నారద మహా పురాణము - పూర్వార్థము
50 - బృహదుపాఖ్యానమ్
సూత మహర్షి పలి కెను :- నారద మహర్షి ఇట్లు సనందనమహర్షి మాటలను విని సంతృప్తి పొందని వానివలె భౌతయగు సనందనుని ఇట్లు పలి కెను.
నారద మహర్షి పలికెను :- ఓ మహానుభావా! నేనడిగిన విషయములన్నిటిని మీరు చెప్పితిరి. అయిననూ హరికథలను ఎన్నిమార్లు వినిననూ ఆత్మకు సంతృప్తి కలుగుట లేదు. వ్యాస పుత్రుడగు శుకుడు పరమధర్మములను తెలుసుకొని అంతరంగమున బహిరంగమున తృప్తిని మహాసిద్ధిని పొందేనని వినియుంటిని. జీవునికి మహానుభావుల సేవ చేయనిదే విజ్ఞానము కలుగదు కదా? వ్యాస పుత్రుడు శైశవములోనే జ్ఞానమునెట్లు పొందెను? శుకమహర్షి జన్మ రహస్యమును, కర్మలను వినగోరు నాకు తెలుపుము. మీరు మోక్ష శాస్త్రార్ధములను తెలిసిన మహానుభావులు.
సనందన మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా? సంగ్రహముగా శుకోత్పత్తిని చెప్పెదను. వినుము. ఈ శుకోత్పత్తిని వినిన మానవుడు బ్రహ్మ జ్ఞానమును పొందును. సంవత్సరముచే, ఫలితములచే, ధనముచే బంధువులచే ఋషులు ధర్మమునాచరించలేదు. అనూచానమునే ఆచరించిరి. అనూచానమే ఉత్తమము.
నారద మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా మానవుడు అనూచానుడెట్లగను? అనూచానమనగానేమి? ఆ కర్మను చెప్పుము. వినవలయునని నాకు కోరికయున్నది.
సనందన మహర్షి పలికేను :- ఓ నారదా? అనూచాన లక్షణమును చెప్పెదను. వినుము. అనూచాన లక్షణమును తెలియువాడు సాంగవేదములను తెలియగలడు. శిక్ష, కల్పము, వ్యోకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను ఈ ఆరు వేదాంగములను పండితులు తెలియుదురు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అను నీ నాలుగు వేదములని ధర్మనిరూపణమున చెప్పబడినవి. గురువు వలను "సాంగవేదములను అధ్యయనము చేయు మానవోత్తముడు అనూచానుడనబడును. స్వయముగా కోటి గ్రంథములను చదివిననూ అనూచానుడు కాజాలడు.
నారద మహర్షి పలి కెను :- వేదాంగముల లక్షణమును, వేదముల లక్షణమును విస్తరముగా తెలుపుము. ఓ మహానుభావా! నీవు సాంగవేదములందు విజ్ఞుడవు.
సనందన మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా!నీవు చాలా కష్టతరమగు ప్రశ్ననడిగితిని. వేదవేదాంగముల సారమును సంక్షేముగా నిశ్చితముగా చెప్పెదను, మునులు ద్విజులు శికలో స్వరము ప్రధానమనీ చెప్పియున్నారు. వేదవిదులు వేదములలో చెప్పిన వాటిని తెలి పేదను వినుము. ఆర్చికము గాధికము సామికము అని సర్వశాస్త్ర సిద్ధాంతముగా విశ్లేషించి ప్రయోగించవలయును. ఏకమాత్రవ్యవధానము కల స్వరము ఋక్కులలో, గాధలలో మాత్రాద్వయవ్యవధానము కలస్వరము, సామమున త్రిమాత్రవ్యవధానముగా నుండును. ఇదియే సామాన్యముగా స్వరలక్షణము, యజ్ఞములలో ప్రయోగించబడు ఋక్సొమయజురంగములలో శిక్షాజ్ఞానము లేనిచో అపస్వరము కలుగును. స్వర హీనము వర్ణహీనమగు. మంత్రమును అపరిశుద్ధముగా పలికినచో అభి పేతమగు నర్థమును చెప్పజాలదు. అట్లు దుష్టమగు వాగ్వజము యజమానికి హాని కలిగించును. ఇంద్రశత్రుపదము అపస్వరముగా పలికినందున ఇంద్రుని శమింపచేయువాడు అను అర్థమును కాక ఇంద్రునిచే శమింప చేయబడువాడు అనునర్థమును బోధించునటుల. వాజ్మయమున వక్షస్థలము, కంఠము, శిరము అని మూడు స్థానములుండును. ఈ మూడింటినే సవనములందురు. అర్థమౌత్రాంతరమున్నచో సామ అనికూడా అందురు. వక్షస్థలము కంఠము శిరము సప్తవివరములు కలిగియుండును. వివరములులేనిచో స్వరము బయలుపరచ శక్యము కాదు.ఇదియే ప్రవచన విధి. కఠకాలాప వృత్తములలో తైత్తిర ఆహ్వరకములలో, ఋగ్వేదము ద్వితీయ తృతీయ స్వరములతో కూడా యుండును. ఉచ్చ మధ్యమ సంఘాతమే స్వరమనబడును. ఆహ్వరకములందు తృతీయ ప్రధమ స్వరములను చెప్పవలయును. ద్వితీయమునుండి మంద్రము వరకు తైత్తిరీయ స్వరములందురు. సామగానము చేయు మునీశ్వరులు ప్రధమ ద్వితీయ తృతీయ చతుర్ధ మంద్ర క్రుష్ట స్వరములను ప్రయోగింతురు. ద్వితీయ ప్రధమ స్వరములు నాండిభాల్లవులనబడును. ఇవియే వాజసనేయులకు శాతపధస్వరములు. వైదికులందరూ ఈ స్వరములను విశే స్వరముల సంగ్రహ చరిత్ర.
