నారద మహా పురాణము - పూర్వార్థము
55 - జాతకనిరూపణమ్
సనందన మహర్షి పలికెను :-
శిరస్సు, ఆస్యము, బాహువులు, హృదయము, క్రోడము, నఖములు, జానువులు, జంఘలు, అంఘియుగలము ఇవియన్నియు కాలపురుషుని అంగములు. క్రియాదులు కూడా కాలాంగములే: మేషాది రాశులను అధిపతులను తెలియుము. మేషవృశ్చికములకు కుజుడు అధిపతి. వృషభ తులలకు శుక్రుడు అధిపతి. మిధున కన్యా రాశులకు బుధుడు అధిపతి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. సింహరాశికి సూర్యుడధిపతి, ధనుర్మీనములకు బృహస్పతి అధిపతి. మకరకుంభ రాశులకు శని అధిపతి. హోరలో సూర్యచంద్రులు విషమ నక్షత్ర గతులైనపుడు, చంద్ర సూర్యులు సమ నక్షత్రగతులైనపుడు ఆది పంచనవాధీశులు దేష్కోణాధిపతులని చెప్పబడినది. పంచ ఇష్ట అష్టాది పంచాంశలు కుజ, శని గురు బుధ శుక్రగతములని తెలియవలయును. ఓజో విషయమున విపర్యయము వలన, యుగ్మమున త్రింశాంశేశులుగా చెప్పబడిరి. మేషాదిరాశులలో తులాకర్కాటకాదులు నవాంశలుగా తెలియవలయును. తమతమ నక్షత్రము నుండి ద్వాదశ భాగేశులు రాశిపూర్వకముగా షడర్గమును తెలియవలయును. వృషభమేషములు కర్కాటక మిధునములతో రాత్రి అను పేరుతో పృష్ట కోదయములు. మిగిలిన రాశులు దీనముగా పేర్కొనబడినవి. ఉభయములు తిమి, క్రూర, సౌమ్య పుమాన్. అను పేర్లచే వ్యవహరించబడును. పురుషుడు, స్త్రీ, నపుంసకుడు, చరము, స్థిరము, ద్విస్వభావములు కలవిగా నుండును. మేషాది రాశులు తూర్పుదిక్కున నుండును. తమతమ స్థానములలో తిరుగుచుండును. సూర్యాదిగ్రహములకు మేషాదిరాళులు ఉచ్ఛరాశులు ఇట్లు చెప్పెదరు. రవికి మేషము, చంద్రునికి వృషభము, కుజునికి మకరము, బుధునికి కన్య, గురునికి కటకము, శుక్రునికి మీనము, శనికి తుల ఇవి ఉచ్ఛరాశులు.. ప్రతిగ్రహమునకు తన ఉచ్ఛరాశికి సప్తమ రాశి నీచరాశిగా తెలియవలయును. అనగా రవికి తుల, చంద్రునికి వృశ్చికము, కుజునికి కటకము, బుధునికి మీనము, గురునికి మకరము, శుక్రునికి కన్య, శనికి మేషము ఇవి నీచరాశులు. ఇవి క్రమముననుసరించి, ప్రాక్, మధ్య,అంత్యాశలు కలవగును. వర్గోత్తమములు భావమువలన ద్వాదశమూర్తులు గలిగియుండును. ఇట్ల రవికి సింహము, చంద్రునికి వృషభము, కుజునికి మేషము, బుధునికి కన్య గురువునకు ధనుస్సు, శుక్రునికి తుల, శనికి కుంభము ఇవి మూలత్రికోణములనబడును. రాశికి, మరియు రాశినుండి నాలుగవ, ఏడవ పదియవరాశులకు కేంద్రములని పేరు. రాశికి, రాశినుండి అయిదవ, తొమ్మిదవరాశులకును కోణములని పేరు. కేంద్ర కోణములందున్న గ్రహములు ప్రబలులుగా ఉండును. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, పొటలవర్ణము, ధూమ్రవర్ణము, పాండురవర్ణము, చిత్రవర్ణము, కృష్ణవర్ణము, పసుపుపచ్చ, పింగళవర్ణము, బభ్రువర్ణము, స్వచ్ఛవర్ణము గ్రహములకు ప్రక్రియవలన ఏర్పడును. సూర్యుడు . కొలస్వరూపుడు, చంద్రుడు మనస్సు, కుజుడు సత్త్వము, బుధుడు వాక్కు, గురువు జ్ఞానము, శుక్రుడు సుఖము, కామము, శని దుఃఖము స్వరూపముగా కలవారు. సూర్యచంద్రులు రాజులు, కుజుడు అధికారి, బుధుడు యువరాజు, గురు శుక్రులు మంత్రులు. శని అనుచరుడు అని జ్యోతిర్విదుల సిద్ధాంతము. సూర్యునికి ఆయారాశి సంచారము ననుసరించి తామ్ర, శుక్ల, రక్త, హరిత్ , పీత, చిత్ర, కృష్ణవర్ణములు కలుగుచుండును. రవి శుక్ర కుజ, రాహు, శని చంద్ర బుధ గురువులు వరుసగా అష్టదిక్కులకు అధిపతులు. క్షీణచంద్రుడు, రవి, కుజుడు శని ఈ సౌలుగు పాప గ్రహములు, పాపగ్రహములతో కలిసినపుడు బుధుడు పొపుడగును. బుధుడు శని నపుంసకులు, శుక్రుడు చంద్రుడు స్త్రీలు, మిగిలిన గ్రహములు పురుషులు అని తెలియవలయును. అగ్నిభూమి, నీరు, వాయువులలో భూసుతాది గ్రహములు నివసించును. గురు శుక్రులు బ్రాహ్మణులు. రవి చంద్ర గురులు సాత్త్వికులు. బుధ శుక్రులు రాజసులు. కుజశని రాహు కేతువులు తామసులు. రవికి అగ్ని, చంద్రునికి జలము, కుజునకు కుమారస్వామి, బుధునకు విష్ణువు, గురునకు దేవేంద్రుడు, శుక్రునకు శచీదేవి, శనికి బ్రహ్మ, రాహు కేతువులకు శివుడు అధిదేవతలు. వస్త్రము స్థలము కొత్తది వహ్నికహతము మద్యదము, స్పుటితము, రవికి తామ్రము, తారము, తామ్రపుని. బంగారము, ఇనుము, ఉక్కు ఈమూడు అంశలతో నుండును. శశిరాదులు గుణములు. అనగా రవికి రాగి, ముదుగు బట్ట, దేహపు ఎముకులు దేవతాస్థానము పూజా సంబంధములుండును. చంద్రునకు రత్నములు, క్రొత్తబట్ట, దేహరక్తము జలసమీపము స్పానప్రదేశములు. ఇట్లే ఇతర గ్రహములకు తెలియవలయును. శని శుక్రుడు కుజుడు చంద్రుడు బుధుడు గురువు ఉదయించుచుండగా క్రమముగా కేంద్రకోణ, చతుర్థ అష్ట సప్తమ స్థానములను వృద్ధిచెందించును. శని గురువు కుజుడు పూర్ణులుగా నున్నపుడు క్రమముగా చూతురు. అయన, క్షణ, ఘస్ర, ఋతు మాస, షాణ్మాసములు. సూర్యునికి కటు, తిక్త, క్షార, మధుర, ఆమ్ల, కషాయ రసములుండును. త్రికోణ స్థానము నుండి ధర్మాయువు మిత్రుడు. గురుడు, గురు బుధులు, శుక్ర బుధులు, సూర్య రహితులు, కుజరహితులు క్రమముగా చంద్రసూర్య రహితులు, కుజచంద్రార్కర రహితులు, ఇతరులు సూర్యునికి మిత్రులు. పరస్పరముగా ధన, వ్యయ, ఆయ త్రిబంధు, వ్యాపార గతుడైనచో మిత్రుడగును. ఏకాను భుక్తములుగా తెలుసుకొని సహజులుగా తెలియవలయును, ఆయాకాలములననుసరించి అధీసుహృత్ మిత్ర పూర్వకములను మరల కల్పించుకొనవలయును. తనకు ఉచ్ఛరాశులందు, త్రికోణరాశులందుండు వారు నవాంశలతో స్థానముల వలన బలము కలుగును. దిక్కులలో బుధ బృహస్పతులకు, సూర్య కుజులకు, శని విషయమున శుక్రచంద్రులకు ఆకాశమునుండి ఋతువులలో, ఇతరులు సమాగమములో, ఉత్తరమున నున్నవారు దీప్త కారులగుదురు. ఇష్టులైనపుడు వీర్యయుతులగుదురు. రాత్రిపూట చంద్రకుజశనులు ఎల్లపుడు శుభకరులు. ఇతర గ్రహములు పగలు శుభకరులు. వీరు కృష్ణపక్షమున క్రూరులు, శుక్లపక్షమున సౌమ్యులని కొలబలమును బుధులు చెప్పేదరు. శని కుజ బుధ గురు శుక్ర చంద్ర సూర్యులకు పరస్పరాధిక్యము గల వారగుదురు ఎప్పడు పాపులు బలయుతులు. సౌమ్యులు స్థానాధీనులుగా నుందురు. క్లీబులవిషయమున శుక్రుని కంటే చంద్రసూర్యాంశ సమముగానుండును. స్వాంశమున నున్న గ్రహములు పాపులు, పరాంశమున సౌమ్యులు వియోనిజమైనపుడు లగ్నభేదమేర్పడును. వియోని జన్మ దుర్బలమగును. శిరస్సు, వక్తము, కంఠము, పాదములు, భుజములు, పృష్ఠ భాగము, వక్షస్థలము, పార్శ్వములు, కుక్షి, అపానము, చరణములు, మేడ్రము, ముషములు (వృషణములు) పుచ్చములు, మొదలగు అవయవములందు మేషాది రాశులుండునని తెలియవలయును. లగ్నాంశము నుండి గ్రహయోగమును చూచి బలయుతముగా వర్ణములను చెప్పవలయును. దృక్సమాన ప్రమాణములను ఇష్టమున నున్న రేఖను గుర్తు చేసుకొనవలయును. నక్షత్రముల రాశుల వంశము బలాగ్రముగానున్నపుడు చరమాంశము గ్రహాన్వితముగా నున్నపుడు అంశములో స్థలమున చంద్రుడు శనికి ద్వీక్షయున్నపుడు యోగభవులు ద్విజులగుదురు. విడిగా ఉన్న చంద్ర గురు సూర్యులచే వృక్షముల జన్మను చెప్పవలయును. స్థలవృక్షముల జులవృక్షముల భేదము గ్రహముల స్థితిననుసరించి ఇతరములకు కూడా చెప్పవలయును. లగ్నమునుండి ఎంతమానము గల గృహమున సూర్యుడు అధిపతిగా ఉన్నపుడు అదేసంఖ్యచే స్థలజములు జలజములగు వృక్షములుండును. రవి రాశ్యధిపతిగా ఉన్నపుడు అంతస్సౌరము గల వృక్షములు, శని అధిపతిగా ఉన్నపుడు దుర్భగములగు వృక్షములు, చంద్రుడు అధిపతిగా యున్నపుడు క్షీరములు గల వృక్షములు, కుజుడు అధిపతిగా ఉన్నపుడు ముళ్ళ చెట్లు, గురువు అధిపతిగా యున్నపుడు ఫలమంతములగు వృక్షములు, బుధుడు అధిపతిగా ఉన్న చో ఫలరహితములగు వృక్షములు, శుక్రుడు అధిపతిగా ఉన్నపుడు పుష్పితములగు వృక్షములు, చంద్రుడధిపతిగా యున్నపుడు దట్టమగు వృక్షములు, కుజుడు అధిపతిగా యున్నచో కటురసము గల వృక్షములు అశుభనక్షత్రములో శుభగ్రహము శుభకరుడగును. కుభూమిలో పుట్టిన వృక్షము కూడా శుభకరమగును.
అట్లే అశుభగ్రహమున్నపుడు ఉత్తమ భూమికూడా ఉత్తమవృక్షమునకు జన్మనీయజాలదు. స్త్రీలకు ప్రతిమాసమున జరుగు ఋతు ధర్మము కూడా కుజ చంద్రగ్రహముల ప్రభావమువలననే జరుగును. చంద్రుడు స్త్రీరాశికి ఇష్టరాశిలో ఉండనపుడు, బృహస్పతిచే చూడబడినపుడు స్త్రీకి పురుషునిచే సంయోగము లభించును. సప్తమ భావమున పాపగ్రహయోగమున్నపుడు రోషపూర్వక పతీ పత్నీసంయోగము, సప్తమభావమున శుభగ్రహమయోగమునపుడు ప్రీతిపూర్వక సంయోగమేర్పడును. సంయోగకాలమున శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు నవమాంశలో ఉండి, బృహస్పతి కేంద్రమున కాని, త్రికోణస్థానమున కాని యున్నచో సంతానప్రాప్తి నిశ్చితము. ఇట్లు సంయోగకాలమున కుజుడు శని సూర్యుని నుండి సప్తమ స్థానమున నున్నచో పురుషునికి, చంద్రునినుండి సప్తమస్థానమున నున్న చో స్త్రీకి రోగము సంభవించును. ఇట్లే గ్రహములు సూర్యునినుండి పన్నెండవ స్థానమున, రెండవస్థానమునకాని యున్నచో పురుషునికి, చంద్రుని కలిసియున్నచో స్త్రీకి మృత్యువు సంభవించును. పగలు గర్భాధానమైనచో శుక్రుడు సూర్యుడు మాతా పితృగ్రహములగును.
