నారద మహా పురాణము - పూర్వార్థము
87 - దుర్గా మంత్ర చతుష్టయ వర్ణనమ్
సనత్కుమార మహర్షి పలికెను :
ఓ బ్రాహ్మణోత్తమా? నీకు లక్ష్మీదేవి యొక్క అవతారత్రయమును చెప్పితిని. ఇక ఇపుడు సర్వలోకోపకారకములగు దుర్గావతారములను చెప్పెదను. “ఓం శ్రీ శివా శివా వాణీ వైరోచనీ” పదముల తరువాత వజ్రాద్యము క్షుధితా సూక్ష్మా మృతా స్వాగ్నీళ్లు సంయుతా శివా ఫట్లను కూడా ప్రతిష్ఠింప చేసి స్వాహాంతముగా అత్యష్టి వర్ణములు గల మంత్రమిది. ఈ మంత్రమునకు భైరవముని. సమ్రాట్ఛందస్సు. ఛిన్నమస్తా దేవతా, రమా బీజము. స్వాహా శక్తి. 'ఆంఖడ్డాయ' అని హృదయము. 'ఈం ఖడ్గాయ' అనునది శిరస్సు. 'ఊం వజ్రాయ' అనునది శిఖ. 'ఐంపొశాయ' అనునది కవచము. “ఔం అంకుశాయ” అనునది నేత్రము. విసర్గము వసురక్షయుక్కు. మాయాయుగ్మము అస్త్రము. ప్రణవాదికములు మంత్రములు, స్వాహాంతము వరకు, ఇట్లు అంగ కల్పన చేసి అంబికను భాను మండల మధ్యస్థనుగా, ప్రవికీలకగా, స్వమస్తకము ఛిన్నము కాగా స్పారముఖురాలై కారుచు పడుచున్న స్వరక్తమును త్రాగుచున్న దానినిగా, రతియందు ఆసక్తులగు రతీమన్మధులపైన యున్న దానినిగా, తన చెలికత్తెలగు డాకినీ వర్ణినులను చూచి ఆనందించు దానినిగా ధ్యానించి నాలుగు లక్షలు జపమును చేయవలయును. దశాంశమును మోదుగు మారేడు పూలచే పండ్లచే హోమమును చేయవలయును. ఆధార శక్తి ఉండి పరతత్త్యాంతము వరకు పూజించబడిన పీఠము నందు జయ, విజయ, జిత, పరాజిత, నిత్యా, విలాసినీ, దోస్తీ అఘోరా, మంగలా అను నవ పీఠ శక్తులను దిక్కులందు, మధ్య భాగమున పూజించవలయును. సర్వబుద్ధి ప్రదముగా వర్ణించి సర్వ భృగువు సదృక సిద్ధి ప్రదము డాకీనీ సంబంధము తారము సభౌతికమగు వజ్రము 'ఖడ్గశోచనీమే భగంధేహి నమః' ఇది తారాది పీఠ మంత్రము. వేదరామాక్షరము. ఈ మంత్రముచే ఆసనమును సమర్పించి అచట శివను పూజించవలయును. త్రికోణ మధ్య షట్కోణ పద్మ భూపుర మధ్యమున బాహ్యావరణము మొదలుకొని ప్రతిలోమ విధానముగా పూజించవలయును. భూపురమున బాహ్య భాగములందు వజ్రాదులను పూజించవలయును. దానిలోపల ఇంద్రాదులను పూజించ వలయును. భూపురము యొక్క నాలుగు ద్వారములందు ద్వారపాలకులను , పూజించవలయును. కరాలుడు, వికరాలుడు, అతికాలుడు మహాకాలుడు అనువారు నలుగురు ద్వారపాలకులు. ఆ తరువాత పద్మ ము నందు అష్టశక్తులను పూజించవలయును. ఏకలింగ యోగిని, డాకినీ, భైరవీ, మహాభైరవీ, కేంద్రాక్షి అసితాంగి, సంహరి అను వారీలు షట్కోణములందు అంగమూర్తులు. త్రికోణగా, ఛిన్నమస్తా అను వారలు పార్శ్వము నందు, సఖీద్వయమగు డాకినీవర్లీని అనువారలను తారా వాక్కులచే పూజించవలయును. ఇట్లు పూజాదులచే మంత్రము సిద్ధించిన పిదప సాధకుడు దుర్లభములగు ఇష్టమనోరథములను ఆ దేవీ అనుగ్రహముచే వెంటనే పొందవచ్చును. మారేడు పూలచే సంపద, మారేడు