నారద మహా పురాణము - పూర్వార్థము
2 - నారదకృత విష్ణుస్తుతిః
ఋషులు పలికిరి.
మహానుభావుడైన నొరదునికి సనత్కుమారుడు సకలధర్మములను ఎట్లు చెప్పెను ? వారిద్దరెట్లు కలిసిరి ? ఓ సూతమహర్షీ ! ఆ ఇద్దరు బ్రహ్మవాదులు ఏ ప్రదేశములో ఉండిరి ? హరికథాగానమునేట్లు చేసిరో అది మాకు . చెప్పుము అనీ అడీగిరి.
సూతమహర్షి చెప్పెను :
సనకాదులు బ్రహ్మమానసపుత్రులు. వారందరు జితేంద్రియులు. అహంకార మమకారరహితులు. వారి పేర్లను తెలి పేదను వినుడు. సనకుడు, సునందనుడు, సనత్కుకుమారుడు, సనాతనుడు. వీరందరూ విష్ణుభక్తులు, మహాత్ములు. బ్రహ్మ ధ్యానము చేయువారు. వేయిసూర్యుల కాంతిగలవారు. సత్యసంధులు, మోక్షమును కోరువారు. ఒకప్పుడు సనకాదులు బ్రహ్మసభ అయిన మేరుపర్వతశిఖరమునకు బయలుదేరిరి. వీరలు మార్గమధ్యమున తమకిష్టమైన విష్ణుపాదమునుండి పుట్టిన గంగానదిని చూచిరి. ఆ నదిని చూచి ఆ చల్లని నీటిలో స్నానము చేయుటకు సిద్దపడిరి. ఓ బ్రాహ్మణోత్తములారా! ఇంతలో దేవర్షియైన నారదుడు తనకు అన్నలగు సనకాదులను చూచి అచటికి వచ్చెను. స్నానము చేయుటకు సిద్దముగానున్న అన్నలను చూచి చేతులు జోడించి నమస్కరించి, ప్రేమతో భక్తితో శ్రీమన్నారాయణుని నామసంకీర్తనమును చేయుచుండెను. నారాయణ ! అచ్యుత ! అనన్త ! వాసుదేవ ! జనార్ధన ! యజేశ ! యజ్ఞపురుష ! కృష్ణా ! విష్ణూ ! నీకు నమస్కారము. పద్మాక్ష ! కమలాకాస్త ! గంగోజనక ! కేశవ ! క్షీరసాగర శయన ! దేవేశ! దామోదర ! నీకు నమస్కారము. శ్రీరామ ! శ్రీ విష్ణ ! నరసింహ ! వామన ! ప్రద్యుమ్న ! సంకర్షణ ! వాసుదేవ ! అజ ! అనిరుద్ధ ! అమలరుక్ ! మురారే ! నీవు మమ్ములను అన్ని భయములనుండి కాపాడుము. ఇట్లు శ్రీహరి నామములను కీర్తించుచు తన అగ్రజులకు నమస్కరించి వారితో కలిసి కూర్చొని, ప్రీతితో గంగలో స్నానము చేసెను.
లోకముల పాపములను నశింపచేయు చల్లని గంగాజలము నందు సనకాదులు స్నానము చేసి దేవ, ఋషి పితృదేవతలకు తర్పణములనిచ్చి కల్మషములను బోనాడి నదిని దాటి తీరముచేరి సంధ్యాపాసన చేసి తమ ఆచారములను ముగించుకొని నోరాయణుని గుణములను వర్ణించు కథలను సంభాషించసాగిరి. సుందరమైన గంగాతీరమున తమ విధులను పూర్తి చేసుకొని నారాయణకథలను చెప్పుచుండగా నారదమహర్షి మధ్యలో ఇట్లు ప్రశ్నించెను.
నారదుడు పలికెను
ఓ ముని శ్రేష్ఠులారా ! మీరందరూ అన్నియూ తెలిసినవారు. భగవంతునియందు భక్తిపరులు. జగన్నాథులు, భగవంతులు. సనాతనులు. లోకమునుద్ధరించుటలో ఆసక్తి కలిగి దీనులయందు మైత్రిని చూపు మిమ్ములను అడుగుచున్నాను. నాకు భగవంతుని లక్షణమును జ్ఞానులైన మీరు తెలుపుడు. ఈ స్థావరజంగమాత్మకమగు ప్రపంచమంతయు ఎవనిచే బుట్టినది? గంగ పాదోదకమైన శ్రీహరి ఎట్లు తెలియబడును? మానవులుచేయు కాయిక, వాచిక, మానసిక కర్మలు ఎట్లు సఫలమగును? జ్ఞానలక్షణమును తపోలక్షణమును చెప్పుడు. శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడగు అతిథిపూజను- గూర్చి తెలుపుడు. ఇట్లు శ్రీమన్నారాయణునికి ప్రీతికలిగించు ఇటువంటి రహస్యములను నాయందు అనుగ్రహముంచి చెప్పుడు.
