నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

89 - లలితా స్తోత్రకవచసహస్రనామకథనమ్

సనత్కుమార మహర్షి పలికెను :- ఇక ఇపుడు ఈఆవరణములలో నుండు శక్తులనియమములననుసరించి గురుధ్యాన పురస్పరముగా నామసహస్రమును చెప్పెదను. ప్రకాశమొదలుకొని సుభగవరకు తొమ్మిదిమంది నాధలుగా చెప్పబడిరి. భూమి మొదలుకొని శివవరకుండునవి తత్త్యములని తెలియుము. గురుజన్మమొదలుకొని దర్శవరకు ఏడుపరలు. వీటిని సాధకుడు మొదట ధ్యానించవలయును. తద్దత మనస్కుడై గురుస్తోతమును జపించవలయును. ఓనాథ! గురురూపుడవగు శివా! నీకు నమస్కారము. విద్యావతార సంసిద్ధి కొరకు అనేక రూపములను స్వీకరించితివి. నవునకు, నవరూపునకు, పరమార్థక రూపునకు, సర్వా జ్ఞానతమోభేద భానునకు చిదనరూపునకు, స్వతంత్రునకు, దయాక్లుప్త విగ్రహునకు, శివస్వరూపునకు, భక్త పరతంత్రునకు భవ్యులకు భవ్యరూపునకు, వివేకులలో వివేకమునకు, విమర్శుల, విమర్శకు, ప్రకాశముల ప్రకాశమునకు, జ్ఞానుల జ్ఞాన రూపునకు ముందు, ఇరు ప్రక్కల, వెనుక, ఉపరి భాగమున, అధోభాగమున నమస్కరించెదను. ఎప్పుడూ నా చిత్త మందిరమున నీ నివాసము నేర్పరచుకొనుము. ఇట్లు భక్తిచే గురువును స్తుతించి పరాదేవిని ధ్యానించవలయును. గణేశ గ్రహ నక్షత్ర యోగినీ రాశి రూపిణి, మంత్ర స్వరూపిణియగు మాతృకాపీఠ రూపిణి, పరమేశ్వరి కాలహృల్లో హలోల్లోహ కలానాశనకారిణి యగు మహాదేవికి నమస్కారము ఈ దేవి మంత్రములోని ఒక అక్షరము సిద్ధించిననూ సూర్యగరుడ చంద్ర మన్మథ శంకర అగ్ని విష్ణువులతో నరుడు పోటీపడును. ఈ భువనత్రయము ఈ మంత్రాక్షర చంద్ర చంద్రకాంతులచే అలంకరించబడియున్నది. అట్టి మహా శ్రీ సిద్ధ మాతృకయగు సర్వేశ్వరీ దేవిని నమస్కరించెదను. ఈ జగత్రయము ఈ దేవీ మంత్రాక్షర సూత్రమున కూర్చబడియున్నది. అట్టి సిద్ధ మాతృకకు నమస్కారము. ఈ దేవి యొక్క ఏకాదశాధారము కోణ త్రయోద్భవ బీజము బ్రహ్మండాది కటాహాంతముగా గోచరమగుచున్నది. అ కచట తపయశ అక్షర వర్గాణి జ్యేష్టాంగ బాహుహృత్కంఠ కటిపాద నివాసిని ఈ కారాక్షరోద్ధార సారములన్నింటిలోని సారము, పరముల కంటే పరమగు దేవికి నమస్కారము. పరమానన్ద రూపిణి యగు మహాదేవికి నమస్కారము. అయిననూ ఈ దేవియొక్క ఒక్కకలను కూడా దేవతలు తెలియజాలరు. ఎవరీమె? ఎక్కడి నుండి వచ్చినది? ఎక్కడుండును? ఎట్లుండను? దేనిచేనుండును? సరూపారూపభావనలను తెలియజాలరు. అట్టి క్షయరహిత క్షకారాక్షరరూపిణి కులకలోల్లోల పొల్లపల్లి, శివ, పరయగు దేవిని నమస్కరించెదను. వర్గాను క్రమయోగముచే ఈమెకు ఉమాష్టకమని పేరు కలిగినది. అట్టి అష్టవర్గ భవమగు మహాసిద్ద్యాదికేశ్వరుని నమస్కరించెదను. కామ పూర్ణజకార సుపీఠాంతర్నివాసిని, చతురాజ్ఞాకోశభూత శ్రీత్రిపురాదేవిని నమస్కరించెదను. ఇట్లు నిత్యాదేవుల స్తోత్రమును సావధానముతో పూజాదియందు పఠించువానికి నిత్యాదేవతలందరు వరప్రదలౌదురు.

ఇక ఇపుడు నీకు నవరతాత్మకమగు దేవీకవచమును చెప్పెదను. ఈ కవచమును ఉపాసించు నరుడు దేవాసురనరులను జయించు వాడగును. అంతటా అన్నివేళలా అంతటనుండు లలితాదేవి కాపాడుగావుత. ముందు భాగమున కామేశి, వెనుక భాగమున భగమాలిని, కుడి ప్రక్క అన్ని వేళలా నిత్యక్లిన్న, నైఋతదిశను భేరుండ కాపాడుకొవుత. వహ్నవాసిని పశ్చిమ దిక్కును, వాయవ్యదిక్కున మహా వజ్రేశ్వరి, వామపార్వమును లలిత కాపాడు గావుత. సిద్ధి దాయినీ ఈశాన్య దిక్కును కాపాడు గావుత. కులసుందరిదేవత ఊర్థ్వ భాగమును కాపాడుదువుగాత. నీలపతాకాదేవి ఆధోభాగమును, విజయఅన్ని దిక్కులందు కాపాడుగావు. సర్వమంగళాదేవి నాకెల్లపుడు శుభములను ఇచ్చుగాక. జ్వాలామాలిని విగ్రహాదేహాశ్రియ మనః ప్రాణములును, చిత్తమును, చిత్తాదేవి ఎల్లపుడూ కాపాడుగావుత. కామక్రోధలోభమోహమదములనుండి, పాపశోకములనుండి అంతటా అన్ని వేళలా కాపాడుగావుత. అసత్యమునుండి, సంక్షయము నుండి, క్రూరాలోచన నుండి, వాసాచౌర్యముల నుండి సౌమిత్యము నుండి కాపాడుచు శుభములవైపు ప్రేరణ చేయు గావుత. తమ తమ శక్తులచే కూడుకొని గజారూఢులైన షోడశనిత్యలు నన్ను కాపాడుదురు గాత. అట్లే హయారూఢలు, సిహారూఢలు, ఋక్షారూఢలు, రథారూఢలు, గరుడారూఢలు, వ్యోమగతలు, భూగతలు అసర్వగతలు అన్ని వేళలా అన్ని దిక్కుల నుండి నన్ను రక్షించుగావుత. భూత ప్రేతపిశాచ పురకృత్యాదికలను, రోగములను స్వశక్తి భూషణాయుధములచే పారద్రోలుగావుత. గజవ్యాఘసింహ గరుడా రూఢలు, అభిలాయుధ ధారిణులు అసంఖ్యాక శక్తులు దేవీసముదాయము అంతటా అన్నివేళలా నన్ను కాపాడువు గావు. ఇట్లు ప్రతిదినము ప్రాత సాయంకాలములో సర్వరక్షకమగు నిత్యాకవచమును పఠించువారు ఎప్పుడూ అశుభమును చూడరు. ఎల్లపుడూ ఆనందమునే అనుభవింతురు. ఇట్లునీకు శుభావహమగు లలితా కవచమును చెప్పితిని. ఈ కవచమును ధరించుటచే నిర్భయుడూ విజయుడూ కాగలడు.

