నారద మహా పురాణము - పూర్వార్థము
46 - బృహదుపాఖ్యానమ్
సూతమహర్షి పలికెను :- పంచశిఖమహర్షి జనకమహారాజునకు చెప్పిన అధ్యాత్మజ్ఞానమును వినిన నారదమహర్షి ఉదారబుద్ధితో ప్రీతితో మరల ఇట్లు పలికెను.
నారదమహర్షి పలికెను :- ఓ దయానిధీ ! నిన్నాశ్రయించిన నాకు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికమను తాపత్రయమును అనుభవించని మార్గమును బోధించుము.
సనందన మహర్షి పలికెను :- ఓ పండితా ! ఆధ్యాత్మి కొది త్రివిధ దుఃఖములు. గర్భవాసము, పుట్టుక, జరాదులతో కలుగును. ఈ త్రివిధ దుఃఖములను తొలగించుకొనుటకు తిశయము, ఆహ్లాదము, సుఖభావము మొదలగు వొటీని అధిగమించిన అత్యంతికమైన భగవతాప్తి ఒక్కటే సరియైన ఔషధము. కావున పండితులైన మానవులు ఆ భగవతాప్తికి ప్రయత్నించవలయును. భగవతాప్తికి జ్ఞానము, కర్మ అనునవి కారణములు. శాస్త్రముల వలన వివేకము జ్ఞానము కలుగును. శబ్దబ్రహ్మ శాస్త్ర స్వరూపుడు. పరబ్రహ్మ వివేకము వలన తెలియును. ఈ విషయమున మనువు కూడా వేదార్థమును స్మరించి ఈ విషయమునే చెప్పెను. ఆ విషయమునే సులభముగా బోధ పడునట్లు చెప్పెదను వినుము. శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మ అని బ్రహ్మ రెండు విధములని తెలియుము. శబ్దబ్రహ్మను చక్కగా తెలిసినవాడు పరబ్రహ్మను తెలియగలడు. ఆధర్వణశ్రుతి కూడా రెండు విద్యలను తెలియవలయునని చెప్పినది. ఋగ్వేదాది స్వరూపమైన ఆకరప్రాప్తి ఉత్తమమైనది. అవ్యక్తము, అజరము, కోరికలు లేనిది, పుట్టుకలు లేనిది, తరగనిది, నిర్దేశించరానిది, రూపరహితము, పాణిపొదొదిసంయుతము, విభువు, సర్వగతము, నిత్యము, సర్వభూతకారణము, అకారణము, వ్యాష్యము, వ్యాప్తము, సర్వకారణము, అయిన పరబ్రహ్మను జ్ఞానులు. చూడగలరు. అదియే పరబ్రహ్మ, పరంధామము, మోక్షమును కోరువారిచే ధ్యానించదగినది, శ్రుతివాక్యములచే చెప్పబడినది, సూక్ష్మము, విష్ణువు యొక్క పరమపదము. అదియే భగవచ్ఛబ్ద వాచ్యము. అదియే పరమాత్మ స్వరూపము. పరమాత్మను చెప్పునది భగవత్ శబ్దము. ఆక్టయాత్మయగు పరబ్రహ్మను ఉద్దేశించి చెప్పినది భగవచ్చబ్దము. ఇట్లు చెప్పిన అర్థము చే పరబ్రహ్మతత్త్వము స్వరూపము చక్కగా తెలియును. ఈ జ్ఞానమే వేదస్వరూపమగు పరబ్రహ్మ స్వరూపమును చేర్చును. ఓ బ్రహ్మణోత్తమా ! శబ్దగోచనుడు” కాని పరబ్రహ్మ గౌరవార్థములో భగవచ్చబ్దము ఉపవాచముగా చెప్పబడినది. భగవచ్చబ్దము శుద్దుడు, మహావిభూతి అనబడుచోడు, సర్వకారణకారణుడు అగు పరబ్రహ్మయందుండును. భగ అను పదములోని భకొరమునకు జేయము, జ్ఞాత అను రెండర్థములు. శాస్త్రకారణత్వము స్రష్టత్వము గకారమునకు అర్థము. సమగ్రమైన ఐశ్వర్యమునకు, వీర్యమునకు, కీర్తికి, శ్రీకి, జ్ఞానమునకు వైరాగ్యమునకు ఈ ఆరింటికి భగము అను పేరు. భూతాత్మ అఖిలాత్మయగు పరబ్రహ్మయందు అన్ని ప్రాణులు నివసించును. సమస్త భూతములయందు పరబ్రహ్మ యుండును అని వకోరము