నారద మహా పురాణము - పూర్వార్థము
63 - అధ్యాయము
శౌనక మహర్షి పలికెను :- ఓ సాధుపురుషా ! సూతమహర్షీ ! నీవు చాలాకాలము జీవించుము. నీవు సర్వశాస్త్ర విశారదుడవు కావున మాకు కృష్ణకథామృతమును రుచి చూపితివి. భగవతియుడగు నారదుడు సనందుని నుండి మోక్షధర్మములను వినిన తరువాత మరల నేమడిగెను. సనకాదిమునీశ్వరులు బ్రహ్మ మానస పుత్రులు, లోకములనుద్ధరించ సంకల్పించి సిద్దులై లోకసంచారమును చేయుచుందురు. నారదమహర్షి కూడా నిత్యము శ్రీకృష్ణపరాయణుడు. వారిద్దరి కలయికలో లోకపావనమగు కథలేవి చెప్పబడినవి?
సూత మహర్షి పలికెను :- ఓ మహానుభావా ! నీవు లోకోపకారపరాయణుడవై చక్కగా అడిగితివి. నారదమహర్షి అడిగినదంతయూ నీకు చెప్పెదను. సనందనమహర్షి చెప్పిన మోక్షధర్మములను వినిన నారదమహర్షి మరల వారినిట్లడిగెను.
నారదమహర్షి పలికెను :- సర్వదేవేశ్వరుడగు విష్ణువు వేదమున తంత్రశాస్త్రమున కీర్తించబడెను. అన్ని పురుషార్ధములను కోరువారందరు అతనినే ఆరాధించవలయును. భగవంతుడగు శ్రీమహావిష్ణువును 'ఏ మంత్రములచే ఆరాధించవలయును? విష్ణుభక్తులు ఏయే దేవతల నారాధించవలయును? గురుశిష్యులను, ప్రయోజనకారియగు భాగవతతంత్రమును, దీక్షను, ప్రాతఃకాలమున మొదట చేయవలసిన దానిని తెలుపుడు. ఏయే మాసములలో ఏయే కర్మలచే, ఏయే జపములచే, ఏయే హోమములచే పరమాత్మ ప్రీతి చెందునో నాకు తెలుపుడు.
సూతమహర్షి పలికెను :- మహానుభావుడగు నారదుడు పలికిన ఈ మాటలను విని సూర్యతేజస్కుడగు, పూజ్యుడగు సనత్కుమారమహర్షి ఇట్లు పలికెను.
సనత్కుమారుడు పలికెను :- ఓ నారదా ! నీకు భాగవతతంత్రమును చెప్పెదను. వినుము. దీనిని తెలిసినచో అవ్యయుడగు విష్ణువును స్వచ్చమైన భక్తిచే సాధించగలరు. మహాతంత్రము త్రిపదార్ధము చతుష్పాదమని చెప్పబడును. భోగము, మోక్షము, క్రీయా, చర్య అనునవి నాలుగు పాదములు. ఇక పదార్థములు పశుపతి, పశువు, పొశము అనునవి మూడు. ఈ మూటీలో ప్రతి ఒక్క శివుడే. జీవులు పశువులు. స్వరూపమును తెలియనీయక మోహాదులున్నంతవరకు జీవులకు పశుత్వముండును. ఈ విషయమును ద్వేతబుద్ధితో చూడవలయును. ఇచట పాశములు అయిదు విధములు. వాటిలో ఒక్కొక్కదానికి విడిగా లక్షణములున్నవి. పశువులు మూడు విధములు కొలమను సంజ్ఞకలవగును. తలప, అకలి, సకలము అనునవి ఆ మూడు విధములు. వీటిలో మొదటిదగు తలప అనునది మలసంయుక్తము, మలకర్మలతో కూడి యుండునది. రెండవది, ఇక మూడవది మలముచే మాయచే కూడి యుండును. వీటిలో మొదటిది మరల ‘రెండువిధములు. సమాసకలుషమని, అసమాపకలుషమని, రెండవది కూడా పక్వము, అపక్వమలము అని రెండు విధములు. ఈ రెండు పరిశుద్ధమైన