నారద మహా పురాణము - పూర్వార్థము
81 - కృష్ణాదిమన్త్రభేదనిరూపణమ్
శ్రీ సనత్కుమార మహర్షి పలికెను : ఓ మునీశ్వరా! ఇపుడు శ్రీకృష్ణపరమాత్మ మంత్రభేదములను చేప్పెదను. ఈ మంత్రములనుపాసించి మానవులు తమ ఇష్టములను సాధించుకానుచుందురు. శక్తి శ్రీమారపూర్వము, శ్రీ శక్తిస్మరపూర్వకము, మార శక్తి రమాపూర్వము అని దశాక్షరమంత్రములు మూడు విధములు. ఈ మంత్రములకు నారద మహర్షి ముని. గాయత్రీ ఛన్దస్సు శ్రీ కృష్ణపరమాత్మ దేవత. ఈ మూడు మంత్రములకు పూర్వము వలె చక్రములచే అంగకల్పన చేయవలయును. తరువాత కిరీట మంత్రముచే వ్యాపకము నాచరించవలయును. సుదర్శన మంత్రముచే దిగ్బంధమును చేయవలయును. ధ్యానార్చనాదికమంతయూ వింశాక్షర మంత్రమునకు వలె నాచరించవలయును. రెండవ మంత్రమున దశాక్షరమంత్రమునకు చెప్పబడిన ధ్యానపూజాదికమునాచరించవలయును. తృతీయమంత్రమున సావధానుడై శ్రీ హరిని ధ్యానించవలయును. శంఖచక్రధనుర్బాణ పాశాంకుశధరుడు, వేణువును మ్రోగించువాడు అగు కృష్ణదివాకరుని ధ్యానించి అయిదు లక్షలు మంత్రమును జపించవలయును. దశాంశమును నేయి కలిపిన పాయసముచే హోమమును చేయవలయును. ఇట్లు మంత్రము సిద్దించిన తరువాత కామ్యములను సాధించుకోనవలయును. శ్రీ కృష్ణాయ గోవిందాయ నమస్వాహా” అనునది ద్వాదశక్షర మంత్రము. బ్రహ్మముని గాయత్రీ ఛందస్సు. కృష్ణపరమాత్మ దేవత. 3, 4, 2 వర్ణములచే బీజములచే షడంగములను కల్పించవలయును. వింశాక్షర మంత్రమునకు చెప్పబడిన జపధ్యానహోమ అర్చనాదికమును ఆచరించవలయును, ఇంకనూ ఏమి చెప్పవలయును. ఈ మంత్రము సర్వాభీష్ట ప్రదాయకము. శ్రీ శక్తి స్మర పూర్వము పార్వతి శక్తి రమాంతికము. దశాక్షర మంత్రము మొదటనే చెప్పబడినది. ఇట్లు షోడశాక్షరి ద్వాదశాక్షర మంత్రములను చక్రములచే అంగములను కల్పించవలయును. వరదాభయహస్తములచే ప్రియురాళ్ళను ఆశ్లేషించుచున్నవాడు, పద్మోత్సలకరములచే శంఖ చక్రములను ధరించు వాడు అగు కృష్ణుని ధ్యానించి పది లక్షలు జపించవలయును. దశాంశమును నేయిచే హోమము గావించి మంత్రము సిద్ధించిన తరువాత మంత్రనాయకులు కావలయును. ఈ మంత్రమును సర్వకామప్రదములు సర్వసంపత్సౌభాగ్యప్రదములు. కామాంతమగు అష్టాదశాక్షరి మంత్రము సుతధనప్రదము. ఈ మంత్రమునకు నారదమహర్షి ముని గాయత్రీ ఛందస్సు. శ్రీ కృష్ణ భగవానుడు దేవతా. కామబీజము. స్వాహాశక్తి షడ్విర్యాఢ్య బీజముచే షడంగములను ఆచరించవలయును. దక్షిణ హస్తమున పాయసమును, వామహస్తమున నవనీతమును ధరించి దిగంబరుడుగానున్న గోపీపుత్రుడు కాపాడు గౌవుత. ఇట్లు ధ్యానించి ముప్పది రెండు లక్షలు జపించవలయును. దశాంశమును