నారద మహా పురాణము - పూర్వార్థము
45 - బృహదుపాఖ్యానమ్
సూత మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తములారా! సనందనమహర్షి చెప్పిన మోక్షధర్మా క్రితమగు అధ్యాత్మ సత్కథను వినిన తత్త్వజ్ఞుడగు నారదుడు మరలనిట్లు పలికెను.
నారద మహర్షి పలికెను :- ఓ మహానుభావా !నీవు చెప్పిన మోక్షశాస్త్రమును చక్కగా వింటిని కాని ఎన్ని మార్లు వినిననూ నాకు తృప్తి కలుగుట లేదు. ఓ సర్వజ్ఞుడా ! అవిద్యాబంధమునుండి జీవుడు విముక్తుడగు మోక్షధర్మమును ఇంకనూ తెలుపుము.
సనందన మహర్షి పలికెను :- ఈ విషయమున మీథిలాధిపతియగు జనకుడు మోక్షమును పొందిన పురాతనమగు ఇతిహాసమును ఉదాహరించేదరు. మీథిలాధిపతియగు జనకుడు పారలౌకికధర్మములను చింతించుచుండెడివాడు. ఆ జనకుని ఇంటిలో ఎల్లపుడూ చాలామంది ఆచార్యులు నివసించుచుండెడివారు. పాషండ ధర్మములను వాదించువారు పృధగ్గర్మములను బోధించువారు పలు విధములుగా నుండెడివారు. ఆ జనకమహారాజు పరలోకస్థితియందు, పరలోక గమనమునందు జాత్యాది నిశ్చయము నందు విశ్వాసము కలవాడు జ్ఞాని కావున వారి వాదములను విని సంతోషించుచుండెడివాడు. కపిల మహర్షి వంశీయుడు పంచశిఖుడను మహర్షి భూమండలమునంతయూ తిరుగుచూ మిధిలా నగరమునకు వెళ్ళెను. సర్వసన్యాస ధర్మములను తెలిసిన వాడు తత్త్వజ్ఞాననిశ్చయమునందు అర్థ పరిష్కారము చేయగలవాడు ద్వంద్వ భావమునధిగమించినవాడు సంశయరహితుడు ఋషులలో ముఖ్యుడు, తన సంకల్పముచే మానవులందు అవతరించినవాడు నగు కపిలేయుడు బహుదుర్లభమగు శాశ్వేతానందమును అన్వేషించుచున్నవాడు సాంఖ్యులచే కపిల మహార్షి ప్రజాపతియని చెప్పబడువాడు ఆరూపములో తనను తాను ప్రసిద్ధిని పొందించుకొనెను. ఈ కాపిలేయుడు ఆధురిమహర్షికి మొదటి శిష్యుడు చిరంజీవిగా పేర్కొనబడినవాడు పంచనదీ ప్రాంతమున సహస్ర వర్షాత్మకమగు సత్రము నాచరించుచుండెడివాడు. కాపిలేయాశ్రమమున్న పంచనదీ ప్రాంతమునకు ఆధురిమహర్షి వచ్చి మహాజ్ఞానియగు కాపీలేయునికి అవ్యక్త స్వరూపమును పురుష స్వరూపమును బోధించు పరమార్థమును తెలియజేసెను. యాగమంత్రోచ్చారణచే తపస్సుచే ఆసురి క్షేత్ర క్షేత్రజ్ఞుల స్వరూపమును శరీరాత్మజ్ఞానము కలవాడు కావున తెలిసియుండెను. ఏకాక్షరము నానారూపముగా కనపడు బ్రహ్మను ఆసురీ ఆశ్రమమండలమున సాక్షాత్కారమును పొందకలిగెను. ఆయాసురి శిష్యుడే పంచశిఖుడను పేరుగలవాడు మానవ స్క్రీస్తన్యముతో పోషించబడినవాడుండెను. కావలి అను పేరుగల బ్రాహ్మణిస్త్రీకి పుత్రత్వమును చెంది కాపీలి స్తన్యపానమును చేసెను. కావున అతనికి