నారద మహా పురాణము - పూర్వార్థము
80 - కృష్ణమన్త్రనిరూపణమ్
సూత మహర్షి పలికేను : నారదమహాముని సనత్కుమారవచనమును విని ఏమడిగెనో దానిని మీకు తెలి పెదను. కార్తవీర్యకవచమును, హనుమత్కవచమును పవిత్రమగు హనుమచ్చరితమును విని నారదమహర్షి మరల ఇట్లు పలి కెను.
నారద మహర్షి పలికేను : ఓ మునిశ్రేష్ఠా ! బాగు ! బాగు ! నీవు అతికరుణాత్ముడవై పరమపవిత్రమగు శివుని చరితమును హనుమంతుని చరితమును వినిపించితివి. ఈ తంత్రమున క్రమ ప్రాప్తమును మీరు చెప్పవలసిన దానిని చెప్పుము. జ్ఞాన శ్రేషా ! మిమ్ములను వేరుగా అడుగవలసినదేమున్నది ?
సనత్కుమార మహర్షి పలికెను :- ఇక ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు కృష్ణ మంత్రములను చెప్పెదను. ఈ మంత్రములనుపాసించియే బ్రహ్మాదిదేవతలు సృష్ట్యాదులను చేయ సమర్ధులగు చున్నారు. శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా" అనునది పదునెనిమిది అక్షరములు గల మంత్రమిది. అధిష్టానదేవత దుర్గ, నారదుడు మునీ గాయత్రీ ఛందస్సు శ్రీకృష్ణ పరమాత్మ దేవత. కామ బీజము స్వాహా శక్తి చతుర్వర్గఫలప్రాప్తి కాఱకు వినియోగము. శిరస్సున ఋషిని, వక్తమున ఛందస్సును, హృదయమున దేవతను, గుహ్యమున బీజమును, పాదములయందు శక్తిని న్యాసము చేయవలయును. 4,4,4,4 మనూద్భవములగు వర్ణములచే పంచాంగన్యాసము కావించి తత్త్వన్యాసమును చేయవలయును. హృదయము అంతిమముగా ఆది నుండి అంత్యవర్ణము వరకు, అపరాద్యములను ఆత్మ కాఱకు మత్యంతతత్త్వములను జీవాద్యములను న్యాసము చేయవలయును. జీవము, ప్రాణము, మతి, అహంకారము మనస్సు, శబ్దము, స్పర్శ, రూపరసములు, గంధము, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, రసన, ఘ్రాణము, వాక్కు పాణి, పాదము, పాయువు, శిశ్నము, ఆకాశము, వాయువు, వహ్ని జలము, మహి, జీవము, ప్రాణము అను వాటిని సర్వాంగములందు, మత్యాదిత్రయమును హృదయమున, మూర్థ ఆస్య, హృదయ గుహ్య పాదములందు శబ్దాదికములను న్యాసమును గావించవలయును. కర్ణాది స్వస్వస్థానములందు శ్రోత్రాదీస్దాయములను వాగాదీస్దాయములను స్వస్వస్థానములందు న్యాసము గావించవలయును. మూర్దాస్య హృదయ గుహ్య పాదములందు ఆకాశాదికములను న్యాసము చేయవలయును. హృత్పుండరీకము అర్కేందు వహ్ని బింబములను వరుసగా ద్విషట్ అష్ట దశ కలా వ్యాప్తములుగా చేయవలయును. భూతాష్టాంగాక్షి పదములందున్న వర్ణములచే హృదయమున పూర్వము వలె న్యాసము చేయవలయును. ఇక ఆకాశాది. స్థలములందు వాసుదేవాదికమునను అనగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, వీరిని పరమేష్ట్యాది యుతముగా అనగా పరమేష్ఠి పుమాన్ శౌచ విశ్వ నివృత్తి సర్వకములు, శ్వేతానిలాగ్ని అంబు భూమి వర్ణములచే యథాపూర్వముగా న్యాసము గావించవలయును. స్వబీజాద్యం కోపతత్త్వమును నృసింహుని వ్యాపకముచే మొదటివలె న్యాసము గావించవలయును. ఇది సర్వాంగములందు తత్త్వ న్యాసమనబడును. మకరాది ఆద్యవర్ణములన్ని యూ చన్దభూషితములే. వాసుదేవాదికములన్నియు చతుర్థి విభక్త్యంత ములుగా తెలియవలయును. తరువాత పూరకుంభకరేచకములచే ప్రాణాయామమును మూలమంత్రముచే నాలుగింటిచే కానీ ఆరింటిచేకాని, రెంటిచేకానీ నొచరించవలయును. ఇచట కొందరు ఆచార్యులు ప్రాణాయామము తరువాత మరల పీఠన్యాసమునాచరించి అన్యన్యాసముల సౌచరించవలయును. చెప్పబోవు విధానముచే దశతత్త్వాదిన్యాసము గావించి, పూర్వోక్తమగు మూర్తి పంజర న్యాసమును చేయవలయును. సర్వాంగమున వ్యాపకమును కిరీట మంత్రముచే గావించి, తరువాత తారాపుట మంత్రమును మూడు విధములుగా కరములందు వ్యాపింపచేయవలయును. పంచాంగుళులయందు పంచాంగన్యాసమును గావించవలయును. మూడు విధములుగా మూలమంత్రముచే మూర్ధాదిపాదాంతము వ్యాపకన్యాసము గావించవలయును. ఒకసారి తారముచే వ్యాపకముగావించి మస్త్రాన్యాసమును చేయవలయును. శిరస్సున, లలాటమున, భ్రూమధ్యమున, కర్ణములందు, నేత్రములందు, నొపికలందు, నదనమున, కంఠమున, హృదయమునందు, నాభియందు, కటియందు, లింగమునందు, జానువులయందు, పాదములందు క్రమముగా న్యాసమును గావించవలయును. హృదంతమంత్ర వర్ణములను శిరస్సున ధ్రువన్యాసమును చేయవలయును. మరల నేత్రములందు, ఆస్యమునందు, హృదయమున గుహ్యమున, పాదములందు హృదయాంత్రమంత్రపదపంచకమును క్రమముగా న్యాసము చేయవలయును. మరల మున్యొదిన్యాసమును గోవించి పంచాంగన్యాసము చేయవలయును. ఇక ఇపుడు పరమ రహస్యమగు సర్వన్యాసోతమోత్తమమును చేపే దీనిని తెలిసిన నరుడు జీవన్ముక్తుడగును. అణిమాద్యష్టసిద్దులకు ఈశ్వరుడగును. దీనినారాధించిన వాడు కృష్ణసాన్నిధ్యమును పొందును. తారాదివ్యాహృతులచే మంత్ర సంపుట న్యాసమును గావించవలయును. మంత్రపుటీతములగు ప్రణవాదులను తరువాత న్యాసము చేయవలయును. గాయత్రీ పుటిత మంత్రమును మాత్సకాసలమున స్వాసముగావించవల మంత్రపుటిత గాయత్రిని క్రమముగా న్యాసము గావించవలయును. మాతృకాపుటిత మూలమంత్రమును న్యాసమును చేయవలయును. మూలమంత్ర