నారద మహా పురాణము - పూర్వార్థము
104 - స్కన్దపురాణానుక్రమణి
ఇక రెండవది వైష్ణవ ఖండము. ఇపుడు వైష్ణవ ఖండములోని ఆఖ్యానములను వినుము. ఈ ఖండమున మొదట భూమి వారాహ సమాఖ్యానము చెప్పబడినది. ఈ సమాఖ్యానమున వేంకటాచల మాహాత్మ్యము సకల పాప నాశనము వర్ణించబడినది. లక్ష్మీ దేవి యొక్క పవిత్ర కథ, శ్రీనివాస స్థితి, కులాల చరిత్ర, సువర్ణముఖరీ నది, నానాఖ్యాన సమన్వితమగు భారద్వాజ కథ, మతంగాంజన సంవాదము, పురుషోత్తమ మాహాత్మ్యము కీర్తించబడినది. మార్కండేయ చరిత్ర, అంబరీష కధ, ఇంద్రద్యుమ్న కథ, విద్యాపతి కథ, జైమిని ఉపాఖ్యానము, నారదోపాఖ్యానము, నీలకంఠ సమాఖ్యానము, నరసింహోప వర్ణనము, అశ్వమేధ కథ, బ్రహ్మలోక గతి, రధయాత్రావిధి, జన్మస్థాన విధి, దక్షిణామూర్త్యు పాఖ్యానము, గుండెవాఖ్యానము, రథ రక్షా విధానము, శయనోత్సవ కీర్తనము, శ్వేతో పాఖ్యానము, పృధూత్సవ నిరూపణము, డోలోత్సవము, భగవద్ర్వతము, ఉద్దాలకుని నియోగము వలన విష్ణువు యొక్క అకామిక పూజ, నానాయోగ నిరూపణలు కల యోగసాధనము, దశావతార కధనము, స్నానాది పరికీర్తనము, పాపనాశనమగు బదరికా మాహాత్మ్యము, అగ్న్యాది తీర్థ మాహాత్మ్యము, వైనతేయ శిలా భవము, భగవద్వాస కారణము, కపాలమోచన తీర్థము, పంచధారా తీర్థము, మేరు సంస్థాపనము వర్ణించబడినది. ఇక కార్తీక మాహాత్మ్యమున మదనాలస మాహాత్మ్యము, ధూమకేశ సమాఖ్యానము, కార్తీక మాసమున దిన కృత్యములు, పంచ భీష్మవతా ఖ్యానము భుక్తిముక్తి దములుగా వర్ణించబడినవి. ఇక మార్గశిర మాహాత్మ్యమున స్నాన విధానము, పుండ్రాది కీర్తనము, మాలాధారణ పుణ్యకము పంచామృత స్నానము వలన కలుగు పుణ్యము. ఘంటానాదాది జన్మ ఫలము, నానా పుష్పార్చన ఫలము, తులసీదల జప ఫలము, నైవేద్య మాహాత్మ్యము, హరివాసర కీర్తనము, అఖండైకాదశీ పుణ్యము, జాగరణ పుణ్యము, ఉత్సవ విధానము, నామ మాహాత్మ్య కీర్తనము, ధ్యానాది పుణ్య కథనము, మధురా మాహాత్మ్యము, మధురా తీర్థ మాహాత్మ్యము, వన మాహాత్మ్యము, శ్రీ మద్బాగవత మాహాత్మ్యము, అంతర్లీలో ప్రకాశకమగు వజ్రశాండిల్య సంవాదము, మాఘ మాసమున చేయు స్నానదాన జపోద్భవ మాహాత్మ్యము నానా కథా సమన్వితముగా పది అధ్యాయములచే చెప్పబడినది. తరువాత వైష్ణవ మాహాత్మ్యమున శయ్యాదానాది జన్య ఫలితము, జలదానాది విధులు, కామాఖ్యానము, శ్రుతదేవుని చరితము, ఆశ్చర్యకరమగు వ్యాధోపాఖ్యాము, అక్షయ తృతీయాది విశేషముల వలన కలుగు పుణ్యముల వివరములు, అయోధ్యా మాహాత్మ్యమున సురాపాప విమోక్షమను పేరుగల చక్ర బ్రహ్మనామక తీర్థమున ధారా సహస్రకము, స్వర్గద్వారము, చంద్రహరి ధర్మపర్యుప వర్ణనము, స్వర్ణ వృష్ట్యుపాఖ్యానము, తిలోదాసరయూసంగమము, సీతాకుండము, గుప్తహరి సరయూ ఘర్ఘరాన్వయము, గోప్రతారము, దుగ్గేదము గురుకుండాది పంచకము, సోమార్కాది తీర్థములు పదమూడు వర్ణించబడినవి. తరువాత గయాకూప మాహాత్మ్యము సర్వాఘవినివర్తకముగా, మాండవ్యాశ్రమాది తీర్థములు, అజితాది మానసాది తీర్థములు చెప్పబడినవి. ఇది రెండవదియగు వైష్ణవ ఖండము. వివరించబడినది.