రాత్రిపూట గర్భాధానమైనచో చంద్రుడు శని మాతృపిత్సగ్రహములగును. పిత్సగ్రహము విషమరాశిలో ఉండుట తండ్రికి శుభము. మాతృగ్రహము సమరాశిలో నుండుట తల్లికి శుభము. పన్నెండవ స్థానమున పాపగ్రహములున్నపుడు, శుభగ్రహములకు బదులు పాపగ్రహములచే చూడబడుచున్నపుడు, లేదా లగ్నమున శని యుండి క్షీణ చంద్రునిచే కుజునిచే చూడబడుచున్నపుడు గర్భాధానము జరిగినచో స్త్రీకి మృత్యువు సంభవించును. లగ్నము నుండి కాని, చంద్రుని నుండి కాని చతుర్ధ స్థానమున పాపగ్రహములుండిన, కుజుడు అష్టమ భావమున నున్నచో, లేదా లగ్నము నుండి నాలుగవస్థానమున కాని పన్నెండవస్థానమున కాని కుజుడు శని యున్నచో గర్బముతో స్త్రీకి కాని, కేవలము స్త్రీకి కాని మృత్యువు సంభవించవచ్చును. లగ్నమున కుజుడు సప్తమమున సూర్యుడు ఉన్నచో గర్భవతికి శస్త్రము. వలన మరణము సంభవించును. గర్భాధాన సమయమున ఆయా మాసాధిపతి అస్తగతుడైనచో అస్తగతుడగు అధిపతిగల మాసమున గర్భపాతము సంభవించవచ్చును. గర్భాధానసమయమున లగ్నమున చంద్రునితో శుభస్థానములలో శుభగ్రహములు, అశుభస్థానమున పాపగ్రహములున్నపుడు గర్భము సురక్షితముగా నుండును. సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు, లగ్నము ఈ నాలుగు విషమ రాశులైనపుడు, నవమాంశలైనపుడు, లేదా సూర్యుడు బృహస్పతి విషమరాశి గతులైనపుడు పుత్రుడు కలుగునని చెప్పవచ్చును. ఇట్లే ఈ గ్రహములే సమరాశిలో నవమాంశలలో ఉన్నపుడు, లేదా కుజుడు, చంద్రుడు, శుక్రుడు సమరాశిలో నున్నచో స్త్రీ శిశువు కలుగునని చెప్పవచ్చును. ఈ గ్రహములే ద్విస్వభావరాశులలో ఉన్నపుడు, . ఈ గ్రహముల మీద బుధుని దృష్టి ఉన్నపుడు కవల పిల్లలు కలుగుదురు. లగ్నము నుండి విషమ.. స్థానమున నున్న శని ప్రభావము వలన పుత్రుడు కలుగును. విషమ సమములగు రాశులలో నున్న సూర్యచంద్రులు లేదా శని బుధులు ఒకరినొకరు చూచుకున్నపుడు, లేదా సమరాశిలో నున్న సూర్యుని విషమరాశిలోనున్న కుజుడు చూచినపుడు, చంద్రుడు సమరాశిలో కానీ లగ్న విషమరాశిలో కొని ఉన్నపుడు, మరియు అట్టి చంద్రుని మీద కుజుని దృష్టి ఉన్నపుడు, లేదా లగ్నము, చంద్రుడు శుక్రుడు మూడు పురుషరాశి నవమాంశలో ఉన్నపుడు గర్భధానమైనచో నపుంసకుడు. పుట్టును. శుక్రచంద్రులు సమరాశిలో ఉండి, బుధుడు, కుజుడు, లగ్నము, బృహస్పతి విషమరాశులలో ఉంటూ పురుష గ్రహముచే చూడబడునపుడు గర్భాధానము జరిగినచో ! కవల పిల్లలు పుట్టదరు. లేదా లగ్నము చంద్రుడు సమరాశిలో ఉండుట, లేదా బుధుడు, కుజుడు, లగ్నము గురుసమరాశి అయిననూ కవల పిల్లలు పుట్టెదరు. బుధుడు నవమాంశలో ఉండి, ద్విస్వభావరాశులగు గృహమును, లగ్నమును చూచినచో ఒకేసారి ముగ్గురు సంతానము కలుగు అవకాశమున్నది. ఆ ముగ్గురిలో ఒకడు లగ్నసదృశుడు, ఇద్దరు బుధసదృశులగుదురు. ధనురాశి అంతిమాంశము లగ్నమైనచో, ఆ యంశలో బలవంతుడగు గ్రహమున్నచో, బలవంతుడగు బుధునిచే కాని శనిదే కాని చూడబడినపుడు ముగ్గురికంటే ఎక్కువమంది సంతానము కూడా ఒకేసారి కలుగవచ్చును. గర్భధాన సమయదశ, మాసముల దశలకు అధిపతులను జ్యోతిషశాస్త్రమున చూపిరి. వారు క్రమముగా శుక్రుడు, కుజుడు, బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, శని, బుధుడు. ఆధీన లగ్నేశులు సూర్యుడు చంద్రుడు. ఏ నెలలో ఎట్లు సబలనిర్భల గృహములుండునో ఆయా నెలలో అట్లే శుభాశుభప్రభావము గర్భము పైన గర్భవతి పైన ఉండునని చెప్పవలయును. బుధుడు త్రికోణ స్థానముననుండి ఇతరగ్రహములు నిర్బలులైనచో శిశువునకు రెండుముఖములు, నాలుగుచేతులు, నాలుగు కాళ్ళు మొదలగు ఆకారములు లభించును. చంద్రుడు వృషభరాశిలో ఉండి ఇతరగ్రహములు నిర్బలులైనచో బాలకుడు వికారాకారము గలవాడగును. గ్రహముల పై శుభ గ్రహదృష్టిఉన్నచో బాలకుడు చాలాదినములకు మాట్లాడగలుగును. కుజుడు శనీ బుధుని రాశి నవమాంశలో ఉన్నచో శిశువు పండ్లతో పుట్టును. చంద్రుడు కర్కటకరాశిలో ఉండి లగ్నగతులై శని కుజుల దృష్టి కూడా చంద్రుని పై ఉన్నపుడు శిశు గర్భములోనే కుబ్జుడగును (మూడు వంకరలుగలవాడు) లగ్నము మీనరాశి ఆయి శనిచంద్రుడు కుజుల దృష్టి ఉన్న చో బాలకుడు కాళ్ళులేనివాడుగా (కుంటివాడుగా) పుట్టును. పాపగ్రహములు, చంద్రుడు రాశిసంధిలో ఉండి, శుభగ్రహ దృష్టి లేనిచో బాలకుడు జడుడు (బుద్ది హీనుడు) అగును. లగ్నము మకరరాశ్యంతిమాంశములో ఉండి శని చంద్ర సూర్యుల దృష్టి ఉన్నచో శిశువు పొట్టివాడగును. పంచమ నవము లగ్నముల వ్రేష్కాణమున అశుభ గ్రహములున్నచో కాళ్ళులేని వాడుగా, చేతులు లేనివాడుగా పుట్టును. సూర్యచంద్రులు సింహలగ్నమున నుండి శని కుజుల దృష్టి కలిగియున్నచో గుడ్డివాడుగా పుట్టును.
శుభాశుభగ్రహముల దృష్టి ఉన్నచో నేత్రములలో బిందువులేర్పడును. లగ్నమునకు ద్వాదశ భావమున చంద్రుడున్నచో ఎడమకన్ను, సూర్యుడున్నచో కుడి కన్ను నశించును. ఇట్లు పైన చెప్పబడిన గ్రహప్రభావములవలన కలుగు అశుభ ఫలములు ఆగ్రహముల పై శుభగ్రహముల దృష్టి కలిగినచో ప్రభావము తగ్గును. గర్భాధానము లగ్నము యొక్క నవమాంశమై ఆగ్రహము సప్తమ భావమున ఉన్న చో శిశువు మూడు సంవత్సరములు తరువాత పుట్టును. శనికాక చంద్రుడు ఈ స్థితిలో ఉన్న చో పన్నెండు సంవత్సరముల తరువాత శిశువు పుట్టును. గర్భాధాన సమయమున చంద్రుడున్న ద్వాదశాంశ సంఖ్యలో ముందున్న రాశిలోనికి చంద్రుడు వెళ్ళినపుడు శిశువు పుట్టును. ద్వాదశాంశ యుక్తములగు అంశలను రెండుచే హెచ్చించి అయిదుచే భాగించినచో రాశిమానము తెలియును. చంద్రుడు జన్మలగ్నమును చూడనిచో శిశువు తండ్రిపరోక్షమున పుట్టును. సూర్యుడు చరరాశిలో మధ్యభావము నుండి వెనుకకో ముందుకో అయినచో తండ్రి దేశాంతరమున నున్నపుడు శిశువు పుట్టును. లగ్నమున శని సప్తమ భావమున కుజుడు ఉన్న చో, లేదా బుధ శుక్రుల మధ్యన చంద్రుడున్నచో తండ్రి లేనపుడు శిశువు కలుగును. పాపరాశియుక్త లగ్నమున చంద్రుడున్నపుడు లేదా వృశ్చికరాశి వ్రేష్కాణముననున్నపుడు సర్పము పుట్టును. సూర్యుడు చతుష్పదరాశిలో ఉండి, ఇతర గ్రహములు బలము కలిగియున్నపుడు ఒకేమావిలో కవలలు పుట్టేదరు. శని, కుజులు సింహరాశిగతులైనపుడు, బుధుడు మేషరాశి నవమాంశలో ఉన్నపుడు, భాంశముతో సమానముగా కన్యాలగ్నము కూడియున్న చో గురువు లగ్నమును చంద్రుని, సూర్యునితో కలిసియున్న చంద్రుని చూడనిచో, సూర్యుడు పాపగ్రహములతో కలిసియున్నపుడు స్త్రీ భర్త వీర్యముచే కాక ఇతర పురుష వీర్యముతో శిశువును ప్రసవించును. పాపగ్రహములు పాపరాశులలో ఉండి సూర్యుడు కుజుడు త్రికోణ స్థానములలో లేనితో శిశువు తండ్రి విదేశములకు వెళ్ళియుండును. లేదా వృద్దుడుగా నుండును. రాశి అంత్యాంశమున గ్రహమున్నను, పూర్ణచంద్రుడున్నపుడు బుధుడు స్వరాశి నవమాంశలో ఉన్నపుడు, కుజుడు శుభగ్రహవీక్షణము కలిగియుండి లగ్నమున చంద్రుడున్నపుడు, చంద్రుడు రెండోస్థానముననున్నపుడు స్త్రీ శిశువు కలుగును. స్త్రీ ప్రసవించును. పూర్ణచంద్రుని బృహస్పతి చూచునపుడు, స్వగృహము లగ్నమై అందులో చంద్రుడున్నపుడు నీటిలో స్త్రీ ప్రసవించును. అనగా నీటిలోనే శిశువు పుట్టునని భావము. శని పాపగ్రహములచే చూడకబడునపుడు, మేషరాశి పన్నెండవరాశిగా ఉన్నపుడు, శని కర్కాటకలగ్నముననున్నపుడు చంద్రుని దృష్టి ఉన్నపుడు గోతిలో శిశువు పుట్టును. స్త్రీ ప్రసవము గోతిలో అగునని భావము. శని జన్మ లగ్నములో ఉండి బుధ సూర్య చంద్రులచే చూడబడినచో,క్రీడాస్థానమున, దేవాలయమున, మరుభూమిలో వరుసననుసరించి శిశువు పుట్టును. అనగా జన్మలగ్నముననుండి శనిని. బుధుడు చూచిన క్రీడాస్థానమున, సూర్యుడు చూచిన దేవాలయమున, చంద్రుడు చూచిన మరుభూమిలో పుట్టునని భావము. కుజుడు లగ్నమును చూచినచో స్మశానమున శిశువు పుట్టును. చంద్ర శుక్రులు కలిసున్నచో గ్రామ్యస్థానమున పుట్టును. బృహస్పతి సూర్యులు కలిసున్నచో అగ్నిహోత్రగృహమున పుట్టును. బుధుడు లగ్నమున నున్నచో బలవంతుడై శిల్పాలయమున శిశు జన్మను కలిగించును. స్థిరమగు గ్రహములు తమ తమ రాశి నవమాంశములలో నున్నపుడు గృహమున శిశువు పుట్టును. కుజుడు శని త్రికోణస్థానములందున్నపుడు, లేదా అస్తంగతులైనపుడు కూడా గృహమున శిశువు పుట్టును. శిశువునకు గురు దృష్టి యున్నచో దీర్ఘాయుష్మంతుడు, ఉత్తముడు అగును. చంద్రుని పాపగ్రహములు చూచునపుడు, లగ్నమున కుజుడు అస్తమించినచో శిశువు త్వరలో మృతి చెందును. శిశువు పుట్టినపుడు కుజ శనులచే చూడబడినచో తల్లిదండ్రులవద్ద కొక ఇతరుల వద్ద నుండి సుఖవంతుడగును. పాపగ్రహవీక్షణమున్నచో కొన్ని నెలలలో మృతి చెందును. ఆయా లగ్నాధిపతుల ప్రభావము వలన పితృ గృహమున, లేదా మాతృగృహమున స్త్రీ ప్రసవించును. శుభగ్రహము నీచ స్థానముననున్నపుడు, లగ్నమున నున్న చంద్రుడు ఒకోస్థానమును చూడనపుడు వృక్షము క్రింద శిశువు కలుగును. ఇట్లు లక్షణములున్నచో ఏకాంతమున ప్రసవించును. శని రాశి నవమాంశములో నున్నపుడు, చంద్రుడు నాలుగోస్థానమున నుండి, చంద్రుడు శనిచే చూడబడినపుడు కొద్దివెలుగున్న చీకటిలో, నీచ భూస్థానమున శిశువు పుట్టును. శీర్ణోదయము, పృషోదయము గల పుట్టుకను కూడా గ్రహముల ప్రభావము వలననే చెప్పవలయును.
