నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

74 - హనున్మన్త్ర కథనమ్

సనత్కుమార మహర్షి పలికెను : ఇపుడు సర్వాభీష్టప్రదములగు హనుమన్మస్త్రములను చెప్పెదను. ఈ మంత్రములను సించిన మానవులు హనుమంతుని ఆచరణ గలవారగుదురు. ఈ మంత్రము స్వరేందుసంయుక్తము గగనము భగాన్వితములగు. హసపాగ్నిని నిశాధీశులు ద్వితీయబీజముగా చెప్పబడిరి. భగేంద్వాఢ్యములగు స్వఫాగ్నులు తృతీయ బీజము. వియదృగ్వన్నీ మన్విందు యుక్తము చతుర్థ బీజము. భగచంద్రౌఢ్యవియదృగుస్వకాగ్నులు పంచమ బీజము.మన్వింద్యాఢ్యములు హసలు షష్టబీజము. ఈ బీజముల తరువాత చతుర్థివిభక్త్యంత హనుమత్పదముండును. చివర నమః పదమున్న ఈ మంత్రరాజము ద్వాదశాక్షరి. ఈ మంత్రమునకు ముని రామచంద్రుడు జగతీ ఛన్దస్సు. హనుమంతుడు దేవతా షష్ణము బీజము ద్వితీయము శక్తి. షడీజములచే షడంగములను శిరోఫాలనేత్రముఖ గల బాహుద్వయ హృదయకుకి నాభి ధ్వజ జాను పాదద్వయములందు క్రమముగా న్యాసము చేయవలయును. షడీజములను పొదద్వయమున, శిరమున, ఫాలమున, ముఖమున, హృదయమున, నాభియందు, ఊరువులయందు, జంఘలందు, పాదములందు క్రమముగా న్యాసము చేయవలయును. తరువాత అంజనీగర్భసంభూతుడగు కపీశ్వరుని ధ్యానించవలయును. ఉదయించు కోటి సూర్యుల తేజస్సు కలవాడు, జగత్ర్పక్షోభకారకుడు, శ్రీరామపాదముల ధ్యానమున నిష్ఠ కలవాడు, సుగ్రీవ ప్రముఖార్చితుడు, నాదముచే రాక్షసులను భయ పెట్టుచున్న హనుమంతుని స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి ఇంద్రియనిగ్రహముతో పన్నెండు వేలు జపించవలయును. దశాంశమును పయోదధ్యాజ్యమిశ్రితములగు పాయసములచే హోమమును గావించవలయును. పూర్వోక్ష వైష్ణవపీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆవాహన గావించి పొద్యొద్యుయనములచే పూజించి, కేసరములందు అందేపూజను, పత్రములందు పూజను గావించవలయును. రామభక్తుడు, మహాతేజోవంతుడు, కపిరాజు, మహాబలుడు, ద్రోణాద్రిహారకుడు, మేరుపీఠార్చనకారకుడు, దక్షిణాశాభానుడు, సర్వవిఘ్నవినాశకుడు, అను నామములతో

దళాగ్రములందు చక్కగా పూజించి అర్చించవలయును. సుగ్రీవుని, అంగదుని, నీలుని, జాంబవంతుని, నలుని, సుషేణుని, ద్వివీదుని, మైందుని, లోకపాలకులను అర్చించవలయును. వజ్రాదులను కూడా పూజించి మంత్ర సిద్ధిని పొందవలయును. పది దినములు ప్రతి రాత్రి మంత్రమును తొమ్మిది వందలమార్లు జపించవలయును. అట్లు జపించినవారికి రాజుల వలన శత్రువుల వలన కలుగును భయము తొలగి పొవును. మాతులుంగ ఆమ్ర కదలీఫలములచే ఒక వేయి హోమము గావించి ఇరువది రెండు మంది బ్రాహ్మణ బ్రహ్మ చారులకు భోజనమునిడినచో భూత విషగ్రహరోగాద్యుపద్రవములు విద్వేషి గ్రహ దానవులు వెంటనే నశించును. నూటా ఎనిమిది మార్లు మంత్రించిన జలము విషమును నశింపచేయును. భూత అపస్మార కృత్యల వలన కలుగు జ్వరము ఈ మంత్రముచే మంత్రించ బడిన భస్మముచే కొని జలముచే కొని జ్వరము వచ్చిన వానిని కోపముచే కొట్టినచో మూడు రోజులలో జ్వరము తొలగి ఆనందమును పొందును. ఈ మంత్రముచే మంత్రించబడిన ఔషధమునుకొని జలమును కొని భుజించిన అన్ని రోగములను పారదోలి వెంటనే సుఖమును పొందును. మంత్రించబడిన భస్మమును శరీరమున పూసుకొని, మంత్రించబడిన జలమును పానము చేసి యుద్ధమునకు