ఇక ఇపుడు సామవేదస్వరముల చరితమును చెప్పెదను వినుము. సామవేదాంగము అల్పగ్రంధము విస్తరార్ధముగా నుండును. ఈ సామవేదములో తాన రాగ స్వర గ్రామ మూర్చనా లక్షణములను తెలియుట పవిత్రము, పావనము, పుణ్యము. కావుననే నీకు చెప్పుచున్నాను. ద్విజులు అధ్యయనము చేయు ఋగ్యజుస్సామ లక్షణమునే శిక్షయందురు. ఏడుస్వరములు, మూడుగ్రామములు, ఇరువది యొకటి మూర్చనలు, నలుబది తొమ్మిది తానములు. ఇదియంతయు కలిసి స్వరమండలమనబడును. షడ్డ, ఋషభి, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత నిషాదములను, ఏడు స్వరములు. షడ్డ మధ్యమ గాంధారములు అను మూడు గ్రామములనబడును. షడ్జము భూలోకమునుండి పుట్టును. భువర్లోకమునుండి మధ్యమము పుట్టును. సువర్లోకము నుండి గాంధారము పుట్టును. ఈ మూడు గ్రామ స్థానములు. స్వరములకు విశేషముగా గ్రామరాగములకి పేరు. మధ్యమ గ్రామమున ఇరువది, షడ్డ గ్రామమును పదునాలుగు, రాగములుండును. సామగానమును చేయువారు గాంధారమున పంచదశ తానములను చేప్పెదరు. నదీ, విశాలా, సుముఖీ, చిత్రా, చిత్రవతీ, ముఖా, బలా అను నీ ఏడు దేవ మూర్చనలు. ఆప్యాయినీ, విశ్వభృతా, చంద్రా, హేమా, కపర్దినీ, మైత్రీ, బార్హతీ అను ఏడు మూర్ఛనలు పితృదేవతలవి. షడ్జమున ఉత్తరమంద్రము, ఋషభమున ఆరోహణము, గాంధారమున అశ్వక్రాంతము, అను మూడవ మూర్చనయుండును. ఈ మధ్యమమున సౌవీర, పంచమ స్వరమున హృషీకా, ధైవతమున ఉత్తరామూర్చన యుండును. నిషాదమున రజనీ, ఇట్లు ఋషులకు ఏడు మూర్చనలుండును. దేవతల సప్త మూర్చనలనే గాంధర్వులు గానము చేతురు. పితృదేవతల మూర్చనలను యక్షులు గానము చేతురు. ఋషుల సప్తమూర్చనలే లౌకికములనబడుచున్నవి. షడ్జస్వరము దేవతలకు ప్రీతి కలిగించును. ఋషభ స్వరము ఋషులను ప్రీతులను చేయును. గాంధారము పితృదేవతలను ప్రీతులను చేయును. మధ్యమ స్వరము గంధర్వులను ప్రీతులను చేయును. పంచమ స్వరము దేవతలను పితృదేవతలను ఋషులను ప్రీతులను చేయును. యకులను నిషాదము, ప్రాణిసమూహమును దైవతము సంతోషపరచును. గానమునకు దశవిధములుగా గుణవృత్తులుండును. వినుము.
రక్తము, పూర్ణము, అలంకృతము, ప్రసన్నము, వ్యక్తము, వికృష్టము, శ్రేక్షము, సమము సుకుమారము, మధురము అని గానమున పదిగుణములుండును. వేణువీణా స్వరముల ఏకీభావము రక్తమనబడును. స్వరశ్రుతి పూరణము వలన ఛందఃపొదాకర సంయోగము పూర్ణమగును. ఉరోభాగమున శిరోభాగమున, కంఠయుక్తమగుచో అలంకృతమనబడును. గద్గదాది శంకలు లేని దానిని ప్రసన్నమందురు. పదపదార్థ ప్రకృతివికార ఆగమ ఆదేశ కృత్తద్ధిత సమాస ధాతు నిపాత ఉపసర్గ స్వరలింగ వృత్తి వార్తిక విభక్త్వర్ధవచనములను చక్కగా ఉపపొదించుట వ్యక్తమనబడును. పెద్దగా ఉచ్చరించబడి స్పష్టమగు అక్షరములు పదములు కలిగియుండుట విక్రుష్టమనబడును. ద్రుతము, అవిలంబితము ఉచ్ఛనీచ స్థుత సమాహార హేలతాల ఉపనయాదులగు ఉపపాదనలచే కూడియున్నది శ్రేక్షమనబడును. ఆవాస నిర్వాప ప్రదేశములందు ప్రత్యంతర స్థాన సమాగమము సమమనబడును. మృదు పద వర్ల స్వరసాద యుక్తము సుకుమారమనబడును. సమభావముచే కూర్చబడిన లలితపద అక్షర గుణ సమృద్ధము మధురమనబడును. ఇట్లు ఈ పదిగుణములచే కూడియున్న దానిని గానమందురు. ఈ విషయమున కొన్ని శ్లోకములు కలవు.
శంకితము, భీషణము, భీతము, ఉర్దుష్టము, అనునాసికము, కాకస్వరము, మూర్ధగతము, స్థానవివర్జితము, విస్వరము, విరసము, విశిష్టము, విషమాహతము, వ్యాకులము, తాలహీనము, అని గీతమునకు పదునాలుగు "దోషములుండును. ఆచార్యులు సమముగా నుండవలయునని భావింతురు. పండితులు పదచ్ఛేదమును కోరెదరు. స్త్రీలు మధురగుణమును. అభిలషింతురు. ఇతరజనులు విక్రుష్టమును కోరెదరు. (స్పష్టాక్షర పదవత్త్వము) షడ్జము యొక్క వర్ణము పద్మపత్రము వలెనుండును. ఋషభము చిలుక- పచ్చన, గాంధారము కనక వర్ణము. మధ్యమము మల్లె పూవురంగు కలిగియుండును. పంచమము కృష్ణవర్ణము. ధైవతము పీతవర్ణము, నిషాదము సర్వవర్ణసంయుతము. ఇవి స్వరముల వర్ణములు. పంచమ మధ్యమ షడ్జస్వరములు బ్రాహ్మణ జాతివి. ఋషభ ధైవత స్వరములు క్షత్రియములు. గాంధార ' నిషాదములు వైశ్యజాతివి. గాంధార నిషాదములు అర్ద పతితములైనచో శూగ్రజాతికి చెందును. మూర్చ నావర్జితమై దైవత సహితముగా ఋషభ. పంచమములున్నపుడు మధ్యమరాగమున నిపలుంచనచో అదిషడ్జము వలన కలిగిన నిషాదమనబడును. పంచమ స్వరవిరామముతో గాంధారము అంతస్వరముగా నుండి నిషాదసహితమగు ఋషభమును