్యలో మీరు పలికిన మాట పరమార్ధమును తెలుసుకొనమని నా మనసును ప్రేరేపించుచున్నది. సర్వజగత్స్వరూపుడగు శ్రీమహావిష్ణువు అంశమే జగన్మోహనోశమునకు కపిలమహర్షిగా అవతరించేననీ వింటీమి. ఆ భగవానుడు మాకు హితమును కూర్చు తలంపుచే ప్రత్యక్షమాయెనేమో? అని మీ మాటలు సందేహమును కలిగించుచున్నవి. కావున సమస్త విజ్ఞాన జలతరంగసముద్రమగు నీవు నా మోహము నశించుటకు ఉపయోగించు హితమునుపదేశించుము.
బ్రాహ్మణుడు పలికెను:- మరల ఏమడుగుచున్నావు? శ్రేయస్సును పరమార్థముగా నడుగుచుంటివా? అన్ని శ్రేయస్సులు పరమార్ధములుగానే చెప్పబడుచున్నవి. దేవతారాధనమును చేసి ధనసంపదను కోరును. పుత్రులను కోరును. రాజ్యమును కోరును. వారికవియే శ్రేయస్సులు. వివేకము కలవారికి మాత్రము పరమాత్మతో సంయోగమే శ్రేయస్సు. స్వర్గాది లోకఫలములనిచ్చు యజ్ఞాది కర్మ లు కూడా శ్రేయస్సులే. ఫలమునాశించక చేయునది ప్రధానమగు శ్రేయస్సు. కావున యోగయుక్తులగు నరులు ఎల్లపుడు ఆత్మను ధ్యానించవలయును. ఇతరులు కూడా ఆత్మ నే ధ్యానించవలయును. ఆత్మ ధ్యానమే నిజమగు శ్రేయస్సు. పరమాత్మ సంయోగమే శ్రేయస్సు. ఇట్లు కొన్నివందల వేల శ్రేయస్సులు కలవు. కాని ఇవియన్నియూ పరమార్థములు కావు, నా మాటను వినుము. నిజముగా ధనమే పరమార్ధమగుచో ధనము నెందుకు విడుచుచున్నారు. కామఫలప్రాప్తి కొరకు వ్యయమెందుకు చేయుచున్నారు? పుత్రుడు పరమార్ధమైనచో అతడు కూడా ఇతరులకు ఈయబడుచున్నొడు. తీసుకొనువాడు పరమార్థమన్నచో అతను కూడా ఇతరులకు తండ్రి యగును కదా? తండ్రి పరమార్థమగుచో ఇతరుల కొరకేల తండ్రిని విడుచుచుంటివి? కావున ఈ జగత్తులో ఏ ఒక్కటీ నియతముగా పరమార్థమని చెప్పుటకు వీలు పడదు. సమస్త కోరణములకు కార్యములను పరమార్ధముగా చెప్పబడుచున్నది. రాజ్యాది ప్రొప్పులను పరమార్ధములుగా చెప్పినచో పరమార్ధములగును. చెప్పనిచో పరమార్ధములు కాజాలవు.ఋగ్యజుస్సామములతో నిష్పన్నములగు యజ్ఞాదులు పరమార్ధములగుచో ఆవిషయమున నేను చెప్పుదానిని వినుము. కారణ భూతమగు మృదాదులచే నిష్పన్నమగునది కారణము ననుసరించి మృణ్మయమగును. అట్లే నశించు స్వభావముకల సమిధలు దర్భలు పుష్పములు మొదలగు ద్రవ్యములచే చేయబడు క్రియ కూడా వినాశియే యగును. పరమార్ధము నాశము లేనిదని పండితులంగీకరింతురు. నశించునది " నశించుద్రవ్యములచే ఏర్పడినదనుట నిస్సందిగ్గమే, అది ఫలమునిచ్చునది కాదు. కావున ఫలము నీయని కర్మ పరమార్థమని చెప్పవలయును. ముక్తికి సాధనమగు నదియే పరమార్థమనిచో పరమార్ధము సాధనము కాజాలదు. ఆత్మ ధ్యానము మాత్రమే పరమార్థమనబడును. ఇతరులు . భేదమును కల్పింతురు కాని పరమార్ధమునకు భేదము లేదు. , పరమార్ధమునకు ఆత్మకు సంయోగము మాత్రమే పరమార్ధము. మిగిలిన " ద్రవ్యమును పరమార్దమనుట మీధ్యయే యగును, పరమార్ధము ద్రవ్యమయము కాక పోవుటయే దానికి కారణము. కావున ఇవి యన్నియు శ్రేయస్పులు మాత్రమే కొని పరమార్థములు కావు. పరమార్ధమును సంక్షేపముగా చెప్పెదను వినుము. ఒకడు, వ్యాపకుడు, సముడు, శుద్దుడు, నిర్గుణుడు, ప్రకృతి కంటే పరుడు, జన్మవృద్ద్యాది రహితుడు, సర్వగతుడు ఆత్మ. నామ జాత్యాదులచే సజ్జనులు తెలియుదురు.ఆత్మయే విభువు. ఆత్మయోగము కలది కాది, యుక్తము కాదు. యుక్తము కాబోదు. ఆ యాత్మ తన, ఇతర దేహములలో ఉన్ననూ ఒక్కటే కాని భిన్నము కాదు. ఆత్మను తెలియు ఓ పరమార్ధము. అసత్యమును చూచువారు దీనిని తెలియ జాలరు. వేణురంధ్రముల భేదములచే షడ్డాది స్వరభేదములు ఏర్పడును. కాని అన్నిరంధ్రములలో వ్యాపించియుండు వాయువు మాత్రము ఒక్కటే. అట్లే దేహాదులు భిన్నములైనను ఆత్మ ఒక్కటే. రూపభేదము బాహ్యకర్మ ప్రవృత్తులచే ఏర్పడినది మాత్రమే. రూపాది భోగములచే దేవాది భేదములను పొందును కాని ఆచరణలో మాత్రమే సమానమే. ఈ విషయమున పూర్వకాలమున జరిగినది ఋభువుచే చెప్పబడినది. ఒకటి కలదు. వినుము. బ్రాహ్మణుడగు నిధఘునకు చేసిన జ్ఞానోపదేశమది.
పరమేష్టియగు బ్రహ్మకు ఋభువను పుత్రుడు కలడు. సహజముగా ఋభువు తత్త్వార్ధ జ్ఞానము కలవాడు. ఆ ఋభువునకు పులస్త్యతనయుడగు నిదాఘుడను వాడు శిష్యుడుగా ఉండెను. ఋభువు పరమానందముతో సమస్త విజ్ఞానమును బోధించెను. ఇట్లు తత్త్వ జ్ఞానము కలిగిన నిదాఘనకు అద్వైత వాసన కలుగలేదని ఋభువు ఊహించెను. జ్ఞానమును పొందిన నిదాఘుడు తన తండ్రివసించు నాగరమను పురమునకు వెళ్ళి నివసించేను. ఆ పురము దేవినదీ తీరమున నుండెను. సర్వసంపత్సమృద్ధము, అతిసుందరము సుందరోపవనయుతము. ఆ నగరమున యోగజ్ఞుడగు నిదాఘుడు నివసించుచుండెను. దివ్యములగు వేయిసంవత్సరములు గడిచిన తరువాత తన శిష్యుడగు నిదాఘుని చూచుటకు ఋభువు వేడలేను. నిదాఘుడు వైశ్వదేవమును పూర్తిగావించిన పిదప ద్వారదేశమున ఋభుని చూచి లేచి ఎదురేగి స్వాగతము పలికి లోనికి తీసుకొని వచ్చి పాదప్రక్షాళనముచేసి ఆసనమున కూర్చుండబెట్టి భుజించుడని పలికెను.