పుటిత మూతృకను న్యాసమును చేయవలయును. తృచమును మాతృకావర్ణములను పూర్వము ఆయాస్థలములందు న్యాసము చేయరాదు. ఇట్లు చేయు న్యాసమే న్యాసషట్కమనబడును. ఈ ఉత్తమన్యాసముచే కృష్ణసముడగును. న్యాసపుటితమును చూచి సిద్ధగంధర్వకిన్నరులు దేవతలు కూడా నమస్కరింతురు. ఇక మానవుల విషయమేమి చెప్పవలయును. తరువాత సుదర్శన మంత్రముచే దిగ్బంధనమును చేయవలయును. సర్వాభీష్టప్రదాయకుడగు దేవుని హృదయమున ధ్యానించుచుండవలయును. వికసించిన పూలచే వంగియున్న కామ్మలు గల చెట్లచే, శోభించు పూలగుత్తుల రాశులు గల తీగలచే చుట్టబడియున్న, పరాగము రాలి పడుచుండుటచే పరిమళవంతములుగా చేయబడిన దిగ్బాగములుగల చల్లని బృందావనమును స్మరించవలయును. వికసించిన కాత్త పద్మములనుండి జారుచున్న మకరందముగలవి, మకరందమునందలి యాశచే ధ్వనించుచున్న తుమ్మెదల సమూహములు గల, నెమళ్ళు కోకిలలు, చిలుకలు, పావురముల సమూహములచే ధ్వనించబడుచున్న, నర్తించుచున్న నెమళ్ళ గుంపులుగల యమునానదీ తరంగకల్లోలముచే అంతటా ఎగిరిపడుచున్న నీటిబిందువులచే, మకరందము నిండి యున్న వికసించిన పద్మముల సమూహముల పరాగధూసరితములు శుభప్రదములగు వాటినే మన్మధుని ఉద్దీపించేడు గోపికాసుందరుల మృదువస్త్రములను కదల్చు వాయువులచే ఎల్లపుడు సేవించబడు, మనోహరమగు కల్పవృక్షమును స్మరించవలయును. ఆ వృక్షము క్రింద స్వర్ణ వేదికయందు ఉత్తమమగు రత్న పీఠము, రత్న ఖచిత పీఠమునందు. అరుణకమలమును స్మరించవలయును. ఆ యష్టదల పద్మమునందు మధ్యన యున్న ముకుందుని స్మరించవలయును. వికసించిన కలువవలె మనోహరుడు నెమలి పింఛమును ఆలంకారముగా ధరించినవాడు, పీతాంబరధారి, చంద్రముఖుడు, పద్మపత్రాయతాకుడు, కౌస్తుభోద్భాసితాంగుడు, శ్రీవత్సాంగుడు, సుభాషితుడు, గోపికానేత్రకమల పూజితుడు, గోగణావృతుడు, గోప బృందయుతుడు, వేణువు నూదువాడు, అగు శ్రీకృష్ణుని స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి మొదట ఇరువది వేలు జపించవలయును. దశాంశమును రక్తపద్మములచే హోమము గావించవలయును. అరుణ కమలములతో హోమమును గావించి సర్వసిద్ధేశ్వరుడగును. పూర్వోక్త వైష్ణవపీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, దానియందు గోపీజనమనోహరుని ఆవాహనచేసి పూజించవలయును. ముఖమున నున్న వేణువును పూజించి, వనమాలను, కౌస్తుభమును శ్రీవత్సమును హృదయమున పూజించి, పుష్పాంజలిని సమర్పించవలయును. తరువాత శుక్ల చందనపంకిలమగు శ్వేత తులసిని, రక్త చందనాంకితమగు రక్తతులసిని, దక్షిణ భాగమున వామ భాగమున సురేశ్వరుని ధ్యానించుచు అర్పించవలయును. తులసీద్వయమును, పద్మద్వయమును, హయమార ద్వయమును, సర్వపుష్పములను సర్వాంగములందు అర్పించవలయును. దక్షిణ భాగమున వాసుదేవునివలె నిత్యానురక్తరజోగుణమూర్తియగు రుక్మిణిని, పూజించి ఆవరణార్చన చేయవలయును. దామసుదాములను, వసుదాముని, కింకిణీని పూజించవలయును. పూర్వాది దిక్కులందు చతుర్ధ్యంతములగు దామాదులను ధ్రువాదికములుగా, ఆగ్నేయనైఋతి వాయవ్య ఈశాన్యకోణములందు హృదయాదికములను దిక్కులందు అస్త్రములను చక్కగా పూజించి పత్రములందు మహిషులను పూజించవలయును. రుక్మిణి, సత్యభామ, నాగ్నజితి, సువిన్ద, మిత్రవింద, లక్ష్మణ, జాంబవతి, సుశీల అను పారలను శోభించు సుందరాభరణ భూషితలనుగా పూజించవలయును. తరువాత దలాగ్రములందు వసుదేవుని, దేవకిని, నందగోపుని, యశోదను, బలభద్రుని, సుభద్రను, గోపాలకులను, గోవిందునియందు బద్దమైన బుద్దీ కనులు గల గోపికలను, జ్ఞానముద్రా అభయ ముద్రలను కరములందు ధరించి పీతపాండురులగు తలిదండ్రులను, దివ్యభూషణాంబర లేపమాల్యధారులనుగా చరువును పాయస పూర్ణ పాత్రను ధరించి యున్న తల్లులను, అరుణ శ్యామల వర్ణములుగల హారమణి కుండల మండితులను, శంఖమువలె చంద్రుని వలే ధవలకర్లుడగు బలరాముడు ముసలమును లాంగలమును ధరించువాడు, మద్యప్రియుడు, నీలాంబరధారి హలధారి, ఏకకుండలుడు, ఇక కలలు శ్యామల, భద్రా, సుభద్ర, భద్ర భూషణ, వరాభయయుతలు, పీతాంబర ధారిణులు, ఆరూఢయావనులు, వేణు వీణా హేమయష్టి శంఖ శృంగాదీపాణులు, వివిధ ప్రాభృతాన్నవరాంబుజులగు గోపాలురు . గోపికలను పూజించవలయును. వెలుపల మందరాద్రిని, కల్పవృక్షములను పూజించవలయును. మందారము, సంతానకము, పారిజాతకము, కల్పవృక్షము, హరి చందనము అనునవి వృక్షములు. మధ్యభాగమున, దిక్కులందు పూజించి వలయును. మందారము, సంతానము. పారిజాతకము, కల్పవృక్షము, హరిచందనము అనునవి వృక్షములు. మధ్యభాగమున, దిక్కులందు పూజించి వెలుపల శక్రాదులను పూజించవలయును. కృష్ణాష్టకములతో వారి అస్త్రములను పూజించవలయును. కృష్ణుని, వాసుదేవుని, దేవకీనందకుని, నారాయణుని, యదుశేషుని, వాగ్గేయుని, ధర్మపాలకుని, అసురాక్రాంత భూభాగహారిని పూజించవలయును. ఈ ఆవరణలతో శ్రీకృష్ణుని పూజ చేయవలయును. సంసారసాగరమును తరించుటకు, సర్వాభీష్టప్రాప్తికి ఇట్లు శ్రీకృష్ణభగవానుని పూజలచే మంత్రసిద్ధిని పొందవలయును.