బయలుదేరినచో శస్త్రాస్త్రములచే బాధించబడరు. శస్త్రము వలన కలుగు గాయము, వ్రణము వలన ఏర్పడిన గాయము, ఖదుల వలన కలుగు గాయము మూడు మార్లు జపించిన భస్మమును స్పృశింపచేసినచో మానును. సూర్యాస్తమయమునుండి సూర్యోదయమువరకు ఏడు దినములు జపించి భస్మమును కీలమును తీసుకొని మంత్రించి శత్రుద్వారమున రహస్యముగా భూమిలో స్థాపించవలయును. ఇట్లు చేసినచో వారిలో వారు కలహించుకొని పలాయనమగుదురు. ఈ మంత్రముచే మంత్రించ బడిన చందనమునుకాని భస్మమును కాని భక్ష్యాదులలో కలిపి ఎవనికి భుజించుటకు ఇచ్చిన వాడు దాసునివలే యగును. క్రూర జంతువులు కూడా ఇట్లే వశవర్తులగును. ఈశాన్యదిక్కున నున్న కరంజతరుమూలభాగముచే హనుమంతుని ప్రతిమను అంగుష్ఠమాత్రముగా చేసి, ప్రాణ ప్రతిష్ఠను చేసి సిందూరొదులచే పూజించి గృహాభిముఖముగా ద్వారమున మంత్రమునుచ్చరించుచు భూమిలో స్థాపించవలయును. ఇట్లు చేసినచో ఆ ఇంటిలో ఎప్పుడు గ్రహ, అభిచార, రోగ, అగ్ని, విష, చోర నృపులవలన కలుగు ఉపద్రవలు కలుగవు. మరియు ఆ గృహము ధన ధాన్య పుత్రాదులచే సమృద్ధమగును. రాత్రి పూట అరణ్యములో భస్మముచే కాని మట్టిచే కాని ప్రయత్నముచే శత్రు ప్రతికృతుని చేసి హృదయమున పేరును వ్రాసి, ప్రాణప్రతిష్ఠను చేసి, మంత్రమునుచ్చరించుచూ శస్త్రములచే భేదించవలయును. మంత్రాంతమున శత్రునామమునుచ్చరించి చిన్ధీ  చిన్ధీయని పలుకవలయును - తరువాత మారయ అని పలుకవలయును. దంతములచే ఓష్ఠములను పీడించుచు,అరచేతులను వత్తి ఆ ప్రతిమను వదిలి తన గృహమునకు వెళ్ళవలయును. ఇట్లు ఏడురోజులు చేసినచో శత్రువు మృతి చెందును. స్మశానమున వెంట్రుకలు విరబోసుకొని రాజికాలవణములచే ఉమ్మెంత పూవులచే పండ్లచే, నఖర్మ విషములచే కాకి, గుడ్లగూబ గద్దల రెక్కల ఈకలచే శ్లేష్మాంతకాక్ష జములగు సమిధలచే దక్షిణాభిముఖుడై మూడు వందలు హోమమును చేయవలయును. ఇట్లు ప్రతిరాత్రి ఏడు దినములు చేసినచో బలవంతుడగు శత్రువును సంహరించును. స్మశానమున మూడు దినములు రాత్రులలో ఆరొందలు జపించవలయును. అంతట భేతాళుడు కింకరునిగా ఉండి సాధకుడు చెప్పిన దానిని చేయుచుండును. మంత్రించబడిన భస్మమును కాని, జలమును కొని రాత్రియందు సహస్రావృత్తిని దీనత్రయము జరిపి స్థూలములైన, లేదా కృశించిన ప్రతిమలలో చలనము కలుగును. అష్టమినొడు కాని చతుర్దశినాడు కాని, భౌమవారమున కాని, ఆదివారమునకొని పట్టమున హనుమంతుని ప్రతిమను నూనె కలిపిన మాషములచే పరిశుద్దాత్ముడై సుందరముగా ఏర్పరచవలయును. ఆ ప్రతిమకు వామభాగమున తైలదీపమును, దక్షిణభాగమున ఘృతదీపమునుంచి మూలమంత్రముచే ఆవాహనగావించి ప్రాణప్రతిష్టను గావించి పాద్యాదులను సమర్పించవలయును. రక్త చన్దన పుష్పములచే సిందూరాదులచే అర్చించవలయును. ధూపదీపములనిచ్చి నైవేద్యములను సమర్పించవలయును. ఆపూపమోదకములను శాకవటకొదులను నేతితో సమర్పించి మూలమంత్రముచే అఖండితములగు అహిలతాదలములను ఇరువదేడింటిని మూడు భాగములను చేసి వక్కలచే మూల మంత్రోచ్చారణే సమర్పించవలయును. ఇట్లు చక్కగా పూజించి మంత్రజ్ఞుడు వేయి మార్లు జపించవలయును. తరువాత కర్పూర హారతినిచ్చి. బహువిధముల స్తుతించి నిజాభిలాషను నివేదించి యథావిధిగా విసర్జన చేయవలయును. నైవేద్యాన్నమును ఏడుగురు బ్రాహ్మణులచే భుజింపచేసి నివేదితపర్ణములను విభజించి వారికీయవలయును.  