నారద మహా పురాణము - పూర్వార్థము
54 - జ్యోతిషవర్ణనమ్
సనందన మహర్షి పలికెను :- పూర్వము బ్రహ్మ చెప్పిన జ్యోతిషాంగమును చెప్పెదను. జ్యోతిషమును తెలిసిన మానవులకు ధర్మ సిద్ది లభించును. ఈ జ్యోతిష శాస్త్రము మూడు స్కంధములు గలది. నాలుగు లక్షల శ్లోకములు గలవు. గణితము, జాతకము, సంహితయని మూడు స్కంధములు. గణిత భాగమున పరికర్మ మొదలుకొని ఆకాశ మధ్యమున నుండు క్రియా స్పుటము, గ్రహానుయోగము, చంద్రసూర్యగ్రహణము, శృంగోన్నతి ఛాయలు, పాత సాధనము చెప్పబడినది. జాతక భాగమున రాశి భేదము, గ్రహకారణములు, గర్భాధాన, జన్మ అరిష్టములు, ఆయుర్దాయము, దశాక్రమము, జీవనమున చేయు కర్మ, అష్టవర్గము, ఆకాశమునకు సంబంధించిన రాజయోగములు, చంద్రయోగము, రాశిశీలము, దృక్ఫలము, గ్రహభావఫలము, ఆశ్రయయోగప్రకీర్ణకములు, అనిష్టయోగములు, స్త్రీ జన్మఫలము, నిర్యాణము, నష్టజన్మ విధానము, దేష్కాణలక్షణము, చెప్పబడినవి. సంహితాభాగమున గ్రహచారము, అబ్దలక్షణము, తిథి, వార, నక్షత్ర, యోగ, తిధ్యర్థ సంజ్ఞలు, ముహూర్తోప గ్రహములు సూర్యసంక్రమణము, తారా చంద్రబలములు, సర్వలగ్న ఋతువులు, గర్భాధాన, పుంసవన, . సీమంత, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, మౌంజీ, కురికా బంధనము, సమావర్తనము, వివాహము, ప్రతిష్ణా, గృహలక్షణములు యాత్రాగమనము, సద్యోవృష్టి, విశేషకర్మలు, ఉత్పత్తి లక్షణము అంతయూ చెప్పబడినది. దానిని నేను సంక్షేపముగా చెప్పెదను. ఒకటి,పది, శతము, సహస్రము, అయుతము, లక్ష, ప్రయుతము (పదిలక్షలు), కోటి, అర్బుదము (పదికోట్లు), అబ్జము, ఖర్వము, నిఖర్వము, మహాపద్మము, శంకు, జలధి, అంత్యము, మధ్య, పరార్ధము అని సంఖ్యల సంజ్ఞలు. ఈ సంజ్ఞలు మొదటి దాని కంటే తరువాత నున్నది పది రెట్లని తెలియవలయును. క్రమముగా కాని ఉతమముగా కాని సంఖ్యాయోగముననుసరించవలయును. గుణము చేయబడిన దానిని గుణ్యమందురు. గుణ్యముచే ఉపాంతిమాదిమములను శుద్ధి చేయవలయును. హరించబడిన గుణమును భాగించుటచే చివరగా మిగిలినది ఫలమనబడును. సమమైన అంకములు గలది వర్గమనబడును. ఈ వర్గనే కృతి యందురు. విషమమైన అంత్యమునుండి కృతిని విడదీసి మూలముగా విడిగా నుంచవలయును. దీనిని రెట్టింపుచే భాగించగా వచ్చిన ఫలమును క్రమముననుసరించి మూలమున నుంచవలయును. అపుడు దాని కృతిని - వీడువవలయును. మరల మూలమున భాగించవలయును. ఇట్లు మాటిమాటికి చేసినచో వర్గమూలమేర్పడును. మూడంకములతో సమముగా భాగించవలయును. ఇట్లు భాగించగా వచ్చిన దానిని ఘనమందురు. మూటీలో మొదటి దానిని విషమమందురు. మిగిలిన రెండు సమములనబడును. తరువాత విషమమగు అంత్యమునుండి ఘనమును శుద్ధి చేయవలయును. ఇట్లు శుద్ధి చేయబడిన ఘనమే మూలమనబడును. ఇట్లు మూటిచే భాగించబడిన దానిని మూలముచే కలిపి, సమమైన దానిని మూలమున ఫలముగా నుంచవలయును. దానిని కృతిచే భాగించబడగా, దానిని కూడా శుద్ధి చేయవలయును. ఇట్లు విషమము నుండి ఘనమును, ఘనమునుండీ ఘనమూలమును మాటి మాటికి శుద్ధిచేసి తేల్చవలయును. ఇట్లు ఒకదానిచే ఒకటి భాగించబడినపుడు, భాగాంశములను వేరు చేయవలయును. లవములు, లవఘ్నములు, హరములు హరఘ్నములు, అని శాస్త్రార్థచింతకులు భాగప్రభాగములను తెలియవలయును. అనుబంధమున కొని . అసవాహమున కొని ఒకదానికి ఎక్కువగా కానీ తక్కువగా కొని యున్నపుడు చేతిలో నున్న హారభాగముచే విభజించి, హరమును స్వాంశాధిక్యముచే విభజించవలయును. తక్కువగా నున్నదానిచే కూడా గుణించవలయును. గుణించునపుడు ఘనమును (మూలమును) ఋణమును గుర్తుంచుకొనవలయును. చివరలో సమముగా నున్న హరాంశములను కలుపవలయును. హరముకాని రాశిలో కూడా హరమును కల్పించవలయును. అంశభాగమైనపుడు భాగించబడిన హరభాగమును గుణించినచో వచ్చునది ఫలమగును. హారమును -పరివర్తనము చేసి భాగించగా వచ్చు భాగమును లవమని తెలియుము. భాగహారమున శేషమును చూపవలయును. వచ్చిన దానిని గుణించవలయును. హారాంశలలోని కృతిని, వర్గమును ఘనవిధిలో ఘనమును విడిగా చూపవలయును. పదము సిద్ధించుటకు పదమున క్రింద, 'అంతట శూన్యము వచ్చునట్లు భాగించవలయును. భోగమును గుణముగ, గుణమును భాగముగా వర్గమును, మూలముగా, పదమును కృతిగా, ఋణమును శూన్యముగా శూన్యమును ఋణముగా చేసినచో రాని తెలియును. స్వాంసము కంటే, అధికముగా కొని తక్కువగా కానీ భోగమున్నపుడు లవమును తక్కువగా చేసినచో వచ్చినదానిని హరమందురు. ఈ విషయమున విలోమమున మాత్రము అంశము వికారమును చెందదు. శేషము మొదటి చేయవలయును. ఉద్దేశించబడిన రాగి తగ్గినపుడు అంశములతో హరించబడును. అంశహారము కొనిది యుతమనబడును. ఇట్లు ఇష్టమును భాగము చేయగా వచ్చిన దానితో భోగము చేయబడిన రాశిని కలుపరాదు. ఇట్లు కలుపక ఉన్నదానిని, తక్కువగా ఉన్నదానిని . రెండుగా రాశులనేర్పరుచ వలయును. రెండు రాశులలోని భేదమును, వర్గము తరువాత నున్నదానిని ఒకటిగా చూడవలయును. హారమైనదీ అంశరహితమైనది . యుతమగును. ఇష్టముచే హృతమైన దానతో భాగరాశితో కలుపవలయును. మరొక దానితో కలిసిన యుతమును భాగరాశినీ సంక్రమింపచేయవలయును. ఇతర రాశితో హతమైన దానిని వర్గము తరువాత నున్నదానిని రెండును విడిగా చూపవలయును. ఇవియే మూలము యుతములనబడును. దీనినే గజాగ్రీ, ఇష్టకృతి యందురు. ఇష్టముచే భాగింపబడినది