మార్గమున వెళ్ళుచు 'విజ్ఞానమును ప్రళయమును కలిగించునవి. కలాది తత్త్వముచే నియతమగు సకలమనునది అంతటా పర్యటించును. ఆయా లోకములలో నుండు కర్మలననుసరించి పొందిన శరీరములు కలవారిలో అయిదు పొశములుండును. వాటిలో మొదటి రెండు మలకర్మల వలన కలుగునవి. మాయేయము అనునది తిరోధాన శక్తి వలన కలుగును. మూడవది బిందుజము ఒకటీ అయిననూ అనేక శక్తులు కలది. దర్శన క్రియను కప్పివేయునది. కోమలమైనది. ధాన్యమునకు పొట్టు, శరీరమునకు వస్త్రము వంటిది ఆత్మకు శరీరమును కలిగించునది,. విచిత్రములైన ఫలానుభవమును కలిగిచునది ధర్మ అధర్మాత్మకమైన కర్మయే. ఈ కర్మ, శరీరము అనునది ప్రవాహము వలే నిత్యము. అనగా ప్రవాహములో ఎపుడూ ఒకే నీరుండదు. వచ్చిన నీరు పోవుచుండును. కొత్త నీరు వచ్చుచుండును. ప్రతిప్రదేశమున ఎప్పడూ నీరుండును. అట్లే ఆత్మకు ఒకే శరీరముండదు. వచ్చిన శరీరము. పోవును. కొత్త శరీరము వచ్చును. శరీరము మాత్రము ఎప్పుడూ ఉండును. దీనినే ప్రవాహానిత్యత అందురు. అట్లే కర్మ ముందుండునో, శరీరము ముందుండునా అను విచారము కూడా బీజాంకురన్యాయముతో సమాధానపరచవలయును. అనగా బీజము మొదటిదో, అంకురము మొదటిదా? అను విచారమునకు రెండూ అనాది సిద్దములే యనునట్లు శరీరము కర్మ అనాది సిద్ధములని చెప్పవలయును కొని ముందు వెనుకల విచారమును చేయరాదని భావము. ఇట్లు శరీరము, కర్మయనునవి మొదటి రెండు. ఇక మాయేయము బిందుజము మొదలగు వోటిని చేప్పెదను వినుము. సచ్చిదానందవిభవము కలవాడు సనాతనుడగు పరమాత్మ ఒక్కడే. ఈ పరమాత్మయే అందరికి అన్నిటికీ బీజము. ఇతడే విభుస్వరూపుడు. అనగా సర్వవ్యాపకుడు మనసులో సంకల్పము కలుగును కాని ఉదయించదు. నివృత్తిని ప్రసాదించును. దర్శనక్రియను ప్రవర్తింపచేయును. అదియే శంభుని తేజస్సు ఇదియే సర్వత్కృష్టము. ఇతనే పార్వతితో కలిపి శక్తి స్వరూపుడగును. శ్రీహరి యందు భోగరూపముననుండును. జీవగణమునకు ముక్తిని ప్రసాదించును. ఈ శక్తిని ఆద్యము ఏకము చిద్రూపము అని యందురు. ఆ శక్తిచే విజృంభింపచేయబడిన బిందువే దికియా స్వరూపముగా శివనామముచే వ్యవహరించబడును. ఈ శివుడే సమస్త తత్త్వములకు కారణము. విభువు, అవ్యయము, సమస్తములగు ఇచ్చాశక్తులు ఇతని యందే లీనమగును. తమతమ కార్యములను చేయును. ఈ శివుడే అందరిని అను గ్రహించువాడు. స్థావర జంగమములను అనుగ్రహింపగోరి ప్రపంచమును సృజించదలచిన ఇతని మొదటి ఉన్మేషమే నాదస్వరూపము. ఇదియే శాంతి మొదలగు భువన స్వరూపము. ఈ శక్తి తత్త్వము సావయవమగును. దీని నుండియే జ్ఞానక్రియా శక్తుల యొక్క, ఉత్కర్షాప కర్షముల యొక్క ప్రసారముండును. ఏదీ లేని