నారద మహా పురాణము - పూర్వార్థము
88 - రాధాది మంత్ర నిరూపణమ్
సూతమహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తములారా? ఇట్లు దేవజ్ఞానముగల నారదుడు అన్ని అవతారముల యొక్క మన్రో ధ్యానపురస్సరముగా పూజా విధానమును విని సర్వాది దేవత జగన్మాతయగు రాధాదేవి యొక్క అవతార కలా సమర్చనమును వినయముతో నడిగెను.
నారద మహర్షి పలికెను :
ఓ మునిసత్తమా? జగన్మాతల మంత్ర వైభవమును విని నేను ధన్యుడనైతిని. అనుగ్రహించబడితిని. లక్ష్మి మొదలగు అవతారములను చెప్పిన విధముగా రాధావతారముల వైభమును వినగోరుచున్నాను. ఎన్ని అవతారములు? ఏయే రూపములు? ఎంత ప్రభావములు కలవి? ఆరాధావతారము లనన్నింటిని అశేష సిద్ది ప్రదములను తెలుపుము. ఇట్లు నారద మహర్షి పలికిన మాటలను వినిన బ్రహ్మ పుత్రుడగు సనత్కుమార మహర్షి. రాధాపాద పద్మములను ధ్యానించి ఇట్లు పలికెను.
సనత్కుమార ఉవాచ:
సనత్కుమార మహర్షి పలికేను :-
ఓ బ్రాహ్మణోత్తమా ! పరమ రహస్యమగు, సేవించు వారికి ఇష్టపదమగు రాధావతార చరితముల చెప్పెదను వినుము. రాధా దేవికి చంద్రావతి లలితయను ప్రియ సఖులిరువురు. మాలావతి మొదలగు ఎనిమిది మందికి చంద్రావతి ఆధీశ్వరి. కలావతీ మొదలగు ఎనిమిది మందికి లలిత అధీశ్వరి. రాధాదేవి పూజా ప్రకరణమున మాలావతీ మొదలగు వారి నామములను చెప్పితిని. కలావతీ మొదలగు వారి నామములనిపుడు చెప్పెదను. కలావతి, మధుమతి, విశాఖ, శ్యామల శైబ్యా, బృందా, శ్రీధరా అనువారలు అందరు లలితా సమరూపులు. సుశీల మొదలగు వారు మరికొంతమంది ముప్పదిరెండు మంది చెలులు చెప్పబడిరి. ఇపుడు వారి పేర్లను చెప్పెదను వినుము. సుశీల, శశిరేఖ, యమునా, మాధవి, రతి, కందబమాల, కుంతీ, జాహ్నవీ, స్వయంప్రభ, చన్రానన, పద్మముఖీ, సావిత్రి, సుధాముఖి, శుభా, పద్మా, పారిజాత, గౌరిణి, సర్వమంగల, కాలికా, కమలా, దుర్గా,విరజ, భారతీ, సురా, గంగా, మధుమతి, సుందరీ, చందూ, సతీ అపర్ణా, మనసానన్హా, అనువారలు ముప్పది రెండు మంది రాధికా ప్రియ సఖులు, ఒకపుడు లలితాదేవి పుంరూపమును ధరించి కృష్ణరూపము గలదై పదునారు కలలను సృజించెను. వారందరు లలితా సమకాంతులు. వారి మంత్రమును, ధ్యానమును, యంత్రారాదిక్రమమును సర్వతంత్ర రహస్యమును చెప్పెదను వినుము. వాతము, మరుత్తు, అగ్ని వహ్నలు, ధరాక్ష్మలు, జలచారిణులు, విముఖము, చరశుచి విభువన స్వశక్తులు, స్వరములు, ప్రాణము తేజస్సు, స్థిర, వాయువు, ప్రభ జ్యకు అభ్ర వాదములు, దావకము, పొధము, వ్యోమరయము, శిఖి, గోత్రములు, తోయము, శూన్యజవీద్యుతి, భూమి, రసము, నమస్సు, వ్యాప్తము దాహము, రసాంబు, వియత్ స్పర్శము, హృదయము, హంస, హలాద్రాసము హలాత్మికలు, చంద్రావలి లలితా అనువారలు హంసేలలు నాయికలు. స్వయముగా శక్తి స్వరూపిణియగు రాధ స్వయముగా గ్రాసస్థిత. మిగిలిన వారు పదునారు కలలు. వారి కలలు ముప్పది రెండు మంది. వీరిచేతనే సకల వాజ్మయము వ్యాపించియున్నది. లలితా ప్రముఖులు షోడశత్వమును పొందిరి. శ్రీ రాధా సుందరీదేవి తాంత్రికులచే చెప్పబడినది. కురుకుల్ల వారాహి చంద్రాలలితలు ఇద్దరు. వారిద్దరు కలిసియున్న మన్ల వర్గమును నీకిపుడు చెప్పెదను. హత్పాణ ఇలా హంస దోహవహ్ని స్వములచే లలిత చెప్పబడినది. హంస భేదముచే త్రివిధము. యథాక్రమముగా ఆ భేదములను వినుము. మొదటిది హంసాద్యముచే నుండును. మధ్యమము ఆదిమధ్యస్థ హంసచే ఏర్పడును. మూడవది ప్రకృతి. నాలుగవది అంత్యమాయచే నేర్పడును. ఈ నలుగురిలో నాలుగవది ముక్తికి, మిగిలిన ముగ్గురు సంపద కొరకు చెప్పబడిరి. ఇట్లు త్రిపుర సుందరీ విద్యలను చెప్పితిని. దాహభూమి రసాక్ష్మ స్వములచే వశినీ బీజము, చెప్పబడినది. రసాశక్తియుతమగు ప్రాణము కామేశ్వర్యక్షర మంత్రము, శూన్యము అంబురసా వహ్ని స్వములచే యుక్తము మోహినీ మంత్రము. రసాక్ష్మా స్వయుతముగా వ్యాప్తమగునది. విమలాబీజము. జానభోదాహ వహ్ని స్వయోగములచే అరుణా మంత్రము, జయినీ మంత్రము అంతట జయప్రదము. నబోదాహసహితమగు జలము వ్యాప్తస్వయుత మంత్రము సర్వేశ్వరి సర్వసిద్దికరముగా చెప్పబడినది. నభోదాహవహ్ని స్వయుతమగు గ్రాసము కౌలినీ మంత్రము. ఇట్లు వర్గసంయుతములగు శక్తులు గల ఎనిమిది మంత్రములచే వాగ్దేవతాంతముగా న్యాసము చేసిన దేవ్యాత్మకమగును. రంధ్రమున, ఫాలమున, ఆజ్ఞయందు, గలమున, హృదయమున న్యాసము చేయవలయును. నాభియందు ఆధారము నందు, పాదద్వయమున మూలాగ్రావధిగా షడ్జీర్జాఢ్య బీజముచే షడంగ న్యాసము చేయవలయును. లోహితవర్ణ, బాణా చాప పాశసృణులను కరములచే ధరించిన, కామ రాజాంక యంత్రిత, ముదితయగు లలితను ధ్యానించవలయును. మధ్యస్థ దేవి ఒక్కతే షోడశాకారములచే నుండును. కావున ఆ దేవి శరీరము నందే మిగిలిన పదిహేను మందిని ఆర్చించవలయును. శివఋషి. లలితాదికలు దేవతలు. నిత్యములగు. అందరి నామసంచయమున ఆవృతులను, పదమున చేయు ప్రయోగములను ముందు సవిస్తరముగా చెప్పెదను.
