నారద మహా పురాణము - పూర్వార్థము
112 - ద్వాదశ మాస తృతీయావ్రత కధనమ్
పెట్టవలయును. అర్యముల నిచ్చి వాయనముల నిచ్చిన తరువాత భోజనము చేయవలయును. సర్వకామ సమృద్ధి కొరకు ఆ ఫలమును కంఠమున ధరించ వలయును. తరువాత ప్రొద్దుననే లేచి, అలంకారములను ధరించి సఖీజనముతో గీతవాద్య నృత్యములతో గౌరీదేవి ప్రతిమను నదిలో విడువవలయును. ఓ శుభప్రదులారా? నేనాహ్వానించితిని. యధావిధిగా పూజించబడితివి. నాకు సౌభాగ్యమునిచ్చి యధేచ్చముగా వెళ్ళుము. ఇట్లు భక్తితో వ్రతముచేసి బ్రాహ్మణాను గ్రహముతో దేవీ అనుగ్రహముతో ఇహలోకమున సకల భోగములననుభవించి దేహాంతమున గౌరీలోకమును పొందును. కార్తీక శుక్లతదియనాడు విష్ణురీ వ్రతము నాచరించవలయును. జగద్వంద్యయగు దేవిని వేరు వేరు ఉపచారములతో పూజించి, ముత్తైదువకు భోజనము పెట్టి, మంగల ద్రవ్యములతో పూజించి నమస్కరించి విష్ణు గౌరీ సంతోషము కొరకు విడువ వలయును. మార్గశుక్ల తృతీయనాడు శుభకరమగు హరగౌరీవ్రతము నాచరించవలయును. పూర్వవిధానము ననుసరించి జగదంబికను పూజించవలయును. ఈ వ్రత ప్రభావము వలన ఇహలోకమున నచ్చిన భోగములననుభవించి అంతమున దేవీలోకమును చేరి దేవితో ఆనందించును. పుష్య శుక్లతదియనాడు బ్రహ్మగౌరీ వ్రతము నాచరించవలయును. పూర్వోక్త విధానముతో పూజించినచో బ్రహ్మగౌరీ అనుగ్రహము వలన బ్రహ్మగౌరీ లోకమున ఆమెతో కలిసి ఆనందించును. మాఘశుక్ల తృతీయనాడు సౌభాగ్య సుందరిని పూర్వోక్త విధానముచే నాలికేర జలమే నర్యమునిచ్చి పూజించవలయును. ఈ వ్రతముచే సంతోషించి ప్రసన్నురాలై తనలోకమును అనుగ్రహించును. ఫాల్గుణ శుక్ల తృతీయనాడు కులసౌఖ్యదా దేవిని గంధపుష్పాదులచే పూజించినచో సర్వమంగల ప్రదమగును. ఇట్లు అన్ని తృతీయా తిధులలో పూజా విధానము సాధారణముగానే యుండును. దేవీపూజ, విప్రపూజ, దానము, హోమము, విసర్జనము. ఇవియన్నియు సాధారణములు. ఇట్లునీకు తృతీయా వ్రతములను చెప్పితిని. ఈ వ్రతములను భక్తితో ఆచరించినచో మనోభిలాషలను ప్రసాదించును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున ద్వాదశమాస స్థిత తృతీయావ్రత కధనమను నూటాపన్నెండవ అధ్యాయము సమాప్తము.
