నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

5 - మార్కండేయ వర్ణనమ్

 నారదుడు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! భగవానుడగు శ్రీమన్నారాయణుడు మృకండు మహర్షికి ఎట్లు పుత్రుడాయెను? భార్గవ వంశమున పుట్టిన శ్రీహరి ఏమి చేసెను ? ఈ విషయమునంతటిని నాకు తెలుపుము. చిరంజీవియగు మార్కండే ముహాముని ప్రళయకాలమున శ్రీమహావిష్ణు మాయను చూచేనని పురాణములలో వినబడుచున్నది.

 సనకమహర్షి పలికెను :- ఓ నారదమహర్షీ ! విష్ణుభక్తితో కూడినది, సనాతనమైనది అయిన మార్కండేయ మహర్షి కథను చెప్పెదను వినుము. మృకండుమహర్షి తపస్సు పూర్తి చేసి వివాహము చేసుకొని శాంతుడై దొంతుడై కృతార్థత నొంది గృహస్థాశ్రమము నాశ్రయించి ఉండెను. మృకండు మహర్షి భార్య పరమ పవిత్రురాలు, సమర్థురాలు; ఎపుడూ పతిభక్తి కలిగియుండెను. కర్మతో మనస్సుతో మాటతో త్రికరణశుద్ధిగా భర్తను సేవించు పరమ పతివ్రత. సరి అయిన సమయమున మృకండు మహర్షి భార్య హరితేజోంశమును కలిగించు గర్భమును ధరించెను. పది నెలలు గడిచిన తరువాత పరమ తేజస్వీయగు పుత్రుని ప్రసవించెను. మంచి లక్షణములతో నున్న పుత్రుని చూచి మృకండు మహర్షి సంతోషించేను. విధిపూర్వకముగా శుభకరమైన - జాతకర్మను చేయించెను. శుక్లపక్షమున చంద్రుడువలె ఆ బాలుడు పెరుగుచుండెను. తరువాత ఆయిదవ ఏట మృకండు మహర్షి ఆనందముతో ఉపనయనము చేసి ధర్మసంహితయగు వైదిక శిక్షను బోధించెను. ఓ పుత్రా! ఎప్పుడూ విధిపూర్వకముగా బ్రాహ్మణులకు నమస్కారము చేయవలయును. మూడుమార్లు అర్యప్రదానముచే సూర్యుని పూజించి వేదాధ్యయన పూర్వకముగా వైదిక కర్మను ఆచరించవలయును. ఎప్పుడూ బ్రహ్మ చర్యముచే తపస్సుచే శ్రీహరిని పూజించవలయును. దుష్టులతో, మాట్లాడుట మొదలగు నిషిద్ధ కర్మలను వదలవలయును. ఎపుడూ విష్ణుభక్తి పరులగు సజ్జనులతో కలిసి ఉండవలయును. ఎవరినీ ద్వేషించరాదు. అందరికి హితమునే ఆచరించవలయును. యజ్ఞములను, వేదాధ్యయనమును, దానములను ఎపుడూ చేయవలయును. ఇట్లు మార్కండేయమహర్షికి తండ్రి వైదిక శిక్ష నుపదేశించెను.

మహానుభావుడైన మార్కండేయమహర్షి ధర్మము నందు ప్రీతికలవాడై అన్ని ప్రాణులయందు దయగలవాడై ఎప్పుడూ శ్రీహరిని ధ్యానించుచు ధర్మము నాచరించుచుండెను. ఆత్మజ్ఞానము కలవాడు, సత్యసంధుడు, సూర్యుని వంటి కాంతి గలవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, శాంతుడు, గొప్పజ్ఞానము కలవాడు, అన్ని తత్త్వములు అర్థమును బాగుగా తెలిసినవాడు కావున శ్రీమన్నారాయణుని ప్రీతి కొఱకు ఉత్తమమైన తపస్సును చేసెను. జ్ఞానియైన మార్కండేయునిచే ఆరాధించబడిన "జగన్నాథుడగు శ్రీహరి పురాణ సంహితను రచించు . వరమునిచ్చెను. పురాణసంహితను చేసినవాడు కావుననే మార్కండేయ మహర్షి నారాయణుడని చెప్పబడినది. దేవదేవుడైన శ్రీమన్నారాయణునకు మహాభక్తుడు చిరంజీవి అగు మార్కండేయ మహర్షికి తన ప్రభావమును చూపగోరిన శ్రీమన్నారాయణుడు ప్రళయకాలమున ప్రపంచమంతా జలమయమైనను మార్కండేయ మహర్షిని మాత్రము సంహరించక అట్లే మిగిల్చెను. విష్ణుభక్తి కలవాడు, జ్ఞానియగు మృకండు పుత్రుడు మహాభయంకరమైన ఆ జలముతో రాలిన ఆకు వలె శ్రీహరి శయనించి ఉన్నంత వరకు అ ట్లేయుండెను.