ఇపుడు షోడశ సఖీ సముదాయమున రెండవదియగు కామేశ్వరియను దేవతను సర్వకామప్రదను గూర్చి చెప్పెదను వినుము. స్వయుతమగు శుచీ మొదటిది. లలిత రెండవది. అగ్నియుతమగు శూన్యము తరువాత రయో వ్యాప్త సంయుతము. రసాన్ని సహితమగు ప్రాణము చరాన్వతమగు శూన్యయుగ్యము. వీటి దాహముచే సమయోజిత మగు నభోగోత్రములు చరసంయుక్తమగు అంబు, నవశక్తి యుతమగు హృదయము. ఇదియే నిత్యమగు రామేశ్వరి. సర్వకామప్రదా ఏకాదశాక్షరి. మూల విద్యక్షరములచే క్రమముగా అంగకల్పన చేయవలయును. హృదయమును శ్లోకమును ఒక దానితో, ద్వయము వలన ద్వయమును, నాలుగింటితో నయనమును, ఒకటితో అస్త్రమును కల్పించవలయును. నేత్రత్రోత్రనాసిక్ జిహ్వాహృదయగుహ్యకము లందు మూడ్డాది పాద పర్యంతము సర్వాంగములందు వ్యాపకముచే విద్యాక్షరములను ఈ స్థానములందుంచవలయును. తరువాత ఉక్తక్రమముచే సమస్తముచే వ్యాపకము నాచరించవలయును. ఇక ఇపుడు నిత్యపూజలలో చెప్పబడిన న్యాసమును చెప్పెదను. ఈ ధ్యానముచే కామేశ్వరీ దేవి ప్రసన్నురాలై అప్రయత్నముగా ఇష్టముల నిచ్చును. ఈ కామేశ్వరీ దేవి బాలార్కకోటి సంకాశ, మాణిక్యముకుటోజ్జ్వల. హారశైవేయ కాంచీ ఊర్మికా నూపు రాదులచే అలంకరించ బడినది, రక్త వసన, రత్నా భరణ శోభిత, షడ్భుజ, త్రినయన, ఇందు కలా కలిత మౌలిక, పంచాష్ట షోడశ ద్వన్ద్వ షట్కోణ చతురస్రగత, మందస్మిత లసద్వక్ర, దయా మంధర వీక్షణ, పాశాంకుశ పుండ్రేక్షు చాప పుష్పేషు ధారిణి, సీధు పూర్ణరత్న పాత్రను, వరదమును ధరించినది, యగు దేవిని ధ్యానించవలయును. తరువాత సాధకుడు మంత్రము సిద్ధించిన తరువాత ప్రయోగములను చేయ వచ్చును.
భగమాలిని యను పేరు కల మూడవ దేవతను చెప్పెదను. కామేశ్వర్యాది ఆదియగును. రసము అపస్థిర రసము. చర సహితమగు ధరాయుక్కు తరువాత స్థిర. తరువాత రసము. అగ్ని సంయుక్తములగు స్థిరాశూన్యములు. తరువాత రసము భూ సహితయగు స్థిర. గోత్ర. సదాహమగు అగ్ని రసము. స్థిర మరుద్యుక్తమగు నభస్సు, రసవర్ల సమన్వితము. తరువాత రసము, స్థిర. తరువాతి మరుద్యోజితము హంస చరమగు అంబు మరల రసము. మరల స్థిర. ధరాన్వితమగు స్థిర, చరమగు వ్యాప్తముచే హంసము. రసము. స్థిర వ్యాప్తము. భూయుతమగు శూన్యము. అగ్నియుక్కు రసయుతము. తరువాత హృదయము హంస రసము. స్థిరాంబు. స్వయుతమగు వియత్ ప్రాణము. అగ్నియుణ్ణహము రసము. స్థిర, క్షమ దాహ సంయుతము. సచరమగు జవీ పూర్వ విద్య. తృతీయాది నుండి క్రమముగా నుండును. తరువాత వర్ణ చతుష్టయము రసము స్థిర, అంబుయుక్ హృదయము క్ష్మా దాహము సచరము. జవీ హృదయము, దాహము అంబు మరుద్యుక్తము వ్యోమమున అగ్ని రసయుతము. మద్యుక్తమగు స్థిర, సాగ్నికభశ్చరములగు శూన్యము. వ్యాప్త మరుద్యుక్తమగు హంస. శూన్యము. వ్యాప్తమగు అంబువు. దయము. చరసమన్వితములగు దాహరయములు. రసము స్థిరము ప్రాణము. రసాన్ని సహితమగును. చరయుతమగు శూన్యయుగ్మము. మరల శూన్యయుగ్మ గోత్రవ్యసి దాహమరుద్యుక్త కాంబువుచే చరము. ప్రాణము, రసాచరయుతము గోత్రర్యసి దాహమరుద్యుక్త గోత్ర. ఇది అంటున్యాసము. భూయుక్తము అంబురహితము. చరసమన్వితము ధరాయుతగ్రాసము. శక్తి సమన్వితరసము. భూ సహితగ్రాసము. వ్యాప్తరసము హృదయము. అంబురహిత దాహము హృదయము అంబుమరుదన్విత రయము. కేవల శూన్యము రసము. సుచర స్థిర, అంబుయుత వియత్. అగ్నియుణ్ణహము. సయుతశుచి భూమి రసక్ష్మా స్వయుత ఇవన్నియు పంచెకాంతరితములు స్వసంయుక్తములు అయిదు ఇవి అన్నియు క్రమముగా