యథాశక్తిగా దక్షిణను సమర్పించి వారిని పంపవలయును. తరువాత ఇష్టులతో కలిసి తాను వాఙ్మయమముతో భుజించవలయును. ఆ దినమున భూమి శయ్యను ఏర్పరచి బ్రహ్మ చర్యమును అవలంబించవలయును. ఇట్లాచరించిన మనుజుడు హనుమదనుగ్రహముచే సకలాభీష్టములను పొందగలడు. భూమి మీద హనుమతతిమను లిఖించి, ఆ ప్రతిమముందు మంత్రమును సాధించదలచిన వాని పేరును ద్వితీయాంతముగా వ్రాసి, దాని తరువాత “విమోచయ విమోచయ” అను వ్రాయవలయును. వామహస్తముచే తుడిచి మరల వ్రాయవలయును. ఇట్లు నూటా ఎనిమిదీ మార్లు వ్రాసి తుడువవలయును. ఇట్లు చేసినచో మహాకారాగార బంధమునుండి విముక్తుడగును. ఇట్లు పల్లవమును లిఖించుచు ఇతర కార్యములను చేయవలయును. ఇతరములను వశము చేసుకొనవలయునన్న ఆవాలచే హోమమును చేయవలయును. శత్రత్వమున మినుములచే హోమమును చేయవలయును. కుంకుమచే కొని, ఇద్మ కాష్టములచే కాని, మిరియాలచే కాని, జీలకఱచేకాని, పెరుగుచేకాని, పొలచేకాని నేయిచేకాని చేయవలయును. శూలరోగమున నూనె కలిపిన కరంజవొలూరి సమిధలచే కాని, తైల మిశ్రితములగు నిరుడీసమిధలచే కాని, సౌభాగ్యమునకు చందనములచే కాని, ఇంద్రలోచనములచే కాని, లవ్ గములచేకాని, వస్త్ర ప్రాప్తికి సుగంధ పుష్పములచే, ఆయాధాన్యముల ప్రాప్తికి ఆయాధాన్యములచే హోమమును చేయవలయును. రాజీలవణమిశ్రితములైన శత్రుపాదరజములచే ఏడుదినములు హోమమును గావించినచో శత్రువు యమలోకమును చేరును. ధాన్యముచే హోమమును చేసినచో ధాన్యము లభించును. అన్నముచే హోమము గావించిన అన్నసమృద్ధి కలుగును. గేదెలు ఆవులు సమృద్ధిగా  కలుగుటకు తిలాజ్యక్టీర మధువులచే హోమమును చేయవలయును. ఇంకనూ ఏమి చెప్పవలయును. విషభయమున, వ్యాధియందు, శాంతియందు, మోహమందు, మారణమున, వివాదమున, స్తంభనమున, ద్యూతమున, భూతభయమున, సంకటమున, వశీకరణమున, యుద్దమున క్షత్రియందు, దివ్యములైన బంధమోక్షములందు, మహారణ్యమున ఈ మంత్రమును సాధించిన నరులకకకకు శ్రేయస్సు చేకూరును.

 ఇక ఇపుడు సర్వసిద్ధి ప్రదాయకమగు హనుమద్యస్త్రమును చెప్పెదను. లాంగులాకారసంయుక్తముగా వల యత్రయమును లిఖించవలయును. పాశబీజమున ప్రవేశింపచేసి మధ్యభాగమున సాధ్యనామమును లిఖించవలయును. పైభాగమున అష్టదళములను లిఖించి పత్రములందు కవచమును లిఖించవలయును. బయటి భా, పత్రములందు కవచమును  లిఖించవలయును. బయటి భాగమున దంతమును లిఖించి, దాని వెలుపల చతురస్రమును, చతురస్రరేఖాగ్రభాగమున త్రిశూలములను లిఖించవలయును. భూపురాష్ట్రవజ్రములలో ‘సౌం’ అను బీజమును కోణములయందు అంకుశమును లిఖించి మాలామంత్రముచే పరివేష్టించవలయును. దీనినంతటిని యంత్రవలయత్రితయముచే వేష్టనము చేయవలయును. శిలయందు కాని, ఫలకమునందుకొని, తాళపత్రమునందుకొని భూర్జ పత్రమునందు  కాని గోరోచన కస్తూరి కుంకుమలచే ఈ యంత్రమును వ్రాసి నిరాహారుడై, ఇంద్రియములను జయించి, హనుమంతునికీ ప్రాణప్రతిష్ఠ చేసి యథావిధిగా పూజించవలయును. సమస్త దుఃఖనాశనమునకై ఈ యంత్రమును ధరించవలయును. మారణ, జ్వర, అభిచారాది సర్వోపద్రవములు ఈ యంత్రధారణము వలన నశించును. స్త్రీలు బొలులు ధరించినచో సర్వలోకము వశ్యమగును. ఈ యంత్రమును చూచిన వెంచనే భూతకృత్యా పిశాచాదులు పొరిపోవును.