కాపీలేయుడను పేరు కలిగెను, స్థిరమగు బుద్దిని కూడా పొందెను. ఇది కాపిలేయుని పుట్టుక. నాకు భగవంతుడు తేలి పెను. అతని కాలేయత్వమును సాటిలేని సర్వజ్ఞత్వమును తెలియ చేసెను. మంత్రులతో కలిసి జనకమహారాజు కపిలేయుని రాకను తెలిసి ధర్మజుడు కావున ఎదురేగి అతిథి పూజగావించి అతని వేంటనున్న ఆచార్య శతమును హేతువాదముచే మోహింపచే సెను. జనకమహారాజు కాపీలేయుని దర్శించగోరి ఆచార్య శతమును విడిచి కాపీలేయుని వెంట వెళ్ళెను. ఇట్లు తననాశ్రయించిన జనకమహారాజునకు పరమకళ్యాణప్రదమగు మోక్షధర్మమును కాలేయుడు బోధించేను. ఈ జ్ఞానమునే సాంఖ్యమందురు. జాతి జ్ఞానమును, కర్మజ్ఞానమును, సర్వజ్ఞానమును బోధించెను. ధర్మ సంబంధము కర్మఫలప్రాప్తి దేనికోజుకు చేయుచున్నామో ఆ దేహము అశాశ్వతము, వినాశము, చలము, అధ్రువము, లోకసాక్షికముగా ప్రత్యక్షముగా నశించుచున్ననూ శాస్త్ర జ్ఞానముచే ఉన్నది అని పలికిననూ పరాజితుడే అగును. ఆత్మ జ్ఞానము లేక పోవుటయే ఆత్మకు మృత్యువు. శరీరమునకు జరాస్వరూపమగు కష్టము మృత్యువు. శరీరమునే ఆత్మయనుకోనుట మోహముచేతనే కాని సత్యము సముచితము కాదు. ఇదీయిట్లున్ననూ లోకమున సంభవముకొనీది. ఆత్మ అజరము అమరము. అట్లు దేహమును భావించుట రాజసభావము. ఇదియున్నది. ఇది లేదు అని తమౌలక్షణమగు శరీరమున లోకవ్యవహారమున దేనినాధారముగా చేసుకొని చెప్పవలయును? ఈ భావాభావమూలము మూలమగు నిశ్చయము ప్రత్యక్షమే. ప్రత్యక్షము శాస్త్రము ఈ రెండు భిన్నములు. కావున ఏ నిశ్చయమూ కలుగదు. కావున ప్రత్యక్షము సంభవించదు కావున అనుమానముచే నిశ్చయించవలయును. కాని నాస్తికమతమున శరీరము కంటే భిన్నుడుగా జీవుడు కనపడడు. రేతశోణిత సంయోగమే ఘృతపాకస్థితివంటిది. జాతి జ్ఞానము అయస్కాంతము వంటిది. అంబు భక్షణము సూర్యకాంతము, ప్రీతభూత ప్రియత్వము దేవయాచనము మృతులకు కర్మ నివృత్తి ప్రమాణమని నాస్తికుల నిశ్చయము. ఈ హేతువులన్నియూ మూర్తిమంతయుల విషయమున చెప్పబడినవి. స్వరూపము లేనిదానికి స్వరూపమున్నదానితో సంబంధమే లభించదు. అవిద్య, కర్మ, ఆశ పునర్జన్మకు కారణములని కొందరందురు. ఆ శరీరము నశించిననూ దహించినను. ఇక ఉండెడిదేదియును లేదు. ఆ య "విద్య నశించిననూ దానినుండి మరియొక మోహము పుట్టును. దీనినే సత్త్వసంక్షయమందురు. ఆత్మ శరీరమునకంటే స్వరూపముచే జాతిచే శ్రుతిచే అర్థముచే భిన్నమైనపుడు ఈ శరీరమున ఆయాత్మయే యున్నదని' ఎట్లు నిశ్చయింతుము. ఇట్లు నిశ్చయించలేనిచో జ్ఞానవిద్యాతపోబలముచే ఏమి ప్రయోజనము? ఈ దేహసంబంధముచే చేయబడిన