జ్యోస చరమగు రసము భూమీన బోయుతము. చరయుత హంస రెండుమార్లు తరువాత ప్రాణమరసాగ్నియుతము. చరయుతమగు శూన్యయుగ్మము. చిరయుతమగు హృదయము. దాహాంబు మరుద్యుతము. వ్యోమాగ్ని సహిత రసము. మరుద్యుతస్థిర. సాగినభోయుత శూన్యము. చరసహితము. అంబునియత్తు. మరుద న్వితమగు నభస్సు. శూన్యము, వ్యాప్తము చరయుక్తము దయ దహ స్వవహ్నులచే సదాహమగుహంస అంబురసములు చరస్వములతో సంయుతమగును. సదాహ వహ్ని స్వయుక్తమగు హంస అంత్యముగా చెప్పబడినది. నిత్యయగు సౌభగమాలికా నూటముప్పది యేడక్షరములచే నుండును. మంత్ర వర్ణములచే అంగన్యాసము చేయవలయును. ఆద్యముచే హృదయము. నాలుగింటిచే శిరస్సు, మూడింటిచే శిఖ. గుణ వేదాక్షరములచే శిష్టాంగములు ఆరుక్రమముగా న్యాసము చేయవలయును. అరుణ, అరుణా కల్ప సుందరి, సుస్మితానన, త్రినేత్ర. షడ్బాహుయుక్త, కమలాసనము కప్లోర పాశ పుండ్రేక్షుకోదండములను పోమ బాహువులందు ధరించి, దక్షిణ బాహువులచే పద్మమును, అంకుశమును, పుష్ప బాణములను ధరించి ఇట్టి శక్తులచే చుట్టూ కూడుకొని యున్నది, స్తుతించబడు చున్నదై, ఇరాక్షరోక్తములచే స్మరోన్మాదమదాత్మలచే, కూడియున్నది. ఇట్లు జనమోహినియగు తృతీయ దేవత చెప్పబడినది. ఇక ఇపుడు నిత్యక్లిన్నయనబడు నాలుగవ దేవతను చెప్పెదను వినుము.
దాహవహ్నిస్వయుక్తమగు హంస మొదట చెప్పబడినది. కామేశ్వరి యొక్క తృతీయాది వర్ణాష్టకముండును. మరుద్యుక్తమగు హృదయము అంబువు ఏకాదశాక్షరి. విద్యావర్ణములచే అంగకల్పనము చేయవలయును. ఆద్యమస్త్ర వర్ణముచే హృదయ న్యాసమును, రెండు రెండు వర్ణములచే శేషాంగ న్యాసమును చేయవలయును. అంగుష్ఠ మూలాది నుండి కనిష్టాగ్రాంతము ఊర్థ్వగముగా న్యాసమును చేయవలయును. మిగిలిన దానిని వలయమున న్యాసము చేసి, హృదయ నేత్ర శ్రోత్ర నాసికా ద్వయమున, చర్మమున ధ్వజమున, పాయువున, పాదముల యందు వర్ణన్యాసమును చేయవలయును. అరుణ, అరుణా కల్ప, అరుణాంశుకధారిణి, అరుణ మాల్యాను లేపన, చారుస్మిత ముఖాంబుజ, నేత్ర త్రయలసదాస్య, ఘర్మజలముక్తా శోభిత ఫాలభాగ, మకుట లసదర్దేందుశేఖర, బాహు చతుష్టయముచే పాశాంకుశపానపాత్రాభయధారిణి, పద్మాసనాసీన, మదాలస, యగు నిత్యక్లిన్నను ఇట్లు ధ్యానమును చేయవలయును. ఇట్లు నిత్యక్లిన్నను గూర్చి చెప్పితిని. వనిత నవనీత దావాగ్ని, జయాదిచే స్వయుక్తభూమి దాహయుక్తమగు ప్రాణము, రసము, తద్యుక్తప్రభ, దాహయుక్త జ్యా, తద్యుతమగు నిత్యక్లిన్నాంత గద్వయము. ఇది నవాక్షరీ నిత్యా సర్వసిద్ధి ప్రదయగు భేరుండా. ప్రణవమును రద్వయమును వదిలి మధ్యలోనున్న షడక్షరములచే షడంగన్యాసముచేసి తరువాత వర్ణన్యాసమును చేయవలయును. ముఖ కంఠములందు రంధ్రాద్యములు హృదయ నాభులచే ధారయ ద్వయమును మాతృకాన్యాస పూర్వకముగా మంత్రాక్షర నవక న్యాసమును చేయవలయును. ఇక ఇపుడు సర్వార్థ సిద్ది ప్రదమగు దేవీ ధ్యానమును చెప్పెదను. తప్త కాంచన సంకాశ దేహ, నేత్రత్రయాన్విత, చారుస్మిత, చిత్రముఖి, దివ్యాలంకార భూషిత, తాటంకహార కేయూర రత్నస్త బక మండిత, రసనా, నూపురోరాది భూషణ రమ్య, పాశాంకుశ చర్మఖడ్గ గదావహ్ని ధనుశ్శరధారిణీ, పద్మాసనస్థ తత్సమానాకార తేజోతి సంయుతలగు శక్తులను కూడా భేరుండా దేవితో బాటు పూజించవలయును. ఈ శక్తులే విజయాదికలు. ఇట్లు పంచమీ దేవిని గూర్చి చెప్పితిని. ఈ దేవిని స్మరించినంతనే త్రివిధ విషములు నశించును. ఇక ఆరవదగు వహ్నివాసినీ విధానమును సుసిద్ధి ప్రదమును చెప్పెదను.
