నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

23 - ఏకాదశీవ్రతమహిమానువర్ణనమ్.

సనకమహర్షి పలికెను :- మూడులోకములలో ప్రసిద్ధి నొందినది,సర్వపాపములను శమింపచేయునది, సర్వకామఫలప్రదము అయిన మరియొక వ్రతమును చెప్పెదను వినుము. ఇది బ్రాహ్మకతీయ వైశ్యశూద్రులలో స్త్రీలలో ఎవరు చేసిననూ మోక్షము నొసంగునది. విష్ణువునకు ప్రీతికరము. ఈ వ్రతము పేరు ఏకాగశీవ్రతము. ఇది సర్వాభీష్టప్రదము. ఈ వ్రతమును అన్ని విధములా చేయవలయును. ఈ ఏకాదశవ్రతము విష్ణు ప్రీతికరము. శుక్షకృష్ణపక్షములలోని ఏకాదశీ  తిథీన భోజనము చేయరాదు, అట్లు భుజించువాడు ఇహ లోకమున పాపమును పొంది పరమున నరకమును చేరును, ఉపవాసఫలమును పొందగోరువారు దశమిరాత్రి, ఏకాదశి రెండుపూటలు, ద్వాదశిన రాత్రి ఈ నాలుగు పూటలు భుజించరాదు. ఏకాదశీదినమున భుజించగోరువారు సర్వపాపములననుభవించగోరువాడని తెలియుము. ముక్తిని కోరువాడు దశమిన ఒకపూట, ద్వాదశీ తిథిన ఒకపూట, ఏకాదశీ తిథిన రెండుపూటలా నిరాహారముగా నుండవలయును. బ్రహ్మ హత్యాది మహాపాతకములన్నియు హరిదినమున అన్నము నాశ్రయించియుండును. బ్రహ్మహత్యాదిపాపముల కెట్లో నిష్కృతి లభించును కాని ఏకాదశీ తిథిన భుజించువానికి నిష్పతి లభించదు. మహాపాతకములు కలవారు కాని సర్వపొతకములు కలవారు కాని ఏకాదశీ తిథిన ఉపవాసమును చేసినచో పరమ పదమును పొందుదురు. ఏకాదశీ తిథి పరమపవిత్రమైనది. విష్ణువును ప్రీతిపాత్రమైన తిథి. కావున సంసారచ్ఛేదమును కోరువారు ఏకాదశీ తిథిని సేవించవలయును. దశమీతిథియందు ప్రాతఃకాలమున లేచి దంతధావన  పూర్వకముగా స్నానాదికములను నిర్వర్తించి ఇంద్రియనిగ్రహముతో యథావిధిగా శ్రీమహావిష్ణువునకు స్నానాదికమును చేయించి పూజించవలయును. ఏకాదశినాడు ఇంద్రియ జయముతో నిరహారముగా నుండవలయును. నారాయణుని స్మరించుచు శ్రీమహావిష్ణువు సన్నిధిలో శయనించవలయును. ఏకాదశీ తిథి నాడు స్నానముచేసి జనార్దనుని పూజించి గంధపుష్పాదుల నర్పించి ఇట్లు విజ్ఞాపన చేయవలయును.

 ఈ మంత్రమునుచ్చరించి దేవదేవుడగు శ్రీమన్నారాయణునకు ఉపవాసమును సమర్పించవలయును. (“ఓ పుండరీకాక్షా! నేను ఏకాదశిన నిరాహారముగా నుండి ద్వాదశీ తిథిన భోజనము చేయగలను. ఓ అచ్యుతా! నాకు రక్షకుడవు కమ్ము” అని మంత్రమున కర్థము). నియములతో దేవదేవుని ముందు నృత్యగీత వాద్యపురాణాదులతో జాగరణ చేయవలయును. తరువాత ద్వాదశీ తిథిన ప్రాతఃకాలమున లేచి స్నానముచేసి యథావిధిగా అర్చించవలయును. ఏకాదశీ తిథిన జనార్ధనుని పంచామృతముతో స్నానము చేయించవలయును. ద్వాదశిన క్షీరాభి షేకము చేయవలయును. అట్లు చేసినచో హరిసారూప్యమును పొందును.