దలితమనబడును. ఈ రెంటిలో ఒకవర్గము దలితము రెండవది పరరాశియనబడును. ఇష్టము కంటే రెట్టింపుచే హారమైనది శ్రేష్టరూపము. రెండవది పరరూపముఇదియే మొదటీ రూపముతో కనపట్టును. వర్గయోగాంతరములు భిన్నముగా నుండును. ఈ రెంటిరాశులనే వర్గములుగా వ్యవహరించబడును. ఒకటి ఇష్టవర్గకృతి, మరియొకటి ఇష్టధనము. ఇష్టధనము ఉష్ణగ్రము అని ఒకరాశి కే రెండు పేర్లుండును. ఈ రెండు రాశులనే వ్యక్తములందురు. ఈ గణితమే వ్యక్త గణితమందురు. . గుణించబడిన మూలము యుతము కాదు. గుణించబడినదానిలో సగభాగము పదమనబడును. గుణార్ధముగా చూచినది కూడా యుతము కాదు. వర్గముగా చేయబడినది మాత్రమే గుణమనబడును. పుంరాశి లవ దృశ్య మైనపుడు భాగముకంటే తక్కువ దానిచే కలిసియుండును. ఇట్లు భాగించబడినది, మూలగుణము అను ఈ రెంటిచే వ్యక్త గణితమును సాధించవలయును. ప్రమాణము ఇచ్ఛ, సమానముగా నున్నచో (సజాతీయములైనచో) ఆద్యంతములుగా నున్నచో ఫలము మధ్యమున నుండును. మొదటి హరము ఇచ్చను కొట్టివేయును. దీనినే ఇష్టఫలమందురు. విజాతీయములైనచో విపర్యయము వలన ఫలము అనబడును.
పంచరాశ్యాదిక స్థలములో ఫలమును విభజించు రాశులను పరస్పరముగా విభజించి రెండు పక్షములను చేసి ఎక్కువరాళీగా ఉన్నదానిని భాగహరమునుచేసి తక్కువదానిచే కొట్టబడిన, దానిని ఫలముగా నిర్ణయించవలయును. ఇష్టకర్మఘాతమునకు కలిసి యున్న కలాంతరము నుండి చ్యుతమైనది మూలమగును. మాన నీఘాతమగు కాలము ఆతీతకాలనిఘాతమగు ఫలముచే సమన్వయము చేయబడును. కేపములన్నియూ మిశ్రహతములగును. కేపయోగముచే భాగించబడినవి ఫలములగును. భిన్నమైన అంశములచే విభజించవలయును. వాటితో కలిసియున్న రూపము కాలము పూర్తి చేయునదగును. పూర్ణభాగము సమభాగమును చెందును. వ్యంకమున సమమున వర్గమున అర్థభాగము నిలీనమగును. వ్యస్తమును పొందుచున్న ఫలము ఏ గుణవర్గమును చేరినదో చూడవలయును. వ్యేకము, వ్యేకగుణమును పొందినది, ఎక్కువరాశిచే భిన్నమైనది ఉత్తరగుణమున మానమగును. (కొలబద్ద) రెండు భుజముల కలయికచే ఏర్పడినది భుజములకు కర్ణమగును. శ్రుతికృతుల మధ్యనయున్నది. భుజకోటి ద్వయమున నున్నదీ భుజభాగమగును. ఆ కృతి సంక్షేపమును భిన్నము చేసినది వ్యాసమగును. ఇదియే పరిధియనబడును. నారివ్యాసముల కలయికచే ఏర్పడిన వివరముచే ఆహతమగు మూలమునే అర్ణీతమందురు. గణతములో వ్యాసము శరము అని రెండు సంజ్ఞలుండును. శరము కంటే తక్కువగా నున్నదానికి, వ్యాసము కంటే శరగుణము కంటే అవతలనున్నది పదమనబడును. రెంటిచే విభజించబడునది జీవము. శరహితమగు యుతమున జీవార్ణము గా పేర్కొనబడును. వ్యాసభాగము అష్టవిధముగా భిన్నమగుచో నని గణీతకోవిదులు