ఈ మంత్రమున భేరుండాద్యము ఆద్యమగును. తరువాత నిత్యక్లిన్నాధ్యముండును. తరువాత అంబుశూన్యమున హంసాన్ని ఉత్తమాంబు మరుద్యుతము. హృదగ్నియుత శూన్యము వ్యాప్తముచే శుచి చే యుతము. శూన్యము. ఇది నవాక్షరి. ద్వితీయ బీజముచే విద్యాస్వరములను దీర్ఘములను నియోగించవలయును. మాయాంతములను ఆరింటిచే కరాంగన్యాసమును చేయవలయును. విద్యా నవాక్షరములను నవరంధ్రములందున్యాసము చేయవలయును. సమస్తముచే వ్యాపకమును ఆత్మసిద్ధి కొరకు చేయవలయును. అన్ని విద్యలందు వ్యాపకముల నాచరించవలయును. తరువాత కాంచన, సంకాశ, నవయౌవన సుందరి, చారు స్మేర ముఖాంభోజ, నయనత్రయ శోభిత, అష్ట బాహుయుత, మాణిక్యాభరణోజ్జ్వల, పద్మరాగ కిరీటాంశుసంథిన్నారుతాంబర, పీతకౌశేయ వసన, రత్నమంజీరమేఖల, రక్త మౌక్తిక సంభిన్న స్తబకాభరణోజ్జ్వల, రత్నాబ్దకంబు పుండ్రేక్షు చాప పూర్ణేన్లు మండల ధారిణి, కహ్లారహేమ శృంగ పుష్పేష మాతులుంగములకు దక్షిణ కరములచే ధరించునది, స్వస్వ వామ శక్తులచే చుట్టుముట్టి యున్న వహ్ని విగ్రహయగు వహ్ని వాసినిని ధ్యానించవలయును. ఇట్లు వహ్ని వాసినిని ధ్యానించినచో జగత్తు వశమగును.
ఇక ఇపుడు ఏడవదగు మహా వజ్రేశ్వరీ మంత్రమును సాధకులకు సిద్ది ప్రదమగు దానిని చెప్పెదను. వహ్ని వాసినీ మంత్రములోని ద్వితీయమును నిత్యక్లిన్న మంత్రములోని చతుర్ధమును, భగమాలాద్యమును పంచమును, భేరుండా మన ద్వితీయమును, నిత్యక్లిన్నా ద్వితీయమును, షష్ణ సప్తములు తృతీయమును, అష్టమనవములను, పూర్వము అంతిమమును, ఒక్కొక్కటి రెండుగా, రెండు రెండును రెండుగా, మాయా పుటితమును చేసి షడంగ న్యాసమును చేయవలయును. ప్రత్యేకముగా శక్తి పుటిత మంత్రవర్ణములు పదింటిచే న్యాసమును చేయవలయును. నేత్ర శ్రోత్ర నాసా వాగ్వక్ష నాభిగుహ్యములందు క్రమముగా న్యాసము చేయవలయును. తరువాత రక్తవర్ణ, రక్తాంబర, రక్త గంధ మాల్య విభూషణ చతుర్భుజ, త్రినయన, మాణిక్యమకుటోజ్జ్వల, పాశాంకుశేక్షుచాప దాడిమి శాయక ధారిణి, దయా సుప్రీత శీతల నేత్ర, సాధకమగు అస్త్ర షట్కోణాబ్జ మహీపురమున చక్రమ ధ్యమున సుఖాసీన, స్మితాస్య, స్వస్వరూపములు గల శక్తులచే పరివృత, పీత మధ్యగత, సింహాసనమున అంతట పోతస్థశక్తులచే పరివృత, ఆ శక్తులచే యాతాయాత వినోదములకు చేయుచుండునది, అరుణాంభోధియందు మంత్ర నాయకమును చింతించవలయును. ఇట్లు సప్తమీ విద్యను చెప్పితిని. ఇక అష్టమి విద్యను వినుము.
ఆద్యము వజ్రేశ్వర్యాద్యము. ద్వితీయము అగ్నియుతము, మరుద్యుక్తాంబు క్ష్మాసంయుత గోత్రా వ్యాస శుచియుతమగు రయము. వహ్నివాసిని దూతి ఆత్యార్ణ అని చెప్పబడినది. షడ్ధిర్ఘ స్వరయుక్తముచే విద్యాషడంగ కల్పన చేయవలయును. విద్యా పుటితార్ణములచే శ్రోత్రాది పంచకమున న్యాసమును గావించవలయును. ఆరవ దానిని నాసిక యందు, విద్యతో వ్యాపకన్యాసమును చేయవలయును. నిదాఘ కాల మధ్యాహ్న దివాకర సమప్రభ, నవరత్న కీరీట, త్రినయన, అరుణాంబర, నానాభరణ సంభిన్నదేహ కాంతి విరాజిత, శుచిస్మిత, అష్టభుజ, మహర్షిస్తూయమాన, వామబాహువులచే పాశఖేట నదాపద్మరత్న చషకములను, దక్షిణ బాహువులందు అంకుశ ఖడ్గ కల్హార కమలములను ధరించునది, సాధకాభీష్ట దానోద్యమ సమన్విత, దుర్నీతి నాశినియగు దేవిని ఇట్లు ధ్యానించి పూజించవలయును. ఇట్లు నీకు సమస్తాపన్నివారిణి శ్రీకరి, శివతావాసకారిణి, సర్వార్థ సిద్ది దయగు దేవీ మంత్రమును చెప్పితిని.