ఇక ఇపుడు మాలామంత్రమును చెప్పెదను. మొదట తారము తరువాత వాక్కులక్ష్మి దీర్ఘత్రయాన్వితా మాయా మొదట చెప్పిన పంచకూటములు ధ్రువము హృదయము. “ఓం నమో హనుమతే ప్రకటపరాక్రమ! ఆక్రాంత దీజ్ మండల యశోవితాన ! ధనళీకృత జగత్తాతయ ! వజ్రదేహ ! జ్వలదగ్ని సూర్యకోటిసమప్రభ తనూరుహ ! రుద్రావతార ! లంకాపురీదహన ! ఉదధిలంఘన ! దశగ్రీవశిరఃకృతాంతక ! సీతాశ్వసన ! వాయుసుత ! అంజనాగర్భసంభూత ! శ్రీరామలక్ష్మణాన్విత ! నందంతికర ! సైన్యప్రాకార ! సుగ్రీవసఖ్యక ! రణవాలినిబర్హణకరణ ! ద్రోణ పర్వతోత్పాటన ! అశోక వనవిధ్దారణ ! అక్ష కుమారకచ్ఛేదన ! వనరక్షకరసమూహవిభంజన ! బ్రహ్మస్త్ర బ్రహ్మ శక్తి గ్రస. ! లక్ష్మణ శక్తి భేద నివారణ ! విశల్యోషధి సమానయన ! బాలోదిత భానుమండల గ్రసన ! మేఘనాద హోమ విధ్వంసన ! ఇంద్రజి ద్వధ కారణ ! సీతారక్షక ! రాక్షసీ సంఘ విదారణ ! కుంభకర్ణాది వధ పరాయణ ! శ్రీరామ భక్తి తత్పర ! సముద్రవ్యోమద్రుమ లంఘన ! మహాసామర్థ్య ! మహాతేజఃపుంజ విరాజమాన ! స్వామి వచనసంపాదితార్జున సంయుగ సహాయ ! కుమార బ్రహ్మ చారిన్ ! గంభీరోదయ దక్షిణాపథ మార్తాండ ! మేరు పర్వత పీఠికార్చన ! సకల మంత్రమ ! ఆచార్య ! మమ సర్వగ్రహ వినాశన ! సర్వజ్వరోచ్చాటన ! సర్వవిషవినాశన ! సర్వాపత్తి నివారణ ! సర్వదుష్ట నిబర్హణ ! సర్వవ్యాధ్యాది భయనివారణ ! సర్వశత్రుచ్చెదన ! మమ పరస్యచ త్రిభువన పుంస్త్రీ నపుంసకాత్మక సర్వజీవ జాతం వశయ! వశయ ! మమాజోకొరకం సంపాదయ ! సంపాదయ !” అని పఠించి నానా నామధేయములు గల సర్వరాజులను పఠించవలయును. “పరీవారాన్ మమ సేవకన్ కురు కురు సర్వశస్త్రాస్తవిషాణి విధ్యంసయ ! విధ్వంసయ !”  తరువాత లజ్జా దీర్ఘత్రయో పేతమగు హోత్రయమును ఏహిద్వయమును, పంచకూటములను విలోమము గా  నుచ్చరించి “సర్వశత్రూన్ హన హన ! పరబలాని పర సైన్యాని కోభయ ! శోభయ ! మమ సర్వకార్యజాతం సాధయ సాధయ ! సర్వదుష్టదుర్జన ముఖాని కీలయ ! కీలయ ! “ ఆని పలికి తరువాత దౌత్రయమును వర్మ త్రితయమును, ఫట్ త్రయమును, హాంత్రయమును, పలికి “స్వాహా” అని చివరికి పలికిన ఇది మాలామంత్రమగును. సకలా భీష్టప్రదము 588 వర్ణములు గల మంత్రమిది. సర్వేష్టసాధకము మహాభయమున, మహోత్పాతమున ఈ మంత్రము దుఃఖనాశకము ద్వాదశాక్షరి యొక్క షట్కూటమును వదిలి ఆది బీజమును కలిపి పంచకూటాత్మకమగు ఈ మంత్రము సర్వాభీష్టప్రదాయకము ఈ మంత్రమునకు రామచంద్రుడు ముని, గాయత్రీ ఛందస్సు, హనుమంతుడు దేవత. అఖిలాప్తికి వినియోగము చేయవలయును. సంపూర్ణపంచబీజములతో షడంగములను కల్పించవలయును. “రామదూతాయ” ‘లక్ష్మణ ప్రాణదాత్రే’ ‘అంజనీసుతాయి’  ‘సీతాశోకవినాశాయ’ ‘లంకాప్రాసాద భంజనాయ’ ‘హనుమతే’ అను వాటిలో మొదటి అయిదు బీజాదులగును. ఇవియే షడంగమంత్రములు. ధ్యాన పూజాదికమంతయు పూర్వము వలె నాచరించవలయును. ప్రణవము పొగృవము పద్మోమాయా దీర్ఘత్రయాన్వితము పంచకూటములు గల ఈ మంత్రము ఏకాదశాక్షరములు గలది సర్వసిద్ధిప్రదము. ఈ మంత్రమునకు కూడా ధ్యానపూజాదికమంతయు పూర్వము వలే నాచరించవలయును. ఈ మంత్రము నారాధించినచో సర్వాభీష్టముల నొసంగును.

