నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

71 - నృసింహోపాసనామంత్రగాయత్ర్యాది నిరూపణమ్

సనత్కుమార మహర్షి పలికెను : ఓ నారదా ! దివ్యములగు నారసింహ మంత్రములను చెప్పెదను వినుము. ఈ మంత్రోపాసన చేతనే బ్రహ్మాది దేవతలు సృష్ట్యాది కర్మలను చేయగలుగుచున్నారు. సంవర్తకుడు చంద్రమౌళి మంత్రము వహ్ని విభూషితము. ఈ మంత్రము ఏకాక్షరము, సేవించు వారికి కల్పవృక్షము. ఈ మంత్రమునకు ముని అత్రిమహర్షి జగతీ ఛందస్సు నారసింహస్వామి దేవత అఖిలాభీష్టప్రాప్తికి వినియోగము. క్షం బీజము. ఈ శక్తి షడ్దర్షముతో షడంగన్యాసమును చేయవలయును. సూర్యచంద్రాగ్ని నేత్రుడు, శరచ్చంద్ర వర్ణుడు, చేతులలో చక్ర అభయ వరములను ధరించువాడు అయిన నృహరిని స్మరించవలయును.. లక్ష జపమును చేయవలయును. దశాంశమును ఘృత పాయసములచే హోమమును చేయవలయును. వైష్ణవ పీఠమున పూజించవలయును. కేసరములందు అంగపూజను గావించవలయును. దిక్కోణములందు గరుడుని, శంకరుని, ఆది శేషుని, బ్రహ్మను, శ్రీని, స్త్రీని, ధృతిని, పుష్టిని, కోణపత్రములందు పూజించవలయును. దంతచ్ఛదములందు నారసింహులను పూజించవలయును. కృష్ణుడు, రుద్రుడు, మహాఘోరుడు, భీముడు, భీషణుడు, ఉజ్జ్వలుడు, కరాలుడు, వికరాలుడు, దైత్యాంతకుడు, మధుసూదనుడు, రక్తాక్షుడు, పింగలాక్షుడు, అంజనుడు, దీప్తరుచి, సుఖోరకుడు, సుహనువు, విశ్వకుడు, రాక్షసాంతకుడు, విశాలకుడు, ధూమ్ర కేశుడు, హయగ్రీవుడు, ఘనస్వనుడు, మేఘవర్ణుడు, కుంభకర్ణుడు, కృతాంతుడు, తీవ్రతేజుడు, అగ్నివర్ణుడు, మహోగ్రుడు, విశ్వవిభూషణుడు, విఘ్నక్షముడు, మహా సేనుడు అని ముప్పది రెండు నారసింహులు చెప్పబడిరి. వీరికి వెలుపల ఆయుధములచే కూడిన దిక్పాలకులను పూజించవలయును. ఇట్లు మంత్రసిద్ధిని పొంది అభీష్టములను సాధించవలయును. ప్రద్యుమ్నునిచే కూడిన విష్ణువు శార్జి సాగ్ని, వీరుడు మహాపద్ముడు, ప్రకాశించు విష్ణువును, భృగ్విశుడు జలము, పద్మాసనము. హరి వాసుదేవుడు, విష్ణుయుతుడగు వైకుంఠుడు, గదాధారి సేందువు, భయంకరుడు భద్రుడగు నృసింహుని, మృత్యుమృత్యువును, శౌరి నారాయణ సహితుడగు భానువు. ఇట్లు ఇరువది రెండు వర్ణములు గల మంత్రము నరసింహ మంత్రము సామ్రాజ్యప్రదము. ఈ మంత్రము సర్వేష్ట దాయకము. హుం బీజము ఇం అనునది శక్తి. అఖిలాప్తికి వినియోగము. నాలుగు నాలుగు ఎనిమిది ఆరు ఆరు జంట అక్షరములచే షడంగములనేర్పరిచి శిరస్సున, ఫాలమున, నేత్రములలో, ముఖ బాహ్వంఘి సంధ్యగములలో, కుక్షియందు, హృదయము నందు, గలమున, పార్శ్వద్వయమున, పృష్ఠమున, కకుత్తున మంత్రోద్భవ వర్ణములను ప్రణవాంతరితములను చేసి న్యాసము చేయవలయును. నృసింహస్వామి సన్నిధిని చేర్చు న్యాసము పది విధములు. కరచరణ అష్టాద్యంగుళుల యందు విడివిడిగా ఆద్యంత పర్వములలో, సర్వాంగుళులయందు న్యాసము చేసి మిగిలిన దానిని తలములయందు న్యాసము చేయవలయును. శిరమున, లలాటమున, భ్రూమధ్యమున, నేత్రములలో, కర్ణములలో, కపోలములందు, కర్ణమూలములందు, చిబుకమున, ఊర్ధ్వాధరోషములందు, కంఠమున, ఘోణమున, భుజములయందు, హృదయమున నాభిమండలమున, పాదములయందు, పాదతలములందు, కటియందు మేడ్రమున, ఊరువులందు, జాను జంఘలయందు, గుల్పమున, పాదకరాంగుళులందు, సర్వసంధులంగు, రోమములందు, రక్త స్థిమజ్జలందు, తనువునందు వివేకముకలవాడై న్యాసము చేయవలయును. వరణములను పదమునందు, గుల్బజానుకటికాభిహృదయ స్థలములందు, బాహువులందు, కంఠమునందు, చిబుకమునందు, ఓష్ఠమునందు, గండస్థలములందు 'న్యాసము చేయవలయును. కర్ణములందు, వదనములందు, నాసాపుటమున, నేత్రమున మూర్థలో న్యాసము చేయవలయును. పదములను ముఖమున, మూర్థలో, నాసికయందు