ఇక ఇపుడు నీకు నవమి నిత్య త్వరిత నామము గల దేవిని గూర్చి చెప్పెదను. ఈ దేవి యశోవిద్యా ధనారోగ్య సుఖప్రదాయిని. ఆద్యము వహ్నివాసి న్యాది. ద్వితీయము దూత్యాది. హంస, ధరా, స్వయం యుక్తము చర సమన్విత తేజస్సు, ప్రభా చరయుత గ్రాసశక్తి సమన్విత వాయువు, హృదరయ దాహములచే వహ్నిస్వములు అష్టమము క్ష్మాఖయుత హంస, చరయుత గ్రాసము ద్వితీయము. నాదయుత ద్వితి. నిత్యా త్వరితా ద్వాదశాక్షరి. చతుర్ధవర్ణాది సప్తాక్షరములచే ఏర్పడు విద్య ఇది. యుగ్మ వర్ణములచే కరాంగములందు అంగన్యాసమును చేయవలయును. శిరోలలాట కంఠములందు, హృన్నాభ్యాధారకములందు, ఊరుద్వయమున, జాను ద్వయమున, జంఘాద్వయమున, పాదయుగ్మమున మంత్రాక్షరములను న్యాసమును చేయవలయును. ద్వితీయోపాంత్య మధ్యస్థ మంత్రాక్షరములచే, ఇతరములగు తారాద్యములచే న్యాసమును చేయవలయును. ఇక ఇపుడు సర్వసిద్ధి విధాయకమగు ధ్యానమును వినుము. శ్యామ వర్ణ శుభాకార, నవయౌవన శోభిత, ద్వీ ద్వికమముచే అష్ట నాగకల్పితా భరణ ప్రకాశములచే తాటంగద నూపుర వస్త్రములచే కూడి యున్నది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులచే భీమ విగ్రహులచే ధరింప చేయబడునది, పల్లవాంశుక సంవీత, శుభములగు శిఖిపిచ్ఛకృత వలయ భూషిత భుజ, మాణిక్యముకుటోజ్జ్వల, బర్హిబర్హ కృతాపీడ, బర్షి బర్హచ్చత్ర, బర్హిబర్హి పతాక, గుంజాగున లసద్వక్షః కుచకుంకుమ మండల, త్రినేత్ర, చారువదన, మందస్మిత ముఖాంబుజ, పాశాంకుశ వరాభీతి లసద్భుజ చతుష్టయ యగు తలాదేవిని ట్లు ధ్యానించి శక్తి పరివృతను పూజించవలయును. ఈ దేవి యందు ఫట్కారి శర చాప కరోజ్జ్వలగా శోభించును. ఫలదానమునచే సాధకులకు త్వరగా అభీష్ట ప్రదగా ప్రసన్నురాలగును. ఇట్లు నీకు నవమి విద్యా చెప్పబడినది. ఈ దేవి విఘ్న దుస్స్వప్న వారిణి, సర్వాభీష్ట ప్రదాయిని. స్వయుతమగు శుచి ఆద్యము. వహ్ని సమన్వితయగు రసము. ద్వితీయము ప్రాణము స్వయుతము, వన దుచ్చక్తులచే తృతీయము, ఇట్లు త్ర్యక్షరయగు నిత్యకుల సుందరిని చెప్పితిని. ఈ దేవిని స్మరించుటచే సర్వజ్ఞత్వము లభించును. ఇట్లు చెప్పబడిన మూడు వర్ణములచే షడంగన్యాసమును గావించవలయును. ఆది మధ్యావసానము లందు పూజా జపవిధి క్రమముచే ప్రత్యేకించి దీరస్వర సమన్వితములగు మూడు బీజములచే కరాంగ వక్రన్యాసమును గావించవలయును. ఊర్ద్వ ప్రాగ్దాక్షిణోత్తర పశ్చిమాధనామముల గల సువినద్యంతరములచే యధాక్రమముగా నదాత్మలందు, ఆధార రంధ్ర హృదయములందు మొదటి దానిని, రెండవ దానిని లోచన త్రయమున, తృతీయమును శ్రోత్రచిబుకములందు, చతుర్థమును ధ్రాణ తాలువు లందు, పంచమును అంస నాభులయందు, తరువాత పాణిపాద ద్వయము నందు, నవ వర్ణములచే తొమ్మిది విధములుగా మూల మధ్యాగ్రములచే న్యాసమును గావించవలయును. లోహితవర్ణ, లోహితా కారశక్తి బృష్ణ నిషేవిత, లోహితాంశుక భూషాస్రగ్లేపన, షణ్ముఖాంబుజ, అనర్ఘ్య రత్న ఘటిత మాణిక్యము కుటోజ్జ్వల, రత్న స్తబక సంభిన్న లసద్వక్షః స్థల, శుభ, కారుణ్యా నంద పరమ, అరుణాంబుజ విష్టర, ద్వాదశభుజ సంయుక్త, సర్వవాజ్మయి, ప్రవిలాక్ష ప్రజ, దక్షిణ భుజములచే పద్మ కుండికా రత్న చషక లుంగీ వ్యాఖ్యాన ముద్రికలను, దక్షిణ బాహువులచే పుస్తకమును, అరుణోత్సలమును, సువర్ణ లేఖినిని, కంబురవరమును ధరించునది. అంతటా దేవగంధర్వ కిన్నరులచే, యక్షరాక్షస దైత్యర్షి సిద్ద విద్యాధరాదులచే స్తుతించబడునది. యగు దేవిని ఇట్లు ధ్యానించి వాగ్లక్ష్మీ కాంతి సిద్ధి కొరకు పూజించవలును. కేవల వాక్సిద్ధి కొరకు సీత వర్లను, సంపద కొరకు హేమప్రభను, శత్రు ద్వేషమునకు మృతికి నిగ్రహమునకు ధూమ్ర వర్లను, మూకీకరణము కొరకు నీల వర్ణను ధ్యానించవలయును. ఆయా కోరికల కొరకు ఆయా వర్ణములు గల దేవిని ధ్యానించవలయును. ఇట్లు నీకు దశమియగు కులసుందరి చెప్పబడినది. నిత్యానిత్యయగు ఏకాదశి త్రికూటను ఇప్పుడు చెప్పెదను.