పండ్లచే ఇష్టము సిద్ధించును. మాలతీ పుష్పములచే హోమమును చేసిన వాక్సిద్ధి, చంపక పుష్ప హోమముచే సుఖము లభించును. నేతితో కలిపిన మేక మాంసము ప్రతి దినము నూరు చొప్పున ఒకనెల హోమము గావించినచో రాజులందరు వశమగుదురు. లక్షతెల్ల గన్నేరు పుష్పములచే హోమమును గావించిన అన్ని రోగములను పాలద్రోలి సుఖముగా నూరువత్సరములు జీవించును. లక్ష ఎఱ్ఱ గన్నేరు పూలచే హోమము గావించిన మంత్రులను రాజులను వశ పరచుకొనును. మేడి మోదుగు పండ్లచే హోమమును గావించిన సంపదను పొందును. గోమాయు మాంసముచే కాని, పాలచేకాని, అన్నముచే కాని హోమమును చేసిన కవిత్వమును పొందును. బంధూక పుష్ప హోమముచే భాగ్యము, కర్ణికార పుష్ప హోమముచే మనోరథమును పొందును. తిలతండుల హోమముచే జనులందరు వశులగుదురు. ఆ కృష్ణములగు నారీ రజములచే కాని మృగమాంసముచే కాని హోమమును చేసిన ఇష్టసిద్ధి కలుగును. మహేష మాంస హోమముచే, స ఘృత పంకజ హోమముచే స్తంభనము సిద్ధించును. శత్రు మృత్యువు కొఱకు చితాగ్ని యందు కోకిల రెక్కలచే హోమమును చేయవలయును. ఉమ్మెంత సమిధలచే ప్రజ్వరిల్లిన అగ్నిలో కాకి రెక్కలచే చేసిననూ అదే ఫలము కలుగును. ద్యూతమున, అరణ్యమున, రాజద్వారమున, సమరమున, శత్రు సంకటమున దేవిని ధ్యానించుచు మంత్రమును జపించినచో విజయమును పొందును. భుక్తిముక్తుల కొఱకు శ్వేత వర్ణను, ఉచ్చాటనకు నీల వర్ణను ధ్యానించవలయును. వశమునకు రక్త వర్లను, మృతికి ధూమ్ర వర్లను, స్తంభకమున కనకప్రభను ధ్యానించ వలయును. సిద్ధి కొఱకు రాత్రి యందు మదిరాదులచే బలినీయవలయును. ఇపుడు సర్వసిద్ధి ప్రదమగు ఒక ప్రయోగమును చెప్పెదను. దీనిని అతి ప్రయత్నముచే రహస్యముగా నుంచవలయును. కృష్ణ పక్ష భూతాహమున కారు చీకటి నిండిన మధ్య రాత్రమున స్నానముచేసి రక్తవస్త్రములను ధరించి రక్తమాల్యాను లేపనుడై ఛిన్న మస్త స్వరూపిణి, సుందరి, యౌవనవతి నరపంచక గామిని, సుస్మిత, ముక్తకబరి, భూషాదాన ప్రతోషిణి యగు వారిని తీసుకొని వచ్చి వివస్త్రగా పూజించవలయును. మంత్రమును పదివేలు జపించవలయును. బలినిచ్చి, రాత్రి గడిపి ధనముచే ఆ యువతిని ప్రీతురాలిని చేసి పంపించి పలువిధాన్నములచే బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో పుత్రులను పౌత్రులను ధనమును కీర్తిని స్త్రీలను, ఆయుష్యమును, సుఖమును ధర్మమును, ఇష్టమును పొందును. విద్యను కోరువాడు ఆ రాత్రి యందు వ్రతము నాచరించవలయును. ఇతర కోరికలున్నచో ఆమంత్రమును జపించుచు దానిని పొందవలయును. ప్రాతః కాలమున లేచి పడక మీద కూర్చొని జపించవలయును. ఆరు నెలలలో సాధకుడు కవిత్వముతో కవిని జయించును. శివునిచే కీలితమగుచో ఈ విద్య ఉత్కీలన మగును. తారా పుటమగు మాయను అష్టోత్తర శతము మంత్రాదిలో అంతమున జపించినచో ఈ విద్య సిద్ది ప్రదమగును.