సామాన్యతత్త్వము సదాశివమనబడును. దృశ్శక్తి విడివడినపుడు క్రియాశక్తి విశిష్టమగును. ఈ క్రియా శక్తియే ఈశ్వర నామముచే వ్యవహరించబడును. ఇదియే సర్వార్ధములకు కర్త క్రీయా శక్తి విడిగా యున్నపుడు జ్ఞానమను పేరుచే ఉద్రిక్తమగును. ఈ తత్త్వమునే విద్య యందురు. ఇదియే జ్ఞానరూపము. సర్వప్రకాశకము. నాదము, బిందును, సకలము అనునవి సత్తత్త్వమును ఆశ్రయించి యుండును. విద్యాధిపులు మరియు, ఆధిపత్యము మంత్రములు, విద్య ఈ తత్త్వములు శుద్దాధ అని వ్యవహరించబడును. ఈ జగత్తునకు సాక్షాన్నిమిత్తము ఈశ్వరుడు కావున ఉపాదానము అనబడును. ఈ ఉపాదానమే బిందు రాజము. ఈ అయిదింటికీ కాలనియమము లేదు కావున క్రమము కూడా ఉండదని సిద్ధాన్తము. వ్యాపారము ననుసరించి వీటిని కల్పన విధించబడినది. వాస్తవమగు తత్త్వము శివాఖ్య మొక్క. ఇదియే చిత్రములగు వివిధ శక్తులు కలది. ఇట్టి శక్తులు గల తత్త్వమే వృత్తి భేదముననుసరించి బహుకల్పనలు గలదైనది. ఈ కల్పనలే స్థావర జంగమములననుగ్రహించుటకు ధరించిన బహు రూపములు. ఈ రూపములచే అనాది కులము ఆవరించబడిన జీవులను అనుగ్రహించును. అందరికి భోగమును, మోక్షమును, తన వ్యాపారములో సామర్థ్యమును కలిగించి చూపును. ఆందరిని, అన్నిటిని అనుగ్రహించు శివుడు జడవర్గమునకు వ్యాపార సామర్థ్యమును, చేతన వర్గమునకు భోగమోక్షములను ప్రసాదించును. శివుడు అనునది సామాన్య రూపము. మోక్షమనగా, చేతనులను అనుగ్రహించుట.
శివుడు అనాదియగుట వలన ఆయా కర్మలను అనుభవించవలసిన అవసరము లేకుండును. అయిననూ చేతనులను అనుగ్రహించు స్వభావము కల శమ్భుడు ఆయా భోగములకు సమర్దుడగును. అనుభవించిననూ అవ్యయుడే యగును. శంభుడు కష్టము లేకుండగానే సూక్ష్మకరణములను ప్రపంచమును ఉత్పత్తి చేయును. కర్తృత్వము, ఉపొద్నత్వము, కరణత్వము లేనిచో కార్యమున కనపడడు కదా ! ఈ సృష్టిలో శక్తులు కరణము, వీటికి మాయ ఉపాదానమగును. ఈ మాయ నిత్యము, ఏకము, శివాభిదము శక్తిచే ఆద్యంతములు లేనిదగును. నరులకు సాధారణ రూపము. ప్రపంచమునకు కారణము అగును. జీవులు తాము తెలిసి తెలియక చేసిన కర్మలచే మాయ స్వభావ సిద్ధముగా మోహమును కలిగించును. ఈ మాయ సర్వవ్యాపకము అతి సూక్ష్మము. అన్నిటి కంటే పరము వికృతముల కంటే పరము. జగన్నాధుడు విద్యాధిపతి జీవుల కర్మలను పరిశీలించి తన శక్తులచే మాయను క్షోభింపచేసి జీవుల అనుభవము కొఱకు కరణకళేబరములను సృజించును. మొదట నానాశక్తి మయమగు కొలతత్త్వమును సృజించును. జరుగబోవు దానిని, జరిగిన దానిని, జరుగుచున్న దానిని కొలమే ప్రపంచమున కలిపి ఉంచును. తరువాత మాయ నియమించు శక్తిని