హృత్ప్రాణ రసాదాహ కర్ణ సమన్వితమగు హంస సంప్రదాయ బద్దముగా కులసుందరిచే యోజితము. నిత్యా నిత్య త్రివర్ణములు గలదీ మంత్రము. ఆరుకూటాక్షరములచే కూడి యున్నది. ప్రతిలోమాది రూపములచే డెబ్బది రెండు భేదములు కలది. ఈ దేవిని సేవించుట వలన నరుడు సుఖవంతుడై ఖేచరుడగును. నిగ్రహానుగ్రహ సమర్థుడగును. దీర స్వర సమేతలగు హంస హృదయములచే షడంగ కల్పన చేయవలయును. క్రమముగా భ్రూమధ్యమున కంఠహృన్నాభి గుహ్యాధారములందు క్రమముగా బిందుయుతములగు విద్యాస్వరములను న్యాసము చేయవలయును. యధావిధిగా సమస్తముచే వ్యాపకము నాచరించి, సమస్త సంపత్తి కొరకు సర్వాత్మయగు శివను ధ్యానించవలయును. ఉద్యద్బోస్కర బింభాభ, మాణిక్యముకుటోజ్వల, పద్మరాగకృతాకల్ప, అరుణాంశుక ధారిణి, చారుస్మిత లస ద్వక్త షట్సరోజ విరాజిత, ప్రతిముఖమున మూడు కన్నులు కలది, ద్వాదశ బాహుయుత, పాశాక్ష గుణ పుండ్రేక్షు చాపఖేట త్రిశూలములను వామహస్తమున, అంకుశ పుస్తక పుష్పేషు పంకజ న్న కపాలాభయములను దక్షిణ హస్తమున ధరించి యున్నది యగు దేవిని ఏకాగ్రచిత్తముచే ధ్యానించివలయును. ఇట్లు ఏకాదశీ విద్యను చెప్పితిని. ఇపుడు ద్వాదశీ విద్యను వినుము. త్వరతోయాంత్యము ఆద్యమగును. యుతి దోహచరస్వయుక్' హృదయము దాహక్ష్మాస్వయుతము, వజ్రేశీ పంచమము, స్వయుక్త మధురము మధ్యాఢ్యము దశమి పరముగా రసక్ష్మాస్వయుత భూమి, వజ్రేశీ అనునది అష్టమము త్వరితా షడక్షరములు తృతీయము దాహచరస్వయుతమగు ద్యుతి ఈ మంత్రమునకు ఆద్యము. తరువాత నీల పతాకయనునది సప్తదశాక్షరి. ద్విద్వీపక్షా సడ్వర్ణములతో మంత్రోళములచే అంగకల్పన చేయవలయును. శ్రోత్రాది నాసాయుగలమును వాక్కుయందు, కంఠమున, హృదయమున, నాభియందు, ఆధారమున, పాద సంధులందు క్రమముగా మంత్రాక్షరములను పదిహేడింటిని న్యాసము చేయవలయును. యథావిధిగా సమస్తముచే వ్యాపకము నాచరించవలయును. ఇంద్ర నీలనీభ, భాసన్మణి మౌళి విరాజిత, పంచవక్ర, త్రినయన, అరుణాంశుక ధారిణి, దశహస్త, లసన్ముక్తా మణ్యాభరణ మండిత, రత్నస్తబక సంపన్న దేహ, చారుస్మితానన, వామకరముల, పాశ పతాక చర్మ శార్ణ చాప వరములను, అంకుశ శక్తి ఖడ్గ బాణాభయములను దక్షిణ కరముల ధరించియున్న పద్మవిష్టరాసీన, స్వాకార వర్ణవేషాస్య పాణ్యాయుధ విభూషణములు గల శక్తి బృందముచే పరివృత యగు దేవిని నిత్యార్చనా క్రమమున ధ్యానించ వలయును. త్రిషట్కోణయుతమగు పద్మము, దానివెలుపల అష్టపత్ర పద్మము, దాని వెలుపల అష్టాసము, భూపురద్వంద్వావృతము తత్పురయుగ్మకము చతుర్షారయుతము, దిక్కులందు శాఖా సమన్వితముగా చేసి నామావృత శక్తిని గణములతో అచట పూజించ వలయును. ఇట్లు నీలపతాకిని యను ద్వాదశ విద్యను చెప్పితిని. నీల పతాకిని సమరమున విజయమును ఖడ్గ పాదుకాంజన సిద్దులనిచ్చునది. బేతాల యక్షిణీ ఖేట పిశాచాది ప్రసాధిని. నిధానబిల సిద్ధాన్న సాధినీ, కామ చోదిత, ఇపుడు త్రయోదశ విద్యను చెప్పెదను వినుము. రసము నభస్సు దాహము వ్యాఘ్రక్ష్మావన పూర్విక, ఖయుక్తముగా నిత్యయుండును. విజయా ఏకాక్షర. దీర్ఘ స్వరయుక్తములగు విద్యావ్యంజనములచే చతుష్టయమును, మిగిలిన వాటిచే ద్వయమును, కరాంగములందు షడంగ కల్పన చేయవలయును. జ్ఞానేంద్రియములగు శ్రోత్రాదులందు చిత్తమున న్యాసము చేయవలయును. క్రమముగా బిందుయుతములగు అక్షరముల నుంచవలయును. మిగిలినదంతయు పూర్వమువలెనే ఆచరించవలయును. పంచవక్ర, దశభుజ, ప్రతివక్షమున త్రిలోచన, భాస్వన్మకుట విన్యాస చంద్రలేఖా విరాజిత, సర్వాభరణ సంయుక్త పీతాంబర సముజ్జ్వల, ఉద్యద్భాస్వద్బింబ తుల్య దేహకాంతి, శుచిస్మిత, వామ బాహువులందు శంఖ పాశ భేటచాప కప్లోరములను, దక్షిణ బాహువులందు చక్రాంకుశ ఖడ్గ సాయకములను మాతులుంగమును ధరించి, ప్రయోగమున భీమదర్శన, ఉపాసనలో అతిసౌమ్య సీంహాపరికృతాసన, వాఘారూఢ శక్తులచే పరీవృత, సమరమున పూజయందు, ఇతరత్ర సుఖాసన, పూజయందు శక్తులు కూడా సుఖాసనలుగా ఉండువారు, దేవీ సమస్తము సమాకారముఖ ప్యా యుధలు గా నుందురు. చతురస్ర ద్వయమునేర్పరిచి, చతుర్దారోప శోభితముగా, శాఖాష్టక సమోపేతముగా, పూర్వమువలె పూజించవలయును. దానిలోపల వృతయుగ్మాంతరమున అష్టకోణము నేర్పరచి, దానిలోపల షోడశదల సంయుతమగు పద్మమును ఏర్పరచి, అట్లే అష్టదల పద్మము నేర్పరిచి, అచట ఆ దేవిని ఆవాహించి ఆయా శక్తులచే కూడియున్న దానిని ఉపచారములచే చక్కగా ఆర్చించవలయును. ఇది త్రయోదశి విద్య. వాదమున, యుద్ధమున జయప్రద. ఇక ఇపుడు సర్వమంగల యను పదునాలుగవ విద్యను చేప్పెదను.
