నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

42 - జగదుత్పత్తివర్ణనమ్

శ్రీ నారదమహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తు ఎవరి వలన సృష్టించబడినది. ప్రలయకాలయమున ఎవరిలో లీనమగును. దానినంతటిని నాకు తెలుపుము. సాగరాకాశశైల మేఘ భూమ్యగ్ని వాయువులతో కూడిన ఈ లోకమును ఎవరు నిర్మించిరి. భూతములను వర్ల విభాగమును ఆచార అనాచారములను ధర్మాధర్మ విధానములను ఎట్లు సృజించిరి. జీవించు వారిలో జీవుడు ఎట్టిపాడు? మరణించినవారు ఎచటికి వెళ్ళేదరు? ఇహ లోకము నుండి పర లోకము వరకు. అంతటిని నాకు చెప్పుము.

సనందన మహర్షి పలికెను :- ఓ నారద మహర్షి ! పూర్వము ప్రశ్నించిన భరద్వాజమహర్షికి భృగుమహర్షి చెప్పిన పురాతనశాస్త్రమును ఇతిహాసమును చేప్పెదను. వినుము, కైలాసశిఖరమున గొప్ప తేజస్సుచే ప్రకాశించుచు కూర్చొనియున్న భృగు మహర్షి సమీపించి భరద్వాజమహర్షి ఇట్లు ప్రశ్నించెను.

భరద్వాజ మహర్షి పలికేను :- ఓ మహర్షీ ! జీవుడెప్పుడూ నానాయోనులందు ఎట్లు తిరుగుచుండును? జీవునికి సంసారము నుండి ఎట్లు ముక్తి లభించును? శ్రీమన్నారాయణుడే బ్రహ్మరూపముచే సృష్టించును. ఆ బ్రహ్మ, నారాయణుడు సేవక సేవ్య రూపముతో ఏల యుందురు? ప్రలయ కాలమున చరాచరములన్నియు ఎవనిలో లీనమగును? లోకనాధుడగు ఆ ప్రభువు నిర్గుణుడు నిరంజనుడు అనిర్దేశ్యుడు అప్రతర్కుడు అని ఎట్లు ఎవరిచే తెలియబడును? పరమాత్మ కాలశక్తి, దురన్వయుడు అతర్క్యచరితుడుగు పరబ్రహ్మను వేదములెట్లు ఆదరముతో స్తుతించును? జీవుడు జీవత్వమును లంఘించి ఎట్లు బ్రహ్మత్వమును పొందును? ఈ విషయమును తెలియగోరుచున్నాను. ఓ కృపానిధీ నాకు తెలుపుము. ఇట్లు భరద్వాజ మహర్షి అడుగగా బ్రహ్మ సంకాశుడగు భృగు మహర్షి దొనినంతటిని చెప్పెను.

భృగుమహర్షి పలికెను :- పూర్వము మహర్షులచే మానసుడని చెప్పబడిన వాడు. ఆద్వన్తములు లేనివాడు. అతనీ నుండి అజరామరము, శాశ్వతము అక్షయము అవ్యయము అగు అవ్యక్తము ప్రభవించెను. అవ్యక్తము నుండియే సర్వ భూతములు పుట్టుచున్నవి, మరణించుచున్నవి. ఆ అవ్యక్తము మొదట మహత్తత్వమును సృజించెను. ఈ మహత్తత్త్వమునకే సర్వభూతధరుడు ప్రభునగు ఆకాశమను పేరు. ఆకాశమునుండి జలము, జలము నుండి అగ్ని వాయువులు పుట్టెను. అగ్ని వాయువుల సంయోగమువలన భూమి పుట్టెను. అంతట పరబ్రహ్మ తేజోమయమగు పద్మమును సృష్టించెను. ఆ పద్మమునుండి వేదస్వరూపుడు. విధియను బ్రహ్మ పుట్టెను. అతనికే సర్వభూతాత్మ భూతములను చేయు అహంకారమని ప్రసిద్ధి. ఆ మహాతేజస్కునకే బ్రహ్మ యని పేరు. పంచభూతములు పంచధాతువులు, పర్వతములు అస్థి సంఘములు, భూమిమేదో మాంసములు, సముద్రములు రుధిరము. ఆకాశము ఉదరము, వాయువు నిశ్వాసము. తేజోమయమగు అగ్ని క్రింది శిరస్సు, అగ్నీషోములు చంద్రసూర్యులు బ్రహ్మకు నేత్రములు. ఆకాశము ఊర్ద్వశిరము, క్షితిపాదములు, దిక్కులు భూజములు. ఆ బ్రహ్మ సిద్దులచే తెలియ శక్యము కానివాడు చింతించశక్యమైనవాడుకాడు. ఆ బ్రహ్మయే భగవంతుడగు విష్ణువు అనంతుడని ప్రసిద్దుడు. సర్వభూతాంతర్యామి అజ్ఞానులకు తెలియరానివాడు అహంకారమును సృజించిన వాడే సర్వప్రాణులను సృజించెను. ఆ విష్ణువు నుండే ఈ విశ్వమంతయు పుట్టినది. ఇట్లు నీవడిగిన దానిని చెప్పితిని.