చేప్పేదరు. ధనువు కంటే తక్కువగొనిచే హతనుగునదీ పరిధియనబడును పరిధిని విభజించినచో ప్రదాజమగును. నాలగవ భాగమగు శరాంశముచే అర్థము చేయబడిన భాగము నాలుగరెట్లుండును. వ్యాసముచే విభజించబడిన దానిని మరల విభాగము చేయబడినది కాశమగును. దీనినే స్పుటమందురు. జ్యా భాగముచే శరభాగముచే విభజించబడినది వృత్తవర్గమగును. నాలుగింటిచే విభజించబడిన వృత్తవర్గము, నాలుగింటిచే విభజించబడినది వ్యాసమగును. ఈ వ్యాసమే జ్యాభాగమును హరించును. లబ్దముకంటే తక్కువగానున్న వృత్త వర్గమున ఏడుచే కాని రెంటిచే కొని వెలగట్టినది పతితమగుచో ధనువగును. స్థూలమధ్య భాగమును పొందిన దానిని వేధ చేసినచో వృత్తాంక శేషభాగమగును. వృత్తాంగాంశము యొక్క కృతిచే విద్దమైనదీ కరమితమగును. వారి వ్యొసహతమగునది మరల దీర్ఘమేధాంగులఘ్నమగును. మూడుమార్లు ఒకటిచే భాగించబడినది, మూడుచే భాగించబడినది ద్రోణమునుండి వారివరకుండు మానమగును. వైశాల్యము, పొడుగుగా ఉన్నవాటిని అంగుళములచే నాడులచే విభజించవీలయును. ఆరింటిచే ఏడింటిచే, నాలుగింటిచే విభజించబడినవి ధాన్యమున ద్రోణాదీమానము పరిగణించబడును. ఎత్తు, వెడల్పు, పొడుగును అంగులములచే కొలవవలయును. పరస్పరము ఒకదానితో వేరొకదానిని కలిపి విభజించవలయును. ఒకటితో తొమ్మిదితో, పన్నెండుతో విభజించినచో ద్రోణాది మానమేర్పడును. వెడల్సు మొదలగువాటిని అంగుళాదులతో లెక్కించవలయును. పరస్పరము కొట్టివేయబడినచో మాన నిర్ధారణ జరుగును. అయిదింటిచే, ఎనిమిదింటిచే, అయిదింటిచే విభాగము చేయగా లభించినది ద్రోణామానముగా నిర్దేశించవలయును. దీప శకుంతల ఛిద్రములచే కొట్టివేయబడినచో శంకువగును. నరభాగము కంటే తగ్గిన భాగము దీపశిఖము కంటే ఎక్కువ భాగములచే విభజించబడినది ఆకాశభాగమగును. శంకువునందు నరదీప అఘఛిద్రములచే కొట్టి వేయబడినపోటిచే దీపోచ్చ. భాగమును నరాన్వితమగును. విశంకు దీప భాగములకంటే ఉన్నతమగునది గుణచ్ఛాయ శంకుచే ఉద్ధృతమగును. దీప శంకు మధ్యలోనున్నది ఛాయాగ్ర వివరమును కొట్టివేయును. మానాంతరముచే కొలువబడు: భూమి నరాహతమగును. ప్రభచే పొందబడినది దీపశిఖకంటే ఉచ్చయగును. ఇదియే రాశిత్రయమగును. ఇది సంక్షేపముగా గణితకర్మ చెప్పబడినది. ఎక్కువ విస్తరముగా కాకుండగా గ్రహమధ్యభాగము మొదలగు దానిని చేప్పెదను.
