నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

85 - యక్షిణీ మంత్రభేద నిరూపణమ్

సనత్కుమార మహర్షి పలికెను:-

వాగ్దేవి యొక్క మరియొక అవతారమే కాలికా అని పిలువబడు చున్నది. ఇపుడు నరులను భుక్తిముక్తి ప్రదమైన ఆ కాలికా మంత్రమును చెప్పెదను. సృష్టి క్రీయాన్వితమగు శాంతి బింద్వాఢ్యము మూడు విధములు. అరుణాక్షి ఆదీపిక, ద్విధా బిందు యుక్తము. తరువాత మాయా ద్వయము. దక్షిణమున కాలికా పదము. తరువాత ఏడు బీజములు. అంతమున స్వాహా పదములు కలది ఈ మంత్రము. భైరవ ఋషి. ఉష్ఠికందస్సు. కాలీ దేవత. మాయా బీజము. దీర్ఘకర్మశక్తి, షడ్దర్జాడ్య బీజముచే విద్యాంగ కల్పన చేయ వలయును. పది పది మాయికాక్షరములను హృదయమున, భుజములందు, పాదములందు న్యాసము చేసి మూలమంత్రముచే వ్యాపకమును ఆచరించవలయును. శిరస్సు, కృపాణము, అభయము వరము అనువాటిని హస్తములందు ధరించి ముండస్రజ్మస్తక, ముక్తకేశ, పితృవనస్థిత, సర్వాలంకృత వర్ణ, శ్యామాంగి అయిన కాలికను స్మరించవలయును. ఇట్లు ధ్యానించి మంత్రమును ఒక లక్ష జపించవలయును. పదివేలు గన్నేరు పూలచే హోమమును చేయవలయును.

ఇక ఇపుడు పూజా యంత్రమును చెప్పెదను. మొదట షట్కోణమును లిఖించి, మరల మూడు త్రికోణములను లిఖించి, అష్టదల పద్మమును లిఖించి, అచట భూపురమును పూజించవలయును. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్యా, విలాసినీ, దోస్తీ, అఘోరా, మంగలా అనునవి పీఠ శక్తులు. ‘మాయాత్మనే నమః’ అనునది పీఠ మంత్రము. శివరూప శవమున నుండునది, అన్ని దిక్కులందు నక్కలు చుట్టుముట్టి యున్నది, మహా కాలరతాసక్తయగు కాలికను ధ్యానించి అంగార్చన గావించవలయును. కాలీ, కపాలినీ, కుల్లో, కురుకుల్లా, విరోధినీ, విప్రచిత్త అను వారిని షట్కోణములందు అర్పించవలయును. ఇక నవకోణములందు, ఉగ్రను ఉష్ణ ప్రభను, దీప్తను, నీలా ధనను, బలాకి కను, మాత్రను, ముద్రను, మిత్రను పూజించి, పత్రములందు మాతలను పూజించవలయును. ఈ పద్మమునకు చక్కనీ శ్రద్ధచే బ్రాహ్మీ, నారాయణీ, మాహేశ్వరి, చాముండా కౌమారీ, అపరాజిత, వారాహీ, నారసింహా అనువారిని భూపురమున పూజించవలయును. భైరవిని, మహదాద్యను, సీంహాద్యను, ధూమపూర్వికను, భీమోన్మత్తీదికను, వశీకరణ భైరవిని, మోహనాద్యను, సమారాధించి శక్రాదులను వారి ఆయుధములను పూజించవలయును. ఇట్లు ఆరాధించినచో కొలీ మంత్రము సిద్ధించును. తరువాత మహా భైరవుడు చెప్పిన ప్రయోగములను చేయవచ్చును. తన కొఱకుకాని, ఇతరుల కొరకు కాని వెంటనే సిద్ది ప్రదములగు ప్రయోగములను చేయవలయును. కానీ భక్తుడగు వాడు తన హితమును కోరినచో స్త్రీలను కోట్టుట, నిందించుట, కుటిలత, అప్రియముగా