నారద మహా పురాణము - పూర్వార్థము
79 - హనుమచ్చరిత్రమ్
సనత్కుమార మహర్షి పలికెను : ఇక ఇపుడు పాపనాశకమగు వాయుపుత్రుని చరితమును చెప్పెదను. ఆనన్దవన వాసియగు రాముడు చెప్పినది చరితము. మహా కల్పమున ప్రసిద్ద బలుడగు హనుమంతుడు సద్యోజాతుడాయెను. నాకు శ్రీరామచంద్రుని పై భక్తి ఎల్లప్పుడూ ఉండనిమ్ము. ఈ చరితము • వినువారికి చదువువారికి పాపనాశకము. నేనెప్పుడూ వానరరూపితో నున్న హనుమంతునిచే సంగమమును కోరుచున్నాను. ఆనందవనమున ఏకాంతములో రహస్యమగు ఈ వృత్తాంతమును చెప్పెను. ఇచట అంతటా చింతారహితులగు సఖీజనము స్నేహితులు ఎల్లపుడూ రహస్యముగా ఏకాంతముగా క్రీడించుచుందురు. నా యొకానొక అవతారమున జరిగిన ఒక రహస్యమును ఇచట నీకు సంతోషముతో ప్రకాశింప చేయుచున్నాను. పూర్వకాలమున నేను దశరథ మహారాజుగారింటిలో చతుర్వ్యూహాత్మకముగా దశరథుని భార్యాత్రయమున ఆవిర్భవించితిని. తరువాత కాన్ని సంవత్సరములకు బ్రాహ్మణోతముడగు విశ్వామిత్రుడు వచ్చి నా తండ్రిని యక్షరాక్షస సంహారమునకు లక్ష్మణునితో కూడిన నన్ను యాచించెను. నా తండ్రి విశ్వామిత్రుని వెంట సిద్దాశ్రమమునకు పం పెను. నేను విశ్వామిత్ర మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి ఆ యాశ్రమమును కలుషితమును చేయుచున్న సుబాహమారీచుల బాధను తొలగించితిని. అపుడు విశ్వామిత్రమహర్షి నాయెడ ప్రసన్నుడాయెను. నాకు అస్త్రవిద్యను ప్రసాదించేను. ఒకనెల అచటనే ఉంచుకానెను. తరువాత మహానుభావుడగు విశ్వామిత్రమహర్షి భవిష్యత్తును తెలుసుకాని నన్ను మిథిలానగరమునకు తీసుకాని వెళ్ళెను. శివుని ధనువును చూ పెను. నేను ఆ సభలో ఆ శివధనువును భగ్నము గావించి సురసుతోపమయగు జనకమహారాజ పుత్రియగు సీతను పణభూతను భార్యగా పొందితిని. తరువాత మార్గనుధ్యములో పరశురాముని గర్వమునణచి అయోధ్యకు చేరితిని అపుడు దశరథమహారాజు నన్ను ప్రజారంజకునిగా తెలుసుకాని యువరాజుగా చేయుటకు సంకల్పించేను. ఆ వార్తను దశరథమహారాజునకు ప్రియపతి యగు కైకయి విని దేవకార్యనిర్వహణకై కలుషితమతియే నా పుత్రుడగు భరతుని యువరాజుగా అభి షేకించుము. రాముని పదునాలుగువత్సరములు దండకారణ్యమునకు పంపుము. అని పలికెను. రాజు చెప్పకున్ననూ కైకమాటలను విన్న నేను భార్యాసోదరసహితుడైనై అరణ్యమునకు బయలుదేరితిని. చిత్రకూటమును చేరితిని. అచట నిత్యము వన్యఫలములచే మాంసములచే పనులు చేయుచుంటిని. అచట నివసించుచూ దశరథమహారాజు నిధనవార్తను వింటిని. తరువాత నన్ను గౌరవించు భరత శత్రుఘ్నులు మాతృవర్గముతో ఆచార్యులతో అమాత్యవర్గముతో దీనులై నావద్దకు వచ్చిరి. విజ్ఞాపన చేసిరి. తరువాత నేను భార్యాసోదరసహితుడనై పంచవటికి పెళ్ళితిని. అచట ఆశ్రమమును ఏర్పరుచుకుంటిని. మూడు సంవత్సరములుంటిని. అంతట పదమూడవయేట రావణుడను రాక్షసుడు మాయతో నా ప్రియురాలగు సీతను నా చాటుగా అపహరించెను. అపుడు నేను దీనవదనుడనై భార్యను వెదకుచూ ఋష్యమూకపర్వతమును చేరితిని. వానరాధిపతియగు సుగ్రీవునితో చెలిమి చేసితిని. అపుడు వాలిని చంపి సుగ్రీవుని అతని స్థానమున రాజును చేసితిని. సుగ్రీవుడు వానరయూధములతో నాకు సాయము చేసెను. రావణునితో విరోధించిన రావణానుజుడగు విభీషణుడు నా వద్దకు వచ్చెను. నేను విభీషణుని లంకాధిపతిగా అచటనే అభిషిక్తుని జేసితిని. సపుత్రామాత్యభాంధవుని రావణుని చంపి, పరిశుద్ధురాలగు" సీతాదేవిని తీసుకాని అయోధ్యకు చేరితిని. తరువాత కొంతకాలమునకు పితృశ్రాద్దమున సుగ్రీవవిభీషణులను నిమంత్రణ చేసితిని. అట్లే షట్కులులగు బ్రాహ్మణులను కూడా ఆహ్వానించితిని. అట్లు పిలువబడిన వారందరూ వచ్చిరి. ఒక్క విభీషణుడు మాత్రము రాలేదు. విభీషణుని గురించి నేను ఆలోచించుచుండగా శివుడు బ్రాహ్మణరూపముతో షట్కులులతో కలిసి వచ్చెను. అపుడు నేను విభీషణుని గూర్చి శంకరుని అడిగితిని. అపుడు నన్ను ద్రావిడ దేశమునకు గొనిపోయి ద్విజబంధనమునుండి విడిపించెను. శ్రాద్ధమునకు వచ్చిన అగస్త్యాది బ్రాహ్మణోత్తములు చక్కగా భోజనము చేసి తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి.