భరద్వాజ మహర్షి పలికేను :- ఆకాశమునకు, దిక్కులకు, భూమికి, వాయువునకు ఏయే పరిణామము లేర్పడినవో నాకు తెలుపుము.

భృగుమహర్షి పలికెను :- సిద్దదైవతములచే సేవించబడు ఈ ఆకాశము అనంతము, సుందరము, నానాశ్రయము. దీని అంతము తెలియ శక్యము కానిది. ఆకాశము యొక్క ఊర్ద్వ పరిమాణమును క్రిందుగా నున్న సూర్యచంద్రులు చూడజాలరు. సూర్యాగ్ని సమతేజస్కులు స్వయంప్రకాశులగు దేవతలు కూడా ప్రసిద్ధమైన కాంతి గల ఆకాశాంతమును చూడజాలరు. ఆకాశము దుర్గమము అనంతమగుటయే దీనికి కారణము. పై పై భాగములు కూడా స్వయంప్రకాశకములగు తేజో రాశులచే ఈ ఆకాశము నిరుద్ధమైయున్నది. కావుననే దేవతలు కూడా దీనిని. కొలువజాలరు. పృథివి చివర సముద్రము, సముద్రముల చివర తమస్సు, తమస్సు. చివర జలము, జలము చివర అగ్ని యుండును. రసాతలము చివర జలము, జలము చివర పన్నగాధిపులు, వారి తరువాత మరల నాకాశము, ఆకాశము చివర మరల జలము. ఇట్లు భగవంతునికి జలమునకు అగ్నిమారుతములకు అంతమును దేవతలు కూడా తెలియజాలరు. అగ్నిమారుత జలముల భూమి యొక్క వర్ణములు ఆకాశ సదృశములుగా కనపడును. కానీ తత్త్వదర్శనము వలన భేదము కనపడును. వివిధ శాస్త్రములలో మునులు దర్శించిన విధముగా త్రైలోక్యములలో సొగరమునందు విధించబడిన ప్రమాణము అదృశ్యము అగమ్యము. కావున ఆ ప్రమాణము నెవ్వరు చెప్పగలరు?. సిద్దుల దేవతల పరిమాణమును నిర్ణయించు ఆకాశము అగణ్యము అంతము లేనిది కావున అనంతమని ప్రసిద్ధిచెందినది. ఈ నామధేయము మానసుని స్వరూపమునకు అనురూపము. అనంతము యొక్క దివ్యరూపము పెరుగుచుండును, తరుగుచుండును. అనంతుని వంటి వాడు మరొకడున్నపుడు మాత్రమే అనంత స్వరూపము తెలియనగును. అంతట పద్మము నుండి సర్వజ్ఞుడు మూర్తిమంతుడగు ప్రభువు సృజించబడెను. ఇతడే ధర్మ స్వరూపుడగు మొదటి ప్రజాపతియగు బ్రహ్మ, ఇతనికి సాటి మరియొకడు లేడు.