ఇక ఇపుడు బ్రహ్మఖండ వృతానమును వినుము. ఈ ఖండము అఖండ పుణ్యప్రదము. ఇచట సేతు మాహాత్మ్యమున క్షణమున కలుగు స్నాన ఫలము. గాలవ తపస్సు. రాక్షస చరిత్రము, చక్రతీర్థాది మాహాత్మ్యము దేవీ పత్తన సంయుత్తముగా వర్ణించ బడినది. బేతాల తీర్థ మహిమా, పాప నాశాది తీర్థ మాహాత్మ్యము, మంగలాది మాహాత్మ్యము, బ్రహ్మకుండాది వర్ణనము, హనుమత్కుండ మాహాత్మ్యము, అగస్త్య తీర్థ జన్యఫలము, రామతీర్థాది కధనము, లక్ష్మీతీర్థ నిరూపణము, శంఖాది తీర్థమాహాత్మ్యము, సాధ్యామృతాది జన్యముగా, ధనుష్కోట్యాది మాహాత్మ్యము, క్షీర కుండాది జన్య ఫలము. గాయత్ర్యాది తీర్థ మాహాత్మ్యము ఇచట వర్ణించబడినది. రామనాధ మాహాత్మ్యము, తత్త్యజ్ఞానోపదేశము, యాత్రా విధాన కథనమున సేతు యాత్రముక్తి ప్రదమని, ధర్మారణ్య మాహాత్మ్యము చెప్పబడినది. ఈ మాహాత్మ్యముననే స్థాణవు స్కందునకు తత్యోపదేశము చేయును. ధర్మారణ్య సంభవము, తత్పుణ్య పరికీర్తనము, కర్మసిద్ధి సమాఖ్యానము, ఋషివంశ నిరూపణము, అప్సరసీర్థముఖ్య వర్ణననము, మాహాత్మ్యము, వర్ణాశ్రమ తత్య నిరూపణము. దివస్థాన విభాగము, శుభకరమగు బకులార్క కథ, ఛత్రానన్గా, శాంతా, శ్రీ మాతా, మతంగినీ, పుణ్యదాక్షేత్రమున దేవీ నివాసము, ఇంద్రేశ్వరాది మాహాత్మ్యము, ద్వారకాది నిరూపణము, లోహాసుర సమాఖ్యానము గంగా కూప నిరూపణము, శ్రీరామ చరితము, సత్యమందిర వర్ణనము, జీర్ణోద్ధార కథనము, ఆసన ప్రతిపాదనము, జాతి భేద కథనము, స్మృతి ధర్మ నిరూపణము చేయబడినది. తరువాత నానాఖ్యానములతో వైష్ణవ ధర్మములు చెప్పబడినవి. తరువాత పరమ పవిత్రమగు చాతుర్మాస్యమున సర్వధర్మ నిరూపణము చేయబడినది. దానప్రశంసా, వ్రత మహిమ, తపః పూజాదికముల చిత్ర కథనము, తపః పూజావృత్తి భేదకథనము, శాలగ్రామ నిరూపణము, భారక వధోపాయము, వృక్షాల మహిమ, విష్ణువునకు శాపము, వృక్షత్వము పార్వత్యనుతపము, హరతాండవము, నృత్యము, రామనామ నిరూపణము, హరునకు లింగపతనము, బైజ వన కథ, పార్వతీ జన్మ చరితము, అత్యాశ్చర్యకరమగు తారకాసుర వథ, ప్రణవైశ్వర్య కధనము, తారకా చరితము, దక్షయజ్ఞ సమాప్తి, ద్వాదశాక్షర భూషణము, జ్ఞానయోగ సమాఖ్యానము, ద్వాదశాక్షరి మహిమ, మానవులకు శుభములను ప్రసాదించు శ్రవణాది పుణ్య కధనము వర్ణించబడినది. తరువాత బ్రహ్మోత్తర భాగమున అద్భుతమగు శివ మాహాత్మ్యము, పంచాక్షర మహిమ, గోకర్ల మహిమ, శివరాత్రి మహిమ, ప్రదోష వ్రత కీర్తనము, సోమవార వ్రతము, సీమంతినీ కథానకము, భద్రాయూత్పత్తి కథనము, సదాచార నిరూపణము, శివవర్మ సముద్దేశము, భద్రాయు వివాహ వర్ణనము, భద్రాయు మహిమ, భస్మ మాహాత్మ్య కీర్తనము, శబరాఖ్యానము, ఉమా మహేశ్వర వ్రతము, రుద్రాక్ష మాహాత్మ్యము, పవిత్రమగు రుద్రాధ్యాయ మాహాత్మ్యము, శ్రవణాదికముల పావనత్వము వర్ణించబడినది. ఇట్లు నీకు బ్రహ్మఖండము వివరించబడినది.