తరువాత కాలాంతరమున బ్రాహ్మణులు, దేవతలు, దైత్యులు, నరేశ్వరులు, గౌతముడు పిలువగా యజ్ఞమునకు వచ్చిరి. వారందరూ త్ర్యంబకాద్రిమీద స్థాపించబడిన స్పాటికలింగమును చక్కగా పూజించి నివసించిరి. ఆ విస్తృతమైన సమాజము లింగమును పూజించిన తరువాత మధ్యాహ్న కాలమున గౌతమ మహర్షి శంకరుని పూజించెను. అందరూ శుక్లాంబరధరులై భస్మోధూలిత విగ్రహులై తెల్లని భస్మమును సర్వశరీరమున త్రిపుండ్రములుగా ధరించి భార్గవుని నమస్కరించి భూతశుద్దిని చేసిరి. హృత్పద్మమధ్యమున నున్న భూత పంచకము, వారి మధ్య మహాకాశము, ఆకాశమున నిర్మలము, దాని మధ్యన దీప్తిమయుడు శుభకరుడగు మహేశ్వరుని ధ్యానించవలయును. అజ్ఞానసంయుతము భూతము సమలము కర్మ సంగతమైన ఆకాశదీపమున నున్న ఆ దేహమును జ్ఞానవహ్నితో దహించవలయును. ఆకాశావృతియైన అహం తత్త్వమును దహించి తరువాత ఆకాశమును దహింప చేసి, తరువాత వాయువును దహింప చేయవలయును. తరువాత అగ్ని భూతమును దహించి, జలభూతమును దహించవలయును. తరువాత పృథివీ భూతమును దహించవలయును. తరువాత భూతాశ్రితులైన గుణములను దహించి తరువాత దేహమును దహించవలయును. ఇట్లు భూతాదిని జీవునజ్ఞానవ హిచే దహించి, శిఖామధ్యగతుడు, ఆనన్దరసనిర్భరుడగు విష్ణువును నిష్పన్న చన్డకిరణసంకాశకిరణుడగు శివుని, శివాంగోత్పన్నములు అమృత ద్రవసంయుతములగు కిరణములచే సుశీతలము చంద్రరశ్మి వలే ప్రశాంతముగా ప్రసరించబడిన గొప్పధారలచే సాంద్రముగా చేయబడిన ప్రవాహముచే ప్లావితము చేయబడిన భూతగ్రామమును చింతించవలయును. ఇట్లు భూత శుద్ధిని చేసి క్రియార్థుడగు మర్త్యుడు వెంటనే పరిశుద్దుడైనచో పూజించుటకు, జపించుటకు యోగ్యుడగును. ఇట్లు చేసినచో బ్రహ్మ హత్యాది పాతకములనుండి విముక్తుడగును. ఇట్లు ధ్యానించి ధ్యానముచే శివలింగమునందు చంద్రదీప్తి ప్రకాశమును ఆరోపించి, దీపమధ్యమున సదాశివుని చింతించి పంచాక్షర మంత్రముచే అవ్యయుని అర్చించవలయును. శంకరునికి ఆవాహన స్నానాద్యుపచారములను పూర్వము వలె నాచరించి మేడి కాని, రాజత స్వర్ణమయములు కాని, వస్త్రాది ఛన్నమగు పీఠమును ఏర్పరిచి, అంతమునందు బుద్బుదములచే సృష్టిజరిపి ప్రతి పీఠమున ఒక్కొక్క నాగమునుంచి, ఊర్ధ్వ పీఠమున నాగయుగ్మమును దేవాభ్యాసమున దక్షిణవామభాగములలో నుంచి నాగమధ్యమున జపాపుష్పమునుంచి మధ్యమున వస్త్రము నుంచి, ఆవస్త్రమధ్యమున పీఠయుకుడు లింగాకారుడగు మహేశుని పూజించవలయును. ఆ సాధకులందరు ఇట్లుచేసి పంచగంధములను అష్టగంధములనిచ్చి, పుష్పములచే, పత్రములచే, శ్రీతిలలచే, అక్షతలచే, కేవలపాలలచే పూజించి యథావిధిగా ధూపము నిచ్చి దీపముని యథోక్తముగా ఉపహారము నిచ్చి, పూజా శేషమును ముగించి నృత్యగీతములను ఆచరించిరి. ఈ సమయమున గౌతమశిష్యుడగు శంకరాత్మయను పేరుగలపోడు ఉన్మత్త వేషుడు దిగంబరుడు అనేక వృత్తులనవలంబించినవాడు అచటికి వచ్చెను. ఒకచోట బ్రాహ్మణవేషధారి, ఒకచోట చండాలసముడు, ఒకచోట శూద్రసమునిగా ఒకచోట యోగిగా, ఒకచోట తాపసిగా, నుండుచు గర్జించుచు, గంతులేయును. నృత్యము చేయును. స్తోత్రము చేయును. గానము చేయును. ఏడ్చును వినును. పడును. లేచును. శివజ్ఞానేక సంపన్నుడు పరమానందనిర్భరుడు భోజన సమయమున వచ్చెను. గౌతముని వద్ద కేగెను. గురువుతో కలిసి భుజించెను. ఒకచోట ఉచ్చిష్టమును తినెను. ఒకచోట పాత్రను నాకును. ఒకచోట ఊరికే వెళ్ళును. గురువు హస్తమును పట్టుకాని స్వయముగా తినును. మరియొక - గృహమున మూత్రము చేసెను. మరియొక యింట బురదను పూసుకానెను. అట్లు శంకరాత్మను గురువు చూచి చేయిపట్టుకాని గృహమునకు తీసుకాని వెళ్ళి, తమ పీఠమున అతనిని కూర్చుండబెట్టి భోజనము చేయించేను. గౌతమ మహర్షి కూడా అతని పాత్రలో తినెను.
శంకరాత్మ మనసును తెలుసుకానుటకు గౌతముని భార్యయగు అహల్య ఒకసారి అతనిని పిలిచి తినుమని పలికెను. గురుపత్ని ఆజ్ఞను విని ఏ భేదము లేకుండగా తనేను. నీరును తాగెను. అట్లే అగ్నిని కూడా త్రాగేను. ముళ్ళను అన్నము" వలె తిని ఎప్పటి వలెనే యుండెను. తరువాత మునికన్యలు పిలిచి " ప్రతి దినము వారిచ్చు భోజనమును, రాళ్ళను నీటిని, గోమయమును బురదను, కాషదండములను తిని త్రాగి సంతోషముతో చండాలాకారము నుండు ముని యతడు. ఇట్లు ఒకమారు జీర్ణములగు పాద రక్షలను చేతిలో పట్టుకాని, అరచుచు నవ్యుచు చండాల వేషము కలవాడై వృషపర్వరాజువద్దకు వెళ్ళెను. వృషపర్వుడు ప్రభువు మధ్య దిగంబరుడుగా నిలిచెను. వృషపర్వుడు అతనిని తెలియక పీడించి శిరస్సును ఖండించేను. ఆ బ్రాహ్మణోత్తముడు వధించబడగా చరాచరమగు ఈ ప్రపంచమంతయు కలుషితమాయెను. అచట మునులు కూడా కలత చెందిరి. మహాత్ముడగు గౌతమునకు మహాశోకము కలిగెను. తమ దుఃఖమును చూపుచున్నట్లు నేత్రములనుండి నీరు వేడలెను. గౌతమ మహర్షి దైత్యులందరి ముందు ఇట్లు పలికెను. ఇతను చేసిన అపరాధమేమిటి? ఇతని శిరస్సు నేల ఖండించితిరి? నాకు ప్రాణాధిక ప్రియుడు, సర్వ కాలములలో శివయోగి ' అయిన వానిని చంపితిరి గావున నామరణము కూడా సంభవించును. గురువు శిష్యరూపముతో నుండును కదొ ధర్మయుక్తులు, శైవులు, సర్వదా శివవరులు అయిన వారి మరణమును చూచినచో మా మరణము తప్పదు. ఆమాటలను విని జ్ఞానులలో శ్రేషుడు రాక్షసాచార్యుడగు శుక్రుడు ఇట్లు పలికేను. భార్గవుడు శంకర ప్రియుడగు ఇతనిని బ్రతికించెదను. మీరెందుకు మరణించెదరు? నా తపోబలమును చూడుము. శుక్రాచార్యులు ఇట్లు పలుకుచుండగనే గౌతమమహర్షి మరణించెను. గౌతమమహర్షి మరణించిన వెంటనే శుక్రాచార్యుడు కూడా యోగము చే మరణించెను. శుక్రాచార్యుడు మరణించిన వార్తను వినిన ప్రహ్లాదాది దైత్యేశ్వరులు, దేవతలు రాజులు, బ్రాహ్మణులు అందరూ మరణించిరి. అహల్యశోకసంతప్తమై మాటి మాటికి పెద్దగా ఏడ్చెను. మహేశుని పూజలో గౌతమునిచే పూజించబడిన వీరభద్రుడు అదంతయూ చూచి కోపించేను. ఇది చాలా కష్టము. చాలా కష్టము. చాలా మంది మరణించిరి. ఇదంతయూ మహేశునికి నివేదించెదను. అతను చెప్పినది చేసెదను. ఇట్లు నిశ్చయించుకాని మందరాచలమునకు వెళ్ళెను. శంకరునికి నమస్కరించి జరిగినదంతయూ నివేదించెను. అచట నున్న బ్రహ్మను విష్ణువును గూర్చి శివుడిట్లు పలికెను. నేను వరప్రదుడనని తెలిసి నా భక్తులు సాహసమును చేసిరి. ఓ విష్ణు అచటికి వెళ్ళి వారు చేసిన సాహసమును చేసెదను. అని పలికి వృషభము నౌరోహించి వాయువు చామరములు వీవగా, సువేషుడగు నంది కేశ్వరుడు ఛత్రమును పట్టగా ఇతరులు ధరించరాని శ్వేత హేమదండము ధరించగా మహేశ్వరుని అనుమతిని పొంది శ్రీ మహావిష్ణువు గరుడునధిరోహించెను. అరక్త నీలఛత్రములచే కౌస్తుభ శ్రీవత్సములచే శోభించెను. శివానుమతితో బ్రహ్మ కూడా హంసారూఢుడాయెను. బ్రహ్మ ఇంద్రగోపప్రభాకార చత్రములచే శోభించెను. ఇంద్రాది దేవతలందరు స్వస్వవాహనారూఢూలాయిరి. నానావిధమంగళవాద్యములు మ్రోగుచుండగా వారు బయలుదేరిరి. కోటికోటిగణములతో గౌతమాశ్రమమును చేరిరి.
బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆ పరమాద్భుతమును చూచిరి. అపుడు శంకరుడు తన వామనేత్ర నిరీక్షణచే స్వభక్తుడగు గౌతముని జీవింపచేసి గౌతమునితో ఇట్లు పలికెను. నేను నీయెడ ప్రీతి చెందితిని. వరమును కోరుము అని. ఆ శంకరుని మాటను వినిన గౌతముడిట్లు పలికెను. నీవు నాయెడ ప్రసన్నుడవైనచో నాకు వరమీయదలిచినచో నాకెప్పుడూ నీ లింగార్చనాసామర్థ్యముండనీమ్ము, ఇది ఒక వరము. ఇంకాక వరమును వినుము. ఇతను నా శిష్యుడు మహానుభావుడు. హేయ అదేయాది వర్షితుడు అహంకార మమకార రహితుడు. ఇంద్రియములను జయించినవాడు. కావుననే మహాయోగి మహాయశస్వి ఉన్మత్తవికృతాకారముచే శంకరాత్మ యని నామము గలవాడు. ఇతనిని ఎవరూ ద్వేషించరాదు. ఎవరూ హింసించరాదు. అట్లే చనిపోయిన వారికి ప్రాణములనిమ్ము. ఈ . వరమును నాకిమ్ము. ఆమాటలను వినిన శంకరుడు సంతోషించి హరిని చూచి స్వాంశమగు వాయువుచే శంకరాత్ముని దేహము నావేశంచేను. కావున శంకరాత్ముడు హరిరూపుడు వాయుపుత్రుడుగా కపిశ్రేష్టుడాయెను. అతను సాక్షాద్విష్ణువు శివుడు అని పర్యాయ పదములచే పిలువబడుచుండెను. ఇతను కల్పాంతము వరకు కామ రూపియై యుండును. నా యాజ్ఞికారియై రామభక్తుడై పూజితవిగ్రహునిగా నుండును. అనంత కల్పములు ప్రీతమానసుడై ఉండగలడు. నీవు చేసిన ఈ గృహము సుప్రతిష్ఠితముగా నుండును. నిత్యము అన్నిరూపములచే క్షణకాలము ఆదరముతో నుండగలము. ఆ పూజలనంది మా లోకములకు వెళ్ళగలము. ఆ శంకరుని మాటలను వినిన గౌతముడిట్లు పలికెను. యోగ్యము కాని దానిని ప్రార్థించుచున్నాను. యాచకుడు దోషమును చూడజాలడు. బ్రహ్మ మును లభ్యము కాని దానినడుచుచున్నాను. నచ్చినచో ఈయుము.
అంతట శివుడు విష్ణువును చూచి అతని చేతిని తన చేతిలోకి తీసుకాని నవ్వుచు విష్ణువుతో నిట్లు పలికెను. ఓ గోవిందా ! నీవు కామోదరముతో నుంటివి. నీకు భోజనము కావలయునో? నీవు స్వయముగా ఇంటిలోనికి ప్రవేశించి స్వగృహమున వలే భుజించుము. లేదా పార్వతీ గృహమునకు వెళ్ళుము. నీ కడుపును నింపును. ఇట్లు పలికి అతని చేతిని పట్టుకాని ఏకాంతమునకు వెళ్ళెను. నందిని యథాప్రకారముగా ద్వారాధ్యక్షునిగా నియమించేను. ఆనంది వెడలి గౌతమునితో విష్ణువు మాటలను తెలిపేను. అన్నమును సిద్ధము చేయుము. దేవేశులు అన్నమును భుజించగోరుచున్నారు. ఇట్లు పలికి వాసుదేవునితో శంకరుడు ఏకాంతమున చేరెను. మృదువగు శయ్యను చేరి దేవోత్తములు శయనించిరి. పరస్పరము కొంత సేపు సంభాషించి లేచిరి. తటాకమునకు వెళ్ళి స్నానము చేయుచుండిరి. ఇద్దరు చేతులతో నీరును ఒకరి పై నొకరు చల్లుకానిరి. మునులు రాక్షసులు కూడా జలక్రీడల తేలిరి. అంత విష్ణువు శంకరుడు కూడా జలపానమును చేసిరి. శంకరుడు పద్మ కింజల్క సదృశకరములతో విష్ణువు యొక్కముఖాంభోజమున చల్లెను. నేత్రములలో కేశరములు పడుటవలన శ్రీహరి నేత్రములను మూసుకానెను. ఇంతలో 'శంకరుడు హరి భుజముల నధిరోహించెను. హరి శిరమును చేతులతో పట్టుకాని ముంచెను. ఇట్లు మాటికి మాటికి ముంచుటచే పీడించబడిన శ్రీహరి శంకరుని పడవైచేను. అంతట శంకరుడు విష్ణుపాదములను పట్టుకాని తిప్పి లాగి హరివక్షమును కాట్టి అచ్యుతుని పడవైచెను. అంతట లేచిన శ్రీహరి లేచి దోసిటితో నీరు తీసుకాని శిరస్సున చల్లెను. శంభువు హరి శిరమున చల్లెను. ఇట్లు ఋషి గణమధ్యమున శివ కేశవుల జలక్రీడ సాగేను. జలక్రీడాసమాసక్తులై జటాబంధములు వీడగా ఒకరి జట మరొకరి జటతో ముడిపడెను. ఆ జటా బంధమును విడిపించుటకు శక్తిమంతులు శక్తి హీనులు అగు మునులు లాగుచుండిరి. ఒకరినొకరు పడవేయుచు, పడుచు, ఆక్రోశించుచు రోదించుచుండిరి. ఇట్లు జలక్రీడలో తుములసంరంభము జరుగుచుండగా ఆకాశమున వానరేంద్రుడు నాదము చేసి నృత్యము చేసెను. వీణను లలితముగా మీటుచు పెద్దగా పాడెను. చక్కని గీతములను పది విధములుగా పాడెను. శంకరుడు లోకభావనుడు ఆ మధురగీతమును వినేను.
తాను కూడా మెల్లమెల్లగా మధురముగా పాడ మొదలిడెను. స్వయముగా శంకరుడు మధురముగా గొంతెత్తి పాడుచుండగా ధ్రువస్వరమును సర్వలక్షణ సంయుతమును స్వధారమృత సంయుక్తమును చేసి గానముతో గానమును కలి పెను. వాసుదేవుడు చేతులతో మద్దెలను మ్రోగించేను. తుంబురుడు కూడా మెల్లగా మీ టెను. గౌతమాదులు తానమును చేసిరి. వాయుజుడు గాయకుడాయెను. ఇట్లు కపీశ్వరుడగు హనుమంతుడు మధురముగా గానము చేయుచుండగా వాడినవి చిగురించేను. కృశించినవి పుష్పములాయెను. అందరూ తమతమ గొనములనాపి దేవర్షి దానవగణము స్థిరముగా క్రియా శూన్యులుగా నిలిచిరి. ఒక్క హనుమంతుడు గానము చేయువాడు. మిగిలిన వారందరు శ్రోతలు. మధ్యాహ్నకాలమగుచండగా, హనుమంతుడు. పాడుచుండగా దేవతలందరూ తమ తమ వాహనములనధిరోహించి తమ తమ లోకములకు వెళ్ళిరి. గానప్రియుడగు మహేశ్వరుడు వానరేశ్వరుని గ్రహించెను. ఓ ప్లవ గేశ్వరా ! నీవు నా యాజ్ఞతో నిస్సందేహముగా వృషభమునధిరోహించుము. నాకభిముఖుడవై అనేక గీతములను పాడుము. అని కపీ శార్దూలుడు శివుని గూర్చి ఇట్లు పలి కెను. వృషభారోహణసామర్థ్యము నీకు తప్ప ఇతరులకు లేదు. నీవాహనమునధిరోహించినచో. నేను పాతకినగుదును. నీవు నన్ను అధిరోహించుము. నేను . ఇకఅభిముఖుడనై గానము చేసెదను. ఇట్లు పలుకగా శంకరుడు హనుమంతునధి రోహించెను. శివుడు అధిరోహించగనే హనుమంతుడు తన శిరస్సును భేదించి తిప్పి పెట్టి పూర్వము వలెనే గానము చేయుచుండెను. హనుమంతుని మధురగానమును వినుము. శివుడు గౌతముని ఇల్లు చేరెను. దేవర్షి గణదోనవులందరూ అచటికి వచ్చిరి. భోజనావసరమున గౌతముడు వారినందరిని పూజించెను. గౌతముని ఇంటిలోనున్న శుష్కదారుసంభవ గృహోపకరణములన్నియూ హనుమంతుని గానముతో చిగిర్చెను. హనుమంతుని గానమును అందరూ చిత్తరులవలె వినుచు చూడసాగిరి. హనుమంతుడు ద్విబాహువు. శివపోదాభివందనమును చేయుచు, సమస్తాభరణభూషితుడై ప్రసన్నాకారముతో తరుణుడుగా నుండగా మిగిలిన వారందరు శిరమున చేతులు జోడించియుండిరి. శంకరుడు హనుమంతుని శిరమును చేతులతో పట్టుకాని యథాపూర్వముగా చేసెను. పద్మాసనాసీనుడగు హనుమంతుని అంజలిలో ఒకపాదము నుంచి, మరియొక పాదమును ముఖమున నుంచి, పాదాంగుళులచే నాసికను స్నేహముతో పట్టుకానెను. స్కంధమున ముఖమున, భుజమున కంఠమున వక్షస్థలమున, స్తనమధ్యమున, హృదయమున, కుక్షీయందు, నాభిమండలమున, పాదము నుంచుచు, రెండవ పాదమును దోసిట నుంచుచు శిరస్సును పట్టుకాని వంచుచు ప్పష్టమును చిబుకముతో సుశీంచెను. అట్లే ముక్తాహారమును. హనుమంతుని కంఠమున వేసెను. దానినంతటిని చూచుచున్న విష్ణువు శంకరునితో నిట్లు పలికెను. ఈ బ్రహ్మాండమునందంతటా హనుమత్సముడు మరియొకడు లేడు. శ్రుతులను దేవతలకు గోచరముకాని నీ పాదము హనుమంతుని శరీరమున నిలిచినది. సర్వోపనిషత్తులకు అందని నీ పాదము కపీశ్వరుని చేరినది. యమాదిసాధనములచే కూడా యోగుల హృదయపద్మమున నిలువని నీ పాదము హనుమంతుని యందు స్థిరముగా నిలిచినది. వేలకోట్ల సంవత్సరములు పూజించిననూ నీపాదదర్శనము కలుగదు. లోకమున శివుడు నారాయణప్రియుడని నారాయణుడు శివప్రియుడని అనుకొందురు. కాని నాకా భాగ్యము కలుగలేదు.