నాలుగు ఆకాశ సంఖ్యగల వత్సరములు నాలుగు సముద్రసంఖ్య గల వత్సరములు. యుగచూనము. దానిలో దంశాశములగు నాలుగు కలిసినపుడు కృతయుగము ఒక పొదమగును. మూడు దశాంశములు త్రేతాయుగము రెండవపాదమగును. రెండు దశాంశములు ద్వాపరయుగము మూడవపాదమగును. ఒక దశాంశము కలియుగము నాలుగవపాదమగును. డెబ్బదియొక్కయుగములు ఒక మనువు కాలము. బ్రహ్మకు ఒకపూటలో పదునలుగురు మనువులు ఉందురు. బ్రహ్మ రాత్రి కూడా అంతయే కాలముండును. బ్రహ్మ కౌలమును అయిదు భాగములుగా విభజించి అయిదవ భాగముచే ఖచరానయనమును చేయవలయును. ఇట్లు యుగాది నుండి చేయవలయును. ఒక యుగమున సూర్య బుధ శుక్రులకాలము యుగకాలముతో సమానము. శని గురు శుక్రులకు భగణ పూర్వకాలముగా గుర్తించవలయును. చంద్రునికి 577346 సంవత్సరముల కాలముగా తెలియవలయును. కుజునకు 226835 సంవత్సరములు కొలము. బుధునకు 1763160 సంవత్సరము. బృహస్పతికి 684281 సంవత్సరముల కాలము. శిత శీఘకాలము 712239 సంవత్సరముల కాలము. శనికి వేరొక కాలము 146561 సంవత్సరముల కొలము. ఉచ్చచంద్రునికి 418204 సంవత్సరముల కాలము. వామపాతకాలము 442241 సంవత్సరములు. సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒకదినముగా భూలోకమున పరిగణింతురు. ఒక యుగమున 15727828 సంవత్సరములుండును. అధిమాసముల సంఖ్య 1524346 సంవత్సరములుగా నుండును. తిధి క్షయ కాలము 2518221 సంవత్సరకాలముండును. విమాసములు 1841111 సంవత్సరముల కాలముండును. మాసముల కాలము 1544336 సంవత్సరముల కాలముగా నుండును. సూర్యశనుల సంయోగకాలము 487 కల్పములుగా నుండును. కుజునకు 214, బుధకాలము 468, బృహస్పతికి 110, శుక్రునకు 560, శనిమందగతికి 54, లేదా పాతమునకు అనీ కూడా చెప్పవచ్చును. 142 కుజపొతమునకు, బుధునకు 488, బృహస్పతికీ 171, శుక్రునకు 914, శనిపాతమునకు 662 భగణములు, వర్తమానయుగమున పాతవత్సరములే భగణ నామముచే వ్యవహరించబడుచున్నవి. గడిచిన మధు శుక్లా మాసములచే మాసమానమేర్పడును. సూర్యాది గ్రహములకు విడిగా మాసనామము వ్యవహారమున కలదు. ఇపుడు అధిమాసములతో కలిసి యున్న మాసములను దినములుగా విభజించి, దీనములతో కూడిన వాటిని రెట్టింపు చేసినచో చంద్రవాసరములొచ్చును. రాత్రిలేని పగలును మాత్రమే లెక్కించి, అర్ధరాత్రికాలమును కలిపి సావనమానము చేసినచో అరాది దీనములు మాసములు, సంవత్సరములు కల్పించవచ్చును. మిగిలిన దానిని ఏడుతో భాగించినచో సూర్యాది వాసరములొచ్చును. ఆయావాసరములకు సూర్యాదులే అధిపతులు. మాసమును మొదలుకొని దినసంఖ్య వరకు లెక్కించిన దానిని రెంటితో భాగించి ఏడు కంటే ఎక్కువగా మిగిలిన సంఖ్యకు అధిపతియైన వారు మాసాధిపతియనీ, మూటితో భాగించినపుడు ఏడు కంటే ఎక్కువగావచ్చిన శేషసంఖ్యాధిపతియే సంవత్సరాధిపతిగా తెలియవలయును. కువాసరములతో కలిసిన దానిని భగణముతో రెట్టింపు చేసినచో దినవచ్చును. సగముగా విభజించినపుడు వచ్చినసంఖ్యకు