శర్కరపాలు కలిపిన అన్నముచే హోమమును గావించవలయును. పూర్వోక్త వైష్ణవ పీఠమున అష్టాదశాక్షర మంత్రవిధానముచే పూజించవలయును. పద్మస్థుడగు కృష్ణుని పూజించి అతని ముఖాంబుజమున తర్పణ గావించవలయును. క్షీరములచే అరటి పండ్లచే దధిచే, నవనీతముచే పుత్రులను కోరువాడు తర్పణముగావించినచో సంవత్సరకాలములో పుత్రుని పొందును. కోరిన దంతయూ తర్పణము వలననే సిద్ధించును. “ఓం కృష్ణాయ గోవిందాయ నమః" అనునది దశాక్షర మంత్రము దీనికి ద్వొదశాక్షర మంత్రమును జోడించినచో ద్వొవింశత్యక్షరమంత్రము కాగలదు. ఈ మంత్రము వాగీశత్వప్రదము. నారదుడు ఋషి, గాయత్రీ ఛందస్సు, విద్యాప్రదుడగు గోపాలుడు దేవత. కామబీజము వాగ్భవశక్తి విద్యాప్రాప్తికి వినియోగము. నోమోర్థ్వహస్తమున ఉత్తమ విద్యాపుస్తకమును ధరించువానిని, దక్షిణోర్ద్వహస్తమున మాతృకామయమగు స్ఫటికాక్షమాలను ధరించువానిని, అధః పాణి ద్వయముచే శబ్ద బ్రహ్మమయమగు వేణువునూదుచున్న వానిని, గాయత్రీ గీతవసనుని, శ్యామలుని, కోమలంతిని, బర్ధావతంసుని, సర్వజుని, మునిపుంగ సేవవీతుని, ప్రమదావేశ విలాసుని, భువనేశ్వరుని ధ్యానించి నాలుగు లక్షలు జపించవలయును. దశాంశమును కింశుకములచే హోమముగావించి వింశాక్షర మంత్రమునకు వలె పూజించవలయును. ఇట్లు సేవించినవాడు వాగీశ్వరుడగును. అదృష్ణ శాస్త్రములు కూడా గంగాతరంగములవలె దృష్టములగును. ఓం కృష్ణ | కృష్ణ | మహాకృష్ణ | సర్వజ్ఞ| త్వం ప్రసీద మే శ్రీమారమణ | విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే” అనునది ముప్పది మూడక్షరముల మంత్రము మహావిద్యా ప్రదము. నారదమహర్షి ముని. అనుష్టుప్పనస్సు. శ్రీకృష్ణుడు దేవత. సర్వ పాదములచే పంచాంగములను రచించి శ్రీహరిని ధ్యానించవలయును. దివోద్యానమున సూర్యసన్నిభమణిమయమగు మండపమున, యోగ పీఠమధ్యమున, సర్వవేదాన్త్రమయసురతరువు మూలమున కూర్చొనియున్న ముకుందుడు, కల్పవృక్షరూపములగు వేదములచే శిఖరిశత సమాలంబితములగు నాలుగు కోశములచే న్యాయతరపురాణములచే స్మృతులచే అటువంటి అమరాదులచే అభివృతుడు, శంఖమురలీ పుష్ప బాణీకు చాపములను, అక్షమాలను, పూర్ణకుంభములను ధరించినవాడు, స్మరలలిత శరీరుడు, దివ్యభూషాంగరాగుడు, వామహస్తమున వ్యాఖ్యాముద్రను ధరించిన, స్ఫుటరుచిరపదుడు విశ్వమాత్రమున శబ్దబ్రహ్మోద్భవమగు వేణువుచే నూదువాడు, శ్రీధరుడు, అరుణరుచి, గోపికావల్లభుడు కాపాడుగావుత యని ధ్యానించి, లక్ష జపించవలయును. దశాంశమును పాయసముచే హోమము గావించవలయును. ఈ మంత్రమునకు అష్టాదశాక్షర మంత్రమునకు వలె పూజాదినము నాచరించవలయును.