చంద్రుడు అస్తగతుడై పాపులతో కూడియున్నచో తల్లికీ పీడను కలిగించును. శనితో కలిసియున్నచో జీర్ణమైన గృహము ఉద్ధరించబడును. సూర్యునిచే కలిసియున్నచో కాష్ట్రములతో సుందరగృహముండును. బుధుడున్న చో గృహము బహు శిల్పయుతమగును. శుక్రుడున్నచో చిత్రయుక్తముగా నూతన గృహముండును. గురువు విషయమున దృఢము రమ్యముగా గృహముండును. బుధుడు కుంభ మేష, కర్కాటక రాశులలో ఉన్నచో గురువు గృహమున కలిసియున్నచో ఉత్తర దిక్కును చూచుచున్నపుడు, వృషభమునుండి మృగశిరమున నుండి, సింహమును చూచినపుడు దక్షిణ దిక్కున నివాసముండును. గృహమున ప్రాచ్యాది దిక్కులలో రెండు రెండు గ్రహముల మేలనముండి, ద్వీస్వభావరాశులలో, కోణస్థానరాశులలో ఉన్న చో ఫలితము మారి యుండును. పర్యంకమున వొస్తువు వలె పాదములుండును. త్రిషదంకాంత్య రాశులున్నపుడు, చంద్రుని, అంగారకుని మధ్యలో గ్రహములచే కలిసున్నపుడు సూలికములు చెప్పబడినవి. చక్రము నుండి బహిరాగమున అంతర్భాగమున దృశ్యాదృశ్యముగా నుండును. మరియొక విధముగా అయినచో ఇతరులుండును. లగ్నాశయ సమానాంగముబాలిథీటము సమముగా నున్నను చంద్రనవాంశమువలె వర్ణము కలిగి శిరస్సు మొదలగు అవయవ విభాగములచే కూడియుండును. శిరస్సు, నాసిక, కపోలములు, దవడలు, ముఖము, కంఠము, భుజములు, పార్శ్వములు, హృదయము, బాహువులు, క్రోడము, నాభి, బాస్తికము, శిశ్నము, వృషణములు, పిరుదులు, మోకాళ్ళు, పిక్కలు, పొదములు, రెండు చోట్ల కలిపి చెప్పవలయును. ఆయా అవయవముల అధిపతి పాపగ్రహములచే కలిసి యున్నచో ఆయా అవయవములకు వ్రణములు కలుగును. లేదా మచ్చలు ఏర్పడును. తమతమ రాశ్యంశమున స్థిరయుక్తమైనచో నైజమగును. లేనిచో ఆగంతకుడగును. శనియున్నచో వాయు పాషాణముల వలన భయము కలుగును. కుజుడున్నచో విషశస్త్రాగ్నులవలన భయము కలుగును. సూర్యుడు కోణస్థానమునందున్నచో కొషముల వలన పశువుల వలన భయము కలుగును. మేషరాశిలో పుట్టినవారికి శృంగములు కలవాటి వలన భయము కలుగును. ఏరాశిలో మూడు గ్రహములుండును అతనికి పృష్ఠమున. వ్రణము నిశ్చితము. రాశినాశ్రయించి యున్నచో శరీరమున వ్రణము కలుగును. సౌమ్యగ్రహములచే కూడియున్నచో మచ్చలు కలవాడగును. చతరస్రాకారముగా పింగళవర్ణములు కల నేత్రములు కలవాడు పిత్తస్వభావము కలవాడు కొద్ది జుట్టుకలవాడుగా సూర్యుడుండును. చంద్రుడు వృత్తాకారము కలవాడు వాత కఫ ప్రకృతి కలవాడు, ప్రాజ్ఞుడు, చిన్నగా మాట్లాడగలవాడు, శుభకరమైన నేత్రములు గలవాడు. కుజుడు క్రూరదృష్టి కలవాడు, యువకుడు, పిత్తప్రకృతి కలవాడు చపల స్వభావము కలవాడు. బుధుడు మూడు విధముల స్వభావముకలవాడు, హాస్య రుచి కలవాడు, శిష్ట వాక్కు గలవాడు. గురువు పింగళ కేశములు కలవాడు, శక్త స్వభావము కలవాడు, పొడగరి, కఫ స్వభావము కలవాడు బుద్ధిమంతుడు. శుక్రాచార్యులు చక్కని శరీరము కలవాడు, చక్కని నేత్రములు కలవాడు, నల్లని ఉంగరాల జుట్టు కలవాడు సుఖము కలవాడు. శని పొడగరి, కపిల నేత్రములు కలవాడు, తక్కువ పొడుగు కఠినమైన జుట్టుకలవాడు, సోమరి. స్నాయువు, అస్తి, రక్తము, చర్మము, శుక్రము, వస మజ్జ అను ఏడు ధాతువులు శరీరమున ఉండును. ఈ ఏడు ధాతువులకు వరుసగా శని, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, కుజుడు అధిపతులు. రాశి అంత్యాంశలో చంద్రాంగ పాపులున్నపుడు, చంద్రునితో కలిసి నాలుగు పాపగ్రహములున్నపుడు, చక్రములోని పూర్వాపరములందు పాపులు సౌమ్యులు కలిసియున్నపుడు లగ్నమున కీటమున్నపుడు మృతి తథ్యము. పాపగ్రహములు ఉదయిస్తగతులై క్రూరగ్రహములచే కలిసియున్న చంద్రుడు శుభగ్రహములచే చూడబడనిచో ఆ సమయమున పుట్టిన శిశువు నిశ్చయముగా వెంటనే మరణించును. క్షీణ చంద్రుడు పన్నెండవ స్థానమున నుండి పాపగ్రహములు లగ్నమునకు అష్టమస్థానముననుండి, శుభగ్రహములు లేనిచో, కేంద్రస్థానములందు గ్రహములతో కలిసి చంద్రుడున్నచో మృత్యువులగ్నమని తెలియుము. కేంద్రాది స్థానములందు గ్రహముల వీక్షణము లేనపుడు మృత్యువు కలుగును. షష్ఠస్థానమున చంద్రుడు పాపగ్రహములచే చూడబడక శుభగ్రహములచే చూడబడునపుడు వెంటనే మృత్యువు కలుగును. సమాష్టకమున మిశ్రగ్రహములచే చూడబడినపుడు శిశువు మరణించును. క్షీణ చంద్రుడు అంశమున నున్నపుడు, రంధ్ర కేంద్ర స్థానములలో పాపులున్ననూ, పాపుల మధ్యలో నున్ననూ భూద్యూన నిదన స్థానములలో చంద్రుడున్నపుడు, లగ్నమున నున్నపుడ కూడా శిశువు మృతి చెందును. చంద్రుడస్తగతుడైనపుడు పాపగ్రహములచే చూడబడినపుడు, శుభగ్రహములచే చూడబడనపుడు, రాశి అంత్యాంశమున చంద్రుడున్నపుడు త్రికోణస్థానమున దుష్టగ్రహములు లేనిచో, లగ్నమున చంద్రుడున్నపుడు కూడా, పాపగ్రహములు ఆస్తమొందినపుడు శిశువు మృతి చెందును. చంద్రుడు గ్రసించబడినపుడు అష్టమస్థానమున దుష్టగ్రహములున్నచో తండ్రీకొడుకుల మృతి సంభవించును. లగ్నమున సూర్యుడుండి, బలవంతులగు దుష్టగ్రహములు అష్టమస్థానముననున్నచో శస్త్రముచే మృతి సంభవించును. కర్కాటకరాశిలో బృహస్పతితో చంద్రుడు కలిసున్నచో, లగ్నమున కేంద్రమున బుధుడు శుక్రుడున్నపుడు, మిగిలిన గ్రహములు మూడవస్థానమున, శత్రుస్థానమున నున్న చో. దీర్ఘాయువు లభించును. వర్గోత్తమము మీనలగ్నమైనచో, చంద్రుడు వృషభరాశిలో ఉన్నపుడు అన్ని గ్రహములు ఉచ్చస్థానములలో నుండగా దీర్ఘాయువు నిశ్చయము. బలవంతుడగు గ్రహము శుభగ్రహములచే చూడబడినపుడు, కేంద్రమున నుండగా ఆయువును అర్ధమును ఇచ్చును. చంద్రుడు స్వోచ్చస్థానమున నుండి శుభరాశులలో సౌమ్యగ్రహములు బలవంతులై, బలవర్ద్రహము లగ్నమున నుండగా కేంద్రస్థానమున సౌమ్యులుండగా అరవై సంవత్సరములు ఆయుష్యముండును. అష్టమశుద్ధి కలిగి గురువు అనుకూలముగా నుండగా డెబ్బది సంవత్సరముల ఆయుష్యము మూలత్రికోణస్థానములలో సౌమ్యగ్రహములుండి గురువు స్వోచ్చరాశిలో ఉండగా లగ్నాధిపుడు బలయుతుడైనచో యెనుబదివత్సరములు ఆయువు నిశ్చితము. కేంద్రమున బలయుతులైన గ్రహములుండి, కేంద్రమున శుభగ్రహములుండి అష్టమ శుద్ధియుండి, లయేశుడు ధర్మస్థానమున నుండి, బృహస్పతి అష్టమస్థానముననున్నచో, క్రూరగ్రహదృష్టిపడినచో జితులగుదురు. లగ్నాధిపతి అష్టమాధిపతి అష్టమ స్థానమున నున్నపుడు ఆయుః కారకులగుదురు. లగ్నమున అశుభగ్రహము గురువు ఉన్నపుడు చంద్రుని దృష్టి యున్నపుడు మృత్యువునకు ఒక ఆకాశము ఏర్పడును. శని ధర్మాంగ స్టుడైనపుడు, శుక్రుడు కేంద్రమునుండి చంద్రుడు పన్నెండవ స్థానమున నున్న చో నూరుసంవత్సరము ఆయుష్యముండును. బృహస్పతి కర్కటకరాశిలో ఉన్నపుడు, కర్కటకమున శుకరబృహస్పతులున్నపుడు లయేశుడంగముననున్నపుడు, అష్టమమున శుభగ్రహములు లేనిచో దీర్ఘాయువు నిశ్చితము. లగ్నాధిపతి అష్టమస్థానమున, అష్టమాధిపతి లగ్నమున నున్నచో అయిదుసంవత్సరములు ఆయుష్యము. శుక్రబృహస్పతి యోగమున, బుధ చంద్రులు. లగ్నమున ఉన్నచో మృత్యువు నిశ్చితము. ఇది గ్రహయోగము వలన తెలియు ఆయుష్యము. ఇపుడు స్పష్టముగా చెప్పెదను వినుము. సూర్యాధిక బలమున్నచో పిండము ఆరోగ్యబలములు కలిగియుండును. చంద్రబలమున్నచో సహజముగా నుండును. లగ్నము బలయుతమైనచో అంశాయువు నిశ్చితము. ఆ అంసాయువును తెలియు విధానమును చెప్పెదను వినుము. గోబ్దములు, తత్త్వతిధులు, సూర్యుడు, తిధి స్వర్గములు నఖములు క్రమముగా చేర్చబడవలయును. నఖములు, విధువు, రెండంకములు, ధృతి సాక్షి మార్గణములు చూడబడవలయును. పిండమునిసర్గముగా ఉన్నపుడు స్వోచ్చస్థానమున ఏ గ్రహములేనపుడు ఆరవ స్థానమున క్షీణబలయుతుడగు గ్రహమున్నపుడు చక్రశుద్దిని స్వీకరించవలయును. చక్రశుద్ది అంశములే ఆయుష్యమును తెలుపు ప్రమాణములు. అంశోనములు శత్రురాశిలో చేర్చబడి, వక్రగతిలేని గ్రహమును చూడవలయును. శని శుక్రులు అల్గోనులు కాక అస్తంగత గ్రహమునకు హాని ద్వయమున్నచో అధికాంశలను కూర్చవలయును. లగ్నమున క్రూరగ్రహములున్నపుడు శత్రువులను వదిలి, అంజ్ఞాదులతో కొట్టివేసి ఆయువు భాగములను, చూడవలుయును. భగణాంశములతో హీనలబ్దిని చూచి వాటిని విచక్షణతో పరిశీలించవలయును. పాపగ్రహాంశలను. సమగ్రముగా తక్కువగా చేసి బుధగ్రహాంశలను సగము వదిలి ఆ అంశలను సృష్టములుగా 1, 6, 3 సంఖ్యలచే భాగించి, తమ గణములతో గుణించి శేషమును సంవత్సరములుగా, పన్నెండుతో కొట్టి వేయగా వచ్చిన వి నెలలుగా తెలియవలయును. అట్లు చేయగా మిగిలిన దానిని మూడు రెట్లు చేసినపుడు వచ్చిన దానిని దినములుగా తెలియవలయును. శేషమును అరవైచే భాగించగా వచ్చినవి ఘటికాదులుగా తెలియవలయును. భాజ్యాంగ భాగములను విడిచి 1, 1, 2 తో గుణించగా వచ్చిన వివరములని, మిగిలిన దానిని ద్వాదశాదులచే గుణించగా ద్విసప్తాంశ మాసాదులుగా లగ్నాయువు స్పుటముగా తెలియును. లగ్నముల అంశలు ఆయుష్యము లగ్నాంశములచే గ్రహాంశలచే తెలియవలయును. ఖ యుగములచే ఆయురంశలు తెలియును. ఇపుడు నీకు ఆ సంస్కారమును గూర్చి తెలిపెదను.