భరద్వాజ మహర్షి పలికెను :- మొదట పుష్కరము పుట్టినది కావున పుష్కరమే జేష్టము కావలయును. కాని తాము బ్రహ్మ పూర్వజుడని చెప్పితిరి. కావున నాకు మరల సందేహమే కలుగుచున్నది.

భృగుమహర్షి పలికెను :- మానసుని స్వరూపమే బ్రహ్మ త్వమును పొందినది. ఆ బ్రహ్మకు ఆసనము కొఱకు ఏర్పరిచిన పృథివియే పద్మమనబడుచున్నది. పద్మము మధ్యనున్న నాళమే ఆకాశము వైపు పెరిగిన మేరుపర్వతము. ఆమేరు మధ్యనుండి ఈ బ్రహ్మ జగత్తును సృష్టించును.

భరద్వాజ మహర్షి పలికెను :- మేరు మధ్యన ఉన్న బ్రహ్మ మేరువునకు వెలుపల పలువిధములగు ప్రజాసృష్టినెట్లు చేసెను

భృగుమహర్షి పలికెను :- మానసబ్రహ్మ మనసుచే ప్రజాసర్గమును చేసెను. ప్రాణులరక్షణ కొఱకు మొదట జలమును సృజించెను. అన్ని ప్రాణులకు ప్రాణ భూతములు, ప్రాణులను పెంచునది, జలమే. జలము లేనిచో ప్రాణులన్నియూ నశించును. ఈ ప్రపంచమంతయూ జలముచే ఆవరించబడియున్నది. పృథివి, పర్వతములు, మేఘములు, మూర్తిమంతములగు పదార్థములన్నియూ వారుణములే, జలస్తంభనచే ఏర్పడినవి.

భరద్వాజ మహర్షి పలికెను :- జలము అగ్ని మారుతములు పృథివి ఎట్లు సృష్టించబడినవి?

పూర్వకాలమున బ్రహ్మ కల్పమున బ్రహ్మరుల సమాగమము వారికి లోకముల సృ షెట్లు జరిగెననేడు సందేహము కలిగెను. బ్రహ్మర్షులందరు నిశ్చలులై మౌనముగా ధ్యానమనవలంబించిరి. ఆహారమును స్వీకరించక పట్టుదలతో దీవ్యములగు నూరు సంవత్సరములు నిలిచిరి. అప్పుడు వారికందరికి బ్రాహ్మీవాక్కు చెవులపడెను. ఆకాశము నుండి సరస్వతీదేవి ఆవిర్భవించెను. నిశ్చలము అనంతమయమైన ఆకోశము మొదట నుండెను. సూర్యచంద్ర వాయ్వాది శూన్యమై నిద్రించిన దాని వలే నుండెను. తమస్సున ఉత్కృష్టమైన తమస్సు వలె ఆకాశము నుండి జలము పుట్టెను. సలిల పీడనము వలన వాయువు కలిగెను. ఛిద్రరహితమైన భవనము ఎట్లు నిశ్శబ్దముగా నుండును. అదే భవనము నీటితో నిండునపుడు వాయువు శబ్దమును కలిగించును. అట్లే సలిలిసంరోధము వలన నిరంతరమైన ఆకాశము నుండి చివర నున్న సముద్రములను భేదించుకొని ధ్వనించువాయువు సముత్పన్నమగును. సముద్రసంఘరణ వలన కలిగిన వాయువు అన్నిటిలో సంచరించును కాని ఆకాశ స్థానమును పొంది శాంతించదు. ఆ వాయుజలసంఘర్షము వలన ఉజ్వలమైన ప్రకోశము కల మహాబలమగు ఊర్ధ్వశిఖలు గల అగ్ని ఉత్పన్నమయేను. అగ్నిచే తిమిరము నశించును. వాయువులో కలిసిన అగ్ని ఆకాశము నుండి జలమును ఆవిర్భవింపచేయును. ఆ జలము అగ్ని వాయు సంపర్కము వలన ఘనత్వమును పొందును. ఆ ఘనపదార్థము ఆకాశము నుండి పతనమై అంతరాలముగ స్నేహము వలన నిలుచును. ఆ ఘనీ భూత పదార్థము సంఘాత రూపమును పొంది భూమిత్వమును పొందును. సర్వగంధములకు సర్వరసములకు స్నేహములకు ప్రాణులకు ముఖ్య కారణము ఈ భూమియే అని తెలియును. భూమినుండియే అన్నియూ పుట్టును.