ఓ నారదమునీంద్రా ! మార్కండేయ మహర్షి శ్రీమహావిష్ణువు సమీపమున ఉన్న కాలప్రమాణమును చెప్పెదను వినుము. పదునైదు నిమేషములు ఒక కాష అనబడును. ముప్పదికాష్ఠలు ఒక కల. ముప్పది కలలు ఒక క్షణము. ఆరుక్షణములు ఒక ఘటిక. రెండు ఘటికలు ఒక ముహూర్తము. ముప్పది ముహూర్తములు ఒక దినము. ముప్పది దినములు ఒక మాసము. ఈ మాసము రెండు పక్షములతో కూడినది యగును. రెండు మాసములు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక అయనము. రెండు అయనములు ఒక సంవత్సరము. ఈ సంవత్సరము దేవతలకు ఒక దీనము. ఉత్తరాయణము పగలు, దక్షిణాయనము రాత్రి. మానవుల ఒక మాసము పిత్స దేవతలకు ఒక దినము. ఆ ప్రమాణము ననుసరించి సూర్య చంద్ర సంయోగము జరిగినచో ఉత్తమ కల్పమని తెలియవలయును. దేవతల మాసమున పన్నెండు వేల సంవత్సరములు దైవత యుగము. రెండువేల దేవయుగములు ఒక బ్రహ్మయుగము. అవే రెండు మనుష్య కల్పములు డెబ్బది యొక్క దివ్యయుగములు ఒక మన్వన్తరము. పదునాలుగు మన్వన్తరములు బ్రహ్మకు పగలు, రాత్రి కూడా పగటి ప్రమాణముగానే యుండును. 28 మన్వన్తర కాలములు గడిచిన పిదప మూడు లోకములు నశించును. మానవ కాలమానప్రకారము కాలప్రమాణము చెప్పెదను వినుము. నాలుగు వేలయుగములు బ్రహ్మకు ఒక దీవసము. - ఈ ప్రమాణము ననుసరించి మాసము సంవత్సరము తెలియవలయును. రెండు పరార్థముల కాలము విష్ణువునకు పగలు. అంతయే కాలము రాత్రి. మృకండు పుత్రుడగు మార్కండేయుడు విష్ణుశక్తిచే మహాభయంకరమైన జలప్రళయమున ఎండుటాకువలె ఇంతకాలముండెను. ఇంత కాలము పరమాత్మను ధ్యానించుచుండెను.

సమయము రాగానే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రను విడిచి బ్రహ్మరూపమున చరాచరమైన ఈ ప్రపంచమును సృష్టించేను. జల. ముపసంహరించబడుటను, జగత్తు సృష్టించబడుటను చూచిన మార్కండేయ మహర్షి ఆశ్చర్యమును చెంది పరమానందముతో శ్రీహరి పొదపద్మములను నమస్కరించెను. మార్కండేయ మహర్షి శిరసున దోలిసి యొగ్గి ఇష్టమైన పొక్కులతో సదానన్దరూపుని స్తోత్రము చేసెను.

మార్కండేయ మహర్షి పలికెను :- వికారమును చెందనివాడు, వేయి శిరస్సులు కలవాడు, ఆదిదేవుడు, ఇతరము ఆధారముగా లేనివాడు, వాసుదేవుడు అయిన శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాను. ఇంతటివాడు అని కొలుచుటకు వీలులేనివాడు, తిరుగులేనివాడు, ఎప్పుడూ సదానన్దస్వరూపుడు, ఊహకందనివాడు, నిర్దేశించరానివాడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. నాశములేనివాడు, పరముడు, నిత్యుడు, ప్రపంచమును చూచువాడు, ప్రపంచమునకు కారణభూతుడు, సర్వతత్త్వ స్వరూపుడు, శాంతుడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. పురాణ పురుషుడు, సిద్దస్వరూపుడు, అన్ని జ్ఞానములకు ఆధారభూతుడు, పరములన్నింటి పరరూపుడు అయిన జనార్ధనునికి నమస్కరించుచున్నాను. పరంజ్యోతి పరంధాముడు, పవిత్రుడు, పరమస్థానభూతుడు సర్వెకరూపుడు, పరముడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. సదానన్ద చిన్మా త్రుడు, పరములకంటే పరముడు, సర్వరూపుడు, సనాతనుడు, శ్రేషుడు అయిన జనార్దనుని నమస్కరించుచున్నాను. సగుణుడు, నిర్గుణుడు, శాన్లుడు, మాయాతీతుడు, గొప్పమాయ కలవాడు, రూపములేనివాడు బహురూపుడు అయిన జనార్దనుని నమస్కరించుచున్నాను. ఈ ప్రపంచమును సృష్టించి, రక్షించి సంహరించు ఆదిదేవుడగు జనార్ధనుని నమస్కరించు చున్నాను. ఓ పరేశా! పరమానన్ద స్వరూపా! శరణాగత వత్సల! కరుణా సముద్రమా, మనస్సుకందనివాడా! నన్ను కాపాడుము. నీకు నమస్కారము. ఇట్లు స్తోత్రము చేయుచున్న మార్కండేయ మహర్షిని గూర్చి జగద్గురువైన శంఖచక్రగదాధరుడు మిక్కిలి ప్రీతితో ఇట్లు పలికెను.