నేత్రమునందు, కర్ణములందు, ఆస్యమునందు, హృదయమునందు, నాభియందు, పాదములను సర్వాంగములందు న్యాసము చేయవలయును. అర్థద్వయము మూర్థయందు, పాదము నుండి హృదయము వరకు తదంగములను, ఉగ్రాది పదములను న్యాసము చేసి మృత్యు మృత్యుం నమామ్యహం అనునది అంతమునందు కల వాటిని ఆస్యఘ్రాణచక్షుః శ్రోత్ర పక్ష్మలయందు, హృదయమున, నాభియందు, కట్యాది పాదాంతమున నవాంగవ్యాసము చేయవలయును. వారాది నారసింహులను కూడా మొదట చెప్పినట్లు న్యాసము చేయవలయును. నృసింహాదులను కూడా పూర్వోక్త విధముగా న్యాసము చేయవలయును. చంద్రాగ్ని వేద షడ్రామ నేత్ర దీగ్బాహు భూమితములగా వర్ణములను విభజించి పత్రవర్ణములను క్రమముగా ఆయా స్థానములలో నుంచవలయును. మూలమున మూలమునుండి నాభ్యంతము, నాభినుండి హృదయము వరకు, హృదయమునుండి భ్రూయుగ్మము వరకు, నేత్రత్రయమున, మస్త కమున, బాహువులందు, అంగుళులందు, ప్రాణమున మూర్ధాది పాద పర్యంతమున నామములననుసరించి న్యాసము చేయవలయును. దీనిని హరి న్యాసమందురు. హరి న్యాస ప్రభావమును ఒక్క శ్రీహరి మాత్రమే తెలియును. ఇట్లు న్యాసవిధిననుష్ఠించి హృదయమున నృహరిని ధ్యానమును చేయవలయును.

కంఠమున తగిలియున్న శోభించు బాహువులను తాకు కేశములు గలవాడు, పద్మమును చక్రమును ధరించువాడు, నఖాగ్రములచే రాక్షసాధిపతిని భేదించినవాడు, జ్వాలామాలా సమన్వితుడు. దీప్త జిహ్వుడు, త్రినేత్రుడు, దంష్ట్రాలచే భయంకరమగు వదనము కలవాడు అగు నృసింహుడు స్థలంబుగగనాదులలో ఉండువాడు మమ్ములను ఎప్పుడూ కాపాడు గోవుత. ఇట్లు ధ్యానము గావించి మహానుభావుడైన నృసింహాస్వామి ముద్రను చూపవలయును. చిబుకమును ఓష్ఠములను సమానముగా జానుమధ్యమున నుంచి, చేతులను భూమికి తగిలించి, మాటిమాటికి కంపించుచు, ముఖమును ఆవలించినట్లుగా తెరిచి నాలుకను బయటకు చాచవలయును. దీనిని నారసింహముద్ర యందురు. ఇది చాలా ప్రధానము. వామాంగుష్ఠమున కనిషాంగులిత్రయమును బంధించి త్రిశూలమువలె ఊర్థ్వముఖముగా చేసి నృసింహముద్రను చేయవలయును. అంగుషములచే రెండు చేతుల కనిష్టములను ఆక్రమించి, మిగిలిన వేళ్ళను అధోముఖములుగా చేయవలయును. రెండు చేతులను అధోముఖములుగా చేసి నాభిదేశమున చాచి, తర్జనలచే భుజములను తాకవలయును. దీనిని అంత్రణముద్రికయందురు. హస్తములను ఊర్థ్వముఖములుగా చేసి మధ్యమున తలములను యోజించి వామఅనామికయందు దక్షిణానామికను ఉంచవలయును. తర్జనులను వెనుక కలిపి అంగుష్ఠములను తర్జనియందు తాకించినచో చక్రముద్రయగును. ఈ చక్రముద్రను నృసింహస్వామి సమీపమున చూపవలయును. ఇట్లు చక్రముద్రనాచరించి తర్జనులచే మధ్యమములను పీడించవలయును. ఇది దంష్ట్రముద్రయన బడును. ఇది సర్వపాపములను నశింప చేయును. ఈ ముద్రలు నృసింహ మంత్రములన్నింటిలో సమ్మతములు. మంత్రమును అక్షరలక్ష  జపించవలయును. దశాంశమును నేతితో కలిసిన పాయసములచే అగ్నిలో హోమమును చేయవలయును. పూర్వోక్త పీఠమున ఆర్చన గావించవలయును. మొదట అంగములనారాధించి దీక్పత్రములందు గరుడాదులను శ్రీప్రభృతులను పూజించి, వెలుపల విదిక్కులందు లోకపాలులను పూజించవలయును. ఇట్లు సాధించబడిన మంత్రము సర్వకామములను పూర్తి చేయును. సౌమ్య కార్యమున సౌమ్యుని స్మరించవలయును. క్రూరకర్యమున క్రూరుని సమర్పించవలయును. మృత్యు మృత్యుం అను మంత్రమున మొదటి మృత్యుపదమునకు మొదట శత్రునామమునుచ్చరించి శ్రీనృహరి నిశిత దంష్ట్రాగ్రములచే నములుచున్నట్లు స్మరించవలయును. ప్రతిదినము అష్టోత్తర శతమును జపించవలయును. ఇట్లు జపించినచో నలుబదిరోజులలో శత్రువు యమాతిధి కాగలడు. ఇక ఇపుడు ధ్యాన భేదములను సర్వసిద్ధిప్రదాయకములను చెప్పెదను. వినుము.