ఇక ఇపుడు నాలుగవదగు కాశీ ఖండము వర్ణించబడినది. ఈ ఖండము సర్వోత్తమము. ఈ ఖండమున విన్త్య నారద సంవాదము వర్ణించబడినది. సత్యలోక ప్రభావము అగస్త్యా శ్రమమునకు దేవతాగమనము, పతివ్రతా చరిత్రము, తీర్థయాత్రా ప్రశంస, తరువాత సప్తపురి యను పేరుగల సంయమినీ నిరూపణము, బుధ ఇంద్రాగ్నుల ప్రశంస, శివకర్మ లోకాప్తి, అగ్నిసంభవము, ప్రవ్యాద వరుణ సంభవము, గంధవతీ అలకాపురీ వర్ణనము, పార్వతీ పుట్టుక, చంద్రార్క బుధలోకముల వర్ణనము, కుజ గురు సూర్య భూలోకముల వర్ణనము, బ్రహ్మలోకము, విష్ణులోకము, ధ్రువలోకము, తపోలోకముల వర్ణనము, పరమ పవిత్రమగు ధ్రువలోక కథ, సత్యలోక నిరీక్షణము, స్కందాగస్త్య సంభాషణము, మణికర్ల సముద్భవము, గంగా ప్రభావము, గంగా నామ సహస్రకము, వారాణసీ ప్రశంసా, భైరవావిర్భావము, దండపాణి, జ్ఞానవాపుల ఉద్భవము, తరువాత కలావత్యాఖ్యానము, సదాచార నిరూపణము, బ్రహ్మచారి సమాఖ్యానము, తరువాత స్త్రీ లక్షణములు, కృత్యాకృత్య నిర్ణయము, అవిముక్తేశ వర్ణనము, గృహస్థ ధర్మములు యోగినీ ధర్మములు, కాల జ్ఞానము, పవిత్రమగు దీవోదాస కథ, కాశికా వర్ణనము, భూలోకమున మాయాగణపతి సముద్భవము, విష్ణుమాయా ప్రపంచము, దివోదాస విమోక్షణము, పంచనదోత్పత్తి, బిందుమాధవ సంభవము, వైష్ణవ తీర్థమను పేరు గల కాశికకు శివుడు వచ్చుట, జైగీషవ్య సంవాదము, మహేశ్వరునకు జ్యేష్ణశ నామము, క్షేత్రాఖ్యానము, కందుకేశ వ్యాఘేశ్వర సముద్భవము, శైలేశోత్పత్తి, రత్నేశ్వర్యుత్పత్తి, కృత్తివాసోత్పత్తి, దేవతాధిష్టానము, దుర్గాసుర పరాక్రమము, దుర్గా విజయము, ఓంకారేశ్వర వర్ణనము, ఓంకార మాహాత్మ్యము, త్రిలోచనోత్పత్తి, కేదారమనుపేరు గల విష్ణు భుజోద్భవమగు ధర్మేశ కథ, వీరేశ్వర సమాఖ్యానము, గంగా మాహాత్మ్య కీర్తనము, విశ్వకర్మేశ మహిమా, దక్షయజ్ఞోద్భవము, సతీశ అమృతేశాదుల భుజ స్తంభము, పరాశరము నందు క్షేత్ర తీర్థ కదంబము, ముక్తి మండప సంకథా, విశ్వేశ్వరుని వైభవము, తరువాత యాత్రా పరిక్రమము, వర్ణించబడినవి. ఇట్లు నాలుగవదగు కాశీ ఖండము నిరూపించబడినది. ఇక అయిదవది యగు అవంతీ ఖండమును వినుము.