ఇట్లు పలికిన విష్ణువు మాటలను విని శంకరుడు సంతోషముతో ఇట్లు పలికెను. నీతో సముడగు ప్రియుడు మరియొకడు లేడు. నీతో సమప్రియత్వము ఒక పార్వతిలో యున్నది. మీ ఇద్దరి ప్రీతిలో నాకు భేదము లేదు. అంతట గౌతముడు మహాదేవునకు నమస్కరించి ఇట్లు విజ్ఞాపన చేసెను. ఓ కరుణానిధీ ! మధ్యాకాలము దాటుచున్నది. అందరికి ఇది భోజన వేల. అంతట మహాదేవుడు ఆచమనము చేసి విష్ణువుతో కలిసి గౌతమగృహమును ప్రవేశించి భోజనమునకుపక్రమించెను. రత్నాంగులీయములచే నూపురములచే, దుకూల బంధముచే, మెరుపు వంటి కాంచీ సూత్రము, బహువిధహారములచే, కంఠనిష్కుయజ్ఞోపవీతోత్తరీయములచే మెరయుచు వ్రేలాడుచున్న కుండలములచే సుపుష్పధమ్మిల్లవరముచే, పంచాంగగంధవిలేపనముచే, బాహ్వాంగదములచే, కంకణాంగులీయములచే అలంకరించబడిన శివుడు ఉత్తమాసనమున కూర్చొని, తనకు సమ్ముఖముగా ఉత్త మాసనమున శ్రీహరిని కూర్చోబెట్టెను. ఇట్లు దేవ శ్రేష్టులగు హారీశులు అన్యోన్యాభి ముఖమముగా కూర్చోనిరి. గౌతముడు భక్తితో వారికి సువర్ణభోజనమున అన్నము పెట్టెను. ముప్పది విధముల భక్ష్యములను, నాలుగు విధముల పాయసమును, చక్కగా కల్పించబడిన రెండు వందల పాకజాతమును, అపక్వమును మిశ్రమమును ముప్పది రెండు విధములుగా కల్పించబడిన దానిని నూరు నూరు విధముల చక్కని కందములచే శాకములచే కల్పించబడినదానిని నేతితో చేయబడిన ఇరువదియైదు విధముల వ్యంజనములను, శర్కరాదికమును, మామిడి అరటి దొడిమ, ద్రాక్ష, చెరుకు, నాగరంగ మొగలగు ఫలములను మీషాన్నమును, పక్వాన్నములను, ప్రియాలక జంబూ వికంతర ఫలములను ఇటువంటి ఇతర ద్రవములను ఈశ్వరునికి సమర్పించి ఔపోశానకమునిచ్చి భుజించుడని పలికెను. అందరూ భుజించుచుండగా సూక్ష్మవిస్తృతమగు వ్యజనమును తీసుకాని, స్వయముగా గౌతముడు శివ విష్ణువులకు వీచెను. అంతటా పరమేశ్వరుడు పరిహాసమును చేయకోరెను. ఓ వీస్తూ హనుమంతుడెట్లు తినుచున్నాడో చూడుము అని పలికెను. అట్లు విష్ణువు హనుమంతుని చూచుచుండగా మహేశ్వరుడు మునులందరూ చూచుచుండగనే ఒక మండకమును విష్ణుబోజన పాత్రలో పడవేసెను. స్వోచ్చిష్టమగు పాయసాదికమును హనుమంతునికిచ్చెను. అంతట హనుమంతుడు ఓ ప్రభూ నీ మాటలవలననే నీ ఉచ్ఛిష్టమును భుజించరాదు. నా నైవేద్యమగు పత్ర పుష్పఫలాదికము అభోజ్యము. నాకు నివేదన చేసినదంతయూ బావిలో పడవేయవలయును. తిననిచో నీ మాట సత్యమగును. తినినచో నీ యనుగ్రహము కలుగును. స్వయంభూతుడగు బాణలింగుడు చంద్రకాంతుడు హృదయమున నుండగా శంభునైవేద్య భక్షణము చాంద్రాయణసమమని తెలియుము. అని పలుకగా శంకరుడు, ఇపుడిది భోజన సమయము. ఇపుడు వేరే మాటలు వైరస్యమును కలిగించును. భోజనము చేసిన తరువాత చెప్పెదను. నిశ్శంకగా భోజనము చేయుము. అని పలికెను. అంతట గౌతముడు జలసంస్కారమును చేసెను. ఆరక్తసుస్నిగ్గసుసూక్ష్మ గోత్రములను పలుమార్లు పరిశుద్ధములుగా చేయబడుటచే బాగుగా శోభించుచున్న అంగములను, కతబీజములచే కలచిన తటాకతోయములచే విశోధితములుగా చేయబడిన వాటిచే కరకములను నిం పెను. క్రొత్తనదీ సైకత వేదికను శుద్ధమైన సూక్ష్మాంబురములచే కప్పి, తోయపూర్ణములైన ఘటములను ప్రతిష్టించి నాలకజాతిని అస్తపుటకమును వ్రాసి, కీలకంకారికాచూర్ణమును పూసి చందన చంద్ర రశ్మి విశదమైన మాలను పుటాంతముగా నుంచవలయును. యామభాగమున కూడా నీటితో వస్త్రముచే శోధించి, కుంభమును. ప్రతిష్టించి, చంద్రగ్రంథిని క్రిందిభాగమున ఉంచి, పాటలవకుళమునుంచి, శేఫాలీస్తబకమునుంచి, నీటిని పోసి, మొదట జలమును శుద్ధిపరిచి, మృదుతరము సూక్ష్మవస్త్రమును ఆవేష్టనము చేసి, ఆతపములేని ప్రదేశమున కరకములనుంచి, మంచి మారుతముగల సూక్ష్మవ్యజనముచే వీచబడిన దానిని సువాసనగల శీతజలములను చల్లవలయును. మనో నిగ్రహము గలవారు సుసంస్కృతులగు నరులు, నారీజనము, రాజులు, వారి కన్యలు కాని, క్జాలితాంగులు, దౌతపాదులై మంచి వస్త్రములను ధరించి, బాహమూలమునందు కంటమునందు సువాసన చందనాగురువులను పూసుకాని, మస్త కమున జపాపుష్పమును ధరించి, పంచగంధ విలేపనముగావించి, కేశములందు పుష్పబంధములను దాల్చి నిర్మలులై కుంకుమాది ద్రవ్యములను దాల్చినవారై పూజించబడిన నరులు, సౌందర్యవతులగు యువతులు భూషణములచే భూషితులైన స్త్రీలచేకాని పురుషులచేకాని నీటినిపించవలయును. వీరు కూడా జలప్రధాన సమయమున సూక్ష్మవస్త్రపరివేష్టితులై వామకరమున కరకమునుంచి అచట దోరికాన్యస్తమును వదిలి నీటినీయవలయును. గౌతముడిట్లు అంతటిని చేయించేను. మహాత్ములగు మ హేశాదులు భుజించి హస్తపాదప్రక్షాలనము చేసుకాని, గందొదులు లేపనము గావించుకాని దేవేశ్వరుడగు మహేశ్వరుడు ఉచాసీనుడు కోగా నీచాసనమున మిగిలిన వారు ఆసీనులైరి. మణిఖచితపాత్రలందు కోణములు లేనివి, గుండ్రనివి, స్టూలములు, సూక్ష్మములు కానివి, కృశములు కానివీ, సూధూపితములగు పూగఖండములనుంచి, శ్వేత పత్రములను శుద్దిపరిచి కర్పూర ఖండములనుంచి చూర్ణమునుంచి శంకరునికీ గౌతముడు పెంచి ఓ దేవా తాంబూలముమ స్వీకరించుమని గౌతముడు పలుకుచుండగా శంకరుడు ఓ కపీశ్వరో ఈ తాంబూలమును నీవు స్వీకరించి నొకు. పూగఖండములనిమ్ము అని పలికెను. ఓ మ హేశ్వరా నాకు