సంపదను కోరువాడు పూర్వము చెప్పబడిన శుక్లవర్లుడగు నృసింహస్వామిని ధ్యానము చేయువలయును. ఆ నృసింహస్వామి వామాంకమున పద్మహస్తయగు లక్ష్మిచే ఆలింగనము చేయబడియున్నవాడుగా ధ్యానము చేయబడవలయును. విషమృత్యుపరోగాది ఉపద్రవాది శాంతికోటకు కాలానల సమప్రభుడు, మహాభయంకరుడు, పేగులను మాలగా ధరించినవాడు, రౌద్రుడు, కంఠహారములచే భూషితుడు, నాగయజ్ఞోపవీతుడు, పంచముఖములచే శోభితుడు, చంద్రమౌళి, నీలకంఠుడు, ప్రతివకూడు, త్రినేత్రములు గలవాడు పరిఘలవంటి పదిభుజములచే సుశోభితుడు, జపమాలను, గదను, పద్మమును, ఆవుపాలవంటి శంఖమును, ధనువును, ముసలమును, చక్రమును ధరించినవాడు, ఖడ్గమును, శూలమును, బాణమును ధరించి రుద్రరూపుడుగా నుండువాడు. ఇస్ట్రనీలమణికాంతిగలవాడు, చంద్రసన్నిభుడు, స్వర్ణకాంతిగలవాడు పూర్వాది ఉత్తర పర్యంతము ఊర్ద్వస్యము గలవాడు, సర్వవర్ణుడు అగు నృసింహస్వామిని ఇట్లు ధ్యానమును చేసినచో సర్వవ్యాధి నివారణకాగల సర్వమృత్యుహరుడు దివ్యుడు, స్మరణ మాత్రమున సర్వసిద్ధిప్రదుడగు అగు నృహరిని ధ్యానము చేయవలయును. మహాకార్యమును సంకల్పించినపుడు పదునారు హస్తములు కలవాడు సర్వలోకేశ్వరుడు, సర్వాభరణ భూషితుడగు నృసింహుని ధ్యానించవలయును. రెండు హస్తములు విదారణ కర్మ చేయునవి, రెండు హస్తములు పేగులను వెలికి తీయునవి, రెండు హస్తములు శంఖ చక్రములను ధరించునవి, రెండు హస్తములు ధనుర్బాణములను ధరించునవి, రెండు హస్తములు ఖడ్గఖేటములను ధరించునవి. గదాపద్మములను ధరించు హస్తద్వయము. పాశాయశధరములగు హస్తద్వయము, రెండు హస్తములు శత్రు ముకుటార్పీతములు. ఇట్లు పదునారు బాహువులు గల ప్రభువగు నృసింహస్వామిని నీలవర్లుని ఉగ్రకర్మలయందు అనన్య చిత్తముతో ధ్యానించవలయును. ఇంకను మహత్తమ కార్యమునందు ముప్పది రెండు బాహువులు గల నృహరిని ధ్యానించవలయును. సర్వభూతాధిపతి, సర్వసిద్ధికరుడు, పరుడు నృసింహస్వామియే. దక్షిణ బాహువులలో చక్రపద్మములను, పరుశువును, పొశమును, హలమును, ముసలమును, అభయమును, అంకుశమును, పట్టిశమును, బిందిపొలమును, ఖడ్గముద్ధర తోమరములను ధరించువాడు, వామభాగమున నుండు హస్తములలో శంఖమును, ఖేటమును, పొశమును, శూలమును, అగ్నిని, వరదముద్రను, శక్తిని, కుండికను, కార్ముకమును, తర్జనీముద్రను, గదను, డమరు శూర్పకములను, రెండు చేతులచే శత్రువుల జానుమస్తక పీడనమును చేయువాడు, పైన నున్న బాహువులచే అంత్రమాలను ధరించువాడు, క్రిందనున్న బాహువులచే హిరణ్యకశ్యపుని చీల్చువాడు, భక్తులకు ప్రియమును, దైత్యులకు భయమును కలిగిచువాడు అయిన మహామృత్యుభయమును తొలగించు నృసింహస్వామిని ఇట్లు స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి సర్వకార్యార్థ సిద్ధికి జపమును చేయవలయును. ఇక ఇపుడు శుభకరము, ముఖరోగహరమగు మరియొక ధ్యానమును చెప్పెదను. స్వర్ణవర్ణము గల గరుడుని పై నున్నవాడు, మెరుపు తీగలవంటి జటలు గలవాడు, కోటి పూర్ణేందువరుడు, సుముఖుడు, మూడునేత్రములతో చూచువాడు, పీతాంబరధారి, మహాభూషణభూషితుడు, శాంతవిగ్రహుడు, శంఖ చక్రాభయవరములను ధరించువాడు, కుష్టు వ్యాధి మొదలగు వ్యాధులను శమింప చేయువాడు, దేవతలచే వందనములను పొందువాడు, అయిన నృసింహుని ధ్యానము చేయవలయును. శత్రు సేనానిరోధమును చేయగోరువాడు ప్రయత్నముచే అక్షకాషములతో జ్వలింపచేసిన అగ్నిలో శత్రుమర్ధనుని ధ్యానించుచు, నృసింహదేవుని పుష్పాద్యుపచారములచే పూజించి మూలములతో కూడిన మూలశరములతో ఒక వేయి హోమమును చేయవలయును. శత్రువును భక్షించుచున్న స్వామిని జపించవలయును. శత్రువును దహింపచేయుచున్నట్లుగా క్షేపము చేయవలయును. ఇట్లు ఏడుదినములు హోమమునుచేసి రోజునకు ఇష్టమగు సైన్యమును యుద్ధమునకు పంపించవలయును. పురరాష్ట్రములను