“నమో భగవతే అనంత చంద్రశేఖరాంజనేయాయ మహాబలాయ స్వాహా” ఈ మంత్రము పదునెనిమిదికరములు కలది. ఈశ్వరుడు ముని అనుష్టుమ్ ఛందస్సు. పవనాత్మజుడగు హనుమంతుడు దేవత హం బీజము స్వాహాశక్తి ఆంజనేయాయ అనునది హృదయము. రుద్రమూర్తయే అనునది శిరస్సు. వాయుపుత్రాయ అనునది శిఖ. అగ్ని గర్భాయ అనునది కవచము. రామదూతాయ అనునది నేత్రము. బ్రహ్మాస్త్రాయ అనునది అస్త్రము. చక్కగా పుటము పెట్టిన బంగారు వన్నె కలవాడు, అంజలిబద్దుడు, చలత్కుండలదీప్తాస్యుడు, పద్మాకుడగు మారుతిని స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి పది వేలు జపించి దశాంశమును తిలలచే హోమమును చేయవలయును. పూర్వోక్తవిధానముతో వైష్ణవ పీఠమున పూజించవలయును. ప్రతిదినము అష్ణోత్తరశతమును జపించుచు రాత్రి మాత్రమే భోజనము చేయుచు జితేంద్రియుడైయున్నచో కుద్రరోగముల నుండి విముక్తి పొందును. మహారోగ నివృత్తికి ప్రతిదినము సహస్రము జపించవలయును. రాక్షససమూహములను సంహరించుచుఉన్న పొపనోశకుడగు హనుమంతుని ధ్యానించి ప్రతిదినము పదివేలు జపించినచో త్వరలో శత్రువును జయించును. సుగ్రీవునితో రాముని కలుపుచున్న హనుమంతుని స్మరించి పదివేలు జపించినచో శత్రువులచే సంధి కుదురును. లంకాదహనమును గావించుచున్న ఆంజనేయుని ధ్యానించి పదివేలు జపించినచో త్వరలో శత్రుగ్రామములను దహింప చేయును. ప్రయాణ సమయమున హనుమంతుని ధ్యానించి మంత్రమును జపించినచో వెళ్ళిన చోట త్వరగా తన అభీష్టమును సాధించుకొని తిరిగి ఇల్లు చేరును. జపతత్పరుడై ఇంటిలో ప్రతి నిత్యము ఆంజనేయుని అర్చించువాడు ఆరోగ్యమును, సంపదను, కాంతిని ఉపద్రవరాహిత్యమునను పొందును. ఈ మంత్రమును స్మరించినచో అరణ్యమున వ్యాఘ్రచోరభయము నుండి కాపాడబడును. నిదురించు సమయమున ఈ మంత్రమును స్మరించినచో దుస్స్వప్న చోరభయములు తొలగును.

“శ్రీ హనుమతే రుద్రాత్మకాయ స్వాహా” అను మంత్రము ద్వాదశాక్షరి ఈ మంత్రము అష్టసిద్ధులను కలిగించును. ఈ మంత్రమునకు రామచంద్రుడు ముని జగతీ ఛందస్సు హనుమంతుడు దేవత. ఆద్యబీజము హుం ఆనునది శక్తిషడ్డీర్ఘయుతమగు బీజములచే షడంగములను కల్పించవలయును మహాపర్వతమును పెకిలించి శత్రువు మీదికి లంఘించుచున్న, లాక్షారక్తారుణుడు, రౌద్రుడు, కాలాంతకయమోపముడు, మండుచున్న అగ్నివంటివాడు, జయశీలుడు, కోటి సూర్యసమప్రభుడు, ఆంగదాది నుహవీరులతో పరివేష్టితుడు, రుద్రరూపి, యుద్ధమున ‘దుష్టుడా నీలు నిలు” అని మహా నాదమును చేయువాడు శైవరూపియగు ఆంజనేయుని పూజించి ధ్యానించి లక్ష జపించవలయును. దశాంశమును పాలు పెరుగు నెయ్యి కలిపిన ధాన్యముచే హోమమును చేయవలయును. పూర్వోక్తమగు వైష్ణవపీఠమున విమలాదియుతమగు దొని పై మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి హనుమంతుని పూజను విధివిధానముగా చేయవలయును. కేవలము ధ్యానము చేసిన నరులను కూడా సిద్ధి కలుగును. ఇక ఇపుడు లోకహితమును కోరి