“ఓం నమో భగవతే నన్దపుత్రాయ ఆనన్దవపు షే శ్రీకృష్ణాయ గోవిన్దాయ స్వాహా" అనునది ఇరువది యెనిమిది అక్షరములు గల మంత్రము. సర్వాభీష్టప్రదము.
నన్దపుత్రాయ శ్యామలాంగాయ బాలవపు షే కృష్ణాయ గోవిందాయ శ్రీకృష్ణాయ గోవిన్దాయ స్వాహా” అనునది ముప్పది రెండక్షరములు గల మంత్రము. ఈ రెండు మంత్రములకు నారద ఋషి. ఉషైక్ అనుష్టుప్ ఛందస్సులు. నన్దపుత్రుడు దేవత. అఖిలాఫ్రికి వినియోగము. చక్రములచే పంచాంగ కల్పనము. సాయుధులగు దిక్పాలాదులను పూజించవలయును. దక్షిణ హస్తమున రత్న చషకమును, వామహస్తమున సౌవర్ల నేత్రనమును ధరించినవాడు ప్రియాగ్లిష్టదేహుడగు కృష్ణుని ధ్యానించవలయును. లక్ష జపించవలయును. దశాంశమును పాయసముచే హోమము గావించవలయును. ఇట్లు ఈ మంత్రములు సిద్దించిన తరువాత అభీష్టములను సాధించుకానవలయును. __
“ఓం నమో భగవతే నన్దపుత్రాయ బాలవపు షే స్వాహా” అనునది పందామ్మిది అక్షరముల మంత్రము, బ్రహ్మముని అనుష్టుప్ఛన్లస్సు. బాలవపుడగు కృష్ణుడు దేవత. ఈ మంత్రమును పండితులు సర్వసంపత్తి సిద్దికాఱకు ఉపాసింతురు. “ఓం నమో భగవతే రుక్మిణీవల్లభాయ స్వాహా" అను మంత్రము షోడశాక్షరి నారదఋషి. అనుష్టుప్ఛన్లస్సు. రుక్మిణీ వల్లభుడు దేవత. 1, 2, 4, 6, 2 వర్ణములచే పంచాంగకల్పన చేయవలయును. తరువాత సురేశ్వరుని ధ్యానించవలయును. తాపింఛకాంతి గల శ్రీకృష్ణుడు తన అంకముననున్న స్వర్ణకాంతి గల పద్మమాలను కంఠమున ధరించిన ప్రియురాలిని వామభుజముచే ఆలింగనము చేసుకాని, ప్రియురాలిచే కూడా ఆలింగనము చేయబడి, ఇతర హస్తమున సౌవర్ణనేత్రమును ధరించి, పరిశుద్దపీతాంబర ధారి నానాభూషణభూషితుడగు శ్రీహరి కాపాడుగొత అని ధ్యానించి ఒక లక్ష జపించవలయును. దశాంశమును రక్త పద్మములచే త్రిమధువులను కలిపీ హోమమును గావించవలయును. పూర్వోక్త పీఠమున శ్రీ హరిని పూజించవలయును. అంగములను నారద ముఖ్యులను, సాయుధులగు లోకేశులను పూజించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించినచో సర్వాభీష్టములను ఇచ్చును. ఈలీలాదండ | పద్బో | జనసంసక్తదోర్దండ | ధరాదీశ | మేఘశ్యామ | భగవాన్ | 'విష్ణో | ఫట్” అనునది ఇరువది తొమ్మిది అక్షరములు గల మంత్రము. నారద ఋషి. అనుష్టుప్పనస్సు. లీలాదండ హరి దేవత. 9, 4, 4, 3, 4 మంత్రాక్షరములచే అంగకల్పన గావించవలయును. నిజపామకరస్థితదండముచే గోపయువతులను, ఇతర సుందరీమణులను మోహింప చేయుచు, నిజ ప్రియమిత్రుని భుజము పై దక్షిణ హస్తమునుంచినవాడు, కంసుని సంహరించినవాడు, ఉరుక్రముడు మమ్ములను కాపాడుగావుత. ఒక లక్ష జపించవలయును. దశాంశమును త్రిమధు మిశ్రితములగు తిలతండులములచే హోమమును గావించవలయును. తరువాత ఆంగకల్పనగావించి సాయధులైన దిక్పాలకులను