అని శ్రీహరికి విజ్ఞాపన చేయవలయును. (“అజ్ఞానమను చీకటిలో గుడ్డివాడినైన నాకు ఈ వ్రతాచరణతో సుముఖుడవై ప్రసన్నుడవై జ్ఞానదృష్టిని ప్రసాదించుము” అని అర్థము). తరువాత శక్తి నననుసరించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణను సమర్పించవలయును. తరువాత పంచమహాయజ్ఞములనాచరించి బంధువులతో కలిసి మౌనముతో తాను భుజించవలయును. ఇట్లు పవిత్రమైన ఏకాదశీ వ్రతమునాచరించినవారు పునారవృత్తి రహితమైన శ్రీమహావిష్ణుభవనమును చేరెదరు.

ఉపవాసవ్రతము నాచరించు ధర్మ కార్యపరాయణులు చండాలురను పతితులను ఎప్పుడూ చూడరాదు. నాస్తికులను మర్యాదార హితులను, నిందించువారిని, కొండెములను చెప్పుచారిని, ఉపవాసవ్రతము చేయువారి పలుకరించరాదు. శూద్ర స్త్రీకి పుట్టిన వారిని పోషించువారితో, శూద్ర స్త్రీపతితో యజ్ఞాధికారములేని వానిచే యజ్ఞమును చేయించువానితో మాటలాడరాదు. భర్త ఉండగా జారుని వలన కలిగినవాని ఇంటిలో భోజనము చేయువారితో, గాయకునితో, ధనముతీసుకొని దేవార్చన చేయువానితో, డబ్బు తీసుకొని వైద్యము చేయువారితో,కార్యమును చేయువారితో దేవబ్రాహ్మణులను ద్వేషించువారితో పరాన్నము పై ఆశపడువారితో, పరస్త్రీ నిరతునితో మాటమాత్రముతోనైన సన్మానముగా వ్యవహరించరాదు. ఇటువంటి నియములను నాచరించి శుద్దుడై ఇంద్రియజయము కలిగి సర్వ హితమును కోరుచు ఉపవాసవ్రతమునాచరించినచో ఉత్తమ సిద్ధిని పొందగలరు. గంగాసమతీర్థము, మాతృసమగురువు, విష్ణుసమదైవము, నిరాహారమును మించిన తపము మరియొకటిలేదు, కముతో సమమగు తల్లి, కీర్తి సమమైన ధనము, జ్ఞాన సమమగు లాభము, ధర్మ సముడగు తండ్రి, వివేకసముడైన బంధువు, ఏకాదశిని మించిన వ్రతము లేదు. ఈ విషయమున ఈ ఇతిహాసమును చెప్పుచుందురు వినుము.

 భద్రశీలునికి భద్రశీలుని తండ్రి గాలవునికి జరిగిన సంవాదమును వినుము. పూర్వకాలమున గాలవుడను మహర్షి, పరమశాంతుడు, దాంతుడు, తపోనిధి నర్మదాతీరమున నివసించుచుండెను. ఆ నర్మదా తీరము నానావృకసమన్వితము. గజ భల్లూకాది మృగ ని షేవితము. సిద్ధచారణ గంధర్వయక్ష విద్యాధర సేవితము. కందమూలఫలముతో సమృద్ధము. ముని బృంద సేవితము. ఆచట గౌరవ మహర్షి చాలాకాలము నివసించేను. గాలవమహర్షికి భద్రశీలుడను కుమారుడు కలిగెను. అతడు సుప్రసిద్దుడు జితేంద్రియుడు. పూర్వజన్మ జ్ఞానము కలవాడు. మహానుభావుడు. నారాయణ భక్తుడు. మహామతియగు భద్రశీలుడు బాల్యక్రీడలలో కూడా మట్టి విష్ణుప్రతిమను చేసుకొని క్షణకాలము పూజించుచుండెడివాడు. సర్వకాలమున శ్రీమహావిష్ణువును పూజించవలయునని మిత్రులను బోధించుచుండెడివాడు. పండితులైన వారు ఏకాదశీవ్రతము నాచరించవలయును. ఓ మునీశ్వరా ! ఇట్లు భద్రశీలునిచే బోధించబడిన శిశువులు కూడా కలిసి విడిగా మట్టి శ్రీహరి ప్రతిమను నిర్మించుకొని విష్ణుభక్తి పరాయణులై ఆర్చించుచుండిరి. సర్వజిష్ణువుగు శ్రీమహావిష్ణువునకు నమస్కరించుచు సర్వజగములను శుభము కలుగ వలయునని కోరుచుండెడివాడు. క్రీడా సమయమున ఒక ముహూర్తము కాని ముహూర్తార్థము కాని ఏకాదశీ అని సంకల్పము చేసి శ్రీహరికి వ్రతమును సమర్పించెడివాడు. ఇట్లు సచ్చరిత్రగల కుమారుని చూచి గాలవ మహర్షి ఆశ్చర్యమునందినవాడై చక్కగా ఆలింగమును చేసుకొని ఇట్లు అడిగెను.