ఓ మునిసత్తమా!! దేవి యొక్క మరి యొక అవతారమును చెప్పెదను. జ్ఞానామృతారుణా, శ్వేతా, క్రోధినీ, ఇందు సమన్వితా, అట్టి శాంతి నీచసర్గాన్విత, కామరాజాఖ్య మగు వాగ్భవము శక్తి బీజము. మూడు బీజములచే పంచకూటాత్మికా త్రిపురభైరవి. దక్షిణామూర్తి ఋషి పంక్తి ఛందస్సు. త్రిపుర భైరవి దేవత. వాగ్భవ బీజమును నాభి నుండి పాద పర్యంతము న్యాసము చేయవలయును. కామ బీజమును హృదయము నుండి నాభి వరకు న్యాసము చేయవలయును. తృతీయ బీజమును శిరసు నుండి హృదయము వరకుంచవలయును ఆద్యమును ద్వితీయమును కరములందు, తృతీయమును ఉభయమును మూలాధారమున హృదయమున ఉంచి మరల బీజత్రయ న్యాసమును చేయవలయును. నవయోన్యాత్మక న్యాసమును బీజత్రయముచే చేయవలయును. బాలా త్రిపురకు చెప్పినట్లు మూర్తి న్యాసమును చేయవలయును. స్వస్వ బీజాదికమును పూర్వకమును, శిరస్సున ఈశానుని, వక్రమున మనోభవుని, తత్పురుషుని మకర ధ్వజుని, హృదయమున అఘోరకుమారుని కందర్పుని న్యాసము చేయవలయును. వామదేవాది మన్మధాంతము గుహ్య దేశమున నుంచవలయును. పాదములందు సద్యోజాతుని వామదేవుని న్యాసము చేయవలయును. ఊర్ద్వ ప్రాగ్దాక్షిణోదీచ్య పశ్చిమ ముఖములందు వారివారిని న్యాసము చేయవలయును. సద్యాది పంచహ్రస్వాద్యములు వీటికి బీజముగా చెప్పబడినవి. షడ్డీర యుక్తమగు నాద బీజముచే అంగకల్పన చేయవలయును. తరువాత త్రైలోక్య మోహనములగు పంచబాణములను న్యాసము గావించవలయును. ద్రాం అను దానిని ద్రావిణీ బీజమును శిరస్సున, ద్రాం అను క్షోభిణీ బీజమును పదమున, వశీకరణమగు క్లీం బీజమును వక్రమున, బ్లూం అను దానిని బీజపూర్వకమును గుహ్యమున న్యాసమును చేయవలయును. సర్వాంత భృగు సంస్థితమగు ఆకర్షణ బీజమును హృదయమున, సంమోహన బీజమున క్రమముగా న్యాసము చేయవలయును. దీనిని బాణ న్యాసమందురు. ఫాల భ్రూమధ్య వదనములందు, ఘంటికా కంఠ హృదయములందు, నాభ్యధిష్టానములందు, తారాదులగు అయిదు సుభాగాదికములను, నాభి నుండీ మస్తకము వరకుంచ వలయును. సుభగా, భగా, భగసర్పిణీ, పరా, భగమాలిని, ఆనంగా, అనంగ, కుసుమ, అనంగమేఖలా, ఆనంగ మదనా అనువారలందరు మద విభ్రమస మంధరలు ప్రధాన దేవతలు, వర్ల భూషణాదులచే అలంకరించబడిన వారిని, అక్షసకుస్తక అభయ వరదాఢ్య కరాంబుజలను పూజించవలయును. వాక్కామ బీజమగు బ్లూ. అను దానిని సరాంతమున నుంచవలయును. ఇవియే పంచతారలనబడును. తరువాత భూషణ న్యాసమును చేయవలయును. ఇట్లు న్యస్త శరీరుడై సహస్ర భాను సంకాశ అరుణ క్షామ వస్త్ర, శిరోమాల, అస్పషస్తని, జపకటిని, విద్యను, అభయముద్రను, కరమును ధరించునది, త్రినేత్ర యగు త్రిపుర భైరవిని ధ్యానించవలయును. ఇట్లు దీక్షను పొంది పన్నెండు లక్షలు జపించవలయును. బ్రహ్మవృక్ష సమిధములగు గన్నేరు పూవులచే కాని హోమమును చేయవలయును. అష్టదళములు కల నవయోని అష్టకర్ణిక, ఇచ్ఛాది శక్తి యుతమగు భైరవీ పీఠ పద్మమును ఆర్చించవలయును. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, కామినీ, కామదాయినీ, రతిప్రియా మదానన్దా, నవమి, మనోన్మనీ యను నవపీఠశక్తులు వరదాభయధారిణులుగా చెప్పబడిరి. వాగ్భవము లోహితుడు శ్రీ బీజమునకు, శ్రీ కంఠుడు, లోహితుడు, అనలుడు, దీర్ఘవానికి పరా, తరువాత, అపరాయములు హసయుతములు, “సదాశివాయ, మహాప్రేతాయ పద్మాసనాయ నమ:” అనుమంత్రముచే ఆసనము నర్పించవలయును. శ్రీ గురుక్రమముగా చేయవలయును. పొజ్మధ్యయోగ్యంతరాలమున పూజించి పంచ ప్రణవములచే మూర్తిని కల్పించి, ఆమూర్తి యందు దేవతను ఆవాహించి, సావధాన మనస్కుడై ఆగమోక్త విధానముచే పూజించవలయును. ఈరావాక్చక్తి కమలలు హసఖూ ఫేంహసలుగా చెప్పబడినవి. దేవి యొక్క వామకోణమున ఇందు సమప్రభయగు రతిని పూజించవలయును. ఈ రతిని సృణి పాశధర, సౌమ్య మద విభ్రమ విహ్వలగా పూజించవలయును. దక్షిణ కోణమున తప్తకాంచన సన్నిభ, అంకుశ ప్రణతములను ధరించు ప్రీతిని అర్చించవలయును. అగ్ర భాగమున రక్తవర్ణా, రక్త పుష్పాద్యలంకృత, ఇక్షకార్ముక పుషేషు ధారిణి సస్మితానన యగునో మనోభవను అర్చించవలయును. దిక్కులలో అగ్రభాగమున ఆయా మంత్రములచే ప్రాణదేవతలను అర్చించవలయును. హస్తముల యందు పుష్పేషు ప్రణామామృత ప్రభలను ధరించియున్న అష్టశక్తులను సుభగాదులను అష్టయోనులను పూజించవలయును. భైరవాంకస్థలు మదవిభ్రమ విహ్వలలగు మాతలను అష్టపత్రములందు యధావిధిగా పుష్పాదులచే పూజించవలయును. దిక్కులందు లోకపాలకులను, దాని వెలుపల వారి అస్త్రములను పూజించవలయును. పూర్వజన్మ కృత పుణ్యముచే పరదేవతను తెలిసి ఉక్తమార్గముచే సేవించువాడు సంపదల కాలవాలమగును. ఇట్లు మంత్రసిద్ధిని పొందిన సాధకుడు స్వాభీష్టమును సాధించుకొనవచ్చును. మధుర మిశ్రితములు దోషరహితములగు రక్షాంభోజములచే లక్షకాని యాబదివేలు కాని హోమముచేసి ప్రతిదినము, బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలయును. సౌందర్యము యౌవనము గల స్త్రీలను దేవతా బుద్ధిచే పూజించవలయును. హోమ సమాప్తిలో తన గురువును ధన ధాన్యాదులచే సంతోషింప చేయవలయును. ఇట్లు చేసిన జగత్తు వశమగును. లక్ష్మీనిలయ మగును. త్రిమధు మిశ్రితములగు రకోత్పలముచే కాని, అరుణ వర్ణములు గల హయాదిజములచేకాని, పుష్పములచే కాని, క్షీరాన్నములచే కాని హోమము చేసినచో జగత్తు వశమగును. మోదుగు పూవులచే హోమము గావించిన దివ్యజ్ఞానమును పొంది కవి యగును. పాలతో తడిపిన అమృత ఖండములచే హోమమును గావించిన అపమృత్యువును జయించును. పాలతో తడిపిన గరకతో మూడు దినములు హోమమును గావించిన ఆయుర్వృద్ధి కలుగును. గిరికర్ణికాభవ పుష్పహోమము బ్రాహ్మణులను వశము చేయును. కలువలచే హోమము గావించిన రాజులు వశులగురు, పుష్ప హోమము రాజపత్నులను వశము చేయును. మల్లికా పుష్పహోమము రాజపుత్రులను వశము చేయును. పాటలోద్భవములగు కోరంట పుష్ప హోమము శూద్రులను వశము చేయును. విలోమాంతమున నున్న సాధ్యనామాన్వితముగా అనులోమమును మంత్రముచ్చరించి మధుర మిశ్రితములగు ఆవాలచే హోమమును గావించినచో ఆ క్షణమునే రాజులను వశములో నుంచును. ఇదే విధానముచే రాజపత్నులను రాజపుత్రులను వశములో నుంచుకొనవచ్చును. మధుర త్రయ మిశ్రితములగు జాతి బిల్వ పుష్పములచే హోమమును గావించిన నరనారీ నరపతులను వశులను చేయవచ్చును. చందన లోలితములకు మాలతీవకుల పుష్పములచే హోమమును గావించినచో ఒకవత్సరములో సత్కవిత్వమును పొందును. మధురత్రయ మిశ్రితములగు బిల్వఫలములచే హోమమును గావించిన లోకము వశమగును. ఉత్తమ సంపదను పొందును. నేయి కలిపిన అన్నముచే హోమము గావించిన అన్న సమృద్ది కలుగును. కస్తూరీ మయ, పేతమగు కర్పూర హోమము గావించినచో మన్మథుని మించిన సౌందర్యము కలుగును. దధిక్షీర మధుప్లుతములగు లాజహోమమును గావించిన అన్ని రోగములను జయించి నూరు వత్సరములు జీవించును. రెండు భాగములు మలయ చందనము ఒక భాగము కుంకుమ కేసరీ, ఒక భాగము గోరోజనము ఈ మూడింటిని చల్లని నీటిచే చక్కగా మర్దనము గావించి ఫాలమున తిలకమున ధరించి ఎవరిని చూచినను, ఎవరిచే చూడబడిననూ, ఎవరిని తాకిననూ ఎవరిచే తాకబడిననూ వారందరూ వశమగుదురు. కర్పూర కపిచోరములను సమభాగములుగా ఏర్పరిచి నాలుగవ భాగమున జటామాంసమును, అంతయే గోరోచనమును, అంతయే కుంకుమను, ఎనిమిదవ భాగమును చందనమును, తొమ్మిదవ భాగమును ఆగురును కలిపి చల్లటి నీటితో కన్య చక్కగా మర్ధన గావించి ఫాలమున తిలకమును ధరించినచో రాజులను, నరులను మదగర్వితులగు యువతులను, మదించిన యేనుగులను, సింహ వ్యాఘమహాసర్పములను, భూత భేతాల రాక్షసులను చూచిన తోడనే వశులగుదురు. ఇట్లు మహా భైరవీ మంత్రమును చెప్పితిని. ఇక ఇపుడు అవతారాంతరమును చెప్పెదను వినుము.