జయించు ఇచ్ఛగలవారు శుభలగ్నమున పంపవలయును. ఆ సైన్యముముందు భాగమున శత్రు సమూహమును వధించుచున్న నృసింహదేవుని స్మరించుచు సైన్యము శత్రువును జయించి విజయలక్ష్మితో ఆనందముగా తిరిగి వచ్చువరకు జపము చేయవలయును. తరువాత జయమును చేకొన్న రాజు జపము చేసిన మంత్రజ్ఞుని సంతోషముచే వైభవములతో ప్రీతిని పొందించవలయును. గజాశ్వరధరత్నములచే గ్రామ క్షేత్రధనాదులచే సంతోషపరచవలయును. జపము చేసినవాడు సంతోషించనిచో రాజునకు గొప్ప అనర్థము సంభవించును. రాజ్యభస్మమును లేపనము చేసికొనినచో మూషిక వృశ్చికొదులవలన భయము తొలగును. సర్వరోగములనుండు విముక్తిని పొందును. సేవంతీపుష్పములచే హోమమును గావించినచో మహా సంపదలను పొందును. మేడిసమిధలచే హోమమును గావించినచో ధావ్యసమృద్ది కలుగును. లక్ష అపూపములచే హోమమును గావించినచో కుబేరునితో సమానుడగును. కోపించిన రాజు సమీపమున అష్టోత్తరశతజపమును చేయవలయును. వెంటనే నిర్మలత్వమును పొంది అనుగ్రహమును సంపాదించగలుగును. మల్లెపూవులతో హోమమును గావించిన అభివృద్ధి. అరటి పూవులచే చేసిన విఘ్ననాశము సంభవించును. తులసీపత్రములచే హోమమును గావించిన గొప్ప కీర్తిని పొందును. వరిపొలములతో హోమమును గావించినచో సకలజగము వశమగును. ఇప్పపూవులతో హోమముగావించినచో సకల జగతంభనమును గావించగలుగును. దధిమధుఆజ్యమిశ్రమగు చతురంగుళ పరిమాణముగల గుడూచీచే పదివేలు హోమమును గావించినచో అన్ని రోగములను జయించి నూరు సంవత్సరములు జీవించును. శనివారమున రాగి చెట్టును తాకి అష్టోత్తరశతమును జపించినచో అపమృత్యువును జయించి నూరు సంవత్సరములు జీవించును.

ఇక ఇపుడు నీకు త్రైలోక్యమోహనయంత్రమును చెప్పెదను. ఈ యంత్రమును ధరించినంత మాత్రముననే అన్ని సంపదలు కలుగును. తెల్లని భూర్జపత్రమున ముప్పది రెండు సింహములు గల పద్మములను లిఖించవలయును. మధ్య సింహమున స్వబీజమును పూర్వమువలె లిఖించవలయును. శ్రీ బీజముతో చుట్టి వలయత్రయమును గూర్చి, పాశాంకుశములతో సంవేష్టనము గావించి ఉత్తమ యంత్రమును పూజించవలయును. త్రైలోక్యమోహనమను యంత్రము సర్వకామార్థసాధకము. సర్వ చక్రేశ్వరేశ్వరుడు, మహారాజు అగు చక్రరాజమును ధరించుట వలన సర్వ ప్రదేశములందు జయమును పొందును. ఇది ముమ్మాటికి నిశ్చయము. సంశయము లేదు. ఇక ఇపుడు మరొక యంత్రమును చెప్పెదను. ఇదీ సర్వసిద్ధిప్రదము. మృదువుగా సుందరముగా కర్ణికాయుతముగా అష్టదళయంత్రమును లిఖించవలయును. ప్రణవముతో కూడిన మూలమంత్రమున ఆ యంత్రమున లిఖించవలయును. మధ్యభాగమున నారసింహ ఏకాక్షరినీ లిఖించవలయును. ఆ యంత్రము వెలుపల దారముతో చుట్టి ఎనిమిది వేలు జపమును చేయవలయును. తరువాత బంగారము వెండి రాగులతో చక్కగా చుట్టవలయును. దాని పై లక్కపూత పూసి మరల మంత్రముచే మంత్రించ వలయును. కంఠమున కానీ, భూజమునకొని శిఖ యందు కానీ ధరించవలయును. ఇట్లు చేసినచో నర నారీజనము నరేంద్రులు అందరూ వశులగుదురు. దుష్టులగు పిశాచోరగ రాక్షసులు యంత్రధారకుని బాధించజాలరు. యంత్రరాజానుగ్రహమున అంతటా జయమును పొందును. ఇక ఇపుడు సర్వవశంకరమైన మరియొక యంత్రమును గూర్చి చెప్పెదను. ద్వాదశార మహాచక్రమును పూర్వము వలే లిఖించవలయును. ద్వాదశమాత్రసంపన్నదళముచే లిఖించవలయును. మధ్యభాగములో శక్తి యుక్తమగు మంత్రమును శ్రీ బీజముతో వేష్టనము చేయవలయును. సురాసుర వశంకరమగు కాలాంతకము చక్రమును సర్వశత్రునివారకమును భూర్జపత్రమున లిఖించవలయును. ఈ యంత్రమును ధరించినంత మాత్రమున అంతటా విజయమును పొందును. ఇక ఇపుడు సర్వేష్ట ప్రదమగు జ్వాలామాలియంత్రమును గూర్చి చెప్పెదను. చతుర్థానమగు భగవచ్చబ్దము బీజము హృదయము. తరువాత నరసింహాయ అని. జ్వాలినే మాలినే దీప్త దంష్ట్రాయ అగ్ని నేత్రాయ సర్వాది