మహాకాల వనాఖ్యానము, బ్రహ్మ శిరచ్ఛేదము, ప్రాయశ్చిత్తవిధి, అగ్నిసముద్భవము, దేవతాగనము, దేవదీక్ష, నానాపాతక నాశనమగు శివస్తోత్రము, కపాలమోచనాఖ్యానము. మహాకాలవనస్థితి, సర్వపాప ప్రణాశనమగు కనఖలేశ తీర్థము. అప్సర కుండము, పావనప్రదమగు రుద్రసరోవర్ణనము, కుండవేశ తీర్థము, విద్యాఘ్ర తీర్థము, మర్కటేశ్వర తీర్థము. స్వర్గద్వార తీర్థము, చతుస్సింధు తీర్థము, శంకర వాపికా తీర్ణము, పాప ప్రణాశనమగు శంకరాక తీర్థము, గంధ తీర్థము, దశాశ్వమేధికా తీర్థము, అనంశ తీర్థము, హరిసిద్ధిదము, పిశాచకాది యాత్ర, హనుమత్కవచ తీర్థము, ఈశ్వర తీర్థము. మహాకాలేశయాత్ర, వాల్మీకేశ్వర తీర్థము, శుక్ర పంచకము, కుశస్థలి ప్రదక్షిణలు, అక్రూర తీర్థము, ఏకపాద తీర్థము, చంద్రార్క వైభవము, కరభేశతీర్థము, బటుకేశాది తీర్థములు, మార్కండేశ తీర్థము, యజ్ఞవాపి, సోమేశ తీర్థము, కరకాంతక తీర్థము, కేదారేశ్వర రామేశ సౌభాగ్యేశ నరార్కక క్షేత్రములు, కేశవార్క తీర్థము, శక్తి భేదము, స్వర్ణసార ముఖములు, ఓంకారేశాది తీర్థములు. అంధక శ్రుతి కీర్తనము, కొలారణ్యమున లింగసంఖ్య, స్వర్ణ శృంగ నామము. కుశస్థలీ, అవంతి, ఉజ్జయినీ నామములు, పద్మావతీ, కుముద్వతి అమరావతి నామములు, విశాల ప్రతికల్పాభిధానము. జ్వర శాంతికము, శివనామాదిక ఫలము, నాగోద్గీతా శివస్తుతి, హిరణ్యాక్ష వధాఖ్యానము, సుందరకుండ తీర్థము, నీలగంగా పుష్కర తీర్థము, వింధ్య వాసన తీర్థము, పురుషోత్తమ తీర్థము, సర్వపాప నాశకము, గోమతీ తీర్థము, వామన కుండము, విష్ణు నామ సహస్రకము, వీరేశ్వర సరస్సు, కాలభైరవ తీర్థము, నాగపంచమి మహిమ, నృసింహ జయంతి, కుటుంబేశ్వరయాత్ర, దేవసాధక కీర్తనము, కర్కరాజ తీర్థము, విఘోశాది సురోహనము, రుద్రకుండాది బహుతీర్థ నిరూపణము, పవిత్రమగు అష్టతీర్థయాత్ర, రేపో మాహాత్మ్యము, ధర్మరాజవైరాగ్యము, మార్కండేయ సమాగమము, ప్రాగ్రీయాను భవాభ్యానము, అమృతా పరికీర్తనము, నర్మదానదికి ప్రతి కల్పమున నుండు నామ భేదములు. ఋషులు చేసిన నర్మదా తీర్థము, కాలరాత్రి కథ, మహాదేవస్తుతి, పృథ కల్పకథా, విశల్యాఖ్యానము, జాలేశ్వర కథా, గౌరీవ్రత సమాఖ్యానము, త్రిపుర వాహము, దేహపాత విధానము, కావేరీ సంగమము, దారు తీర్థము, బ్రహ్మవర్తము, ఈశ్వరకథ, అగ్ని తీర్థము, రవి తీర్థము, మేఘనాదాది దారుక తీర్థము, దేవ తీర్థము, నర్మదేశ తీర్థము, కపిల తీర్థకము కరంజక తీర్ధము, కుండలేశ తీర్థము, పిప్పలాద తీర్థము, విమలేశ తీర్థము, శూలభితీర్థము శచీహరణాఖ్యానము, అభ్రక వధ, శూలభేదోద్భవము, పృధగ్విధ దాన ధర్మములు, దీర్ఘ తపసుని ఆఖ్యానము, ఋష్య శృంగకధ, చిత్రసేనా కధ, కాశిరాజ్య లక్షణము, దేవశిలాఖ్యానము, శబరీ తీర్థ కధ, పవిత్రమగు వ్యాధా ఖ్యానము. పుష్కరిణీ తీర్థము, అర్క తీర్థము, ఆమేశ్వర తీర్థము, శక్ర తీర్థము, కరోటి తీర్థము, కుమారేశ తీర్థము, అగస్త్యేశ తీర్థము, ఆనందేశ తీర్థము, మాతృజ తీర్థము, లోకేశము, ధనదేశము, మంగలేశము, కామజము, నాగేశము, గోపారము, గౌతమ తీర్థము, శంఖచూడకము, నారదేశము, నందికేశము, వారుణేశ్వర తీర్థము, దధిస్కందాది తీర్థములు, హనుమంతేశ్వర తీర్థము, రామేశ్వరాది తీర్థములు, సోమేశము, పింగలేశ్వర తీర్థము, ఋణమోక్షము, కపిలేశము, పూతికేశ తీర్థకము, జలేశయము, చండార్కము, యమతీర్థము, కాల్డో డీశము, వనాది తీర్థములు, నారాయణ తీర్థము, కోటీశ తీర్థము, వ్యాస తీర్ధము, ప్రభాస తీర్థము, నాగేశ తీర్థము, సంకర్షణ తీర్థము, ప్రశ్రయేశ తీర్థము, పవిత్రమగు ఐరండీ సంగమము, సువర్ణశిల తీర్థము, కరంజ తీర్థము, కామహతీర్థము, భాండీరము, రోహిణీ భవము, చక్రతీర్థము, దౌతపాపము, స్కంధ తీర్థము, ఆంగేర సతీర్థము, కోటీతీర్థము, అయోన్యాఖ్యము, అంగార తీర్థము, త్రిలోచనము, ఐందేశము, కంబుకేశము, సోమేశము, కోహనము, నర్మదా తీర్థము, అర్కతీర్థము, ఆగ్నేయ తీర్థము, భార్గవేశ్వర తీర్థము, బ్రాహ్మము, దైవము, మార్దేశము, ఆదివారాహము, కేశవ తీర్థము, రామేశము, సిద్దేశము, అహల్యా తీర్థము, కంకటేశ్వరము శాక్రతీర్థము, సౌమ్యతీర్థము, నాదేశము, తోటేశము, రుక్మిణీభవము, యోజనేశము, వరాహాశము, ద్వాదశీ తీర్థము, శివతీర్థము, సిద్దేశము, మంగలేశము, లింగతీర్థము, వారాహ తీర్థము, కుండేశ తీర్థము, శ్వేత వారాహ తీర్థము, గర్భావేశము, రవీశ్వరము, శుక్లాది తీర్థములు, హుంగార స్వామి తీర్థములు, సంగమేశ తీర్థము, నహుషేశ తీర్థము, మోక్షణ తీర్థము, పంచగోపక తీర్థము, నాగశాప తీర్థము, సిద్దేశ తీర్థము, మార్కండ తీర్థము, అక్రూర తీర్థము, కామోద తీర్థము, శూలారోప తీర్థము, మాండవ్యము, గోపకేశ్వరము, కపిలేశము, పింగలేశ తీర్థము, భూతేశ తీర్థము, పాపనాశకమగు కేదారేశ తీర్థము, కలకేశము, జాలేశము, శాలగ్రామ తీర్థము, వరాహ తీర్థము, చంద్ర ప్రభాస తీర్థము, ఆదిత్య తీర్థము, శ్రీపతి తీర్థము, హంసక తీర్థము, మూల్యస్థానము, శూలేశము, ఉగ్రతీర్థము, చిత్రదైవ తీర్థము, శిఖేశ తీర్థము, కోటి తీర్థము, దశకన్య తీర్థము, సువర్ణ తీర్థము, ఋణ మోక్ష తీర్థము, భారభూతి తీర్థము. పుంఖా తీర్థము, ముండి తీర్థము, డిండిమ తీర్థము, ఆమలేశ తీర్థము, కపాలేశ తీర్థము, శృంగ తీర్థము, ఐరండీ భవ తీర్థము, కోటి తీర్థము, లోటణేశము, తరువాత ఫలస్తుతి. దృమి జంగల మాహాత్మ్యమున, రోహితాశ్వ కధా, ధుంధుమార సమాఖ్యానము, ధుంధుమారవధోపాయము, ధుంధుమార వథ, చిత్రవహోద్భవము. చిత్రవహమహమి. చండీశ ప్రభావము. రతీశ్వరము, కేదారేశము, లక్ష తీర్థము, విష్ణుపదీ భవము, ముఖారము, చ్యవనాంధాస్యము, బ్రహ్మసరస్సు, చక్రసరస్సు, లలితా సరస్సు, బహు గోమయ తీర్థము, రుద్రావర్తము, మార్కండ తీర్థము, పాప ప్రణాశన తీర్థము, శ్రవణేశ తీర్థము, శుద్ద పట తీర్థము, దేవాంధుప్రేత తీర్థము, జిహ్వాద తీర్థ సంభవము, శివోద్చేదము, ఫలస్తుతి, విస్తృతముగా వర్ణించబడినది. ఇది అవంతీ ఖండము. వినువారికి సర్వపాపములను నశింపచేయును.