సృజించును. అన్నింటిని నియమించును కావున దీనిని నియతి ఆందురు. తరువాత ఈ మాయ నిత్యము విశ్వమును మోహింపచేయునది, ఆద్యంతములు లేనిదగును కొలతత్త్వమును సృజించును. ఈ మాయ ఒక ప్రక్క మానవుల మలమును ఒక చోట కూర్చి కర్త శక్తిని వ్యక్తము చేయును కావున దీనినే కలా యందురు. ఈ మాయయే కొలముతో కలిసి నియతముగా సృజనాత్మకశక్తిని తన వ్యాపారమును భూలోకము వరకు వ్యాపింపచేయును. ఈ మాయయే జీవులకు కలానామముతో విషయములను తెలియజేయుటకు ప్రకాశనామకమగు విద్యాతత్త్వమును సృజించును. విద్య తన కర్మ చే జ్ఞానశక్తి యొక్క ఆవరణమును భేదించుకొని ఆత్మాంశకారణము కావున విషయములను చూపును. ఈ కలయే పరమగు కరణముచే విషయములను అనుభవింపచేయును. శక్తి ఉద్బుద్దముగ కాగా పురుషుడు మహదాదికమును ప్రేరేపించి భోగ్యమునందు భోగమును భోక్తను భోగోపకరణమును కల్పించును. విషయాకారముతో సుఖాదీ రూపమగు బుద్దియే సంగ్రహముగా భోగమనబడును. భోక్తము తనచే తనే భోగ్యత్వబుద్ధి కలుగుటకు ఇదియే కరణమగును. ఈ బుద్ది సూర్యునివలె ప్రకాశము కలది అయిననూ కర్మరూపమగుటచే కరణాంతరసా పేక్షమగును. అపుడే ఇతరములను గ్రహించకలుగును. కారణాదులసంబంధము వలన భోగమునందలి ఔత్సుక్యముచే ప్రేరేపించబడుట వలన, చేష్టా ఫలసంయోగము వలనను జీవునకు కర్తృత్వము సిద్ధించును. జీవునకు కర్తృత్వమును అంగీకరించనిచో భోక్తృత్వము వ్యర్థమగును. అంతియేకొదు ప్రధాన చరితమంతయూ వ్యర్థమగును. కరణాదుల ప్రయోజకత్వము లేకుండుకు కారణము కోదగిన కర్తృత్వాభావము పురుషునిలో చెప్పినచో అనుభవము అసంభవము కావున జీవుడే ప్రవర్తకుడగును. ఈ జీవునకు విద్యచేతనే కరణాది ప్రయోక్తృత్వము సంభవించును. తరువాత ఈ కలా భేదొంగరూపమగు రాగమును సృజించును. ఈ రాగముచే పురుషునిలో భోగ్యతా బుద్ధి కలుగును. ఈ బుద్ధిచే క్రియాప్రవృత్తి కలుగును. కావుననే దీనిని రాగమందురు. ఈ తత్త్వములచే కలిసి భోక్తృత్వదశలో నిత్యమగు ఈ యాత్మ పురుష నామమునుపొందును. ఈ కలయే పురుషుని భోగ్యము కొరకు అవ్యక్తమును సృష్టించును. ఈ అవ్యక్తము సప్తగ్రంధి విధానమగు గౌణమునకు కారణమగును. ఈ ఆధారమున గుణముల విభాగముండదు. భూమ్యాదిభాగములు మాత్రము కలిగియుండును. భూమ్యాదివిభాగమునకు ఆధారమగు దానినే అవ్యక్తమందురు. ఈ అవ్యక్తము నుండియే గుణత్రయము సంభవించును. ఈ మూడు గుణములే సత్త్వము, రజస్సు తమస్సు. అను పేర్లను పొంది వ్యాపారమును నియమించును. గుణము వల్లనే బుద్ధి విషయాధ్యవసాయ స్వరూపము కలదగును. ఈ బుద్ది కూడా గుణము వల్లనే కర్మానుసారము త్రివిధమగును. మహత్తత్వము నుండి సంరంభవృత్తి గల అహంకారము