శ్రీకృష్ణభగవానుని త్రికాలపూజనమును ఇపుడు చెప్పెదను. ఈ పూజనము సర్వార్థసిద్ధిప్రదము. సంపద్యుక్తమైన ఉద్యానమున హేమభూరత్నమండపమున, శోభించు కల్పవృక్షాధోభాగమున నున్న రత్నాబ్దపీఠమున నున్నవాడు ఇన్రనీలమణి ప్రభాభాసితాంగుడు గుడమువలె సిగ్గములైన అలకలు గలవాడు శిశువుగా నున్నవాడు కదలుచున్న బంగారు కుండలములచే భాసించు గండస్థలములు గలవాడు, చిరునవ్వుతోణికిసలాడు ముఖారవిందము గలవాడు, సుందరుడు, ప్రకాశించు పరిశుద్ధమైన రత్నములు పాదిగిన కనక సూత్రము మొల త్రాడుగా కలవాడు, పీతాంబరధారి, స్వర్ణాభరణ భూషితుడు మనోహరములైన పుండరీకములు గలవాడు సుందర నఖ శోభితుడు, చక్కగా ధూసరితమగు ఉరస్థలమున గోధూలిచే బాగుగా అలదినవాడు, సుపుష్టాంగుడు, స్వర్ణకొంతిలో ప్రకాశించువాడు, కటిస్థలమున జంఘాన్త్రయుగ్మముగా క్వణత్కింకిణీ జాలదామ బద్దుడు, నవ్వుచున్నవాడు, వికసించిన బంధుజీవ పుష్పముల కాంతిగల పాదపాదోబ్దముల ఉదోర కాంతిచే ప్రకాశించువాడు, దక్షిణకరమున పాయసాన్నమును, వామకరమున అపుడే తీసిన వెన్నను ధరించినవాడు, శోభించు గోప గోపీ గోబృందమధ్యమున నుండువాడు, ఇంద్రాది దేవతలచే పూజించబడు పాదపద్మములు గలవాడు, భూమికి భారభూతులైన పూతనాది రాక్షస గణమును సంహరించువాడు, అయిన శ్రీకృష్ణభగవానుని ధ్యానించి స్థిరమగు మనస్సుచే పూర్వము వలే అర్చించవలయును. పెరుగుతో బెల్లముతో నైవేద్యమును సమర్పించి ఒకవేయి జపించవలయును. శోభించు గోపగోపీగోబృందమధ్య స్థితుడు సాంద్రమేఘప్రభుడు సుందరాంగుడు, నెమలి పింఛములను శిరమున భూషణముగా ధరించినవాడు, పుండరీకాయతాకుడు, పూర్ణచంద్రాననుడు, చలత్కుండలోల్లాసి గండస్థల శ్రీభరుడు, సుందరమందహాసము గలవాడు, సునాసుడు, పీతాంబరధారి, దివ్యభూషణభూషితుడు, ధ్వనించు కింకిణీ జాలమల్తానులేపుడు, మ్రోగుచున్న వేణువును కరమున ధరించువాడు, వామకరమున శంఖమును దండమును ధరించువాడు, దక్షిణ హస్తమున అభిప్రదముద్రను ధరించువానిని అర్చించవలయును. ఇట్లు ధ్యానించి విష్ణుభక్తుడు కృష్ణుని పూజించవలయును. అపూప పాయసాన్నొదులచే నైవేద్యమును కల్పించవలయును. నేయి కలిపిన పాల అన్నముతో ‘అష్టోత్తర శతమును హోమమును చేయవలయును. ఆయాదిక్కులందు బలినిచ్చి ఆచమనమునీయవలయును. మంత్రమును అష్టోత్తర సహస్రము జపించవలయును. ఇట్లు మధ్యాహ్నమున పూజించవలయును. అట్లు పూజించిన వానిని దేవతలందరు నమస్కరింతురు. లోక ప్రియుడగును. మేధ ఆయుష్యము, సంపద, కాంతి గలవాడై పుత్ర పౌత్రులచే వృద్ధిచెందును. ఇక తృతీయ కాలపూజా విషయమున కాలభేదము చెప్పబడినది. కొందరు సాయంకాలము, మరి కొందరు రాత్రియని చెప్పియున్నారు. దశాక్షర మంత్రమును రాత్రి అష్టాదశాక్షర మంత్రమును సాయంకాలమున, ఉభయమంత్రమును ఉభయకాలములందు చేయవలయునని కొందరు చెప్పిరి. సాయంకాలమున ద్వారకానగరియందు చిత్రోద్యానోపశోభితమున, అష్టాదశ సహస్రభవనములచే శోభించు దాని యందు, హంససారససంకీర్ణ కమలోత్పలశాలులగు పవిత్ర జలములుకల సరస్సులచే కూడియున్న భవనోత్తమమున ఉదయించు సూర్యకాంతిగల శ్రీమణి మండలమున స్వర్ణ పద్మాసనాసీనుడు త్రైలోక్యమోహనుడు, ఆత్మతత్త్వ నిర్ణయము కాఱకు ముని బృందముచే కూడియున్నవాడు, ఆమునులకు స్వధామమును ఉపదేశించువాడు, వికసించిన కలువలవంటిమేని పన్నెకలవాడు, పద్మపత్రాయతేక్షణుడు, గుడు, కుంతల సంభిన్న కిరీట వనమాలలు కలవాడు, చారు ప్రసన్నవదనుడు, స్ఫురన్మ కరకుండలుడు, శ్రీవత్సవర్ణుడు, భ్రాజకౌస్తుభుడు, సుమనోహరుడు, కాశ్మీరక పిశోరస్కుడు, పీతకౌశేయవస్రుడు, హార కేయూర కటకకటి సూత్రాలంకృతుడు భూభారమును హరించినవాడు, ఆనందమనస్కుడు, శంఖచక్రగదాపద్మములచే శోభించు చతుర్భుజములు కలవాడు, అగు శ్రీకృష్ణుని ధ్యానించి పూజించవలయును. తరువాత అంగములచే ప్రథమావరణపూజను చేయవలయును. మూడవ ఆవరణమున నారదుని, పర్వతుని, జిష్ణువును. నిశధుద్దవదారుకులను, విష్వక్సేనుని, శైనేయుని, దిగగ్రభాగమున గరుడుని వజ్రాదులచే లోకపాలురను పూజించవలయును. ఇట్లు వీధివిధానముగా పూజించి పాయసమును నివేదన చేయవలయును. ఖండమీశ్రదుగ్గబుద్ధిచే జలమును తర్పణగావించి, పురుషోత్తముని భావించుచు, ఎనిమిది నూర్లు జపించవలయును. అన్ని పూజలందు హోమమును మధ్యాహ్నము చేయవలయును. లేదా ఆసనాదిగా అర్ఘ్యపర్యంతము చేసి స్తుతించి నమస్కరించవలయును. తరువాత సమర్ధాత్మను ఉద్వాసన చేసి తన హృదయసరసీరుహమున ఉంచి, తన్మయుడై మరల ఆత్మనర్చించవలయును. ఇట్లు ప్రతినిత్యము సాయంకాలమున వాసుదేవుని అర్చించువాడు అన్ని కోరికలను పొంది అంతమున పరమ పదమును పొందును. రాత్రివేల అయినచో మదనోక్రాంత చిత్తుడు, నందనందనుడు, రాసలీలాపరిశ్రాంతుడు, గోపీ మండల మధ్యగతుడు, వికసించిన కుందకప్లరమల్లికాకుసుమములనుండి వచ్చిన పరాగముచే కప్పబడినవాడు, మందమారుతములచే చల్లగా చేయబడిన, వికసించిన కాత్త కలువలనుండి జారుచున్న 'మకరంద మధ్యమున తిరుగుచున్న మదించిన తుమ్మెదల లలితగానముగల, వికసించిన మల్లెలు కల, చంద్రుని రణములచే శోభించు దిగంతములుగల, మన్మధుని ఉద్దీపింపచేయు కాలిందీ పులినాంగణమున చిరునవ్వు ముఖముతో నున్నవాడు, మాటి మాటికి వేణు వాదనము చేయువాడు, లోపలనీరుగలదగుటచే శోభించు కాత్తమేఘముల కాంతిగలవాడు, పద్మాయత నేత్రుడు, బింబాధరుడు, సుందరుడు, నెమలి పింఛములను శిరమున అలంకరించుకాని, కాప్పున పూలమాలలు కట్టుకాని యున్నవాడు, ప్రకాశించు కుందముల రత్నకాంతిచే