శౌనకమహర్షి చెప్పుచున్నాడు :
పరదేవునికి, పరములన్నిటికి పరుడైనవానికి నమస్కారము. పెద్దవాటిలోను చిన్నవాటిలోను సమానముగా నివసించువానికి సగుణునకు, నిర్గుణునకు నమస్కారము. మాయావశ్యుడు కానివానికి ఆత్మ అను పేరుగల వానికి, మాయారూపునకు విశ్వరూపునకు యోగీశ్వరునకు, యోగరూపునకు, యోగముచే తెలియబడువానికి విష్ణువునకు నమస్కారము. జ్ఞానస్వరూపునకు, జ్ఞానముచే తెలియబడువానికి అన్ని జ్ఞానములకు కారణమైన వానికి, జ్ఞానప్రభువునకు, తెలియదగువానికి, అన్నియూ తెలిసినవానికి, విజ్ఞానసంపద కలవానికి, నమస్కారము. ధ్యానరూపునకు, ధ్యానముచే తెలియబడువానికి, ధ్యానము చేయువారి పాపములను హరించువానికి, ధ్యానేశ్వరునికి ఉత్తమబుద్దిస్వరూపునకు ధ్యేయస్వరూపము ధ్యాతృస్వరూపము గలవానికి నమస్కారము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విధాత, దేవతలు, సిద్ధులు, యక్షులు, అసురులు, నాగసంఘములు ఎవని శక్తిచే శక్తిమంతులో, అట్టి అజుని, పురోణుని సత్యస్వరూపుని స్తుతినాథుని అన్ని వేళలా నమస్కరించుచున్నాను. బ్రహ్మరూపముతో జగత్తును స్పజించువాడు, విష్ణురూపముతో జగత్తును రక్షించుకోడు, ప్రళయకోలమున రుద్రరూపముతో జగమును సంహరించువాడు, పడుకొని తన పాదమును పానము చేయువాడు అయిన శ్రీమన్నారాయణుని నమస్కరించుచున్నాను. శ్రీమన్నారాయణుని నామ సంకీర్తనముచే గజేస్తుడు మకర బాధనుండి విముక్తుడాయెను. తన నివాసమైన పరమపదమునందు ప్రకాశించు ఆది దేవుడైన శ్రీహరికి నమస్కరించుచున్నాను. శివభక్తులకు శివరూపుడుగా, విష్ణుభక్తులకు విష్ణురూపుడుగా సంకల్పమాత్రముచే దేహములను ధరించు ఆ శ్రీహరిని అన్ని వేళలా శరణు పొందుచున్నాను. కేశిని, నరకాసురుని సంహరించినవాడు, బాలుడుగా ఉండి చేతితో పర్వతమును ధరించినవాడు, భూభారమును తొలగించుట వినోదముగా భావించువాడు అయిన దేవునికి ఎల్లప్పుడూ నమస్కరించెదను. ఉగ్రనరసింహరూపముతో నవతరించి, కఠిన శిలవలె నున్న హిరణ్యకశ్యపుని వక్ష స్థలమును చేరి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన దేవునికి నమస్కరించుచున్నాను.
ఆకాశాదులచే భూషించబడియున్న, ఆత్మ యనబడువానిని, ఏ సంబంధము అంటనివానిని, ఇంతటి తత్త్వమిది - అని కొలవలేని స్వరూపముగలవానిని, జగత్తును సృష్టించుచున్నను కర్మ చేయనివానిని, పరుడు, పురాణ పురుషుడైన వానిని శ్రీహరిని నమస్కరించుచున్నాను. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, వాయువు, మానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతలు అను భేదమును తన శరీరముచే పొందుచున్ననూ ఒకనిగానుండు ఆది ఆత్మ స్వరూపుని సేవించెదను. ఈ ప్రపంచమంతయు ఎవని వలన వేరుపడి, పుట్టి, నిలచి, ఎవనిలో లీనమగునో ఆ దేవుని శరణు పొందుచున్నాను. విశ్వరూపముతో నుండి అన్నిటితో సంగమున్న వానివలె తోచుచు ఏ సంగము లేక పరిపూర్ణుడుగా నున్నవానిని శరణు వేడుచున్నాను. అందరి హృదయములలో అంతర్యామి రూపమున నున్ననూ మాయామోహితులకు తెలియని పరుని, శుద్దుని శరణు వేడుచున్నాను. అన్ని సంగములను వదిలినవారికి, ధ్యానయోగమునందు ఆసక్తి కల మనసు కలవారికి అంతటా జ్ఞానరూపునిగా భాసించువానిని శరణువేడుచున్నాను. క్షీరసముద్రమును అమృతము కొఱకు చిలుకునపుడు దేవతల హితము కొఱకు మందర