పుట్టును. ఈ అహంకారసంభేదము వలననే విషయము వ్యవహారయోగ్యమగును. ఈ అహంకారము మరల సత్త్వాద్గుణభేదముచే మూడు విధములగును. తైజసము, రోజసము తామసము అని వాటి పేర్లు. ఈ మూడింటిలో తైజసము నుండి మనసుతో పొటు జ్ఞానేంద్రియములు కలిగి ప్రకాశముతో అన్వయించి బోధకములగును. క్రియా హేతువగు రాజసము నుండి కర్మేంద్రియములు పుట్టెను. తామసము నుండి భూతములకు కారణములగు పంచతన్మాత్రలు పుట్టెను. వీటిలో మనస్సు అనగా ఇచ్చారూపమగు సంకల్ప వ్యాపారము. ఈ చిత్తము భోక్తభోగోపపాదకరూపకముగా రెండు విధములగును. బయట కరణములుండుటచే తనకు ఉచితమైన పోటీచే ఎపుడూ ఆత్మవృత్తియగు సంకల్పముచే ఇంద్రియములకు సామర్థ్యము కలుగును. లోపల నున్న దానిని చేయును కావున దీనినే అంతఃకరణమందురు. ఈ అంతఃకరణము మనస్సు, అహంకారము, బుద్ధి అను పేర్లచే మూడు విధములగును. ఈ మూడింటికి వరుసగా ఇచ్ఛా, సంరంభను, బోధ అనునవి ప్రవృత్తులుగా నుండును. శ్రోత్రము, త్వక్, చక్షువు, జిహ్వా, నాసిక యనునవి జ్ఞానేంద్రియములు. ఈ ఇంద్రియములచే గ్రహించబడు విషయములు శబ్దాదులు. శబ్దాదులనగా శబ్దప్పర్శ రూపరస గంధములు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ యనునవి కర్మేంద్రియములు, వచనము, ఆదానము, గమనము, మలవిసర్జనము ఆనందము అనునవి వీటి పనులు. ఇట్లు పురుషునకు కరణములు సిద్ధించినవి. కరణములు లేనిచో కృతి సంభవించును. ఇట్లు పది కరణములచే చేష్ణకార్యమును ఆవేశించి చేయించును. కార్యమును ఆధారముగా చేసుకొని కరణములు విభువులు కావున చేష్టను కలిగియుండును. తన్మాత్రములనగా ఆకాశ వాయు తేజో జలభూములు అయిదు. ఈ తన్మాత్రముల నుండే ఒకే గుణము కల పంచభూతములు పుట్టును. అయిననూ శబ్దమనుగుణము అయిదు భూతములందు, స్పర్శ తొలుగు భూతములందు, రూపము మూడు భూతములందు, రసము రెండు భూతములందు, గంధము పృథివీ యందు ఉండును. ఈ పంచభూతముల కార్యము అవకోశము, వ్యూహకల్పనము, పాకము, సంగ్రహము, ధారణము అనునవి. శీతము జలముతో, ఉష్ణస్పర్శ అగ్నిలో ఉండును. అగ్నిలో భాస్వర శుక్లరూపము, జలమున అభాస్వర శుక్లము, పృథీవిలో శుక్లాద్యనేకరూపములుండును. రూపము మూడు భూతములలో నుండును. రసము జలములో నుండును. ఈ ధసము మధురాదిభేదములలో ఆరు విధములుగా నుండును. అసురభి సురభి అను రెండు విధముల గంధము భూమిలో నుండును. తన్మాత్రము, తదూతగుణము, కరణము, పోషణము అనునవి భూతముల వైశిష్ట్యము. భూతమూలము విశేషరహితముగా నుండును. ఈ అయిదు భూతములు అంతట సన్నివిష్టములగును. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతయు పంచభూతాత్మకమే యని తెలియును.