గ్రహాన లగ్నము షడ్రంత్యమైననే సంస్కారము చేయవలయును. అట్లు కానిచో చేయరాదు. ఆయంశము నాలుగుచే భాగించగా వచ్చిన తక్కువ భాగము గుణమగును. ఎక్కువగా ఉన్నవి అంశములు తక్కువగా ఉన్నవి భూగుణమని తెలియవలయును. సౌమ్యగ్రహమునకు అర్థభాగముచే, పాపగ్రహమునకు సమగ్రభాగముచే చేయవలయునని సిద్ధాంతము. ఆరింటిని గుణభాగముచే కొట్టివేయబడినవి ఆయురంశములు. దీనినే సంస్కారమందురు. ఆయురంశ కలా భక్తమునుండి పన్నెండుచే కొట్టివేసి ఇరువదిచే భాగించబడినవి సంవత్సరములు. మిగిలిన దానిని ద్విశతముచే భాగించగా నెలలు, మిగిలినవి దినాదికములని తెలియవలయును. లగ్నాంశములను, ఆయురంశములను మూడుచే గుణించి 8చే భాగించినపుడు సంవత్సరములగును. మిగిలిన దానిని పన్నెండుచే గుణించి 8చే భాగించగా మాసాదికములగును. బలవంతుడగు గ్రహమున్నరాశిలో సమానమగు సంవత్సరములు ఆయుష్యమని స్పష్టముగా తెలియును. అంశద్వీఘ్నము, అక్షాంశము 1, 3 మొదలగు వాటిచే గుణించగా మాసములు తెలియును. మిగిలినవి దినాదికములుగా తెలియవలయును. ఈ గణితము పిండ నిసర్గములకు చేయరాదు. లగొర్క చంద్రుల మధ్యలో ఏ గ్రహము బలీయమో ముందు ఆ దశ ప్రారంభమగును. తరువాత కేంద్రాది స్థానములలో ఉన్న గ్రహముల దశలు రెండు మూడు మొదలగు వాటి యందు బలీయుని దశ వచ్చును. ఈ దశలలో కూడా కేంద్రదిస్థానములలో ద్వితీయ తృతీయస్థానములలో బలీయునితో క్రమము ప్రారంభమగును. బలీయులై సూర్యాదులతో కూడియున్న గ్రహములదశ ప్రారంభమైనపుడు. దీర్ఘాయుష్మంతుడగును. విపరీతమైనచో యాచకుడగును. షడ్వర్గార్థము, త్రింశాంశ, త్రికోణస్థానములలో నున్న గ్రహదశయేర్పడినచే స్మరగుడగును. సప్తమాసములలో చతురస్రగతుడైనచే ఇచట కూడా కేంద్రాదిస్థానములలో ద్రాత్ర్యాదులలో సబలగ్రహములక్రమమే ప్రారంభమగును. పాకాధిపుడైనచో నాలుగు ఎనిమిది స్థానములు, సహగుడైనచే నాలగు స్థానములు. త్రికోణ స్థానమున నున్న వానికి 8, 8, 12 సంఖ్యలీయవలయును. నాలుగు పెనిమిది స్థానములలో ఉన్న వానికి స్వరగుణితము చెప్పబడినది. దశాగుణములో హతములై భాగముచే గుణేక్యముచే వచ్చినవగును. మిగిలిన భాగము అర్కాదిహతమైనచో మాసాద్యేక్యముచే భాగముచేయవలయును. అంతర్దశలలో విదశలు, విదశలలో ఉపదశలుండును. దశలో. అంశమిత్ర స్వోచ్చరాశులలో నున్న చంద్రుడు నాలుగు ఒకటిమొదలగు వాటిచే వృద్ధినందినచో శుభస్థానముననున్న చో శుభకరుడగును. ఏరాశిలో ఉన్నపుడు ఆయా స్థానములకనుగుణముగా ఫలితములనిచ్చును. చెప్పిన స్థానముల కంటే భిన్న స్థానములలో నున్నచో ఆయా భావములను క్షీణింపచేయును. గ్రహమునకు యే ద్రవ్యముండునో అది భావాంశలో కణయోగము వలన కలుగును. జీవనఫలమంతయు దశలో కూర్చవలయును. విదశాది దశలలో శత్రుగ్రహముచే చూడబడు గ్రహము ఆపదలను కలిగించును. శుభగ్రహములచే, మిత్రగములచే చూడబడినచో, సద్వర్గలోనున్న గ్రహము ఇష్టుడగును. ఆ దశా కాలములో ఆగ్రహము బలయుతుడైనచో ఆపదలను నశింపచేయును. అతనికి అష్టవర్గజఫలము పూర్తిగా శుభమే యగును. లగ్నమున మూర్తి స్థానమున నున్న చంద్రుడు వృద్ధిచెంది వాడై స్వోచ్చరాశిలోనున్న చో, తనను త్రికోణస్థానమున మిత్రగ్రహములున్న చో మధ్యమఫలము కలుగును. విపరీతగతుడైనచో శ్రేష్ఠము శుభతరమగు ఫలమును చెప్పవలయును. ఉతాటానిష్టమును, స్వల్పముగా తెలిసి బలమును చెప్పవలయును. చరరాశిలో ఉంటూ మధ్యలో దుష్టగ్రహములచే విపర్యమువలన అంగ భంగము జరిగినచో, స్థిరరాశిలో ఇష్టమగు అష్టమమధ్యలో నున్ననూ హోరాత్ర్యంశములతో ఫలమును చెప్పవలయును. రాశ్యధిపతి బృహస్పతి బుధులచే కలిసియున్న చో, లేదా చూడబడినచో సత్పలమునొసంగును. చూడబడిననూ కలిసియున్ననూ పాపగ్రహముల మధ్యన నున్నచో వినాశము తప్పదు. ప్రాగ్ద్వక్షముగా నున్నచో బంధుమృత్యువు సంభవించును. సూర్యుడు ఇద్దరికంటే తక్కువగా ఉన్ననూ, శుక్రాదులు షడ్రతులైనపుడు నాలుగు ఆరు పదకొండు స్థానములలో బృహస్పతిమొదలగు గ్రహములున్నూ, చంద్రునికి మూడింట ఆరింట ఉన్ననూ చెడుఫలము కలుగునని తెలియవలయును.. వృద్దిస్థానమగు రాశిలోకాని, పదకొండింట, ఆయిదింట చంద్రుడు తనరాశిలో ఉన్న చో శుభకరుడగును. ఆరు, మూడు, పదకొండు, అయిదు స్థానములలో నుండి శనికి బుధునికి రెండు మూడు పదకొండు కేంద్రస్థానములలో నున్ననూ కేంద్రము అష్టమఏకాదశ స్థానములలో నున్న బృహస్పతి కంటేను బుధుడు స్వస్థానముననున్న. శుక్రుని కంటే బలీయుడగును. వృద్ధిలో ఉన్న సూర్యునికంటే మొదటి అయిదవ స్థానములలో నున్న పదకొండు ఆరుస్థానములలో నున్న చంద్రునికంటే, కేంద్రస్థానములలో అష్టమస్థానములో శుభరాశిలోనున్న శని కం ఓ గోషాఆయ కేంద్రస్థానములలోనున్న, గ్రహము బలీయము. ఆరు మూడు అయిదు స్థానములలో నున్న బుధుని కంటే ఆరు, అంశ, అష్టమస్థానములలో నున్న శుక్రుని కం టే, నాలుగు పదకొండు పన్నెండు స్థానములలో నున్న కుజుడు గురువు కంటే బలీయుడు. ఆరు పదకొండు స్థానములలో నున్న శుక్రునికంటే, అయిదు మూడుస్థానములలో నున్న శనికంటే బుధుడు బలీయుడు. అస్తగతుడైన కుజునీ, కంటే బృహస్పతికంటే పన్నెండు ఆరుస్థానములలో నున్న గ్రహము మృత్యుప్రదుడు. నాలుగు పదకొండు ఆరుస్థానములలో నున్న అంత్యములోనున్న సూర్యునికంటే ప్రథమ తృతీయ స్థానములలోనున్న, ఆరు, ఒకటి, పదకొండు, ఎనిమిది, నాలుగు, స్థానములలోనున్న బృహస్పతికంటే భిన్నలగ్నములలోనున్న గ్రహములు బలీయములు. కోణస్థానములలో అష్టమస్థానములో ప్రథమస్థానముననున్న కుజునికం ఓ మూడవస్థానముననున్న గురువు. బలీయుడు. మూడవస్థానమున నున్న సూర్యుని కంటే, శుక్రునికం , మూడవ మొదటిస్థానమున, 8, 9, 6 స్థానములలోనున్న గ్రహము బలీయము. నాలుగు అయిదు రెండు స్థానములలో నున్న చంద్రుని కం టే, రెండు మూడు ఆరుస్థానములలోనున్న గ్రహము అదే స్థానములోనుండు శనికంటే బలీయుడు. ఒకటి, నాలుగు, అయిదు, ఆరు పదకొండు స్థానములలో నున్న గ్రహములు రెండు పన్నెండు స్థానములలో, భిన్న రాశులలో నుండు బుధునికంటే బలీయులు. రాశ్యంత్యాంశములలో నుండు చంద్రుని కంటే శుక్రుడు శుభకరుడు. తన రాశిలో బుధునితో నున్న గ్రహములలో మూడు అయిదు. నాలుగు రెండు స్థానములలో, దిక్ భద్ర ఆగతుడగు గ్రహము శనికంటే శుభకరుడు. రంధ్ర, ఆయ, వ్యయస్థానగతుడు 8, 5, 3 స్థానములలో నుండు సూర్యునికం టే గురువు కంటే బలీయుడు. బుధుడు నాలుగు మూడు, పదకొండు, ఆరు, రెండు స్థానములలో, మూడు అయిదు ఆరు స్థానములలో నుండు శని రాశ్యంత్యాంశములలో నుండు కుజుని కంటే బలీయుడు, కేంద్ర, ఆయ, అష్ట ధనస్థానములలో నున్న సూర్యుడు లగ్నమునుండి వృద్ధి ఆద్యబంధువులలో గోఅధ్వఅష్టఅరి భస్థానములలో రాంశ్యంత్య భాగములలో నుండు చంద్రునికంటే లాభత్రిషట్ స్థానములలో నుండగా బలీయుడు.
ఆరు, ఎనిమిది, అంత్యాంశగతుడు రెండు, అంత్యాంశలయందుండు గురువు కంటే శుక్రుని కంటే బలీయుడు. ఉక్తస్థానములలో రేఖల నీయవలయును. చెప్పని స్థానములలో బంధువుల నుంచవలయును. జన్మరాశి నుండి ద్వీమిత్రోశ్చరాశులు స్వస్థానములైనచో శుభము. పరస్థానమైనచో అశుభమని తెలియ వలయును. అర్థక్షయము క్లేశము. సమత అర్థ సుఖమునిచ్చును. ధనాప్తి, సుఖము, ఇష్టాప్తి అని క్రమముగా రేఖాఫలమును చెప్పవలయును. సూర్యుని వలన పితృమాతృద్విషన్మిత్ర భాతృ సేవనలు లభించెదరు. స్వాబగా ఉన్నను మేషలగ్నములోను స్వస్థానములోనున్న సూర్యచంద్రుల వలన కీర్తి ప్రతిష్ఠలు పెరుగును. తృణ, స్వర్ణ, అశ్వ, ధోరణాదులచే సూర్యాంశలో జీవనమును" చెప్పవచ్చును. చంద్రాంశలో, కృషి, అంచుజస్త్రీలచే జీవనమును చెప్పవలయును. కుజాంశలో ధాతువులచే, ఆస్త్రములచే, సాహాసముచే జీవనము జరుగునని చెప్పవలయును.
బుధాంశలో కావ్యశిల్పాదులచే జీవనము సాగునని, దేవ ద్వీజాకరములచే గుర్వంశలో జీవనము సాగునని చెప్పవలయును. శుక్రుని అంశలో రజత రత్నములచే, శని అంశలో హింసాశ్రమ అధములతో జీవనము సాగునని చెప్పవలయును. సూర్యుడు తన ఉచ్ఛరాశులలో ఉండి గురుకుజులతో కలిసి యున్నచో రాజులగుదురు. లగ్నములోకాని, వర్గోత్తమమున కొని చంద్రుడుండి నాలుగు అంతకంటే ఎక్కువ గ్రహములచే చూడబడినచో రాజగును. ఉచ్ఛలో కుజుడు, ధనూరాశిలో సూర్య చంద్రులు, లగ్నమున శని ఉన్నచో రాజగును. ఉచ్ఛలో సూర్యుడు, స్వస్థానమున నుండు గురువు, శని చంద్రులు ఉచ్ఛలో నుండు నపుడు, లగ్నమున సూర్యుడు, షష్ఠస్థానమున బుధుడున్నచో, శుక్రుడు కుజుడు, గురువు కర్కటకముననున్నపుడు, కుజుడు మేషమున కొని లగ్నమున కాని యున్నచో రాజగును. సూర్యుడు, బృహస్పతి వృషభమున నున్నను, స్వస్థానమున బృహస్పతి యున్ననూ రాజగును. శని సింహమున, మూడు ఆరు స్థానముల రాశ్యంశమున మేషాదులున్ననూ రాజగును. మేషమున బృహస్పతితో కూడిన గ్రహమునుండి, సింహమున కుజుడుండిన, ఉచ్ఛరాశితో మేషము చూడబడునపుడు రాజగును. లగ్నమున బృహస్పతితో కూడి సూర్యుడున్నపుడు, బుధశుక్రులు మేషమున నున్నపుడు, మేషరాశిలో సూర్యుడుండి, కుజచంద్రులతో కలిసి యున్ననూ చూపు పడిననూ, శని కుజులున్ననూ, సింహమున కుంభమున మేషమున ఉన్నచో రాజగును. మేషలగ్నమై, మేషమున కుజుడున్ననూ రాజగును. సూర్యుడు, బృహస్పతి లగ్నమున నున్ననూ, సూర్యుడు, కుజుడున్ననూ రాజగును. అయిదవస్థానమున గురువు చంద్రుడు శుక్రుడున్నచో, స్వస్థానమున మూడింటఉన్నను రాజగునని పండితులు చెప్పెదరు. సింహలగ్నజాతకుడు, సింహమున శనిచంద్రుడున్నపుడు, శుక్రుడు కుజుడు తులారాశిలో కాని, ద్విస్వభావరాశులలో కాని ఉన్నచో రాజు కీర్తిమంతుడగును. పైన చెప్పబడినయోగములచే ఎవరి పుత్రుడైననూ రాజు కావచ్చును. ఇపుడు చెప్పబోవుయోగములచే రాజ పుత్రుడు మాత్రమే రాజగునని తెలియును.
స్త్య్రాదిగ్రహములు బలయుతులై తమతమ ఉచ్చ స్థానములలో కాని త్రికోణ స్థానములందు కానియున్నచో రాజుకోగలడు. సింహమున సూర్యుడు, మేషమున చంద్రుడు, మకరరాశిలో కుజుడు, కుంభరాశి అష్టమము, ధనూరాశిలో బృహస్పతి, స్వస్థానమున శుక్రుడున్న చో జాతకుడు రాజగును. పాతాల ధర్మస్థానములలో నున్న చంద్రుడు శుభగ్రహములచే చూడబడినచో మిగిలిన గ్రహములు త్రోలగ్న భవస్థానములలో నున్నచో రాజగును. బలయుతుడగు బుధుడు వృషభమున నుండగా, శుభగ్రహములు శుభస్థానములలో నున్నపుడు, ధర్మధనస్థానములలో మిగిలిన గ్రహములున్నపుడు రాజు. ధర్మాత్ముడగును. మేష ఆయలగ్నములలో చంద్రుడు శని గురువులున్నచో ధనస్థానమున (2) బుధకుజులున్నచో, శుక్రుడు హిబుకమున ఉన్నచో రాజగును.
వృషభమున, కుంభమున చంద్రుడు, రెండవస్థానమున ఆరవ స్థానమున గురు శనులు, ఇతరులు పదకొండవ స్థానముననున్నచో, నాలుగవస్థానమున గురువు, సూర్య చంద్రశనులు లగ్నమున, భవమున, కరిలో ఉన్నపుడు, లగ్నమున శుక్రుడు శని, చంద్రుడు, గురువు, శుక్రుడు, సూర్యుడు బుధుడు క్రమముగా శుభులు శుభరాశిలో ఉన్నపుడు పుట్టినవాడు రాజగును. పదవస్థానమున, లగ్నమున నున్నగ్రహముయొక్క దశలో రాజ్యము లభించుట కలదు. బలీయమగు గ్రహముయొక్క దశలో కాని శత్రుగ్రహములు నీచ స్థానములలో నున్నపుడు ఆర్తిని కలిగించును. సూర్యుని సమీపమున . సకల గ్రహములున్నచో వర్గదము అందురు. లగ్నమున గ్రహము అస్తగుడైనచో సకట యోగమందురు. రాజ్యబంధుస్థానములలో గ్రహములున్నచో విహగయోగమందురు. అయిదవ స్థానమున ఎనిమిదవ స్థానమున గ్రహములున్న చో శృంగాటకయోగమందురు. లగ్నమున కంటే ఇతర స్థానములలో గ్రహములున్నచో హలయోగమందురు. అంగమున శుభాశుభగ్రహములున్నపుడు వర్జయోగమందురు. నాలుగవ స్థానమున నున్న చో యపయోగమందురు.