రక్షోఘ్నాయ సర్వ భూహారి వినాశనాయ, సర్వజ్వరవినాశనాయ దహదహ, పచపచ, రక్ష రక్ష అని కూర్చ వర్మ తీస్త ఈద్వయాంతముగా ధ్రువొదికమును చెప్పవలయును. ఈ జ్వాలా మాలీ మంత్రము అరువది యెనిమిది అక్షరములు కలది. పదమూడక్షరములచే పూర్వోక్తముగా పుణ్యాదికము నాచరించవలయును. పదకొండు పంక్తులచే పదునెనిమిది అక్షరములచే. పన్నెండు కరణములచే అంగములను కల్పించవలయును. పూర్వమున చెప్పిన రూపముగల జ్వాలామాలి నారసింహుని స్మరించవలయును. మంత్రమును లక్షజపించి దశాంశము కపిల గోఘృతముచే హోమమును గావించవలయును. ఈ మంత్రము రౌద్రౌపస్మార భూతా దీనాశకము. మాయ ప్రాణము నరసింహదేవుడు సృష్టి బ్రహ్మ స్రముగా చెప్పబడినది. ఈ మంత్రము షడక్షరము సర్వాభీష్టప్రదాయకము. ఈ మంత్రమునకు బ్రహ్మముని, పంక్తి ఛందస్సు. నరసింహస్వామి దేవత, షడీర్ఘయుతమగు బీజముచే "షడంగములనాచరించవలయును. పూర్వోక్తవిధానమున ధ్యానమును పూజను గావించవలయును. ఈ మంత్రము సిద్ధించినచో నరులను సర్వసిద్దులు కలుగును. రమాబీజాది బీజములు కలది, అనుష్టుప్పన్షస్సు, ముప్పది మూడు వర్ణములు కలది. ఈ మంత్రము ముని ప్రజాపతి. అనుష్టుప్చందస్సు. లక్ష్మీనరసింహస్వామి దేవత. అన్ని పదములచే గకల్పన గావించవలయును. ఇట్లు పంచాంగన్యాసమును గావించి ఆత్మరక్షణనాచరించవలయును. దక్షిణ బాహువును స్పృశించుచు శరభమంత్రమును జపించవలయును. ప్రణవము హృదయము శివాయ మహతే శరభాయ అనునది వహ్నిప్రియాంతమగు మంత్రము రక్షకోజుకు చెప్పబడినది. లేదా రామ మంత్రాంతమున రెండక్ట కొరములను పఠించవలయును. లేదా కేశ వాదినామములచే ప్రయత్నించి రక్షను చేయవలయును. కేశవుడు పాదములను, నారాయణుడు జంఘలము కాపాడుగావుత. మాధవుడు కటీని, గోవిందుడు గుహ్యమును, విష్ణువు నాభిని, మధుసూదనుడు జఠరమును త్రివిక్రముడు ఊరువులను, నరుడు హృదయమును, శ్రీధరుడు కంఠమును, హృషీ కేశుడు ముఖమును కాపొడుగోవుత పద్మనాభుడు స్తనములను, దామోదరుడు శిరస్సును కాపాడుగావుత. ఇట్లు సాధకుడు జపకాలమున అంగన్యాసమును గావించినచో భూతభేతాళగ్రహ రాక్షసులనుండి భయము లేనివాడగును. మరల సావధాన మనస్కుడై ధ్యానము చేయుచు న్యాసమును గావించవలయును. బంగారు కొంతీగల, చక్రాయుధుడగు కేశవుడు ముందు భాగమున కొపొడు గావుత, వెనుకభాగమున నీలమేఘశ్యాముడగు, శంఖధారియను నారాయణుడు, ఊర్ధ్వభాగమున ఇందీవరశ్యాముడు గదాదారియగు మాధవుడు, దక్షిణ పార్శ్వమున చంద్రప్రభుడు ధనుర్ధారియగు గోవిందుడు, ఉత్తర పార్శ్వమున పద్మ కింజల్కసన్నిభుడు హలధారియగు విష్ణువు, ఆగ్నేయ భాగమున అరవిందాకుడు ముసలధారియగు మధుసూదనుడు, నైఋత దిగ్భాగమున జ్వలనప్రభుడు ఖడ్గపాణియగు త్రివిక్రముడు, వాయవ్యభాగమున తరుణాదిత్య సన్నిభుడు వజ్రధారియగు మాధవుడు, ఈశాన్యదిగ్బాగమున పుండరీకాక్షుడు పట్టిశాయుధుడగు శ్రీధరుడు, ఊర్థ్వభాగమున ముద్ధర ధారయగు హృషీ కేశుడు, అధోభాగమున సూర్యసమప్రభుడగు పద్మ నాభుడు, సర్వాయుధుడు, సర్వశక్తి, సర్వాగ్యుడు, సర్వతోముఖుడు ఇంద్రనీల మణిప్రభుడు, అపరాజితుడు పాశహస్తుడు అగు దామోదరుడైన శ్రీహరి బాహ్యాభ్యంతరములందు కాపాడుగావుత. ఇట్లు అంతటా ఛిద్రరహితమగు ద్వాదశనామ పంజరమున నేను ప్రవేశించితిని. నాకు ఎప్పడూ ఏ భయమూ లేదు. ఇట్లు అంతటా రక్ష నేర్పరచుకొనినవాడు ఇతరులను దుర్ధరుడగును. అన్ని నారసింహమంత్రములలో ఈ విధియే ఆచరించవలయును. తరువాత పూర్వోక్తవిధిననుసరించి ధ్యాన పూజాదికము నాచరించవలయును. ఓ పుండరీకాక్షా ! నీవు అంతటా జయించువాడవు. ఓ విశ్వభావనా! నీకు నమస్కారము. ఓహృషీ కేశా మహాపురుషా ! నీకు నమస్కారము. ఇట్లు ప్రార్ధన చేసి, జీపించి పఠించి విసర్జన గావించవలయును. ఇట్లు మంత్ర సిద్ధిని పొందినవాడు సర్వసంపదలకు నిలయుడగును.

