నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

108 - గారుడానుక్రమణి వర్ణనమ్

బ్రహ్మ పలికెను :-

ఓ మరీచి మహర్షి ! ఇపుడు శుభకరమగు గరుడ పురాణమును చెప్పెదను వినుము. భగవంతుడగు శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికీ అతడడుగగా చెప్పెను. ఈ పురాణమున పందొమ్మిది వేల శ్లోకములు కలవు. ఇందులో గరుడ కల్ప కథ కలదు. మొదట పురాణోప క్రమ ప్రశ్న. తరువాత సంక్షేపముగా సృష్టి. సూర్యాది పూజన వీధి, దీక్షావిధి, శ్రాద్ధ పూజా, నవవ్యూహార్చనము, పూజా విధానము, విష్ణుపంజరము, యోగాధ్యాయము, విష్ణుసహస్ర నామకీర్తనము, విష్ణుధ్యానము, సూర్యపూజా మృత్యుంజయార్చనము, మాలా మస్త్రము, శివపూజా, గణపూజా, గోపాల పూజా, త్రైలోక్య మోహన శ్రీధరార్చనము, విష్ణుపూజా, పంచతత్యపూజా, చక్రపూజా, దేవపూజా, న్యాసాది సంధ్యోపాసన, దుర్గార్చన, సూర్యార్చన, మాహేశ్వరీ పూజా, పవిత్రారోపణము, మూర్తి ధ్యానము, వాస్తుమానము, ప్రాసాద లక్షణము, సర్వదేవ ప్రతిష్ఠ, యధావిధిగా పృధక్పూజా, అష్టాంగ యోగము, దానధర్మములు, ప్రాయశ్చిత్త విధిక్రియా, ద్వీపేశ నరకాఖ్యానము సూర్యవ్యూహము, జ్యోతిషము, సాముద్రికము, స్వరజ్ఞానము, నవరత్న పరీక్షణము, తీర్ధమాహాత్మ్యము, గయా మాహాత్మ్యము, మన్వన్తర కథ, పిత్రాఖ్యానము, వర్ణధర్మములు, ద్రవ్య శుద్ధి, సమర్పణము, శ్రాద్ధము, వినాయక పూజా, గ్రహ యజ్ఞము, ఆశ్రమములు, జనన మను ప్రేత శౌచము, నీతి శాస్త్రము, వ్రత కథనము, సూర్యవంశము, సోమవంశము, శ్రీహరి అవతార కథనము, రామాయణము, హరివంశము, భారతము, ఆయుర్వేద నిదానము, చికిత్సా, ద్రవ్య గుణములు, రోగనాశకమగు శ్రీ విష్ణుకవచము, గరుడ మస్త్రము, త్రిపురా మస్రము, ప్రశ్న చూడామణి, హయాయుర్వేద కీర్తనము, ఓషధీ నామ కథనము, వ్యాకరణ శాస్త్రము, ఛన్ల శ్శాస్త్రము, సదాచారము, స్నానవిధి, వైశ్వ దేవ తర్పణము, సంధ్యా, పార్వణ కర్మ, సపిండమను నిత్య శ్రాద్ధము, ధర్మసారము, అఘ నిష్కృతి, ప్రతి సంక్రమణము, యుగ ధర్మములు,