భ గణాది నుండి లెక్కించగా అధిపతియగు గ్రహము తెలియును, ఇట్లు పూర్వపాపులుగా అశీఘ్రలు, మందులుగా చెప్పబడిన గ్రహములకు విలోమగతి ఏర్పడినపుడు పాతమని చక్రగతిని బట్టి తెలియవలయును. ఎనిమిదొందల యోజనములు భూకర్ణములుగా చెప్పబడినవి. ఒకవర్గము కంటే రెండో వర్గము రెట్టింపుగా నుండును. ఆ వర్గము కంటే పది రెట్లుగా నున్నది. భూపరిధి యగును. లంబము, జ్యాఘ్నము, స్వజీవాప్తముగానున్న స్పుటమగునది భూపరిధి. ఈ భూపరిధిలో దేశాంతర భాగములను రెట్టింపు చేసి గ్రహభుక్తిచే విభజించినపుడు కలాదులు తెలియును. ఆ ఫలములను గ్రహములనుండి శోధించి తెలియవలయును. తమ ప్రాంతమునుండి రేఖకు పశ్చిమదిశగా గీసి ఆస్థానమును సంఖ్యను వేయవలయును. రాక్షస, ఆతప, దేవనీవాస, పర్వత మధ్యభాగముల నుండి సూత్రమున అనుసరించు ఆరోహణావరోహణలను చూచుచు దగ్గరగా నున్న సరో ప్రాంతమును గుర్తించి, వారప్రవృత్తికి స్థానమైన వాకాంతమున క్షయ భాగమునలోని సగముకంటే ఎక్కువ భాగమునుంచవలయును. ఆ దేశాంతర నాడులచే పశ్చిమభాగమున తక్కువగా నిర్దేశించవలయును. ఇష్టనాడీగుణములు కలది భుక్తియగును. ఈ భుక్తిని ఆరు సంఖ్య చే భాగించిన కలాదికమగును. పూర్తిగా పోయినపుడు శోధించవలయును. అట్ల యోగము చేయవలయును. ఇట్లు చేసినపుడు వచ్చునది తాత్కాలికగ్రహము. భక్త చక్ర లిప్తాంశము గలది అంశియగును. దక్షిణోత్తరముగా నున్నది అంశమగును. చంద్రుడు తన పాతముచే సంక్రాంత్యంతము వరకు విక్షేపము చేయబడును. దానికి రెట్టింపుగా బృహస్పతి, మూడు రెట్లు కుజుడుండును. బుధ శుక్ర శనులు పాతములచే నాలుగు రెట్లు విక్షేపము చేయబడుదురు. రాశిలిపాష్టమ భాగము . మొదట జ్యార్థమనబడును. దానికంటే రెంటితో భాగించగా మిగిలిన దానికంటే తక్కువగా నున్నది కలిసి రెండవ జ్యార్ధమగును. మొదటిదానివలెనే క్రమముగా భాగముచే లభించిన శేషభాగములను లభించిన దానికంటే తక్కువగానున్న భాగములను కలిపినచో ఖండకములగును. ఇవి మొత్తము ఇరువదినాలుగు జ్యార్థ పిండములుండును. క్రమముగా అన్నిటికంటే పరమైనది అపక్రమజ్యార్థము 1607 గా తేలును. దీనికి మూడు రేట్లుగా గుణజ్యాయగును. చాపమును క్రాంతియందురు. గ్రహమును చక్కగా మందత్వమును, ఉచ్చత్వమును, శీఘత్వాదులనుండి శోధించి మిగిలిన దానిని కందపదముగా పేర్కొనవలయును. దీని నుండి భుజము, జ్యా, కోటి భాగములనేర్పరచవలయును. గతమునుండి భుజ జ్యాభాగములను విషమముగా, గమ్యమునుండి కోటి పదములో నుండును. గమ్యమునుండి వచ్చిన భుజ జ్యా భాగము సమకుని, దానిననుసరించి వచ్చునది కోటిజ్యాయగును. తత్త్వయమలచే విభజించబడిన లిప్తలు