ఇక ఇపుడు ఆరవదగు నాగర ఖండమును చెప్పెదను. ఈ ఖండమున లింగోత్పత్తి సమాఖ్యానము, శుభకరమగు హరిశ్చన్డకధ, విశ్వామిత్ర మాహాత్మ్యము, త్రిశంకుస్వర్గము, హాటకేశ్వర మాహాత్మ్యమున వృత్రాసుర వధ, నాగబిల శంఖతీర్థ అచలేశ్వర వర్ణనము, అత్యంత చమత్కారమును కలిగించు చమత్కార పురాఖ్యానము, గయ శీర్షము, బాలశాఖ్యము, వాలమండము, మహ్వయము, విష్ణుపాదము, గోకర్ణము, యుగరూపము, సమాశ్రయము, సిద్దేశ్వరము, నాగసరస్సు, సప్తర్షి చరిత్రము, అగస్త్య చరిత్రము, భ్రూణనర్తము, నలేశము, భైష్మము, వైడురము, అర్కకము, శారమిష్టము, సోమనాధము, దౌర్గము, అతర్జలేశ్వరము, జామదగ్న్య వధాఖ్యానము, నైఃక్షత్రియ కధానకము, రామప్రదము, నాగపురము, షడ్లింగము, యజ్ఞభూమి, ముండీరాదిత్రికము, అర్కము, సతీపరిణయము, రుద్ర శీర్షము, యాగేశము, వాలఖిల్యము, గారుడము, లక్ష్మీశాపము, సప్తవింశసోమ ప్రాసాదము, అంబాబద్ధము, పొండుకము, ఆగ్నేయము, బ్రహ్మకుండకము, గోముఖము, లోహముష్టి, అజాపాలేశ్వరీ శానైశ్చరము, రాజవాపీ, రామేశము, లక్ష్మణేశ్వరము, కుశేశము, లవేశము, సర్వోత్తమోత్తమ లింగము, అష్టషష్టి సమాఖ్యానము, దమయంతీ త్రిజాతకము, రేవతీ తీర్థము, భక్తికా తీర్థము, క్షేమంకరీ, కేదారము, శుక్ల తీర్థ ముకారకము, సత్యసంధేశ్వరాఖ్యానము, కర్లోత్పల కథ, అటేశ్వరము, యాజ్ఞవల్క్యము, శౌర్యము, గాజేశ్వరము, వాస్తు పదాఖ్యానము, అజాగృహకధానకము, సౌభాగ్యాంధు, శూలేశము, ధర్మరాజు కధానకము, మిష్టాన్నదేశ్వరాఖ్యానము, గాణపత్యత్రయము, జాబాలి చరితము, మకరేశ కధా, కాలేశ్వర్యంధకాఖ్యానము, అప్సరస కుండము పుష్యాదిత్యము, రోహితాశ్వము, నాగరోత్పత్తి కీర్తనము, భార్గవ చరితము, వైశ్వామిత్రము, సారస్వతము, పైప్పలాదము, కంసారీశము, పైండకము, బ్రహ్మయజ్ఞ చరిత్ర, సావిత్ర్యోఖ్యానము, రైవతము, భార్తయజ్ఞము, ముఖ్యతీర్థ నిరీక్షణము, కౌరవము, హాటకేశాఖ్యము, ప్రభాస క్షేత్ర త్రయము, పౌష్కర, నైమిశ, ధర్మములను అరణ్యత్రయమ, వారాణాసీ, ద్వారక అవస్తాయను పురీత్రయము, బృన్దావన, ఖాండవ, అద్వైత నామక అరణ్యత్రయము, కల్ప, శాల, నల్గియను గ్రామత్రయము, అసి శుక్ల పితృనామక తీర్థత్రయము, శ్రీ అర్బుద రైవత నామక పర్వత త్రయము, గంగా నర్మదా సరస్వతీ యనునదీ త్రితయము అనునవి. పైన చెప్పిన త్రికములలో ఒక్కొక్క త్రికము సార్థకోటి త్రయ ఫలముగా కీర్తించబడినది. కూషికా శంఖ తీర్థము, అమరకము, బాలమండకము, హాటకేశ క్షేత్రము అను క్షేత్ర చతుష్టయము క్షేత్ర ఫలప్రదముగా చెప్పబడినది. సాంబాదిత్యము, శ్రాద్ధకల్పము, బోధిష్ఠిరము, అంధకము, జలశాయి చతుర్మాసము, అశూన్య శయన వ్రతము, మంకణేశము, శివరాత్రి, తులాపురుష దానకము, పృధ్వీదానము, వానకేశము, కపాలమోచనేశ్వరము, పాప పిండము, మాసలైంగము, యుగమానాది కీర్తనము, నివేశము, శాకంభరీ, ఏకాదశ రుద్రకీర్తనము దాన మాహాత్మ్య కథనము, ద్వాదశాదిత్య కీర్తనము ఇవియన్నీయు సవిస్తరముగా నిరూపించబడినవి. ఇట్లు నీకు నాగర ఖండమును వర్ణించితిని. ఇక ఇపుడు ప్రభాస ఖండమును చెప్పెదను వినుము.