“జయ జయ శ్రీనృసింహ” అనునది అష్టాక్షర మంత్రరాజము. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ, గాయత్రీ ఛందస్సు, జయ నృసింహాస్వామి దేవత. సర్వాభీష్టప్రదాయకుడు. సేందువగు గోవింద పూర్వముతో సేంద్వాకాశముతో షడ్దర్షాధ్యముతో షడంగన్యాసమును చేయవలయును. తరువాత హృదయమున చంద్ర శేఖరుడగు నృసింహస్వామిని ధ్యానము చేయవలయును. శ్రీమంతుడగు నృసింహ శరీరా ! జగదేక బంధూ ! శ్రీ నీలకంఠ ! కరుణార్ణవ ! సామరాజ ! సూర్యచంద్రాగ్ని నేత్ర పినాకపాణీ ! శ్రీ చంద్ర శేఖర ! రమాపతీ ! విష్ణో ! కాపాడుము. ఇట్లు ధ్యానము చేసి ఎనిమిది లక్షలు జపమును చేయవలయును. దశాంశము నేయి కలిసిన పాయసాన్నముచే హోమము గావించవలయును. మొదటివలె అర్చన చేయవలయును. మాయాతారము స్వబీజాంతమున కర్ణోగ్రవీర శబ్దమును పలుకవలయును. “మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం స్పుర స్పుర ప్రస్పుర ప్రస్పుర ఘోర ఘోరతర తనురూప ప్రచట ప్రచట కహా కహ బన్ల బన్ల ఘాతయ ఘాతయ” అని కవచాస్త్రములనుచ్చరించవలయును. భయంకరుడు భద్రస్వరూపుడు మృత్యు మృత్యువు యగు నృసింహుని నమస్కరించవలయును. భయంకరుడు భద్రస్వరూపుడు మృత్యుమృత్యువు యగు నృసింహుని నమస్కరించుచున్నాను. ఈ మంత్రము ఎనుబదియైదక్షరములు గలది. సేవించువారికి ఇష్టమును కలిగించును. అఘోర బ్రహ్మలు ఋషులు త్రిష్టుప్ అనుష్టుప్ ఛందస్సులు. హోరనృసింహుడు దేవత. ఆనుష్టుభవిధానముగా ధ్యానార్చనాదికమును ఆచరించవలయును. విశేషించి ఈ మంత్రరాజుము సర్వరక్షాకరముగా ప్రసిద్ధిపొందినది. “జయ జయ నరసింహ” అను అష్టాక్షరీ మంత్రము బీజము. ఈ మంత్రమునకు ప్రజాపతి ఋషి. అనుష్టుప్పన్లస్సు. విదారణ నరసింహస్వామిదేవత జం బీజము హం శత్రి అఖిలాప్తికి వినియోగము. దీర్జాడ్యమగు నృసింహ మంత్రముతో షడంగన్యాసమును గావించవలయును. శత్రువక్షో విదారణుడగు నృసింహస్వామీని రౌద్రరూపుని ధ్యానము చేయవలయును. నఖదంష్ట్రాయుధుడు, భక్తాభయ ప్రదుడు, శ్రీనికేతనుడు, తప్తహాటక కేశాంత జ్వలత్సావకలోచనుడు, వజ్రాధికనఖస్పర్శుడగు ఓ దీవ్య సింహా! నీకు నమస్కారము బ్రహ్మ ముని, అనుష్టుప్పన్లస్సు. ముప్పది రెండక్షరములు గల ఈ మంత్రమునకు దివ్యమారసింహుడు దేవత. నాలుగు పొదములతో పంచాంగన్యాసమును చేయవలయును. ధ్యానపూజాదికమునంతటిని పూర్వము వలే నాచరించవలయును. పూర్వోక్త కార్యములన్నియు సిద్దించును.