గ్రహములు కలగాపులగముగానున్నచో కమలయోగమందురు. లగ్నమున నాలుగు గ్రహములున్నచో యూపయోగమందురు. నాలుగవ స్థానమున సొలుగు గ్రహములున్నచో శరయోగమందురు. ఏడునాలుగు రెండవ స్థానములలోనున్న చో శక్తి , యోగమందురు. లగ్నమునుండి వరుసగా ఏడు స్థానములలో గ్రహములున్నచో- నౌకా యోగమందురు. లగ్నమున మాత్రమే యున్నచో కూటయోగమందురు. స్వస్థానమున గ్రహమస్తంగతుడైనచో ఛత్రయోగమందురు. ఇతర స్థానములలో అస్తగుడైనచో అర్ధేందు యోగమందురు. లగ్నమునుండి ఒకటిని విడిచి తరువాతి రాశిలో గ్రహములున్నచో చక్రయోగమందురు. సమసప్తరాశులలో గ్రహములున్నచో వీణాదియోగములనబడును. వీణా దోమ, పాశ, కేదార, శూల యుగ గోలకములని ఆరు యోగములు. అన్ని గ్రహములు చర రాశులలో నున్నచో రాజయోగమని చెప్పబడినది. స్థిరరాశులలో అన్ని గ్రహములున్నచో ముసలయోగమందురు. ద్విస్వభావరాశులలో నున్నచో నలయోగమందురు. కేంద్రమున సౌమ్యగ్రహములున్నచో భాలయోగమందురు. కేంద్రమున పాపగ్రహములున్నచో సర్పయోగమందురు. రజ్జుయోగమున పుట్టినవాడు ఈర్ష్యాలువు ప్రయాణమున రుచి గలవాడుగా నుండును. ముసల యోగమున పుట్టినవాడు ధనము గౌరవము కలవాడగును. వీణాయోగమున పుట్టినవాడు అతినిపుణుడు, గీతనృత్యము లందు మిక్కిలి అభిలాష కలవాడుగా నుండును. దామయోగమున పుట్టినవాడు సర్వసంపద్యుక్తుడు దౌతయగును. పొశయోగమున పుట్టినపోడు ధనవంతుడు శీలవంతుడగును. కేదారయోగమున పుట్టినవాడు వ్యవసాయము చేయువాడగును. శూలయోగమున పుట్టినవాడు శూరుడు తరగని ధనము కలవాడగును. యుగయోగమున పుట్టినవాడు పాషండులతో కలిసియుండును. గోలకయోగమున పుట్టినవాడు ధన హీనుడు మలినుడగును. చక్రయోగమున పుట్టినవాడు రాజులచే నమస్కరించదగినవాడగును. సముద్రయోగమున పుట్టిన వాడు రాజభోగములు కలవాడగును. అర్థచంద్ర యోగమున పుట్టినవాడు సౌందర్యము కల అవయవములు కలవాడు సుఖీ, శూరుడు దీర్ఘాయుష్మంతుడగును. ఛత్రయోగమున పుట్టినవాడు మిత్రులకు ఉపకారము చేయువాడగును. కూటయోగమున పుట్టినవాడు అసత్యవాదియగును. తేజోవంతుడు, కీర్తిమంతుడు, సుఖము కలవాడుగా నగును. యూధయోగమున పుట్టినవాడు త్యాగి, యాగము చేయువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, గుహ్యాధిపుడగుచో శరములచే హింసించువాడగును. శక్తియోగమున పుట్టినవాడు నీచుడు, అలసుడు, నిర్థనుడు అగును. దండయోగమున పుట్టినవాడు ప్రియుల ఎడబాటును పొందును. సూర్యుడుకాక మిగిలిన గ్రహములు కుంభ మీన రాశులలో నున్నపుడు సునఫా, ఆనఫా యోగములందురు. చంద్రుడు మీనరాశిలో ఉన్నపుడు దురుధరాయోగమనబడును. అట్లు కానిచో కేముద్రుమయోగమందురు. సునఫా యోగమున పుట్టినవాడు తాను సంపాదించిన ధనమును అనుభవించువాడు, దాత, ధనవంతుడు, సుఖవంతుడుగా ఉండును. ఆనఫా యోగమున పుట్టినవాడు రోగము లేనివాడు, శీలమంతుడు, ప్రసిద్ధిని పొందువాడు, చక్కని వేషము కలవాడగును. దురుధర యోగమున పుట్టిన పొడు. భోగవంతుడు, సుఖవంతుడు, ధనవంతుడు, దానము చేయువాడు, త్యాగము చేయవాడుగా నుండును. కేముద్రుమ యోగమున పుట్టినవాడు మిక్కిలి మురికిగా నుండువాడు దుఃఖము కలవాడు, నీచుడు, నిర్ధకుడుగా నుండును. కుజుడు పుష్కరాంశమున నుండగా పుట్టినవాడు యంత్రకారుడు, అశ్మ కారుడు, చక్కని బాటలో నడుచువాడు, చక్కని జ్ఞానము కలవాడు, చక్కని కీర్తి కలవాడు, నిపుణుడు, విద్వాంసుడు, ధనవంతుడుగా నుండును. లగ్నమున సూర్యుడున్నచో అన్యోన్యకార్య నిరతుడగును. శుక్రుడున్నచో శస్త్ర జీవియగును. శనితో కలిసియున్నచో ధాతుకుశలుడగును. కూటస్థానమున తిరుగువాడు శవవిక్రేత కుజడున్నచో యగును, చంద్రుడున్నచో సంతాన ద్వేషియగును. బుధునితో కలిసున్నచో అర్ధ నిపుణుడగును. వినయశాలి సత్కీర్తిమంతుడగును. గురువుతో కలిసియున్నచో స్థిరవయస్కుడు, సద్వంశజుడు, విక్రాంతుడు సమర్థుడగును. శుక్రుడున్నచో, సుఖము తెలిసినవాడగును. శనియున్నచో బలిష్ఠుడగును. బుధునితో కలిసి కుజుడున్నచో బాహు యుద్ధము చేయువాడు, గురువుతో కలిసి యున్నచో పురాధ్యక్షుడు, శుక్రునితో కలిసి యున్నచో ద్యూతము నాడువాడు, శనితో కలిసి యున్నచో అబద్దములాడువాడు, ద్యూతము నాడువాడు, గురువుతో కలిసి బుధుడున్న చో నృత్యగీత నిపుణుడు, శుక్రునితో కలిసున్నచో మాయదకుడు, శనితో కలిసున్నచో పిసిసొరీ క్రూరడగును. శుక్రునితో కలిసి గురువున్నచో విద్వాంసుడు, శనితో కలిసున్నచో అన్నఘటకరుడు, శుక్రుడు మాత్రమే ఉన్నచో చిన్నకన్నులు కలవాడు, అరణ్యము వలన వచ్చు డబ్బుగలవాడగును. ఒకేస్థానములో నలుగురు అంతకన్నా ఎక్కువగ్రహములున్నచో, కుజుడు, బుధుడు, బృహస్పతి, చంద్రుడు, శుక్రుడు శని సూర్యులున్నచో పరివ్రాజకుడగును. శాకములను కందమూలములను, ఫలములను తిను పొడగును. రాశుల అధిపతులు బలీయులైనచో ప్రవ్రజించినచో చ్యుతి కలుగదు. అదీక్షితుడు, అల్పుడు, అస్తగతుడు. బలీయులగు గ్రహములు కలిసి యున్నచో వారి భాగములచే ఫలములను చెప్పవలయును. జన్మలగ్నాధిపత్తి ఇతర గ్రహములచే చూడబడనిచో మెల్లగా చూచును. జన్మలగ్నాధిపతిని శని చూచినచో నశించును. కుజ సూర్యాంశలు శనిచే చూడబడినచో, చంద్రుడు చూడబడినచో దీక్షితుడగును.
అశ్వినీ నక్షత్రమున పుట్టినవాడు రూపవంతుడు ఆభరణభూషితుడుగా నుండును. భరణీ నక్షత్రమున పుట్టినవాడు సమర్థుడు సత్యమును పలుకువాడగును. కృత్తికా నక్షత్ర జాతకుడు తీండిపోతు, స్థిర బుద్ధి కలవాడు, ప్రియముగా మాటలాడువాడగును. రోహిణీ నక్షత్ర జాతకుడు ధనవంతుడు, మృగశిరా నక్షత్రజాతకుడు భోగి, ఆర్థా నక్షత్ర జాతకుడు హింసాలి, శఠుడు, పాపకారి యగును. పునర్వసు నక్షత్ర జాతకుడు ఇంద్రియనిగ్రహము కలవాడు, రోగి, శుభకరుడు, పుష్యమీ నక్షత్ర జాతకుడు కవి, సుఖి, ఆశ్లేషానక్షత్ర జాతకుడు ధూర్తుడు, శరుడు, కృతఘ్నుడు, పాపి, అన్నిటిని తినువాడగును. మఘ నక్షత్ర జాతకుడు భోగి, ధని, భక్తుడు, పూర్వఫల్గునీ నక్షత్ర జాతకుడు దొత, ప్రియముగా మాట్లాడు వాడు, ఉత్తరా నక్షత్ర జాతకుడు ధని, భోగి, హస్తా నక్షత్రజాతకుడు చోరుడు, ధృష్ణుడు, దైన్యము కలవాడగును. స్వాతి నక్షత్రజాతకుడు చిత్రాంబరధారి, చక్కని నేత్రములు గలవాడు, ధర్మపరుడు దయాపరుడు కాజాలడు. వీశాఖా నక్షత్ర జాతకుడు లుబ్ధుడు శఠుడు, కోపిష్టి, అనూరాధానక్షత్ర జాతకుడు తిరుగుబోతు, విదేశములకు వెళ్ళువాడు, జ్యేష్ణానక్షత్ర జాతకుడు ధర్మపరుడు, సంతోషశీలి, మూలానక్షత్ర జాతకుడు అభిమానము కలవాడు, ధనవంతుడు, సుఖము కలవాడగును. పూర్వాషాఢనక్షత్రజాతకుడు అభిమాని, సుఖీ, సంతోషము కలవాడు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుడు వినయశీలి ధార్మికుడగును. శ్రవణా నక్షత్ర జాతకుడు ధనవంతుడు, సుఖవంతుడు, ధనిషా నక్షత్రజాతకుడు దాత, శూరుడు, ధనవంతుడగును. శతభిషా నక్షత్ర జాతకుడు శత్రుసంహారకుడు, వ్యసనములు కలవాడు, పూర్వాభాద్ర నక్షత్ర జాతకుడు స్త్రీలకు లొంగుపొడగును. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుడు వక్త, సుఖి, ప్రియుడు, రేవతీ నక్షత్ర జాతకుడు శూరుడు, ధనవంతుడు పవిత్రుడగును. మేష లగ్న జాతకుడు కొమి, శూరుడు, కృతజ్ఞుడగును. వృషభలగ్న జాతకుడు ప్రియుడు, త్యాగి, ఓర్పుకల వాడగును. మిధున లగ్న జాతకుడు స్త్రీ విషయమును, ద్యూతమును, శాస్త్రములను చక్కగా తెలిసినవాడు, కర్కాటకలగ్న జాతకుడు శ్రీస్వభావము కలవాడు, పొట్టివాడు అగును. సింహలగ్న జాతకుడు స్త్రీలను ద్వేషించువాడు, కోపిష్టి అభిమానము కలవాడు, విక్రమము కలవాడు, స్థిరబుద్ధి కలవాడు సుఖవంతుడగును. కన్యాలగ్న జాతకుడు ధర్మాత్ముడు, వినయము కలవాడు, మంచి బుద్ధి కలవాడు, తులాలగ్న జాతకుడు ప్రాజ్ఞుడు, పొడగరి, ధనవంతుడగును. వృశ్చిక లగ్న జాతకుడు రోగి, పూజ్యుడు, గాయములు కలవాడు, ధనుర్లగ్న జాతకుడు కవి, శిల్పి, ధని యగును. మకర లగ్న జాతకుడు సోమరి, తిరుగుపోతు, మంచికనులు కలవాడు, కుంభ లగుజాతకుడు పరస్త్రీలను, పరధనమును హరించువాడు, మీన లగ్నజాతకుడు బలవంతుడు, భయము కలవాడగును. ఏ లగ్నమున పుట్టినవాడైనను లగ్నాధిపతి బలయుతుడైనచో ఫలము సంపూర్ణముగా నుండును. బల హీనుడైనచో విపరీత ఫలములు కలుగును. చంద్రుడు బలయుతుడుగా నున్నను సకల ఫలములు లభించును. క్షీణ చంద్రుడైనచో విపరీత ఫలములు కలుగును. మేషము మొదలు మీనాంతమగు రాశులలో సూర్యుడున్నపుడు వరుసగా ఖ్యాతి గలవాడు, స్త్రీ ద్వేషి, ధనవంతుడు, తీవ్రస్వభావము కలవాడు, జ్ఞానము కలవాడు, కవి, శాండికుడు, ధనవంతుడు, పూజ్యుడు, లుబ్ధుడు, దరిద్రులతో స్నేహము చేయువాడు, బలవంతుడు అగును. సూర్యుడు లగ్నమున నుండగా పుట్టినవాడు ధనహీనుడు, కుజుడున్నచో ధనవంతుడు, చంద్రుడున్నచో స్వభేదనుడు, బుధుడున్నచో కృతజ్ఞుడు, గురువున్నచో ఖ్యాతి కలవాడు, శుక్రుడున్నచో పరదార నిరతుడుగా నుండును. మకర లగ్న జాతకుడు బహపుత్రుడు బహుధనవంతుడగును. కుంభలగ్నమున పుట్టినవాడు దుఃఖవంతుడు, అసత్యవాది, ఖలుడగును. సూర్యునితో బుధుడు కలిసున్నచో స్త్రీలచే ద్వేషించబడువాడు, స్వజనులను ద్వేషించువాడు, దుఃఖములను పొందువాడు, బుద్ధిమంతుడు, ధనవంతుడు, సమానార్థుడు, పుత్రులు స్త్రీలు ఋణములు కలవాడుగా నుండును. సూర్యునితో బృహస్పతి కలిసున్నచో సేనాధిపతి, స్త్రీలు ధనము పుత్రులు కలవాడు, సమర్థుడు, అధికారము కలవాడు, వస్త్రములు కలవాడు మండలాధిపతి, ధనము సుఖము కలవాడు, ఋణము ప్రభుత కలవాడుగా నుండును. సూర్యునితో శుక్రుడు కలిసున్నచో స్త్రీల వలన ధనమును పొందువాడు, తక్కువ దుఃఖము కలవాడు, బంధువులను ద్వేషించువాడు, ధనము పొపము గలవాడు, ధనవంతుడు, ఖ్యాతిగలవాడు, సముడు, ప్రాజ్ఞుడు స్త్రీలకు వశ్యుడగును. సూర్యునితో శని కలిసున్న చో విపరీత కార్యములచే ధనమును పొందుపొడు, ఖప్రసూకుడు, విధిమిత్రుడు, సుఖత్రయము కలవాడు, సత్పుత్రులు, మంచి స్త్రీలు, మంచి ధనము కలవాడు, రాజు కాగలడు. కుజాదులచే చంద్రుడు చూడబడి మేషరాశిలో ఉన్నపుడు రాజు జ్ఞాని గుణవంతుడు, పౌరుల ధనమును స్వీకరించువాడగును. మిధునమున చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు ధన హీనుడు, చోరుడు, రాజుల సేవలు చేయువాడుగా నుండును. కర్కాటకమున చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు ధాతువుల నమ్ముకొని బ్రతుకువాడు, రాజాజ్ఞకు భయపడవాడు, బట్టలను నేసి బ్రతుకువాడు, ధనములేని వాడుగా నుండును. సింహమున చంద్రుడుండి ఇతరగ్రహములచే చూడబడినపుడు యుద్ధమునందు కోరిక గలవాడు, కవి, పండితుడు, యజ్ఞములచే, ధాతువులచే బ్రతుకువాడు, కంటి జబ్బులు కలవాడు, జ్యోతిశ్శాస్త జ్ఞానము కలవాడగును. కన్యలో చంద్రుడు శుభగ్రహములతో కలిసియున్నచో రాజు, సేనాపతి, నైపుణ్యము కలవాడు మంచి ఆశయము కలవాడు గా నుండును. తులారాశిలో చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినచో రాజు, స్వర్ణకారుడు, వాణిజ్యము చేయువాడుగా నుండును. వృశ్చికరాశిలో చంద్రుడుండి ఇతర గ్రహముల దృష్టి ఉన్నచో ఇద్దరు తండ్రులు కలవాడు, సముద్రజీవి, సైన్యము గలవాడు, తన భూమిని కాపాడుకొన గలవాడుగా నుండును. ధనూరాశిలో చంద్రుడుండి శుభగ్రహవీక్షణమున్నచో జోత్రులు కలవాడు, భూమి న్యాయములను చెప్పువాడు, శఠుడుగా నుండును. మకరరాశిలో చంద్రుడుండి ఇతరగ్రహములచే చూడబడినపుడు రాజులచే సన్మానించబడువాడు, మిత్రులు గలవాడు, యజ్ఞములు చేయువాడుగా నుండును. కుంభరాశిలో చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు హాస్యజ్ఞుడు, నృపజ్ఞుడుగా నుండును. హారేసఋక్షదలములలో నుండి వారిచే చూడబడిననూ, కలిసియున్ననూ చంద్రుడు శుభుడు. త్ర్యంశమున తదధిపతి, మిత్రరాశులలో నున్ననూ, చూడబడిననూ శుభకరుడే.
