నారద మహా పురాణము - పూర్వార్థము
107 - మత్స్యపురాణానుక్రమ కథనము
బ్రహ్మ పలికెను :
ఈ భూమండలమున ఏడు కల్పముల చరిత్రను చెప్పిన మత్స్య పురాణమును చెప్పెదను. వేదజ్ఞుడగు వ్యాస మహర్షిచే నారసింహోప వర్ణనమును ప్రారంభించి పదునాలుగు వేల శ్లోకములు చెప్పబడినవి. మొదట మను మత్స్య సంవాదము, బ్రహ్మండ కధనము, బ్రహ్మఉత్పత్తి దేవాసురోత్పత్తి, మారుతోత్పత్తి, మదనద్వాదశీమహిమ, లోకపాలపూజనము, మన్వన్తరోద్దేశము, వైశ్యరాజ్యాభి వర్ణనము, సూర్యోత్పత్తి, సూర్యవంశీయుల ఉత్పత్తి, బుధసంగమనము, పితృవంశానుకధనము, శ్రాద్ధకల్పము, పితృతీర్థప్రచారము, చంద్రోత్పత్తి, చంద్రవంశకీర్తనము, యయాతిచరితము, కార్తవీర్యచరితము, సృజించబడిన వంశములకీర్తనము, భృగుమహర్షి విష్ణువును భూమిపై దశవిధ జన్మలను పొందునట్లు శపించుట, పూరు వంశకీర్తనము, అగ్ని వంశ కీర్తనము, క్రియాయోగము, పురాణకీర్తనము, నక్షత్ర పురుషవతము మార్తండ శయనము, కృష్ణాష్టమి వ్రతము, రోహిణీ చంద్రవ్రతము, తటాక విధి మాహాత్మ్యము, పాదపోత్సర్గము, సౌభాగ్య శయనము, అగస్త్య వ్రతము, అనన తృతీయా వ్రతము, రసకళ్యాణినీ వ్రతము, ఆనన్ద కరీ వ్రతము, సారస్వత వ్రతము, ఉపరాగాభిషేకము, సప్తమిశయనము, భీమద్వాదశి వ్రతము, అనంగ శయనము, అశూన్య శయన వ్రతము, అంగారక వ్రతము, సప్తమీ సప్తక వ్రతము, విశోక ద్వాదశీ వ్రతము, దశ విధ మేరుప్రదానము, గ్రహశాంతి, గ్రహస్వరూప కధనము, శివచతుర్దశి, సర్వఫలత్యాగము, సూర్యవార వ్రతము, సంక్రాస్తి స్నపనము, విభూతి ద్వాదశీ వ్రతము, షష్టివత మాహాత్మ్యము, స్నానవిధి క్రమము, ప్రయాగ మాహాత్మ్యము, ద్వీపలోకాను వర్ణనము, త్రిపురద్యోతనము, పితృ ప్రవర మాహాత్మ్యము, సురేన్ద భవన వర్ణనము, త్రిపురద్యోతనము, పితృ ప్రవరమాహాత్మ్యము, మన్వన్తర నిర్ణయము, చతుర్యుగ సంభూతి, యుగ ధర్మ నిరూపణము, వజ్రాంగ సంభూతి, తారకోత్పత్తి తారకాసుర మాహాత్మ్యము, బ్రహ్మదేవాను కీర్తనము, పార్వతీ సంభవము, శివతపోవన వర్ణనము, అనంగదేహ దాహము, రతిశోకము, గౌరీత పోవనము, శివుడు పార్వతిని ప్రసన్నురాలిని చేసుకొనుట, పార్వతీ ఋషి సంవాదము, పార్వతీ కళ్యాణము, కుమార సంభవము, కుమార విజయము, తారకాసుర వధ, నరసింహోప వర్ణనము, పద్మోద్భవము, అంధకాసుర వధ, వారాణాసీ మాహాత్మ్యము, నర్మదా మాహాత్మ్యము, ప్రవరానుక్రమము, పితృగాధను కీర్తనము, ఉభయముఖీ దానము, కృష్నాజిన దానము, సావిత్ర్యుపాఖ్యానము, రాజధర్మములు, వివిధోత్పాత కధనము, గ్రహణాంతము, యాత్రా నిమిత్త కధనము, స్వప్న మంగలకీర్తనము, వామన మాహాత్మ్యము, వారాహ మాహాత్మ్యము, సముద్ర మధనము, కొలాకూటాభి శాంతనము, దేవాసుర యుద్ధము, వాస్తువిద్య, ప్రతిమా లక్షణము, దేవతా యతనము, ప్రసాద లక్షణము, మండప లక్షణము, రాబోవు రోజుల కథలు, మహాదానాను కీర్తనము, కల్పాను కీర్తనము ఇవి ఈ పురాణమున చెప్పబడినవి. ఈ పురాణము పరమ పవిత్రము, కళ్యాణ ప్రదము. ఆయుష్య కీర్తి వర్ధనము. ఈ పురాణమును చదివిననూ వినిననూ శ్రీ విష్ణు లోకమును చేరును. ఈ పురాణమును వ్రాసి బంగారు మత్స్యమును, గోవును కలిపి బ్రాహ్మణునకు పూజించి దానము చేసినచో పరమ పదమును పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున మత్స్యపురాణానుక్రమ కథనమను నూటా ఏడవ అధ్యాయము సమాప్తము.