“ఓమ్ నమో భగవతే నరసింహాయ తేజ స్తేజే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర, కర్మ త్రాసయ త్రాసయ, ఆక్రందయ ఆక్రందయ, తమోగ్రసగ్రస స్వాహా ఆభయమాత్మని భూయిష్టా ధ్రువమ్” అనునది మంత్రము. ఈ మంత్రము అరువది రెండక్షరములు గలది. మున్యాదికము సర్వము పూర్వము వలెనే చెప్పుకోనవలయును. “ఓమ్ నమో భగవతే నరసింహాయ” అనునది ఈ మంత్రమునకు బీజము. రూపాయ అనునది తారము స్వః అనునది బీజము. ఈఓమ్ నమో భగవతే కూర్మరూపొయ, వరాహరూపాయ నరసింహారూపాయ, వామనరూపొయ, రామాయ కృష్ణాయ కల్కి నే జయ జయ శాలగ్రామ నివాసినే దివ్య సింహాయ స్వయంభువే పురుషాయ స్వాహా అను మంత్రము మహాసామ్రాజ్యప్రదము. ఈ నృసింహమంత్రము నూరక్షరములు కలది. అత్రి మహర్షి అతిజగతీ ఛన్దము దశావతారుడగు నృహరిదేవతా, ఖం బీజము అవ్యయ శక్తి షడ్దర్జాగ్యబీజముతో అంగన్యాసము చేసి భావన చేయవలయును. అనేక చంద్రప్రతిముడు, లక్ష్మీ ముఖమునందు చూపు నిలిపినవాడు దశావతారములు కలవాడు అయిన నరసింహస్వామి ఆనందమును విస్తరించుగావుత. పది వేలు జపము చేసి దశాంశము పాయసముతో హోమమును గావించవలయును. పూర్వోక్త పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పూజించవలయును. మొదటి అంగములను తరువాత దిగంతములందు మత్స్యాదులను పూజించవలయును. ఇంద్రాదులను, వజ్రాదులను పూజించి ఇష్టమును పొందవలయును. ఇక ఇపుడు తంత్రములందు రహస్యముగా దాచబడియున్న సహస్రాక్షరమహామంత్రమును చెప్పెదను వినుము. ఈ మంత్రము మాయాతారము. రమాకామ బీజము. “క్రోధమూర్తే ! నృసింహా ! మహాపురుష !? ప్రధానధర్మాధర్మనిగడ నిర్మోచన ! కాలపురుష ! కాలాన్తకసదృక్ స్వేశ్వరాదృక్ జలశ్రాంతనివిష్ట ! చైతన్య చిత్సదాభాపక ! కాలాద్యతీత ! నిత్యోదిత ! ఉదయాస్తమయాక్రాంతమహాకారుణిక ! హృదయాబ్ద చతుదిల నివిష్టిత ! చైతన్యాత్మన్ ! చతురాత్మన్ ! ద్వాదశాత్మన్ ! చతుర్వింశాత్మన్ ! పంచవింశాత్మన్ ! ఓరి ! హరిసహస్రమూర్తీ ! ఏ హ్యే హి ! భగవన్నసింహపురుష ! క్రోధేశ్వర రస ! సహస్రవందితపాద ! కల్పాన్హాగ్ని సహస్రకోట్యాభ ! మహాదేవనికాయ ! దశశత యజ్ఞతల ! అమల అమల పింగలేక్షణ .! సహస్ర దంష్ట్ర ! దంష్ట్రాయుధ ! నఖాయుధ ! దొన వేండ్రోంతక ! వహ్ని వర్ణ శోణిత ! సంసక్తి విగ్రహ ! భూతాపస్మార యాతుధాన సురాసుర వంద్యమాన పాదపంకజ ! భగవాన్ ! వ్యోమచక్రచర ! ప్రభవాష్యయ రూ పేజోత్తిష్ణోత్తిష్ణ ! అవిద్యానిచయం దహ దహ ! జ్ఞానేశ్వర్యం ప్రకాశయ ! ప్రకాశయ ! ఓం సర్వజ్ఞ ! అరోష జంభా జృంభ్యవతారక ! సత్యపురుష' ! సదసన్మధ్యనివిష్ట ! మమ దుస్స్వప్నభయం నిగడభయం కొంతారభయం విషజ్వర ఢాకినీ కృత్యాధరేవతీ భయం, ఆశనిభయం, దుర్భిక్షభయం, మారీభయ మారీచ భయం, ఛాయాస్కందాపస్మార భయం, చోరభయం, జలస్వప్నాన్ని భయం, గజసింహభుజంగ భయం, జన్మ జరామరణ భయం నిర్మోచయ నిర్మోదయ, ప్రశమయ ప్రశమయ, జ్ఞేయ రూప ధారణ నృసింహా బృహత్సామ పురుష సర్వభయనివారణ అష్టాష్టక చతుష్టష్టి చేటికాభయం, విద్యావృత స్త్రయం శద్దేవతా కోటి నమిత పదపంకజ సహస్రవదన సహసోదర సహ సేక్షణ సహస్రపద సహస్రభుజ సహస్రజిహ్వా సహస్రలలాట వహస్రాయుధధర నమ: ప్రకాశక పురమథన సర్వమన్త రాజేశ్వర విహాయసగతిప్రద పాతాలగతిప్రద యంత్రమర్ధన ఫరాట్టహాసహసిత విశ్వావాస వాసుదేవ అక్రూర హయముఖ పరమహంస విశ్వేశ విశ్వవిడంబన నిర్దిష్ట ప్రాదుర్భావకారక హృషీకేశ స్వచ్ఛన్ల నిశ్శేషజీవగ్రాసక మహాపిశితా స్పక్ లింపట ఖేచర సిద్ధి ప్రదాయక అజేయ అవ్యయ అవ్యక్త బ్రహ్మండోదర బ్రహ్మ సహస్రకోటి సగ్రుండ మూలపండితముండ మత్స్య కూర్మ వరాహ నృసింహవామన త్రైలోక్యక్రమణ దశాలిక రామత్రయ విష్ణురూపధర తత్త్వత్రయ ప్రణవాధార తచ్చిఖానివిష్ట స్వాహాస్వధావషట్” ఇది నృసింహాసహస్రాక్షరి తరువాత నేత్రవర్మాస్త్రముల నుచ్చరించవలయును. “ప్రాణాధార ఆదిదేవ ప్రాణాపాన నివిష్టిత పాంచ రాత్రిక దితిజవినిధనకర మహామాయా అమోఘ దర్యదైత్యేంద్ర దర్పదళన తేజోరాశికి తేజస్వర పురురూపాయ సత్య పూరుష” అని పలుకవలయును. అస్త్రతారము అచ్యుతాస్త్రము తారము వాక్కుచే 'సుదేవ ఫట్' అనునది.