పూజించవలయును. లీలాదండధరుడగు శ్రీహరిని ప్రతినిత్యము ఆదరముతో పూజించువాడు అందరిచే పూజించబడును. అతనింటిలో లక్ష్మి స్థిరముగా నిలుచును. సద్యారూఢస్మృతితోయము కేశవాధ్యధరాయుగము. భయాగ్నివల్లభా మంత్రము. అనగా • ఓం కేశావవాయ స్వాహా” అను మంత్రము సప్తాక్షరమంత్రము. సర్వసిద్ధి ప్రదము. నారద ఋషి. ఉమ్లెక్సందస్సు. గోవల్లభుడు దేవత. పూర్వము వలె చక్రములతో పంచాంగ కల్పన గావించి, కపిలాగణ మధ్య స్థితుడు, గోపికలను గోవులను ఆహ్వానించుచు దక్షిణ హస్తమున వేణువును ధరించి యష్టనిపాశమును వామకరమున ధరించి, మేఘ శ్యాముడు, మయూర పింఛాలంకృతుడగు శ్రీహరిని ధ్యానించవలయును. ఏడు లక్షలు జపము చేయవలయును. తరువాత పూర్వోక్త పీఠమున అంగములతో ప్రథమావరణ పూజను గావించవలయును. సువర్ణ పింగల, గౌరపింగల, రక్త పింగల, గుడపింగ, బభ్రువర్ల, ఉత్తమకపిల, చతుష పింగల, పీత పింగల అను గోగణాష్టకమును పూజించి సాయుధులైన లోకపాలులను పూజించి మంత్ర సిద్ధిని పొంది కామనలను సాధించుకానవలయును. ప్రతిదినము అష్ణోత్తరసహస్రము పాలతో హోమము చేసిననచో పది హేను దినములలో గోగణముతో ముక్తుడగును. దశాక్టరమంత్రమునకు కూడా ఇదియే విధి.
“ఓం నమో భగవతే శ్రీగోవిందాయ” అనునది ద్వాదశాక్షర మంత్రము, నారద ఋషి, గాయత్రీ ఛందస్సు. శ్రీగోవిందుడు దేవత. 1,2,4,5 అక్షరములచే అంగకల్పన కావించవలయును. కల్పవృక్షమూలమును ఆశ్రయించి మణులచే శోభించు దివ్య సింహాసనమున నున్న వాడు, మేఘ శ్యాముడు, సీతాపరుడు ఆతీసుందరుడు, శంఖ నేత్రధరుడు, గోసహాసపరివృతుడు, అమరపతి, ప్రౌఢహస్తముననున్న కుంభము నుండి జారిపడుచున్న అమృత ధారలచే స్నానము చేయబడువాడు అభినవాంభోజపత్రనేత్రుడగు శ్రీహరిని ధ్యానించవలయును. పన్నెండులక్షలు జపించవలయును. దశాంశమును పాలచే హోమము గావించవలయును. పూర్వమువలె గోషమున నున్నవానిని కాని ప్రతిమాదులందు గాని పూజించవలయును. పూర్వోక్తవైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి అచట శ్రీకృష్ణపరమాత్మను ఆవాహన గావించి, గురుపూజన పూర్వకముగా పూజించవలయును. ఇరుప్రక్కల రుక్మిణీ సత్య భామలను, అగ్రభాగమున ఇంద్రుని, పృష్ఠభాగమున సురభిని, కేశరములందు, అగ్రభాగమున ఇంద్రుని, పృష్ఠభాగమున సురభిని. కేశరములందు అంగములను, కాలిందీ మొదలగు అష్టభార్యలను, వసుపత్రములందు, పీఠకోణములందు బడ్డాది కింకిణిని, పృష్ఠ భాగమున దామములను, ముందు వేణువును, శ్రీవత్స కౌస్తుభములను, అగ్రభాగమున వనమాలను, అష్టదిక్కులలో పాంచజన్యమును, గదను, చక్రమును, వసుదేవుని దేవకీని, నందగోపుని, యశోదను, గోగోపాల గోపికలను, బాహ్యభాగమున ఇంద్రాది దేవతలను, వజ్రాద్యాయుధములను, కుముద, కుముదాక్ష, పుండరీక, వామన, శంకుకర్ణ, సర్వనేత్ర, సుముఖ, సుప్రతిష్ఠితాదులను, విష్వక్సేనుని పూజించి స్వాత్మను పూజించవలయును. ఒకమారు కాని మూడు మార్లు కాని గోవిందుని పూజించువాడు చిరాయువు నిరాధుడు ధనధాన్యాధిపతియగును.