పర్వతమును మూపున దొల్చిన కూర్మావతారునికి నమస్కారము. సముద్రమునుండి భూమిని తన కోరకొనతో ఉద్దరించి సమస్త జగత్తును - నిలిపిన వరాహావతారమునకు నమస్కరించుచున్నాను. ప్రహ్లాదుని కాపాడుచు, నీలవలె కఠినమైన రాక్షసుని వక్షస్థలమును చీల్చిన నొరసింహునికి నమస్కరించుచున్నోను. బలిచక్రవర్తినుండి భూమిని పొంది, రెండు అడుగులతో బ్రహ్మ వరకు వ్యాపించియున్న ప్రపంచమును అతిక్రమించి, దేవతలకిచ్చిన త్రివిక్రమరూపునికి నమస్కరించుచున్నాను. కార్తవీర్యార్జునుని అపరాధముతో ఇరువదినొక్కమారులు క్షత్రియవంశమును సంహరించిన పరశురామునికి నమస్కరించుచున్నాను. నాలుగురూపములతో ఆవిర్భవించి వానరులతో కలిసి రాక్షస సైన్యమును సంహరించిన రామచంద్రునకు నమస్కరించుచున్నాను. రెండురూపములను ధరించి భూభారమును తొలగించి తన కులమును సంహరించిన శ్రీకృష్ణుని సేవించెదను. మూడులోకములను తన స్వరూపమును తనలో లీనముచేసికొనిన దోషరహితుడు, పరిశుద్దుడు అయిన, ఈశ్వరుని తమలో చూచుచుందురో ఆతనిని సేవించెదను. యుగాన్తమునందు పొపులను, అపరిశుద్దులను వాడియైన ఖడ్గధార ఖండించి కృతయుగారంభమున ధర్మమును స్థాపించిన శ్రీహరికి నమస్కారములు.
ఇటువంటి అనేక రూపములు కలవు. శ్రీమన్నారాయణుని అవతారములను రూపములను లెక్క పెట్టగలవారెవ్వరూ లేరు. కొన్ని సంవత్సరములు లెక్కించిననూ సరిపోవు. శ్రీమన్నారాయణుని నామమాహాత్మ్యమును సంపూర్ణముగా మహర్షులు కూడా తెలియలేరు. దేవతలు, రాక్షసులు, మనువులు తెలియజాలరు. అంతటి మహిమగల ప్రభువును కుదుడను నేనేట్లు భజించగలను ? శ్రీమన్నారాయణుని పేరును వినినంతనే మహాపాపులైన మానవులు కూడా పవిత్రులగుదురు. అల్పబుద్దినైన నేనెట్లు ఆ స్వామిని స్తుతించగలను ? ఏదో విధముగా శ్రీమన్నారాయణుని పేరును కీర్తించిననూ వినిననూ పాపులు పరిశుద్ధులగుదురు. పరిశుద్దులు మోక్షమును పొందగలరు. దోషరహితులైన యోగులు మనసులో నిలిపి చూచు జ్ఞానరూపుడైన పరమాత్ముని శరణు వేడుచున్నాను. జ్ఞానులు అన్నిటిలో పరిపూర్ణుడైన శ్రీహరిని చూచెదరు. అట్టి జ్ఞానరూపుని ఆదిదేవుని పుట్టుకలేని శ్రీహరిని నేను భజించేదను. సర్వసత్త్వస్వరూపుడు, శాల్లుడు, అన్నిటిని చూచువాడు, అందరికీ ప్రభువు, భావస్వరూపుడు, సహస్రశీర్షుడు అయిన శ్రీహరికి నమస్కరించుచున్నాను. జరిగినది, జరుగనున్నది, స్థావరము జంగమము, అయిన జగత్తును అతిక్రమించి దశాంగులపర్యన్తము వ్యాపించియున్న జగదీశ్వరుని, జరారహితుని సేవించెదను. అణువులకన్నా అణువు, మహత్తుల కంటే మహత్తు, రహస్యములలో కెల్ల పరమరహస్యము అయిన ఆదిదేవుని మాటిమాటికి నమస్కరించెదను. ఒక మారు ధ్యానించినను, తలచినను, పూజించినను, వినినను, నమస్కరించినను తన లోకమునిచ్చు జగదీశ్వరుడగు పురుషోత్తముని నమస్కరించుచున్నాను. ఇట్లు పరమాత్మను, శౌనకమహర్షి స్తుతించుచుండగా నారదునితో గూడిన సనందనాదులు, ఇతర మునీశ్వరులు ఆనంద బాష్పములు చూపునడ్డగించుచుండగా పరమానందమును పొందిరి. ఈ పురుషోత్తముని స్తోత్రమును ప్రాతఃకాలమున లేచి చదువువారు అన్ని పాపములు నశించి పరిశుద్ధులై విష్ణులోకమును పొందెదరు.
ఇది శ్రీబృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సనత్కుమారనారదసంవాదమున నారదకృత విష్ణుస్తుతియను రెండవ అధ్యాయము ముగిసినది.