ప్రకాశించు గండస్థలము కలవాడు, కొంచీనూపురహార కంకణలసత్కేయూర భూషాన్వితుడు, గోపీద్వయమధ్యగతుడు, వన్యప్రసూనస్రజుడు, పరస్పరము పట్టుకానిన గోపికాభుజబంధమున నున్నవాడు, రాసక్రీడాలోలుపుడు, మన సిజాక్రాంతుడగు ముకుందుని సేవించవలయును. వివిధ శ్రుతిభిన్నమనోజ్ఞతరస్వర సప్తక మూర్చనతానగణములచే భ్రమించువాడు, ఉదారమణిస్పుటమండన సింజిత చారుతనువు, పరస్పరము పట్టుకానిన గోపికాకరములచే కల్పించిన రాసవిహారవిధిలో ఈ శరీరముచే బహువిధములుగా చేయబడిన దివ్యతనువు కలవాడు, అగు శ్రీకృష్ణుని ఇట్లు ధ్యానించి పూజించవలయును. తరువాత అంగములచే ప్రథమావరణ పూజను కావించవలయును. కేశవుడు కీర్తి మొదలుగాగల షోడశమిథునములను పూజించవలయును. తరువాత ఇంద్రాదులను, వజ్రాదులను పూజించవలయును. పృధు, సువృత్తము, మసృణము వీత స్త్రీమాత్రేన్నతమగు శంకును భూమియందు ప్రతిష్ఠించి, దానిని పాదములచే ఆక్రమించి పరస్పరము హస్తములను పట్టుకాని భ్రమించుట రాసగోష్టి యందురు. ఇట్లు పూజించి ఖండశర్కర నేయి కలిపిన పాలచే నైవేద్యమును సమర్పించి, 16చషకములనర్పించవలయును. శర్కర కలిపిన పాయసమును, క్రమముగా మిథునములందర్పించవవలయును. మిగిలిన దానిని పూర్వము వలె నాచరించి సహస్రము జపించవలయును. స్తుతించి, నమస్కరించి, ప్రార్థించి, పూజా శేషమును ముగించవలయును. ఇట్లు కృష్ణుని పూజించినవాడు సర్వసమృద్ధులను పొందును. అణిమాద్యష్టసిద్దులకు అధిపతియగును. ఈ లోకమున పలు భోగములననుభవించి, అంతమున విష్ణుపదమును చేరును. ఇట్లు పూజాదులచే మంత్రము సిద్ధించిన పిదప కామ్యములను సాధించుకానవలయును. మూడు కాలములందు ఇరువది యెనిమిది మార్లు పూజించవలయును. స్వకాలవిహితములగు పరివారములను కూడా తృప్తిపరచవలయును. ప్రాతఃకాలమున బెల్లమున కలిపిన పెరుగుచే, మధ్యాహ్నము పాలచే, సాయంకాలము వెన్న కలిపిన పాలచే తృప్తిపరచవలయును. ఖండశర్కర కలిపిన పాలతో నివేదన గావించవలయును. ఆయా నామములను ద్వితీయాంతములుగా పలికి చివర ‘తర్పయామి’ అను పదమును కూర్చవలయును. చివర పూజా శేషమును ముగించవలయును. ఆ ప్రసాదజలముచే తనను ప్రోక్షించుకాని, ఆ జలమును త్రాగవలయును. దానితో తృప్తి చెంది, భగవానుని ఉద్వాసన గావించి, తన్మయుడై మంత్రమును జపించవలయును.
ఇక ఇపుడు కామ్యకర్మలందు తర్పణములందు ఉపయోగించవలసిన ద్రవ్యములను చెప్పెదను. ఆ విధానములలో ఏదో ఒకదానిని అనుసరించవలయును. పాయసము, పెరుగుతో, చేసిన పదార్ధము, నెయ్యి, గుడాన్నము, నువ్వుల అన్నము, పాలు, పెరుగు, అరటి పండు, రేగి, అల్లనేరేడు, మేడి, అపూపములు, మోదకములు, పేలాలు, అటుకులు, వెన్న, ఈ పదునారు పదార్దములను బ్రహ్మదులు చెప్పియున్నారు. పేలాల తరువాత అటుకులు సమర్పించి ఖండశర్కరను డెబ్బది నాలుగు మార్లు ప్రొద్దున తర్పణమును చేయవలయును. కృష్ణస్థానమును ధ్యానమును చేసి నలుబది రోజులలో ఇష్టమును పొందును. గోరువెచ్చని పాలచే, వెన్నను, పెరుగును, పాలుకలిపిన పదార్ధము, నేయి, మత్స్యాండములు, తేనె, కీలాలము ఈ తొమ్మిది పదార్దములచే పూజించవలయును. ఇట్లు పన్నెండు మార్లు ఒక్కొక్కదానిచే పూజించి నూట ఎనిమిది మార్లు తర్పణమును చేయు విష్ణుభక్తుడు పూర్వోక్తఫలమును పొందును. ఇంకను ఏమి చెప్పవలయును. ఈ తర్పణము సర్వాభీష్ట ప్రదము. ఖండశర్కర కలిపిన గోరువెచ్చని పాలు అను బుద్దిచే జలమును కృష్ణునికి తర్పణముచేయుచు గ్రామమున వెళ్ళినచో పరివారముతో కూడా ధనవస్త్రములను, భోజనమును పొందగలడు. ఎన్నిమార్లు తర్పణము చేసినచో అన్నిమార్లు మంత్రమును జపించవలయును. తర్పణముచే అఖిల కార్యములను సాధించుకానవలయును. ఇక ఇపుడు సాధకుల హితము కాఱకు కామ్యహోమమును చెప్పెదను. తరుగని సంపద కాఱకు మారెడు పుష్పములతో హోమమును చేయవలయును. ఘృతాన్న సమృద్దికాకు నేయి కలిపిన అన్నముచే హోమమును చేయవలయును. వన్యపుష్పములచే హోమమును చేసినచో బ్రాహ్మణులు వశమగుదురు. జాతి పుష్పముచే క్షత్రియులు, నల్లపూలచే వైశ్యులు, నీలోత్పలములచే శూద్రులు, లవణములచే అందరు, పద్మములచే యువతులు వశమగుదురు. గోశాలయందు నేయి కలిపిన పాయసముచే హోమము గావించినచో గోపాలకృష్ణుడు గోవులకు గౌతిని కలిగించును. శిక్షావేషధరుడు, కింకిణీజాలశోభితుడు అగు కృష్ణుని ధ్యానించి పాలభావనే శుభ జలములచే తర్పణమును గావించవలయును. ఇట్లు చేసినచో ప్రీతిచెందిన కృష్ణభగవానుడు ధనధాన్యపుత్రకీర్తులను ప్రసాదించును. బ్రహ్మవృక్షసమిధలచే కాని, దర్భలచే కాని, తీలతండులములచే కాని త్రిధుమిశ్రములచే పదివేలు హోమమును గావించవలయును. ఇట్లు చేసిన బ్రాహ్మణులు వశులగుదురు. రాజవృక్షపుష్పములచే హోమమును గావించిన వైశ్యులు, కురండ కుసుమములచే చేసిన వైశ్యులు పాటల కుసుమములచే శూద్రులు వశులగుదురు. శ్వేతరక్త పద్మములచే చంపకములచే, పాటలములచే క్రమముగా పదివేలు హోమము గావించినచో ఉత్తమాంగనలు వశులగుదురు. త్రిమధు మిశ్రితములగు హయారి కుసుమములచే ప్రతినిత్యము నిశీధకాలమున ఎనిమిది దినములు హోమము గావించినచో వరాంగనలు వశమగుదురు. పోలు, పెరుగు, తేనె కలిపిన ఆవాలచే ఒకనెల రాత్రిపూట ముప్పుది వేలు హోమమును. గావించినచో ఇంద్రుడు కూడా వశుడగును. వల్లవీవస్త్రములను పరించి నీపవృక్షమును ఆరోహించిన కృష్ణుని స్మరించుచు, రాత్రిపూట ఒకవేయి పదకొండురోజులు జపించినచో ఊర్వశిని కూడా బలముతో ఆకర్షించవచ్చును. ఇంకనూ ఏమి చెప్పవలయును. ఈమంత్రము సర్వవశ్యకారి.