ఈ మంత్రసాధనమును చెప్పేదను. ఈ హనుమత్సాధనము పరమ పావనము. మహాపాతకనాశనము. ఇది అత్యంత రహస్యమైనది. మానవులకు శీఘ్రసిద్ధి ప్రదము. హనుమంతుని అనుగ్రహముచే మంత్రసిద్ధి పొందినవాడు త్రైలోక్యవిజయి కాగలడు. ప్రాతఃకాలమున స్నానమాచరించి, నదీతీరమున దర్భాసనమున కూర్చుండి, మూలమంత్రముచే ప్రాణాయామమును షడంగకల్పనను చేయవలయును. అష్ట పుష్పాంజలులనిచ్చి, సీతాసహితుడగు రాముని ధ్యానించి, తామ్ర పొత్రమునందు కేసరములతో కూడిన అష్టపత్రపద్మమును చక్కగా మర్థించిన చందనముచే శలాకతో లిఖించవలయును. కర్ణికయందు మహామంత్రమును లిఖించి అచట కపీశ్వరుని ఆవాహించి, మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ధ్యానించి పొద్యొదికము నోసంగవలయును. మూలమంత్రముచే గంధపుష్పాదికములను నివేదించి కేశరములందు షడంగములను కల్పించి, దలములందు సుగ్రీవుని, లక్ష్మణుని, అంగదుని, నలనీలులను, జాంబవంతుని, కుముదుని, కేసరీశుని చక్కగా అర్చించవలయును. తరువాత దిక్పాలకులను వజ్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత తన ఇష్టమును సాధించుకొనవచ్చును. నదీతీరమున కొని, కొనన మునకాని, పర్వతమున కాని, ఏకాంతమున కాని సాధకుడు భూమిగ్రహణ పూర్వకముగా సాధించవలయును. జితాహారుడై, జీతశ్వాసుడై, జితవాక్కె, జితేంద్రియుడై, దిగ్బంధనాదికమును చేసి న్యాసధ్యానాదిక పూర్వకముగా మంతర్రాజమును లక్ష జపించి, పూర్వమువలె పూజించి, లక్షముగిసిన తరువాత దివసమున మహాపూజనమును చేయవలయును. ఏకాగ్రమనస్సుతో పవనాత్మజుని ధ్యానించి హనుమత్సందర్శనమగు వరకు దివారాత్రములు జపించవలయును. నిశీధకాలమున హనుమంతుడు సాధకుని ధార్యమును గుర్తించి సుప్రసన్నుడై సాధకుని ముందు ప్రత్యక్షమగును. సాధకుడు కోరిన వరమునిచ్చును. అట్లు వరమును పొంది సాధకుడు సుఖముగా విహరించవచ్చును. లోకహితమును కోరి అతిరహస్యము, పరమ పవిత్రము, దేవతలకు కూడా దుర్లభము అగు ఈ సాధనమును తెలియజేసితిని.

 ఆత్మ కు హితకరములగు ఇతర ప్రయోగములను కూడా సాధించవలయును. “శ్రీ పవననందనాయ స్వాహా” అను మంత్రము దశాక్షరి సర్వకామప్రదము. ఈమంత్రములకు మున్యాదీకము షడంగములు పూర్వము వలెనే తెలియవలయును. కోటి సూర్యసమప్రభుడు, యుద్ధమున రావణుని జయించుటకు లంఘించుచున్న, రణభూమియందు పడి యున్న మహావీరుడగు లక్ష్మణుని చూచి లేచినవానిని, గొప్ప కోపమును కలిగించి గొప్ప పర్వతమును గ్రహించ యత్నించువానిని, దర్పముచే చేయు సింహనాదములచే జగత్తయమును కంపింప చేయుచున్నవాడు, బ్రహ్మండమంతయు వ్యాపింపచేయు భయంకర శరీరము కలవాడు అగు హనుమంతుని ధ్యానించవలయును. మంత్రమును ఒక లక్ష జపించవలయును. పూర్వము వలె హోమమును చేయవలయును. ఈ మంత్రమునకు పూజనము కూడా పూర్వము వలెనే చెప్పబడినది. ఇట్లు మంత్రము సిద్దించిన తరువాత ఆత్మ హితమును సాధించవలయును. ఈ మంత్రమునకు కూడా సాధనము పరమ రహస్యము. సర్వతంత్రములందుకూడా