పరిశుద్ది లేదు. బహు విధములగు ఫలములను భుజించు వొనరులకు పరిశుద్ధి ఎక్కడిది. అని పలి కెను. ఆ మాటను వినిన శంకరుడు కపీశ్వరునితో ఇట్లు పలికెను. నామాట వలన అంతయు శుద్ధి పొందును. నామాటవలన అమృతము కూడా విషమగును. నామాట వలననే వేదములు దేవతాదులు, నామాటవలననే ధర్మ జ్ఞానము కలుగును. నామాట వలననే మోక్షము లభించును. పురాణములు, ఆగమములు స్మృతులు కూడా నామాటవలననే ఏర్పడును. కావున తాంబూలమును గ్రహించుము. పూగఖండములనిమ్ము. అని పలికెను. అంతట కపీన్దుడు వామకరముచే తాంబూలమును గ్రహించేను. పత్రములను సంగ్రహించి శంకరునికి పూగఖండములనిచ్చేను. మొదట ఇచ్చిన కర్పూరమును శంకరుడు భక్షించెను. ఇట్లు శంకరుడు తాంబూలభక్షణము చేయగనే మందరాచలమునుండి పార్వతీదేవి జయవిజయల హస్తములను పట్టుకాని గౌతముని గృహమునకాచ్చి దేవపాదములకు నమస్కరించి ముఖము వంచి నిలబడెను. అంతట శంకరుడు పార్వతీదేవి ముఖమును పైకెత్తి ఇట్లు పలికెను. నీ విషయమున నేను అపరాధమును చేసితిని. నిన్ను విడిచి భోజనము చేసితిని. అట్లే నిన్ను స్వమందిరమున విడిచి నేను గొప్పతప్పును చేసితిని. నన్ను క్షమించి కోపమును విడిచి చూడుము. ఇట్లు పలికిననూ పార్వతి మాటలాడక అరుంధతితో కలిసి బయలు వెడలేను.. అట్లు పార్వతి వెడలుట చూచీ గౌతమ మహర్షి దండవత్సణామమునాచరించెను. అపుడు పార్వతి గౌతముని గూర్చి నీవేమి కోరుచుంటివని అడిగెను. అపుడు చిరునవ్వుతో నున్న పార్వతి గౌతమ మహర్షి, నీవు నొఇంటిలో భుజించినచో కృతకృత్యుడనౌదును అని పలికెను. అపుడు అంజలి బద్దుడగు , గౌతముని చూచి శంకరుడు అనుమతించినచో భుజించేదనని పలి కెను. అంతట గౌతముడు శివుని నుండి అనుమతి పొంది త్వరగా వచ్చెను. పార్వతిని అరుంధతిని భోజనము చేయించెను. అట్లు భుజించిన పార్వతి సర్వగంధ పుష్పాలంకృతయై సహస్ర అనుచర కన్యలచే శివుని చేరెను. అంతట శంకరుడు ఓ దేవా నీవు గౌతమ మందిరమునకు వెళ్ళుము. నేను సంధ్యోపాసన గావించి నీ వద్దకు వచ్చెదను అని పలికెను. ఆ మాటతో పార్వతీదేవి గౌతమ మందిరమునకు వెళ్ళెను. సంధ్యావందనము చేయగోరి అందరూ బయలుదేరిరి. మహేశాదులు తటాకమునందు సంధ్యవార్చిరి. శంకరుడు ఉత్తరముఖుడై న్యాసమును గావించి జపించెను. అంతట మహాతేజస్వియగు విష్ణువు మహేశునిట్లు పలి కెను. అందరిచే నమస్కరించబడు నీవు, అందరిచే పూజించబడు నీవు, యజ్ఞములు ఎవరి నీకారకు చేయబడునో అట్టి నీవు, దేనిని జపించు చుంటివి? చేతులు జోడించి అందరూ నిన్నే ఉపాసించేదరు. అట్టి దేవదేవేశుడవగు నీవు ఎవరికి చేతులు జోడించు చుంటివి? నమస్కారాది పుణ్యములకు ఫలమునిచ్చునది నీవు. నీకు ఫలమునిచ్చు వాడెవడు? నీకు నమస్కరించదగిన వాడెవడు ? నీకంటే అధికుడెవరు ? నాకు చెప్పుము. ఆమాటలను వినిన శంకరుడు విష్ణువుతో నిట్లు పలికెను.
ఓ గోవిందా ! నేనెవరినీ ధ్యానించుటలేదు. ఎవరికీ నమస్కరించుట లేదు. కాని నాస్తికుల ప్రవృత్తి కాఱకు ఇట్లాచరించి చూపవలయును లేనిచో లోకులు పాపాచారులగుదురు. కావున లోకోపకారము కాఱకునే నిట్లాచరించుచున్నాను. అంత విష్ణువు అట్లే అని నమస్కరించి నిలిచెను.. అంత వారు దేవర్షులు గౌతమ గృహమును చేరిరి. వారందరు దేవ దేవుడగు శంకరునికి పూజలు జరిపిరి. శివుడు హనుమంతునితో కలిసి గానము చేయుచుండెను. వారందరూ పంచ్ మంత్రమును జపించిరి. హనుమంతుని హస్తమును పట్టుకాని శివుడు దేవతలతో కలిసి యుండెను. అంత శివపార్వతులు ఏకశయ్యాసమాసీనులైరి. హనుమంతుడు తుంబురు ప్రముఖులు గానము చేయుచుండిరి. పరమేశ్వరుడు నానావిధివిలాసములను చేయుచుండెను. పార్వతిని పిలిచి ఇట్లు పలికెను. ఓ శుభురాలా ! నీకు కాప్పుముడిచెదను. నా ముందుకు రమ్ము. అంత పార్వతి స్త్రీని పతి సేవించుట యుక్తముకాదు. కేశ ప్రసాధనముతో పాటు అర్థాంతరము కూడా సంభవించును. కేశప్రసాధనముననే ఈప్పితమంతయూ నేరవేరదు. కేశబంధము తరువాత భుజప్రాంతమున ప్రమార్జనమును చేయవలయును. తరువాత కేశమును చివర తగిలియున్న పుష్పాదీమార్జనము. ఇట్లు జరుగుచుండగా మహానుభావులు వచ్చినచో దేవవందితుడవగు నీవు ఏమి సమాధానమును చెప్పెదవు ? ఎవ్వరూ రానిచో భయము తొలగిపోవును. అని పలికెను ఇట్లు మాటలాడుచున్న పార్వతిని శంకరుడు చేతితో లాగి తన ఊరువుల మీద కూర్చోబెట్టుకాని కచబంధమును విప్పి, చేతులతో చక్కగా విడమరచి, గోళ్ళతో చిక్కు తీసి, విష్ణువిచ్చిన పారిజాతమాలను కేశములలో ముడిచెను. అట్లు ముడిచి కాప్పు వేసెను. చేతిలో నున్న మల్లెలమాలను కాప్పున కట్టెను. బ్రహ్మ ఇచ్చిన కల్ప పుష్పమాలను సుగంధభరితమగు పార్వతీవస్త్రమున కట్టెను. అట్లు చేయుచున్నపుడు అంటుకున్నది, అంటియున్న పుష్పమార్జనమును గావించెను. అంత నడుముభాగమున వస్త్ర వేష్టనము లోపల జారుచున్న నీవీ బంధమును చూచి ఇది యేమిటని నీవీ బంధమును గావించెను. తరువాత ఇది నీకు నాసా భూషణము. నిజము చెప్పుచున్నాను అనెను. అంత పార్వతి చిరునవ్వుతో శంకరునితో ఇట్లుపలికెను. ఓ శంభూ? నీ మందిరమున సర్వవస్తువులు సమృద్ధిగా కలవు. నేను మొదటనే ఈ విషయమును తెలిసియుంటిని. సర్వద్రవ్య సంపత్తి భూషణములచే