శ్రీ భగవానువాచ :-

 శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- ఈ లోకమున భగవంతుని యందు మనసు నిలిపిన వారు పరమభాగవతులు. వారి విషయమున నేనెపుడూ సంతోషముతో నుండి వారికి సర్వకాలములలో కాపాడుచుందును. ఓ బ్రాహ్మణోత్తమా ! నేనే నా స్వరూపమును మరుగుపరచి ఎపుడూ భగవద్భక్తుల రూపముతో ఈ లోకములను కాపాడు చుందును.

మార్కండేయ మహర్షి పలికెను :- భగవద్భక్తు లెట్లుందురు? ఏ పని చేసినచో భగవద్భక్తులు (భాగవతులు) ఆగుదురు? ఈ విషయమున నాకు చాలా కుతూహలమున్నది కావున వినగోరుచున్నాను.

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- ఓ మార్కండేయ మహామునీ ! భాగవతుల లక్షణమును చేప్పెదను, వినుము. భాగవతోత్తముల ప్రభావమును నూరు కోట్ల సంవత్సరములలో కూడా చెప్ప శక్యముకాదు. అన్ని ప్రాణులకు హితమును కోరువారు, అసూయలేనివారు, మాత్సర్యములేనివారు, ఇంద్రియ నిగ్రమును కలవారు, ఆశలేనివారు, శాంతస్వభావులు భాగవతు లనబడుదురు. పనితో మనసుతో మాటతో ఇతరులను పీడించనివారు, ఇతరునుండి దేనినీ గ్రహించనివారు భాగవతు లనబడుదురు. సత్కథలను వినుటలో సాత్త్విక బుద్ధి కలవారు, సత్కథా భక్తులు, శ్రీమహావిష్ణుభక్తులు భాగవతోత్తము లనబడుదురు. . తలిదండ్రులను గంగా పరమేశ్వర బుద్ధితో సేవించువారు భాగవతోత్తము లనబడుదురు. దేవుని ఆర్చించుటలో ప్రీతి కలవారు. దేవతార్చనను సాధించువారు. దేవతార్చనను చూచి- ఆమోదించువారు భాగవతోత్తములనబడుదురు. యతులను సన్యాసులను సేవించుటలో ఆసక్తి గలవారు పరులను నిందించనివారు భాగవతోత్తము లనబడుదురు. అందరికి హితమును బోధించువారు, గుణములను మాత్రమే గ్రహించువారు భాగవతోత్తములనుబడుదురు. తమవలె అన్నీ ప్రాణులను చూచువారు శత్రువులను మిత్రులను సమముగా చూచువారు భాగవతోత్తములన బడుదురు. ధర్మ శాస్త్రములను బోధించువారు, సత్యవాక్యమునే చెప్పువారు, సత్పురుషులను సేవించువారు భాగవతోత్తములనుబడుదురు. పురాణములను వ్యాఖ్యానము చేయువారు పురాణములను వినువారు పురాణములను చెప్పువారియందు భక్తి కలవారు భాగవతోత్తములనబడుదురు. గోవులను బ్రాహ్మణులను సేవించువారు, తీర్థయాత్రలయందాసక్తి కలవారు భాగవతోత్తములన బడుదురు. ఇతరుల అభివృద్ధిని చూచి అభినందించువారు, హరినామ కీర్తన చేయువారు పరమభాగవతోత్తములు. ఉద్యానవనములను నిర్మించువారు, తటాకములను రక్షించువారు, సరస్సులను బావులను ఏర్పరచువారు, పరమ భాగవతోత్తములు. తటాకములను దేవాలయములను నిర్మించుపొరు, గాయత్రీ మంత్రజపమునందు ప్రీతి కలవారు పరమభాగవతోత్తములు. శ్రీహరి నామములను విని అభినందించి, ఆనందించి శరీరమున పులకలు వచ్చువారు పరమ భాగవతోత్తములు. తులసీవనమును చూచి నమస్కరించువారు, తులసీకొషములను చేపులలో ధరించువారు భాగవతోత్తములు. - తులసీగంధమును వాసన చూచి ఆనందించువారు, తులసీమూల నుత్తికను వాసన చూచి ఆనందివారు బాగవోత్తములు ఆశ్రమాచారములయందు శ్రద్ద కలవారు, అతిథులను పూజించువారు, వేదార్థమును చెప్పువారు భాగవతోత్తములు. శివుని యందు ప్రీతి కలవారు, శివుని యందు మనసును లగ్నము చేసినవారు, శివపాదార్చనలో ఆనందించువారు, త్రిపుండ్రములను ధరించువారు పరమభాగవతోత్తములు. మహానుభావుడైన శ్రీహరి నామములను, శంకరుని నామములను కీర్తించువారు, రుద్రాక్షలను అలంకరించుకొనువారు భాగవతోత్తములు. బహుదక్షిణలిచ్చి యాగములతో శివుని ఆరాధించువారు. ఉత్తమమైన భక్తితో శ్రీమన్నారాయణుని గూర్చి చేసిన యాగములతో ఆతనిని ఆరాధించువారు భాగవతోత్తములు. తమకు తెలిసిన శాస్త్రములను ఇతరుల కొఱకు చెప్పువారు, అంతటా గుణములను మాత్రమే చూచువారు భాగవతోత్తములు. పరమేశ్వరుడైన శివుని యందు, పరమాత్మయగు శ్రీమన్నారాయణుని యందు సమబుద్ధితో ప్రవర్తించువారు భాగవతోత్తములు. శివుని గూర్చి అగ్నికార్యములను, యాగములను, చేయుటయందు ఆసక్తి కలవారు, పంచాక్షరిని జపించుటలో ఆసక్తిని చూపువారు శివుని ధ్యానము, చేయువారు కూడా భాగవతోత్తములు. మంచినీరును దానము చేయుటలో ఆసక్తినిపొందువారు, అన్నదానమును చేయువారు. ఏకాదశీవ్రతమును ఆచరించువారు భాగవతోత్తములు. గోదానము చేయువారు, కన్యాదానమును చేయువారు నా ప్రీతి కొఱకు పనిచేయువారు భాగవతోత్తములు. ఇచట కొందరు భాగవతోత్తములను గూర్చి చెప్పి యుంటిని. నేను కూడా నూరు కోట్ల సంవత్సరములలో నైనను భాగవతోత్తములను గూర్చి సంపూర్ణముగా చెప్పలేను.

