నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

90 - అధ్యాయము

సనత్కుమార మహర్షి పలికెను :-

ఓ బ్రాహ్మణోత్తమా ! ప్రయోగాది సమన్వితమగు నిత్యాభ్యర్చన దీపకమగు నిత్యా పటలమును చెప్పెదను. లలితా దేవి యొక్క మూడు వర్ణములచే సకలార్థములు చెప్పబడును. మిగిలిన దేవీ రూపముచే చెప్పబడిన దానిచే ఇది చెప్పబడుచున్నది. ఈ సమస్త జగత్తు హృల్లేఖాత్మకముగా చెప్పబడినది. సర్వతంత్రములందు రహస్యముగా నుంచబడిన అర్ధము చెప్పబడినది. ఆకాశముచే ప్రకాశము, అగ్నిచే గ్రసమానత్వము. ఈ రెంటి విమర్శయే బిందుయుత ఈకారము. దీనినే ఫాలన మందురు. పిండి కర్తృత్వము నందు మాలానామకరములు బీజాఖ్యములగు మన్తములు క్రమముగా ఏకాక్షరములు ద్వ్యక్షరములు, త్ర్యక్షరములు చతురాధ్య క్షరములుగా నుండును. అంకములచే వృత్తి భవార్లములను లిఖించవలయును. వ్యస్త క్రమయోగముతో వ్రాయవలయును. ఆవర్ణములచే భేదయోజనమును చేయవలయును. అశేష సందర్భములకిదియే క్రమము. సముదయము దేవ్యాత్మకము, విశ్రాంతి శివాత్మకము, ఆత్మ స్వరూపము ఉభయాత్మకముగా భావన చేయవలయును. ఇట్లు చేసినచో కొంత కాలమునకు దుఃఖార్తి నాశము జరుగును. సర్వస్వరూపము పరిహాంతామయము. ఆత్మ విగ్రహము. అరోపోపాధి వర్జితము స్పురతాఖ్యము సదాత్మకము. ఆత్మత్వమున ప్రకాశ రూపమగు వస్తువు భాసించును. కావున లోకమున అ మంత్రాత్మకమగు అక్షరము లేదు. ఇదియే అంతటా అన్ని వేళలా విద్యయనబడును. ఆయా వాసరము లందు ఇట్లాచరించిన సర్వాపత్తారకమగును. ఇపుడు చక్కగా ఆసవకల్పనా విధానమును చెప్పెదను. ఈ ఆసవము గౌడీ, పైస్టీ, మాధ్వీయని మూడు విధములు. వేడి నీటిలో బెల్లమును పడవేసి చక్కగా కలిపి గాజుకుండలో వేసి దానిలో ఉమ్మెంత పూవుల పొడి కలిపి, భూమిలో నుంచవలయును. ప్రతిదినము రెండు పూటలా చేతులచే కలుపు చుండ వలయును. ఇట్లు ఒక మాసము చేసినచో పుప్పొడి కలిసిపోవును.అపుడు ఆ యాసవముచే పూజించవలయును. గుడముతో కలిసినది కావున ఈ ఆసనమును గౌడీ యందురు. ఇట్లే మధువును కలిపినచో మాధియగును. ఇక పైష్టి ఆసనమును చెప్పెదను వినుము. రెండున్నర రెట్లు అధికముగానున్న నీటిలో బియ్యమును నానబెట్టవలయును. అట్లు మూడు దినముల తరువాత ధ్యాత్యంకుర రజమును పడవేయవలయును. ఒక దినము గానీ ఉన్నచోట ఉంచి తరువాత నివాత ప్రదేశమున నుంచవలయును. నీటితో కలిపిన తరువాత అడుగున జారిపడినది పెద్దీ ఆసవమగును. ఈ మధువు వృక్షజమని, ఫలజమని రెండు విధములు. ఈ రెండు విధముల ఆసవమును నిర్మించు విధానమును వినుము. ఈ యాసవమును సేవించినచో మనోలయమగును. ద్రాక్షఫలమును కానీ ఖర్జూర ఫలమును కొని పుష్పమును కాని ఇప్ప పూవు నీటిలో పడవేసి సగములగునట్లుగా చేసి మొదట వచ్చిన ఆసవశేషముచే రెండు దినములు కలిపినచో తేలినది రుచికరము పూజార్హమగు ఆసవము శుభప్రదము మనోలయకరమగును. ఇక వృక్షజాసవము నాలికేరముకాని హింతాలముకాని తాలము కాని వృక్షముకాని వృక్షములయొక్క ఫలకాండముల నుండి స్రవించిన రసము రసావహము గా నుండును. నాలికేర ఫలంతర్భాగమున నున్న జలము శశియుతమగునపుడు, అర్థపూగ ఫలోత్తమగు రసమును సంగ్రహించి ఎండలో నుంచినచో ఏర్పడు ఆసవము దేవతా ప్రీతికరమగును. ఇట్టి ఆసవములచే దేవికి ఆర్యము నర్పించవలయును. సాధకుడు ఆహారనియము కలవాడై సమాధిలో నుండి ఆసవపానమును గావించవలయును. దేవికి నివేదన చేయక ఆసవపానము చేయరాదు. మనోలయమగు వరకే పానము చేయవలయును. తరువాత కూడా పానము చేసినచో మహాపాతకి యగును. దేవతా గురువులకు నివేదన చేయని ఆసవమును పానము చేసినవాడు పాతకి రాజదండ్యుడు, రిక్టోపాసకుడగును. సాధ్యసాధకములకు కామ్యముగా చెప్పబడినది. సిద్ద విషయమున ఎప్పుడూ చెప్పబడియే యున్నది. కావున సాధకుడు తన్మయుడు కావలయును. ఉక్తరూపుడై ఉక్తరూపులగు దేవతలను క్రమముగా ఉపచారములచే, ఆసవములచే, మత్స్య మాంసములచే పూజించవలయును.

ఓ నారదా! ఇక ఇపుడు కామ్యార్చనను ప్రయోగములను చేప్పెదను. వీటిని ఆచరించినచో సాధకుడు సిద్ధిని పొందును. చైత్రమాసమున దమనకములతో పూజించవలయును. పూర్ణిమనాడు మదనోత్సవమును జరుపవలయును. వైశాఖ పూర్ణిమనాడు బంగారు పుష్పములచే పూజించవలయును. జ్యేష్ఠ పూర్ణిమ నాడు కదలీ పనసామ్ర ఫలములచే పూజించవలయును. ఆషాఢ పూర్ణిమనాడు చందనములచే ఏలా జాతీ కంకోల కుంకుమలచే దేవిని పూజించవలయును. శ్రావణ పూర్ణిమ నాడు ఆగమోక్త విధిచే పవిత్రములచే కాని మొగలు ఫూవులచే కాని పూజించవలయును. ఆశ్వయుజ పూర్ణిమనాడు భూషావస్త్ర ధనాదులచే కన్యను అర్చించవలయును. కార్తీక పూర్ణిమనాడు రాత్రి యందు దీపములచే, పగలు కుంకుమలచే అర్చించవలయును. మార్గశీర్ష పూర్ణిమన చంద్ర సహితములగు నాలికేరములచే అపూపములచే పూజించవలయును. పుష్య పూర్ణిమనాడు శర్కరచే గుడములచే పాలచే ఆర్చించవలయును. మాఘపూర్ణిమన స్వర్ణ రూప్యములచే, పంకజములచే సౌగంధికాదులచే పూజించవలయును. ఫాల్గున పూర్ణిమనాడు వివిధ ద్రవ్యములచే, ఫలములచే సుగంధ పుష్పములచే పూజించవలయును. రాత్రిపూట పర్వతాగ్రమునందు మోదుగు పూవులచే పూజించవలయును. ఇట్లు సిద్ధ ద్రవ్యములచే పూజించినచో ఏడు దినములలో ఖేచరీ మేలనము జరుగును. అరణ్యమున కొని, వటమూలమున కాని చెట్ల పొదలలోకాని కదంబ జాతి పుష్పములచే సిద్ధ ద్రవ్యములచే శివను పూజించవలయును ఇట్లు ఒక మాసము చేసినచో సిద్దులు యక్షిణులు ప్రత్యక్షమై అభీష్టముల నిత్తురు. సముద్ర తీరమున మొగలి పూవులచే పూజించినచో ఖేటకులు సిద్ధించెదరు. అభీష్టమగు ఆజ్ఞను పాలించెదరు. యుద్దమున ఆశ్చర్యకరమగు మాయను చేయుదురు. సాధకుని ఇష్టముననుసరించి ధనమును మాలలను భూషణములను ఇతురు. ఋక్షద్రుమములచే పీఠము నేర్పరచి ఆ పీఠముపై దేవిని పూజించవలయును. శాల్మలీ కుసుమములచే సిద్ద ద్రవ్యములచే ఒక మాసము నిర్భయముతో శ్మశాన దేశమున పూజించినచో పిశాచములు సిద్ధించును. శత్రువుల పాషాణ వర్షాదుల నుండి కూడా జీవించును. నిర్జనారణ్యమున రాత్రి యందు ఒక మాసము నిర్భయుడై సిద్ధ ద్రవ్య సమన్విత చక్రగతయగు దేవిని మాలతీ జాత "పున్నాగ కేతకీమరు పుష్పములచే పూజించవలయును. ఇట్లు పూజించినచో వేతాలులు సిద్ధించెదరు. వేతాలులనధిరోహించి స్వేచ్ఛగా సంచరించవచ్చును. శ్మశానమున కాని, చండికాలయమున కాని, నిర్జనారణ్యమున కాని మధ్యరాత్రమున కృష్ణ చక్రమున అతికృష్ణయగు దేవిని కృష్ణ వస్త్ర విభూషణములచే కోపావీషుడై పూజించవలయును. ఆదేవి ముందు సాధ్యయోనిని బలిగా ఛేదించి నివేదన చేయవలయును. సిద్ద ద్రవ్య సమేతముగా చేయవలయును. ఇట్లు ఒక మాసము చేయవలయును. సిద్ద ద్రవ్య సమేతముగా చేయవలయును. ఇట్లు ఒక మాసము చేసినచో ఆ దేవీ ఫాలలోచనము నుండి భయంకరులగు కృత్యలు పుట్టెదరు. వారికి సిద్దిని నివేదించవలయును. విశ్వ సంహార సంతుష్టలై మరల నిజేచ్చచే వచ్చి దేవీలలాట నేత్రమున నుందురు. ప్రార్థించినచో తిరోహితులగుదురు. రక్త భూషాంబరా లేపమాలా భూషిత విగ్రహాలై యుందురు. నిర్జనోద్యానమున చక్రమున దేవిని ధ్యానించి పూజించవలయును. కహోర చంపకాశోక పాటల శతపత్రముల చేసి ద్రవ్యసముపేతములచే పూజించినచో ఒక మాసములో మాయలు సిద్ధించును.ఈ మాయా ప్రసాదము వలన నరుడు కామరూపి యగును. విశ్వ విజయీ, విశ్వచారీ, విశ్వ వినోదములు కలవాడగును. షడాధారాబ్ది మధ్యమున చక్రమును ధ్యానించి పూజించవలయును. చన్ల చన్దన కస్తూరీ మృగనాభి మహా దయములచే పూజించవలయును. ఇట్లు చేసిన త్రికాలజ్ఞుడగును. త్రికాలములందు దేవిని చక్కగా ధ్యానించవలయును. పూర్ణ ప్రతీతిలో భవ్యము, వికలమున అభవ్యము చెప్పబడినది. చక్ర సహిత దేవిని భక్తియుతుడై స్మరించవలయును. వివేకా, విభవా, విశ్వా, వితతో, కామినీ, ఖేచరీ, గర్వా, పురాణా, పరమేశ్వరీ, గౌరీ, శివా, అమేయా, విమలా, విజయా, పరా, పవిత్రా, పీడనీ, విద్యా, విశ్వేశీ, శివ వల్లభా, అశేష రూపా, స్వానందా, అంబుజాక్షీ, అనిందితా, వరదా, వాక్యదా, వాణీ, వివిధా, వేద విగ్రహా, విద్యా, వాగేశ్వరీ, సత్యా, సంయుతా, సరస్వతీ, నిర్మలా, ఆనందరూపా, అమృతా, మానదా, పూషా, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశినీ, చంద్రికా, కాంతి, జ్యోత్స్నా, శ్రీ, ప్రీతి, అంగదా, ఈ దేవీ నామములను చులుకసలిలమున స్మరించుచు మాతృకా సహిత, విగ్న, త్రికావృత్తిచే అమృతాత్మిక సారస్వలు జిహ్వను దీపాకారముగా స్మరించుచు తొడిని పానము చేయవలయును. ఒక సంవత్సరములో చతుర్విధ పాండిత్యము కలుగును. ఇట్లు పరిశుద్ధ మనస్కుడై ప్రతినిత్యము చేయువాడు యోగి, బ్రహ్మవిత్తు, జ్ఞానీ, శివయోగి, ఆత్మవిత్ యగును. పైన చెప్పియున్న చక్రముననున్న దేవిని మాతృకా సహితను స్మరించవలయును. ఒక మాసము చంపకములచే నిందీవరములచే పూజించిన ఆరోగ్యము కలుగును. అట్లే జ్వర భూత గ్రహోన్మాద శీత కాకామలాక్షులను హరించును. దంత కర్ణ జ్వర శిరశ్శూల గుల్మాది కుక్షి రోగములు, వ్రణప్రమేహ ఛర్ధి ఆర్శ గ్రహిణి ఆమ త్రిదోషజములు అన్నియూ పరమేశ్వరీ పూజచే శాంతించును. చక్ర నిర్మాణమును కాశ్మీరముచే చేయవలయును. లేదా సిందూరము, గైరికము, లాక్షా, దరదము, చందన ద్వయము వీటిచే కూడా నిర్మించవచ్చును. బిలద్వారమున షోడ శత్త్యస సంయుతమగు త్ర్యసమును లిఖించవలయును. ఈ మధ్యన నున్న పరమేశ్వరిని దరదముచే పూజించవలయును. వారితో వారి శక్తులతో కూడియున్న పరమేశ్వరుని సుగంధము కల సిద్ద ద్రవ్యములచే పూవులచే ఒక మాసము. పూజించినచో పాతాలాది లోకములందు నాగ కన్యాసంయుతుడై చాలా కాలము ఆనందించును. యధావిధిగా యధోదిత కాలమున పూజించుటచే యక్షరాక్షస గంధర్వ సిద్ధ విద్యాధరాంగనలు, పిశాచములు గుహ్యములు, కిన్నరులు, భుజగులు సిద్ధించెదరు. మోదుగు పూవులచే పూజించిన భూషణములు, పాటలములచే పూజించిన గజములు, ఎర్ర కలువల పూజచే అశ్వములు, కుముద పూజచే వాహనములు, ఉత్పల పూజచే ఒంటెలు, తగర పూజచే పశువులు, జంబీరపూజచే మహిషములు, లకుచములచే మేకలు, దాడిమ పూజచే నిధులు, ఇప్పపూల పూజచే గానము, పొగడ పూల పూజచే అంగనలు, కహోర పూజచే పుత్రులు శత పత్ర పూజచే జయము, కేతక పూజచే వాహనములు, సుగంధి పుష్పపూజ చేనిత్య సౌభాగ్యము కలుగును. ఒక మాసము కాని రెండు మూడు మాసములు కానీ లేదా ఫలావాప్తి వరకు కాని శర్కరా ఘృత పాయసములచే సచక్రపరివార సలిల మధ్యగ యగు దేవిని పూజించవలయును. సర్వోపద్రవ శాంతి కొరకు అర్యములచే పుష్పములచే తర్పణము గావించవలయును. సంపూర్ణాయుష్యముకొరకు నేతితో, సౌభాగ్యసిద్ధికి తేనెతో, ఆరోగ్యము కొరకు పాలతో ఐశ్వర్యము కొరకు మూడింటిచే, ప్రీతి కొరకు నాలికేరోదకముచే, నృపాప్తికి చల్లని నీటితో, సర్వార్థ సిద్ధికి జలముచే అభిషేకము గావిచంవలయును. పగలు రాత్రి పూగోద్యానమున సిద్ద ద్రవ్యములచే పూజించవలయును. ఆ ఉద్యానమున నివసించి పుష్పములచే పూజించినచో మన్మథుని వంటి సౌందర్యము కలవాడగును. పూర్ణిమల యందు నియతముగా కన్యక యందు దేవిని అర్చించవలయును. ఇట్లు చేసినచో పరప్రయుక్త కృత్యలు విముఖములై ప్రయోగించిన వారినే సంహరించును. లింగత్రయమయి యగు దేవిని చక్రస్థ శక్తులతో పూజించినచో ఈ లోకమున పరలోకమున సర్వాభీష్టములను పొందును. సుగంధములగు నూరు బంగారు పుష్పములచే ఒక మాసము పూజించినచో పూర్వ జన్మకృత పాపముల నుండి విముక్తి పొందును. నవరత్నములచే ఒక మాసము పూజించినచో సర్వపాపములు నశించి దేవిని కనులారా చూడగలడు. ఒక మాసము సుగంధముగల అంశుకములచే పూజించినచో సకల పాపకృత్యముల నుండి ఇతర దుఃఖ రాశుల నుండి విముక్తి పొందును. తనను తాను దేవీ రూపముగా చక్రమును చుట్టూ శక్తులను భావించుచు సుగంధ పుష్పములచే పూజించుచు తన్మయుడు కావలయును. షోడశాన్విత దేవతా పూజకు ప్రత్యేక క్రమముగా తిధులు నిర్దేశించబడియున్నవి. ఆయా తిధులలో ఆయాదేవతలకు పూజాజపహోమాదుల నాచరించ వలయును. ఘృతము, శర్కర, పాలు, అపూపము, కదలీ ఫలము, తేనె, గుడము, నాలికేర ఫలము, పేలాలు, నువ్వులు, దధి, అటుకులు, శనగలు, పెసలు, పాయసములను నివేదన చేయవలయును. ఈ నివేదన కామేశ్వర్యాది సమస్త శక్తులకు చెప్పబడినది. ఆద్యాలలితను ఇవి అన్నియు అన్నివేళలలో నివేదన చేయవలయును. అగ్నిలో హోమమును గావించవలయును. నరులకు దానము చేయవలయును. ఆయా విద్యాక్షరములచే చెప్పబడిన ఔషధమును ఆయాప్రమాణాను సారముగా మర్దనచేసి గుటీకలుగా