మాటలాడుటను పరిహరించవలయును. సునేత్రి యొక్క మదనవాసమును చూచుచు పదివేలు జపించినచో వాకృతితో సముడగును. దిగంబరుడై వెంట్రుకలను విరబోసుకొని రాత్రిపూట స్మశానమున నుండి పదివేలు జపించినచో సర్వసిద్ధులు లభించును. దిగంబరుడై స్మశానమున శివహృదయమున నుండి, తన రేతస్సుచే తడిపిన వేయి జిల్లేడు పువ్వులచే భక్తిచే కాలికా దేవిని పూజించుచు ఒక్కొక్కటి కాలీ మంత్రమును జపించువాడు త్వరలోనే భూపతియగును. స్త్రీయొక్క రజః కీర్ణమగు భగమును ధ్యానించుచు పదివేలు జపించిన వారు చక్కని కవిత్వముచే జనులను మోహింప చేయును. త్రిసంచార మహీపీఠమున శివుని హృదయమున నుండి, మహాకాల దేవునిచే మన్మథ యుద్ధమును చేయుచున్న చిరునవ్వు కల కాలికను ధ్యానించుచు తాను స్వయముగా సురతమును చేయుచు ఒకవేయి జపించిననూ శంకర సముడగును.  అస్థిలోమత్వచలులేని మార్జారమేషముల మాంసమును, లేదా ఉష్ట్ర మాంసమును, మహిష మాంసమును కొని బలిగా భూతాష్ట్రముల మధ్య రాత్రి సమర్పించిన వానికి అన్ని జంతువులు వశమగును. విద్యా లక్ష్మీ యశః పుత్రులచే చాలా కాలము సుఖమునను భవించును. హవిస్సును తినుచు దేవిని స్మరించుచు మంత్రమును రాత్రిపూట స్మశానమున నుండి ఒక లక్ష జపించినచో ధరాపతియగును. ఎఱ్ఱని పద్మములచే హోమమును గావించినచో ధనముతో ధనపతిని మించినవాడగును. మారేడు పత్రములచే హోమము చేసిన వశమగును. మహిషాదుల రక్తముచే కాలికను తృప్తి పరచినచో అన్ని సిద్ధులు అతని చేతిలో నుండును. శవము నధిరోహించి లక్ష జపించినచో మంత్రము వెంటనే సిద్దించును. అతను అశ్వమేధాది యాగములు చేసిన వాడగును. కాలీ ఉపాసన చేసినవాడు అన్ని దానములను చేసినవాడగును. అన్ని తపముల నాచరించినవాడగును. కాలికను పూజించినవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గౌరి లక్ష్మీగణపతి సూర్యుడు మొదలగు వారిని పూజించినవాడగును.

ఇపుడు సరస్వతీదేవి యొక్క మరియొక అవతారమును చెప్పెదను. సరస్వతీదేవిని సేవించి మానవులు కృతార్డులయ్యేదరు. చంద్రయుక్తయగు ఆప్యాయని వదనాంతరమున మాయ క్రోధ యుక్తమగుకామిని చంద్రాలంకృతమస్తకయగుశాంతి సాసనయగు దీపిక చంద్రయుగ అస్త్రము ఈ మంత్రము. అక్షోభ్యఋషి బృహత్ ఛందస్సు తారాదేవత. ద్వితీయము బీజము చతుర్థము శక్తి. షడ్డీరయుక్తమగు బీజముచే అంగకల్పన చేయువలయును. సర్వసిద్ధికరమగు తారయొక్క షడంగన్యాసమును చేయవలయును. మాతృకావర్ణపూర్వకములగు చతుర్థి విభక్త్యన్తములను నమః పదయుక్తముల ఉంచుట ప్రథమన్యాసమగును. శవపీఠసమాసీన నీలకాంతి, త్రిలోచన, ఆర్ధేందు శేఖర, నానాభూషణ భూషిత, యగు దేవిని స్మరించుచు న్యాసము చేయవలయును. ద్వితీయావరణమున గ్రహన్యాసమును