చక్కగా రక్షింపదగినది. అందరికీ ఈయరాదు. బ్రాహ్మీ ముహూర్తమున లేచి నిత్యకృత్యములను నెరవేర్చుకొని పరిశుద్దుడై నదికి వెళ్ళి స్నానమాచరించి అష్టతీర్థములను ఆవహించి, మూలమంత్రమును జపించి పన్నెండు మార్లు ప్రోక్షించవలయును. ఇట్లు స్నానాదికమునాచరించి గంగాతీరమున కొని, పర్వత ప్రాంతమున కాని వనమున కానీ భూమిగ్రహణ పూర్వకముగా ఆద్యవర్ణములచే పూరకమును, పంచవర్గములతో కుంభకమును, యాదులచే రేచకమును ఆచరించి ప్రాణాయామము నాచరించి పీఠన్యాసావధిగా భూతశుద్ద్యాదికమును ఆచరించి, ధ్యానము చేసి పూర్వోక్త విధిచే కపీశ్వరుని చక్కగా పూజించి సాధకుడు కపీశ్వరుని ముందు గొప్ప పూజనమాచరించవలయును. ఏకాగ్రమనస్సుతో దివారాత్రములు జపించవలయును. రాత్రి మూడు భాగములు మిగిలియుండగా నిశ్చయముగా హనుమంతుడు వచ్చి, అభయము నిచ్చి కోరిన వరము నొసంగును. విద్యను కాని, ధనమును కొని, రాజ్యమునుకాని, శత్రునిగ్రహమును కొని ఆక్షణముననే పొందగలడు. ఈ విషయమున సంశయమేలేదు. ఈ లోకమున సకలాభీష్టములను పొంది అంతమున మోక్షమును పొందును. సద్యొచితము వాయుయగు ము హనుమంత అని పలికి, ఫలాంతమున ప్రక్రియా నేత్రయుక్తమగు కానిక తరువాత ధగంతమున ధగిత యని పలికి ఆయురాస్వపదమును లోహిత గరుడ పదములచే హేతి బాణ నేత్రాక్షరమగు మంత్రమిది. మున్యాదికమంతయూ పూర్వోక్త విధానముగా నుండును. ఈ మంత్రమున ధ్యానించబడు హనుమంతుడు ప్లేహరోగమును హరించును. ఈ మంత్రమునకు హనుమంతుడు దేవత. ప్లేహరోగయుక్తమగు ఉదరమున నాగవల్లీ దలమునుంచి పై భాగమున ఆచ్చాదన చేయవలయును. తరువాత ఎనిమిది రెట్లు వస్త్రమునుంచి వంశ శకలమును దాని పై నుంచవలయును. తరువాత కపీశ్వరుని స్మరించవలయును. ఆరణ్యసాణమున పుట్టిన వహ్నియందు యష్టినీ తపింపచేయవలయును. బదరీవృక్షజమగు ఆ యష్టిని ఈ మంత్రముచే ఏడు మార్లు జఠరమున నున్న వంశశకలమును తొడనము చేయవలయును. ఇట్లు ఏడుమార్లు కొట్టినచో ప్లేహరోగము నశించును. “ఓం నమో భగవతే ఆంజనేయాయ” అనునది మంత్రము. దీని తరువాత “శృంఖలాం త్రోటయత్రోటయ బంధమోక్షం కురు కురు స్వాహా” అని పలుకవలయును. ఇట్లు మంత్రము పరిపూర్ణము. ఈ మంత్రమునకు ముని ఈశ్వరుడు. అనుష్టుప్ఛన్దస్సు. శృంఖలామోచనుడు పవనాత్మజుడగు హనుమంతుడు దేవత. హం అనునది బీజము, ఈ ద్వయము శక్తి, బంధమోక్షము వినియోగము. షడీర్ఘవ హ్నియుక్తమగు బీజముచే అంగములను కల్పించవలయును. వామభాగమున వైరిభేదకమగు శైలమును, దక్షిణభాగమున టంకమున ధరించినవాడు, స్వర్ణవర్ణుడు, కుండలియగు హనుమంతుని ధ్యానించవలయును, ఇట్లు ధ్యానము చేసి లక్ష జపించవలయును. దశాంశమును మామిడి చిగురులచే హోమమును చేయవలయును. పూజనమంతయు పూర్వోక్తవిధానమున గావించవలయును. మహాకారాగృహము ప్రాప్తించినచో పదివేలు జపించవలయును. త్వరగా కారాగృహమునుండి విముక్తుడై ఆనందించును. ఇక ఇపుడు శుభము. బంధమును విడిపించు యంత్రమును చెప్పెదను.