ఋభువు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా!మీ గృహమున ఏమి తినవలయునో చెప్పుము. ఈ కుత్సితాన్నము నందు నాకు ప్రీతిలేదు.
నిదాఘుడు పలికెను :- సత్తు పిండి, యవలు ద్రోహులచే చేయబడిన పదార్ధములు అపూపములు నా ఇంటిలో సమృద్ధిగా నున్నవి. వాటిలో మీకు నచ్చిన వాటిని భుజించుడు.
ఋభువు పలికెను:- ఇదియన్నియూ కదన్నములే. నాకు మిష్టాన్నమునిమ్ము భక్ష్యములను పాయసములను చెరుకు రసములను ఇమ్ము.
నిదాఘుడు పలికెను :- ఓ శాలినీ ! మన ఇంటిలో ఉన్న ఉత్తమ ఫదార్ధములతో రుచికరమైన ఉత్తమాన్నమును సిద్ధము చేయుము అనీ భార్యతో పలుకగా నిదాఘుని భార్య రుచికరమైన ఆహారమును సిద్ధము చేసెను. ఋభుడు ఆ ఆహారమును భుజించెను. అపుడు నిదాఘుడు వినయముతో వినమ్రుడై ఋభునితో - ఇట్లు పలికెను.
నిదాఘుడు పలికెను : ఓ బ్రాహ్మణోత్తమా ! మీరు కోరిన రుచికరమైన ఆహారముతో మీకు తృప్తి పుష్టి కలిగినవా? మీ మనసుకు స్వస్థత చేకూరినదా? మీరు ఎక్కడ నివసించుచున్నారు? ఎచటికి బయలుదేరుతున్నారు? ఎచటి నుండి వచ్చుచున్నారు? దయచేసి తెలుపుడు.
ఋభువు పలికెను :- ఆకలిగొన్నవాడు అన్నమును భుజించినచో తృప్తి కలుగును. నాకు ఆకలి లేదు. తృప్తి లేదు. నన్నేల అడుగుచున్నావు? అగ్నిచే పార్థివము దహించబడగా ఆకలి కలుగును. దానిని పార్థివకుల్ అందురు. శరీరములోని నీరు తరిగినచే దప్పియగును. మనసు అడిగిన దానితో జీవునకు సంబంధములేదు. మీనివాసమెక్కడ? మీరెక్కడికి వెళ్ళుచున్నారు? ఎక్కడి నుండి వచ్చుచున్నారు? అని నీవడిగితివి. ఈ మాటి విషయమున నేను చెప్పుదానిని తెలియుము. జీవుడు ఆకాశము వలె అంతటా వ్యాపించియుండును. కావున ఎక్కడ, ఎచటినుండి? ఎచటికి? అను ప్రశ్నలకు అర్థమెట్లుండును? జీవుడనగు నేను వెళ్ళువాడను కాను, వచ్చువాడను కాను. ఒకే ప్రదేశమున ఉండువాడను కాను. నీవు కాని ఇతరులు కాని ఇంతియే. నీవు నీవు కావు, నేను నేను కాను ఇతరులు ఇతరులు కారు. రుచికరమైన ఆహారమును కోరినది జిహ్వ. రుచిని తెలుపునదికూడా జిహ్వయే. ఆ జిహ్వ ఏమి చెప్పుతో వినుము. రుచికరమైనది నిజముగా రుచించినచో ఉద్వేగమును కలిగించును. రుచి లేనిది రుచి కలిగించును. రుచి కలిగిన ఉద్వేగము కలుగును. ఆదిమధ్యావసానములలో అన్నము రుచి కారణమగునా? మట్టితో నిర్మించిన ఇంటిని మరల మట్టిచే చక్కగా పై పూత పూసినచో స్థిరముగా నుండును. అట్లే పొర్ధవమైన ఈ దేహము పార్ధివ పరమాణువులచే దృఢమగును. యవలు, గోధుమలు, పెసలు, ఘృతము, తైలము, పాలు, పెరుగు గుడము ఫలములు ఇవియన్నియు పార్థివ పరమాణు సంఘాతములే. దీనిని తెలుసుకొని మీష్టమో అమిష్టమో ఆలోచించుము. అట్లాలోచించినచో మనశ్శాంతి కలుగును. అపుడు ముక్తికి ప్రయత్నించవలయును. ఇట్లు ఋభువు పలికిన పరమార్థయుక్తమగు వచనమును వినిన నీదొఘుడు ప్రణామముల నాచరించి ఇట్లు పలికెను. ఓ మహానుభావా? ప్రసన్నుడవు కమ్ము. మీరు నాకు హితమును కూర్చుటకే వచ్చియుంటిరి. ఓ బ్రాహ్మణోత్తమా? మీరు పలికిన మాటలను విని నా మోహము తొలగినది.
