నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

75 -  దీపవిధినిరూపణమ్

సనత్కుమార మహర్షి పలికెను : ఇక హనుమంతుని దీపవిధిని సరహస్యముగా చెప్పెదను. ఈ విధిని తెలిసిన వారు సిద్ధిని పొందెదరు. దీప పాత్ర ప్రమాణము తైలమానము, ద్రవ్యప్రమాణము ఈ మూడింటిని మానమందురు. స్థానభేదము మంత్రము, దీపదానమంత్రమును గూర్చి వివరించేదను. పూనూనెచే దీపముంచినచో సర్వాభీష్టప్రదము. సంపదను పొందుటకు నువ్వుల నూనెచే ఉంచవలయును. ఇతరులను వశపరుచుకోనుటకు అవిశనూనెచే దీపముంచవలయును. రోగనాశమునకు ఆవనూనె, మారణకర్మకు రాజికలైలము కొని విభీతకతైలముకొని, ఉచ్చాటనలో కరంజతైలము, విద్వేషమున ఇప్పనూనెచే ఉంచవలయును. ఈ తైలములు లభించనిచో నువ్వులనూనె ప్రశస్తము. గోధుమలు, నువ్వులు, మినుములు, పెసలు, తండులములు ఈ అయిదు ధాన్యములు హనుమన్నిత్యదీపవీధిలో ఉపయోగించవలయును. ఈ అయిదు ధాన్యముల పిండి ఉత్తమముగా పేర్కొనబడినది. ఇట్లు దీపముంచుటలో ఈ పిష్టములను వాడుట సర్వాభీష్టప్రదమని చెప్పబడినది. వశమును చేసుకొనుటకు బియ్యపుపిండి, మారణకర్మకు మినుపపిండి, ఉచ్చాటనకు నల్లనువ్వుల పిండి, దేశాంతరమునకు వెళ్ళిన వాడు వచ్చుటకు గోధుమ బియ్యపు పిండి, మోహనమున ఆఢకపిష్టము, విద్వేషమున ఉలువపిండి, యుద్ధమున కేవలము మినుములు దీపపాత్రలో ఉపయోగించవలయును. సంధి విషయమున మూడు పిష్టములను, సంపద కొఱకు కస్తూరిభవమును వాడవలయును. ఏలా లవంగకర్పూర కస్తూరీ భవములను కన్యా ప్రాప్తికి, రాజవశ్యతకు, స్నేహమునకు ఉపయోగించవలయును. ఈ వస్తువులు లభించనిచో పంచధాన్యములు ఉత్తమములు. ఎనిమిది పిడికిళ్ళు కించిత్ అగును. ఎనిమిది కించిత్తులు పుష్కలము. నాలుగుపుష్కలములు ఆడకమనబడును. నాలుగాఢకములు ద్రోణమగును. నాలుగు ద్రోణములు భారీయగును. నాలుగు భారీలు ప్రస్థమగును. ఇచట ఇంకొక విధముగా మానము చెప్పబడినది. రెండు పలములు ప్రస్పతము. రెండు ప్రసృతములు కుడవము. నాలుగు కుడవములు ప్రస్థము. నాలుగు ప్రస్థములు ఆడకము సోలుగాఢకములు ద్రోణము. నాలుగు ద్రోణములు ఖారీ. ఈ క్రమమున షట్కర్మ సంభవమగు పాత్రయందు మానములను తెలియవలయును. అయిదు, ఏడు, తొమ్మిదిగా యథాక్రమముగా ఈ ప్రమాణములుండును. సుగంధ విషయమున మాన నియమముండదు. అభిరుచికి అనుగుణముగా తెలియవలయును. నిత్యపాత్రయందు వత్తిని బట్టి తెలనియమముండును. సోమకారమున ఆ ధాన్యమును