మానసుడు పంచ ధాతువులను సృజించెను. ఈ పంచ ధాతువులకే మహ భూతములను నామ మేర్పడెను. తరువాత లోకములనావరించెను. మహామతియైన మానస బ్రహ్మ వేల భూతములను సృజించెను కదా ! సృజించిన తరువాత వాటియందు భూతత్వమెట్లు సంభవించును?

భృగుమహర్షి పలికెను :- అమితములు మహాష్టములగు భూతములు సంభవించును. కావుననే వాటికి మహాభూత శబ్దముచే వ్యవహారము కలిగినది. చేష్ట వాయువు, శబ్ధమాకాశము, వేడి అగ్ని, ద్రవము సలిలము, సంఘాతరూపము పృధివి. కావున ఈ శరీరము పొంచభౌతికము. కావుననే స్థావరజంగమాత్మకమగు ఈ విశ్వమంతయు పంచభూతములతో కూడినదే. శ్రోత్రము, ఘ్రాణము, రసము, స్పర్శము, దృష్టి అను అయిదు ఇంద్రియములనబడును.

భరద్వాజ మహర్షి పలికెను :- స్థావర జంగమములన్నియూ పాంచభౌతికములని చెప్పుచున్నారు కదా ! కాని స్థావరముల శరీరమున పంచ ధాతువులు కనపడుట లేదు కదా ! ఊషరహితములకు, చేష్టారహితములకు, ఘన పదార్థములకు వాస్తవముగా వృక్షముల శరీరమున పంచధాతువులు కనపడుటలేదు కదా ! వృక్షములు వినలేవు, చూడలేవు, గంధమును, రసమును తెలియజాలవు. స్పర్శను కూడా తెలియవు. కావున వృక్షములు పాంచ భౌతికములెట్లగును? వృక్షములు ద్రవములు కావు, అగ్నిమయములు కావు, భూమికావు వాయు రూపములు కావు. అప్రమేయాకాశరూపములు కావు. కావున వృక్షములకు పాంచ భౌతికత్వము లేదు.