జ్య పిండమున లభింపచేయును. దీనినే గతమందురు. గతగమ్యములలోని బేధాభ్యాసమును తత్త్వజ్ఞానము కలవారు విభజించగలరు. అట్లు విభజించగావచ్చిన ఫలమును గతము అను సంజ్ఞకల జ్యా పిండమున కలుపవలయును. ఇట్లు క్రమజ్యావిధి యగును. ఇట్ల ఉత్కమ జ్యావీధి కూడా గతమనబడును. జ్యా భాగమును శుద్ధి చేసి మిగిలిన దానిని తత్త్వముతో భాగించిగా వచ్చినది వివరోద్ధృతమగును. సంఖ్యాతత్త్వము యొక్క అంశులతో సంవర్గ్యములతో కలిసిన దానిని ధనువు అందురు. సూర్యుని మంద పరిధి అంశములు మనవులు. చంద్రునికి ఇట్లుండును. యుగాంతమున, విషమాంతమున నలిప్త భాగమే ఆరెంటికి భేదము. యుగ్మాంతమున 491233413 గా భాగములేర్పడును.
కుజాదులకు ఆయుగాంతమున అయిదున్నరలో లెక్కించవలయును. 4126271146 గా సంఖ్యలు తెలియవలయును. ఓజాంతమున 7222232 సంఖ్యలు తెలియవలయును. గ్రహముల శీఘకర్మలను 4726! సంఖ్యలు తెలుపును. ఓజో యుగ్మాంతర గుణములు భుజ, జ్యూ, త్రిజ్యలతో ఉద్దరించబడును. యుగ్మవృత్తమున్న చో ధనమును అప్పుచేయువాడగును. ఓజము కంటే తక్కువగా ఉన్నను, ఎక్కువగా ఉన్నను స్పుటఫలితము తెలియును. ఓజగుణమును భుజ, కోటి, జ్యా భాగములలో భగణాంశములతో విభజించినపుడు భుజ జ్యా ఫలము ధనువైనపుడు మందగతియని, లిప్తాదికములు ఫలముగా తెలియును. కేంద్రమున శేఘ్యకోటి ఫలము, మకరాదులలో నైనచో ధనము ఫలమనీ చెప్పబడినది. త్రిజీవభాగమును శోధించినపుడు కర్కాదులలో నైనచో కోటిజము ఫలమగును. భుజ భాగ ఫలవర్గము ఐక్యమైనచో మూలమగుకర్ణము చలమనబడును. శ్రీజ్యాభ్యస్తమే భుజఫలము ఇదియే ఫల భాగ కర్ణముతో విభజించబడును. విభాగము చేసినపుడు లబ్దమైన భాగము యొక్క చాపమే లిప్తాదులను తెలుపును. దీని ఫలము శైఘ్యాదికమని తెలియుము. ఇట్లు కుజాదులకు చతుర్ధకర్మలో మాంద్యము కర్మగా నుండును. సూర్యునిలో ఒకటి, కుజాదులకిపుడు చెప్పెదను. శీఘ్రత, మాంద్యము, మరల మాంద్యము శీఘ్రత ఇట్లు వరుసగా నాలుగు సంభవించును. అన్ని గ్రహములకు మేషాని కేంద్రములందు మాంద్య శీఘ్రకర్మలలో లిప్తాదుల ఫలము ధనముగా తెలియును. తులాదులలో నైనచో ఫలము ఋణము. సూర్యభుజ ఫలమును రెట్టించినచో, గ్రహభుక్తితో విభజించబడి భచక్రళలినాదులతో కలిసిన లిప్తలను సూర్య గ్రహమునందువలె చూడవలయును. మందకర్మలో గ్రహమువలే గ్రహభక్తమును ఫలముగా చేయవలయును. అట్లు చేసినపుడు కర్కాదులొచ్చినచో ధనమని, మకరాదులోచ్చినచో ఋణమనీ తెలియవలయును. భుజభాగము జ్యూభాగము తరుపోత గుణభుక్తి చతురులైన. చారిచే ఉద్దరించబడినపుడు స్వమందపరిధిచే క్షుణ్ణమై భగణాంశములచే ఉద్ధరించబడిన కలలు మందస్ఫుటములుగా