పంచమమని తెలియవలయును. గాంధారస్వరాధీపత్యమున్నచో నిషాద స్వరగమనాగమనములచే ధైవత దౌర్బల్యము వలన నుండునది మధ్యమ గ్రామమనబడును. కొంచెము నిషాద స్పర్శకలిగి, గాంధారము అధికముగానుండి, ధైవత కంపమున్నచో షడ్డగ్రామమగును. అంతర స్వరములతో కాకలి కనబడినచో నది పంచమమగు కైశికమను సాధారణగ్రామమగును. అంతట అన్ని స్వరములచే కైశికమును భావించి మధ్యమమున నుంచినచో నది కైశికమధ్యమమనబడును. కాకలి స్వరముండి కూడా పంచమ ప్రాధాన్యము కలిగియున్నచో మధ్యమ గ్రామసంభవమగు కైశికమని కశ్యపుడు చెప్పెను. గంధర్వ శబ్దములో గకారము గేయమును, ధకారము కారువాదనమును, వకారము వాద్యమును చెప్పును. సామగానము ' చేయువారికి ప్రధమస్వరము వేణువునకు మధ్యమ స్వరమగును. రెండవది గాంధారము, మూడవది ఋషభము, నాలుగవది షడ్జము, అయిదవది ధైవతము, ఆరవది. నిషాదము, ఏడవది పంచమ స్వరము. మయూరము షడ్జమును పలుకును. గోవులు ఋషభమును, మేకలు గొట్టెలు గాంధారమును, క్రౌంచము మధ్యమమును, పూవులు పూయు కాలమున కోకిల పంచమ స్వరమును పలుకును. అశ్వము ధైవతమును, ఏనుగు నిషాదమును పలుకును. షడ్జము కంఠమునుండి వెడలును, శిరస్సు నుండి ఋషభము,గాంధారము అనునాసికము నుండి, ఉరోభాగము నుండి మధ్యమ స్వరము, ఉరోభాగము నుండి, శిరస్సు నుండి కంఠము . నుండి పంచమ స్వరము వెలువడును. లలాటమునుండి దైవతము, సర్వసంధులనుండి నిషాదము వెలువడును. నాసిక, కంఠము, వక్షస్థలము, తాలువు, జిహ్వా, దంతములు అను ఈ ఆరింటినుండి వెలువడును కావున షడ్జస్వరమందురు. నాభి నుండి పుట్టిన వాయువు కంఠ శీరములచే కొట్టబడి ఋషభమువలె నినదించును కావున ఋషభమందురు. నాభి నుండి పుట్టిన వాయువు కంఠశీర్షములచే కొట్టబడి పవిత్ర వాయువును వదులును కావున గాంధారమందురు. నాభినుండి పుట్టిన వాయువు వక్షస్తలమున హృదయమున కొట్టబడి మరల సౌభిదేశమున చేరి మధ్యవర్తి యగును కావున మధ్యమమనబడును. నాభి నుండి బయలు వెడలిన వాయువు ఉగోహత్కంఠములచే కొట్టబడి పంచస్థానములనుండి వచ్చును. కావున పంచమమనబడును. ధైవత నిషాదములను వదిలి మిగిలిన అయిదు స్వరములు పంచస్థానములనుండి పుట్టిన వేయని తెలియుము. పంచస్థానములలో నుండియే అన్నిస్థానములను ధరించును. షడ్జము అగ్నిచే గానము చేయబడునది. ఋషభమును బ్రహ్మ , గాంధారమును చంద్రుడు, మధ్యమమును విష్ణువు, పంచమమును నీవు (నారదుడు) ధైవత నిషాదములను తుంబురుడు గానము చేయును. షడ్జమునకు అధిదేవత బ్రహ్మ, ఋషభమునకు అగ్ని, గాంధారమున గోవులు, పంచమమునకు చంద్రుడు, ధైవతమునకు బ్రహ్మ అధిదేవతలు. గ్రామమును చేరి చంద్రుని వలే హొస వృద్దులు కలది కావున తనకంటే ముందున్న స్వరములచే సంధానము చేయబడుచున్నది కావున ఈ స్వరమును ధైవతమందురు. అన్నిస్వరములు చేరియుండును. కావున నిషాదమని పేరు. ఈ నిషాదస్వరము అన్నిస్వరములను కప్పివేయును. కావున నిషాదమునకు సూర్యుడు దేవత,
గానజాతులలో దారవీ గాత్రవీణ యని రెండు వీణలుండును. సామగానమును చేయునది గాత్రవీణయందురు. ఆ గాత్రవీణలక్షణమును చెప్పెదను వినుము. సామగానము చేయువారు దేనియందు గానము చేతురో దానిని గాత్రవీణయందురు. స్వరవంజనములతో కూడినదై అంగుళులచే అంగుష్ఠముచే రంజితమై జానువుల పై హస్తములను కలిపి ఉంచవలయును. గురువును అనుకరించవలయును. లేనిచో భిన్నమతి యగును. మొదట ప్రణవమును ప్రయోగించవలయును. తరువాత భూః, భువః, సువః అను వ్యాహృతులను ప్రయోగించవలయును. తరువాత సావిత్రీమంత్రమును ప్రయోగించవలయును. అపుడు గానము నాగంభించవలయును. అన్ని అంగుళులను చాచి స్వరమండలమును ఆరోపించవలయును. ఇతరాంగుళులతో అంగుష్ఠమును, అంగుష్ఠముతో ఇతరొంగుళులను స్పృశించరాదు. అంగుళులను ఎక్కువ వ్యవధానమునుంచరాదు.అంగుళుల మూలమును స్పృశించరాదు. అంగుషాగ్రముతో మధ్యమ పర్వను (రేఖను) స్పశించవలయును. విభాగమును చక్కగా తెలిసిన వారు ఏకమాత్ర ద్వీమాత్రావిభాగమును తెలుపుటకు అట్లు మధ్యమ పర్వను స్పృశించవలయును. వామహస్తముయొక్క అంగుళులతో ద్విమాత్రాస్థితిని తెలుపవలయును. మూడు రేఖలున్న ప్రదేశమున స్వర సిద్ధిని చూపవలయును. ఆత్రి రేఖలున్న ప్రదేశమునే పర్వయందురు. మిగిలిన భాగము మధ్య భాగమందురు. సామవేదమున పర్వాంతరమును ఋగ్వేదమున తీలాంతరము నోచరించవలయును. మధ్యమ పర్వం యందు స్వరములను చక్కగా నిచేశించవలయును. ఈ విషయము ఏ శరీరావయవమును కొంచెము కూడా కదిలించరాదు. క్రిందమ్సత్తు