“ఓమ్ నమో భగవతి! శ్రీ మాతంగేశ్వరి! సర్వజనమనోహరి! సర్వసుఖరాజ్య సర్వసుఖరంజని! సర్వరాజవశంకరి! సర్వప్రీ పురుష వశం కరి! సర్వదుష్ట మృగవశంకరి! సర్వ సర్వ సత్యవశంకరి! సర్వలోకం అముకం మే వశం ఆనయ స్వాహో అనునది ఎనుబది ఎనిమిది అక్షరముల మంత్రము. భైరవీ మంత్రము న్యాసాదులే ఈ మంత్రమునకు కూడా చెప్పుకొనవలయును. చెప్పబోవు న్యాసములను యథా క్రమముగా శరీరమున చేయవలయును. శిరోలలాట భ్రూమధ్యములందు తాలు కంఠగలోరస్థలములందు అనాహతమున భుజద్వంద్వమున, జఠరమున నాభిమండలమున, స్వాధిష్టానమున గుప్తదేశమున, పాదములందు మూలాధారమున, గుదమున, పదునెనిమిది పదములను క్రమముగా న్యాసము చేయవలయును. 6,1,2,4,6,8,3,9,8,9,7,8,4,3,1,2,6 సంఖ్యలచే ఇది యదు క్లుప్తియని మంత్ర వర్ణములచే న్యాసము చేయవలయును. మూల హృదయ భ్రూమధ్యము లందు రత్యాద్యములు వాక్శక్తి లక్ష్మీ బీజాద్యములను మాతంగ్యంతము న్యాసము చేయవలయును. శిరోవదన హృదుహ్యపావనములందు విధానముచే న్యాసము చేయవలయును. హృల్లేఖను, గగనను,రక్తను, కరాలికను, మహోచ్ఛుష్మను స్వనామాదివర్ణ బీజపురస్సరముగా నూతంగ్యంతముగా సడంగ కల్పన చేయవలయును. ఇరువది నాలుగక్షరములచే హృదయమును, పదమూడక్షరములచే నేత్రమును, పదునెనిమిదక్షర ములచే శిఖను కవచమును, పదమూడక్షరములచే నేత్రమును, రెంటిచే అస్త్రమును ఏర్పరచవలయును భైరనీమంత్రప్రోక్తవిధిచే బాణన్యాసమును చేయవలెను. మాతంగీపదములయందు మరియొక న్యాసమును చేయవలయును. వదాంశములందు మన్మధుల నుంచవలయును. పార్శ్వనటులందు, నాభిదేశమునకటి పార్శ్వాంసమునందు బీజత్రయాదికన్యాసమును చేయవలయును. మన్మధుని, మకరధ్వజుని, మదనుని, పుష్పధన్వుని, కుసుమాయుధుని, కందర్పుని, మనోభవుని, రతిప్రియుని, న్యాసము చేయవలయును. కుసుమమేఖల, మదన మదనాతురా మదనవేగా, సంభవా భువనపాల, ఇందురేఖ, అనంగ పూర్వ మాతంగి అని చెప్పబడినది. తరువాత అధిష్టానమగు మణిపూరకమున న్యాసముచేయవలయును. హృత్కంఠాస్య ములందు, భ్రూమధ్యమున, మస్తకమునందు, న్యాసము చేయవలయును. ఆద్యమున లక్ష్మీసరస్వతులను, రతి, ప్రీతి, కృత్తిక, శాంతి, పుష్టి, తుష్టి, మాతంగి మూలమంత్రన్యాసమును గావించవలయును. ఆధారదేశమున, అధిష్ఠానమున, నాభియందు, నిరోధికయందు, తీర్దేందునాదమున, శివమున, మాతంగి పరమ న్యాసమును గావించవలయును. తరువాత వామను జేష్టను, రౌద్రిని, ప్రశాంతను, శ్రద్దను, మాహేశ్వరిని, ప్రియాశక్తిని, సులక్ష్మిని, మృష్టిని, సంజ్ఞను, మోహినిని ప్రమథశ్వాసినిని. విద్యుల్లతను, చిచ్ఛక్తిని, సుందరిని, నిన్లను, నందబుద్ధిని క్రమముగా శిరోఫాలహృదా ధారములందు బీజయతాధికలుగా మాతంగాదులను యథావిధిగా న్యాసమును గావించవలయును. మాతంగిమహదాద్యను, మహాలక్ష్మిని, సిద్ధలక్ష్మిని మూలాధారమండలమును న్యాసము చేసి, ఈశాన్యముచేతనే వ్యాపకమును ఆచరించవలయును. ఇట్లు శరీరమున న్యాసము గావించి మంత్రదేవతను ధ్యానించవలయును. శ్యామ, చిలుక పలుకులను వినుచున్నది, న్యసైకాగ్నిశిరోరుహ, శశిఖండ ధర, వీణావాదనమును చేయుచున్నది, మధూన్మాద, రక్షాంశుక, కప్షరమాలా శోభిత చూలిక, శంఖపుత్ర, చిత్రకోద్దాసి