ఈ పంచభూతములు శరీరమున ఏరూపమున నుండునో తెలుపును. శరీరమున అస్థిమాంస, కేశ, త్వక్, నఖ, దంతములు పృథివీ రూపములు. మూత్రము, రక్తము, కఫము, స్వేదము, శుక్రము మొదలగు వాటియందు జలముండును. హృదయమున, పంక్తిలో నేత్రములలో పిత్తమున తేజోధర్మము కనపడుచున్నది కావున అగ్నియుండును. ప్రాణాదివృత్తి భేదముచే వాయువు ఉండును. అన్ని నాడులలో గర్భవృత్తి యొక్క అనుషంగముతో ఆకాశముండును. ప్రయోక్తి నుండి మహి వరకు ఉన్నసాధనము అండార్థమగును. ఇది ప్రతి ఆత్మలో నియతముగా నుండును. భోగభేదమును అనుసరించి నిశ్చయించబడును. ఇట్లు కలా మొదలగు తత్త్వములు ప్రతి జీవునిలో నియతముగా ఉండును. కర్మ వశమున అన్ని దేహములలో సంచరించుచుండును. ఇదియే మాయే యమను పొశము. ఈ పాశముతో జగత్తంతయు ఆవరించబడియున్నది. ఇది అశుద్దమగుటవలన ఇదీ మరొకభాగమున భూమినుండి కల వరకుండును. దానిలో భూమండలమున నున్నది స్థావర జంగమాత్మకముగా నుండును. గిరి వృక్షాదులు స్థావరములు. జంగమములు మూడు విధములు. జరాయుజములు, అండజములు, స్వేదజములు అని. చరాచర జగత్తులలో ఎనుబది నాలుగు లక్షల జీవరాశులున్నవి. జీవుడు ఆ జీవరాశులలో తిరుగుచు ఎపుడో ఒకప్పుడు మానవజన్మనందును. కర్మవశమున మాత్రమే ఈ జన్మలు లభించుచుండును. మానవజన్మ సర్వార్థసాధకము. ఆ మానవజన్మ కూడా భారతఖండమున బ్రాహ్మణాధికులములందు ఎంతో పుణ్యము చేసిననే జన్మించుట సంభవించును. లేనిచో దుర్లభమే యగును. స్త్రీ పురుషుల సంయోగము వలన శుక్రశోణితయోగముచే పుట్టుక కలుగును. ఒకే బిందువు ద్వయాత్మకముగా గర్భమున ప్రవేశించును. ఆ బిందువులో రజస్సు అధికముగా నున్నచో స్త్రీగా, రేతస్సు అధికముగా నున్నచో పురుషుడుగా పుట్టును. మలకర్మాది పాశముచే నియంత్రితుడగు ఒక జీవాత్మ కలాతత్త్వముచే కూడి జీవభావమును పొందును. ఆ గర్భమున తల్లి తీసుకొను అన్నపానాదులచే పోషించబడుచు పక్షమాసాది కాలవశమున శరీరము పెరుగుచుండును. మావిచే కప్పబడి దుఃఖాదులచే పీడించబడుచు గర్భమున నివసించి, పూర్వజన్మలో ఆచరించిన శుభాశుభాకర్మలను చింతించును. మాటిమాటికీ పీడించబడుచు దుఃఖించుచుండును. కాలవశమున ఈ శిశువు తల్లిని పీడింపచేయుచు తాను పీడించబడుచు తలక్రిందులుగా యోనియంత్రము నుండి బయటపడును. బయటపడిన తరువాత క్షణకాలము చేష్టారహితునిగా నుండును. తరువాత ఏడ్చుటకు సంకల్పించును. తరువాత ప్రతిదినమున పెరుగుచు బాల్యమును పౌగండమును పొంది తరువాత యౌవనమును పొందును. ఈ లోకమున జీవులకు దేహప్రాప్తి విధానమది. సర్వలోకములకు ఉపకారకము దుర్లభమునగు మానవజన్మను పొందికూడా ఆత్మను తరింప చేసుకొనని