చెప్పుచున్నది. ఇట్లు భగవాన్ అనునది మహాశబ్దము. ఈ శబ్దము మాత్రమే పరబ్రహ్మ యగు వాసుదేవునకు వాచకము. ఇతరమునకు కొదు. ఇతరమును చెప్పజాలదు. భగవాన్ అను శబ్దమునకు పూజ్యార్థము చెప్పుట కూడా పరబ్రహ్మ కు స్వరూపకథనమే కొని ఔపచోరికము కొదు. పరబ్రహ్మ కంటే భిన్నమైన వాటియందు మాత్రమే ఉపచారముగా చెప్పబడుచున్నది. ఉత్పత్తిని, ప్రళయసును, ప్రొణుల ఆగమనమును, గమనమును, విద్యను, అవిద్యను తెలియువాడు భగవానుడు. భగవచ్చబవాచ్యుడు. హేయగుణములు లేక జ్ఞానశక్తి బలైశ్వర్యవీర్య తేజస్సులను ఆరుగుణములు కలవాడు భగవచ్చబ్దవాచ్యుడు. ఆ పరమాత్మ యందు అన్ని ప్రాణులు వసించును. అన్ని ప్రాణులలో పరమాత్మ యుండుటచే వాసుదేవుడనబడుచున్నొడు. ఖాండిక్యుడగు జనకుడు అడుగగా కేశిధ్వజుడు ఈ విషయమునే చెప్పెను. అనంతుడగు వాసుదేవనోమమునకు తత్త్వమును తెలుపు వ్యోఖ్యానమును బోధించేను. అన్ని ప్రాణులలో ఉండును. అన్నీ ప్రాణులు అతనిలో ఉండును. జగత్తునకు ధాత, (ధరించువాడు) విధాత జగత్తు నందు తానుండును. కావుననే వాసుదేవుడనబడును అని. ఆ పరమాత్మ సర్వభూతప్రకృతిని, వికారమును, గుణాదులను, దోషములను అధిగమించినవాడు అన్నీ ఆవరణములను అధిగమించినవాడు, అఖిలాత్మ, భువనాంతరాలమునంతటిని వ్యాపించియున్నవాడు, సమకళ్యాణగుణగణములు కలవాడు దుఃఖము లేనివాడు, ప్రొణిసృష్టి చేయుపొడు, సంకల్పముచే కోరిన దేహమును స్వీకరించువాడు, జగద్దితమును సాధించువాడు. తేజోబలేశ్వర విశేషజ్ఞానము కలవాడు, వీర్యశక్త్యాది గుణములకు మూలస్థానము, పరములన్నిటి కంటే పరుడు, పరులకు అవరులకు ఈడు, ఏ క్లేశములు లేనివాడు, అతనే ఈశ్వరుడు వ్యష్టిరూపుడు, సమష్టిరూపుడు, అవ్యక్తరూపుడు, ప్రకటస్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వసృష్టి తెలియువాడు, సర్వశక్తి కలవాడు, పరమేశ్వరుడు దోషములను తొలగించువాడు, శుద్దుడు, నిర్మలుడు, పరుడు అగు పరమాత్మను తెలుపునది, చూపునదే జ్ఞానము. ఇతరము అజ్ఞానము. స్వాధ్యాయసంయమములచే పురుషోత్తముడు తెలియబడును. పరబ్రహ్మను పొందించునది వేదమే. స్వాధ్యాయముచే యోగమును అభ్యసించవలయును. యోగముచే స్వాధ్యాయమును మననము చేయవలయును. స్వాధ్యాయయోగములచే పరమాత్మ తెలియును. పరమాత్మను చూచుటకు స్వాధ్యాయము యోగము అనునవి రెండు కన్నులు. పరబ్రహ్మను చర్మ చక్షువులచే చూడజాలము.
నారదమహర్షి పలికెను :- పూజ్యుడా ! నేనా యోగమును తెలియగోరుచున్నాను. నాకా యోగమును చెప్పుము. యోగము తెలిసినచో అఖిలాధారుడగు పరమేశ్వరుని దర్శించగలను.
సనందన మహర్షి పలికెను :- మహానుభావుడగు ఖాండిక్యుడను జనకునకు పూర్వము కేశిధ్వజుడు చెప్పిన యోగమును అదే విధముగా నేను నీకు తెలి పెదను.
నారద మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! ఖాండిక్యుడెవరు ? కేశిధ్వజుడెవరు ? వారిద్దరికి యోగసంబంధమున సంవాదమెట్లు జరిగేను ?