భృగు మహర్షి పలికేను :- ఘన స్వరూపములైన వృక్షములలో కూడా ఆకాశమున్నది. సంశయము లేదు. వృక్షములకు పూవులుపూయుట పండ్లు కాయుట నిత్యము కనపడుచునేయున్నది. వేడివల్లనే ఆకులు. చర్మ, పండు, పూవువాడిపోవును పోడుచున్నది రోలుచున్నది కావున వృక్షములకు స్పర్శ ఉన్నది. వాయునుచే అగ్నిచే ఈ పిడుగుచే ఏర్పడిన ధ్వనులే పండ్లు పూవులు రాలిపడుచున్ద్నవి. ధ్వనిని శ్రోత్రములచే మాత్రమే గ్రహించవలయును. ధ్వనిచే గొలుచున్నవి కావున చేట్లు శబ్దమును వినుచున్నవి. తీగలు చెట్టును చుట్టుకొని ఆంతటా పొకును, ముందుకు సొగవలయునన్న దృష్టి కావలయును కదా. తీగలు పొకుచున్నవి కావున చెట్లు చూచుచున్నవి. పవిత్రములైన అపవిత్రములైన గంధములచే, ధూపములచే వృక్షములు రోగరహితములుగా పుష్పితములుగా మనగలుగుచున్నవి కావున వృక్షములు వాసన చూచుచున్నవి. సుఖమును దుఃఖమును వాడుట విప్పారుటలచే అనుభవించుచున్నవి. నరికిన మరల చిగుర్చుచున్నవి. కావున వృక్షములకు ప్రాణమున్నది. అచైతన్యము లేదు. ప్రాణమున్నది కావున జలమును గహించుచున్నది, గ్రహించిన జలమును జీర్ణించుకోనుచున్నది. జీర్ణమగుచున్నది కావున వాయువును గ్రహించుచున్నది, తీసుకొనిన ఆహారమును జీర్ణము చేసుకొనుచున్నది. కావుననే ఆహారము మాగినపుడు తరుగుట పెరుగుట సంభవించుచున్నది. అన్ని జంగమముల శరీరములలో ప్రత్యేకించి పంచధాతువులు భిన్నములుగా ఉండును. పంచధాతువులచే శరీరము చేష్టలను కలిగియుండును. చర్మము, మాంసము, అస్తులు, మజ్జ (కొవ్వు) స్నాయువు అను అయిదింటి సమూహము పృథివీమయమగు శరీరమున ఉండును. తేజస్సు, అగ్ని, క్రోధము, నేత్రములు, ఊష్మము అను అయిదింటిని శరీరమున అగ్ని కలిగించును. శ్రోత్రము, ఘ్రాణము, ఆస్యము, హృదయము, కోష్ఠము అను అయిదు ధాతువులు ఆకాశమువలన శరీరమున సంభవించును. శ్లేష్మము, పిత్తము, స్వేదము, వసా, రక్తము అని జలము అయిదు విధములుగా శరీరముననుండును. ప్రాణి ప్రాణముచే తృప్తి పొందును. వ్యానముచే తృప్తిని బయలుపరుచును. అపానము అధోదేశమునుండి వెడలును. సమానము హృదయముననుండును. ఉదానముతో గాలి పీల్చుకొనును. ఇట్లు అయిదు వాయువులు శరీరమున వ్యాపించియుండును. దేహి భూమినుండి గంధగుణములను, జలమును రసములను గ్రహించును. ఇపుడు గంధగుణములను విస్తరముగా చెప్పెదను వినుము. ఇష్టము, అనిష్టము, మధురము, కటువు, నిర్దారి, సంఘాతము, స్నిగ్ధము, రూక్షము, విశదము అని పొర్థివగంధములు తొమ్మిది విధములు. నేత్రములచే వెలుగును చూచును, వాయువుచే స్పర్శను తెలియును, శబ్ద స్పర్శరూపరసములు గుణములనబడును. ఇక ఇపుడు రస జ్ఞానమును 'చెప్పుచున్నౌను వినుము. జ్ఞానులగు ఋషులు బహువిధరసములను చెప్పియున్నారు. మధురము, లవణము, కారము, వగరు, పులుపు, చేదు అను ఆరు రసములు జలమయములు. శబ్దస్పర్శరూపములు జ్యోతిర్గుణములందురు. వెలుగే రూపములను చూచును. ఆ రూపము. బహువిధము, పొట్టి, పొడుగు, లావు, నాలుగుమూలము, అణువు, వృత్తము, తెలుపు, నలుపు, ఎఱుపు, నీలము, పసుపుపచ్చ, అరుణము, కఠినము, ముదురు, లేత, నునుపు, మెతన, భయమును కలిగించునది అని జ్యోతియొక్క రూపగుణములు పదునోరు విధములు. ఆకాశమునకు