కూడా దేవిని స్మరించుచు చేయవలయును. త్రిబీజస్వరపూర్వమును రక్తసూర్యను హృదయమున ఉంచవలయును. ఆబాటనే కవర్గ పూర్వముగా రక్తవర్ణుడు త్రిలోచనుడగు అంగారకుని ఉంచవలయును. వక్షస్థలమున చవర్గాదిగా శ్యామవర్ణుడగు బుధుని న్యాసము చేయవలయును. కంఠకూపమున టవర్గాద్యముగా పీతవర్ణుడగు బృహస్పతిని, ఘటికయందు తవర్గాద్యముగా శ్వేతవర్ణుడ శుక్రుని, నాభిదేశమున పరవాద్యముగా నీలవర్ణుడగు శనైశ్చరుని, ముఖమున శవర్గాద్యముగా ధూమ్రవర్ణుడగు రాహువును, ధ్యానముచేసి న్యాసము చేయుటను త్రివర్గపూర్వకముగా చేయుట గ్రహన్యాసమందురు. మూడవది లోకపాలన్యాసమును చేయవలయును. ఈ న్యాసమును సర్వసిద్ధికోజుకు మాయాది బీజత్రితయ. పూర్వకముగా చేయవలయును. లలాటాదికముగా స్వమస్తకమున, అష్టదిక్కులందు, ఊర్థ్వమున, హ్రస్వ దీరనాక అష్టవర్గపూర్వులగు దిగధిపులను న్యాసము చేయవలయును. చతుర్థమగు శివశక్తి నామకమున వ్యాసమును చేయవలయును. శక్తియుక్తులగు షట్శివులను త్రిబీజపూర్వకముగా న్యాసము చేయవలయును. ఆధారాది చక్రములందు స్వచక్రవర్లపూర్వకముగా వ్యాసమును చేయవలయును. డాకినీయుతుడగు బ్రహ్మను వాకారాది సకారాంత వర్ణపూర్వకముగా చతుర్థలసమన్వితముగా మూలాధారమున న్యాసమును చేయవలయును. బకారాదిలకా రాంత వర్ణపూర్వకముగా రాకిణీయుతుడగు శ్రీవిష్ణువును స్వాధీష్టానమను పేరుగల షడ్డలమగు లింగస్థచక్రమున ఉంచవలయును. డకరాది ఫకారాంత వర్ణపూర్వకముగా డాకినీయుతుడగు రుద్రుని నాభిస్థానమగు మణిపూరకమను దశదల చక్రమున న్యాసముగా వించవలయును. కకారాది ధకారాన వర్ణపూర్వకముగా శాకినీయు తుడగు ఈశ్వరుని హృదయ స్థమగు అనాహతమను ద్వాదశదలమున ఉంచ వలయును. షోడశదలమున న్యాసమును గావించవలయును. హాకీనీయుతుడగు పదాశివుని ఆజ్ఞాచక్రమున ఉంచవలయును. లక్షా పూర్వకముగా భ్రూమధ్యస్థితమగు అతిమనోహరచక్రమున సర్వేష్ట సిద్దికి తారాది పంచన్యాసమును గావించవలయును. అష్టవర్థులను స్వరద్వంద్వపూర్వకములను బీజయుతములను, న్యాసప్రయోగించ వలయును. తారా, ఉగ్రా, మహోగ్ర, వజ్రా, వాలీ, సరస్వతీ కామేశ్వరి, చాముండా, అను ఎనిమిది తారకలనబడును. బ్రహ్మరంధ్రమున, లలాటమున భ్రూమధ్యమున, కంఠదేశమున, హృదయమున, నాభియందు, ఫాలమున, మూలాధారమున క్రమముగా న్యాసము గావించవలయును. తరువాత పీఠాంగ న్యాసమును సర్వసిద్ధిప్రదమును చేయవలయును. ఆధారమున హ్రస్వవర్ణపూర్వకమగు కామరూపాఖ్య బీజ న్యాసమును గావించవలయును. హృదయమున జాలంధరబీజమును దీర్ఘపూర్వకముగా న్యాసము చేయవలయును. లలాటమున- కవర్గాద్యమగు పూర్ణగిర్యాఖ్య బీజమును న్యాసము చేయవలయును. కేశసంధియందు చవర్గాద్యమగు ఉద్దేయానన్యాసమును గావించవలయును. కంఠమున