ఓ బ్రాహ్మణోత్తమా ! కావున నీవు కూడా ఎల్లపుడు సుశీలుడవు కమ్ము. అన్ని భూతములకు ప్రాణులకు ఆశ్రయుడవై, ఇంద్రియ నిగ్రహము నలవర్చుకొని అందరియెడ మైత్రి కలవాడవై, ధర్మమునందే మనసును నిలుపుము. మళ్ళీ వచ్చు ప్రళయము వఱకు సర్వవిధ ధర్మముల నాచరించుచు, నా స్వరూపమును ధ్యానించుటలో ఆసక్తుడవై పరమపదమును పొందెదవు. ఇట్లు దేవదేవేశుడు దయానిధియైన శ్రీమన్నారాయణుడు మృకండుమహర్షి పుత్రుడు, తన భక్తుడు అయిన మార్కండేయ మహర్షికి వరమునిచ్చి అక్కడనే అంతర్థానము చెందెను. మహానుభావుడైన మార్కండేయమహర్షి కూడా ఎల్లప్పుడూ హరి భక్తిచే ఆనందించుచు పరమ ధర్మము నాచరించెను. విధిపూర్వకముగా యజ్ఞములచే శ్రీమహావిష్ణువును పూజించెను. పరమ పవిత్రమైన శాలగ్రామ క్షేత్రమున ఉత్తమమైన తపస్సు నాచరించెను. శ్రీమహావిష్ణువును ధ్యానించుచు శ్రీ నారదీయ మహాపురాణమ్ కర్మలను క్షీణింపచేసుకొని పరమ పదమును పొందెను. కావున అన్ని ప్రాణులకు హితమును కలిగించుచు శ్రీమహావిష్ణువును పూజించువాడు మనసులో కోరిక లనన్నింటిని పొందగలడు. ఈ విషయమున ఏ మాత్రము సంశయము లేదు.

 సనక మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! నీవు అడిగిన భగవద్భక్తి మాహాత్మ్యమునంతటిని చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచుంటివో తెలుపుము.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున మొదటిపాదమున మార్కండేయ వర్ణనము అను అధ్యాయము సమాప్తము.