హృదంబు వన యుక్తమగు ఆకాశము నిత్యయగు సర్వమంగల. ఈమంత్రము ఏకాక్షరి. ఈ మంత్రముచే సిద్ధిని పొందిన వాడు ఖేచరుడగును. షడ్దర్షాఢ్యమూల విద్యను షడంగములందు న్యాసమును చేయవలయును. ఈ సర్వమంగలను నిత్యము. కనక సన్నిభను, ముక్తామాణిక్య భూషణను, మాణిక్యముకుటను, నేత్రద్వయముచే దయావీక్షణములు కలదానిని ద్విభుజను, పద్మాసనాసీన, అష్టషోడశపతో పేతమగు పద్మమున చతుర్ధార భూ సద్మయుగ్మకమున, దక్షిణ హస్తమున మాతులుంగ ఫలమును, వామకరముచే నిజ భక్తులకు ధనాదికములనిచ్చు దానిని, చుట్టూ స్వసమానులగు శక్తులచే కూడి యున్నదానిని, ఇతరులగు దెబ్బది యారు అప్సరసలచే కూడియున్న దానిని, ప్రయోగములందు, ఇతరత్ర సపర్యాసక్త శక్తులు కల దానిని ధ్యానించవలయును. ఇట్లు చతుర్దశ విద్యను చెప్పితిని. ఇక పంచ దశ విద్యను వినుము.
భూమి, శూన్యము, నభోయుతమగు భూమి, రసము, స్థిరాంబువు, అగ్ని యుతరయము, ఇజ్యాంబు మరుద్యుక్త రసామరుత్ మరుద్యుక్త నభస్సు, శూన్యమున సంయుతమున చరసహిత గోత్రాంబు పూర్వాక్షరము, అంబ్వగ్నులు, హృదయము, దొహాంబు రసోక్ష్మారయ హృత్స్వయుక్, మరుద్యుక్త హంస, దాహము, ప్రాణము, మరుద్యుతము, దాహము సాగ్ని ప్రాణచరములు, జ్యామరుత్సహితరయము, చరయుతాంబు, గోత్రా హృత్యాగ్ని జ్యాంబురసా స్వయుక్, రయము, సాగ్నిజ్యాంబు రసము, మరల ఇవియే జవీ, ఈ దాహముచే అవి రెండగును. హ్రస్వము దాహ మరుత్స్వయుక్, హంసము, సదాహవహిస్వము, దాహోష్మ స్వయుతము. అట్లే ఈ విద్యకు సప్తదాహము లుండును. అష్టమాద్యమములు అయిదు. ఉపాంత్యధ సిృతమునీలపతాకానంతరము త్వరిత, భేరుండాష్ట్రమం నవమము. జ్వాలామాలిని. నిత్యా అరువది మూడక్షరములు కలదిగా చెప్పబడినది ఒకటి, రెండు, నాలుగు, అయిదు చతుష్టయ దశాక్షరములచే మంత్రాక్షరములచే వరాంగములందు షడంగ న్యాసమును చేయవలయును. మిగిలిన వాటిచే వ్యాపకము నాచరించవలయును. తరువాత సనాతని, జ్వలజ్వలన సంకాశ, మాణిక్యముకుటోజ్జ్వల, షడ్వక్త, ద్వాదశభుజ, సర్వాభరణ భూషిత, పాశాంకుశ ఖడ్గఖేటములను, చాప బాణములను, గదాశంఖములను, శూలవహ్నులను, వరాభయములను కర పద్మములచే ధరించునది, స్వప్రమాణలగు శక్తులచే పరివృత చారుస్మిత లసద్వక్త సరోజ, త్రినయన యగు దేవిని ధ్యానించి, ఉపచారములచే పూజించవలయును. చతురస్ర ద్వయమును చతుర్హార సమన్వితముగా సశాఖ మష్ట పబ్లము నేర్పరచి, అంతరము త్ర్యసమును సిద్ధముచేసి, మధ్య భాగమున త్ర్యసము చేసి శివను పూజించవలయును. ఇట్లు పంచదశీ విద్యను చెప్పితిని. ఇక షోడశిని వినుము. వాయు ప్రణవతత్యములచే చిత్రామంత్రము అక్షర ద్వయాత్మకము. ఈ మంత్రము సిద్ధించినచో ధన ధాన్యాత్మ నిధి లాభమును కలిగించును. విద్యాద్యవాయువుచే దీర్ఘ స్వరయుతముచే షడంగ కల్పనను గావించవలయును. మంత్రముచేత మాతృకా న్యాసమును చేయవలయును. ఉద్యదాదిత్యబింబాభ, నవరత్న విభూషణ, నవరత్న కిరీట, చిత్రపట్టాంశు కోజ్జ్వల, చతుర్భుజ, నవరత్న విభూషణ, నవరత్న కిరీట, చిత్ర పట్టాంశు కోజ్జ్వల, చతుర్భుజ, త్రినయన, శుచిస్మితలసన్ముఖ, సర్వానందమయి, నిత్యా, సమస్తీప్సిత దాయిని, పాశాంకుశ వరదాభయములను నాలుగు భుజములందు ధరించియున్న, సర్వమంగల, పద్మకర్ణికాయోని మధ్యగను, అట్లే అదే చక్రము నందు ఆమెను చుట్టుముట్టి యున్న శక్తులను కూడా పూజించవలయును. ధరాయుక్తములగు ప్రాణ దాహములు, మరల రసము నందు ఆద్యము, మరుత్తు మరుచ్చక్తి యుతమగు వ్యాసము, స్వయుక్త భూమి, మరల త్రయము. ఈ మంత్రోద్యము రసాయుగ్మము చరణ ప్రయోజితము, దాహవహ్ని శక్తులచే కూడిన హంస, నభము హృత్ దోహాంబుజ్యా శూన్యములు స్వయుతాంబు, విషయుక్త మరుత్తు నభయుతమగు శూన్యము భూ వ్యాప్త హంస పూర్వాంత్యము ఈ మూడు మంత్రములు. ఈ మంత్రమునకు షష్టాది పంచవర్ణములు దైత్య ఆది యగును. ఏకాదశాక్షరముల తరువాతది రెండవ ఖండము చెప్పబడినది. మూడవది ఇరువది అయిదక్షరములు కలది. బాలా బీజత్రయాద్యములచే రెండు మూడు మంత్రములచే షడంగ కల్పన చేయవలయును. వికీర్ణకుంతల, నగ్న, రక్తవర్ణ, ఆనంద విగ్రహ, కరములలో బాణ చాప పాశసృణులను ధరించు దేవిని ధ్యానించవలయును. ఈ దేవితో సమానమైన ఆయుధాకార వర్ణములు గల వారు, ఋతు స్నాతలు, స్ఫురద్యోగులు సదానందారుణేక్షణలు యగుదేవులు చుట్టూ ఉందురు. వారిని కూడా పూజించవలయును. ఇట్లు నీకు కురుకుల్లాంతమున చంద్రావళిని చెప్పితిని.
