నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

110 - ద్వాదశ మాస ప్రతి పద్ర్వత నిరూపణమ్

నారద మహర్షి పలికెను :-

ఓ మహానుభావా? పరమేష్టియగు బ్రహ్మ మరీచి మహర్షికి చెప్పిన సకల పురాణ సూత్రమును నీ నుండి వింటిని. ఇక ఇపుడు ఆయా తిధులలో క్రమముగా చేయవలసిన వ్రత విధానమును నాకు తెలుపుము. యే మాసములో యే తిధి ఏ విధానముగా ఉపాసించవలయునో ఆ పూజా విధానమంతటిని నాకుపదేశింపుము.

సనాతన మహర్షి పలికెను :

ఓ నారదా ! ప్రత్యేకముగా తిధుల వ్రతమును చెప్పెదను వినము. తిధీశానుక్రమముగా చెప్పెదను. ఈ వ్రతములు సర్వసిద్ది ప్రదములు. చైత్రమాసమున శుక్లపక్షమున మొదటి దినమున సూర్యోదయ కాలమున బ్రహ్మ జగత్తును సృజించెను. సంవత్సరాదిలో