నీటితో తడుపవలయును. తరువాత కుమారీ హస్త పోషణప్రమాణము తెలియవలయును. అనగా కుమారీ హస్తములచే విసరిన ఆ పిండిని ఈ నదీతోయముచే ముద్దగా చేసి శుద్ధపాత్రలో నుంచవలయును. అపుడు పరిశుద్దుడై ఏకాగ్రమనస్కుడై దీపపాత్రను సిద్ధము చేయవలయును. దీపపాత్ర వెలుగుచుండగా హనుమత్కవచమును పఠించవలయును. పరిశుద్ధమైన భూమియందుంచి మంగళవారమున దీపదానముగావించవలయును. సాధ్యనామముతో కూడిన మాలామంత్రవర్ణముల సంఖ్యలో వత్తియందు దొరములుండవలయును. లేదా ఆ వర్ణములలో ముప్పదియవ భాగమునుంచవలయును. వార్యము గొప్పదైనపుడు మొత్తముగా నుంచవలయును. నిత్యమగు సామాన్య విశేషకార్యములందుకూడ తుల్యర్తులుండవలయును. కూటగమనగా ఏకాదశ సంఖ్య. దీప పాత్ర విషయమున నియమములేదు. మార్గమున నున్నపుడు ఇరువదియొక్క తంతువులుండవలయును. హనుమంతునికి దీపదానము చేయునపుడు ఎఱ్ఱనిదారము నుంచవలయును. ఉచ్చాటన విషయమున కృష్ణసూత్రము, ద్వేషమున అరుణ సూత్రము, మారణకర్మలోకూడా అరుణసూత్రము నుంచవలయును. గురుకొర్యమున పదకొండుపలముల తైలమునుంచవలయును. నిత్య కర్మయందు పంచపలముల తైలమును, లేదో మనసునకు తోచినంత యుంచవచ్చును. హనుమంతుని ప్రతిమ సన్నిధిలో కాని, శివాలయమున కాని, నిత్య నైమిత్తిక స్థలములలో కాని దీపదానము చేయవలయును. ఈ విషయమున హనుమంతుని సంబంధమున కొంత విశేషము గలదు. దానిని చేప్పెదను. హనుమంతుని ప్రతిమ ముందు సంతోషముచే గ్రహ భూతగ్రహ విషయమున చతుష్పథమున షట్పాత్రలందు దీపప్రదాపనము చేప్పబడినది. హనుమంతుని సన్నిధిలో, స్పొటిక లింగమున, శాలగ్రమసన్నిధిలో నాసొభోగసంపదల కొజుకు హనుమంతునికి దీపదానము విధించబడినది. విఘ్నములు మహాసంకటములు నశించుటకు గణేశసన్నిధిలో, ఘోరమగు విషవ్యాధి భయమున హనుమంతుని సన్నిధిలో దీపదానము చెప్పబడినది. వ్యాధిలో, నష్టము జరిగినపుడు, దుష్టులదృష్టి తగిలినపుడు చతుష్పధమున దీపదానముగావించవలయును. బంధముక్తికి రాజద్వారమున కానీ కారగారమున కాని దీపదానము చేయవలయును. సర్వకార్య సిద్ధికోటకు అశ్వత్థామూలమున కాని వటవృక్షమూలమున కాని దీపదానము గావించవలయును. వశీకరణలో, భయమున, వివాదమున, వేశ్మ సంగ్రమ సంకటములందు, ద్యూతమున, దృష్టిస్తంభనమున విద్వేషమున మారణమున, మృతకోత్తాపనమున, ప్రతీమాచాలనమున విష ప్రయోగమున, వ్యాధి యందు, జ్వరమునందు, భూతగ్రహముల విషయమున, కృత్యావిమోచనమున, క్షతగ్రంధియందు, మహారణ్యముమన