యాదికమగు దశమ మధురాపీఠన్యాసమును చేయవలయును. తారయొక్క షడ్విధన్యాసము అబీష్ట ప్రదమని చెప్పబడినది. హృదయమున ఏకజటను, శిరస్సున తారిణిని, శిఖయందు వజోదకమును, కవచమున ఉగ్రతారను, నేత్రము నందు మహోగ్రను, అస్త్రమున పింగాగ్రమును న్యాసమును చేయవలయును. షడ్డీరయుక్తమాయయొక్క ఈ ఎనిమిదింటిని షడంగము లందు న్యాసము గావించవలయును. మొదటి అంగుష్టాద్యంగుళులలో ప్రయత్నముచే న్యాసము చేసి తర్జనీ మధ్యమాంగుళులచే తాలత్రయమును గావించి, దేవతను స్మరించుచు చోటికాముద్రచే దిగ్భందమును గావించవలయును. తారపుట విద్యచే ఏడు విధములుగా వ్యాపకము నాచరించవలయును. సద్యోవాదమును అతిసిద్దిప్రదమగు ఉగ్రతారను ధ్యానించవలయును. లయాబ్దిలోని అంబుజమున నుండు, నీలవర్ణ, దివ్యభూషణ శంఖ ఖడ్గకపాల నీలాబ్దధారిణి, నాగశ్రేషాలంకృతాంగి, రక్తనేత్రత్రయయగు దేవిని ధ్యానించి నాలుగు లక్షలు జపించి, దశాంశమును క్షీరాజ్యమిశ్రితములగు రక్త పద్మములచే హోమమును గావించవలయును. శంఖమును స్థాపించి. జపమును చేయవలయును. స్త్రీని చూచుచు, తాకుచు, పొందుచు, మహారాత్రియందు బలినాచరించవలయును. స్మశానమున కాని, శూన్య గృహమున కాని, దేవాలయమున కాని, నిర్జన పర్వత ప్రాంతమునకాని, అరణ్య మధ్యమున కాని, శవము నధిరోహించి, యుద్ధమున శత్రునిహతుని కాని, ఆరునెలల శిశువును కొని ఆశ్రయించి ఈ విద్యను సాధించినచో త్వరగా సిద్ధి లభించును. మేధా, ప్రజ్ఞ, ప్రభా, విద్య ధీ, వృత్తి, స్మృతి, బుద్ధి, విశ్వేశ్వరి అనునవి తొమ్మిది పీఠ శక్తులు. భృగు మన్విందు సంయుక్తమగు ఆకాశము, సరస్వతి, 'యోగపీఠాత్మనేనమః' అనునది పీఠమంత్రము. ఈ మంత్రముచే ఆసనమును సమర్పించి మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి యథావిధిగా దేవిని పూజించవలయును. ఆ పూజా విధానమునిప్పుడు చెప్పెదను. తారము, మాయ, భగము, బ్రహ్మ, జటలు, సదీర్ఘకమగు జటలు, యక్షాధిపతయే తండ్రీ తరువాత సోపవీత బలిని గృహయుగ్మము, శివా, స్వాహ అనునది బలిమంత్రము చెప్పబడినది. ఈ మంత్రముచే ప్రతినిత్యము మధ్యరాత్రమున నాలుగు దారుల కూడలి యందు బలినీయవలయును. జలదానాదికమును పదిమంత్రములచే నాచరించవలయును. ధ్రువము వజోదకములు కవచము ఫట్ అను సప్తాక్షరి జలగ్రహమంత్రము తారాది స్వాహాంతము మాయ క్షాలన మంత్రము. తారము, మాయ, భృగువు, కర్ణము, ధర్మవర్మలచే విశుద్ధము నేత్రయుతమగు జలము సర్వపాపములను శమింప చేయును. కల్పాన నయన స్వాహా యనునది ఆచమన మంత్రము. ధ్రువము మణిధరీ వజ్రాణీ అక్షియుతా మృతి ఖరి విద్యాయుగ్రజము సర్వవాంతమున అబ్జవత్తగు బకము. వారిణ్యంతమున దీర్ఘవర్మము హుంస్వాహా అనునది ఇరువది మూడక్షరములు