చేసుకొని, వాటిని అన్నిటిని సాధించవలయును. ఆదివారమున అరుణాంభోజములచే, సోమవారమున కుముదములచే, మంగళవారమున రక్తాత్పలములచే, బుధవారమున తగరములచే గురువారమున కహ్లారములచే, శుక్రవారమున తెల్లని పద్మములచే, శనివారమున నీలోత్పలముచే స్వేష్ణ దేవతను పూజించవలయును. అట్లు పూజించి ఆదివారము మొదలగు వారములలో క్రమముగా పాయసమును, పాలను, కదలీ ఫలములను, నవనీతమును, శర్కరను, నేతిని నివేదన చేయవలయును. ఇట్లు ఇష్టదేవిని చక్కగా పూజించి గందొదులను అర్పించవలయును. ఇట్లు చేసినచో గ్రహపీడ తొలగి సర్వసుఖముల నందగలడు. అర్థరాత్రి యందు మదనాగ్నిచే తపించు, హరించబడిన హృదయముగల, చేతులు జోడించి శిరస్సున ధరించియున్న, జుట్టు విరబోసుకొని, బెదురు చూపులు గలదై, ఎఱ్ఱని కన్నులు గలదై, గాలిచే ఎగురు గొట్టబడు వస్త్రము గలదై, పద్మసుందరి, వివేకము నశించినదై, మదము గలిగి, మానలజ్ఞా భయములను విడిచియున్న ఇష్టురాలగు స్త్రీని చింతించుచు చక్రమును అర్చించి, చక్రమధ్యమున దిగంబర దేవిని జపాదాడిమ బంధూక కింశుకాది పుష్పములచే పూజించవలయును. అట్లే సుగంధ భరితములగు శేషాలీ పుష్పములచే పూజించవలయును. ఇట్లు ఇరువది యొక్క దినములు చేసినచో ఇష్టసుందరి చింతించిన రూపముతో మదము కలదై వచ్చి తీరును. శరీరపాతము వరకు అతనితోనే యుండును. పాలు పెరుగు తేనె కలిపి రక్త పద్మములచే పూజించినచో సంపదలు కలుగును. ఎట్టి కలువలచే పూజించిన యువతులు వశమగుదురు. సమాన రూపముగల దూడయున్న ఆవుపాలు కలిపిన మల్లికామాలతీ జాతి శతపత్రములచే పూజించినచో కీర్తి, విద్యా, ధనారోగ్య, సౌభాగ్య సంపదలు కలుగును. తేనె కలిపిన అశోక పుష్పములచే పూజించినచో స్వర్ణాదిస్తంభనము, యుద్ధమున కోపించియున్న శత్రు స్తంభనము జరుగును. నేయి కలిసిన ఎఱ్ఱని గన్నేరు పూలచే పూజించినచో రక్తవస్త్రములు, వనితలు, రాజులు మంత్రులు స్వవశమున నుందురు. ఇతను కోరిన ఆభరణ వాహన వాణిజ్య సిద్దులు చేకూరును. అర్థరాత్రమున నూనె కలిపిన ఎఱ్ఱని ఆవాలచే కాని లవణములచే కాని హోమమును గావించిన కోరిన యువతి వచ్చును. రాత్రి మధ్యలో నూనె కలిపిన నల్లని పుష్పములచే పూజించినచో ఒక నెలలో శత్రువునకు జ్వరపీడ కలుగును. నేయి కలిపిన ఆరుపుష్కరములచే కాని తద్బీజములచే కాని రాత్రి హోమము గావించినచో శత్రువులకు వైద్యులు తొలగించలేని దాహవ్రణాదులు సంభవించును. అట్లే ఆ నూనె కలిపిన బీజములచే కాని అంకోలములచే కాని ఆవాలు నేయి కలిపిన మిరియాలచే రాత్రి హోమము చేసినచో తాను కోరిన స్త్రీ కామాతురయై సమీపించును. నేయి కలిపిన బియ్యముచే హోమమును గావించినచో తండుల సమృద్ధి కలుగును. పెసలచే హోమము గావించిన పెసలు, నేతితో కావించిన నేయి లభించును. సాధించ వలసిన వాని నక్షత్ర సంబంధము గల చెట్టు నుండి తీసిన పిండిని పాదరజముతో కలిపి రాజీ మరిచీ లోకోత్తమగు బొమ్మను రాత్రి యందు హోమమును గావించవలయును. పాదములతో, పిక్కలతో, మోకాళ్ళతో, తొడలతో, నాభి క్రింది నుండి, హృదయము నుండి కంఠము వరకు శిరస్సుతో నిశిత శస్త్రముచే ఛేదించి క్రమముగా పన్నెండు విధములుగా హోమము గావించిన నరనారీ నరాధిపులు ఏడు దినములలో వశులగుదురు. సాధకుడు కోరినచో జ్వరము, ఆర్తి కలుగును. బెల్లము కలిపిన పిండిచే, జిలకర్రతో కలిసిన మిరియాలచే బొమ్మను చేసి బొమ్మ హృదయమున సాధ్యనామమును వ్రాసి నామోచ్చారణచే నేతిచో హోమమును చేసి, ఆ బొమ్మను తన కరాగ్రముచే స్పృశించుచు మన్తమును వేయిమార్లు జపించవలయును. ఆ బొమ్మను నేతితో తడిపి చక్కగా పూజించి అదే ధ్యానముచే జపించుచు భక్షించవలయును. ఇట్లు చేసినచో నరనారీ నృపాదులు జీవితాంతము వశులై యుందురు. శక్త్యష్ట గంధమును చల్లని నీటితో చక్కగా కన్యచే మర్ధింప చేసి దానితో ఫాల భాగమున తిలకమును ధరించినచో జగత్తు వశమగును. ప్రస్థ మాత్ర పరిమాణముగల బియ్యమును తీసుకొని కొత్త కుండలో వేసి సమానమగు వర్ణముగల దూడయున్న ఆవుపాలను రెండింతలు ఆ కుండలో నుంచి సంస్కరించిన అగ్నిలో ఉడుకబెట్ట వలయును. నేతితో తడిసిన ఆ ముద్దను శర్కర కలిపి చేతిలోనికి తీసుకొని నూటయెనిమిది మార్లు మంత్రమును జపించి హోమము