దుర్గమున, వ్యాఘగజాది క్రూర జంతువుల విషయమున, బంధవిమోక్షణమున, పధిగమనమున, దుస్థానమున, రాజమోహనమున, ఆగమమున, నిర్గమమున రాజద్వారమున దీపదానము ప్రశస్తముగా చెప్పబడినది. ఈ విషయమున విచారించవలయున పనిలేదు. పదకొండు కొని ఇరువదియొకటి కాని పిండి ముద్దలు చేసి మూడు భాగములు చేసి నలుబది రోజులు చేయుట. ఒక పద్ధతి. పంచ,సప్త,నవ అనునది లఘమౌనము. క్షీరముచేకొని, దధికానని, నవనీతముచేకొని, గోమయముచేకొని దీపదాననిషయమున హనుమంతుని దక్షిణాభిముగా చేసి ఋకవిన్యస్త పాదుని, కిరీట వీరాజితునిగా భిత్తియందు కాని, పటమునందు కాని, పీఠమున కాని హనుమంతుని చిత్రమును లిఖించి మాలామంత్రముచే దీపదానము చేయవలయును. ద్వాదశాక్షర విద్యచే నిత్యదీపముంచవలయును. దీపదానమున నున్న విశేషమును తెలియును. షష్ట్యాది యందు ద్వితీయాదియందు ఈ దీపమును గ్రహీంచుము. అని పలుకవలయును. కూటాదులయందు నిత్యదీపవీధియందు ద్వాదశాక్షరమంత్రమును పఠించవలయును. ఆయా కార్యములందు మాలామంత్రముచే దీపదానమును చేయవలయును. గోమయముచే అలికిన భూమియందు రేఖా సమన్వితముగా షట్కోణమును అష్టదలమును లిఖించవలయును. షట్కోణములందు బీజయుక్త షడంగములను లిఖించవలయును. ఆమధ్యలో సౌమ్యుడగు మారుతిని వ్రాసి పూజించి, షట్కోణములందు షడంగములను సొమములను పూర్వోక్తవిధిగా వసుపత్రములందు క్రమముగా ఈ ఎనిమిది మంది వానరులను పూజించవలయును. సుగ్రీవుని, అంగదుని, సు షేణుని, నలును, నీలుని, జాంబవంతుని, ప్రహస్తుని, సువేషుని చక్కగా పూజించి తరువాత షడంగ దేవతను పూజించవలయును. మొదట వాయుపుత్రుని, తరువాత జానకీజీవనుని, రామదూతను, బ్రహ్మాస్త్రనివారకుని దేశకాలసంకీర్తనము చేసి చక్కగా పూజించవలయును. కుశోదకమును తీసుకొని దీపమంత్రమును పఠించవలయును. ఉత్తరాభిముఖుడై జపించి సాధించవలయును. ఆ మంత్రమును పదకొండు మార్లు జపించి జలమును భూమిమీద విడువలయును. తరువాత అంజలిబద్దుడై శక్త్యను సారముగా జపించవలయును. ఉత్తరాభిముఖముగా నున్న ఈ దీపరాజులు నా కోరికలు తీరునట్లు చేయుము. ఇట్లు పదమూడు ద్రవ్యములను గోమయము, మృత్తికా, మషీ, లత్తుక, దరదము, రక్త చందనము, చందనము, తేనె, కస్తూరి, దధి, క్షీరము, నవనీతము, ఘృతము వీటిని ఉపయోగించవచ్చును. గోమయము గోభవము, మహిషీ భవము అని రెండు విధములు. నశించిన ద్రవ్యప్రాప్తికి మాహిష గోమయమునుపయోగించవచ్చును.