నుంచి హస్తమాత్రమున యథాక్రమముగా మేఘముల మధ్యన మణీసూత్రము వలె నుండు మెరపు వలె ప్పషచ్ఛేద వివృత్తులకు బాలులలో కర్తరీవలే, తాబేలు తన అవయవములను తనలో దాచుకొనినట్లు అన్ని వ్యాపారములను మాని మనసును నిలుపవలయును. స్వస్తుడై ప్రశాంతుడై భయము లేనివాడై జ్ఞాని వర్ణములనుచర్చంచవలయును. నాసిక యొక్క పూర్వభాగమున గోకర్ణము వలె హస్తమునుంచవలయును. హస్తాగ్రమున దృష్టినుంచి శాస్త్రార్థమును చింతన చేయవలయును. హస్తముతో నోటితో చక్కగా వాక్యమును పలుకవలయును. వర్ణములనుచ్చరించుట సమాప్తిగావించుట ఒకే విధముగా చేయవలయును. ఎక్కువగా తక్కువగా రాగ ప్రస్తారము చేయరాదు. ఎక్కువగా ఉచ్చస్వరముతో గానము చేయరాదు. శరీరావయవములను స్వరములను కంపన చేయరాదు. ఆకాశమున వాయుస్థితివలె సామమును సమమగా గానము చేయవలయును. జలములో చక్కగా సంచరించుచున్ననూ మీనముల అడుగుల జాడ కనపడదో, ఆకాశమున విహరించుచున్ననూ పక్షుల పాద చిహ్నములు స్పష్టముగా తెలియవో అట్ల స్వరములో శ్రుతి ఉండి లేనట్లుండవలయును. పెరుగులోని నేతిని, కాష్ఠములోని అగ్నిని ప్రయత్నముచే పొందునట్లు స్వరములోని శ్రుతిని ప్రయత్నముచే తెలియవలయును. ఒక స్వరమునుండి మరొక స్వర సంక్రమమును స్వర సంధిని ఎదుటి వారిని కోభింపచేయక, విచ్చిత్తి కలుగనీయక కొద్దినీడతో కూడిన ఎండవలె సమముగా చేయవలయును. అనాగతము, అతిక్రాంతము, విచ్చిన్నము, విషమాపతము, సూక్తాంతము, అంతములేకుండుటను కర్షణమును పండితుడు వర్షించవలయును. స్థానము నుండి చ్యుతమైన స్వరము తన స్థానమునతిక్రమించినచో సామగాన మును చేయువారు విస్వరమందురు. వీణాగానము చేయువారు విరక్తమందురు. అభ్యాసము కొఱకు ద్రుత వృత్తిని, ప్రయోగము కొలుకు మధ్యమావృత్తిని, శిష్యోపదేశము కొఱకు విలంబిత వృత్తినాశ్రయించ వలయును. గ్రంథమును గ్రహించి గ్రంథమునుచ్చరించుట నేర్చుకొను వారికి శిక్షావిధిననుసరించి హస్తముతో అధ్యాపనమును చేయవలయును. క్రుష్టస్వరమునకు స్థానము మూర్ద. ప్రధమ స్థానము లలాటము ద్వితీయమునకు స్థానము భూమధ్యము. తృతీయమునకు స్థానము కర్ణములు. చతుర్ధస్థానము కంఠము. మంద్రమునకు స్థానము రసన (నాలుక) అతిస్వరము నీచ స్వరమునకు హృదయము స్థానము. అంగుషోత్తమ భాగమున క్రుష్టస్వరమును, అంగుష్ఠమున , ప్రధమస్వరమును, ప్రదేశిని యందు గాంధారమును, దాది తరువాత ఋషభమును, అనామిక యందు షడ్జమును, కనిష్ఠయందు ధైవతమును కనిషము క్రింది భామున నిషాదమును చూపవలయును. పర్వలు లేకుండుటచే, మధ్యములేకుండుటచే, వ్యయములేకుండుటచే ఎపుడూ మందీ భూతముగానుండు మంద్రము పరిస్వారమనబడును. క్రుష్టస్వరముచే దేవతలు, ప్రథమముచే మనుష్యులు, ద్వితీయముచే పశువులు, తృతీయముచే గంధర్వాప్సరసలు, పక్షులు పితృదేవతలు నాలుగవస్వరముచే, పిశాచ అసుర రాక్షసులు మంద్రస్వరముచే, అతిస్వరముచే నీచముచే స్థావరజంగమాత్మకమగు ప్రపంచము జీవించుచున్నది. సామిక స్వరముతో అన్ని ప్రాణులు తమ ప్రాణములను నిలుపుకొనుచున్నవి. దీప్తాయత కరుణము, మధుమధ్యమముల శ్రుతుల విశేషములను తెలియనిపోడు ఆచార్యుడనబడడు. దీప్త శ్రుతిని మంద్రమున ద్వితీయమున చతుర్ధమున, అతి స్వరమున, తృతీయమున ప్రయోగించవలయును. క్రుష్టస్వరమున కరుణశ్రుతిని ప్రయోగించవలయును. ద్వితీయమునకు మృదుమధ్య ఆయత శ్రుతులను ప్రయోగించవలయును. ఆ శ్రుతుల లక్షణములను కూడా విడివిడిగా చెప్పేదను వినుము. నీచమున ఆయత శ్రుతి, ఉచ్ఛలో మదుశ్రుతి స్వీయస్వరమున మధ్యమ శ్రుతిని చక్కగా విచారించి ప్రయోగించవలయును. ద్వితీయమున వినతమైనది, పరమున క్రుష్టమైగును. మొదట మృదువుగా నుండి వీరతమై చతుర్థస్వరమున ప్రవర్తించునది, మంద్రమున ప్రయోగించునదీ, సామసమాప్తిలో ఉపయోగించునది దీప్త శ్రుతీయని తెలియవలయును. స్వరముల మధ్యన తార శ్రుతిని ప్రయోగించరాదు. ఊష్మలతో (శషసహ) పదాంత స్థిత సంధికి రెండు గతులుండును. ఈ అయిదు స్థానములను ఘుటి యని యందురు. స్వరాంతరావిరతములు హ్రస్వదీర్ఘ ఘటికలు అను శ్రుతి స్థానములలో శ్రుతులవలెను స్వరములను చెప్పవలయును. ఉదాత్త స్వరిత స్వరములలో దీపాశ్రుతిని, అనుదోత్తమున మృదుశ్రుతిని ప్రయోగించవలయును. శ్రుతి సంపదలో గంధర్వులు నిష్ణాతులు. ఉదాత్తము అనుదాత్తము, స్వరితము, ప్రచితము నిఘాతము అని స్వరభేదములు అయిదు విధములు. ఇకనిప్పుడు ఆచిక స్వరత్రయమును చెప్పెదను. వినుము.
ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని మూడు స్వరములు ఉదాత్తమనునదే స్వరితము కంటే పరముగా నుండును. స్వంతము కంటే పరముగానున్న ఉదాత్తమును ప్రచయమందురు. ఇచట ఇంకొక స్వరముండదు. వర్ణస్వరము, అతీత స్వరము అని స్వరితము రెండు విధములు. మాత్రాస్వరము వర్ణస్వరము, దీర్ఘము అతీత స్వరమనబడును. ఈ స్వరము ప్రత్యయముననుసరించి ఏడు విధములగును. యెచట ఏ స్వరముండునో పదమును అనుసరి" తెలియవలయును. సమర్థుడగు శ్రోతకు ఏడు స్వరములను ప్రయోగించవలయును. పుత్రుల శిష్యల హితమును కోరిన ఆచార్యులు శాస్త్రమునేర్పచిరి. ఉచ్చమునకం ఓ ఉచ్చతరము, నీచముకంటే నీచతరము లేదు. వైస్వర్యమున స్వారమున ఏస్థానమును స్వరముగా పలుకవలయునో తెలియును. ఉచ్ఛనీచముల మధ్యమున నున్న దానిని సాధారణమందురు. గానశాస్త్ర శిక్షకులు స్వార సంజ్ఞలో ఈ సాధారణమునే స్వారమనీ యందురు. ఉదాత్తస్వరము నిషాదగాంధారములను అనుదాత్త స్వరమున ఋషభదైవతములను ప్రయోగించవలయును. షడ్గమధ్యమ ధైవతములు స్వరితము నుండి పుట్టినవి. జిహ్వామూల ప్రయోజనములుగాగల కఖలు పరముగానున్న శషసహలను కూడా మాత్రా ప్రకృతి చేతనే ప్రయోగించవలయును. దానినే కల యందురు. జాత్యము, కైప్రము, అభినిహితము, అవ్యంజనము, తిరోవిరామము, ప్రశిష్టము, అపొదవృత్తము అని మరియొక ఏడు స్వరములు గలవు. ఈ స్వరముల లక్షణములను విడిగా చెప్పెదను. ఈ స్వరములను ప్రయోగించు ఉద్దేశ్యములను ఉదాహరణములను కూడా చెప్పెదను. సకారముతో కొని వకారముతో కాని కూడియున్న యకరము స్వరితమగును. ముందు ఉదాత్తము లేనిచో జాత్యస్వారమందురు. ఇకార ఉకారములు ఉదాత్తములుగా నున్నను కొన్ని చోట్ల పకారవకారములు అనుదాత్త స్వరముకల ప్రత్యయము పరముగా నున్ననూ కైప్రస్వరమని తెలియవలయును. ఉదాత్తములైన ఏకార ఓకారములచే ఆకారము నుదాత్తమగుచో అకారము లోపించినపుడు అభినిహిత స్వరమందురు. ఉదాత్తపూర్వమగు ఏదో ఒక చంధస్సున స్వరితమొచ్చినచో, సర్వస్వరితములు కలది కూడా అవ్యంజన స్వరమనబడును. అవగ్రహము తరువాత స్వరితమున్న చో ఉదాత్తము అవగ్రహమైనచో తిరోవిరామమగును. ఇకారముచే ఇకారము కలిసియున్నచో ఉదాత్తము అనుదాత్తము చే కూడిన ప్రక్లిష్ట మగును, స్వరిత స్వరమున సంహిత వివృతమైనచో పొదాత వృత్తముగా తెలియవలయును. తానస్వరము జాత్యముచే శ్రుత్యగమున కలిసియున్నచో కైప్రమనబడును. అవియే అభినిహితమైనచో అవ్యంజనమనబడును. విష్కషితమున తిరోవిరామమగును. హీ ఈగో వర్ణములు ప్రశిష్టములనబడును. పాదవృత్తమున ఈ యేడు స్వరములను తెలియవలయును. ఉచ్చమగు ఒక అక్షరమునకంటే పూర్వమున స్వరము గలిగి యుండుట జాత్యవర్జితములగు స్వరములకిట్లుండుట స్వభావము. మొదట నాలుగు స్వారములుండును. కం, షం, పుం, స్సు అనునవి.ఉదాత్తమున ఒక నీచ స్వరమున అగ్ని హోమము దృష్టాంతము. మొదట ఇకారాంతమగు పదముండి పరమున ఉకారమున్నచో దానిని హ్రస్వకంపమని తెలియవలయును. ఇకారాంత పదమన పరమున ఉకార ద్వయమున్న చో దీర్ఘకంపమని తెలియవలయును. సంధ్యక్షరములలో మూడు దీర్ఘములుండును. మిగిలినవి హ్రస్వములుండును. న ఇంద్రభ్యాం అనునపుడు మూడు దీర్ఘములున్నవి. మిగిలినవి హ్రస్వములు. అనేకోదాత్తములగు అనుదాత్త ప్రత్యయమున్నచో శివకంపమని తెలియవలయును. రెండుకంటే ఎక్కువ ఉదాత్తక్షరములకు నీచము కాని ఉచ్చముకొని పరమగునపుడు అచట ఉదాత్తమునే చెప్పుకొనవలయును. రేఫయందు హకారమునందు ఎప్పుడూ ద్విత్వము రాదు. వర్గద్వితీయ వర్ణములందు వగ్గ చతుర్ధ వర్ణములందు కూడా ద్విత్వము రాదు. చతుర్థమును తృతీయముతో, ద్వితీయమును ప్రథమముతో కలిసియున్నపుడు ఆదిమద్య అంత్యవర్ణములను స్వరాక్షరముచే పీడించవలయును. అనన్యము పూర్వమున అంత్యము పరమున నున్నచో ఆ రెంటి మధ్యన నున్నదానిని యమమందురు. ఈ యమము పూర్వవర్ణముతో సవర్ణమగును. శషశలతో కాని యరలవలతో కాని వర్గాంత్యములచే కలిసి యున్నచో పరదేశమును బాటసారులు విడిచునట్లు యమములు నివర్తించును. తృతీయ వర్ణము చతుర్ధ వర్ణము . చతుర్దాది వర్ణములు పరముగా గలదిగా యున్నచో పదమగును. రెండు తృతీయ వర్ణములు హకారము హకారపరముగా నున్నచో పదమగును. ఈ పదములు అనుస్వారోపధామూలములుగా క్రమముగా పరములగును. పూర్వము రేఫహకారములతో సంయుతమైనచో క్రమముగా ఉత్తరాక్షరములుగానుండును. పదాంతమున సంయోగ మున్నచో అంత్యమున వ్యంజనముండును. మొదట