తెలియబడును. స్వామి మీ శిరస్సు బ్రహ్మ శిరోమాలచే అలంకరించబడుచున్నది. నరకపాలమాలచే వక్షస్థలము విభూషణమైనది. విషయుక్తములైన శేషవాసుకులు నీకు కంకణములు. నీ వస్త్రములు దిక్కులు. జటలు కేశములు. భస్మము అంగరాగము. మహావృషభము వాహనము. గోత్రము కులము తెలియదు. తలిదండ్రులు తెలియదు. నీ శరీరము విరూపాక్షము. ఇట్లు పార్వతీ పలుకుచుండగా విష్ణువు చాలా కోపముతో ఇట్లు పలికెను. ఓ దేవా ! దేవదేవుడు జగత్పతియగు శివుని ఏల నిందించుచున్నావు ? నీ నియమాభావముచే ప్రాణములు ప్రియములు కావనిపించుచున్నది. ఈశ్వరుని నింద జరిగినచో మరణించుట మా వ్రతము. ఇట్లు పలికి శ్రీహరి నఖములచే తన శిరస్సును ఛేదించుకానుటకు ఉద్యుక్తుడాయెను. అంతట శంకరుడు విష్ణువు హస్తమును పట్టుకాని సాహసము చేయకుము. పార్వతీ వచనములన్నియూ నాకు ప్రియములే. అప్రియములు కావు. ఇపుడు నీవే నాకు అప్రియమును చేయ ప్రయత్నించుచున్నావు అని పలి కెను. అంతట శ్రీహరి అట్లే అని ఊరకుండెను. అంతట హనుమంతుడు శంకరునితో ఇట్లు విజ్ఞాపన చేసేను. స్వామి నిష్కామమగు నీ పూజా వ్రతమును చేయుటకు అర్థించుచున్నాను. పూజ చేయుటకు వెళ్ళవలయును. నాకు అనుజ్ఞ నిమ్ము. ఆ మాట నినిన శంకరుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను. నీవు ఎవరిని పూజించెదవు. ఎచట పూజించేదవు. ? ఏ పుష్పము? ఏ దళమో చెప్పుము. గురువెవ్వరు ? మంత్రమేది ? ఎట్లు పూజింతువు ? ఇట్లు శంకరుడు పలుకగా నీతియుతుడగు హనుమంతుడు శరీరమంతయూ వణకుచుండగా స్తోత్రము చేయ నారంభించెను. మహాదేవుడు అమితాత్ముడగు శంకరునికి నమస్కారము. యోగికి యోగధాతకు యోగి గురువునకు నమస్కారము. యోగగమ్యుడగు దేవునికి, జ్ఞాని పలికి నమస్కారము. వేదసతికి దేవపతికి నమస్కారము. ధ్యానమునకు, ధ్యానగమ్యునకు, ధ్యాతగురువునకు నమస్కారము. అష్టమూర్తికి పశుపతికి నమస్కారము. అంజకునికి, త్రినేత్రునకు, సోమసూర్యాగ్ని నేత్రునకు నమస్కారము. సుభృంగరాజ ధత్తూర ద్రోణప్రియునకు, బృహతీ పూగ పున్నాగ చంపక ప్రియునకు, నమస్కారము. నమస్కారము మరల మరల నమస్కారము. ఇట్లు స్తోత్రము చేయగా శివుడు కపీంద్రునితో భయపడకుము. నాకంతయూ చెప్పుము. అని పలికెను. అంతట వాక్యకోవిదుడగు హనుమంతుడు భయమును విడిచి ఇట్లు పలికెను. భస్మోద్ధూలితదేహీ శివలింగార్చనమును పగలు సంపాదించిన జలముచే, పుష్పాదులచే చేయవలయును. ఓ దేవా ? శుభప్రదమగు శివపూజావిధిని విజ్ఞాపన చేతును. సాయంకాలమున అశిరస్నానము నాచరించవలయును. చక్కగా శుద్ధిచేయబడిన, ఆరిన వస్త్రమును ధరించి, మూడు మార్లు ఏకాగ్రచిత్తముతో ఆచమనము గావించి, భస్మమును తీసుకాని ఆగ్నేయ స్నానము నోచరించవలయును. ప్రణవముతో అష్టవారము మంత్రించి కాని, పంచాక్షరమంత్రముతో కాని, ఏదో ఒక నామముతో ఏడుమార్లు మంత్రించిన భస్మమును దర్భపాణియై “ఈశానః సర్వవిద్యానాం” అని శిరమున వేసుకానవలయును. “సద్యోజాతం ప్రపద్యామీ” అను మంత్రముచే పాదముల పై చల్లుకానవలయును. ప్రణవముచే సమస్తాంగముల పై చల్లుకానవలయును. ఇది తైవర్లి కులకు స్నానవిధి చేప్పబడినది. గురువు చెప్పిన శూద్రస్నానవిధిని చేప్పెదను. శివ అను పదమును పలికి భస్మమును మంత్రించవలయును. ఏడుమార్లు శివనామముతో మంత్రించి శిరస్సున చల్లుకానవలయును. ‘శంకరాయ’ అని ముఖమున, ‘సర్వజ్ఞాయ’ అని హృదయమున, స్థాణవే నమః అని ముఖమున, “స్వయంభువే” అని పాదముల పై చల్లి, శుద్ధమగు భస్మమును తీసుకాని నమశ్శివాయ అని సర్వాంగములందు చల్లుకానవలయును. హస్త ప్రక్షాలనము గావించుకాని, ఆచమనము చేసి దర్భపాణియై సావధానముగా నుండవలయును. దర్పలేనిచో సువర్ణము, సువర్ణము లేనిచో గవోలుకలు, అవి లేనిచో దూర్వలు, అవి కూడా లేనిచో రజతమును ధరిచవలయును. సంధ్యోపాసనను, దేవీ జపమును చేసి దేవ గృహమునకు వెళ్ళవలయును. లేదా దేవవేదికను కాని, కల్పించిన స్థండిలమును కాని చేరవలయును. కల్పించబడిన మృణ్మయరచితమైనది పరిశుద్ధమైనది నాలుగు వర్ణములతో రంగములతో కూడినది పద్మా దిరచనా యుతము లేదా ఒక శ్వేతముతో కూడియున్నది, అట్లే విచిత్రములైన పద్మములు, స్వస్తికాదులు, ఉత్పలాదులు గదా శంఖత్రిశూల డమరులు, శరోక్త పంచ ప్రాసాదములు కలదిగా నేర్పరిచి, అచట శివలింగము నుంచి, సర్వకామఫలవృక్షము కులకము కోలకము, షట్కోణము, త్రికోణము లేదా నవకోణము, ద్వాదశ కోణమునందు ఆందోళపాదుకావ్యజనములు చామర చత్రయుగలము, విష్ణుబ్రహ్మదులు వీటినన్నిటిని చూర్ణాదులచే వేదికయందు రచించవలయును. లేదా దేవాలయమునందు కాని చేయవలయును. దేవపూజ చేయు ప్రదేశమున ఇట్లు కల్పించవలయును. స్వహస్తిరచితమైనది ఉత్తమము. క్రీతము మధ్యమము. యాచితము కనిష్టము. బలాత్కార లభ్యము అధమము. అర్ణములలో ఆనర్ణములలో బలాత్కారలభ్యము నిష్పలమగును. రక్తశాలి జపాశాణకలమఅసితరక్తకములచే ప్రీమాత్రేళ్లతండులములచే కణములచే యథాక్రమముగా ఉత్తమ మధ్యమ కనిష్టములచే పద్మాదిస్థాపనములచే చక్కగా యాగము నాచరించవలయును. ప్రాగుత్తరముఖముగాకాని ప్రాజ్ముఖముగా కాని కూర్చొనవలయును. ఇక ఇపుడు చూచినట్లు వినినట్లు ఆసనవిధిని కూడా చెప్పెదను.