కర్మ ఇతనిదే అయినచో ఇతనే ఇక్కడే ఇతరులమైన ప్రకృతి ధర్మములచే ఎట్లు దుఃఖమును పొందును. సుఖముగలవాడు దుఃఖము గలవాడు అని చెప్పబడువాడు దృశ్యుడా? అదృశ్యుడా? అను నిర్ణయము జరుగవలయును. రోకళ్ళచే కొట్టి చంపబడిన శరీరము మరల ఎట్లు పుట్టును? కావున జ్ఞానము వృథా. కర్మలు తపస్సు వృథా. వాటిచే శరీరము లభించుట లేదు కదా? ఋతువు సంవత్సరము, "మాసము -శీతోష్ణములు ప్రియా ప్రియములు వచ్చును, పోవును. వాటిని చూచుట చూడకపోవుట అనునది లేకుండుటయే సత్త్వసంక్షయము. వార్ధక్యముచే జీర్ణమైనది మృత్యువుచే నశించినది. గృహమున మొదటి దుర్బలమైనది నశించునట్లు శరీరమునకూడా దుర్బలమైనదే నశించును. ఇంద్రియములు, మనసు, వాయువు, రక్తము, మాంసము, అస్థులు క్రమముగా నశించి తమతమధాతువులను చేరును. దొనధర్మములచే ఫలము లభించినచో లోకయాత్రకు విఘాతము కలుగును. కావున వేదశబ్దములు వ్యవహారములు కూడా లౌకికములే. ఇట్లు ప్రాణి తన మనసున పలువిధములైన హేతువులను కల్పించుకొని ఆలోచించుచుండును.
ఇది యున్నది, ఇది లేదు అని ఏ ఒక్కడూ నిశ్చయించలేడు చక్కగా జ్ఞానము ననుసరించి విమర్శించు వారికి ఒకచోట బుద్ది నిలుచును. శరీరము మాత్రము వృక్షము వలె జీర్ణించును. ఇట్లు అర్ధములచే అనర్థములచే అన్ని ప్రాణులు దుఃఖితులై మావటివానిచే ఏనుగు వలె ఆశలచే ఆకర్షించబడుదురు. ఇట్లు సారములేని ఆశలచే ఆస్వాదించబడుచు సుఖములను కలిగించు పురుషార్ధములను స్వయముగా నశింపచేసుకొందురు. గొప్ప దుఃఖమును సౌంది ఆహారమును విడిచి మృత్యువును పొందెదరు నశించునది శాశ్వతము కాని జీవితము గల ప్రాణులకు బంధువులతో మిత్రులతో ఏమి ప్రయోజనము? అంతటిని అన్నిటిని వదిలి క్షణములో వెళ్ళి మళ్ళీ తిరిగిరాడు కదా? ఈ శరీరమును భూమ్యాకాశ జలాగ్ని వొయువులు ఎపుడూ కొపొడుచుండును. ఈ విషయమును తెలిసినవాడేట్లు ఆనందించగలడు. వినాశియగు ఈ శరీరములో సుఖమునేట్లు పొందగలడు? ఇట్లు ఉపాధిరహితము కల్మషరహితము పరమనిరామయమగు మహర్షి వాక్యమును వినిన జనకమహారాజు ఆశ్చర్యమును చెంది మరల తెలియుటకీటు పలి కెను.
జనక మహారాజు పలికెను :- ఓ మహర్షీ ! మృతి చెందిన తరువాత ఎవ్వరికీ జ్ఞానముండనిచో జ్ఞానాజ్ఞానములచే ప్రయోజనమేమి? సిద్దాంతమంతయూ భంగము కావలసి వచ్చును. దీనిని చక్కగా పరిశీలించుడు. అప్రమత్తునికి ప్రమత్తునికి విశేషమేమి యుండును? భూతములయందు అసంగముకొని ప్రాణములయండు సంపదలయందు సంబంధముకొని ఎవరికోజుకు చేయబడుచున్నది? దేని కోటకు చేయబడుచున్నది. ఈ విషయమున సిద్ధాన్త మెట్లుండును?