మస్తకయగు మాతంగిని ధ్యానించి పదివేలు జపించవలయును. దశాంశమును ఇప్పపూలను త్రిమధుమిశ్రితములుగా మంత్రసిద్ధి కొఱకు హోమమును గావించవలయును. త్రికోణ కర్ణికము అష్టపత్రము కల్పించవలయును. బాహ్య భాగమున అష్టపత్రావృతము, షోడశ దలావృతము, చతురస్రీకృతము, కొంతిచే దృష్టి మనోహర మగు పీఠమున క్రమముగా నవశక్తులను పూజించవలయును. ఈ నవశక్తులు విభూతి పూర్వులు మాతంగీ పదపశ్చిమలను పూజించవలయును. “సర్వశక్తి కమలాసనాయ నమ:” అనునది బీజాద్యమగు పొకృత్వలక్ష్మీ బీజాద్యము. పీఠాపూజన మంత్రము మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తి a ందు దేవతను ఆవాహించి, వక్ష్యమాణ విధిచే పూజించవలయును. పూర్వమువలే కోణత్రయములందు రత్యాదులను పూజించవలయును. దిక్కులందు బాణములను, అగ్రభాగమున పంచమమును పూజించవలయును. దల మధ్యమున అనంగ కుసుమాదికలను పూజించవలయును. పాశాంకుశాభయాభీష్ట ధారిణదిజ్మధ్యమున హృత్ హృల్లేఖలను పూజించవలయును. పత్రాగ్రములందు వల్లకీకరులను లక్ష్యాదులను పూజించవలయును. అష్టదలములందు బహిర్ధాగమున మద్దతులగు మన్మధాదులను పూజించ వలయును. వీరందరు అపరాంగులు నిషంగాదులు పుష్పాస్తేషు ధనుర్ధరులు గానుందురు. పైన చెప్పబడిన లక్షణములుగల బ్రహ్మాది మాతలను పత్రస్థలను పూజించవలయును. తదగ్ర భాగమున అసితాంగాది భైరవులను పూజించవలయును. మరల షోడశ సత్రములందు షోడశ శక్తులను పూజించవలయును. ఈ షోడశక్తులు. వామాద్యలు కల వీణలచే గానము చేయు వారు శ్యామ విగ్రహలు, నాలుగు దిక్కులందు చతురస్ర పీఠమున నలుగురిని పూజించవలయును. ఈ నలుగురు మాతంగ్యాదులు మదోన్మత్తలు వీడోల్లసితపాణులుగా నుందురు. ఆగ్నేయ కోణమున విఘ్నేశుని దుర్గను పూజించవలయును. వాయవ్యకోణమున బటుకలను, ఈశాన్యమున క్షేత్రపాలుని పూజించవలయును. బహిర్భాగమున వజ్రాద్యాయుధములతోపాటు లోకపాలులను పూజించ వలయును. ఇట్లు సాధకుడు మన్రసిద్ధిని పొందిన తరువాత స్వేష్టమును సాధించుకోనవలయును. మల్లికజాతి పుష్పములచే హోమమును గావించిన ధనాధిపతియగును. బిల్వఫలములచే కాని పత్రములచే కాని హోమమును గావించిన రాజపుత్రులకు రాజ్యము లభించును పద్మ హోమముచే సంపద కలుగును. ఉత్పలహామముచే జగత్తు వశమగును. మధుమిశ్రిత క్షారములచే స్త్రీ వశమగును. వంజుల సమిట్టోమము వర్షమును కురిపించును. క్షీరమిశ్రిత అమృతఖండములచే హోమమును గావించిన జ్వరము నశించును. దూర్వాహోమముచే ఆయుష్యము, తండులచే సర్వము వశమగును. తద్యావర్త సంజాత పుష్పహోమముచే వాక్సిద్ధి కలుగును. అభీష్ట సంపత్సమృద్ధికి నింబపుష్ప హోమమును చేయవలయును. పలాశ కుసుమ హోమముచే తేజస్వియగును. చందనాగరు కస్తూరీ చంద్ర కుంకుమల హోమమును గావించిననూ తిలకముగా ధరించిననూ సర్వవశ్యత సర్వప్రియత్వము సంభవించును. నిగుడీ మూల హోమముచే నిగడ విముక్తుడగును. నింబతైల మిశిత లోహోమముచే శత్రు నాశమగును. హరిద్ర చూర్ణ మిశ్రితములగు లవణములచే జగతంభనము సిద్దించును. ఓ బ్రాహ్మణోత్తమా! ఇట్లు నీకు మాతంగీ సిద్దవిద్యను చెప్పితిని. ఇక ఇపుడు మరొక అవతారమును చెప్పెదను వినుము.