గాలవ మహర్షి పలికెను : మహానుభావా ! భద్రశీలా ! నీవు నిజముగా భద్రమగు శీలము గలవడమే. నీ  చరితము యోగులకు కూడా దుర్లభమగు మంగళకరము.  ఎల్లపుడూ హరి పూజను చేయుచు సర్వప్రాణి హితమును కోరుచు ఏకాదశి వ్రతము నాచరించుచు నిషిద్ధమైన దాని విడిచి సుఖదుఃఖములను పరిత్యజించి మమకార రహితుడవై శాంతుడవై హరిధ్యాన పరాయణుడవై యుంటివి. బాలుడవాన నీకు ఇట్టి . బుద్ధి ఎట్లు కలిగెను ? మహాత్ముల సేవ లేనిదే హరి భక్తి కలుగునది కాదు. సామాన్యముగా లోకమున మానవులకు అవిద్యవలన  కామ్యకర్మలయందాసక్తి కలుగును కదా ! నీ కెట్లు అలౌకికమైన బుద్ధి కలిగినది. మానవులకు సత్సంగమున్ననూ పూర్వజన్మ సుకృతము లేనిదే భగవద్భక్తి కలుగదు. అందువలననే నేను విస్మయమును చెందుచున్నాను. కావుననే ప్రీతిచెంది  అడుగుచున్నాను. కావున తెలుపుము. ఇట్లు తండ్రి అయిన గాలవమహర్షి ప్రశ్నించగా పుణ్యాత్ముడు పూర్వజన్మ జ్ఞానము కలవాడు అయిన భద్రశీలుడు ఆనందముతో విప్పారిన మోము కలవాడై తాను అనుభవించిన దానిని యథాతధముగా తండ్రికి తెలియపరిచెను.

 భద్రశీలుడు పలికెను :- “ఓ తండ్రీ ! మహామునీ ! నేను పూర్వ జన్మలో అనుభవించిన దానిని చెప్పెదను వినుము. నాకు పూర్వజన్మ జ్ఞానము కలదు కావున యమధర్మరాజు చెప్పినదానిని వినుము”. ఈ విషయమును వినిన గాలవ మహర్షి ఆశ్చర్యమునొంది ప్రీతితో మహామతియగు భద్రశీలుని గూర్చి ఇట్లుపలికెను.

గాలవ మహర్షి పలికెను :- ఓ మహానుభావా ! నీవు పూర్వజన్మలో ఎవరివి ? యముడు నీతో ఏమి పలికెను? ఎందువలన పలికెనో త్వరగా చెప్పుము.