ఇక ఇపుడు పరమ రహస్యము మోక్షప్రదమగు దానిని చెప్పెదను. తన హృదయపద్మమున ప్రభువు, దేవకీనందనుడు, కుందేందుచౌరుడు, పద్మాక్తుడు, శంఖచక్రగదాపద్మములను, ధరించినవాడు. నవనలినమాలచే శోభించువాడు, మునీంద్ర వేద్యుడు, కణికముని లసద్దివ్యభూషాభిరాముడు, దివ్యాంగాలేషభాసుడు, సకల భయహరుడు, పీతాంబర ధారి, మురారి, స్పుట హృదయ సరోజాసనాసీనుడు, ఆద్యుడు, సాంద్రాంభోదచ్ఛవి అయిన కృష్ణుని ధ్యానించి పన్నెండు లక్షలు జపించవలయును. పన్నెండు వేలు సమిధలచే హోమమును గావించవలయును. క్షీర వృక్షసముద్భవములచే కాని. తేనె, నెయ్యి శర్కరచే కాని పాయసముచే కాని హోమమును గావించవలయును. ఇట్లు లోకేశ్వరారాధ్యుడగు కృష్ణుని తన హృదయపద్మమున ధ్యానించుచు ప్రతిదినము మూడు వేలు జపించవలయును. సాయంకాలమున చెప్పబడిన రీతిగా పూజించి, పూర్వోక్తవిధిగా హోమమును గావించి తద్గతమనస్కుడై యుండవలయును. ఇట్లు ప్రతిదినము గోపాలకృష్ణుని పూజించు విద్వాంసుడు సంసారసాగరమును దాటి పరమపదమును చేరును. అనలపుటపురము యొక్క మధ్య భాగమున, బాహ్యకోణములందు, కర్ణికయందు సాధ్యయుక్తుడగు మన్మథుని లిఖించవలయును. కేశరములందు వివరగత షడర్లద్విట్ లను లిఖించవలయును. శక్తిశ్రీపూర్వకములగు ద్వినవలిపి గల మంత్రాక్షరములను, దలముల మధ్యలో వర్ణములను, మంత్రము యొక్క దశాక్షరములను ఒక్కొక్కటిగా పద్మమున వ్రాయవలయును. భూసద్మ నాభి వృతముగా కాల్చినసూచిచే గోరోజనముచే లిఖించి హిరణ్యరచితమగు పట్టమున గులికీకృతమగు గోపాల యంత్రము అఖిలాభీష్టప్రదమని చెప్పబడినది. ఈ యంత్రమును సంయాతసిక్తముగా చేసి చక్కగా జపించి మహానుభావులు ధరించినచో జగత్తయమును వశము చేయుటలో సమర్థము. రక్షణ, కీర్తి, పుత్రులు, భూమి, ధనము, ధ్యానము, సంపద, సౌభాగ్యములను కోరువారు ఎల్లవేళలా ఈ యంత్రమును ధరించవలయును. “చక్రిష్ణ్యాయ నమః” అనునది షడక్షర మంతరము. సర్వ సిద్ది ప్రదము శాంతిందువహ్యాఢ్యమగు క్రోడము మాయ బీజముగా చెప్పబడినది. ఈ మంత్రము గోవిన్దవహ్ని చక్జాడ్యము. శ్రీబీజము. వీటిచే అష్టదశక్లిపి అయినచో ఇరువది యక్షరముల మంత్రమగును. శాలగ్రామమునందు కాని, మణి యందుకాని. యంత్రమునకాని, మండలమున కాని, ప్రతిమలందు కాని హరి పూజ చేయవలయును. కాని కేవల భూమియందు చేయరాదు. ఇట్లు కృష్ణుని పూజించువాడు ఉత్తమగతిని పొందును. ఇరువది వర్ణముల మంత్రమునకు బ్రహ్మ ముని, గాయత్రిఛన్దస్సు. కృష్ణుడు దేవత కామబీజము. ధ్వఠము శక్తి 3,4,4 4. 4,2 వర్ణములచే షడంగన్యాసమును గావించవలయును. మూలమంత్రముచే వ్యాపకము నోచరించవలయును. ఆ మూలము మనుపుటితము కావలయును. సావధానముగా ఆయాస్థానములందు మాతృకావర్ణములను న్యాసము గావించవలయును. దశతత్త్వన్యాసముగావించి మూలముచే వ్యాపకము గావించవలయును. దేవతాభావసిద్ది కాఱకు మన్రన్యాసమును చేయవలయును. శీర్షమున, లలాటమున, భ్రూమధ్యమున, నేత్రములందు కర్ణములందు, నాసికలయందు, వస్త్రమునందు, చిబుకమున, కంఠమున, బాహమూలమున, హృదయమున, ఉదరమున, నాభిదేశమున, లింగమున, మూలసరోరుహమున, కటియందు, జానువులందు, జంఘలందు, గుల్పములందు, పాదములందు, క్రమముగా మంత్రవర్ణములను హృదంతముగా న్యాసముగావించినచో సృష్టిన్యాసమనబడును. హృదయమున, ఉదరమున, నాభియందు, లింగమున, మూలసరోరుహమున, కటియందు, జానువులందు, జంఘలందు, గుల్పములందు, పాదములందు శిరస్సున, కపోలమున, భ్రూమధ్యమున, నేత్ర కర్ణనాసికా వదనచిబుక కంఠబాహు మూలములందు నమోంత. మంత్రవర్ణములను క్రమముగా న్యాసమును గావించినచో స్థితిన్యాసమనబడును. పాద గులజంఘజానుకటిమూలధ్వజనాభి జఠర హృదయబాహుమూల కంఠచిబుకవదన నాసికా కర్లనేత్ర భ్రూమధ్య నీటల శిరస్సులలో క్రమముగా మంత్రాక్షర న్యాసము గావించినచో సంహారన్యాసమనబడును. మరల సృష్టి స్థితి న్యాసములను గావించి పూర్వమువలె మూర్తి పంజరనామ న్యాసమును గావించవలయును. మరల షడంగన్యాసమును గావించి హృదయపద్మమున శ్రీకృష్ణపరమాత్మను ధ్యానించవలయును. ద్వారకానగరమున సహస్రార్కభాస్వరములగు భవనరాజములచే మహాకల్పవృక్షములచే కూడియున్న మణిమండపమున జ్వలద్రత్నమయస్తంభ ద్వారతోరణ కుడ్యములు గల, ఫుల్ల ప్రఫుల్లపచ్చిత్ర వితానాలంబిమౌక్తికమగు, పద్మరాగస్థలీరాజద్రత్న సంఘములమధ్యన, అనారతగలద్రత్న ధారాడ్యమగు దేవతావృక్షము క్రింద రత్న ప్రదీపరాజులచే దిగంతములు ప్రకాశించుచుండగా ఉద్యదాదిత్య సంకాశమణి సింహాసనాంబుజమున ద్రుతహాటకసన్నిభుడై కూర్చొనియున్న అచ్యుతుని ధ్యానించవలయును. ఆ యచ్యుతుడు ఏకకాలమున ఉదయించిన సూర్యచంద్రవిద్యుత్కోటులతో సమకాంతిగలవాడు. సర్వాంగసుందరుడు, సౌమ్యుడు, సర్వాభరణ భూషితుడు, పీతాంబరధారి, శంఖచక్రగదాపద్మములచే శోభించు హస్తములు కలవాడు. ఎడతెగక ప్రకాశించు రత్నధారలతో నిండిన కలశమును స్పృశించుచు వామపాదపద్మా గ్రముచే పల్లవకాంతిని హరించుచు, దక్షిణవామ భాగములలో రుక్మిణీ సత్యభామలు రత్నాఘదారచే శిరమున తడుపుచు, నాగ్నజితి సునందలు వారికి కలశములందించుచుండగా, వారికి దక్షిణ వామభాగములలో మిత్రవింద సులక్ష్మణలు రత్ననదీ నుండి రత్నపూర్ణఘటములను తీసి ఇచ్చుచుండగా, వారికి జాంబవతి సుశీలలు రత్నఘటములనందించుచుండగా, వెలుపల పదునారు వేల ప్రియభార్యలు చుట్టు ముట్టియుండగా. ఆ వెలుపల ఇష్ణనిధులు ధనములచే భూమిని నింపుచుండగా, వారి వెలుపల యాదవులందరు, పూర్వమువలే స్వరాదులుండగా యున్న కృష్ణపరమాత్మను ధ్యానించి అయిదు లక్షలు జపించవలయును. దశాంశమును అరుణకమలములచే హోమము గావించి పూర్వోక్త పీఠమున పూజించవలయును. గంధముచే అలికి అష్టదలపద్మమును లిఖించవలయును. కర్ణికయందు షట్కోణమును లిఖించి అచట సాధ్యయుతముగా మన్మధుని లిఖించవలయును. మిగిలిన పది హేడక్షరములచే స్వరవేష్టనమును గావించవలయును. అనిలకోణములందు ప్రొగ్రక్షను, శ్రీని, శిష్టముగా స్మరగాయత్రిని లిఖించవలయును. దలాష్టకమున మాలామంత్రమును లిఖించవలయును. ఇట్లు ఆరుగా వ్రాసి తద్బొహ్యభాగమున మాత్సకాక్షరములచే వేష్టనము గావించవలయును. బాహ్యభాగమున భూబింబమును లిఖించవలయును. దిక్కులలో విదిక్కులలో శ్రీమాయలను భూగ్రహము చతురస్రముగా అష్టవజ్రవిభూషితముగా నుండవలయును. ఈ యంత్రమును హాటకాది పట్టములందు లిఖించి సంస్కరించి ధరించువారిని దేవతలు కూడా పూజింతురు.