 ఇక ఇపుడు నీకు లలితా సహస్ర నామములను షోడశ శక్తుల క్రమాగతమగు ఆవరణార్చనమును చెప్పెదను. లలితా, కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నా భేరుండా, వహ్నివాసినీ, వశ్వరీ, దూతీ, త్వరితా, కులసుందరీ, నిత్యా, సంవత్, నీల పతాకా, విజయా, సర్వమంగలికా, జ్వాలామాలినీ, చిత్రా అను పదునారుమంది ఇష్ట విగ్రహాలు. కురుకుల్ల, వారాహి అను ఇద్దరు ఇష్ట విగ్రహాలు వశిని, కామేశి, మోహినీ, విమలా, అరుణ, తపని, సర్వేశ్వరి, కౌలినీ, ఇష్వర్ణ రూపా, అపర్ణ విగ్రహా, పాశవర్ణశరీర, ఆకుర్వర్ణసువపుర్ధరా, త్రిఖండా, స్థాపినీ, సన్నిరోధినీ, అవగుంఠనీ, ఇషు చాపాఖ్యా, పాశాంకుశాభిదో, నమస్కృతి, సంక్షోభణీ, విద్రావణీ, ఆకర్షణీ, విఖ్యాతా, ఆవేశకారిణీ, ఉన్మాదినీ, మహా. పూర్వా, కుశాభో, ఖేచరీ, బీజా, శక్త్యుష్ఠాపనా, స్థూలసూక్ష్మా పరాభిధా, అణిమా, లఘిమా, మహిమా, గరిమా, ప్రాప్తి, ప్రకామితా, ఈశితా, వశితా, భుక్తి, సిద్ది, ఇచ్చా, సిద్దిరూపా, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఇంద్రాణీ, చాముండా, మహాలక్ష్మీ, కామా, బుద్ధి, అహంకార శబ్ద స్పర్శ స్వరూపిణీ, ఆత్మరూపిణీ, కుసుమా, మేఖలా, మదనా, మదనాతురా, రేఖా, సంవేగినీ, అంకుశా, మాలినీ, సంక్షోభిణీ, విద్రావిణీ, ఆకర్షణ రూపిణీ, ఆహ్లాదినీ, సంమోహినీ, స్తంభినీ, జంభినీ, వశంకరీ, రంజినీ, ఉన్మాదినీ, అర్థసాధినీ, సంపత్తి పూర్ణా, మంత్రమయీ, ద్వంద్వక్షయంకరీ, సిద్ది, సంపత్ర్పదా, ప్రియ మంగలకారిణీ, కామప్రదా, దుఃఖ విమోచనీ, మృత్యుప్రశమనీ, విఘ్న నివారిణీ, అంగసున్దరికా, సౌభాగ్యదాయినీ, జ్ఞానైశ్వర్య ప్రదా, జ్ఞానమయీ, పంచమి, విన్ద్యవాసనకా, మౌర స్వరూపా, పాపహారిణీ, ఆనన్దమయీ, రక్షా, రూపేప్సిత ఫలప్రదా, జయినీ, విమలా, కామేశీ, వజ్రాణీ, భగాత్రే లోక్యమోహనా, స్థానా, సర్వాశాపరిపూరిణీ, సర్వసంక్షోభణగతా, సౌభాగ్యప్రద సంస్థితా, సర్వార్థ సాధకాగారా, సర్వరోగహరా, స్థితా, సర్వరక్షాకరస్థానా, సర్వసిద్ధి ప్రదస్థితా, సర్వానన్దమయా, ఆధార బిన్లు స్థాన శివాత్మికా, ప్రకృష్టా, గుప్తా, జైయా, గుప్తతరా, సంప్రదాయ స్వరూపా, కులకౌలని గర్భగా, రహస్య, పరాపరప్రాకృత్, అతి రహస్యకా, త్రిపురా, త్రిపురేశీ పురవాసినీ, శ్రీమాలినీ, సిద్దాయీ మహా త్రిపుర సుందరి, నవరత్నమయ ద్వీప నవఖండ విరాజితా, కల్పకో ద్యాన సంస్థా, ఋతు రూపేంద్రియార్చకా. కాలముద్రా, మాతృకాఖ్యా, రత్న దేశోప దేశికా, తత్యాగ్రహాభిధా, మూర్తి, విషయద్విపా, దేశకాలాకార శబ్ద రూపా, సంగీత యోగినీ, సమస్త గుప్త ప్రకట సిద్ద యోగిని చక్రయుక్, వహ్ని సూర్యేష్ణు