“ఓం ధరానాథాయ నమః” అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మముని. గాయత్రీ ఛందస్సు. శ్రీకృష్ణుడు దేవత. వర్ణద్వంద్వముచే పంచాంగకల్పన చేయవలయును. పంచవక్తవయస్కుడు, అతిలోలుడు, అంగణమున పరుగిడువాడు అతిచంచలేక్షణుడు, కింకిణీవలయహారనూపురభూషితుడు అగు గోపబాలుని నమస్కరించుడు. ఇట్లు ధ్యానము గావించి ఎనిమిది లక్షలు జపించ వలయును. దశాంశమును బ్రహ్మవృక్షసమిధలచే కాని పాయసముచే కానీ హోమము గావించవలయును. పూర్వోక్త వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, అచట ఆవాహనగావించి స్థిరమనస్కుడై అర్చించవలయును. కేసరములందు, నాలుగు దిక్కులందు విదిక్కులందు అంగపూజను గావించవలయును. వాసుదేవుని, బలరాముని, దిక్కులందు ప్రద్యుమ్నానిరుద్ధులను, విదిక్కులందు రుక్మిణీ సత్యబామలను లక్షణం జాంబవతులను, సాయుధులగు లోకపాలకులను బయట పూజించవలయును. ఇట్లు చేసిన మంత్రము సిద్ధించును.
“ఓం శ్రీ భువనకాపయ శ్రీకృష్ణాయ శ్రీగోవిందాయ గోపీజనవల్లభాయ" అనునది ఇరువది అయిదక్షరముల మంత్రము. మున్యాదికమంతయు పూర్వోత్తమువలెనే యుండును. సిద్ద గోపాలుని స్మరించవలయును. మాధవీ మండపా సీనులు గరుడాభిపాలితులు, దీవ్యక్రీడానిరతులు అగు రామకృష్ణులను స్మరించుచు జపించవలయును. విష్ణు భక్తులు ఈ " మంత్రమునకు పూజనము పూర్వోక్తవిధిగా నాచరించవలయును. శ్రీ అనునది ఏకాక్షర మంత్రము. కృష్ణ అనునది ద్వ్యక్షరమంత్రము. శ్రీకృష్ణ అనునది త్ర్యక్షర మంత్రము. శ్రీ కృష్ణాయ అననునది చతురక్షరీ మంత్రము. కృష్ణాయనమః అనునది పంచాక్షర మంత్రము శ్రీకృష్ణాయ నమః గోపాలాయ స్వాహా అనునవి షడక్షరమంత్రములు శ్రీకృష్ణాయ స్వాహా అనునది కూడా షడక్షరమంత్రము. కృష్ణాయ గోవిందాయ నమః అనునది నవాక్షర మంత్రము ఓం శ్రీ గోవిందాయ నమః అనునది అష్టాక్షర మంత్రము. శ్రీధరాశ్యామలాంగాయ నమః అనునది దశాక్షరమంత్రము. బాలవపు షే కృష్ణాయ స్వాహా అనునది మరియొక దశాక్షరి. బాలవపు షే కృష్ణాయ నమః, అనునది ఇంకాక దశాక్షరి. తరువాత గోపీ జనమనోహరుని స్వప్పదయమున ధ్యానించవలయును. శ్రీబృష్ణావన ప్రాంతమున వికసించిన పూలచే - వంగిన తీగల సమూహములు : కలిపాదలందు పరస్పర సంఘర్షము వలన పరిమలవంతమగు వాయువుచే సేవించబడిన కాలిందీతీరమున విహరించు చున్నవాడు రాధ జీవమునకు ముఖ్యాధారుడు, నందకిశోరుడు, స్నిగ్లాంబుదాడంబరుడు ఇందువదనుడగు శ్రీకృష్ణుని నమస్కరించుచున్నాను. ఈ మంత్రములకు పూర్వోక్తవిధానముచే పూజాదికము నాచరించవలయును. .
దేవకీసుత | గోవిన్ద | వాసుదేవ | జగత్పతే | దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః" అనునది ముప్పది రెండక్షర ముల మంత్రము. నారద ముని గాయత్రీ అనుష్టుప్ఛన్లస్సులు.
సుతప్రదుడగు శ్రీకృష్ణుడు దేవత. అన్ని పాదములచే అంగన్యాసము కావించవలయును. అర్జునునితో కలిసి రథము మీద కూర్చొని సముద్రమధ్యమునకు వెళ్ళి, మరణించిన బ్రాహ్మణపుత్రులను తెచ్చి ఇచ్చిన శ్రీకృష్ణుని ధ్యానించవలయును. ఒక లక్ష జపము చేయవలయును. దశాంశము. మధుర మిశ్రితములగు తిలలచే హోమమును గావించవలయును. పూర్వోక్త పీఠమున అంగ సాయుధ ద్సీల పూజగావించవలయును. ఇట్లు మంత్ర సిద్ధిని పొందినచో గొడ్రాలియందు కూడా పుత్రులను పొందును. . “(ఓం )”
సోహం హంస స్వాహా నమః' అనునది అష్టాక్షర మంత్రము. పంచ బ్రహ్మాత్మకమగు ఈ మంత్రములకు బ్రహ్మ ఋషి. గాయత్రీ ఛందస్సు. పరంజ్యోతి పరబ్రహ్మ దేవత. ప్రణవము బీజము. స్వాహాశక్తి, స్వాహా అనునది హృదయము. సొహం వా అనునది శిరస్సు. హంస అనునది శిఖా. 'నమః' అనునది కవచము. ప్రణవము నేత్రము. హరిహరి అనునది అస్త్రము. అతనే బ్రహ్మ అతనే శివుడు, అతనే హరి, అతనే ఇంద్రుడు, అతనే సర్వరూపుడు, సర్వనాముడు, అతనే ఆక్టరుడు పరముడు, స్వరాట్. ఇట్లు ధ్యానించి ఎనిమిది లక్షలు జపించవలయును. దశాంశము హోమము గావించవలయును. పూర్వోక్త ప్రణవపీఠమున సాంగావరణపూజ గావించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత సాధకునికి “తత్త్వమసి" ఇత్యాది వాక్యముల నిర్వికల్పకజ్ఞానము కలుగును.