వానికంటే పాపాత్ముడెవడుండును? ఆహార నిద్రా భయమైధునములు పశ్వాది సకలప్రాణులకు సమానములని చెప్పబడినవి. ఈ నాలుగింటియందే అనురక్తుడగు వాడు ఆత్మఘాతకుడగును. మూర్తుడగును. తన బంధమును ఛేదించుకొనుట మానవధర్మము. దీక్ష చేతనే పాశబంధవిచ్ఛేదము జరుగును. కావున బంధనవిచ్ఛిత్తి కొఱకు మంత్రదీక్షను స్వీకరించవలయును. దీక్షాజ్ఞానమను శక్తిచే బంధనము ధ్వంసమై శుద్ధాత్మతత్త్యనామముచే ఈ జీవుడు నిర్వాణపదవిని చేరును. స్వశక్త్యాత్మిక దృష్టిచే శివుని ధ్యానించును. దర్శించును. సహితమునకు పరహితమునకు జీవుడు శివమంత్రములచే పూజించును. శివుడను సూర్యశక్తి కాంతిచే చేతననేత్రములు సమర్థములై ఆత్మ గతావృతి కలవాడై శివశక్త్యాదులతో చూచును. బోధ యను అంతఃకరణవృత్తి మహేశ్వరుని ప్రకాశింపచేయజాలదు. పాశబంధము అర్గళము వలె యున్నది. కావున పాశబంధనవిచ్ఛేదమునకు దీక్షయే ముఖ్య హేతువు. కావున శాస్త్రోక్త విధానముచే మంత్రదీక్షను స్వీకరించవలయును తంత్రవిధిచే దీక్షితుడై స్వవర్ణాచారతత్పరుడై నిత్యనైమిత్తి కాత్మకమగు అనుష్టానమును ఆచరించవలయును. దీక్షితుడైనను స్వవర్ణాశ్రమాచారములను మనసున కూడా అతిక్రమించరాదు. ఏ ఆశ్రమములో నుండి దీక్షను స్వీకరించునో అతను ఆయాశ్రమములో నుండి ఆ ధర్మములను పొలించవలయును. దీక్షను స్వీకరించిన తరువాత చేయు పనులు బంధనము నీయజాలవు. మంత్రానుషానసంభవమగు కర్మ మాత్రమే ఫలమునిచ్చును. దీక్షితుడైనవాడు ఏయే లోకముల భోగములనభిలషించునో ఆ భోగానుభవము తరువాత మోక్షమును పొందును. దీక్షను పొందినవాడు నిత్యనైమిత్తిక ధర్మములను ఆచరించనిచో కొంతకాలము పిశాచత్వమును పొంది అంతమున మోక్షము నొసంగును. కావున దీక్షితుడు నిత్యనైమిత్తికములను ఆచరించి తీరవలయును. దీక్షను పొందినపుడు అనుష్టానము అనుమానించబడును. నిత్యనైమిత్తికాచారపాలకునికి దీక్ష ఫలించును. దీక్షా వైకల్యము లేనిచో సద్యోమోక్షము లభించును. అందులో గురుభక్తునికి మరింత నిశ్చితము. దీక్షచే గురుమూర్తిలో నున్న శివుడు సర్వానుగ్రాహకుడగును. పైకి చూపుట కొరకు కృత్రిమమగు గురుభక్తి కలవానికి దీక్ష నాచరించిననూ నిష్ఫలమగును. ప్రతిక్షణమున ప్రాయశ్చిత్తమును చేయవలసివచ్చును. త్రికరణశుద్ధిగా గురుభక్తి కలవానికి ప్రాయశ్చిత్తమే యుండదు. ప్రతిక్షణమున సిద్ది కలుగును. శిష్యుడు గురుభక్తి కలిగి తన సర్వస్వమును సమర్పించు వానికి గురువు మిథ్యామంత్రోపదేశము చేసినచో గురువు ప్రాయశ్చిత్తము నాచరించవలయును.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున అరువదిమూడ - అధ్యాయము సమాప్తము.