సనందన మహర్షి పలికెను :- జనకవంశమున ధర్మధ్వజుడను మహారాజు కలడు. ధర్మధ్వజుని పుత్రుడు అమితధ్వజుడు. అమితధ్వజుని సోదరుడు. కృతధ్వజుడు. ఎప్పుడూ అధ్యాత్మజ్ఞానమునందాసక్తి కలవాడు. కృతధ్వజుని పుత్రుడు కేశిధ్వజుడు. ఇతను ధన్యుడు. అమితధ్వజుని పుత్రుడు ఖాండిక్యముడు. కర్మమార్గమున నున్న ఖాండిక్యుని రాజ్యమునుండి కేశిధ్వజుడు వెడలగొట్టను. పురోహితునితో మంత్రులతో కూడి కొద్ది సైన్యముతో రాజ్యభ్రష్టుడగు ఖాండిక్యుడు దుర్గమారణ్యమున నివసించసాగేను. కేశిధ్వజుడు కూడా చాలా యజ్ఞములనాచరించెను. సంసారమును తరించుటకు బ్రహ్మ విద్యనభ్యసించసాగెను. ఒకప్పుడు కేశిధ్వజుడు యాగమును చేయుచుండగా కేశిధ్వజుని గోవును ఒక భయంకరమగు పెద్దపులి చంపేను. అపుడు కేశిధ్వజ మహారాజు ఆవును పులి చంపినదని తెలుసుకొని దీని కేమి ప్రాయశ్చిత్తమునాచరించవలయునో తెలుపుడని ఋత్విజులనడిగెను. అపుడా ఋత్విజులు మాకు తెలియదు. కశేరుమహర్షిని అడుగవలయునని తెలిపిరి. కశేరుమహర్షి నడుగగా నాకు తెలియదు. శునక మహర్షి నడుగమని చెప్పెను. కేశిధ్వజుడు శునకమహర్షి వద్దకు వెళ్ళి అడుగగా కశేరునకు తెలియదు. నాకు తెలియదు. ఇపుడీ భూలోకమున ఈ విషయమును తెలిసినవాడు నీ శత్రువగు ఖాండిక్యుడొక్కడు మాత్రమే అని తెలి పెను. ఆ మాటలను వినిన కేశిధ్వజుడు ఖాండిక్యునే ఆడి గెదను. నేను వెళ్ళినపుడు అతను నన్ను వధించునా ? లేక నేనడిగినపుడు ప్రాయశ్చిత్తమును తెలుపునా చూచెదను. ప్రాయశ్చిత్తమును తెలిపినచో నా యోగము సిద్దించును అని పలికి రథమునధిరోహించి కృష్ణాజినధరుడై ఖాండిక్యుడున్న వనమునకు వెళ్ళెను. తన శత్రువగు కేశిధ్వజుడు వచ్చుట చూచి ఖాండిక్యుడు కోపముచే కనులు ఎఱ్ఱబారగా ధనువున బాణమును సంధించి ఇట్లు పలికెను.
ఖాండిక్యుడు పలికెను :- కృష్ణాజినమును కవచముగా ధరించి మమ్ములను చంపదలచితివా ? కృష్ణాజనమును ధరించినందున - నిన్ను వధించనని తలచితివా ? మూడుడా లేళ్ళ శరీరము పైన కృష్ణాజినముండదా ? ఆ లేళ్ళను నిష్కారణముగా క్రూరులై బాణములతో వధించుటలేదా ? కావున ఓ దుష్టబుద్దీ ! నీవు నాకు జ్ఞాత్రివి, రాజ్యమును హరించిన శత్రువును కావున నిన్ను వధించెదను. నా నుండి బ్రతికి వెళ్ళలేవు.