ఒక ఓ గుణము. అదియే శబ్దము. ఇపుడు శబ్దములయొక్క వివిధ స్వరూపములను విస్తరముగా చెప్పెదను, షడ్జ, ఋషభ, గాంధార, మధ్యమ, ధైవత, పంచమ నిషాదములని ఏడు విధములగు  శబ్దగుణములు ఆకాశ సంభవములు. ఈశ్వర రూపముగా అంతట శబ్దమున్నను, పటహ, మృదంగ, భేరి, శంఖ, మేఘ రధాదులయందు కలుగు ధ్వని ఆకాశసంభవమే, వాయుగుణము స్పర్శ. స్పర్శ పలువిధములుగా నుండును. ఉష్ణ, శీత, సుఖ, దుఃఖ, సిద్ధ, విశద, కఠిన, మృదు, శ్రేక్ష, లఘు, గురువులు  అనునవి శబ్దస్పర్శములు రెండింతలు వాయుస్పర్శలు. ఇట్లు వాయుగుణమగు స్పర్శ పదకొండు విధములు. ఈ పోయుగుణములతో కలిసిన శబ్దము ఆకాశమువలన జనించును. సంఘర్షమువలన, సంఘర్షము లేక కూడా కలుగుట శబ్దముయొక్క విషమగతి. ఇట్లు పంచధాతువులచే ధాతువులు వృద్ధి చెందించబడును. శరీరధారులయందు నీరు నిప్పుగాలి ఎప్పుడూ జాగరూకతతో నుండును, శరీరమునకు ఇవియే మూలములు. ప్రాణములను వ్యాపించియుండును. పార్ధివధాతువును పొందుటచే బలము గలవాడై చేష్టలు చేయును, శిరోస్థానముననున్న అగ్ని శరీరమును పరిపొలించుచుండును. ప్రాణము శిరమున వాని అగ్నిలోకాని నివసించుచు తిరుగుచుండును. ఆ ప్రాణమే ఆత్మరూపముగా సనాతన పురుషునిగా ఉండును. మనస్సు బుద్ది అహంకారము భూతములు విషయములు అన్నియూ అతనే. ఇట్లు శరీర అంతట ప్రాణములచే పరిపాలించబడుచుండును, ఉపస్థమూలమును గుదమున ఉన్న అగ్నిని ఆశ్రయించు అపానము మూత్ర పురీషములను గ్రహించును, విసర్జించును, ప్రయత్నమునందు, కర్మలయందు, నియమములందు మూడింటియందు ఒకటిగా నుండునది ఉదానమనబడును. మనుష్య శరీరములలోని అన్ని సంధులలోనుండు దానిని వ్యానమందురు. బాహువులలో విస్తరించియున్న అగ్ని సమాన వాయువుచే ప్రేరేపించబడి రస అన్నాది దోషములను నివారించుచుండును. అపాన ప్రాణముల మధ్యమున ప్రాణాపానములచే చక్కగా కలిసి అధిష్టానమును చక్కగా పాకము చేయును. ఆస్యమునుండి పొయువువరకూ చివరి గుదమువరకు వ్యాపించియున్న అగ్ని, వాయువుల సంయోగమువలన రేతస్సు జనించును. దానినుండి దేహిద్వారములు ఏర్పడును. ద్రోణముల సన్నిహితముచే సన్నిహిత వ్యాధి ఏర్పడును. ఊష్మమే అగ్ని. ఈ అగ్నియే అన్నమును, జీర్ణము చేయును. అగ్ని వేగముతో తిరుగుచున్న ప్రాణము గుదాంతమున త్రిప్పిపంపబడును. అట్లు ఊర్ధ్వభాగమునకు వచ్చి అగ్నిని ప్రజ్జ్వలింపచేయును. నాభికి క్రింది భాగమున పక్వాశయముండును, నాభికి పైభాగమున ఆమాశయముండును. శరీరముయొక్క ప్రాణములన్నియు నాభిమూలమున నిలిచియుండును. హృదయమునుండి పైకి, క్రిందికి అడ్డముగా ప్రసరించియున్న నొడులు అన్నరసములను దశ ప్రాణముల బలముచే వహించుచుండును. ఈ నాడీ మార్గముననే యోగులు పరమపదమును చేరెదరు. వీరు శ్రమను బాధను జయించి సమవర్తులై ధీరులై శిరోభాగమున ప్రాణములను నిలిపి పరమధామమును చేరెదరు. ఇట్లు అన్ని ప్రాణులలో నియమముగా నుండు అగ్ని ప్రాణాపానాదులలో స్థాలిలో ఉంచిన పదార్థమువలె చక్కగా నిలిచి ప్రవహించుచు పెరుగుచు దేహిని చేష్టామయుని చేయును.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున భృగుభరద్వాజసంవాదమున జగదుత్పత్తి వర్ణనమను నలుబది రెండవ అధ్యాయము సమాప్తము.