“శ్రీ హృషీకేశాయ నమః” అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మ ఋషి, గాయత్రీ ఛందస్సు, హృషీకేశుడు దేవత. అఖిలాఫ్రికి వినియోగము. కామబీజము ఆయ అనునది శక్తి. బీజము చేతనే షడంగములను కల్పించి ధ్యానించవలయును. పురుషోత్తమ మంత్రమునకు చెప్పినదంతయూ ఇచట ఆచరించవలయును. లక్ష జపము పదివేలు నేయిచే హోమమును గావించవలయును. సంమోహినీ పుష్పములచే తర్పణము గావించిన సర్వాభీష్టములు. సిద్దించును. | శ్రీ శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః” అనునది పదునాలుగక్షరముల మంత్రము. బ్రహ్మరుషి. గాయత్రి ఛందస్సు. శ్రీధరుడు దేవత. శ్రీ బీజము 'ఆయ 'శక్తి, బీజముచే షడంగకల్పనము. 'ధ్యానపూజాదికమంతయు
పురుషోత్తమమంత్రమునకు వలె చేయవలయును. లక్షజపము దశాంశము నేయిచే హోమము. సుగంధశ్వేత పుష్పములచే పూజను హోమాదికమును ఆచరించవలయును. ఇట్లు చేసినవాడు సాక్షాత్తు శ్రీధరుడగును.
“అచ్యుతాయనమః” “అనంతాయనమః" ఈగోవిన్దాయనమః"అనునవి మంత్రరాజములు. శౌనక ఋషి విరాట్ఛందస్సు. పరాశరవ్యాసనారదులు ఋషులు. విరాట్చనస్సు పరబ్రహ్మత్మ కమగు హరి దేవత. బీజశక్తులు పూర్వోత్తములు. శంఖచక్రధరుడు, చతుర్భాహుడు, కిరీటి, సర్వాయుధయుతుడు, గరుడవాహనారూడుడు, సనకాదిమునీంద్రులచే సర్వదేవతలచే ఉపాసించ బడువాడు, శ్రీభూమిసహితుడు, ఉదయాదిత్యసన్నిభుడు, ఉద్యదాదిత్యసహస్ర సన్నిభకుండలుడు, సర్వలోకరక్షణ కాఱకు అనన స్థితుడు, భయప్రదుడు, వరదుడు, ముదాన్వితుడు, అగు హరిని, ధ్యానించి, వైష్ణవపీఠమున అర్చించవలయును. ప్రథమావరణమున శంఖ చక్ర గదా ఖడ్గములను, ముసల" ధనుః 'పాశాంకుశములను ద్వితీయావరణమున, సనకాదిక శాక్తేయ వ్యాసనారద శౌనకులను తృతీయావరణమున, చతుర్ధావరణమున లోకపాలులను, పూజించవలయును. లక్ష జపము దశాంశము నేతితో హోమము గావించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత ప్రయోగములనాచరించవచ్చును. -బిల్వవృక్షము క్రింద నున్న దేవుని ధ్యానించుచు రోగిని స్మరించుచు, లేదా రోగిని స్పశించికాని పది వేలు జపించవలయును. మనసులో స్మరించికాని జపించవలయును. ఇట్లు నలుబది రోజులు చేసినచో రోగులకు రోగవిముక్తి లభించును. కన్యను కోరువాడు పేలాలచే హోమముగావించవలయును. ధనార్ణి' బిల్వములచే హోమమును చేయవలయును. వస్త్రార్జిగంధకుసుమములచే ఆరోగ్యార్ధి తిలలచే హోమమును గావించవలయును. ఆదివారమున నాభిమాత్రము జలములో నుండి అష్టోత్తర. సహస్రము జపించినచో జ్వరము నశించును. వివాహము కాఱకు ఒకమాసము చన్దమండలమధ్యగతుడగు కృష్ణుని ధ్యానించిన కోరిన కన్యను పొందవచ్చును.