భూతాహ్వా, ఆత్మాష్టాక్షరాహ్వయా, పంచధార్చ స్వరూపా, నానావ్రత సమాహ్వయా, నిషిద్దా చారరహితో, సిద్ద చిహ్న స్వరూపిణీ, చతుర్థాకూర్మ భాగస్తా, నిత్యాద్యర్చా స్వరూపిణీ, దమనాది సమభ్యర్చ్యా, షట్కర్మ సిద్ది దాయినీ, తిధి వార పృధగ్రవ్య సమర్చన శుభావహా, వాశ్య నంగకుసుమా, అనంగమేఖలా, ఆనంగమదనా, ఆనంగమదనాతురా, మదగినికా, భువన పాలినీ, శశిరేఖా, సముద్దిష్ణా, గతిలేఖా హ్వయా, శ్రద్దా, ప్రీతి, రతి, ధృతి, కార్న్, మనోరమా, మనోహరీ, మనోరధా, మదనోన్మాదినీ, మోదినీ, శంఖినీ, శోషిణీ, శంకరీ, సింజనీ, సుభగా, పూషా, వాసుమనసా, రతి, ప్రీతి, ధృతి, బుద్ధి, సౌమ్యా, మరీచి, అంశుమాలినీ, శశినీ, అంగిరా, ఛాయా, సంపూర్ణ మండలా, తుష్టి, అమృతా, డాకినీ, లోకపా, బటుకా, ఇభ స్వరూపా, దుర్గా, క్షేత్రశరూపిణీ, కామరాజ స్వరూపా, మన్మథరూపిణీ, కందర్ప రూపిణీ, మకర కేతనా, మనో భవ స్వరూపా, భారతీ వర్ల రూపిణీ, మదనా, మోహినీ, లీలా, జంభినీ, ఉద్యమా, శుభా, హోదినీ, ద్రావిణీ, ప్రీతి, రతి, రక్తా, మనోరమా, సర్వోన్మాదా, సర్వముఖా, ఆభంగా, అమితోద్యమా, అనల్పావ్యక్త విభవా, వివిధక్షోభ విగ్రహా, రాగశక్తి, ద్వేషశక్తి, శబ్దాది రూపిణీ, నిత్యా, నిరంజనా, క్లిన్నా, దినీ, మదనాతురా, మదగ్రవా, ద్రావిణీ, మదావిలా, మంగలా, మన్మధానీ, మనస్వినీ, మోహా, మోదా, మానమయీ, మాయా,మందా, మితానతీ, విజయా, విమలా, శుభా, విశ్వా, విభూతి, వనితో, వివిధా, వినతా, కమలా, కామినీ, డాకినీ, శాకినీ, లాకినీ, కాకినీ, రాకినీ, ఇచ్ఛా, జ్ఞానా, క్రియా, ఆయుధాష్టకధారిణీ, కపర్దినీ, కులసుందరీ, జ్వాలినీ, విస్ఫులింగా, మంగలా, సుమనోహరా, కనకా, కినవా, విద్యా వివిధా, మేషా, వృషా, మిధునా, కర్కటా, సింహా, కన్యా, తులా, కీటా, చాపా, మకరా, కుంభ, మీనా, సారా, సర్వభక్షా, విశ్వాత్మా, వివిధోద్భూత చిత్రరూపా నిస్పృత్నా, నిరాతంకా, యాచనా, అచింత్య వైభవా, రక్తా, విద్యాప్రాప్తి స్వరూపిణీ, హృల్లేఖా, క్లేదినీ, క్లిన్నా, క్షోభిణీ, మదనాతురా, నిరంజనా, రాగవతీ, మదనావతీ, మేఖలా, ద్రావిణీ, వేగవతీ, కమలా, కామినీ, కల్పా, కలా,కలితో, అద్భుతా, కిరాతా, కాలా, కదనా, కేశికా, కంబువాదికా, కాతరా, కపటా, కీర్తి, కుమారీ, కుంకుమ, భంజినీ, వేగినీ, నాగా, చపలా, పేశలా, సతీ, రతి, శ్రద్ధా, భోగలోలా, మదోన్మత్తా, మనస్వినీ, విహ్వలా, ఆకర్షణీ, లోలా, మదనమాలినీ, వినోదా, కౌతుకా, పుణ్యా, పురాణా, వాగేశీ, వరదా, విశ్వా, విభవ, విఘ్నకారిణీ, బీజ విఘ్నహరా, విద్యా సుముఖీ, సుందరీ, సారా, సుమన్, సరస్వతీ, సమయా, సర్వగా, విద్దా, శివా, వాణీ, దూరసిద్దా, అథో