ఈ ప్రభాస ఖండమున విశ్వేశుడు వర్ణించబడెను. పుణ్యప్రదమగు అర్కస్థలము, సిద్దేశ్వరాదీకాఖ్యానము, ఇచట విడిగా చెప్పబడినది. అగ్ని తీర్థము, కపర్దేశము, కేదారేశము, భీమ, భైరవ, చండీశ, భాస్కలేందు కుజేశ్వరములు, బుధ, గురు, శుక్ర, శని శిఖాశులు హర విగ్రహులుగా, ఇతరులను సిద్ధేశ్వరాది పంచ రుద్రులు, ఇచట వ్యవస్థితులైరి. వరారోహా, ఆజాపాలా, మంగలా, లలితేశ్వరీ, లక్ష్మీశుడు, వాడవేశుడు, ఉర్వీశుడు, కామేశ్వరుడు, గౌరీశ, వరుణేశ, దుర్వాసేశ, గణేశ్వర, కుమారేశ, చండకల్ప శకులీశ్వర నామక క్షేత్రములు వర్ణించబడినవి. తరువాత కోటీశ బాల బ్రహ్మాది సత్కధ చెప్పబడినది. నరకేశ సంవర్ణేశ నిధీశ్వర కథలు, బలభద్రేశ్వర, గంగాగణపతి కధలు, జాంబవతీ నదీ కథ, పాండుకూప కథ, శతమేధ, లక్షమేధ, కోటి మేధ కథలు, దుర్వాస అర్కఘట స్థాన హిరణ్యాసంగమ కథ, నగరార్క, కృష్ణ సంకర్షణ సముద్రముల కథ, కుమారీక్షేత్రపాల బ్రహ్మేశ కథలు వేరు వేరుగా, పింగలా సంగమేశ కథ శంకరార్క ఘటేశుల కథలు, ఋషి తీర్థ నస్టార్క త్రిత కూప కీర్తనము, సోపాన పర్లార్కన్యయ మతీ కథలు, వారాహ స్వామి వృతానము, ఛాయాలింగ గుల్పకథలు కనక నందా కథ, కుంతీ గంగేశుల కథ, చమగోద్ఛేద విదురత్రిలోకేశ కథలు, మంకణేశ త్రిపురేశ షండతీర్థ కథలు, సూర్యప్రాచీత్రిక్ష ఉమానాథ కథలు, భూద్దార శూలస్థల కథ, చ్యవనార్కేశ కథలు, అజాపాలేశ, బాలార్క కుబేరస్థలజా కథలు, ఋషితోయ కథ, సంగాలేశ్వర కీర్తనము, నారదాదిత్య కథనము, నారాయణ నిరూపణము, తప్తకుండ మాహాత్మ్యము, మూల చండీశ వర్ణనము, చతుర్వక్ర గణాధ్యక్ష కలబేశ్వర కథ, గోపాలస్వామి వకులస్వామి కథ, మరుత్తుల కథ, క్షేమార్కోన్నత విఘ్నేశ జలస్వామి కథా, కాలమేఘ రుక్మిణీ, దుర్వాసేశ్వర, భద్ర, శంఖావర్త, మోక్షతీర్థ, గోప్పదాచ్యుత పద్మ, జాలేశ్వర, హుంకారేశ్వర చండీశుల కథలు, ఆశాపురస్థవిఘ్నేశ కలాకుండ కథ, కపిలేశ కధా, జరద్దవ శివకథ, నలకర్కోటేశ్వరుల కథ, హాటకేశ్వర కథ, నారదేశ యన్తభూష దుర్గకూట గణేశ కథలు, సుపర్లా ఇలా భైరవీ భల్ల -తీర్థ భవకథా, కర్ణమాల కీర్తనము, గుప్తసోమేశ్వర కథ, బహు స్వర్ణేశ, శృంగేశ కోటీశ్వర కధ, మార్కండేశ్వర, కోటీశ, దామోదర గృహోత్కధా, స్వర్ణరేఖా, బ్రహ్మకుండ కుంతీ భీమేశ్వర కథ, మృగీకుండ సర్వస్వకథ, వస్త్రా పథ క్షేత్ర కథా, దుర్గాభిల్లేశ గంగేశ రైవత కథ, అర్బుదేశ్వర