ఆగమాదులను చేయవలయును. పరాంగమునందు ఆగమమును నివేశించవలయును. సంయోగమున స్వరితమున్న చోట ఉద్ఘాతముగాని ప్రతనము కాని ఉన్న చో దానిని పూర్వాంగమని తెలియవలయును. ఆరంభించునది పరమగును. సంయోగమునకు పరముగానున్న దీనిని సంయోగసాగుకమందురు. సంయుక్తవర్ణమును పరమున పూర్వమున నున్న అక్షరము పదోంతరమగు అనుస్వరము స్వప్రత్యయమున క్రమజమందురు. స్వరభక్తి రేఫ పూర్వాంగమగును. పాదాది యందు ఆపాదాదియందు సంయోగమునందు అవగ్రహమునందు. యశబ్దముగా తెలియుము. ఇతరము సయమగును. పొదొదిలో విచ్ఛిత్తి కలుగనిచో సంయోగాంతమున నున్న రేఫహకార పకారములను వదిలి ఉపదేశము కనపడును. సంయుక్తమైన వర్ణము అనుస్వరయుక్త మగు వర్ణము గురువగును. దీనినే స్పుటమందురు. ప్రస్వ శేషము గో వర్ణములు యుగళాదులు అవిస్పోటమందురు. ఆ పదముననున్న ఉదాత్తము స్వరితము ఉదాత్తముగా స్వరితముగానే యుండును. నీచము నీచముగానే యుండును. ప్రచయస్థము కూడా నీచమే యగును. అగ్ని, సుత, మిత్ర " శబ్దములు ప్రియ, దూత, ఘృత చిత్త మతి శబ్దములలో నీచ స్వరముండును. అక్కసుత యజ్ఞ కలశ, శత పవిత్ర శబ్దములలో నీచ స్వరము నుండి ఉచ్చారణ ప్రారంభించవలయును. హారివరుణ వరేణ్య ధారా పురుష శబ్దములలోని రేఫ స్వలితమగును. విశ్వానర శబ్దమున నకారము, ఇతర శబ్దములలో నకార రేఫలు స్వరితములగును. వరుణ శబ్దమున వకారము నుండి రెండు వర్ణములు స్వరితములుండును. వరుణ ధారాశబ్దము ఉదాత్తమగును. ఇట్ల ఉరుధార ఓరుధారా శబ్దములలో తెలియవలయును. ఈ శబ్దములలో ఏకమాత్రికము, ద్విమాత్రికము స్వరితమగుచో మొదటిసగము ఉదాత్తమగును.మిగిలినది అనుదాత్తమగును. రెండుస్వరములు ప్రయోగించబడినచో దీర్ఘము కాని దానిని కూడా దీర్ఘముగా చేయవలయును. స్వరితమును కంపము చేయవలయును. హ్రస్వమును కరణము చేయవలయును. మాత్రయనగా నిమేషకాలము లేదా, విద్యుత్కాలము అని తెలియవలయును. ఋక్స్వరములు కూడా ఇట్లే యుండునని కొందరు చెప్పెదరు. సమాసమున అవగ్రహమును (సంధి - విచ్ఛేదమును) చేయవలయును. పదమును అనుసంహితముగా పలుకవలయును. మిత్రపుత్ర సఖి శబ్దములు, అహి శత క్రతు శబ్దములు అవగ్రహములు కలవి. ఆదిత్య, విప్ర, జాత వేద, సత్పతి, గోపతి వృత్రహ సముద్ర శబ్దములు స్వరయుతములు. చికితములు ధకారము అవగ్రహములు కావు. ఇచట నాలుగు వివృతులుండునని నా అభిప్రాయము. ఈ వివృతులు అక్షరనియోగముచే ఏర్పడును. ఈ వివృతుల పేర్లను చేప్పెదను వినుము.
హ్రస్వాదివత్తు, సాన్పుతా, ముందు వత్సానుసాగిణీ, ఉభయత్రపాకవతి అని నాలుగు వివృతులు. ఈ నాలుగింటికి హస్వా, దీర్జా, వృద్దా, పిపీలికా అని పేర్లు. నాలుగు వివృతులకు వ్యవధానము ఒక మాత్రయుండును. ఇతరములకు అర్దమాత్రము, మిగిలిన వాటికి అణుమాత్రము వ్యవధానముండును. రేఫలో శషసరాలలో మకారముండి ప్రత్యయమున అనుస్వారము, పర్వములలో పరసవర్ణము, స్పర్శలలో (క నుండి మ వరకు)ఉత్తమా సతిని, పూర్వము నకారాంత పదముండి పరమున స్వరమున్నచో తకొరముతో కూడియున్న కారమును ‘రక్తము’ అని యందురు. పూర్వమునందు నకారాంత పదముండి యవహ మొదలగునవి వ్యంజనములచే కూడి యున్నపుడు పూర్వమున అర్దమాత్ర. అణుమాత్రముతో రక్తమగును. నకార స్వర సంయుక్తము నాలుగింటి యుక్తమై విధించబడినపుడు రేఫరంగము లోపము కొన్ని చోట్ల సానుస్వారముగానుండును. రంగము హృదయమునుండి వెలువడును. కాంస్యముతో కూడి యుండును. మృదుస్వరముగా ద్విమాత్రముగానుండును. దీనికి ఉదాహరణము దధన్వాం అనునది. సౌరాష్ట్ర కనారి ‘అరాం’ అని పలుకునట్లు రంగమును ప్రయోగించవలయును. ఇది నా అభిప్రాయము. శషసహలతో కూడిన గ,డ,ద,బ లు జ, ణ నమలు స్వరములు (అచ్చులు) నాలుగు పదజాతులను పది పదాంతములు చెప్పబడినవి. ఉచ్ఛస్వరము, నీచస్వరము, స్వరిత స్వరము, అని. ఈ స్వరమున్న ప్రదేశమున వ్యంజములుండవు. ఈ మూడు స్వరములు స్వరప్రధానములు గా ఆచార్యులు ప్రతిజ్ఞ చేసిరి. స్వరములు సూత్రమువంటివి. వ్యంజనము మణివంటిదని తెలియుము. దుర్భలుడగు రాజు యొక్క రాజ్యమును బలవంతుడగు రాజు హరించునటుల దుర్బలమైన వ్యంజనమును బలవత్తైన స్వరము హరించును. ఉభావము, చివృత్తి శషసలు, రేఫ, జిహ్వా మూలములు, ఉపధ్మా నీయములు అను ఎనిమిది ఊష్మల స్వరూపము. సంహితలో కలుగు స్వర ప్రత్యయ వివృతి ప్రదేశమున విసర్గలను చెప్పకొనవలయును. ఇచట