విగ్రహావతీ, నాదా, మనోన్మనీ, ప్రాణప్రతిష్ఠా అరుణ వైభవా, ప్రాణా, అపానా, సమానా, వ్యానా, ఉదానా, నాగా, కూర్మా, కృకరా, దేవదత్తా, ధనంజయా, ఫట్కారీ, కింకరా, ఆరాధ్య, జయా, విజయా, హుంకారీ, ఖేచరీ, చండా, ఛేదినీ, క్షపిణీ, స్త్రీ హుంకారీ, క్షేమకరీ, చతురక్ష రూపిణీ, శ్రీ విద్యామత వర్ణాంగీ, కాలీ, యామ్యా, నృపొర్లకా, భాషా, సరస్వతీ, వాణీ, ప్రాకృత, సంస్కృతి, పరా, బహురూపా, చిత్తరూపా, రమ్యానందా, కౌతుకా, త్రయాఖ్యా, పరమాత్మాఖ్యా, అమేయ విభవా, వాక్స్వరూపా, బిన్లు సర్దరూపా, విశ్వాత్మికా, త్రిపుర కందాఖ్యా, జౌత్రాది త్రివిధాత్మికా, ఆయుర్లక్ష్మీ కీర్తి భోగసౌందర్యా రోగ్యదాయికా, ఐహికా ముష్మిక జ్ఞానమయీ, జీవా, విజయా, విశ్వ విన్మయీ, హృదాది విద్యా, రూపాది భానురూపా, జగద్వపు, విశ్వమోహనికా, త్రిపురా, అమృతా, సర్వాపాయన రూపా, మోహినీ, క్షోభణీ, క్లేదినీ, మహోదయా, సంపత్కరీ, లక్షార్జా, సీమామాతృతను, రతి, ప్రీతి, మనోభవా, వారాధిపా, త్రికూటా, షట్కూటా, పంచకూటా, విశుద్ధగా, అనాహతగతా, మణిపూరక సంస్థితా, స్వాధిష్టాన సమాసీనా, ఆధారస్థా, ఆజ్ఞా సమస్థితా, షత్రింశత్కూటరూపా, పంచాశ న్మిథునాత్మికా, పాదుకాదికసిద్దీశా, విజయ దాయినీ, కామరూప ప్రదా, వేతాల రూపా, పిశాచికా, విచిత్రా, విభ్రమా, హంసీ, భీషణీ, జనరంజికా, విశాలా, మదనా, తుష్టి, కాలకంఠీ, మహాభయా, మాహేన్రీ, శంఖినీ, ఐస్టీ, మంగలా, వటవాసినీ, మేఖలా, సకలా, లక్ష్మీ, మాలినీ, విశ్వనాయికో, సులోచనా, సుశోభా, కామదా, విలాసినీ, కామేశ్వరీ, నందినీ, స్వర్ణరేఖా, మనోహరా, ప్రమోదా, రాగిణీ, సిద్దా, పద్మినీ, రతిప్రియా, కల్యాణదా, కలాదక్షా, సురసుందరీ,విభ్రమా, వాహకా, వీరా, వికలా, కోరకొ, కవి, సింహనాదో, మహానాదా, సుగ్రీవా, మర్కటా, శఠా, బిడాలాక్షా, బిడాలాస్యా. కుమారీ, ఖేచరీ, భవా, మయూరా, మంగలా, భీమా,ద్విపవక్రా ఖరాననా, మాతంగీ, నిశాచారా, వృషNహా వృకాననా, సైరి భాస్యా గజముఖా, పశువక్రా, మృగాననా, క్షోభకా, మణిభద్రా, క్రీడకా, సింహచక్రకా, మహోదరా, స్థూలశిఖా, వికృతాస్యా, వరాననా, చపలా, కుక్కుటాస్యా, పాలినీ, మదనాలసా, మనోహరా, దీర్ఘజంఘా, స్థూలదన్హా దశాననా, సుముఖా, పండితా, క్రుద్దా, వరాహాస్యా, సటాముఖా, కపటా, కౌతుకొ, కాలా, కింకరా, కితవా, ఖలా, భక్షకా, భయదా, సిద్దా, సర్వగా, జయ, విజయా, దుర్గా, భద్రా, భద్రకరీ, అంబికా, వామదేవీ, మయామాయా స్వరూపిణీ, విదారికా, విశ్వమయీ, విశ్వా, విశ్వ విభంజితా, వీరా, విక్షోభిణీ, విద్యా, విభవా, వివిధా, విప్రా, మనోహరా,మంగలా, మదోత్సక్షా, మనస్వినీ, మానినీ, మధురా, మాయా, మోహినీ, భద్రా, భవానీ, భవ్యా, విశాలక్షీ, శుచిస్మితా, కకుభా, కమలా, కల్పా, కలా, పూరణీ, నిత్యా, అమృతా, జీవితా, దయా, అశోకా, అమలా, పూర్ణా, భాగ్యోద్యతా, వివేకా, విభవా, విశ్వామితతా, కామినీ, ఖేచరీ, గర్వా, పురాణా, పరమేశ్వరీ, గౌరీ, శివా, అమేయా, విమలా, విజయా, పరా, పవిత్రో, పద్మినీ, విద్యా, విశ్వేశ్, శివ వల్లభా, అశేషరూపా, ఆనందా, అంబుజాక్షి, అనిందితా, వరదా, వాక్యదా, వాణీ, వివిధ, వేద విగ్రహా, విద్యా, వాగీశ్వరీ, సత్యా, సంయుతా, సరస్వతీ, నిర్మలా, ఆనన్ద రూపా, అమృతా, మానదా, పూషా, పుష్టి, తుష్టి, రతి, ధృతి, శశినీ, చన్దికా, కాంతి, జ్యోత్స్నా, శ్రీ, ప్రీతి, అంగదా, పూర్ణా, పూర్ణామృతా, కామదాయిని, ఇందుకలాత్మికా, తపినీ, తాపినీ, భ్రూమ్రా, మరీచి, జ్వాలినీ, రుచి, సుషుమ్లా, భోగదా, విశావ, బాధినీ, ధారిణీ, క్షమా, ధూమ్రార్చి, ఊష్మా, జ్వలినీ, జ్వాలినీ, విస్ఫులింగినీ, సుశ్రీ, స్వరూపా, కపిలా, హవ్య కవ్యవహా, ఘస్మరా, విశ్వకబలా, లోలాక్షీ, లోల జిహ్వికా, సర్వభక్షా, సహస్రాక్షీ, నిస్సంగా, గతిప్రియా అచింత్యా, అప్రమేయా పూర్ణరూపా, దురాసదా, సర్వా, సంసిద్ది రూపా, పావనీ, ఏకరూపిణీ, యామలవేధా, వేదస్వరూపిణీ, శాంభవవేదా, "వనాసిద్ది సూచినీ, వహ్నిరూపా, ద్రసా, అమావిఘ్నా, భుజంగమా, షణ్ముఖా, రవిరూపా, మాతా, దుర్గా, విశా, ధనాధా, కేశవా, యమి, హరా, శశా, అశ్వినీ, యమి, వహ్నిరూపా, ధాత్రీ చంద్రా, శివా, అదితి, జీవా, సర్పిణీ, పితృరూపిణీ, అర్యమ్స్, భగా, సూర్యా, త్వాష్టి, మారుతి ఇంద్రాగ్నిరూపా, మిత్రా, ఇంద్రాణీ, నిఋతి, జలా, వైశ్వదేవీ, హరితభూ, వాసవీ, వరుణ, జయా, అహిర్బుధ్న్యా, పూషణీ, కారస్కరా, అమలా, ఉదంబురా, జంబువా, ఖదిరా, కృష్ణరూపిణీ, వంశా, పిప్పలా, నాగా, రోహిణీ, పలాశకా, పక్షవా అమ్బష్ణా, బిల్వా, అర్జునరూపిణీ, వికలకతా, కకుభా, సరలా,సర్జికా, వంజులా, పనసా, అర్కా, శమి, హలిప్రియా, ఆస్రుకొ, నింబా, మధూవా, అశ్వత్థా, గజా, నాగినీ, సారిణీ, శునీ, కపిరూపా, గోఘంటా, వానరీ, నరా, అశ్వినీ, నగా, గౌ, హస్తినీ, షట్చక్రవాసినీ, త్రిఖండా, తీరపాలా, భ్రమణీ, ద్రవిణీ, సోమా, సూర్యా, తిథి, వారా, యోగా, ఋక్షా, కరణాత్మకొ, యక్షిణీ, తారణా, వ్యోమ శబ్దాద్యా, ప్రాణినీ, ధీ, క్రోధినీ, సంభినీ, చందా,ఉచ్చండా, బ్రహ్మాదిరూపిణీ, సింహస్థా, వ్యాఘ్రగా, గజాశ్వగరుడస్థితా, భౌమాప్యా, తైజసీ, వాయు రూపిణీ, నాభసా, ఏకవస్త్రి, చతుర్వక్రా, నవవక్రా, కలావా, పంచవింశతి, వక్రో, షడ్వింశతివదనో, ఊనపంచాశ దాస్యా, చతుష్టష్టిముఖా, ఏకా శీతిముఖా, శతానన సమన్వితా, స్థూలరూపా, సాక్షిరూపా,తేజోవిగ్రహధారిణీ, వృణా, వృత్తిరూపా, నాథా, వృత్తి