కేశిధ్వజుడు పలికెను :- ఓ ఖాండిక్యా ! సంశయమడుగుటకు నీ వద్దకు వచ్చితిని. నిన్ను చంపుటకు రాలేదు. కావున ఆలోచించి కోపమునో బాణమునో వదులుము. అంతట ఖాండిక్యుడు మంత్రులతో పురోహితులతో కలిసి ఆలోచించసాగెను. అపుడు మంత్రులందరు కలిసి ఇపుడు నీవు నీ శత్రువగు కేశిధ్వజుని చంపుము. ఇతనిని చంపినచో రాజ్యము నీ వశమగును. మంత్రి మాటలను విని బౌండిన్యుడిట్లు పలికెను. మీరు చెప్పినది నిజమే. సంశయము లేదు. ఇతనిని చంపినచో భూమి నా వశమగును. కాని కేశిధ్వజుడు పరలోకమును జయించును. నాకు భూమి నాకు లభించును. చంపనిచో నాకు పరలోక జయము ఇతనికి భూమి లభించును. భూమి స్వల్పకాలికము, పరలోక జయము . అనంతకాలికము. కావున నేనితనిని చంపను. అతనడగిన దానిని చెప్పను. ఇట్లు పలికి కేశిధ్వజుని సమీపించి నీవడుగదలచినదానినడుగుము చెప్పెదను. అంతట కేశిధ్వజుడు హోమధేనువును వ్యాఘ్రము చంపినది. దానికి చేయవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పమని అడిగెను. అంతట ఖాండిక్యుడు అచట చేయవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పెను. ఇట్లు ఖాండిక్యుని వలన ప్రాయశ్చిత్తమును తెలుసుకొనిన కేశిధ్వజుడు ఖాండిక్యుని అనుమతిని పొంది యాగభూమిని చేరి ప్రాయశ్చిత్తము నాచరించెను. ఇట్లు ప్రాయశ్చిత్తము నాచరించి యాగమును సమాప్తి గావించి ఆవబ్బధ స్నానము నాచరించి ఇట్లు ఆలోచించసాగెను. ఋత్విజులనందరిని పూజించితిని. సదస్యులను గౌరవించితిని. యాచకులకు అభిమతార్థములనిచ్చి సంతుష్టుల గావించితిని. ఈలోకమున చేయతగిన వాటిని అన్నింటిని చేసితిని. . అయిననూ నా కర్తవ్యము ముగియలేదనిపించుచున్నది. ఇట్లు ఆలోచించుచుండగా ఖాండిక్యునికి గురుదక్షిణనీయలేదని జ్ఞప్తికొచ్చెను. వెంటనే కేశిధ్వజుడు రథము నారోహించి ఖాండిక్యుడు నివసించు దుర్గమారణ్యమునకు వెళ్ళెను. ఖాండిక్యుడట్లు వచ్చు. కేశిధ్వజుని చూచి ఆయుధమును ధరించి వధించ సంకల్పించెను. అపుడు కేశిధ్వజుడు నేను నీకపకారమును చేయుటకురాలేదు. గురుదక్షిణ నిచ్చుట కొచ్చితిని. నీవు ఉపదేశించునట్లు యాగమును పూర్తిగావించితిని. కావున నీకు గురుదక్షిణనీయ సంకల్పించితిని. ఏమి కావలయునో కోరుకొనుము అని పలికెను. కేశిధ్వజుని మాటలను వినిన ఖాండిక్యుడు - మంత్రులతో ఆలోచించసాగెను. కేశిధ్వజుడు గురుదక్షిణనీయ దలచినాడు. ఏమడుగవలయును ? అని మంత్రుల నడిగెను. సంపూర్ణరాజ్యమునడుగుము. అట్లు కోరినచో సైన్యము శ్రమలేకనే రాజ్యము లభించును అని మంత్రులు పలికిరి. ఆ మాటలను వినిన ఖాండిక్యుడు నవ్వి వారితో నిట్లనెను. అశాశ్వతమగు రాజ్యమును నాలాంటివారెట్లడిగేదరు ? మీరు మంత్రులు కావున స్వార్థపరులుగా మాటలాడుచున్నారు. పరమార్థమును తెలియజాలకున్నారు. ఇట్లు పలికి ఖాండిక్యుడు కేశిధ్వజుని సమీపించి నీవు తప్పక గురుదక్షిణ నిచ్చెదవా ? అని అడిగెను. తప్పక నిచ్చెదనని కేశిధ్వజుడు పలుకగా ఖాండిక్యుడిట్లడిగెను. నీవు ఆధ్యాత్మ విజ్ఞాన పరమార్థమును బాగుగా తెలిసిన వాడవు. నీవు గురుదక్షిణనీయ దలచినచో క్లేశములను పరిహరింపచేయు కర్మను నాకు బోధించుము.
కేశిధ్వజుడు పలికెను :- క్షత్రియములకు రాజ్య లాభమునకంటే ప్రియమైనది మరియొకటి లేదు గదా ? నీవు నా రాజ్యమునేల అడుగలేదు ?