అష్టదళములలోపల సాధ్యానామసమన్వితముగా షట్కోణమును లిఖించవలయును. షట్కోణములలో ధ్రువమును ‘ఆంజనేయాయ’ అను పదమును వ్రాయవలయును. అష్టదళములలో ప్రణవమును వాతు వాతు అని వ్రాయవలయును. గోరోచనముచే కుంకుమచే ఈ ఉత్తమ యంత్రమును వ్రాసి శిరస్సున ధరించి పదివేలు జపించవలయును. మట్టిమీద కుడిచేతితో వ్రాసి చెరుపవలయును. ఇట్లు నలుబది రోజులు ప్రతిదినము చేసినచో మహాకారాగారమునుండి విముక్తి లభించును. గగనము, అగ్ని, సూర్యుడు, మర్కట మర్కట అనునది జలము, చంద్రుడు, మకరము పరిముంచతి ముంచతి శృంఖలికా వీటితో కలిసి ముప్పది నాలుగక్షరముల మంత్రము. ఈ మంత్రమును కుడి చేతియందు వ్రాసి వామహస్తముచే చేరిపి మంత్రమును అష్టోత్తర శతమును జపించవలయును. ఇట్లు మూడు సప్తాహములు చేసినచో బద్దుడు ముక్తుడగును. ఈ మంత్రమునకు మున్యాదికము పూజాదికమంతయు పూర్వము వలె చేయవలయును. ఒక లక్ష జపము చేసి శుభ ద్రవ్యములచే హోమమును చేయవలయును. పుచ్చాకారమగు పవిత్రవస్త్రమునందు కురకము వలన ఏర్పడిన లేఖినిచే గంధాష్టకములచే హనుమంతుని సుందరరూపమును లిఖించవలయును. ఆ మధ్యలో అష్టాక్షరిని దశాక్షరిని శత్రునామ సహితముగా వ్రాయవలయును. ఆ యంత్రమును మంత్రించి శిరమున ధరించి యుద్ధములకు వెళ్ళినచో శత్రు సైన్యమును జయించును. సూర్య చంద్రగ్రహణములలో పూర్వోక్త యంత్రమును ధ్వజమున వ్రాయవలయును. గ్రహణ స్పర్శనుండి మోక్షము వరకు మంత్రజ్ఞుడు ధ్వజమును తీసుకొని మాతృకామంత్రమును జపించవలయును. తరువాత దశాంశమును హోమముగావించవలయును. సంస్కరించబడిన అగ్ని హోత్రములో ఆవాలు కలిపిన నువ్వులతో హోమమును చేసి గజము పై ధ్వజమునుంచి యుద్ధమునకు వెళ్ళవలయును. గజము పైనున్న ధ్వజమును చూచి శత్రువులు పారిపోవుదురు. ఇక ఇపుడు మహారక్షాకరమగు హనుమద్యంత్రమును చెప్పెదను. మొదట అష్టదళపద్మమును లిఖించి సాధ్యనామయుతముగా కర్ణికను వ్రాయవలయును. దాని బయట మాయచే వేష్టించి ప్రాణప్రతిష్ఠ చేయవలయును. స్వర్ణలేఖినితో చక్కని భూర్జపత్రమము పై కాశ్మీరరోచనములచే వ్రాయబడిన యంత్రమును లోహత్రముచే కప్పివైచి చక్కగా సాధించిన యంత్రమును భుజమున కాని శిరస్సును కాని ధరించవలయును. యుద్దమున, దూత్యమున, పొదమున, వ్యవహారమున జయము లభించును. గ్రహములచే, విఘ్నములచే, విషయములచే, శస్త్రములచే చోరులచే భయము కలుగదు. అన్ని రోగములను పారదోలి నూరు సంవత్సరములు జీవించును. షడ్దర్షయుక్తాకాశము, తార సంపుటమగు అగ్నితో కూడిన ఈ మంత్రము అష్టాక్షరీమంత్రము “ఓం నమో ఆంజనేయాయ” అనునది. ఇక ఇప్పుడు మాలామంత్రమును చేప్పెదను. “ఓం వజ్రకాయ! వజ్రతుండ ! కపిల ! పింగల ! ఊర్ద్వ కేశ ! మహాబల ! రక్తముఖ ! తడిజ్జిహ్వా ! మహారౌద్రదంష్ట్ర ! ఉత్కటం వహ ! వహ ! కరాల ! మహాధృడ ప్రహారేణ లంకేశ్వరవధాత్ వాయు మహా సేతుబంధ ! మహా శైల ప్రవాహ గగనే చర ! ఏ హ్యే హి ! భగవన్మహాబల పరాక్రమ ! భైరవ'! ఆజ్ఞాపయ ! ఏ హ్యే హి ! మహారౌద్ర ! దీర్ఘపుచ్చేన వేష్టయ వైరిణమ్. జంభయ జంభయ ! హుంఫట్” ఇది మాలామంత్రము. శరనేత్రధరాక్షరము. మాలామంత్రమునకు అష్టాక్షరికి మునిపూజాదికము పూర్వమువలెనే యుండును. యుద్దమున జపించిన జయము, వ్యాధిలో వ్యాధినాశనము, జరుగును. ఇట్లు వాయుపుత్రుడగు కపీశ్వరుని భజించువాడు దేవతలకు కూడా దుర్లభములగు సకలాభీష్టములను పొందును. ధనధాన్యపుత్రపౌత్రసౌభాగ్యకీర్తి మేధావిద్యాప్రభారాజ్యములను వాదవిజయమును, సర్వలోకవశ్యతను యుద్ధజయమును ఆంజనేయుని అనుగ్రహమువలన పొందును.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున సనత్కుమార విభాగమున తృతీయపాదమున హనుమన్మస్త్రకథనమను డెబ్బదినాలుగ - అధ్యాయము సమాప్తము.