“వామదేవాయ విద్మ హే పుష్పబాణాయ ధీమహి తన్నోఒనంగః ప్రచోదయాత్" అనునది స్మరగాయత్రి. ఈ స్మరగాయత్రిని గోపాలమంత్రముకు మొదట జపించినచో జనరంజకమగును. ఈశ్రీకామమదేవాయ సర్వజనప్రియాయ సర్వజనసమ్మోహనాయ. జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల సర్వజనస్య హృదయం మమ వశం కురు కురు” అనునది నలుబది యెనిమిది అక్షరములు గల మదన మంత్రము. జపమునకు ఆదియందు స్మర బీజాదిగా చేసినచో జగత్తయము వశమగును. పీఠమును మొదటీ వలె అర్చించి మూలముచే మూర్తి సంకల్పించి అచట అచ్యుతుని న్యాసక్రమముగా ఆసనాది విభూషాంతముగా పూజించవలయును. సృష్టి స్థితి షడంగములను, కిరీటమును, కుండలద్వయమును, శంఖచక్రగద పద్మములను, మాలను, శ్రీవత్స కౌస్తుభములను, గంధపుష్పములచే పూజించి షట్కోణములందు షడంగములను దిగ్గలములందు క్రమముగా పూజించవలయును. కోణములందు వాసుదేవాదికములను, శాంత్యాదికమును, పత్రాగ్రములందు అష్టమహిషులను పూజించవలయును. తరువాత పదునారు వేల ప్రియురాళ్ళను పూజించవలయును. ఇన్దనీలముకుందులను, కరాలానన్ద కచ్చపులను, శంఖపద్మములను, అష్టనిధులను, క్రముగా పూజించవలయును. ఆ బయట లోకపాలురను, వజ్రాదులను పూజించవలయును. ఇట్లు సప్తవరణములలో కృష్ణుని పూజించి దధిఖండాజ్యమిశ్రమగు క్షీరాన్నముచే ప్రీతుని చేయవలయును. దివ్యోపచారమునిచ్చి, స్తుతించి, నమస్కరించి, పరివారగణములతో స్వహృదయమున ఉద్వాసన గావించవలయును. ఆత్మ న్యాసము గోవించి, చక్కగా పూజించి తన్మయుడై విహరించవలయును. వింశత్యక్టరమంత్రమునకు రత్నాభి షేక ధ్యాన పూజలను గావించవలయును. ఇట్లు మంత్రమును ఉపాసించువాడు సమృద్ధిని పొందగలడు. జపహోమార్చన ధ్యానములచే ఈ మంత్రమును జపించువానిల్లు ఎపుడూ రత్నసువర్ల ధనధాన్యములచే నిండియుండును. సర్వసస్యసమాకులమగు పృథివీ అతని హస్తగతమగును. పుత్రమిత్రాదులచే సుసంపన్నుడై అంతమున పరమపదమును పొందును. గోవిందుని అగ్నిహోత్రమున్న తండులసహితశుక్లపుష్పములచే పూజించి నేయి కలిపిన వాటిచే పదివేలు హోమమును గావించి, ఆ భస్మమును శిరమున ధరించవలయును. ఇట్లు చేసినచో అతనికి - అన్నాది సమృద్ధి కలుగును. ఆతని వంశమున స్త్రీలందరు సుఖసంపదలు కలిగియుందురు. త్రిమధు మిశ్రితములగు రక్తాంభోజములచే లక్షహోమమును గావించవలయును. అట్లు చేసినచో అతని సంపదముందు ఇందైశ్వర్యమును గావించవలయును. అట్లు చేసినచో అతని సంపదముందు ఇందైశ్వర్యము కూడా అల్పముగా తోచును. త్రిమధు మిశ్రితములగు శుక్లపుష్పములచే ప్రతి నిత్యము ఒక నెల హోమము గావించినచో రాజపురోహితుడగును. ఇటువంటి ప్రయోగములను ఈ మంత్రముచే సాధించవచ్చును.