 తారామాయామూర్తికి ‘ఫట్ వః కామః” అనునది స్వర్గాదిమము. మూర్తి అస్త్రము బీజము అవ్యయ . అనునది విశ్వమూర్తే అస్త్రమవ్యయము. “మాయీ విశ్వాత్మనే” అని షట్ తారము శౌచము తురాత్మను. “ఫట్ తారోఽహం. వీశ్వరూపిన్ అనునది అస్త్రము తరువాత హై అనునది తారము పరమాంతమున ప్రాంస ఫట్ ప్రణవము పలికిన తరువాత “హ్రః హిరణ్య గర్పరూపధారణ అనుదాని తరువాత ఫట్ అనునది ధ్రువము. “హౌం అనౌపమ్యరూపధారిణే” అనునది అస్త్రము తరువాత ధ్రువము “క్షౌం నృసింహరూపధారిన్ ఓం క్లం శ్రః” అనునది తరువాత ధ్రువము “క్షౌం నృసింహ రూపధారిన్ ఓం క్లం శ్రః” అనునది సంకరము ఖండద్వయము ఖాదయద్వయము క్లీం సాధ్యము. ఆనయ ఆనయ మహాత్మన్ సమ్యగ్లర్శయ దర్శయ” అని షడ్జీర్జాడ్యమగు స్వబీజము క్షపితాంతము కల్మష ఉత్తరాయ ద్వయము పంచ బాణబీజములను ఉచ్చరించవలయును. నృసింహజ్వాలాత్మనే స్వాహా " అని పలుకవలయును. నృసింహకాలాత్మనే స్వాహా” అని ధ్రువము. ఆకాశబీజము, కొమబీజము, లక్ష్మీబీజద్వయము మాయాజారాంతిమమగు ఈ మంత్రము సహస్రాక్షర సమ్మీ తము. ఈ మంత్రమునకు ముని కపిల మహర్షి జగతీ ఛందస్సు. శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవత క్రైం బీజము. శక్తి స్వాహా శ్వేత వర్ణము ఉదాత్త స్వరము పరమాత్మ క్షేత్రము అఖిలాప్తి కొఱకు వినియోగము. “క్షః సహస్రబాహవే సహస్రాయుధ ధరాయ నృసింహాయ స్వాహా అస్త్రాయ ఫట్” అనునది మంత్రము. ఈ మంత్రముచే కరశుద్ధిని చేసుకొని అంగన్యాసము చేయవలయును. క్షాం అనునది తారము. సహస్రాంతమున క్షర శబ్దము వలన విజృంభితము. “నృసింహాయ స్వాహా” అనునది హృదయ మంత్రము. మారః క్షీరం మహాతనుప్రభావికరన్న సింహాయ స్వాహా అనునది శిరో మంత్రము.. కూం, అనునది తారము. తప్త సింహాయ అనునది నేత్రములనుండి కేశాంతము వరకు ఉచ్చరించవలయును. జ్వలత్యావకలో కూర్మో దీర్ఘ వజ్రాదినఖస్పర్శదివ్య సింహా భగవన్ మహాధ్వస్త జగద్రూప నృసింహాయ స్వాహా అనునది శిఖామంత్రము. తరువాత కవచము. క్షేం అనునది తారము.

“సహస్రబాహవే సహస్రాయుధాయ నృసింహాయ స్వాహా” అనునది అస్త్రమంత్రము. తరువాత నృసింహస్వామిని ధ్యానించవలయును. ఉదయించు సహస్రసూర్యులకాంతి గలవాడు. త్రినేత్రుడు, భీమభూషణుడు, సుతీక్షాస్రభుజుడు దైత్యదొరణకుడగు నృసింహస్వామిని స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి ఒక సహస్రము నేయి కలిపిన పాయసముచే హోమము చేసినచో మంత్రము సిద్ధించును. పూర్వోక్త వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి నృసింహస్వామిని చక్కగా పూజించి తరువాత అంగపూజను గావించవలయును. చక్రమును, శంఖమును, పొశమును అంకుశమును, కులిశమును, గదా కృపొణక్ష్వీడములను దలములందు పూజించవలయును. లోకపాలకులను వజ్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్ర సిద్ది లభించిన తరువాత ప్రయోగములను చేయవచ్చును. భస్మమును మంత్రించి గ్రహగ్రస్తునికి లేపనము గావించవలయును. భస్మ లేపనము వలననే సర్వగ్రహవినాశము జరుగును. ఈ విధానము చేతనే యక్షరాక్షస కిన్నరులు భూత ప్రేత పిశాచములు నశించును. సంశయముతో పనిలేదు. ఈ మంత్రముచే మంత్రించిన భస్మమును లేపనము చేసినచో పరాభిచారకృత్యములు కూడా నశించును. శుభదినమున సర్వతోభద్రమండలమున కుంభమును స్థాపించి తీర్థజలముచే నింపి అష్టోత్తర శతమును జపించవలయును. ఆ జలముచే అభి షేకము చేయబడిన మానవుడు అన్ని ఆపదలనుండి విముక్తుడగును. ఇంకా ఏమి చెప్పవలయును ఈ మంత్రరాజము సకలాభీష్టప్రదము “వజ్రనఖాయ విద్మహే తీర్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహః ప్రచోదయాత్” అనునది నృసింహగాయత్రి. ఈ గాయత్రి సర్వాభీష్టప్రదాయిని ఈ నృసింహగాయత్రిని స్మరించినంత మాత్రముననే సర్వపాపక్షయము జరుగును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమునగ బృహదుపాఖ్యానమున తృతీయపాదమున నృసింహోపాసనా మంత్ర గాయత్ర్యాది నిరూపణమను డెబ్బది యొకట - అధ్యాయము సమాప్తము.