సనందన మహర్షి పలికేను :- అజ్ఞానముచే ఆవరించబడిన బుద్ధి కలిగి భ్రాంతుడై ఆతురుడైయున్న జనకుని మంచిమాటలచే శాంతింపచేయుచు పంచశిఖుడిట్లు పలి కెను.
పంచశిఖ మహర్షి పలికెను :- ఈ విషయమున ఉచ్చేదనిష్కొని భావనిష్కొని లేదు. ఇది శరీరేంద్రియ మనస్సుల సమాహారము. ఈ మూడు విడివిడిగా ఒకదానిని మరియొకటాశ్రయించి యుండును. జలము ఆకారము వాయువు అగ్ని భూమి యనునవి అయిదు ధాతువులు. అయిదింటిలో భావముతో నిలుచును. స్వభావముగా విడిపోవును. ఆకాశము వాయువు వేడి పార్థివము జలము ఈ అయిదింటి సమాహారము శరీరము. ఈ శరీరముకూడా పలువిధములు. జ్ఞానము వేడి వొయువు అను మూడు వొయసమూహము. ఇంద్రియములు, ఇంద్రియార్థములు, స్వభావము చేతనో, మనస్సు, ప్రాణాపానములు, వికారము. ఇచట ధాతువులు బయల్పడును. శ్రవణము, స్పర్శనము, జిహ్వా, దృష్టి, నాస అను నీ అయిదు ఇంద్రియములు చిత్తమునకు పూర్వమున కలుగు గుణములు. ఇచట విజ్ఞానసంయుక్తమగు చేతన ధ్రువము త్రివిధము. సుఖము, దుఃఖము, అసుఖదుఃఖము అని శబ్దము స్పర్శ రూపము అను మూడు మూర్తి కొఱకే ఏర్పడును. ఈ అయిదు సద్గుణములు మరణపర్యంతము జ్ఞాన సిద్ది కొఱకుండును. ఈ సద్గుణములయందే కర్మలు సిద్ది సర్వతత్వార్ధ నిశ్చయముండును. దీనినే పరమము, శుద్ధము, బుద్ధి అవ్యయము మహత్ అందురు. ఇట్లు గుణ సమాహారమును ఆత్మ భావముతో చూచువానికి చెడును మాత్రమే చూపించు అజ్ఞానముచే అంతులేని దుఃఖము శాంతించదు. నేనుకాను నాది కాదు అని అనాత్మగా చూడబడినదానికి అధిష్టానమేది? దుఃఖసంతతి ఎటనుండి వచ్చుచున్నది? ఈ విషయము మంచి జ్ఞానమనగా సాటిలేని త్యాగ శాస్త్రము మాత్రమే. దానిని ఇతరులు చెప్పునపుడు మోక్షముకొఱకు వినపయును. చెప్పబడిన అన్ని కర్మలను విడుచుటయే బూటకపు వినయము గలవారికి దుఃఖమును కలిగించు కష్టము. ద్రవ్యమును త్యాగముచేసినచో కర్మలు, భోగములను త్యజించినచో వ్రతములు, సుఖమును త్యజించినచో తపము యోగము సిద్ధించును. అన్నిటిని విడిచిన వానికి అన్నియు ముగియును. ఇట్లు సర్వత్యాగమునకున్న ఏకైకమార్గమును వివరించితిని. దుఃఖనాశమునకు త్యాగమే ఏకైక మార్గము. త్యాగములేనిచో దుర్గతి ఏర్పడును. మనసుతో కలిసి ఆరగు పంచ జ్ఞానేంద్రియములను చెప్పి, ఇపుడు బలముతో ఆరగు పంచ కర్మేంద్రియములను చెప్పెదను. హస్తములు కర్మేంద్రియములు పాదములు గమనేంద్రియములు. మేడ్రము జనన ఆనందేంద్రియము, పొయువు మలవిసర్జనేంద్రియము వాక్కు శబ్లేంద్రియము. ఇవి అయిదు కర్మేంద్రియములు. ఇట్లు పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మనుసుతో కలిసి ఏకాదశేంద్రియములగును. ఈ ఏకాదశేంద్రియములు బుద్ధితోకలిసి అన్ని వ్యవహారములను నడుపును. కర్ణములు శబ్దము చిత్తము అను మూడు శ్రవణ సంగ్రహమందురు. అట్లే స్పర్శరూపము, రసగంధములు అనువాటికి కూడా ప్రాకముండును. ఈ త్రికము గుణోపలబ్దిని కూర్చును. ఈ త్రికముచే పర్యాయముగా భావత్రయముండును. సాత్త్విక రాజస తామసములను మూడుభావములే మూడు వేదనలను కలిగించును. ఈ వేదనలే సంసారమున అన్నింటినీ సాధించును. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము శాంతచిత్తత సకారణముగా అకారణముగా చిత్తములో కలుగుట సాత్త్విక గుణము. అసంతోషము, పరితాపము, శోకము, లోభము, అసహనము ఇవికూడా అకారణముగా సకారణముగా కలుగుట రజోగుణమువలన కనిపించును. అవివేకము, మోహము,ప్రమాదము, నిద్ర, సోమరితనము మొదలగునవి సహేతుకముగా నిర్ణేతుకముగా కలుగుట తమోగుణ చిహ్నములు. ఇట్లు అప్రమత్తుడై విముక్తి మార్గమును తెలిసినవాడు జల సిక్తమైన పత్రము విషలిప్తముకానట్లు అనిష్టములైన దుఃఖములతో సంబంధమును కలిగియుండుడు. దృఢములు పలువిధములగు పాశములనుండి విముక్తుడు కావలయును. ఈ పాశములు ప్రజానిమిత్తములు కావచ్చును. దైవనిమిత్తములు కావచ్చును. ఇట్లు విముక్తుడై సుఖదుఃఖములను విడిచినచో శరీరత్యాగముచే ఉత్తమగతిని పొందును. శ్రుతిస్మృతి శాస్త్రప్రమాణములచే జ్ఞానమును సంపాదించి జరామృత్యువులకు అతీతుడై శరీరమునకు నిమిత్తములగు పుణ్యపాపములు నశించగా నిర్లేపము నిర్లింగము అగును ఆకాశమును మహత్తత్త్వమున దర్శింతురు. సాలెపురుగు తాను సృజించిన సూత్రము నశించిన తరువాత భ్రమణమును ఆపి స్థిరముగా నిలుచునట్లు జీవుడు స్థిరుడగును. ఇట్లు విముక్తుడై దుఃఖమును పరిత్యజించును. లోష్టమునకు అంటుకొనియున్న మట్టి వదులునట్లు వదులును, జింక తన పాత కొమ్మును వదిలినట్లు, పాము కుబుసమును వీడుచునట్లు జీవుడు విముక్తుడై దుఃఖమును విడుచును. నీటిలోనున్న పక్షిని అందుకొనుటకు నీటిలోనికి వచ్చిన పక్షి మత్స్యమును గ్రహించలేక దానిని వదిలినచో ఆకాశమున కేగురును. అట్లు కదలనిచో పక్షి కూడా నీటిలోపడి నశించును. అట్లే జీవుడు సంసారవిషయములను వదిలినచో దుఃఖవిముక్తుడగును. సంగమును వీడనిచో సంసారమున పడును. ఇట్లు పంచశిఖమహర్షి ఉపదేశించిన తత్త్వజ్ఞానమునువిని నిశ్చితార్ధము కలవాడై శోకమునువీడి పరమానందముతో విహరించెను. మరియు ఒక సనుయమున శత్రువులు నగరమును ముట్టడించి నిప్పంటించి తగులబెట్టుచుండగా ఆ వార్త వినిన జనకమహారాజు నాదంటూ ఏదీలేదు నావస్తు వేదీ దహించుటలేదు అని నీసంగముగా పలికెను. ఇట్లు పంచఖమహర్షి ఉపదేశించిన ఈ మోక్షమార్గమును చదివినవాడు తెలిసిన దానిని యథావిధిగా ఆచరించి ఆపదలనుకూడా దుఃఖించకనే అనుభవించి కపిలుని ఆశ్రయించిన జనకునివలె విముక్తుడగును.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున బహదుపాఖ్యానమున నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.