తాలవ్యవర్ణములుండును. సంధ్యకరము పరముగా నున్నపుడు సంధిలో యకొరవకారములు లోపించినచో అచట వ్యంజన వివృత్తి స్వరసంహిత యుండునని తెలియుము. ఊష్మాంతముచే పదము ముగియునపుడు సంభావమగుచో స్వరవివృతియని తెలియవలయును. ఉభావముచే కలిసిన ఋకారము ఆదియందున్న పదము పరముననున్న చో స్వరాంతవివృతి యనబడును. మిగిలిన ఊష్కలకు వ్యక్తి వివృతి కలుగును. పదాంతములందు ప్రథమాకరములు, చివరి అక్షరములు (వర్గలలో) ఉన్నచో శషస ప్రత్యయములు ద్వితీయ స్థానమును పొందినచో ఊష్మయుక్తములగు ప్రథమ వర్ణములను ద్వితీయ వర్ణముల వలె చూపవలయును. కాని వీటిని ద్వితీయములుగా నియమించరాదు. మత్స్య, కుర, అప్సర అనునవి దృష్టాంతములు. చంధస్సునకు మానము వృత్తము. పాదస్థానమునకు కారణత్రయముండును. ఋక్కులు స్వచ్ఛందవృత్తములుగా నుండును. అక్షరముల మానముననుసరించి పొదములుండును. ఋక్కులను స్వరభక్తిని ఛందోమానముచే చూపవలయును. స్వరభక్తితో రేఫలేని దొనిని గుర్తించవలయును. ఋ వర్ణములో విడిగెనుండు రేఫజ్ఞానము నిష్ప్రయోజనమేయగును. ఊషలచేకూడిన ఋకారమును లఘువుగా తెలియవలయును. ఊష్మలతో కూడిన ఋకారము పీడించబడినచో గురువుగా తెలియవలయును. ఇచట త్పచ్ అనునది ఉదాహరణము. ఋషభ, బృహస్పతి, గృహీత, పృథివి, నిర్వతి శబ్దములలో నున్న అయిదు ఋకారములు గురువులేయగును. ఈ విషయమున సంశయము లేదు. శషసహరలు ఆదియందు గల పదములలో నున్న రేఫద్విపద సంధిలో నున్న రేఫ స్వరభక్తి యగును.. ఇ ఉ వర్ణరహితమైనది, క్రమ రహితమైన ఏకపదములోని ఋకారము కూడా స్వరభక్తి యగును. స్వరభక్తి రెండు విధములు. ఋకారమునందు రేఫయందు ఉండును నియమించబడిన అక్షరములను చింతించువారు ఈ స్వరభక్తిని స్వరోద వ్యంజనోద యని యందురు. శషసలలో నున్న స్వరభక్తిని స్వరోదయందురు. హకారమునున్న స్వరభక్తిని వ్యంజనోద యందురు. శషసలలోని ఋకారమును వివృతముగా హకారములోని ఋకారమును సంవతముగా తెలియుదురు. స్వరభక్తిని ప్రయోగించువారు మూడు దోషములను వర్షించవలయును, ఇకారమును, ఉకారమును, గ్రస్తదోషమును, సంయోగ పరమైన చకారమును, విసర్గలను, ద్విమాత్రక వర్ణమును, అంతమున నున్న చ, న, జ్, మ, సకారములను, అనుస్వారమును, ఘుటితమును విడువవలయును. ఏ వృత్తములో ప్రథమపాదము తృతీయ పాదము ద్వాదశ మాత్రలు కలదిగా, ద్వితీయపాదము అష్టాదశ మాత్రలు కలదిగా, చతుర్లపాదము పంచదశ మాత్రలు కలదిగానుండునో దానిని విపుల వృత్తమందురు. సంయోగము పరమునందు లేని హ్రస్వాక్షరములు లఘువులని, సంయోగము పరమందున్న హ్రస్వాక్షరములు, దీర్ఘాక్షరములు గురువులని తెలియవలయును. స్వరమున కంటే ముందు వివృతి యున్నచో నది గురుస్వరముగా తెలియబడును. అచట క్షిప్ర స్వరముండదు. పదములలోని స్వరములు అష్టవిధములని తెలియుము.
అంతోదాత్తము, ఆద్యుదాత్తము, ఉదాత్తము, అనుదాత్తము, నీచస్వరితము, మధ్యోదాత్తము, స్వరితము, ద్విరుదాత్తము అని ఎనిమిది పదస్వరముల పేర్లు. అగ్ని సోమ,ప్రవ, వీర్యం, హవిషా, స్వ, వనస్పతి అను శబ్దముల లోపల మధ్యమున నున్న స్వరములు అనునిపాతము చేయబడి మొదటి దానికంటే పరముననున్నది స్వరితమని, ఉపసర్గలో ద్విరుదాత్తమని, ఆఖ్యాతమున నీచస్వరితమని, స్వరితము కంటే పరమందున్నవాటిని నిపాతములుగా తెలియవలయును. ప్రచయమున నున్న అన్నిస్వరములలో ఉదాత్త సమీపవర్తి అనుదాత్తమగును. ప్రచయమున్న ప్రదేశమున స్వరమును అనుదాత్తముగా పలుకవలయును. కేవల స్వరితమున్నచో మృదుస్వరమునుపయోగించవలయును. ఆచార్యులు చెప్పుట అయిదు విధములు. సుఖము, న్యాసము, కరణము, ప్రతిజ్ఞ, ఉచ్చారణము అని ఈ విషయమున శ్రేయోదాయకమగు పద్దతిని చేప్పెదను. వైశ్యులు ప్రతిజ్ఞచే ఉచ్చరించుట యుక్తము. ఏ వర్ణమునకైనను కరణము లభించదు. ప్రతిజ్ఞ మాత్రమే స్వీకరించవలయును. కరణము కూడా ప్రతిజ్ఞాత్మకముగా నుండును. తుంబురుడు, నారదుడు, విశ్వావసువు మొదలగు గంధర్వులు సామములో నిక్షిప్తమగు కరణమును స్వర సూక్ష్మత వలన తెలియరు. జఠరాగ్నిని ఎప్పుడూ తగిన ఆహారపానీయములచే రక్షించవలయును. జీర్ణమగు ఆహారమునే భుజించవలయును. ఉషఃకాలమున లేచి బ్రహ్మను ధ్యానము చేయవలయును. వేదమును వల్లెవేయవలయును. శరదృతువు హేమంతరువు నందు మధ్య కాలమున మామిడి, మోదుగు మారేడు, ఉత్తరేణి శిరీష కొషములతో వాక్కును నియమించి, ప్రాతఃకాలమున లేచి దంతధావనమును చేయవలయును