ఋభువు పలికెను :- నేను ఋభుడను వాడను, నీ ఆచార్యుడను. నీకు జ్ఞానమును ప్రసాదించుటకు ఇటకొచ్చితిని. నీకు చక్కని పరమార్ధమును సులభముగా బోధించెదరు. ఈ జగత్తంతయూ ఒకటే. భిన్నము కాదు. ఈ ప్రపంచమంతయూ పరమాత్మ యగు వాసుదేవుని స్వరూపమే.
బ్రాహ్మణుడు పలికెను :- నిదాఘుడు అట్లే అని పలికి పరమభక్తితో పూజించగా పూజను స్వీకరించి సంతృప్తితో వెడలిపోయెను. మరల వేయిసంవత్సరములు గడిచిన పిదప నిదాఘునకు, జ్ఞానమునిచ్చుటకు ఆదే నగరమునకు వచ్చెను. నగరము వెలుపల ఋభువు మునిగా నున్న నిదాఘుని చూచేను. మహా సైన్యముతో రాజు నగరములోనికి ప్రవేశించుచుండగా జన సమ్మర్ధములేని ఏకాంత ప్రాంతమున దూరముగా నున్న వానిని ఆకలి దప్పులచే శుష్క గాత్రునిగా అరణ్యమునుండి సమిధలను దర్భలను తెచ్చుచున్న నిదాఘుని చూచేను. అట్లు నిదాఘుని చూచిన ఋభువు నిదాఘుని సమీపించి అభివాదము చేసి నీవి బ్లీకొంతమున ఎందుకుంటివి? అని అడిగేను.
నిరాఘుడు పలికెను:- ఓ బ్రాహ్మణోత్తమా! ఈ జనాధిపుడు నగరమును ప్రవేశించుచున్నపుడు చాలా జనసమూహమున్నది. కావున నేనిచట ఉంటీని.
ఋభువు పలికెను :- ఇక్కడున్న వారిలో రాజెవరు? ఇతరులెవరు? నీవు బాగా తెలిసిన వాడవు. కావున నాకు తెలుపుము.
నిదాఘుడు పలికెను :- పర్వత శిఖరము వలె ఎత్తుగానున్న గజేన్ద్రుని అధిరోహించియున్నవాడు రాజు. అతని చుట్టూ ఉన్నవారు ఇతర జనులు.
ఋభువు పలికెను:- నేను మాత్రము గజమును రాజును ఒకేమారు ఒకేవిధముగా చూచుచున్నాను. నీవు మాత్రము విడిగా గుర్తించుచున్నావు. కావున ఓ మహానుభావా ! ఈ గజరాజులకున్న భేదమును తెలుపుము. ఎవరు గజమో ఎవరు రాజో చెప్పుము.
నిదాఘుడు పలికెను:- ఓ బ్రాహ్మణా! క్రింద నున్నది గజము పైన ఉన్నవాడు రాజు. ఈ ఇద్దరి కున్న వాహ్యవాహక : సంబంధమును తెలియని వారెవరు?
ఋభువు పలికెను :- ఓ బ్రాహ్మణా నాకు తెలియునట్లు తెలుపుము. అధోభాగమనగా నేమి? ఊర్ధ్వభాగమనగానేమి? ఈ విభాగమును తెలుపుము.