ఇంతవరకు ద్వాదశాంశఫలమును చెప్పితిని. ఇపుడు నవాంశఫలమును చేప్పెదను. కుజాంశలో శుక్రుడున్నచో తనను తాను రక్షించుకొనువాడు, ఇతరులను చంపుటలో రుచిగలవాడు, ద్వంద్వయుద్దకుశలుడు, ధనవంతుడు, కలహశీలి, మూర్తుడు, పరస్త్రీలోలుడగును. బుధాంశలో కవి, సుఖము గలవాడు, నటుడు, చోరుడు శిల్పి యగును. స్వాంశలో ఆల్నతనువు, సుఖము కలవాడు, తపస్వి లోభపరుడగును. కుజాంశలో కోపిషి, నిధీశుడు, అమాత్యుడు, రాజు, వెంసాశీలుడగును. బృహస్పతి అంశలో, హాస్యము తెలిసినవాడు, యోధుడు, బలశాలి, మంత్రి, ధార్మికుడు అగును. శన్యంశలో అల్పసంతానము గలవాడు, దుఃఖితుడు, దుష్ట స్త్రీ సంగతి గలవాడగును. సూర్యుడు చంద్రాదులచే చూడబడినచో క్రమముగా శుభఫలము చెప్పబడినది. అంశాధిపతి బలయుతుడైనచో పుష్టము మధ్యమము, లఘుఫలమని తెలియవలయును. రాశీక్షణఫలమును ఆపి అంశఫలమును స్పుటముగా నిచ్చును. సూర్యుడు లగ్నమున నున్నచో శూరుడు, స్తబుడు, వికలదృష్టి కలవాడు, నిర్ణయుడుగా నుండును. మేషణరాశిలో సూర్యుడున్నచో ధనవంతుడు, గుడ్డివాడు, సింహరాశిలో ఉన్న చో రేచీకట్లు కలవాడు, కర్కటరాశిలో ఉన్న చో నీచుడు, ధన హీనుడు, లగ్నముననున్నచో త్రిప్పుడు కనులు గలవాడగును.
రెండవస్థానమున సూర్యుడున్న చో బహుధనము కలవాడు, నృపునిచే దండించబడువాడు, ముఖామయము గలవాడగును. సూర్యుడు మూడవరాశిలో ఉన్నచో పండితుడు పరాక్రమవంతుడు, విముఖుడు, పీడించబడువాడగును. అయిదవస్థానమున నున్నచో ధనాపత్యములు కలవాడు, ఆరవరాశిలో ఉన్న చో శత్రువులచే పరాజయమును పొందువాడగును. ఏడవరాశిలో ఉన్నచో స్త్రీలకు వశ్యుడు, 8వ స్థానమున నున్నచో అల్పసంతానము కలవాడు, అల్పదృష్టికలవాడగును. 9వ రాశిలో నున్న సువర్ణ సుఖము కలవాడు, 10వ రాశిలో ఉన్నచో శాస్త్రజ్ఞానము, శౌర్యము కలవాడు, పదకొండవస్థానమున సూర్యుడున్నచో బహుధనవంతుడు, గౌరవము కలపోడు, 12వ రాశిలో ఉన్న చో పతితుడగును. లగ్నమున చంద్రుడున్న చో మూగవాడు చెవిటివాడు, సేవకుడుగా నుండును. రెండవస్థానముననున్నచో ధనవంతుడు, వటువు, మూడవస్థానమున నున్నచో హింసాప్రియుడు, నాలుగవస్థానమున నున్నచో సాధుస్వభావము కలవాడు, అయిదనస్థానమున నున్నచో స్త్రీ సంతానము కలవాడు సోమరి. ఆరవస్థానమున ఉన్నచో కొద్దీ ఆకలి కొద్దీ కామము కలవాడు, తీక్షస్వభావము కలవాడు, ఏడవస్థానమున నున్నచో ఈర్యకలవాడు మదత్రయము కలవాడు, 8వ స్థానమున నున్నచో వ్యాధి పీడాయుతుడడు, 9వ రాశిలో నున్న మిత్రులచే ధనముచే కూడియుండువాడు, పదవరాశిలో యున్నచో ధర్మబుద్ది ధనము కలవాడు, పదకొండవ స్థానములో నున్నచో ప్రసిద్ధి, బుద్ధి, ధనము కలవాడు, పన్నెండవరాశిలో చంద్రుడున్నచో కుద్రుడు అంగహీనుడగును. కుజుడు లగ్నమున నున్నచో గాయములు కల శరీరము కలవాడు, ధనస్థానమున నున్నచో దుష్టాన్నమును తినువాడు, కొంతధర్మము కొంత పాపమును ఆచరించువాడుగా నుండును. మిగిలిన స్థానములలో కుజుడున్నచో సూర్యుడిచ్చు ఫలములనే ఇచ్చును. బుధుడు లగ్నమున నున్నచో విద్వాంసుడు, ధనవంతుడు, ప్రవరుడు పండితుడు, మంత్రి, శత్రువులు కలవాడు, ధర్మము తెలిసినవాడు, విస్తృత గుణములు కలవాడు అగును.
మిగిలిన స్థానములలో నున్నచో సూర్యుని వలెనే ఫలములు కలుగును. బృహస్పతి లగ్నమున నున్నచో విద్వాంసుడు, కృపణుడు, మంచినేత్రములు కలవాడు, శత్రువులు కలపోడు, నీచుడు, తపస్వి, లోభి, దుష్టుడగును. శుక్రుడు లగ్నమున నున్నచో కాముకుడు, సుఖము కలవాడు, కలహ శీలుడు, సురతమునందు అభిలాష కలవాడు, సుఖించు వాడుగా నుండును. మిగిలిన స్థానములలో నున్న చో బృహస్పతి వలెనే ఫలములనిచ్చును. లగ్నమున శని యున్న చో నిర్థనుడు, రోగి, కామవశుడు, మలినుడు, శైశవము న ఆర్తి కలవాడు, సోమరి యగును. ఉచ్ఛస్థానమున నున్నచో రాజగును. గ్రామాధిపతి, విద్వాంసుడు, సుందరాంగుడు అగును. ఇతర స్థానములలో నున్న చో సూర్యునివలే ఫలములనిచ్చును. ఉచ్చస్థానములలో నున్నచో పూర్ణఫలము నొసంగును. మూలత్రికోణ స్థానములలో నున్నచో ఒక భాగము తక్కువ ఫలమునిచ్చును. శుభగ్రహము స్వస్థానమున నున్న చో పూర్ణఫలమును, మిత్రస్థానమున నున్నచో పొదఫలమును కలుగజేయును. శత్రుస్థానమున నున్నచో అల్పఫలమునిచ్చును. నీచస్థానముననున్ననూ అస్తగతుడైనను ఏ ఫలమునీయజాలడు. గ్రేష్కాణము, త్రికోణము మొదలగు స్థానములలో గ్రహములున్నచో క్రమముగా కులతుల్యుడు, కులాధికుడు, బంధుపూజ్యుడు, ధనవంతుడు, సుఖి, భోగి, రాజు అగును. అట్లే పరవిత్తమును హరించువాడు, మిత్రులను, బంధువులను పోషించుచోడు, గణాదీపుడు, బలాధిపుడు అగును. మీత్రస్థానములలో నున్న చో రాజగును. విషమరాశిలో సూర్యహారలో శుభరాశులలో నుండగా ప్రసిద్ధి నొందువాడు, మహోద్యమము గలవాడు, అతి తేజోవంతుడు, ధీమంతుడు, ధనవంతుడు, బలవంతుడు అగును. శుభగ్రహములు సమరాశులలో నుండగా చంద్రహోరలో పుచ్చినవాడు కాంతి, మృదుత్వము, సౌభాగ్యము, భోగము, బుద్ధి కలవాడగును. పాప గ్రహము సూర్య హోరలో ఉండి, సమరాశులలో మధ్యమ గ్రహములున్నచో, విషమరాశులలో శని మొదలగు పొరు కాని సౌమ్యగ్రహములుకాని ఉన్నచో పైన చెప్పబడిన ఫలములు నీయజాలవు. చంద్రుడు స్వమిత్ర గ్రహములతో కలిసున్నను, త్ర్యంశగతుడైనను రూపవంతుని గుణవంతుని చేయును. మూడవస్థానమున నున్నచో అట్లే అంతటి గుణములు, రూపము కలవానీని చేయును.