గలది శిఖా బంధన మంత్రము. “ఓం రక్ష రక్ష" స్వాహా హుంఫట్” అను నవాక్షర మంత్రముచే భూమి శుద్దిని గావించవలయును. “నార సర్వవిఘ్నానుత్సారయ హుంఫట్ స్వాహా" అనునది పదునాలుగక్షరముల మంత్రము విఘ్న వినాశకము. జపా పుష్ప సన్నిభమగు మాయా బీజమును నాభియందు ధ్యానించవలయును. దేహముతో పాటు స్వపాపమును కూడా, దహింప చేయవలయును. సువర్ణ సన్నిభమగు తారా బీజమును హృదయమున ధ్యానించవలయును. దాని వలన పుట్టిన వాయువుచే పాపమును భూమిమీద చల్లవలయును. నాలుగవదగు చంద్రకుందాభ. బీజమును లలాటమున ధ్యానించి దానిచే పుట్టిన అమృతముచే దేవతా సన్నిభమగు దేహమును ఏర్పరచ వలయును. ఈ భూత శుద్దిచే దేవీ సాదృశ్యమును పొందును. తారము, అనంతుడు, భృగువు, కర్ణము, పద్మనాభయుత బలి, ఆకాశమున వజ్రరేఖలు క్రోధాఖ్య బీజము స్వాహాపదము ఈ ద్వాదశాక్షర మంత్రముచే శుభ మండలమును రచించవలయును. తారము యధాగత నిద్ర సదృక్షేక భృగువిషము సదీర స్మృతిరములు సాక్షములు భగాన్వితుడగు మహాకాలుడు క్రోధమస్త్రము ఇది మను వర్ణమంత్రముచే పుష్పాది శోధన గావించవలయును. తారము పాశము పరా స్వాహా అను పంచాక్షరిచే చిత్త శోధన గావించవలయును. ఇట్లు పదిమంత్రములు చెప్పబడినవి. ఇక ఇపుడు అర్ష్య స్థాపనమును చెప్పెదను. సేందు మాసము వలన మాయచే భూగృహమున భూమిని సృజించి వృతము, త్రికోణ సంయుక్తముగా మండలమంత్రముచే నేర్పరచవలయును. ఆబాల వహ్ని మండల మధ్యగతమగు ఆధారశక్తిని పూజించవలయును. వహ్ని మండలమును పూజించి మహా శంఖమును స్థాపించవలయును. వామకర్ణేందు యుక్తము షడంతమగు ఆకాశముచే ప్రక్షాళితమగు, దానిని భృగుదండి. త్రిమూర్తీందు యుతమును పఠించవలయును. తరువాత మంత్ర చతుష్టయమును పఠించుచు మహా శంఖమును పూజించవలయును. దీర్ఘతయాద్వితమగు మాయ కాలీ సృష్టి సదీర సము ప్రతిమాసంయుతమగు మాసము యవనము హృదయము గల ఏకాదశాక్షరీ మంత్రము మహా శంఖార్చనలో మొదటిది. హరి భుజంగేశయుక్తమగు హంస, దీరతయేందు యుతము “ఓం మాయాతారిణే కపాలాయ నమ:” అను ద్వాదశాక్షరమంత్రము. స్వరము దీర్ఘతయ మన్వాడ్య మేషము వామదగన్వితము. “ఓం శ్రీ మహా లోకపాలాయ నమ:” అనునది ఏకాదశాక్షర తృతీయ మంత్రము. మాయా స్త్రీ బీజము అర్థందు. యుతము స్వరము స్వర్గ, ఖాదిమము. “ఓం శ్రీ స్వర్గభాదిమపాలాయ సర్వాధారాయ సర్వాయ, సర్వోద్భవాయ, సర్వశుద్దిమయాయ, సర్వాసురాంతకాయ రుధిరా రతిదీరా వాయుశుభ్రానీల సురాభా జనాయ భగీ సత్యా వికపాలాయ నమ:” అనునది నాలుగవ మంత్రము. ఇట్లు మహా శంఖ పూజనమున నాలుగు మంత్రములను జపించవలయును. సనార్క మండలమును పూజించి మూలమంత్రముచే సుధాబుద్ధిచే జలమును గంధ పుష్పాక్షతాదులచే పూరించి, త్రిఖండముద్రను