ఇక ఇపుడు సర్వ సిద్దిప్రదమగు దశాక్టరమంత్రరాజమును చెప్పెదను. సద్వాన్యిత స్మృతి సాక్షి లోహితము జనవల్లభ అగ్ని ప్రియాంత పవనము ఇది దశాక్షర మంత్రము. ఈ మంత్రమునకు నారదముని. విరాట్చందస్సు "కృష్ణపరమాత్మ దేవత. కామబీజము. స్వాహాశక్తి చక్రము, విచక్రము, సుచక్రము, త్రైలోక్య రక్షణ చక్రము. అసురాంతక చక్రము. ఈ పదములను చతుర్థ్యంతములుగా ఈద్వయాంతములుగా మన్త్రమునకు. పంచాంగన్యాసమును చేయవలయును. తరువాత తొరాపుట మంత్రమును చేతులలో మూడు మార్లు వ్యాప్తి చేసి ఇందు సహితహృదంతమంత్రాక్షరములను ప్రణవాంతరితముగా న్యాసము చేయవలయును. దక్షిణాంగుష్ఠము నుండి వామాంగుష్ఠము వరకు అంగులిపర్వలందు చేయబడునది సృష్ఠిన్యాసముగా
చేప్పబడినది. ఇపుడు స్థితి న్యాసమును చెప్పేదను. వామకనిష్ణాదిగా కనిషాంతముగా చేయునది స్థితి న్యాసము. దక్షిణాంగుష్ఠము నుండి వామాంగుషాంతము అంగులి పర్వములలో చేయవలయును. ఇదియే సంహృతి న్యాసము. ఈ న్యాసము దోషసమూహనాశకముగా చెప్పబడినది. సృష్టి న్యాసము విద్యా ప్రదము కావున పరిశుద్ధ చిత్తులగు బ్రహ్మచారులకు యోగయమైనది. స్థితి న్యాసము గృహస్థులకు. సంహారన్యాసము మునీన్దూలకు విరక్తులకుపయోగించును. మరల స్థితిక్రమముగా మంత్రాక్షరములను అంగులులందు న్యాసమును చేయవలయును. మరల మొదట చెప్పిన చక్రములచే "కరములందు పంచాంగన్యాసము చేయవలయును. తరువాత మూలపుటితములగు సబిందుకములైన మాతృకాక్షరములను మాత్సకాన్యాస స్థానములందు న్యాసము గావించవలయును. తరువాత తారాపుటమగు మూలమును వ్యాపకముగా న్యాసము చేయవలయును. సంహార సృష్టి భేదములచే దశతత్త్వములను న్యాసమును గావించవలయును. నమోంతమగు మూలమంత్రాక్షరములగు పదములను ఆత్మన్యాసము గావించవలయును. మత్యంతతత్త్వములు పృథివ్యాదులు క్రమముగా పృథివి, జలము, వహ్ని, వాయువు ఆకాశము, అహంకారము, మహత్తత్వము. ప్రకృతి, పురుషుడు, పరుడు. అను వాటిని మస్తక నేత్ర శ్రోత్ర నాసికా వదన హృదయ నాభిలింగ జాను పాదములందు న్యాసము చేయవలయును హృదంతములు ప్రణవాంతరితములగు మంత్రాక్షరములను న్యాసము చేయవలయును. దీనిని సృష్టి న్యాసమందురు. ఇక స్థితి న్యాసమును వినుము. హృదయ నాభి ధ్వజజాను పాద మస్తక నేత్ర కర్ణ నాసికా వదనములందు క్రమముగా న్యాసము చేయుట స్థితి న్యాసమనబడును. పాదజానులింగనాభి హృదయముఖ నాసికా కర్ల నేత్ర మూర్ణలందు చేయు న్యాసము సంహార న్యాసమందురు. సృష్టి న్యాసము వరకు బ్రహ్మచారులకు, స్థిత్యంతము గృహస్థులకు, సంహారాంతము యతులకు విధించబడినది. బ్రహ్మచారులకు నాలుగు విధములుగా. గృహస్థులకు అయిదు విధములుగా, యతులకు మూడు విధములుగా చెప్పబడినది. కొందరు గృహస్తులు విరక్తులుగా నున్నపుడు సంహారాంతముగా చెప్పియున్నారు. తరువాత ఇష్టాప్తి కారకు విభూతి పంజర న్యాసమును చేయవలయును. మంత్రములకు దశా వృత్తిమయమగు ఈ న్యాసము కృష్ణ సన్నిధిని చేర్చును. ఆధార ధ్వజ నాభి హృదయకంఠముఖశయ ఊరుకంధర నాభి కుక్షి హృదయ స్తన పార్శ్వ శ్రోత్ర మస్తక వదన మస్తక నేత్ర కర్ల నాసాపుట కపోల దక్షిణ దోర్మూల సంధ్యగగుళి శిరస్సులందు, పూర్వాది "దిక్కులందు, స్వకలలందు, బాహుసక్తి శిరోనేత్ర ఆస్య కంఠహృదయ జఠర మూలాధార లింగజాను పాద శ్రోత్ర గండ భూజ వక్షోజ పార్శ్వ లింగములందు న్యాసముగావించవలయును. మరల ఊరు జాను జంఘ పాదములందు క్రమముగా న్యాసము చేయవలయును. ఇదియే విభూతి పంజర న్యాసము. సర్వార్థ సిద్ధి ప్రదము - ఈ -న్యాసముచే కృష్ణ స్వరూపుడగును.
మొదట చెప్పిన మూర్తి పంజప న్యాసమును చేయవలయును. తరువాత న్యాస శేషములగు పంచాంగ దశాంగన్యాసములను చేయవలయును. హృదయ మూర్ఖశిఖా సర్వాంగ దిక్పార్శ్వ కటి పృష్ఠములందు న్యాసము చేయవలయును. మరల సావధానమనస్కుడై చక్రములచే పంచాంగన్యాసము కావించవలయును. ఇట్లే అష్టాదశాక్షర మంత్రమునకు చెప్పబడిన మరియొక న్యాసమును చేయవలయును. తరువాత కిరీట మంత్రముచే వ్యాపకము నాచరించవలయును. అట్లే సాధకోత్తముడు వేణు బిల్వాది ముద్రలను చూపవలయును. సుదర్శన మంత్రముచే దిగ్బంధమును చేయవలయును. అంగుష్ఠరహితములగు అంగుళులు చక్కగా ఉన్న చో హృదయముద్రయగును. అధోంగుష్ఠముగా నున్న ముషిని శిఖాముద్ర యందురు. కరాంగులులు చాచి యుంచినచో కవచముద్ర యగును. నారాచముష్టిచే బాహు యుగ్మమును ధరించి అంగుష్ఠతర్జనులచే ధ్వని వచ్చునపుడు అర్థముగా విముక్తాంగులు కలది అస్త్రముద్రయగును. ఈ ముద్రలో తర్జని మధ్యమములు అక్షి స్థానమున నుండును. వామకరాంగుష్ఠము ఓష్ఠమున లగ్నమై కనిష్ఠిక దక్షిణాంగుష్ఠసక్తమై, "దక్షిణ కనిష్ఠిక చాచియుండి, తర్జని మధ్యమములు కొంచెము ముడిచి చాచినచో వేణు ముద్రయగును. ఇది అతి రహస్యమైనది. శ్రీహరికి మిక్కిలి ప్రీతికరమైనది. మాలాశ్రీవత్సకౌస్తుభములు సిద్దములు కావున ఆ ముద్రలను చెప్పుట లేదు. సముద్రమగు వామాంగుష్ఠమును దక్షిణకరాంగుష్ఠముచే బద్దమై దక్షిణవామాంగుళులచే అగ్రభాగమును పీడించి, స్వహృదయ పద్మమున గాడబద్దమై కామబీజమును స్థాపించవలయును. ఇట్లు చేసినచో దీనిని బిల్వముద్ర యందురు. ఇది అతి రహస్యము సకల సుఖకరము. ఇట్లు ముద్రిజ్ఞానముచే కాయికవాచికమానసిక పాపములన్నియూ నశించును. ఇట్లు ఈ మంత్రమునకు ధ్యానము, జపము, త్రికాల పూజనము చేయవలయును. దశాక్షర అష్టాదశాక్షర మంత్రములకన్నింటికి ఒకే క్రమము చెప్పబడినది. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత ప్రయోగములను చేయవచ్చును.