గావించవలయును. ఇట్లు ప్రతిపత్తున చేసిన హోమము మహాలక్ష్మిని ప్రసాదించును. ఇట్లు ప్రతి శుక్రవారము గావించిన రాజతుల్యుడగును. విశేషించి పంచమినాడు పైన చెప్పిన విధముగా హోమమును గావించవలయును. పంచమినాడు పాలు పెరుగు తేనె కలిపిన మల్లికాదులచే హోమమును చేయవలయును. అన్నముచే నేయిచే హోమమును చేసిన అన్నాడ్యుడగును. కోరిన వస్తువులన్నియూ లభించును. నేతిచే హోమము గావించిననూ, నువ్వులచే తండులములచే గాని హోమమును గావించినచో అభీష్ట వస్తుసిద్ది కలుగును. పాలు పెరుగు తేనె కలిపిన ఎఱ్ఱని పద్మములచే హోమమును నలుబది రోజులు గావించినచో, మహాలక్ష్మిని పొందును. తేనె కలిపిన వేయి కలువలచే నేయికలిపి ప్రతిదినము భక్తిచే హోమమును గావించినచో కీర్తిని ధనమును పుత్రులను పొందును. తేనెతో కలిపిన చంపకములచే వేయి హోమము ఒక మాసము చేసినచో నూరు బంగారు నాణెములు లభించును. నేయి కలిపిన పాటల పుష్పములచే మూడువేలు' హోమము గావించినచో అమావాస్య నుండి నెల దినములలో చిత్ర వస్త్రములను పొందును. కర్పూర చందనాది సుగంధి వస్తువులు లభించును. ఇతర భోగోపయోగులగు వస్తువులు కూడా లభించును. ప్రతి సప్తమి తిధి యందు పాలు కలిపిన బియ్యముచే ఆరునెలలు నూరు హోమమును గావించిన శాలి సమృద్ది కలుగును. నువ్వులతో ఒక సంవత్సరము హోమమును గావించినచో ఆరోగ్యమును పొందును. నిజ నక్షత్రమున మూడు మార్లు దూర్వాహోమము గావించినచో రోగాదులు నశించి మహాభోగములచే నూరు వర్షములు జీవించును. మూడు జన్మ నక్షత్రములందు గుడూచీతిల దూర్వలచే హోమమును గావిచంవలయును. ఇట్లు చేసినచో ఆయు శ్ర్ళీ యశోభోగ పుణ్య నిధ్యాదులు లభించును. ఇట్లు మూడు జన్మ నక్షత్రములలో ఘృత పాయసదుగ్ధములతో హోమము గావించినచో ఆయురారోగ్య వైభములచే రాజమంత్రి తుల్యులగును. ప్రతి సప్తమీన కదలీ హోమము చేసినచో సౌభాగ్యము లభించును. ప్రాదేశ సూత్రములగు మూడు దూర్వలచే పాలు పెరుగు తేనెలు కలిపి నిత్యము సన్నిపాత జ్వరమున్నపుడు హోమమును గావించవలయును. ఆ దినములలో జలమును స్పృశించుచు మంత్రమును జపించవలయును. ఆ జలముచే వేయిమార్లు స్నానమును పానము నాచరించవలయును. పొకాదులను కూడా ఆ జలముతోనే చేసినచో రోగ విముక్తుడగును. సాధ్యనక్షత్ర వృక్ష చూర్ణమును పాలు పెరుగు తేనెలతో కలిపి, ఆవాలు, నువ్వులు పిడి, సాధ్య. పాదరజస్సుతో కూడియున్న దానిచే బొమ్మను చేసి హృదయమున సాధ్యనామమున వ్రాసి నిశితాయుధములచే పైన చెప్పినట్లు ఖండించి హోమమును గావించవలయును. ఇట్లు ఏడుదినములు చేసిన సాధ్యుడు వశ్యుడగును. అటువంటి బొమ్మను కుండ మధ్యమున పాతిపెట్టి, పైన అగ్ని నుంచి మంత్రములో ప్రతినిత్యము హోమమును చేయవయలును. రాత్రిపూట మూడువేలు ఆపాలచే రసముతో కలిపి హోమమును గావించినచో నూరు యోజన దూరముల నుండి కూడా వనితను తీసుకొని వచ్చును. మధు మిశ్రిత కౌశికములచే హోమమును గావించిన స్త్రీని వశము చేయును. నాలికేర ఫలములతో కూడియున్న గుడముచే హోమమును గావించిన లక్ష్మి లభించును. అట్లే నేయి కలిపిన కలువలచే, పాలు కలిసిన ఎర్రకలువలచే, పాలు పెరుగు తేనె కలిపిన చంపకములచే, పొగడ పూవులచే, ఇప్ప పూవులచే హోమము గావించినచో కన్య లభించును. పున్నాగ పుష్పములచే హోమము చేసిన వస్త్రములు, నేతి హోమమున ఇష్టములు మహిష క్షీరహోమమున మహిషములు, అజక్షీర హోమమున అజములు, గవ్యహోమముచే గోవులు రత్నహోమముచే రత్నములు లభించును. వరిపిండితో బొమ్మను చేసి శర్కర కలిపి, హృదయమున నామాక్షరములను వ్రాసి రాత్రిపూట నూనెలో నేతిలో ఉడికించవలయును. దానియందే మనసు నుంచి మంత్రమును జపించుచు భక్షించవలయును. ఇట్లు ఏడు రాత్రులు చేసినచో నరుడు నారి నృపాదులు దాసులవలె వశులై మనసును ప్రాణాదులను అర్పించెదరు. తెల్లని లేదా ఎఱ్ఱని గన్నేరు పూవులచే ఇరువది యొక దినములు హోమమును గావించిన మహా సంపదలను పొందును. పాలు పెరుగు తేనె కలిపి ఛాగ మాంసముతో హోమమును గావించిన బంగారమును పొందును. పాలు కలిపి హోమము గావించి సస్యశ్యామలమగు భూమిని పొందును. మూడు దినములు పద్మాక్షములచే హోమము గావించిన లక్ష్మిని పొందును. మారేడుచే ద శాంశ హోమమును చేయవలయును. ఇట్లు మంత్ర సిద్ధిని పొందినవాడు మంత్రించిన ములుకోదకములచే పాము కరిచి, మరణించిన వారి ముఖముపై చల్లి బ్రతికించవచ్చును. పాము కరిచి మరణించిన వారి చెవిలో మంత్రమును చదివి కాని, జపసిద్ధమగు దండముచే శిరస్సున కొట్టి లేపవచ్చును. కుండమధ్యమున యోనిని లిఖించి అగ్నిని స్థాపించి యధావిధిగా హోమమును చేయవలయును. నువ్వులు, ఆవాలు, గోధుమలు, బియ్యము, యవలు మొదలగు వాటిచే హోమమును చేయవలయును. పాలు పెరుగు తేనెలు కలిపి ఒక్కొక్క ధాన్యముతో కాని, అన్ని కలిపి కాని సమృద్ధి కొరకు హోమమును చేయవలయును. పొగడ సంపెంగ, పద్మములు, కప్లోరములు, ఎర్రకలువలు, నల్లకలువలు, మల్లికా కుంద మధూకాదులచే హోమము చేసిన లక్ష్మీని పొందును. అశోక పాటల బిల్వజాతి కంకత నవనీలోత్పల కరవీర కర్ణికారపుష్పములచే హోమమున చేసిన లక్ష్మిని సౌభాగ్యమును, నిధిని, ఆయుష్యమును, కీర్తిని పొందును. దూర్వను, గుడూచిని, అశ్వత్తమును, వటమును, ఆరగ్వధమును సితార్క ప్లక్షములచే హోమమును గావించి రోగ విముక్తుడగును. ఇక్షు, జంబూ నాలికేర మోనా గుడసితమిశ్రములచే హోమమును గావించిన స్థిరమగు లక్ష్మిని పొంది సమస్త భోగముల ననుభవించును, నేయి ఆవాలతో హోమమును గావించిన మృత్యువు, కాషాగ్నియందు శత్రుమృత్యువు కలుగును. చతురంగుల పరిమాణముల గల సమిధలచే హోమమును గావించిన శత్రువు యొక్క చతురంగబలము ఏడు దినములలో రోగదుఃఖార్తులు కలిగి నశించును. ప్రతి నిత్యము నిత్యార్చన గావించి ఘృతముచే హోమమును గావించవలయును. విద్యాభిమంత్రిత జలమును ప్రాతః కాలమున త్రాగవలయును. చందనోశీర కర్పూర కస్తూరీ రోచ నాయుతములగు కాశీకాలాగురు కస్తూరీ మిశ్రిత గంధములతో సర్వార్థ సిద్ధి కొరకు పూజించవలయును. ప్రాతః కాలమున మాతృకతో సర్వనిత్యా మంత్రములను మూడుసార్లు జపించి జలపానము గావించిన వాక్సిద్ధి కలుగును. పయోవ్రతము స్వీకరించి పూర్వమువలె వర్ణలక్ష జపము గావించవలయును. పాలు పెరుగు తేనె కలిసిన పద్మముల చే దశాంశము హోమము గావించవలయును. జపతరణ హోమార్చనాభిషేకాదులతో మంత్ర సిద్ధిని పొంది పైన చెప్పబడిన ప్రయోగములను చేయవలయును. అట్లు చేయనిచో ఆ మంత్ర దేవతలు కోపించి ఆ క్షణముననే సాధకుని ప్రాణములను హరింతురు. ఈ విద్యచే సాధ్యము కానిదేదీ ఈ జగత్తున లేదు.

అరణ్యమున మజ్జిచెట్టు మూలమున, పర్వతాగ్రమున గుహలలో ఉద్యాన మధ్య భాగమున, కాంతారమున, మాతృ పాదప మూలమున, నదీ తీరమున, వనమున, ఈ యక్షిణీ విద్యలను సాధించవలయును. కమలములచే, ఎట్టకలువలచే, తెల్లని సౌగంధికా పుష్పములచే, కలువలచే, సుగంధిశేఫాలికా పుష్పములచే పొలుపెరుగుతేనే కలిపి యథావిధిగా ఏడు వారములు కాని, నలుబది రోజులు కాని హోమమును చేసినచో యుద్ధమున విజయమును పొందును. మల్లయుద్దమున, ద్వంద్వ యుద్ధమున, వాదమున, ద్యూతమున, సర్వ వ్యవహారములలో విజయమును పొంది తీరును. చతురంగుల పుష్పములచే హోమమును గావించి శత్రుస్తంభనము చేయగలడు. అట్లే కర్ణికార పున్నాగమేరు చంపకకైతక రాజవృక్ష మాధవ పుష్ప సప్తకముచే ద్వారములందు యథా పూర్వకముగా హోమము చేసినచో శత్రు స్తంభనము కాని శత్రు భంగముకాని జరుగును. శత్రు నక్షత్ర వృక్షాన్ని యందే ఆ సమిధలచే ఆవాలు నెయ్యి కలిపి హోమమును గావించినచో శత్రువు పాదాక్రాంతుడగును. మృత్యుకాష్టాన్ని యందు నుృత్యుపత్ర పుష్పములచే, సమిధలచే ద్వారే శార్చన పూర్వకముగా హోమమును గావించిన శత్రువుల చతురంగ బలము రోగ పీడితమగును. దానిచే సాధకునికి జయము లభించును. లేదా శత్రు సంహారముచే కూడా విజయము లభించును. ఆదివారమున జిల్లేడు కట్టెలతో బాగుగా మండుచున్న అగ్నియందు జిల్లేడు సమిధలచే పత్రపుష్ప ఫలకాండములతో సమాన వర్ణములు గల దూడయున్న ఆవునెయ్యిచే తడిపి నలుబదిరోజులు త్ర్యస్త్రమండలమున యధావిధిగా శత్రుదిక్కున ముఖముచేసి హోమము గావించినచో రోగార్తుడై పలాయనము గావించును. భయారుడై పాదాక్రాంతుడగును. సోమవారమున మోదుగు కాష్ఠముచే చక్కగా మండుచున్న అగ్నిలో మోదుగు సమిధలచే పత్ర పుష్ప ఫలకొండములచే నేతితో తడిపి హోమము గావించినచో పైన చెప్పిన ఫలము సంభవించును. మంగళవారమున