బ్రాహ్మణుడు పలికెను :- ఈ మాటను వినిన వెంటనే నిదాఘుడు ఋభువు నధిరోహించి నీవడిగిన దానిని చెప్పెదను వినుము. రాజువలె నేను పైన ఉంటిని. ఏనుగు వలె నీవు క్రిందనుంటివి. ఇపుడు ఈ దృష్టాంతముతో తెలియుము.
ఋభువు పలికేను :- నీవు రాజువలె నేను ఏనుగు వలె ఉన్నచో మొదట నీవెవరు? నేనెవరో తెలుపుము.
బ్రాహ్మణుడు పలికెను :- ఋభువు మాటలను వినిన నిదాఘుడు త్వరపడి వెంటనే క్రిందికి దిగి, పాదముల పై బడి ప్రణమిల్లి మీరు మా ఆచార్యులగు ఋభువులు. ఇతరుల కిట్లు అద్వైత సంస్కారముగల మనసుండదు. కావున నేను మిమ్ములను ఆచార్యులనుగా గుర్తించితిని .అని పలి కెను.
ఋభువు పలికెను :- నీవు మొదట చేసిన సేవలవలన నీకు ఉపదేశించుటకు గురు స్నేహముచే ఋభువు నిదాఘుని చేరెను. ఓ మహామతీ! పరమార్ధసారభూతమైన అద్వైతమును సమగ్రముగా సంక్షేపముగా నీకుపదేశించితిని.
బ్రాహ్మణుడు పలికెను :- ఇట్లు గురువగు ఋభువు నిదాఘుని గూర్చి పలికి అద్వైతవిద్యను బోధించెను. ఆ యుపదేశముచే నిదాఘుడు కూడా అద్వేశపరుడాయెను. అపుడు తనను ఇతర ప్రాణులను అభేదముగా చూడగలిగెను. అట్లు అద్వైత జ్ఞానముచే కొంతకాలమునకు నిదాఘుడు బ్రహ్మ స్వరూపమున లీనమై ముక్తిని పొందెను. అట్లే నీవు కూడా ధర్మజ్ఞుడవై శత్రుమిత్రులలో సమభావము కలవాడవై ఆత్మ సర్వగతము ఏకము అని తెలియుము. ఒకటే ఆకాశము నలుపు తెలుపు బేధముచే ఎట్లు కనపడుచున్నదో అట్లే భాంత్రదృష్టి గలవారికి ఒకే ఆత్మ భిన్నముగా కనపడును. ఈ లోకమున ఉన్నదంతయూ ఒకే ఆత్మ. ఆత్మ కంటే భిన్నమైనది మరియొకటి లేదు. అదియే అచ్యుత నామము. ఆ యచ్యుతుడే నేను, నీవు, ఈ సమస్త ప్రపంచము. ఆ పరమాత్మ భేదమోహశూన్యముగా నుండును.
సనందన మహర్షి పలికెను :- ఇట్లు బ్రాహ్మణుని ఉపదేశమును పొందిన ఆ రాజశ్రేష్ఠుడు పరమార్ధదృష్టికలవాడై భేదదృష్టిని విడిచెను. ఆ బ్రాహ్మణుడు కూడా పూర్వజన్మ జ్ఞానముచే ఆ జన్మలోనే మోక్షమును పొందెను. ఓ మునీశ్వరా!ఇట్లు ఈ పరమార్ధమగు అధ్యాత్మజ్ఞానమును నీకుపదేశించితిని. ఈ జ్ఞానము బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు విను వారందరికీ మోక్షమును ప్రసాదించును. నీవడిగినట్లు నేను చెప్పితిని. ఇదియే పరిశుద్ధమగు బ్రహ్మ జ్ఞానము. ఇంకనూ ఏమి చెప్పవలయునో అడుగుము.
ఇది శ్రీబృహన్నారదీయపురాణమున పూర్వభాగమున బహదుపాఖ్యానమున రెండవపాదమున నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