కథ, అచలేశ్వర కీర్తనము, నాగతీర్థకథ, వసిష్టాశ్రమ వర్ణనము, భద్రకర్ల మాహాత్మ్యము, త్రినేత్ర మాహాత్మ్యము, కేదార మాహాత్మ్యము, తీర్థాగమన కీర్తనము, కోటీశ్వర రూప తీర్థ హృషీకేశ కథలు, సిద్ధేశ శుక్రేశ్వర మణి కల్లేశ కీర్తనము, పంగు తీర్థ యమతీర్థ వారాహ తీర్థవర్ణనము, చన్ద ప్రభాస, పిండోద శ్రీమాతా శుక్ల తీర్థజ కథ, కాత్యాయనీ మాహాత్మ్యము, పిండారక మాహాత్మ్యము, కనఖల కథ, చక్రమానుష తీర్థ, కపిల తీర్థ అగ్నితీర్థ కధా, రక్తాను బంధజ కథ, గణేశ పార్ధేశ్వర యాత్ర యందు ఉజ్జ్వల కథ, చండీస్థాన, నాగోద్భవ, శివకుండ, మహేశ కథలు, కామేశ్వర కథ, మార్కండేయోత్పత్తి కథ, ఉద్దాలకేశసిద్దేశ గత తీర్థకథ, శ్రీదేవఖాతత్పత్తి, వ్యాస గౌతమ తీర్థముల కథ, కుల సంతార మాహాత్మ్యము రామకోటి తీర్థమాహాత్మ్యము, చంద్రోద్భేదేశాన శృంగ బ్రహ్మస్థానోద్భవము, త్రిపుష్కర, రుద్రప్రద గుహేశ్వర కథలు, అవిముక్త మాహాత్మ్యము ఉమామహేశ్వరుల కథ, మహోజా ప్రభావము, జంబూతీర్థ వర్ణనము, గంగాధర మిశ్రక కథ, ఫలస్తుతి, ద్వారకా మాహాత్మ్యమున చన్తశర్మ కధా, జాగరాద్యర్చనాది వ్రతములు, ఏకాదశీ వ్రతము, మహాద్వాదశీ వ్రతము, ప్రహ్లాదర్షి సమాగమము, దుర్వాసుని ఉపాఖ్యానము, యాత్రపక్రమ కీర్తనము, గోమత్యుత్పత్తి కథనము, గోమతీ స్నాన జన్యఫలము, చక్రతీర్థ మాహాత్మ్యము, గోమతీ సముద్ర సంగమము, సనకాది హ్రదాఖ్యానము, నృగతీర్థకధా, గోప్రచార కధా, గోపికలు ద్వారకకు వచ్చుట, గోపీసరస్సమాఖ్యానము, బ్రహ్మతీర్థాది కీర్తనము, పంచనద్యాగమాఖ్యానము, నానాఖ్యాన శివలింగ గదా తీర్థ కృష్ణపూజాది కీర్తనము, త్రివిక్రమ మూర్త్యాఖ్య కథ, దుర్వాస కృష్ణ సంకథ, కుశదైత్యవధ, ఉచ్చార విశేషార్చన జన్యఫలము, గోమతియందు, ద్వారకయందు, తీర్థాగమన కీర్తనము, కృష్ణమందిర సంప్రేక్ష, ద్వారవత్యభిషేచనము. తీర్థావాస కధా, ద్వారకాపుణ్య కీర్తనము, ఇవియన్నియు సవిస్తరముగా వర్ణించబడినవి. ఇదియే ఏడవదియగు ప్రాభాసిక ఖండము. ఈ ఖండమున సర్వోత్తమ కథలు శివమాహాత్మ్యము వర్ణించబడినవి. ఈ స్కాంద పురాణమును వ్రాసి మాఘ పూర్ణిమ నాడు. హేమ శూల సమన్వితముగా బ్రాహ్మణుని సత్కరించి దానము చేసినచో అతను శివలోకమున ఆనందమును పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధపాదమున స్కన్దపురాణానుక్రమణియను నూటానాలుగవ అధ్యాయము.