 భద్రశీలుడు పలికెను : ఓ తండ్రీ ! నేను పూర్వము సోమవంశపురాజుగా ఉంటిని. నా పేరు ధర్మకీర్తి. నా గురువు దత్తాత్రేయ మహర్షి. తొమ్మిది వేల సంవత్సరములు రాజ్యపాలన చేసితిని. అధర్మములను ధర్మములను చాలా ఆచరించితిని. అంతట ఐశ్వర్యమదముతో చాల అధర్మముల నాచరింతిని. పాషండ జనుల మైత్రితో పాషండాచారము ననుసరించితిని. మొదట చాల పుణ్యములను సంపాదించితిని కాని పాషండులచే బాధించబడిన నేను వేదమార్గమును పరిత్యజించితిని. మాట యుక్తి విదుడనైన నేను చాల యజ్ఞములను ధ్వంసము చేసితిని. నేను అధర్మనిరతుడనగుట చూచి నా దేశప్రజలు కూడా ఎప్పుడూ అధర్మమునే ఆచరించుచుండిరి. ఆ అధర్మమునుండి ఆరవ భాగము నాకు చేరినది. ఇట్లు పాపా చారుడను, వ్యసనరతుడను అయిన నేను వేట మీద ఆసక్తి కలిగి ఒకసారి ఆడవికి వెళ్ళితిని, సైన్యముతో అడవిలో చాలా మృగములను చంపితిని. ఆకలిదప్పులు బాధించగా రేవానదీతీరమును చేరితిని. సూర్యకిరణతాపొరుడనైన నేను రేవానదీలో స్నానము చేసితిని. కాని నా వెంట నా సైన్యము చేరలేదు. సైన్యములేక ఒంటరినై ఆకలి దప్పికచే పీడించబడుచు రేవానదీ తీరవాసులను కొందరిని కలిసితిని. సాయంకాల సమయమున ఏకాదశవ్రతము నాచరించుచున్నవారిని చూచితిని. ఒంటరినైన నేను వారితో కలిసి నిరాహారముగా నుంటిని. సైన్యము లేనందున రాత్రి అంతయు జాగరణ చేసితిని, నడక బడలికతో ఆకలి దప్పులతో పీడించబడిన నేను జాగరణ చీరలో ప్రాతఃకాలమున మరణించితిని. అపుడు మహాదంష్టలతో భయంకరులైన యమభటులు నన్ను బంధించి బహుకష్టతరమైన మార్గముతో యముని సన్నిధికి చేర్చి ఆచట దంష్ట్రాకరాల వదనుడైన యమధర్మరాజును చూచితిని. అపుడు సమవర్తీ చిత్రగుప్తుని పిలచి “ఇతని చరితమును శిక్షను వివరించుము” అని పలికెను. ధర్మరాజు మాటలను వినిన చిత్రగుప్పుడు చాలాకాలమాలోచించి ఇట్లు పలికెను “ ఓ ధర్మరాజా ! ఇతడు వాస్తవముగా పాపాచారరతుడే. అయిననూ ఏకాదశీ తిథిన నిరాహారముగా నున్నచో అన్ని పాపములు తొలగును. ఇతడు వేటకై బయలువెడలి ఏకాదశీ తిథిన రేవానదీ తీరమున నిరాహారముగా నుండి జాగరము చేసెను. కావున ఇతని పాపములన్నియు తొలగెను. ఇతను చేసిన పాపములన్నియు ఏకాదశీ ఉపవాస ప్రభావముచే నశించినవి” ధీమంతుడగు చిత్రగుప్తు డిట్లు పలుకగా యమధర్మరాజు వినయముతో భక్తితో నాముందు దండవత్రణామునాచరించెను. భక్తి భావముతో నన్ను పూజించెను. తరువాత తన భటులనందరిని పిలిచి ఇట్లు పలికెను.