దేశాన్తరము వెళ్ళినవాడు చాలా దూరము నుండి రావలసి యున్నపుడు, మహా దుర్గమును రక్షించవలసియున్నపుడు, బాలాదులను రక్షించవలసి యున్నపుడు, చోరాదుల వలన కలుగు భయమునను తొలగించవలసియున్నపుడు, స్త్రీలను వశము చేసుకొనవలసి యున్నపుడు గోమయము ప్రశస్తము. గోమయమును భూమి మీద పడిన తరువాత గ్రహించరాదు. ఆకాశమున నుండగనే పాత్రలో తీసుకొనవలయును. శ్వేతము, పీతము, - అరుణము, అసితము అని మృత్తిక నాలుగు విధములు. గోపీచందనము, హరితాలము, గైరికము, మషి, లాక్షారసోద్భూతము వర్ణములు విశిష్టములు. ఇతరములు స్పష్టములే. గోపీచందనముచే చతురస్ర గృహమును లిఖించి, ఆ గృహమధ్యమున మాహిషగోమయముచే హనుమంతుని మూర్తిని చేసి క్రోధభీజమును పుచ్చమునను సావధానముగా లిఖించి, తైలముచే స్నానము చేయించి, గుడముచే తిలకధారణ చేసి శాలనిర్యాససంభవమగు ధూపమును పద్మ సమముగా చేసి, అయిదు వత్తులచే తైలదీపమునుంచి, దధ్యోదనమును నైవేద్యము చేసి, మూడు వారములు కంఠదేశమున శేషవిషమునుచ్చరించుచుండవలయును. ఇట్లు చేసినచో నష్టములగు గేదెలు, గోవులు దాసదాసీజనములు త్వరలో లభింతురు. చోరాది దుష్టులవలన సర్పాదులవలన భయము కలిగినపుడు తాలముచే నాలుగు ద్వారములు గల గృహమును లిఖించి పూర్వద్వారమున గజమును, దక్షిణ ద్వారమున మహిషమును, పశ్చిమద్వారమున సర్పమును, ఉత్తరమున వ్యాఘము ఏర్పరిచి, ఇట్లే క్రమముగా ఖడ్గమును కురికను, దండమును ముదర్గమును లిఖించి, మధ్యలో మాహిష గోమయముచే మూర్తిని ఏర్పరిచి డమరు హస్తము చకితాక్షిని ప్రయత్నముచే ఏర్పరిచి, పాలచే స్నానము చేయించి, రక్త చందనముచే అనులేపనపనము గావించి, జాజిపూవులచే పూజించి శుద్ద ధూపమును కల్పించవలయును. నేతిదీపమునుంచి పాయసాన్నమును నివేదన చేయవలయును. దీప కేంద్వొడ్యమగు గగనమును శాస్త్రమును ముందు జపించవలయును. ఇట్లు ఏడు దినములు చేసినచో మహాభయము నుండి విముక్తుడగును. ఈ రెండు విధానములను మంగళవారమున ప్రారంభించవలయును. శత్రు సైన్య భయము కలిగినపుడు గైరికాది ధాతువులచే మండలమును లిఖించవలయును. మధ్యభాగమున కొద్దిగా వంగియున్న తాలమును లిఖించవలయును. అచట వ్రేలాడు ప్రతిమను గోమయముచే ఏర్పడవలయును. వామహస్తముచే తాలాగ్రమును, దక్షిణహస్తముచే జ్ఞానముద్రికను, తాలమూలమునుండి స్వదిశలో మార్గమున హస్తమితమున చతురస్ర గృహము నేర్పరిచి, దాని మధ్యలో మూర్తిని లిఖించవలయును. దక్షిణాభిముఖముగా సుందరముగా, హృదయమున అంజలిని ధరించి జలముచే స్నానగందాదులను యథాశక్తిగా అర్పించవలయును. నేయి కలిపిన నువ్వుల అన్నమును నివేదన చేయవలయును. రెండు వేలు జపించవలయును. ఇట్లు ప్రతిదినము చేసినచో తప్పిపోయినవారు తిరిగి వత్తురు. శ్యామపాషాణ ఖండముచే భూపతి గృహమును లిఖించి, నాలుగు ద్వారములచే కూడిన ప్రాకారము నేర్పరిచి, ఆ ద్వారములలో అన్యోన్యపుచ్చములుకల హనుమంతుని ఆకొరత్రయము నేర్పరిచి గోమయముచే హనుమన్మూర్తిని చేసి, ఉమ్మెంత పూవులచే పూజించవలయును. జటామాంసీభవమగు