స్వరూపిణీ, తత్యావృత్తి స్వరూపా, నిత్యావృత్తివపుర్థరా, అంగావృత్తిస్వరూపా, ఆయుధావృత్తిరూపిణీ. గురుపంక్తి స్వరూపా, విద్యావృత్తితను, బ్రహ్మద్యా వృత్తిరూపా, పరా, పశ్యంతికా, మధ్యమా, వైఖరీ, శీర్షకంఠతాలోఅష్టదంతగా, జిహ్వామూలగతా, నాసాగతా, ఉరఃస్థలగా మినీ, పదవాక్యస్వరూపా, వేద భాషాస్వరూపిణీ, సేకాఖ్యా, వీక్షణాఖ్యా, ఉపదేశాభ్యా, వ్యాకులాక్షరసంకేలీ, గాయత్రీ, ప్రణవాదికా, జపహోమార్చన ధ్యానమంత్ర తర్పణ రూపిణీ, సిద్దసారస్వతా, మృత్యుంజయా, త్రిపురా, గారుడా, అన్నపూర్ణా, అశ్వారూఢా, నవాత్మికా, గౌరీ, దేవీ, హృదయా, లక్షదా, మతంగినీ, నిష్పత్రయపదా, చేష్టావాదినీ, రాజలక్ష్మీ, మహాలక్ష్మీ, సిద్ధలక్ష్మీ, గజాననా.

ఇట్లు ఇవి లలితా దేవీసహస్రనాములు సర్వార్థసిద్ధిప్రదములు. ఫలప్రదములు ఈ సహస్రనామస్తోతమును ఉషఃకాలమున చదివినచో అతను యోగీ, బ్రహ్మజ్ఞాని, శివయోగి, ఆత్మజ్ఞాని యగును. ప్రతిదినమురెండుమార్లు జపించినచో ఆయురారోగ్య సంపదలు, లోకానురంజనము, నారీనృపవశీకరణలు ఒకేసారి సిద్దించును. మూడుమార్లు జపించినచో సమస్త ప్రపంచము వశమగును. నాలుగు మార్లు జపించువానికి అఖిలాభీష్టములు సిద్ధించును. ప్రయోగార్హత లభించును. లోకరక్షాకరుడగును. అయిదుమార్లు జపించువానికి, నరులు, నారీమణులు, దేవతలు, జంతువులు, వశమగును. ఎపుడూ సాధకుని సేవించుచుండును. ఆరుమార్లు పఠించినచో తన్మయుడగును. దేవీప్రసాదమువలన వెంటనే అన్ని సిద్దులూ చేకూరును. ఏడుమార్లుజపించినచో శత్రు,రోగ, కృత్య, అపస్మారాదులు.నశించును. ఎనిమిదిమార్లు జపించినవాడు నిగ్రహానుగ్రహ సమర్థుడగును. తొమ్మిదిమార్లు జపించినచో వాక్ లక్ష్మీకాంతులు సిద్ధించును. పదకొండుమారులు పఠించినచో అఖిలవృద్ధులు సమకూరును. జగత్తు అధీనమగును. పన్నెడు మార్లు పఠించినచో అంతట జయము సుఖము లభించును. పదునాలుగు మార్లు పఠించినచో అఖిలాభీష్టములు సర్వమంగలములు లభించును. పదునైదుమార్లు పఠించినచో సకలాభీష్టములు అప్రయత్నముగా సిద్దించును. పదునారుమార్లు పఠించినచో నరుడు సాక్షాత్తుగా మహేశ్వరుడగును. ఈ ప్రపంచమును సృష్టించుటకు, కాపాడుటకు, సంహరించుటకు సమర్థుడగును. నలుబది రోజులుకాని ఒకనెలకొని కోరికతో ఈ సహస్రనామస్తోతమును జపించిన ఆ కోరికలు వెంటనే నెరవేరును. ఇట్లు నిత్యావృత్త్యర్చనాశ్రితవిధానమును నీకు తెలిపితిని. సకలాభీష్టసాధనమగు సహస్ర నామస్తోత్రమును కూడా తెలిపితిని.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున లలితాస్తోత్ర కవచసహస్రనామకథనమను ఎనుబది తొమ్మిద - అధ్యాయము సమాప్తము.