ప్రీతి చంద్రాఢ్య దీపిక ద్విధా రంజితమై స్వాహాంతమగు మంత్రము ధూమావతీ మంత్రము అష్టాక్షరి. పిప్పలాద మహర్షి. నివృచ్ఛందస్సు. ధూమావతీశ్వరి దేవత. షడ్డీర్ఘ జాతి యుక్తముచే అంగకల్పన చేయవలయును. తరువాత శత్రునిగ్రహకారిణి, వివర్ణ, చంచల, దుష్ట, దీర్ఘ, మలినాంబర, విముక్త కుంతల, సూక్ష్మ, విధవ, విరలద్విజ, కంకధ్వజ రధారూఢ, ప్రలంబిత పయోధర, సూర్యహస్త, నిరుక్షాంక ధృతహస్తాంబరాన్విత, ప్రవృద్ధలోమ, కుటిల, కుటిలేక్షణ, క్షుత్పిపాసార్డిత, నిత్య భయద, కలహప్రియ, యగు ధూమావతీశ్వరిని చింతించి, నమస్వాహా ఫడంత బీజమును సాధ్యోపరి భాగమున నుంచి, దానిపై శవమును స్థాపించి జపించవలయును. శవమును శత్రు నామముచే అవష్టంభనమును గావించి మంత్రమును జపించవలయును. ఉష కంచుకములను ధరించి కృష్ణపక్షమున రాత్రింబవళ్ళు ఉపవసించి, శ్మశానమునకొని, అరణ్యమునకొని, శూన్యమందిరమున కాని మంత్రసిద్ధి కోరకు, వాక్కును నియమించి దేవిని ధ్యానించుచు, వేయికంటే ఎక్కువ జపించినచో శత్రువు జ్వరపీడితుడగును. పంచ గవ్యముచే కాని పాలచే కాని జ్వర శాంతి జరుగును. మంత్రాద్యక్షరమును లిఖించి తరువాత శత్రునామము లిఖించి, మరల మన్త ద్వితీయాక్షరమును శత్రునామమును లిఖించవలయును. 98 వేల జపముచే శత్రుమృతి సంభవించును. శ్మశానాగ్నియందు కంకమును దహించి, ఆ భస్మమును తీసుకోని శత్రునామముచే ఎనిమిది వందలు జపమును గావించినచో శత్రూచ్చాటనము జరుగును. శ్మశాన భస్మముపై శవము నుంచి కృష్ణ పక్షమున శత్రునామము నుచ్చరించి మహిషీక్షీర ధూపమును ఇచ్చినచో శత్రువులకు విపత్తును కలిగించును. ఇట్లు సంక్షేపముగా జగదంబికయగు దుర్గాదేవి యొక్క అవతార చతుష్టయమును చెప్పితిని, ఇంకనూ ఏ మడుగ దలచితివి?
ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున పూర్వభాగ మున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున దుర్గామంత్ర చతుష్టయ వర్ణనమను ఎనుబదియేడ - అధ్యాయము సమాప్తము