కుశలతో ఏర్పరిచినది, చర్మముతో ఏర్పరిచినది. దొరువుతో ఏర్పరిచినది. తాటాకులతో చేయబడినది. కంబలముచే ఏర్పరిచినది. కొంచనముచే ఏర్పరిచినది. రాజతము, తామ్రము. గోకరీషార్కజములచే ఆసనములను కల్పించవలయును. పద్మాసనమును కాని స్వస్తికాసనమును కాని ఏర్పరచుకానవలయును. దర్భలయందుకాని, భస్మమునందుకాని సమాసీనుడై వాక్కును నియమించి ప్రాణాయామమును గావించి, దేవతారూపుడై అంతర్ధ్యానము గావించవలయును. ద్వాదశాంగుల పరిమితమగు. శిఖాంచమున నున్న మంగళప్రదమగు సూక్ష్మతనువుగా నున్న, భూతములలో అంతర్భాగమున గుహాయందు చరించుచున్న విశ్వతోముఖుడు, సర్వాభరణ సంయుక్తుడు, అణిమాదిగుణాన్వితుడుగు మ హేశ్వరుని ధ్యానించి, అతనినే చిత్తమున ధరించవలయును. అతని కొంతిచే శరీరమును నింపవలయును. ఆ కాంతిచే శరీరమున నున్న పాపమును నశింపచేయవలయును. స్వర్ణపాద సంపర్కము లేనందువలన రక్తము కాని శ్వేతముగా కాని ఉంటున్నటుల ద్వాదశ దలావృత్తము అష్టకాని పంచకాని మూడుకాని దళములున్న శుద్ధమగు ఆసనమును కల్పించి అచట లింగమునుంచి గుహలోనున్న లింగేశ్వరుని చింతించవలయును. పరిశుద్ధము చేయబడిన కలశమునందు గంధవాసితము శోధితము అగు జలమును గంధపుష్ప సహితముగా నుంచి, ప్రణవముచే అభిమంత్రించవలయును. శూద్రుల విషయమున ప్రాణాయామము, ప్రణవముచే అభిమంత్రించవలయును. శూద్రుల విషయమున ప్రాణాయామము, ప్రణవము విధించబడలేదు. ప్రాణాయామ స్థానమున ఓంకారాభి మంత్రితమగు శివనామముండును. గంధపూష్పాక్షతాదికముగు పూజాద్రవ్యములను సమీపమున నుంచి సంకల్పమునాచరించవలయును. శివుని సంతోషము కాఱకు శివుని పూజకు చేసెదను. ఇట్లు సంకల్పముగావించిన తరువాత ఆవాహనాదికమును గావించి స్నానమును కల్పించవలయును. ‘నమస్తే’ ఇత్యాది మంత్రముచే శతరుద్ర విధానముగా అవిచ్చిన్నధారను ముక్తిధారయందురు. జపించుచు ముక్తిధారచే రుద్రముఖులను ఒకనేల స్నానము చేయించినచో ఆ స్నానము కూడా ఒకమారు కానీ మూడు అయిదు ఏడు తొమ్మిది పదకొండుమార్లు పదకొండు మార్లు పదకొండు విధములుగా చేసినచో దీనిని ముక్తి స్నానమందురు. ఇట్లు ఒక మాసము చేసినచో మోక్షమును ప్రసాదించును. శైవవిద్యచే కాని, కేవలప్రణవముచే కాని, మృణ్మయములచే కాని నారి కేలశకలములచే కాని, జలధారలచే కాని, కాంస్యములచే కాని, ముత్తేపుచిప్పలచే కాని, పుష్పాది కేసరములచే యథాశక్తి దేవదేవేశుని స్నానము చేయించవలయును. ఇక ఇపుడు స్నానయోగ్యమగు శృంగవీధిని చెప్పెదను. మొదట అంతర్భాగమును సంశోధించి, బహిరంతరము శోధించవలయును. సుస్నిగముగా లఘువుగా చేసి అంగఛేదన గావించకూడదు. నీచైకదేశవిన్యస్త ద్వాదశ ద్రోణిచే సహృత్తుగా అగ్నిహోత్రయుక్తముగా స్నానమును మహాదేవునికి కల్పించవలయును. ఇట్ల గవయశృంగమునకు జలపూర్తిని ఇపుడు చెప్పెదను. నిషిద్ధలోహార్ధసంధిద్వారసమన్వితమగు ద్వారమున యోగవక్రమును, నాగ దండమగు నాగాకారముగా కల్పించవలయును. ఫలస్థానమున దండముతో సమరంధ్రకమగు చషకమునుంచి అచటనే మూర్ధ యంత్రఘటమున నున్న జలము నుంచవలయును. మరియొక దానిచే కాని వామకరముచే కాని నుంచవలయును. ఇట్లు దానిచే చేయబడిన ముక్తిధార పరమపవిత్రము పాపనాశకము. ఇట్లు పంచగవ్యములచే పంచామృతముచే మధురత్రితయముచే కాని స్నానము గావించి భూషణములచే చక్కగా నలంకరించి, మరల స్నానము చేయించి శీతలోపచారమును గావించి, ఆచమనాదికమును వస్త్రమును, ఉపవీతమును గంధద్రవ్యమును, కర్సూరుమును, అగరును, పాటీరమును కాని, ఉభయమిశ్రితముగా కాని శివలింగమును పూజించవలయును. సమస్త పీఠమును కాని, లేదా విభవాను సారముగా కాని గంధపూర్ణమును గావించి, కాలీయ పుష్పమును, శ్రీపత్రమరుచిత్యాజ్యమును యథాశక్తిగా సమస్తమును అనేక ద్రవ్యధూపమును, కేవల గుగ్గులమును, సర్వధూపము కపిలాఘృతసంయుక్తమైనచో పరమోత్తమముగా పేరుకానబడినది. యథాశక్తిగా ధూపమును సమర్పించి, కపిలాఘృతములచే దీపములను కాని, పూజామాత్రముచే దీపములనుంచి, ఉపహరమునిచ్చి ఉపపన్నమగు నైవేద్యమును పుష్పసమన్వితముగా కల్పించి, ముఖశుద్దిని గావించి, ఆదరముగా తాంబూలము నిచ్చి ప్రదక్షిణనమస్కారములు గావించినచో పూజ పరిసమాప్తమగును.
ఇక ఇపుడు గీత్యంగపంచకమును విజ్ఞాపన చేసెదను. గీతము, వాద్యము, పురాణము, హాసోక్రీనృత్యము అనునవి అయిదు గీత్యంగపంచకము. నీరాజనము, పుష్పాంజలి, అఖిలార్పణము, క్షమాపణము, ఉద్వాసనము అనునవి అయిదు ఉపచారములు. భూషణము, ఛత్రము, చామరవ్యజనములు, ఉపవీతము, కైంకర్యము, షోడశోపచారములను చేయవలయును. ముప్పదీ రెండు ఉపచారములుచే శివుని ఆరాధించినచో ఒకే దినమున సమస్త పాపములు నశించును. ఇట్లు చెప్పిన హనుమంతుని మాటలను విని శంకరుడు ఇట్లు పలికెను. నీవు చెప్పిన నా పూజా విధానమంతయూ సత్యమే. కాని ఇపుడు నేను నీకు సారభూతమగు దానిని ఉపదేశించెదను. లింగమున నీవు చెప్పిన విస్తృతమగు శివారాధనా ఫలమును నా పాదయుగమునర్సించినచో పొందగలవు. అపుడు కపి శేషుడు దేవదేవుడగు ఉమాపతిని గూర్చి ఇటు పలికెను. నా గురువు నాకు లింగపూజానియమము నేర్పరిచెను. కావున మొదట లింగపూజను గావించి తరువాత నీ పాదపూజను గావింతును. ఇట్లు పలికి ఈశ్వరుని నమస్కారించి శివలింగార్చన కారకు సరసీరమున కాచ్చి సైకత వేదికను కల్పించి తాలపత్రరచితమగు నాసనమునేర్పరచుకాని హస్తపాద ప్రక్షాలనము గావించి ఆచమనము చేసి సావధానుడై, భస్మస్నానమును గావించి, మరల ఆచమనము చేసి, వాక్కును నియమించి, దేవవేదియందు మనోహరమగు పద్మమును చేసెను. తరువాత తొలపత్రమున పద్మాసనగతుడై, ప్రాణాయామమును గావించి, న్యాసమును చేసి శుక్ల ధ్యానసమన్వితుడై గురువును ఈశ్వరుని నమస్కరించి జపించుచుండెను. అంతట కపీనుడు దేవార్చన గావించుటకు ప్రయత్నించెను. మోదుగాకుచే ఏర్పరిచిన రెండు దొప్పలచే తేబడిన పరిశుద్ధజలమును కమండలమున శిరము నుంచి అగ్నిని మంత్రితముగా ఆవాహనాదికము స్నానపర్యంతము గావించి స్నానము చేయించుటకు చేతులలోనికి శివలింగమును తీసుకోని చూడగా దేవపీఠము కనిపించడాయెను. చేతులలో కేవలము శివలింగమును చూచి నేనేమి మహాపాతకమును చేసితిని ? ఇట్లు పీఠరహితమగు శివలింగము నాచేతిలో నున్నది. పీఠము రానిచో ఈ దినము నా మరణము తప్పదు. కావున రుద్రుని జపించెను. అపుడు మహేశ్వరుడు