ఉద్దండబాహువై దోర్దండముచే గోవర్ధన పర్వతమును ధరించినవాడు, మరియొక హస్తముచే ధరించిన వేణువునందు మోము చేర్చినవాడు అగు శ్రీ కృష్ణుని ధ్యానించుచు మంత్రము జపించి గొడుగు లేకనే వెళ్ళవచ్చును. వర్షము గాలి : పిడుగుల నుండి అతనికి భయము కలుగదు. వ్యర్థములగు మేఘసమూహములను - చూచి తీసుకాని వెళ్ళునట్లు ఇంద్రుని చేసిన శ్రీకృష్ణుని స్మరించుచు పది వేల కోణములచే హోమమును గావించినచో అనావృష్టి ఏర్పడును." యమునానదీ, తీరమున మజ్జన సానాదులచే క్రీడించుచుచున్న, . యమునానదీ శీకరములను చల్లుచున్న ప్రియురాళ్ళచే కూడియున్న శ్రీ కృష్ణపరమాత్మను ధ్యానించుచు పాలు కల్పిన నీటి తర్పణములచే కాని, హోమముచే కాని పది వేలు చేసినచో అకాలమున కూడాఆ మహా వృష్టి సంభవవించును. విస్పోటక జ్వరాదులచే దాహమోహాదులచే ఆరుడైనవాడు ఈ కృష్ణుని స్మరించుచు జపమును చేసినచో శాంతి కలుగును. లేదా గరుడారూఢుని ప్రద్యుమ్సబలరామసహితుని, నిజ జ్వరముచే తపించబడు జ్వరముచే స్తోత్రము చేయబడిన అచ్యుతిని ధ్యానించి మంత్రమును జపించినచో జ్వరము కలవాడు జ్వరవిముక్తుడగును. ఇట్లు ధ్యానము చేసి అగ్ని యందు చెప్పబడిన చతురంగులములగు అమృతాఖండములచే హోమముగావించినచో జ్వరశాంతి కలుగును. బాణముల వలన కలుగు భీష్ముని చాపమును హరించు కృష్ణుని ధ్యానించుచు జ్వరార్హుని చేతితో తాకినచో జ్వరశాంతి కలుగును. సాందీపునికి పుత్రునిచ్చుచున్న కృష్ణుని ధ్యానించి పదివేలు హోమముగావించవలయును. అట్లు చేసినచో అపమృత్యువు నశించును. బ్రాహ్మణునకు చనిపోయిన పుత్రులను అర్పించిన అర్జునునితో కూడియున్న శ్రీ కృష్ణుని ధ్యానించి లక్ష జపించినచో పుత్ర పౌత్రాది వృద్ధి కలుగును. మధురములగు పుత్రజీవఫలములచే ఆ సమిధలచే వృద్ధి పొందిన అగ్నియందు హోమము గావించినచో దీర్ఘయుష్మంతులగు పుత్రులు కలిగెదరు. రాత్రియందు పాలు కల చెట్టు ద్రవముచే నిండిన కలశమును పూజించి ప్రాతః కాలమున పది వేలు జపించి ఆ జలముచే పన్నెండు దినములు స్త్రీని అభి షేకించినచో గొడ్రాలు కూడా దీర్ఘాయుష్మంతులగు పుత్రులను పొందును. ప్రాతఃకాలము వాచంయమ అశ్వత్త పత్రముల దాప్పలోని జలమును అష్టోత్తర శతముచే మంత్రించి పుత్రులను కోరు స్త్రీ, ఒక మాసము త్రాగినచో గొడ్రాలు కూడా సర్వలక్షణ సంపన్నుడగు పుత్రుని పొందును. కాశిరాజుచే పంపబడిన కృత్యను జయించి అతని నగరమునే దహింప చేసిన హరిని భావించుచు నూనె కలిపిన ఆవాలచే ఏడు దీనములు హోమముగావించినచో కృత్యను ప్రయోగించిన వానినే కృత్య నశింప చేయును. రేగి చెట్లు గల దివ్యాశ్రమమున నుండి ఘంటాకర్లుని శరీరమును స్పృశించుచున్న శ్రీ కృష్ణుని ధ్యానించి త్రిమధురమిశ్రితములగు తిలలచే లక్ష జపించినచో మహాపాపములు కలవాడైననూ పవిత్రుడగును. ద్యూతాసక్తులగు రుక్మి బలరాములను ద్వేషించుచున్న శ్రీహరిని స్మరించుచు గోమయగులికలచే నిత్యము వేయి చొప్పున ఏడుదినములు హోమము గావించినచో శత్రువులు పరస్పరము ద్వేషించు కొందురు. పారిపోవు శత్రువుల వెంట బడి గరుడారూఢుడై అగ్న ముఖులగు శరములను వర్షించు శ్రీకృష్ణుని ధ్యానించుచు ఏడు వేలు జపించినచో ఏడు దినములలో శత్రువులకు ఉచ్చాటనము జరుగును. ఆవు దూడ నెత్తి వెలగ పండ్లను హరించు కృష్ణుని ధ్యానించుచు పదివేలు జపించినచో శత్రూచ్చాటనము వెంటనే జరుగును. సింహాసనము నుండి పడవేసి కంసుని వధించి కంసుని శరీరమును లాగుచున్న కృష్ణుని ధ్యానించుచు మంత్రమును జపించి శత్రు జన్మ నక్షత్ర వృక్ష సమిధలచే రాత్రి పూట పదివేలు జపించినచో ఉగ్రుడగు శత్రువు కూడా నశించును. లేదా వేపనూనె కలిపిన అక్షవృక్ష సమిధలచే రాత్రి యందు పదివేలు హోమముగావించినచో త్వరలో శత్రునాశము సంభవించును. శ్మశానమున ఏరండతైల మర్రితములగు కార్పొసముచే కాని అస్తులచే హోమమును గావించినచో శత్రునాశము కలుగును. మారణకర్మ ప్రశస్తము కాదు. ఒకవేళ చేసినచో మనశ్శాంతి కాఱకు సావధానమస్కుడై పదివేలు హోమము గావించవలయును. లేదా పాయసముచే హోమమును చేయవలయును. పారిజాతహరుడగు కృష్ణుని ధ్యానించుచు లక్ష జపించవలయును. అట్లు చేసిన వారికి అంతట జయమే కలుగును. పరాజయము కలుగదు. రథము మీద నుండి వ్యాఖ్యాముద్రకరుడై పార్డునకు గీతనుపదేశించుచున్న కృష్ణుని ధ్యానించుచు తేనే కలిపిన మోదుగు పూవులచే లక్ష హోమమును చేసినచో సకల విద్యానిష్ణాతుడగును. రాష్ట్ర పుర గ్రామ వస్తువుల రక్షను, ఆత్మ రక్షణను భానుకోటి సమప్రభుడు, విశ్వరూపధరుడు, చామీకర ప్రభుడు, అగ్నీషోమాత్మ కుడు అర్కాగ్నిద్యోతితాస్యాంఘిపంకజుడు, దివ్య భూషణుడు, నానాయుధధరుడు, విశ్వాకాశావకాశుడగు కృష్ణుని ధ్యానించుచు లక్ష జపించవలయును. ప్రాతః కాలమున ఎఱ్ఱని అడవి పూలచే కృష్ణుని పూజించి దీనమధ్యోక్తి విధిచే అష్టోత్తర శతము జపించినచో బ్రాహ్మణులు వశులగుదురు. జాతి పుష్పములచే పూజించినచో క్షత్రియులు, క్రీడారకుడగు కృష్ణుని ధ్యానించుచు ఎఱ్ఱని అశ్వారి పుష్పములచే పూజించినచో వైశ్యులు, నీలోత్పలములచే పూజించినచో శూద్రులు వశులగుదురు. గీత నృత్యరతుడగు కృష్ణుని ధ్యానించుచు నేయి కలిపిన తెల్లని పూవులచే, తండులములచే ఏడు . దినములు ప్రతిదినము హోమముగావించి, ఆ భస్మమును ఫాల భాగమున, శిరస్సున ధరించినచో స్త్రీ వశమగును. స్త్రీ చేసినచో పురుషుడు వశమగును. తాంబూలము, పుష్పము, అంజనము, వస్త్రము, చందనము, ఈ వస్తువులను వేయి మంత్ర జపము గావించి ఏ నరునికిచ్చిన ఆ నరుడు సపుత్రపశుబాంధవుడుగా వశమగును. గోపికా సహితుడై బృందావనముననున్న కృష్ణుని ధ్యానించుచు ఉత్తరేణి సమిధలచే హోమముగావించినచో జనులు వశమగుదురు. సద్గురువు నుండి దీక్షను పొంది ఈవిధిచే కృష్ణుని పూజించినచో అష్టసిద్దేశ్వరుడగును. అతనిని చూచినంతనే ప్రతివాదులు తేజోహీనులగుదురు. వస్త్రమున సరస్వతి, గృహమున సభాసదులుందురు. ఇహమున పలు భోగములననుభవించి అంతమున విష్ణుపదమును చేరును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున తృతీయపాదమున కృష్ణమస్త్రానిరూపణమను ఎనుబదియ - అధ్యాయము సమాప్తము.