చూపి చంద్రమండలమును పూజించవలయును. వాక్సత్య పద్మ గగన రేఫాను గ్రహబిందు యుతము విపద్ద్వంసమను సర్గ సమన్వితముగా మూలమంత్రముచే జలమును ఎనిమిది మార్లు మంత్రించ వలయును. మాయా యామ దిక్కును క్షేపించి ఆకాశముద్రను, యోనిముద్రను చూపవలయును. అచట వృత్తిష్ట షట్కోణమును ధ్యానించి దేవిని స్మరించవలయును. పూర్వోక్త దేవిని పూజించి మూలమంత్రముచే, తర్పణమును చేయవలయును. తర్జని మధ్యమ అనామికా కనిష్ణాంగులు అనే మహేశ్వరుని అంగుష్ఠ సహితముగా మహా శంఖస్థిత జలమున నాలుగుమార్లు ఖంరేఫమును బింద్వాడ్య మును భృగుమన్విందుయుక్తమగు ధ్రువాదిచే. నమోంతముచే ఆనంద భైరవుని తర్పణ చేయవలయును ఆ యర్ఘ్యజలముచే పూజా సామాగ్రిని ప్రోక్షించవలయును. యోని ముద్రను చూపి భవతారిణిని నమస్కరించ వలయును. ఇట్లు అర్ఘ్యమున సర్వసిద్ధి ప్రదాయకమగు విధానము చెప్పబడినది. పూర్వోక్త పీఠమున షట్కోణ కర్ణికా పద్మమున రమ్యమగు. భూగృహావృతమున రమ్యోపచారములచే దేవిని పూజించవలయును. భూగృహమున నాలుగు దిక్కులందు గణేశాదులను పూజించవలయును. మొదట తూర్పున పాశాంకుశ కపాల త్రిశూలములను ధరించియున్న గణేశుని పూజించవలయును. దక్షిణమున కపాలశూలములను హస్తములందు ధరించిన సర్పభూషణుడు, స్వయూధ పరివేష్టితుడగు బటుకుని పూజించవలయును. కరములందు ఖడ్గశూల కపాల డమరులను ధరించిన కృష్ణ వర్ణుడు, దిగంబరుడు, క్రూరుడగు క్షేత్రపాలుని పశ్చిమమున పూజించవలయును. కరములందు కపాల డమరు పాశ లింగములను ధరించియున్న అధ్యాకన్యా రక్త వస్త్రలగు యోగినులను ఉత్తర దిక్కున పూజించ వలయును. దేవితో శుభకరుడగు అక్షోభ్య మంత్ర ఋషిని శిరస్సున పూజించ వలయును. అక్షోభ్యము వస్త్ర పుష్పము ప్రతీచ్ఛ స్వాహా అనునది అక్షోభ్య పూజన మంత్రము. షట్కోణములందు షడంగములనేర్పరచి వైరోచనుని, అమితాభుని, పద్మనాభుని పాండురమను శంఖమును అష్టదలములందు పూజించవలయును. లాభక, మానక, పాండుర, తారక, అను వారిని విదిక్కులందుండు పద్మపత్రములందు ఇష్టసిద్ది కొజుకు పూజించవలయును. బిందు నామాది వర్ణాదులు, సంబుద్ద్యంత నామములు, 'వజ్ర పుష్పం ప్రతీచ్చ స్వాహా' అనునది అంతమందు కలవి ప్రణవాదులు వైరోచనాది పూజలందు మంత్రములుగా చెప్పబడినవి. నాలుగు ద్వారములలో భూధరుడు, పద్మాంతక యమాంతకులు, విద్యాంతకుడు, నరాంతకుడు అను వారిని పూజించవలయును. తరువాత ఇంద్రాదులను వజాదులను పూజించ వలయును. ఇట్లు దేవిని పూజించినచో పాండిత్యము, అద్బుత ధనము, పుత్రులు, పౌత్రులు, శుభకీర్తి జనవశ్యత కలుగును. తారము, మాయ, శ్రీమదేక జటలు, నీల సరస్వతి, మహాగ్రతారలు, దేవాస సనేత్ర గదియుగ్మకము, సర్వదేవ పిశాకర్మ దీరాన్ని