ఖాండిక్యడు పలికెను :- ఓ కేశిధ్వజా ! పండితులైన వారు రాజ్యమునందు ఆశపడరు. కావున నేను రాజ్యమును కోరలేదు. క్షత్రియులకు ప్రజాపరిపాలనము, ధర్మయుద్దమున శత్రువధ స్వధర్మము. ఆ రెంటిలో అశక్తుడనగుట నా దోషము. నీవు చేసిన అపకారమేమియును లేదు. అక్రమ మార్గమున శత్రువధ చేయుట అజ్ఞానమే యగును. మరల పుట్టుకను పాపాను భవమునకే నాకు రాజ్యలాభమునందాశయగును. దోషముల వలన చేయు ధర్మములనే అనుసరింతురు. క్షత్రియులు యాచనచే రాజ్యమును పొందుట ధర్మము కానేరదు. కావున అవిద్యలో అంతర్భవించిన రాజ్యమును నేను అర్థించలేదు. మమకారముచే ఆకర్షించబడిన చిత్తము కలవారు అహంకారమదమత్తులు మాత్రమే రాజ్యమునాశించేదరు. నా వంటి వారు రాజ్యము నాశించజాలరు.
కేశిధ్వజుడు పలికెను :- నేను జ్ఞానముచే సంసారమును తరించుటకే రాజ్యమును యజ్ఞములను చేయుచున్నాను. పుణ్యక్షయము కొఱకు పలు భోగములననుభవించుచున్నాను. దైవేచ్చచే నేటికి నీ మనసు వివేకవృద్ధిని చెందుచున్నది. ఓ కులనందనా ! అవిద్యాస్వరూపమును చెప్పెదను వినుము. ఆత్మ కాని దానియందు ఆత్మ బుద్ధి, తనది కానిదానియందు తనదను బుద్దీ ఈ రెండు విధములగు బీజములు అవిద్యావృక్షములనుండి పుట్టినవి. పంచభూతాత్మకమగు దేహమునందు జీవుడు మోహమను చీకటిచే ఆవరించబడి దుష్టబుద్ధి కలవాడై ఈ దేహమేనేనని భావనచేయును. ఆకాశ వాయ్వగ్ని జల పృథీవులను పంచభాతములు విడివిడిగా యుండగా శరీరమున ఆత్మయని భావించువాడెవ్వడు? శరీరముచే అనుభవించదగిన గృహక్షేత్ర కలత్రాదులు దేహమున కంటే భిన్నమగు ఆత్మలో నావి ఇవి యని ప్రజ్ఞుడు భావించును. ఇట్ల దేహము వలన ఉత్పన్నములైన పుత్రపౌత్రాదులందు ఆత్మకొని శరీరమునందు పండితుడు కూడా తనది - అను భావన కలిగియుండును. సమగ్ర శరీరానుభవము కొఱకు మానవుడు కర్మను చేయును. కాని ఆత్మకంటే భిన్నమగు ఈ దేహము ఎపుడూ దేహినీ బంధించుటకే ప్రయత్నించుచుండును. మట్టిచే నిర్మించిన గృహమును మట్టినీటిచే అలుకునట్లు ఈ పార్థివ దేహమును కూడా మట్టినీరులచే పూయబడియుండును. పంచభోగాత్మకములగు భోగములచే పంచభూతాత్మకమగు శరీరమును తృప్తిపరిచినచో పురుషుని గర్వము విజృంభించుచుండును. అనేక వేలజన్మలలో సంసారమును పొందుచు వాసనా ధూళిధూసరితుడై మోహముచే శ్రమను పొందును. జానమను ఉష్ణజలముచే వాసనాధూళిని ప్రక్షాళనము చేసినచో , సంసారమను బాటలో పయనించు బాటసారికి మోహాశ్రమము శమించును. మోహమను శ్రమ శాంతించినపుడు పవిత్రమైన అంతఃకరణము గల పురుషుడు ఇతరములను అధికముగా ఆశ్రయించక పరమానందమును పొందును. ఇట్లు ఈ ఆత్మ పరమానందమయుడు జ్ఞానమయుడు, దుఃఖమును కలిగించు ధర్మములు ప్రకృతివి కాని ఆత్మవి కావు. నీటిని అగ్నితో సంగముండజాలదు. స్థాలిసంగముండును. జీవుడు శబ్లోద్రేకాది ధర్మములను ఆచరించినపుడు ఆత్మ కు ప్రకృతి సంబంధమేర్పడుటచే అహంకార దూషితమగును. అపుడు అవ్యయుడగు ఆత్మ నిశ్చేష్టతను విడిచి ప్రాకృతధర్మమున నాచరించును. ఇట్లు నీకు అవిద్యాబీజమును తెలిపితిని. క్లేశములను నశింప చేయు సాధనము ఒక్క యోగము మాత్రమే.
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ద్వితీయ పాదమున బృహదుపాఖ్యానమున నలుబది యారవ అధ్యాయము సమాప్తము.