మేడి, కదంబము, కరవీరము, కరంజము, కంటకములు గల వృక్షముల కొషములు, పాలుకారు వృక్షముల కొష్టములు దంతధావనమునకుపయోగించినచో పావనత్వమేర్పడు ఓ కాక స్వరములో సూక్ష్మత మాధుర్యము కలుగును. తూర్పుదిక్కున నుండు మేఘము పలువర్ణములను చూపునట్లు కంఠము అన్నివర్ణములను చక్కగా పలుకగలుగును. శిష్యుడు త్రిఫలచూర్ణమును లవణములతో కలిపి సేవించవలయును. ఈ త్రిఫల జఠరాగ్నిని మేధస్సును కలిగించును. నిత్యకృత్యములను నెరవేర్చి నిత్యధర్మములనాచరించి జఠరాగ్నిని తృప్తిపరిచి, తేనెను నెయ్యిని త్రాగి, పవిత్రుడై వేదాధ్యయనమును చేయవలయును. మొదట మంద్రస్వరముతో ప్రారంభించవలయును. అన్ని వేదశాఖలలోను ఈ విధినే అనుసరించవలయును. సప్తస్వరములనతిక్రమించి యథేషముగా పలుకుటను విసర్జించవలయును. యథేషముగా పలుకరాదు. ఊపిరిని బిగబట్టరాదు. ఊపిరిని బిగబట్టుటచే వైస్వర్యము కలుగును. స్వరవ్యంజనములలో మాధుర్యము లో పించును. చెడుతీర్ధములను వచ్చినవాటిని, దగ్గమైన వాటిని, అపవర్ణములు కలవాటిని భక్షించినచో స్వరము చక్కగా రాదు. అటువంటివారికి పాపులకువలె పరిమోక్షము లేదు. మంచితీర్ధములనుండి వచ్చినవాటిని భక్షించినవారు చక్కగా వేదాధ్యయనమును చేయగలరు. వారివద్ద వేదము సుప్రతిష్ఠితమగును. మంచి స్వరముతో, మంచినోటితో ప్రయోగించిన వేదము శోభించును. పెద్దనోరు కలవాడు, వేలాడు పెదవులు కలవాడు, అన్నివర్ణములను ముక్కుతో పలుకువాడు, బొంగరు గొంతు కలవాడు, నాలుకు కదల్చనివాడు, వేదాధ్యయనమును చేయరాదు. ఏకాగ్రచిత్తము గలవాడు, ఉద్వేగము లేనివాడు, స్నానము చేసి గానమును విడిచి, మంచి దంతోషములు కలవాడు . వేదవర్ణములనుపయోగించవలయును. చండులు, స్తబ్దులు, అలసులు, రోగము గలవారు, పలువిషయములందు మనసునుంచువారు ఈ అయిదుగురు వేదాధ్యయనమును చేయరాదు. విద్యను మెల్లగా అభ్యసించవలయును. ధనమును. మెల్లగా సంపాదించవలయును. పర్వతమును మెల్లగా అధిరోహించవలయును. దొరిలో మెల్లగా నడువవలయును. ప్రతిదినము ఒక యోజనమును మించి నడువరాదు. మెల్లగా కదలుచు చీమలు కొన్ని వేల యోజనముల దూరమును చేరును. ఒక్క అడుగు కూడా ముందుకు వేయనిచో గరుడుడు కూడా ఒక్క అడుగు దూరమును కూడా చేరలేడు. పాపములను పలుకు వాక్కుచే వేదములను పలుకరాదు. చెవిటి వానితో వదురుబోతుతో నెరజాణ పలుకుల వలె యుండును. ఉపాంశు చరితమును భయపడుచు పలుకువాడు ఎన్ని వేలమార్లు చదివిననూ సందేహముతోనే యుండును. గురువు సన్నిధిలో చదువక పుస్తకమును చూచి చదువబడినది జారుని వలన గర్భమును ధరించిన స్త్రీవలే సమాజమున గౌరవమును పొందజాలదు. ఎన్నిమార్లు పెట్టిననూ కరిగిపోవు కాటుకను, చీమలు ప్రయత్నముచే నేర్పరుచు పుట్టను చూచి దానాధ్యయన కర్మలయందు నిత్యము యత్న శీలుడై యుండవలయును. పురుగులు ధూళికణములతో "మెత్తనిమట్టితో పెద్ద పుట్టను సిద్దము చేయును. ఆ పురుగులకు బలము కాని సామర్ధ్యము కాని లేదు. ప్రయత్నశీలతే కార్య సిద్ధికి కారణము నూరుమార్లు అధ్యయనము చేసి వేయిమార్లు వల్లె వేసినచో విద్య పల్లమునకు ప్రవహించునదివలె వచ్చును. జాత్యశ్వములు అర్థరాత్రి సగము నిద్రపోవునట్లు విద్యార్థులు చాలాకాలము కనులకు నిద్ర యుండరాదు. చాలాకాలము భోజనము చేయరాదు. నారీ నిర్బంధముండరాదు. సముద్రమును గరుడ పక్షులు, హంసలు చోటునట్లు విద్యార్థులు వేదసాగరమును దాటవలయును. పాము వలే జనసమూహమునకు భయపడుచు, నగరమును వలె సాహిత్యమును చూచి భయపడుచు రాక్షసులకు వలే స్త్రీజనమునకు భయపడు విద్యార్థి విద్యను పొందగలడు. శకులు, దీనులు, వృధాభిమానులు, లోకముతో ఎక్కువగా మాట్లాడువారు, నపుంసకులు, తమను తాము చూచుకొను వారు అర్ధములను పొందజాలరు. గడ్డపారతో త్రవ్వుచు భూమిలో నీరును పొందినట్లు గురువులో నున్న విద్యను శుశ్రుషతో పొందగలరు. గురువును సేవించుటచే, పుష్కుల ధనముచే కాని ఒక విద్య నిచ్చుటచే గాని విద్యను పొందవచ్చును. నాలుగవ మార్గము లేదు. గురువును సేవించక మేధాసంపత్తి చే విద్యను పొందిననూ గొడ్డురాలి యౌవనము వలె సఫలము కాజాలదు. ఇట్లు సంగ్రహముగా శిక్షను నీకు తెలిపితిని. వేదమునకు మొదటి యంగమగు శిక్షను చక్కగా తెలుసుకొని చక్కగా వేదమును అభ్యసించవచ్చును.
ఇది శ్రీబృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయ పాదమున యాబదియవ అధ్యాయము సమాప్తము.