చంద్రకాష్ఠములలో మండించిన అగ్నిలో నేయికలిపిన చండ్ర సమిధలచే పత్రపుష్ప ఫలకాండములచే హోమమును గావించిన పూర్వోక్తఫలము లభించును. బుధవారమున అపామార్గ కాషాగ్నిలో, గురువారమున రాగికట్టెల అగ్నిలో, శుక్రవారము మేడి కట్టెల అగ్నిలో, శనివారము జమ్మి కట్టెల అగ్నిలో నేయి కలిపిన శుభ్రపీత సీత శ్యామ వర్ణములు కల ఆయా సమిత్ పత్ర పుష్ప ఫలకొండములచే హోమమును గావించిన పూర్వోక్త ఫలము లభించును. ప్రతిపత్తి నుండి పంచమి వరకు క్రమముగా జాలీ చణక ముద్దయవ మాషలచే మాహిష ఘృతము కలిపి హోమమును గావించినచో పూర్వోక్త ఫలములను పొందును. షష్టి నుండి సప్తమి వరకు మేక నెయ్యి కలిపిన ప్రాగుక్త ద్రవ్యములచే హోమమును గావించిన పూర్వోక్త ఫలము లభించును. ఆ తరువాత, అయిదు తిధులలో పైన చెప్పబడిన ద్రవ్యములచే తిలద్వయముచే, సీతాన్నములచే, పాయసములచే మేక నేతితో హోమమును గావించినచో పూర్వోక్త ఫలమును పొందును. ఇట్లే నక్షత్ర వృక్షముల నుండి పుట్టిన అగ్నిలో నేయిలో కలిపిన ద్రవ్యములచే హోమమును గావించిననూ పూర్వోక్త ఫలము లభించును. మొదట విద్యను సాధించి తరువాత మంగళానుగ్రహముతో సమస్త ప్రయోగములను సాధించవలయును. దేవతను కాని బ్రాహ్మణకుమారిని కాని, కన్యకనుకాని శుభావయవములు కలిగి ముగ్ధయై స్నాత దౌతాంబర శుభకరియగుదానిని కాని ఇట్టి కుమారుని కాని స్థాపించి విద్యచే పూజించి, శిరస్సును స్పృశించుచు మంత్రమును నూరుమార్లు జపించి పూజించవలయును. ఎట్టని తెల్లని గంధము గల పూవులతో పూజించవలయును. కర్మపూర్తి యగువరకు గుగులు ధూపమును వేయవలయును. అపుడు దేవి ఆవేశించియున్న కుమారునీ లేదా కుమారిని భక్తితో చక్కగా పూజించి పూర్వోక్త షోడచాశోపచారములచే సేవించి మంత్రజపమును చేయుచు తన అభీష్టమును అడుగవలయును. ఆమె అభీష్టములను భూత భవిష్యద్వర్తమానములను మనసులోనున్న సమస్త విషయములను జన్మాంతర విషయములను కూడా చెప్పును. తరువాత మరల ఆ దేవిని పూర్వోక్తముగా పూజించి తనలో ఉద్వాసన చేసి మంత్రమును జపించవలయును. ఇట్లు వేయిమార్లు జయించి స్థిరబుద్ధి కలవాడై పూర్ణాత్ముడై సుఖము కలవాడై విహరించవలయును. పాలు, పెరుగు, తేనె కలిపిన ఎఱ్ఱని పద్మములచే నలుబది రోజులు హోమము గావించిన సంపదను, తెల్లని పద్మములచే చేసిన కీర్తిని పొందును. తేనె కలిపిన ఎఱ్ఱని కలువలచే హోమమును గావించినచో బంగారమును కొని నీధిని కాని భూమిని కొని పొందును. పాలు కలిపిన కలువలచే హోమమును గావించిన కోరినవి లభించును. ధాన్యములను పొందును. సౌందర్యవంతుడగుసు. నేయి కలిపిన కలువల హోమముచే కోరిన దానిని పొందును. నేయి కలిపిన ఎఱ్ఱని కలువల హోమముచే రాజప్రియుడగును. పాలు, పెరుగు, తేన్డే కలిపిన మోదుగు పూవుల హోమముచే చతుర్విధ పాండిత్యమును పొందును. పాలు, పెరుగు, తేనె కలిపిన పేలాల హోమముచే సమస్త గుణ సంపూర్ణయగు కన్యను భార్యగా పొందును. బెల్లముకాని శర్కరకాని కలిపిన నాలికేర ఫలక్షదముచే హోమమును గావించినచో యత్నరహితముగనే కుబేరు డంతటి ధనవంతుడగును. నేయి కలిపిన అన్నముతో, బియ్యము కలిపిన నువ్వులతో, ఎర్రని పూవులచే, ఎర్రగన్నేరు పూవులచే, తెల్లగన్నేరు పూవులచే హోమము చేసినచో వాక్సిద్ధి కలుగును. తెల్లని ఎర్రని పూవులను కలిపి హోమము చేసినచో ఆయురారోగ్యములు లభించును. పాలు పెరుగు తేనె కలిపిన దూర్వాత్రయముచే హోమము చేసిన శత్రుజయము లభించును. గుడూచీ హోమముచే పాయసముచే, తిలలచే, శ్రీ ఖండ పంక కర్పూర మిలితములైన శతపత్రములచే హోమమును చేసిన సంపదను పొందును. వంశ పారంపర్యముగా స్థిరముగా నుండును. కర్పూర సంయుతమగు కుంకుంమను హిమతోయముచే మర్థించి ఆ పంకముచే, వికసించిన కలువలచే హోమము చేసినచో రాజంతటి వాడగును. సంపదలతో తులతూగును. నూరు సంవత్సరములు జీవించును. శత్రు రహితముగా, ఆపదహితముగా, సాటిలేనివాడై, పరిశుద్దమనస్కుడై యుండును. ఇక్షుకాండ శకల హోమముచే వస్త్రములను పొందును. అట్లే ఎర్రని తెల్లని గన్నేరు పూలచే కాని, తేనెతో కలిపిన పాటల పుష్పములచే హోమమును గావించిన స్త్రీలు వశ్యులగుదురు. అట్లే పద్మ హోమముచే వేశ్యలు వశ్యులగుదురు. సమాన రూపము గల దూడయున్న