అంగారకుడు చతురంశలలో త్ర్యంశలలో కాని యున్నచో తీక్లరాశిలో ఉన్నచో అతిహింసాశీలుడు, గురుతల్పగతుడు, తిరుగుబోతు అగును. అట్లే చోరుడు, భోక్త, ధనవంతుడు, ధీమంతుడు, రాజు, నపుంసకుడు, శత్రుహంతకుడు, విషైకారుడు, దొసవృత్తి కలవాడు, పాపి, హింసాశీలుడు, బుద్దిహీనుడు గా మేషాది ద్వాదశరాశులలో కాని వాటి ఉత్తమాంశలలో కాని ఉన్నచో పైన చెప్పిన ఫలములు కలుగును. జాయా బలవిభూషణాడ్యుడు, సత్త్వముకలవాడు, అతిసాహసి తేజస్విగా అంగారకుడు త్రింశాంశలో ఉన్నచో అగును. శని స్వాంశలో కొని స్వరాశిలో కాని ఉన్నచో రోగిష్టి తన భార్యయందు విషముడు, పరదొరలయందు ఆసక్తి కలవాడు, దుఃఖము కలవాడు, వస్త్రములు కలవాడు, మలినుడుగా నుండును. బృహస్పతి త్రింశాంశలో ఉన్నచో సుఖము, బుద్ధి, ధనము, కీర్తి కలవాడు, తేజస్వి, లోకపూజితుడు, నీటిలో పుట్టినవాటిని, రహస్యముగా లభించిన వాటిని అనుభవించువాడుగా నుండును. బుధుడు త్రింశాంశలో ఉన్నచో మేధావి, కళాకోవిదుడు, కావ్య కర్త, శిల్పకారుడు, వివాదములు కపటము కలవాడు, శాస్త్రార్భజుడు, సాహసి యగును. శుక్రుడు స్వాంశలో ఉన్నచో బహుసంతానము, సుఖము, ఆరోగ్యము, భోగము, సౌందర్యము ధనము కలవాడు, లలితాంగుడు, ఇంద్రియానుకూలముగా సంచరించువాడుగా నుండును. కుజాది గ్రహములతో సూర్యచంద్రులు. కలిసున్న చో శూరుడు, స్తబ్దుడు, విషమ వధను పొందువాడు, సద్గుణములు కలవాడు, సుఖమునందభిలాష కలవాడు, సుందరాంగములు కలవాడుగా నుండును. మూలత్రికోణ స్వస్థాన ఉచ్చస్థానములలో కంఠస్థానమున నున్న గ్రహములు పరస్పరము సహకారమందించువారు, విశేషించి కర్మసాధకులుగా నుందురు. విషమరాశులలో గ్రహములుండగా వర్గోత్తమమున జన్మించుట శుభకరము. కేంద్రములు శూన్యముగా నుండక, కారక గృహములలో గురు, జ్మేశ లగ్నేశులుండగా కేంద్రములో నున్న గ్రహములు మధ్యకు సౌఖ్యమును ఇచ్చెదరు. అంత్యాంత రాదులలో నున్న గ్రహములు, భాస్కర కుజుల ప్రవేశమున, శుక్రగురులు మధ్యనుండగా, శని చంద్రులు అంత్యమున నున్నపుడు ఫలప్రదులగుదురు. బుధుడెప్పుడూ ఫలదోయకుడే. లగ్నమునుండి అయిదవస్థానమున ఏడవస్థానమున నున్న చంద్రుడు శుభగ్రహములతో కలిసియున్నను, శుభరాశ్యధిపతులతో చూడబడిననూ, సంపదలు సమృద్ధిగా కలుగును. స్వత్వముండును. సూర్యుడు మీనరాశిలో శనితో కలిసున్నచో స్త్రీని చంపును. అయిదవస్థానమున నున్న కుజుడు కూడా స్త్రీఘాతమును చేయును. నాలుగవస్థానమున ఎనిమిదవస్థానమున క్రూరగ్రహములున్నపుడు, క్రూరాంతరమున శుక్రుడున్నపుడు, సద్గహములతో కలిసి ఉండక చూడబడనిచో పుట్టిన స్త్రీకి అగ్నిపాతము వలన మృతి సంభవించును. సూర్యచంద్రులు లగ్నాద్యపాణి గతులైనపుడు, స్త్రీ గ్రహముతో కలిసియున్నపుడు, సప్తమ స్థానమున నున్నపుడు, శుక్ర సూర్యులు తొమ్మిదవస్థానమున అయిదవస్థానమున నుండి వికల స్త్రీగతులైనపుడు, కోణోదయమున, అస్తాంత్యసంధిలో శుక్రుడున్నపుడు వంధ్యాపతి పుట్టును. అయిదవస్థానము సౌమ్యగ్రహములు కలదికానపుడు, అంత్యాస్తుదయరాశులలో గ్రహములున్నపుడ, పాపగ్రహముల అయిదింట ఉన్నపుడు, చంద్రుడు క్షీణ దశలో నుండగా అల్పాయుష్కులగు భార్యాపుత్రులుందురు. శని శుక్రునితో కలిసి ఉన్నను, శుక్రునిచే చూడబడినపుడు పుట్టినవాడు పరదారరతుడగును. శని శుక్రులు చంద్రునితో కాని, స్త్రీ గ్రహములతో కాని కలిసున్నచో పురుషుడు పుంశ్చలుడగును. శుక్రుడు చంద్రుడు అస్తగతులైనపుడు పురుషుడు కాని స్త్రీకానీ, పుత్రుడుకాని, శుభగ్రహములచే చూడబడిన స్త్రీ పురుషులు పరిణతాంగులౌదురు. చంద్రుడు, శుక్రుడు, పాపగ్రహములు, తమరాశిలో అస్తగతులైనచో వంశవినాశకుడు జన్మించును. త్ర్యంశాధీపతి బుధునితో కలిసి కేంద్రములోనున్న శనిచే చూడబడినపుడు శిల్పియగును. శని అంశలో భృగువీక్షణమున్నపుడు, లేదా భృగువు నీచలో ఉన్నపుడు, సూర్యచంద్రులు అస్తగతులైనను, శనిచే చూడబడిననూ దాసీపుత్రుడగును. పాపగ్రహములచే చూడబడిన శని కుజులు, లేదా అస్తగతులైన శనికుజులు వాతరోగమును కలిగింతురు. కర్కాటక వృశ్చికొంశ గతము కేంద్రమైనపుడు, లేదా పాపగ్రహములు కేంద్రమున ఉన్నపుడు గుప్తరోగములు కలుగును. చంద్రుడు పాపగ్రహమధ్యమునున్నపుడు, సూర్యుడు ఏడవస్థానమున నున్నపుడు కుష్టురోగము కలుగును. చంద్రుడు తన స్థానమున నుండి, కుజుడు అస్త గతుడై, శని విషమ రాశిలో ఉన్నపుడు పుట్టినవాడు వికల మనస్కుడగును.
గ్రహములు ఒకదాని అంశలో వేరొకటి ఉన్నపుడు శూలరోగము కలుగును. సూర్యచంద్రులు కలిసియుండగా కశాంగుడగును. ఏడవస్థానమున సూర్యుడు, ఆరవస్థానమున చంద్రుడు, రెండవస్థానమున కుజుడు, అంత్యమున (12) శని ఉన్నచో చరగ్రహ గత దోషమువలన అంధుడు నిరాశ్రయుడగును. పాపగ్రహములు తొమ్మిది పదకొండు, మూడు, అయిదు స్థానములలో ఉండి సౌమ్యగ్రహములచే చూడబడనిచో చెవులకు హాని చేతురు. పాపగ్రహములు 7వ స్థానమున నున్నచో దంతములకు వికారమును కలిగింతురు. లగ్నమున గురువు, 7వ స్థానమున శని యున్న చో వాతరోగముచే పీడించబడును. కుజుడు నాలుగవస్థానమున కొని, అస్తగతుడుగా, కాని ఉన్నచో, బృహస్పతి లగ్నమున శనితో కలిసి ఉదయించినపుడు, కుజుడు అయిదవస్థానమున, ఏడవస్థానమున బుధునితో కలిసి చంద్రుడున్నను ఉన్మాదావస్థను చెందును. 12వ స్థానమున చంద్రుడున్నను ఉన్మత్తుడగును. అయిదు, తొమ్మిది, రెండు, పన్నెండు స్థానములలో పాపగ్రహములున్న చో బంధనము కలుగును. సర్పశృంఖలతో పాపగ్రహములు చూచినపుడు, బలయుతులగు పాపగ్రహముల చూపున్నపుడు, శనితో కలిసియున్న చంద్రుడు వక్రదృష్టి గలవాడైనపుడు అపస్మారము కలవాడు, దుష్టవాక్కుగలవాడు, క్షయరోగము కలవాడగును. సూర్యుడు శని కుజులు స్వస్థానములలో నుండి సౌమ్యగ్రహములచే చూడబడినపుడు, మండలములతో కూడియున్నపుడు ఇతరులచే పోషించబడువారు వరుసగా ఉత్తమ మధ్యమాధములుగా నుందురు. ఈ సమయమున పురుషుడు జన్మించినచో వేశ్యస్త్రీలకు తగిన ఫలమును చెప్పవలయును. స్త్రీలు తమభర్తలయందు సర్వకార్యభారమునుంచి, వారు మరణించినపుడు మరణించుట స్త్రీలఫలము. అట్లే వీరు కూడా యజమానులందు సర్వభారముంచి వారు మరణముతో మరణమును పొందెదరని చెప్పవలయును. చంద్రుడు లగ్నమున నున్నను, ఏడవస్థానమున నున్ననూ ద్వీస్వభావరాశులలో కాని లగ్నమున కాని చంద్రుడున్నచో స్త్రీ తన స్వభావముతో నుండును. లగ్నచంద్రుడు కాని సప్తమ చంద్రుడు కాని శుభగ్రహములచే చూడబడినపుడు పుట్టిన స్త్రీ, సత్స్వభావము, ఆభరణములు కలిగియుండును. లగ్నసప్తమ చంద్రులు ఓజస్తులైనపుడు పురుషాకారము, పురుష స్వభావము కలదెను. ఒక వేళ లగ్న, సప్తమ చంద్రులు పోపగ్రహములచే చూడబడినచో పాపులు, గుణహీనులు అవుదురు. కుజుని స్థానములో కుజుడు కాని, శనికాని, గురువుకాని, బుధుడు కాని, శుక్రుడు కాని యున్నచో వరుసగా స్త్రీ బాల్యమును దుష్టురాలు, దాసి, సాధ్వీ, మాయావతీ, తొందరపాటు గలదగును. పైన చెప్పబడిన గ్రహములచే చూడబడిననూ ఆ ఫలములే కలుగును. ఆ గ్రహములు బలయుతులైనచో మంచిరూపము, మంచిశీలము కలదగును. ఆ గ్రహములు పాపగ్రహములచే చూడబడినపుడు పాపులు గుణహీనులు అగుదురు. శుక్రుడు స్వస్థానమున నున్నచో దుష్టవాక్కు గలది, పునరూ, గుణవంతురాలు, విజ్ఞురాలు, ఖ్యాతి గలదియగును. బుధుడున్నపుడు సమురాలు, దీనురాలు, సాధ్వి, గుణవతి చంచలస్వభావము కలదగును.
ద్విస్వభావరాశులలో నున్నపుడు పుట్టిన స్త్రీ స్వేరిణి, భర్తను చంపునది, గుణాడ్యురాలు, శిల్పికా, అధమురాలు, వదరుబోతు, కులట అగును. సింహరాశిలో ఉన్నపుడు పురుష బుద్ధిగలది, అగమ్యురాలగును. బృహస్పతి అంశలో పుట్టిన శ్రీ గుణాడ్యురాలు, అల్పరతిగలది, గుణజ్ఞురాలు, జ్ఞానము కలది, సాధ్వి యగును. శని యంశలో పుట్టిన స్త్రీ దాసి, నీచులందు ప్రీతిగలది, సాధ్వి, దుష్టురాలు, సంతానము లేనిది యగును. లగ్నములో చంద్రునితో కలిసి ఉన్న త్రింశాంశం బలానుసారమగు ఫలితమిది. శుక్రశనులు దృగ్గోచరులై పరస్పరాంశలలో ఉన్నపుడు శుక్రుడు కుంభరాశ్యంశలో ఉన్నపుడు స్త్రీలతో స్త్రీ సంగమమును చేయును. మదనోగి తాపముచే దహించబడుచుండును. శూన్యముగా లగ్నమున్నపుడు దుష్టపురుషుడు జన్మించును. సప్తమరాశిలో బలయుతుడగు గ్రహమున్న చో నపుంసకుడు పుట్టును. బుధశనులు చరరాశిలో నున్నపుడు పుట్టినవాడు ఎప్పుడు పరదేశములందుండును. సూర్యుడు శనితో కలిసున్నపుడు పుట్టిన స్త్రీ అల్పగుణములు కలదిగా, కుజుడున్నపుడు బాల వితంతువగును. పాపగ్రహములచే చూడబడు శని సప్తమస్థానమున నున్నపుడు పుట్టిన స్త్రీ కన్యగానే వృద్దురాలగును. అగ్ని గ్రహములు భూమిగ్రహములతో కలిసున్నపుడు పుట్టిన స్త్రీ భర్తను కోల్పోవును. క్రూర గ్రహము బలహీనుడై అస్తంగతుడేనపుడు, శుభగ్రహముల దృష్టిలేనిచో భర్త విడువబడును. శుక్రకుజులు పరస్పరాంశలలో ఉన్నపుడు పుట్టిన స్త్రీ భర్తకంటే పరపురుషుని యందు ప్రీతికలదగును. చంద్రుడు ఏడవస్థానమున నున్నపుడు పుట్టిన స్త్రీ భర్తను అనుసరించి యుండును. శని కుజుల రాశులలో చంద్రునితో కలిసున్న శుక్రుడు లగ్నములో నుండగా పుట్టిన శ్రీ బంధకి యగును. నాలుగవస్థానములో కుజాంశ అస్తగాంశలో ఉన్నపుడు, పాపగ్రహముల దృష్టియున్నపుడు, శనిదృష్టియున్నపుడు వ్యాధిగ్రస్తురాలగును. శుభగ్రహాంశలో మాత్రము భర్త యందు ప్రీతి గలదగును. శని గ్రహరాశిలో కొని, శన్యంశలో కాని, సప్తమాంశ వృద్ధిలో ఉన్నపుడు స్త్రీకి మూర్భుడు భర్తగా లభించును. కుజాంశలో పుట్టినవాడు స్త్రీలోలుడు కోపిష్టిగా యుండును. బుధాంశలో విద్వాంసుడు నిపుణుడుగా ఉండును. గుర్వంశలో జితేంద్రియుడు, గుణవంతుడు, చంద్రాంశలో కాముకుడు, మృదు స్వభావము కలవాడు, శుక్రాంశలో సౌభాగ్యవంతుడు, సుందరుడు, శన్యంశలో మృదుకర్మలను చేయువాడుగా నుండును. శుక్రచంద్రులు లగ్నములో నుండగా పుట్టిన స్త్రీ సుఖము కలది, ఈర్ష్యతో కూడియుండినదగును. లగ్నములో బుధచంద్రులున్నచో కలానిపుణురాలు, సుఖవంతురాలు, గుణవంతురాలు, శుక్రుడు బుధుడున్నచో శుభకరురాలు, కళలు తెలిసినది, సుందరాంగి యగును. లగ్నమున మూడు సౌమ్య గ్రహములున్నచో బహుసౌఖ్యములు, అర్ధములు గుణములు కలదిగా నుండును. క్రూరగ్రహము అష్టమస్థానమున నున్నచో, అష్టమాధి పత్యంశలో ఉన్నపుడు పుట్టినవాడు సమవయస్కురాలగు భార్యను పొందును. శుభగ్రహములు ఆర్ధగతములుగా నున్నపుడు పుట్టిన స్త్రీకి వైధవ్యము మృతి సంభవించును. కన్యావృశ్చికము సింహము వృషభరాశులలో చంద్రుడున్నచో అల్పసంతానము కలదగును. శని మధ్య బలీయుడైనపుడు చంద్ర శుక్ర బుధులు బల హీనులుగా ఉన్నపుడు, మిగిలిన గ్రహములు బలీయములై ఓజ స్థానమున నున్నచో, లగ్నమున నున్ననూ కురూపిణి యగును. బృహసితి కుజుడు బుధుడు బలీయులై సమరాశులలో కాని, లగ్నములో కాని ఉన్నపుడు పుట్టిన స్త్రీ విఖ్యాతురాలు, అనేక శాస్త్రజ్ఞురాలు, బ్రహ్మ వాదిని యగును. పాపగ్రహము అస్తగతమైనపుడు, నవమ స్థానముననున్నపుడు పరివ్రాజకురాలగును. వివాహ సమయమున, కన్యావరణమున, కన్యనడుగునపుడు పైన చెప్పిన విషయములనన్నింటిని విచారించవలయును. బలయుతమగు గ్రహము మృత్యుస్థానమును చూచునపుడు ధాతుకోపము వలన నరులకు మృత్యు హితవు యుక్తమగును. బలయుతులగు గ్రహములు ఆశుభస్థానములో నున్నపుడు అగ్నిచే గాయములచే, జ్వరముచే రోగములు కలుగును. సూర్యాదులు అష్టమస్థానమున నున్నచో ఆకలి దప్పులు ఎక్కువగా నుండును. సూర్యకుజులు పరగ్రహమస్థానములలో ఉన్నపుడు మృత్యువు సంభవించును. బంధు స్థానమున, కర్మస్థానమున, అస్తగులుగా శని కుజులున్నపుడు బంధువులలో నుండగా శైలాగ్రమున నుండగా మృతి సంభవించును. సూర్యచంద్రులు శ్రీరాశిలో ఉన్నపుడు, మిత్రగ్రహములు పాపదృష్టి కలిగియున్నపుడు పదకొండు పన్నెండు స్థానములలో సూర్యచంద్రులున్నపుడు, ఉదయావస్థలో ఉన్నపుడు జలమున మరణము సంభవించును.