ధర్మరాజు పలికెను :- “ఓ దూతలారా ! నా మాటను వినుడు. మీకు హితమును బోధించెదను. ధర్మమార్గరతులై మానవులను నా వద్దకు చేర్చుకుడు. విష్ణుపూజా పరులను, భక్తులను, కృతజ్ఞలను, ఏకాదశీవ్రతపరులను, జితేన్టియులను “నారాయణ ! అచ్యుత ! హరే ! రక్షకుడవుకమ్ము” అని ఎప్పుడూ పలుకు శాస్తులను త్వరగా వదిలి పెట్టుడు. నారాయణా ! “అచ్యుత ! హరే ! జనార్దన ! కృష్ణ ! విష్ణో ! పద్మేశ ! పద్మజపిత! శివ ! శంకర” అని. ఎల్లపుడూ పలుకు అఖిల లోక హితకొంకులను, ప్రశాంతులను దూరము నుండియే వదులుడు. వారి విషయమున నా శిక్షలుండవు. అన్ని కర్మలను నారాయణు కర్పించు వారిని, హరిభక్తి గలవారిని, స్వాచారమార్గమున నడుచువారిని గురు సేవకులను, సత్పాతదాననీరతులను, దీనపాలకులను, హరినామ పరాయణులను వదిలి పెట్టుడు. పాషండ సంగమ:లేని వారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమునందు నందాస్తక్తి కలవారిని, అతిథిపూజ చేయువారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమునందు నందాసక్తి కలవారిని, అతిథిపూజ చేయువారిని, శివ విష్ణువులందు సమబుద్ధి కలవారిని, జనోపకారములను విడిచి పెట్టుడు. హరికథామృతమును సేవించువారిని, నారాయణస్మృతి పరాయణమౌనసులతో కలియుని వారిని, బ్రాహ్మణపాద జల సేచనముతో సంతోషించనివారిని, లోకులను ద్వేషించువారిని, హితజనులను అహితము నాచరించువారిని, దేవధనమున నొశించువారిని, హిత జనులకు అహితము నాచరించువారిని, దేవధనము సాగించువారినీ, జనులను నాశముచేయువారిని, అపరాధపరులను ఇక్కడకి రెండు. ఏకాదశీవ్రతపరబ్ముఖుని, ఉగ్రస్వభావుని, లోకాపవాద నిరతుని, పరనిందకుని, గ్రామస్థాశకుని, ఉత్తములను ద్వేషించువానిని, బ్రాహ్మణ ధనము నాశించువానిని ఇటకు రెండు. విష్ణుభక్తి విముఖునకు వెళ్ళని వారినీ, మూర్ఖులను అతి పాపరతులను, ఇటకు లెండు.” ఇట్లు యమధర్మరాజు పలికిన మాటలను వినిన నేను చేసిన పాపకర్మలను తలచుకొని పరితపించితిని. పాపములను తలచి పశ్చాత్తాపమును చెందుటచే సద్ధర్మములను వినుటచే అప్పుడే అక్కడే నా నా పాపములన్ని నిశ్శేషముగా నశించినవి. ఇట్లు పాపరాహిత్యమునొంది హరిసారూప్యమును పొందియున్న సహస్ర సూర్యసమప్రకాశుడనైన నాకు ధర్మరాజు నమస్కరించెను. ఇట్లు నన్ను చూచిన యమదూతలు భయముచే వణుకుచు యమధర్మరాజు చెప్పిన దానిని దృఢముగా విశ్వసించిరి.

తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి నూరు దివ్యవిమానములతో శ్రీమహావిష్ణు పరమ పదమును పంపెను. నేను చేసి ఆ చిన్న పనిచే అన్ని భోగములతో కూడిన కోటి విమానములతో విష్ణులోకమున నుంటిని. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు, విష్ణులోకమును నుండి తరువాత ఇంద్రలోకమునకు వచ్చితిని. ఆచట కూడా దేవతలందరిచే పూజలనందుచు కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు, అన్ని భోగములుతో నివసించి భూలోకమునకు వచ్చితిని. ఇచట కూడా విష్ణుభక్తులైన మీ  వంశమున పుట్టితిని. పూర్వజన్మ జ్ఞానముచే దీనినంతటిని తెలిసియున్నాను. కావుననే బాకులతో కలిసి విష్ణుపూజా ప్రయత్నమును చేయుచున్నాను. మొదట నేనాచరించినది ఏకాదశవ్రతమని తెలియకపోతిని. పూర్వజన్మ జ్ఞానముచే ఇపుడు తెలిసితిని. నేను నా వశమునలో లేనప్పుడు చేసిన పని కే ఇంతటి ఫలము కలిగినదన్న భక్తిచే ఏకాదశవ్రతమును చేయువారికి కలుగు ఫలమునేమి చెప్పవలయును. కావున ఓ మహర్షి ! నేను పరమపవిత్రమైన ఏకాదశవ్రతమును ఆచరించెదను. పరమపదమును కాంక్షించి ప్రతిపూట విష్ణుపూజను చేసెదను. శ్రద్దతో ఏకాదశవ్రతము నాచరించువారు పరమానందతాయకమగు విష్ణుభవనమును పొందెదరు. ఇట్లు భద్రకీలుని మాటలను వినిన గాలవమహరి సంతోషించినవారై పరమానందమును మానసికముగా పొందెను. విష్ణుభక్తి పరాయణుడైన నీవు నా వంశమున పట్టితివి కావున నా వంశము ధన్య మైనది నా జన్మ సఫలమైనది. ఇట్లు పుత్రుని కర్మలచే సంతోషించిన గాలవమహర్షి విధి విధానముగా హరిపూజా విధానమును బోధించెను. ఓ మునిపుంగవా! ఇట్లు ఏకాదశవ్రద మహిమను సంకోచవిస్తారములతో నీకు చెప్పితిని. ఇంకను ఏమీ వినకోరుచుంటిలో తెలుపుము.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున వ్రతాఖ్యానమున ఏకాదశి వ్రతమహిమానువర్ణనమను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.