నల్లని ఆవుపాలలో శర్కర కలిపి హోమమును చేసినచో పాపస్వభావము కలవాడైనను సాటిలేని సంపదను పొందును. సౌవీరముచే కలిపిన పత్తి గింజలచే హోమముగావించిన శత్రువులు వశ్యులగుదురు. అరిష్ట పత్రములచే కాని, బీజములచే కాని అరిష్టాగ్నిలో మృత్యుబీజములచే నింబతైల సిక్తముగా హోమమును గావించిన శత్రునాశము జరిగి తీరును. పంచ గవ్య హోమముచే రోగార్త తురగములు ఆరోగ్యమును పొందును. నూనె కలిపిన అక్షబీజములచే హోమమును గావించిన సర్వవినాశము జరుగును. చక్కగా తడిపిన కరంజ బీజములచే హోమమును గావించిన శత్రువు పిశాచగ్రస్తుడగును. అక్షతరుజన్యములను పత్రపుష్ప ఫలకాండ సమిధలచే హోమము గావించిననూ పూర్వోక్త ఫలము లభించును. నింబతైలము కలిపిన అక్షద్రుమబీజములచే హోమము గావించిన శత్రువు అదే దినమున అపస్మారమును పొందును. శత్రు జన్మ నక్షత్ర వృక్ష సమిధలచే ప్రజ్వరిల్లిన అగ్నిలో అదే వృక్షము యొక్క పంచాగములచే హోమము గావించిన శత్రువు మరణించును; ఆవాల నూనె కలిపిన తామర పూసలచే హోమమును గావించినచో శత్రువులు కుష్ఠరోగగ్రస్తులై దేహలోపము గల వారగుదురు. మిరియాల ఆవాలచే నూనెలో కలిపి హోమము గావించినచో ఆదే దినమున శత్రువు దాహ జ్వరగ్రస్తుడగును. ఇట్లు శత్రునిగ్రహము కొరకు చేయు హోమములందు, తన రక్షణ కొరకు ప్రతి దినము భక్తియుతుడై సద్విద్యలచే జప హోమాదుల నాచరించవలయును. మృత్యుంజయ మంత్రముచే కాని ఆయా ప్రయోగములందుండు విద్యలచే ఇతని అన్యధా సిద్దమంత్రమును వెంటనే నశింప చేయును. కృతయుగమున మూడులక్షలు జపము గావించిన మంత్రసిద్ది లభించును. త్రేతాయుగమున రెట్టింపు చేయవలయును. ద్వాపరయుగమున మూడురెట్లు, కలియుగమున నాలుగురెట్లు చేయవలయును. దశాంశము హోమము, తద్దశాంశము బ్రాహ్మణ భోజనము గావించవలయును. ఈ క్రమముచే అన్ని విద్యలకు చెప్పబడిన సంఖ్యానుసారముగా జపమునుచేసి మంత్రసిద్ధిని పొంది తరువాత ప్రయోగాదులను చేయవలయును. కామేశ్వరీ జపము రెండితలు చేయవలయును. మంత్రసిద్ధి జరిగిన తరువాత ప్రయోగాదులను చేయవలయును. భగమాలా మంత్రమును లక్ష జపించి దశాంశము హోమమును చేయవలయును. నిత్యక్లిన్నా జపము లక్ష దశాంశము హోమమును చేయవలయును. తరువాత ప్రయోగములను చేయవలయును. భేరుండ మంత్రమును మౌనముతో క్షీరపానము మాత్రము చేయుంచు తొమ్మిది లక్షలు జపమును చేయవలయును. తరువాత మిగిలిన వాటిని చేయవలయును. వహ్ని వాసినికి మూడు లక్షలు జపము చేయవలయును. మిగిలిన దంతయు యధా పూర్వముగా చేయవలయును. మహావజ్రేశ్వరీ విద్యాజపమును మూడులక్షలు చేయవలయును. యధోక్త క్రమముగా దశాంశమును హోమము చేయవలయును. దూతీమంత్రమును లక్ష జపించవలయును. దశాంశ క్రమముగా హోమాదులు చేయ వలయును. త్వరితా మంత్రమును లక్ష జపించవలయును; విద్యాసిద్దికి హోమాదికమును చేయవలయును. కులసుందరీ మంత్రమునకు లక్ష జపము దశాంశము హోమాదులను చేయవలయును. నిత్యానిత్యా జపము మూడు లక్షలు దశాంశము హోమాదులు చెప్పబడినవి. నిత్యపతాకా మంత్రజపము యాబది మూడులక్షలు జపము దశాంశము, హోమాదులు గావించవలయును. విజయాజపముమూడు లక్షలు, సర్వమంగలకా జపము ముప్పది రెండు లక్షలు, జ్వాలామాలిని మంత్రమునకు ఎనిమిది లక్షల జపము యధోక్త ద్రవ్యములచే దశాంశ హోమమును గావించవలయును. చిత్రా మంత్రమునకు పదునారు లక్షల జపము దశాంశ హోమాదులు చేయవలయును. ఇట్లు నిత్యోపటంమును మొదటి నుండి చివరి వరకు సంక్షేపముగా చెప్పితిని. ఇచట అంతయూ యంత్ర సాధన పూర్వకముగా చేయవలయును అని తెలియవలయు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగ మున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున నిత్యాపటలకథనమను తొంబదియ - అధ్యాయము సమాప్తము.

చుండును. తాను చేయు భయమును కలిగించు కర్మలచే వధించబడును. బంధించబడును. తన కర్మోదయము వలన బంధనిర్ముక్తుడని తలచును. బాహువులు లేనివాడై చక్రము వలె. సంసారమున పరిభ్రమించుచుండును. నిగ్రహమువలన, సంబంధ నివృత్తి వలన, తపోబలము వలన చాలామంది బాధలు లేని ఆనంద స్వరూపమగు సిద్ధిని పొందిరి.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున అరవదియవ అధ్యాయము సమాప్తము.