అశుభరాశ్యంత్యాంశలో నున్నపుడు, కుజరాశిలో చంద్రుడున్నపుడు, మకరములో చంద్రుడు, శని కర్కాటకమున నున్నపుడు జలోదరవ్యాధిచే మరణించును. స్త్రీ రాశిలో చంద్రుడు, శని అశుభ స్థానమున నున్నపుడు వాయ్వగ్నిపాతము వలన మృతి సంభవించును. పాపగ్రహములు అయిదు తొమ్మిది స్థానములలో నున్న చో శుభగ్రహముల దృష్టిలేనపుడు బంధనముచే ఆయదులచే మృత్యువు సంభవించును. పాపగ్రహములచే కూడియున్న చంద్రుడు స్త్రీరాశిలో యున్నపుడు, శుక్రుడు సప్తమ స్థానమున నున్నపుడు సూర్యుడు మేషమున కాని లగ్నమున కాని యున్నపుడు స్త్రీ వలన ఇంట్లో మరణము సంభవించును. కుజుడు కాని సూర్యుడు కాని నాలుగవస్థానమున నున్నపుడు శని రాశ్యంశలో కాని త్రికోణస్థానములో కాని ఉన్నచో పాపగ్రహములతో కలిసి క్షీణ చంద్రుడున్నపుడు, సూర్యుడు నాలుగవస్థానమున నున్నపుడు, క్షీణచంద్రునిచే కుజుడు చూడబడినపుడు సమిధల చే. మరణించును. క్షీణచంద్రుడు, అంగారకుడు, శని, సూర్యుడు కలిసున్న చో రంధ్రాదులతో జలాదులతో మృతి సంభవించును. మొదటి స్థానమున, రెండు మూడు స్థానములలో పైన చెప్పబడిన గ్రహములున్నచో లగుడముచే మతి సంభవించును. పొగచే గడ్డపార మొదలగు పరికరములచే మృతి సంభవించును. బంధు స్థానమున, అస్తగునిగా, మొదటి స్థానమున కుజుడు సూర్యుడు శని ఉన్నచో శస్త్రములచే అగ్నిచే రాజులచే మృతి చెందును శని, చంద్రుడు, కుజుడు, స్వస్థానమున జలస్థానమున మొదటి స్థానమున సూర్యుడు, నాలుగవస్థానమున కుజుడున్నచో వాహనము నుండి పడుట వలన మరణము కలుగును. కుజుడు అస్తంగతుడై క్షీణచంద్రునితో కలిసియున్నచో యంత్రాదులచే మృతి చెందును. కుజుడు, శని చంద్రుడు తులమేష మకర కుంభములలో ఉన్న చో, క్షీణచంద్రుడు సూర్యుడు, కుజుడు లగ్నమున, అస్తగుతుడుగా, జలస్థానమున ఉన్న చో వారజనము చేతిలో మృతి సంభవించును. క్షీణచంద్రుడు బలయుతుడగు కుజునిచే చూడబడినపుడు శని ఏడవస్థానమున నున్నపుడు గుప్తరోగములచే, కృములచే, శస్త్రములచే అగ్నిచే దారువుచే మరణము సంభవించును అని అంగీర మహర్షి చెప్పెను. శని. సూర్యుడు అస్తగంతులైనపుడు, శని ఏడవస్థానమున నున్నపుడు క్షీణచంద్రుడు భూస్థానమున నున్నపుడు, లగ్నమున, పదకొండవస్థానమున, అస్తంగతునిగా మొదటిస్థానమున సూర్యుడు, చంద్రుడు, కుజుడు చంద్రుడున్న చో పర్వతశిఖరములనుండి పడుటచే మరణము సంభవించును. దృక్కోణములలో, నాలుగవస్థానములలో ఆయధిపతులున్న చో వారిలో బలవంతుడగు గ్రహప్రభావము వలన తనగుణముల వలననే తాను మరణించును. లగ్నాంశమునకు అధిపతి. దృష్టిపడు స్థానమున నున్నచో యో గేక్షణలచే మృతి చెందును. అస్తంగతాంశలో నున్నగ్రహము అశుభగ్రహములచే చూడబడినచో రెండు రెట్లు కీడు సంభవించును.. శుభగ్రహములచే చూడబడినచో మూడు రెట్లు మేలు జరుగును. ఇతర విషయములను తమ తమ బుద్ధిచే ఊహించుకొనవలయును. మృత్యుస్థానమున గ్రహములున్నచో అగ్నిజల భస్మ, శ్రీద, శోష, సర్పాదులచే మృతి సంభవించును. గ్రహములున్నరాశ్యంశములను బిందు మాత్రస్థానమును కూడా పరిశీలించి బుద్ధి వైభవముచే ఫలితమును చెప్పవలయును. అష్టమస్థానమున గురువుకాని, శుక్రచంద్రులు, సూర్యాంగారకులు, శని బుధులు కాని యున్నచో నరకమును కలిగించును. సూర్య చంద్రాది గ్రహములు బలవంతులతో కూడియున్నపుడు అంశాధిపతులతో కూడియున్నపుడు శ్రేష్ఠ, సమ, అధములగుదురు. గురువు ఏడవస్థానముననున్న చో రిపుస్థానమును కేంద్రస్థానమును నశింపచేయును. బృహస్పతి ఉచ్చలో ఉన్నపుడు, పన్నెండవస్థానమున బుధాంశయున్నచో ఇతర గ్రహముల బలము కూడా యున్నపుడు మోక్షము సంభవించును.
గర్భాధానము పుట్టుకతెలియనపుడు లగ్నమును బట్టి చెప్పవలయును. లగ్నము యొక్క పూర్వార్ధాపరార్దములు సౌమ్యముగా నున్నపుడు ఫలములు చెప్పవలయును. లగ్నత్రికోణ స్థానమున అయిదవస్థానమున బృహస్పతి త్ర్యంశములతో వికల్పావయవములు సమముగా నుండును. సూర్యుడు గ్రీష్క గతుడైనపుడు ఇతరులు శుభస్థానగతులైనపుడు, సూర్యరాశినుండి చంద్ర బుధ బృహస్పతుల ఆవృత్తులతో ఒక ఫలితము, శుక్ర కుజ శనుల ఆవృత్తిచే మరొక ఫలితము సంభవించును. దృగ్గణితముననుసరించి కుజాదులచే పూర్వమాస తీథులను అనుపాతము వలన తెలియనగును. విలోమ జన్మభాగములచే కాలమున రాత్రిపగలు అను సంజ్ఞలు ఏర్పడును. త్రికోణ ఉత్తమ వర్గలననుసరించి లగ్నమును. లగ్నాంశములను గుర్తించవలయును. లగ్నము నుండి చంద్రుడెంత తక్కువగా నుండునో అంత చంద్రుని నుండి తక్కువగా లగ్నరాశిని చూడవలయును. 1, 11 స్థానములు, సంస్థానములు, అష్టమరాశులు, క్రియాజనము, మకర కన్యలు 10, 8, 7 విషయమున స్వసంఖ్యచే శేషమును గుణించవలయును. గురువు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఆఘవాద్యాయరము లందు బుధునీవలే -అగును. రాశులకు నిత్యవిధి యుండును. గ్రహములవశము వలన ఆర్థగణములేర్పడును. ఏడుచే కొట్టివేయబడినదానిని పన్నెండుచే భాగించగా మిగిలిన దానిని నక్షత్రసంఖ్యచే నవ, ద్విసంఖ్యలచే ఋణముగొని రెండుచే భాగించగా సంవత్సర, ఋతుమాసములు ఏర్పడును. ఎనిమిదిచే కొట్టివేయగా పక్షములు తిధులేర్పడును. అయిదుచే భాగించగా పగలురాత్రులు వచ్చును. గోంశాష్ట్రము హోరలగును. కృష్ణవర్ణుడు పరశుధారియగు పురుషుడు, రక్త నేత్రుడు రక్షణకు సమర్థుడు. స్త్రీ అయినచో హృష్ణర్తి. సపాదములు గలది.. అశ్వము కలది, రక్తవస్త్ర, ఘటాకారము కలదిగానుండును. కపిలుడు అంధదృష్టి కలవాడు, క్రూరుడు, రక్తవస్త్రుడు, క్షతవ్రతుడు, ఆకలిదప్పులచే ఆర్తుడు, తెల్లని వస్త్రములు కలవాడు, ఖండించబడిన పొట్టి వెంట్రుకలుకలవాడు, మలినుడు, క్షత్పరుడు, అజముఖుడు, కృష్యాదికర్మలలో దక్షుడు. ఏనుగువంటి శరీరము కలవాడు, సరభయము వలన పింగలవర్ణుడు, వ్యాకులమైన మనసు కలవాడుగా పురుషుడుండును.
శౌచము కలది, రూపవతి, సాధ్వి, సంతానములేనిది, బలిసియున్న చేతులు కలదిగానుండును. కవచమును ధనువును ధరించి నరుదాననముతో ఉద్యానమున క్రీడేచ్చ గలవాడు నృత్యాదులు తెలిసినవాడు, వరుణుని వలె బహురత్నములు కలవాడు, ధనుర్ధరుడు, ఏనుగు ముఖము కంఠము కలవాడు, క్రోధముఖము కలవాడు, అరణ్యమునందు శరములచే వేటాడువాడు, పలాశశాఖను ధరించువాడు శిరస్సు సర్పమువలె కఠినముగా నుండునది, చపలాస్యుడు, సంవీతుడు, నౌకలో ఉండువాడు, స్త్రీ కొరకు జలమును పయనించువాడు. సారమేయము లేదా నరుడు జంబుకమును గద్దను తీసుకొని బూరుగువృక్షము మీద నిలుచుని అరుచుపోడు, ధనుర్ధారి, కృష్ణాజనమును ధరించువాడు, సింహమువలే అశ్వమువలె గంభీరుడు, ఉన్నతుడు, ఆరుడు, ఫలామిషములను హరించువాడు, కూర్చను ధరించువాడు, భల్లాస్యుడు, వానర చేష్టలు కలవాడు, స్త్రీ అయినచో పూలునిండిన బుట్టను ధరించునది, కన్య, మలినాంబరధారిణిగా తెలియవలయును. పురుషుడైనచో ధనుర్ధారి, వ్యయమును తొలగించువాడు, శ్యాముడు, లిపికారుడు, ఆరామమును చేయువాడు, నరుడు. స్త్రీ అయినచో గౌరి, శుభ్రవస్త్రము కలది, మద్యశాలలో కుంభహస్త, అభిమానమును తొలగించువాడు, పాపిష్టుడు, భాండమును తాచువాడు, చింతకుడు, ఆకలిదప్పులు కలవాడు, మంథీ, గృధ్రాస్యుడు, స్క్రీస్తుతోపగుడు, ధనుర్ధారి, కింకరచేష్టుడు, బంగారు కవచము కలవాడు, మృగముల వెంటవెళ్ళువాడు, సముద్రమున అరుచుచు వెళ్ళు స్త్రీ సౌనాసర్పహస్త, సౌఖ్యమునందు అభిలాష కలది, శరీరమును కప్పుకొనునది, కచ్చపాకారము కలది, మార్మాస్యుడు, మలయపర్వతమున సింహము, శునకవరాహమృగములకు భయమును కలిగించువాడు, వాస్యుడు, శునక శరీరుడు, ధనుర్ధారి, తాపసుయజ్ఞములను రక్షించువాడు, చంపకము వంటి ఆసనమధ్యమున నుండునది, నదులను వృద్ధి పొందించునది, కూరాసనమున . చంపక కాంతిగలపోడు, దండధారి, కౌశేయమును ధరించువాడు, ఉత్తముడు, గృధ్రముఖుడు, తైలమును మద్యమును సేవించుటలో అభిలాష కలవాడు, కాలిన బండిలో ఉండునది, లోహమును ధరించునది, భూషణములు - కలది, భాండమును ధరించుచు తిరుగునది, భాండము కలది, రోమములు కల చెవులు కలది, శ్యాముడు, కిరీటము కలవాడు, ఫలయంత్రమును ధరించువాడు, నౌకలో ఉండువాడు, భుజములను అలంకరించుకొనుటకు నానారత్నములను చేతులలో ధరించి యున్నవాడు, పడవలో ఉండిన సముద్రతీరమునకు వచ్చుచు సైన్యముతో కూడియున్నది, చంపకముఖి, గోతిలో సర్పములచే చుట్టబడియున్నవాడు, నగ్నుడు, చోరులచే అగ్నిచే బాధించబడి ఏడ్చువాడు, అనిపైన చెప్పబడిన ఈ ముప్పదియారు క్రీయాంశలు క్రమముగా ఫలితములుగా నుండును. ఓ మునీశ్వరా ! ఇది జాతకము. సంక్షేపముగా చెప్పితిని. లోకకృత్యములకు ఉపయోగించు, సంహితా భాగమును ఇక తెలుసుకొనుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున బృహదుపాఖ్యానమున జాతకనిరూపణమను యాబదియైదవ అధ్యాయము ముగిసినది.