వచ్చును. అని నిశ్చయించి మనస్సుచే శతరుద్రీయమును జపించెను. అయిననూ మహేశ్వరుడు రాకపోగా కపీశ్వరుడు రుద్రుని భూమి పై పడవేసెను. అంతట వీరభద్రుడొచ్చెను. ఓ శుభప్రదుడా ? ఎందుకు రోదించుచుంటివి ? రోదన కారణమును చెప్పుము. అని అడిగెను. అంతట కపీనుడు వీరభద్రునితో తన మనసులోని మాటను పీఠహీనముగు శివలింగమున్నది. నా పాపసంచయమును చూడుము అని పలికెను. అంతట వీరభద్రుడు ఆమాటను విని పీఠము రానిచో శివలింగమున సాహసమును చేయకుము. నాకు శివలింగమును చూపుము. పీఠము వచ్చినదో లేదా ? అని అడిగేను. అయననూ లింగము రాకుండుటను చూచి ప్రతాపవంతుడగు వీరభద్రుడు అగ్నిని భూమి పై పడవే సెను. అదే క్షణములో భూమి దగ్గమాయెను. అయదు ఊర్ధ్వలోకములను దహించెను. లలాటనేత్రసంభూతమగు అగ్నిని నఖముతో తీసుకాని చేతిలో నుంచుకాని తపోలోకమును సత్యలోకమును దహించుటకు. సిద్దపడెను. అంతట తపోలోకనివాసులగు మునిజనులు దహించ సంకల్పించిన వీరభద్రుని చూచి గౌతమాశ్రమమునకు వచ్చిరి. అచట శంకరుని చూడక తనలో నున్న శంకరుని భక్తితో వేదసముద్భూతములగు స్తోత్రములచే స్తుతించిరి. వేదవేద్యుడదు దేవునకు, శుద్దప్రభాచిన్యరూపునకు, బ్రహ్మాద్యధీశునకు సృష్ట్యాదికర్తకు, విష్ణుప్రియునకు, ఆర్తిహంతకు అంతకర్తకు నమస్కారము. అఖిలాధీశ్వరునకు, ఆంబరస్వరూపునకు, చరస్థావరవ్యాపకునకు, వేదగుహ్యునకు, భక్తి ప్రియునకు, పాకభోక్తకు, మఖేశునకు నమస్కారము. శివునకు, ఆదిదేవునకు, వ్యాలయజ్ఞోపవీతధారికి, సురాబిన్దువద్దాపనునకు, త్రయీమూర్తికి కాలకాలునకు నమస్కారము. ధరిత్రీమరుత్ వ్యోమత్యఇందు వహ్నిప్రభా మండలాత్మునకు అష్టమూర్తిధారికి, శివునకు ఆశివనాశికి, వీరునకు నమస్కారము. జగనాధులచే పూజించబడువాడు మాయెడ ఎల్లపుడు ప్రసన్నుడగు గావుత. కాలనాధపౌలునకు నమస్కారము. ఆత్మ స్వరూపుడు, మహాత్ముడు, మనోరూపుడు, అగ్రగణ్యుడు, వేదములచే నిరూపింప శక్యము కాని వాడు, జగజ్జాడ్యమును ధ్వంసము చేయువాడు, భుక్తి ముక్తి ప్రదుడు, శుద్ద కీర్తి ఎల్లప్పుడూ ప్రసన్నుడుగా ఉండనిమ్ము. ఈ ప్రపంచమును సృష్టించిన వాడు, రక్షించువాడు, నశింపచేయువాడు, వాగ్విదూరుడు, కాలత్రయస్వరూపుడు మాకు ప్రసననుడు కావలయును. స్వానుమానము కలవాడు, సర్వస్వరూపుడు మా విభూతి కాఱకు ఎల్లపుడు మాకు ప్రసన్నుడగు గావు. మాకృత్యమును విజ్ఞాపనమును విన్నవించెదము. భగనేత్రప్రదుడగు శివుడు మునులు చేసిన స్తోత్రమును విని, ఈమునులను నా వద్దకు తీసుకాని రమ్మని విష్ణువునకు చెప్పెను. అంతట విష్ణువు తపోలోకవాసులను సమీపించి ఓదార్చి వారిని శివుని వద్దకు తీసుకాని వచ్చెను.
వారిని చూచిన శంకరుడిట్లు పలికెను. ఓ పాపరహితులైన మునులారా ? మీరు తపోలోకము నుండి భూలోకమున కేల వచ్చితీరి ? ఆ మాటలను వినిన మునులు ఇట్లు పలికిరి. ఓ దేవా ! పన్నెండు లోకములు బూడిదకుప్పలుగా కనపడుచున్నవి. ఈ వనమొక్కటి మిగిలినది. ఆ లోకసంక్షయమును చూడుము. వారి మాటలను వినిన శంకరుడు జితేంద్రియులగు మునులను గూర్చి. ఇట్లు పలికెను. భూలోకము పాతాలలోకములు దగ్గమగుటలో సందేహము లేదు. ఊర్ధ్వపంచలోకముల దాహము విషయములోనే సందేహము కలదు. ఊర్ధ్వలోకముల పై అంగార వృష్టి ఎట్లు సంభవించినది? ఈ మహాధని ఎట్లు వచ్చినది ? ఈ శంకరుని ప్రశ్నను వినిన మునులు బద్దాంజలులై శంకరునితో ఇట్లనిరి. ఇపుడు మాకు వీరభద్రుని వలన భయమేర్పడినది. అతనే అంగారవృష్టి నేర్పరచెను. అంతట శంకరుడు వీరభద్రుని పిలిచి ఏమిటిది ? అని అడిగెను. అంతట వీరభద్రుడు కపి శేషుని శివలింగమున పీఠము లేనందువలన ఇట్లు చేసితినని పలికెను. ఆ మాటను విన్న శంకరుడు భయవిహ్వలులగు మునులను చూచి ఇట్లు పలికెను. కపిశ్రేష్ఠుని మనసును తెలియగోరి నేనిట్లు చేసితిని. మీరు భయపడకుడు. మీకు క్షేమమును నేను కూర్చేదను. ఇట్లు పలికి కృపానిధియైన దేవదేవుడు దగ్గములైన లోకములను యథాపూర్వముగా మొదట కంటే శోభాయుతములుగా చేసెను. అపుడు వీరభద్రునితో ఇట్లు పలికెను. ఓ వత్సా! బాగు ! నీవు భక్తులకు భద్రమును కల్పించుచున్నావు. కావున నీకు శాశ్వతమైన కీర్తి లోకమున వ్యాపించగలదు. ఇట్లు పలికి ఆలింగనము చేసుకాని శిరస్సును మూర్కొని ప్రీతితో వీరభద్రునకు - తాంబూలము నిచ్చెను. అంతట హనుమంతుడు శివలింగపూజను యథావిధిగా పూర్తి చేసెను. పూజ ముగిసిన వెంటనే సంతోషము నిండిన మనసుతో నున్న హనుమంతుడు అచట ఒక వనచర రూపములో నున్న గంధర్వుని వీణతో నున్నవానిని చూచెను. అతనితో కపి శేషుడు వీణను నొకిమ్మని యడుగెను. గంధర్వుడు కూడా ఈ వీణ. నాకు చాలా ప్రియమైనది. కావున వీడలేననేను. నాకు కూడా చాలా ఇష్టమైనదీ వీణ అని హనుమంతుడనేను. అయిననూ గంధర్వుడీయనందున హనుమంతుడు ముష్టి ప్రహారముతో గంధర్వుని నేల పై పడవేసెను. అంతట స్వరతంతు సమన్వితమైన వీణను తీసుకాని మీటుచు శివుని వద్దకు వెళ్ళేను. అంతట గానముచే జగదీశ్వరుని ప్రసన్నము చేసుకాని శుద్ధమగు బృహతీపుష్పములతో శివపాదములను పూజించేను. అంతట ప్రసన్నుడైన శివుడు మునులు, దేవతలు, దైత్యుల, రాజుల సమీపమున హనుమంతునికి కల్పాంతజీవనమును, సముద్రలంఘనశక్తిని, సకల శాస్త్ర జ్ఞానమును, ఉన్నత బలమును వరముగా నిచ్చెను. ఇట్లు మ హేశ్వరునిచే వరమును పొంది నా కనుల ముందే మహాసంతోషమును పొందెను. సమస్తాభరణభూషితాంగుడై " తన కాంతిచే దేవకాంతిని క్రిందుగా చేసి, ప్రసన్నమూర్తి, తరుణుడు, శివాంశ సంభూతుడు దేవతల నందరిని సంభావించెను. అంతట నా సేవలో ఆజ్ఞాపించబడినవాడై యుండెను. నేను కూడా ఇతనిని శంకరునిగానే తలతును. ఇంకనూ ఏమని చెప్పవలయును. బుద్ధిలో, న్యాయములో, ధైర్యములో హనుమంతునితో సమానుడు మరియొకడు లేడు. ఇట్లు వినువారలకు చదువువారలను పాపములను నశింపచేయు హనుమచ్చరితమును నీకు చెప్పితిని. కావున నీ కనుకూలమైన ప్రదేశమునకు వెళ్ళుము. అట్లు రామభద్రుని వాక్యమును విని నమస్కరించి ఆటనుండి వచ్చితిని. ఇట్లు నీకు సుఖమును మోక్షమునిచ్చు హనుమంతుని చరితమును చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు ?
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున హనుమచ్చరిత్రమను డెబ్బది తొమ్మిద - అధ్యాయము ముగిసినది.