“వసుదేవనిగడచ్చేదవాసుదేవాయ హుంఫట్ స్వాహా" అనునది మంత్రము. నారద , ఋషి గాయత్రీ చంధస్సు. శ్రీ కృష్ణుడు దేవత, కవచము. బీజము శిరము శక్తి మొదలగునవన్నియు దశాక్టరమంత్రమునకు వలే చెప్పుకానవలయును. బాలాత్రిఃవ్యాసాయ నమః అనునది అష్టాక్షర మంత్రము బ్రహ్మముని అనుష్టుప్ఛన్లస్సు సత్యవతీ పుత్రుడు దేవత. ఆద్యబీజము. నమశ్శక్తి దీర్ఘాఢ్యముచే అంగాదికము చేయవలయును. వ్యాఖ్యాముద్రచే శోధించు కరతలము కలవాడు. యోగపీఠస్థితుడు, వామజానుతలమున ఇతర హస్తమునుంచినవాడు, సువిద్యానిధి, విప్రసమూహావృతుడు, ప్రసన్న మనస్కుడు, పాథోరుహాద్యుతి, పుణ్య చరితుడు పరాశరపుత్రుడగు వ్యాసుని సిద్ధి కారకు స్మరించవలయును. ఎనిమిది వేలు జపించవలయును. దశాంశమును పాయసముచే హోమమునాచరించవలయును. పూర్వోక్తవ్యాసపీఠమున అంగ పూజ గావించవలయును. ప్రాచ్యాది దిక్కులందు పైలుని, వైశంపాయనుని, జైమినిని, సుమంతుని, కోణ భాగములందు శ్రీశుకుని రోమహర్షణుని, ఉగ్రశ్రవసుని, ఇతర మునులను, ఇంద్రాదికులను, వారి ఆయుధములను పూజించవలయును. ఇట్లు మంత్రసిద్ధిని పొంది కవిత్వమును, ఉత్తమ సంతానమును, వ్యాఖ్యాన శక్తిని, కీర్తిని, సంపదలను పొందును. ఓం నృసింహాయస్వాహా ఓం మాధవాయస్వాహా ఓం లోహితాయ స్వాహా అను మంత్రములు పంచాక్టరులు. విషహరములు, అనంతముని, పంక్తి ఛందస్సు, పక్షీంద్రుడు దేవత, ఓం బీజము, స్వాహా శక్తి స్వాహా యనునది హృదయము గరుడచూడానన స్వాహా అనునది శిరోమంత్రము స్వాహా యనునది శిఖ, గరుడ ప్రభంజయ ప్రభంజయ | ప్రభోదయ, ప్రభేదయ | విక్రాసయ "విత్రాసయ | విమర్ధయ విమర్ధయ | స్వాహా అనునది కవచ మంత్రము. ఉగ్రరూపధర సర్వవిషహర భీషయ భీషయ సర్వం దహ దహ | భస్మీ కురు | స్వాహా -అనునది నేత్ర మంత్రము. అప్రతిహతబలాయ ప్రహతశాసన హుంఫట్ స్వాహా అనునది అస్త్రమంత్రము. పాదకటిహృదయముఖ మూర్ధములందు వర్ణన్యాసమును చేయవలయును. తప్తసువర్ణ నిభుడు ఫణీస్ట్రనికరములచే క్లుప్తాంగభూషుడు, స్మరించువారల తాపమును చల్లార్చువాడు సమస్త జనుల విషమును హరించువాడు ముక్కుకానను కదిలించుటచే పాములను భయమును కదిలించువాడు, పక్షములచే సామగానము చేయువాడు అగు పక్షిరాజును సేవించెదను. అని ధ్యానము చేసి అయిదు లక్షలు జపించి దశాంశమును తిలలచే హోమమును - చేయవలయును. మాతృకాపీఠమున వేద విగ్రహుడగు గరుడుని పూజించవలయును. పక్షిరాజాయ స్వాహా అనునది పీఠమంత్రము. కర్ణికామధ్యమున అంగమును పూజించి యంత్రములందు నాగులను పూజించవలయును. ఆ బయట లోకపాలురను వజ్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్రసిద్ధిని పొందినవాడు గరలమును నశిపచేయగలడు. దేహాంతమున శ్రీవిష్ణుపదమును పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున, బృహదుపాఖ్యానమున తృతీయపాదమున కృష్ణాదిమస్త్రభేద నిరూపణమను ఎనుబది యొకట - అధ్యాయము సమాప్తము.