లలితాదేవి యొక్క మరియొక రూపమైన వారాహీదేవిని గూర్చి చెప్పెదను. స్వయుతమగు శుచి, శూన్యము, నభోయుతమగు అభైరసస్థిరా, అంబుసాగ్నిరయము, మరుద్యుతాంబురయములు, ఇలాయుతాన్ని మరల మరుద్యుతాంబు, దాహాంబు మరుద్యుత హంస, అగ్నియుత త్రయము, మరుద్యుక్తాంబ దాహములు, ధరాయుక్త హంస, నభస్సు, అగ్నియుత తేజస్సు, మరల అయిదు,, స్వయుత వాతము, చరయుత తోయము, తత్పూర్వము అగ్నియుత తోయము, వ్యాప్తముచే శుచిచే శూన్యము శక్తినబోయుతమగు దాహము ధరా, స్వసహితతోయము చరసమన్వితము, ఇది పూర్వమనువు. దీని తరువాత చతుష్టయము. జ్యాయుక్త సచరము రభము చర పూర్వకము అగ్నియుతరసము తోయ రహిత చతుష్కము. అభ్ర చరయుత శుభము స్వయుతము సపూర్వకము హంసము, అగ్నియు హంసము మొదట త్రితయము, స్వసమాయుత హృదయము చర సహితరసము, తత్పూర్వము రసయుతాగ్ని. తరువాత ఉక్తృతయము వాతము ధరానభస్సు. స్వయుత ప్రాణము హృదయము, స్వయుత రసము, ఏతత్రయ వ్యాప్తము దాహాంబు యుతము. గోత్రా, భరాయుత స్పర్శము నాద యుక్తము, జవీయుతము, దాహముచే పూర్వ పూర్వము, మరుద్యుత పూర్వము, స్వ సహిత మరుత్తు శూన్యము హృద్ధాహాంబువులచే చరము, స్పర్శను స్వసహితమరుత్తు, హృదయము దాహముతో, అంబు సంయుతము, స్వసంయుతమగు జ్వాలాన్ని హంసము, మరుద్యుతాంబు హృద్రూపమగు స్వయుతరసము, ధరాయుక్త ప్రాణ దాహములు, మరల ప్రాణ దాహములు వహ్నియుక్త వియత్తు, అంబు, దాహము, స్యాది షష్ట్యా స సంయుతము. మొదట చెప్పబడిన వర్ణములు, స్వయుత శుద్ది, స్థిరా, రసా, స్వయుతము దావములు, హంసలు , స్వయుతధరా, నాదవతియుతి, హృదంబు మరుతా యుతము, మరుద్యుత హంసము, ఇట్లు ఈ మంత్రము నూటపది అక్షరములు గలది. వారాహీ, పంచమి, విశ్వ విజయా, భద్రాకౌముదీ, వార్తాలీ అనుపేర్లచే ప్రసిద్ధి పొందినది. స్తంభనాది సకలాభీష్టప్రద. ఏడు, ఆరు, పది, ఏడు, ఏడు మంత్రాక్షరములచే అంగకల్పనమును చేయవలయును. త్రికోణ, వృత్త, షట్కోణ వృత్త ద్వయ సమన్వితముగా చక్రమును ఏర్పరచి, అచట స్వనామమును లిఖించి, పూజించవలయును. అట్లే కీలాస్య, కాంచన సన్నిభ, ఆ కంఠం వనితారూప, జ్వలత్పింగ శిరోరుహ, త్రినేత్ర, అష్టహస్త, చక్ర శంఖ గదా అంకుశ, పాశ, ముసల శీర్ష ఆభయ వరద ముద్రలను హస్తముల ధరించియున్న, గరుడస్కంధమున సుఖాసీనయగు దేవిని ధ్యానించవలయును. నిత్య పూజయందు ఆ దేవిశక్తులను తత్సమానులను స్మరించవలయును. ప్రయోగములందు సింహస్థనుకాని, వ్యాఘ్రగామిని కాని, గజారూఢను హయారూఢను, వృషభారూఢను శక్తి సంయుతను ధ్యానించవలయును. శ్యామ అరుణ పీతను, దుర్గమ మార్గమున శ్యామను, యుద్దమున శత్రునాశమునకు సీతను, ఉచ్చాటనమున ధూమ్రవర్లను ధ్యానించవలయును. ఇట్లు షోడశ నిత్య దేవతలను నీకు పూజా విధానముతో వివరించితిని. ఈ దేవతలందరు తమను సేవించువారికి అభీష్టప్రదలు, సర్వపాప క్షయంకరలుగా తెలియుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున రాధాది మంత్ర నిరూపణ మను ఎనుబది ఎనిమిద - అధ్యాయము సమాప్తము.