ధూపమును, నూనె కలిపిన నేతి దీపమును, నువ్వుల నూనె కలిపిన కారము కలిపిన మినుప రొట్టెను నైవేద్యము చేసి, దక్షిణ హస్తమున రొట్టెను తినుచున్న హనుమంతుని ధ్యానించవలయును. వామహస్తముచే పొషాణములను విసరుచు శత్రు సైన్యమును భయ పెట్టుచున్న వానిని, కనుబొమను ముడిచి, భయ పెట్టుచు, క్రోబింప చేయుచు శత్రువులను సంహరించుచున్న హనుమంతుని ధ్యానించవలయును. ‘భుగుగ్’ అని వేయి మార్లు జపించవలయును. ఇట్లు చేసినచో పర సైన్యమును నశింపచేయగలడు. దుర్గములకు చక్కనిరక్షణ ఏర్పడును. ఇట్లు చాలా ప్రయోగములను చెప్పితిని. ప్రతిదినము యథావిధిగా దీపదానము చేయువానికి మూడులోకములలో సాధించలేనిదేదియు నుండదు. దుష్టహృదయము కలవానికి, దుష్ణాలోచన దుష్టబుద్ధికలవానికి, వినయము లేని శిష్యునకు, లోభికి, కృతఘ్ననకు ఈ మంత్రములనుపదేశించరాదు. చక్కగా పరీక్షించి ఉపదేశించవలయును. ఇంకనూ ఏమి చెప్పవలయును. హనుమంతుడు అన్నిటినిచ్చును. ఇపుడు తత్త్వజ్ఞానము నిచ్చు మరియొక మస్త్రమును చెప్పెదను. “ఓం నమో హనుమతే జాఠరదన క్షోభం సంహర! సంహర ! ఆత్మ తత్త్వం ప్రకోశయ ప్రకాశయ ! హుం ఫట్ స్వాహా” అను మంత్రము సార్ధ షడ్వింశత్యక్షరములు కలది. ముని వసిష్ఠమహర్షి అనుష్టుప్ ఛందస్సు హనుమంతుడు దేవత 7, 7, 6, 4, 8, 4 మంత్రాక్షరములచే షడంగములను కల్పించవలయును. హనుమంతుని ధ్యానించవలయును. పొమబాహువును జానువుననుంచి, హృదయమున జ్ఞానముద్రనుంచి అధ్యాత్మ చిత్తముతో ఆసీనుడై, కదలీవనమధ్యగతుడై, బాలార్కకోటి ప్రతిముడు, జ్ఞానప్రదుడగు హనుమంతుని ధ్యానించి, లక్ష జపించి, దశాంశమును నేయి కలిపిన నువ్వులచే హోమము గావించి, పూర్వోక్త పీఠమున- పూర్వమువలె పూజించవలయును. ఈ మంత్రమును జపించినచో మన్మథ వికారములు నశించును. హనుమంతుని అనుగ్రహమువలన తత్త్వజ్ఞానమును పొందును. భూతములను పొరద్రోలు మరియొక మంత్రమును చేప్పెదను. “ఓం కాశీం కుకీ వరాహాం జనా పవన వనపుత్ర ఆవేశి ఆవేశి” “ఓం శ్రీహనుమన్మస్త్రరచ” అనునది మరియొక మంత్రము. బ్రహ్మ ముని గాయత్రీ ఛందస్సు హనుమంతుడు దేవత. కమలా బీజము ఫట్ శక్తి. షడ్రీరాడ్య బీజముచే షడంగకల్పన చేయవలయును. పాటలాస్యుడు, స్వర్ణోదీ సమవిగ్రహుడు, పారిజాత వృక్షమూలస్తుడు అగు ఆంజనేయుని ధ్యానించవలయును. ఇట్లు ధ్యానించి, లక్ష జపించి, తేనె కలిపిన నువ్వులచే, దశాంశమును హోమముగావించి, పూర్వోక్త పీఠమున పూర్వమువలె పూజించవలయును. ఈ మంత్రముచే గ్రహగ్రస్తుని తుడువవలయును. ఇట్లు చేసినచో గ్రహము అరుచుచు అతనిని విడిచి పారిపోవును. ఈ మంత్రములను ఎప్పుడూ రహస్యముగా నుంచవలయును. అందరికీ తెలుపరాదు. చక్కగా పరీక్షించిన శిష్యునికి కాని, పుత్రునికి కాని ఉపదేశించవలయును. హనుమద్భజనాసక్తుడగు బుద్ధిమంతుడు కార్తవీర్యార్జుని విశేషముగా ఆరాధించి యథోక్తఫలమును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున దీపవిధి నిరూపణ మను డెబ్బది అయిద - అధ్యాయము సమాప్తము.