మరుసానస అభ్రగు మమ జాడ్యం భేదయ ఛేదయ నమ:' మాయాస్త్రము స్వాహాంతము అగు యాబది రెండక్షరములు గల మంత్రముచే ప్రతినిత్యము పూజాంతమున బలిహరణమును గావించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత ప్రయోగములను చేయవచ్చును. పుట్టిన పిల్లవానికి మూడు దినముల లోపు తేనె నేతులలో శలాకచే నాలుక మీద మంత్రమును వ్రాయవలయును. ఆ శలాకసువర్ణముచే చేయవలయును. లేదా ఆ తెల్లని రెల్లు గడ్డిచే వ్రాయవచ్చును ఎనిమిది సంవత్సరముల తరువాత ఆబాలుడు అద్భుత కవియగును. ఇతరులకు అజేయుడగును. రాజులచే పూజలందును. గ్రహణ సమయమున నరదారు సరోజలము లందు కీలకము నిర్మించి దానిచే తైల మధ్వ ఘృతములచే మంత్రమును లిఖించవలయును. పద్మపత్రమునందు మంత్రమును మాతృకాక్షరములచే పరివేష్టించవలయును. ఆ పద్మపత్రమును సమేఖలము చతురస్రమగు కుండమున స్థాపించి అచట ఈ మంత్రముచే హోమము గావించవలయును. ఆవుపాలచే తడిపిన వేయి రక్త పద్మములచే హోనూంతమున బహు విధ రత్నములచే ఫలములచే బలిహరణమును ఆచరించవలయును. బలిని యథావిధిగా మంత్రముచే చేయవలయును. ఇపుడు బలిమంత్రమును తెలిపెదను. తారము, పద్మములు, యుగ తండ్రీ వియడ్డీరము లోహితము విషభగా రూఢడగు, అత్రి, తరువాత “పద్మావతీ యింటీశాడ్యోనిలస్వాహా” అనునది పదునారు వర్ణముల బలమంత్రము. తరువాత నిశీథ కాలమున పూర్వోత్తమంత్రముచే బలిని అర్పించవలయును. ఇట్లు ఆచరించినచో అతడు పండితులను జయించువాడు, కవిరాట్ అగును. సరస్వతీ లక్ష్ములకు నివాస భూతుడగును. జన రంజన సమర్థుడగును. నూరుమార్లు మంత్రించి నరేచకమును మస్తకమున ధరించి ఎవరెవరిని చూచునో వారందరూ దాసులగుదురు. మంగళవారమున తూర్పు దిక్కున శ్మశానాగ్నిని ఆశ్రయించి ఈ మంత్రముచే వేష్టనము చేసి, ఎఱ్ఱని దారములచే కట్టి మూలమంత్రముచే నూరుమార్లు మంత్రించి శత్రు గృహమున పడవేయవలయును. ఏడు దినములలో సకుటుంబముగా శత్రువులను ఉచ్చాటన చేయును. వేయి మార్లు మంత్రించి శత్రు గృహమున పడవేసిన నలుబది రోజులలో శత్రు భ్రంశనము జరుగును. పొలమున పడవేసిన పంట నశించును. స్వరములచే కేశరము నందు సాధ్యార్ణమును షట్కోణాంతమున వ్రాయవలయును. భూర్జ పత్రమున జతురసములతో పీతాంబరావృతముగా పట్టసూత్రముచే కట్టి శిశుకంఠమున ధరింప చేసినచో భూత భీతి తొలగును. స్త్రీలకు వామ బాహువున కట్టినచో పుత్రులు కలుగును. పురుషులకు దక్షిణ బాహువున ధరింప చేసినచో నిర్థనులకు ధనములు కలుగును. జ్ఞానమును కోరు వారికి జ్ఞానము నిచ్చును. రాజులకు విజయమును ప్రసాదించును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున యక్షిణీమంత్ర భేద నిరూపణమను ఎనుబది ఐద - అధ్యాయము సమాప్తము