చేయబడిన భుక్తి శీఘ్ర ఉచ్చ భుక్తి చే శోధించబడి మిగిలిన దానిని వివరముచే కొట్టివేయవలయును. ఈ కొట్టివేత కూడా త్రి ,జ్యాంకభాగమున కర్ణములయందు మాత్రమే చేయవలయును. చక్రకర్ణ హృతమే భుక్తిలో ప్రాజ్యాధిక కర్ణములో నున్నచో ధనము. ఫలమని చెప్పవలయును. తక్కువగా ఉన్నచో ఋణము ఫలముగా తేలును. అధికమున శుద్ధిచేయగా మిగిలినది వక్రగతిగా తెలియవలయును. 6, 1, 4, 1, 0, 1, 1, 6, 8, 5, 11, లలో చతుర్థాంశ కేంద్రాంశములలో కుజాదులున్నపుడు వక్రులుగా, చక్రశుద్ధాంశలచే రుజువక్రతలను తెలియవలయును. క్రమ జ్యభాగము విషువు వలే నక్షత్రముచే కొట్టి వేయవలయును. పన్నెండునుండి ఉద్దరించబడిన క్షితిజ్యాభాగము, త్రిజ్యా భాగముచే గుణించినపుడు దీనవ్యాస భక్త మైనచో చాపము వచ్చిన శత్రువృద్ధి ఫలమగును. ఆ చాపము ఉదకొంతమైనపుడు, విడివిడిగా కొట్టివేయబడినపుడు ధన హీనుడగును. తన తన అహోరాత్రముల చతుర్బాగమున దినరాత్రి భాగములుండును. యామ్య కొంతిలో, విపర్యస్తముగా నున్నపుడు, దినకయమున దీనిని రెట్టింపు చేయవలయును. నక్షత్రభుక్తి ఎనిమిదివందల లిప్తలు. తిథి భుక్తి 72గా ఉండును. గ్రహలిప్తలు నక్షత్ర భుక్తులు, నక్షత్రములు, భుక్త్యాదులచే దినాదికమును తెలియవలయును. సూర్యచంద్రయోగ లిప్తలు మాత్రము నక్షత్రభుక్తులచే విభజించబడినపుడుగా యోగములుగా తెలియును. గతములు గమ్యములు అరవైచే కొట్టివేసినచో భుక్తియోగముచే నాడీ విభాగములను పొందును. సూర్యలిప్తలకంటే తక్కువగానున్న చంద్రలిప్తలు భుక్తిచే విభజించబడి తిథులగును. - ఇవి కూడా గతములు గమ్యములు ఆరవై సంఖ్యచే కొట్టబడును. ఇంతకంటే భుక్తి ఇక ఉండదు. శుక్ల ప్రతిపత్ మొదలగునవి తిథులు. రెంటితో కొట్టబడును. ఏడుతో కొట్టబడినచో ఒక ఓ యగును. మిగిలినవి బవ, బాలవ, కౌలవ తైతుల, గరములను పేర్లను పొంది కరణములగును. అభ్రమున వణిజులున్నచో విష్టియగును. పరార్దభాగము కృష్ణపక్షమగును. శకుని, నాగము, చతుష్పదము, కింస్తుఘ్నము అను నామము లేర్పడును. శిలాతలమువలె శుద్ధి చేసినపుడు, వజ్రలేపమువలె సమముగా చేసి భాగమున ఇష్టమైన అంగుళులచే సమమండలమును లిఖించవలయును. ఆ మండల మధ్యభాగమున శంకువును స్థాపించవలయును. శంకువు ద్వాదశాంగులి పరిమితము కావలయును. శంకుచ్చాయాగ్రము తాకిన ప్రదేశము పూర్వాపరాహ్లాదత్తమగును. అచట బిందువునుంచి పూర్వఅపర అను పేర్లుగల రెండు వృత్తముల నేర్పరచవలయును. ఆ రెండు వృత్తముల మధ్యలో అంచుతో దక్షిణోత్తరముగా రేఖ నేరపరచవలయును. దక్షిణోత్తర దిక్కుల మధ్యమున అంచుతో పూర్వపశ్చిమ దిశలకు ఒక రేఖను ఏర్పరచవలయును. దిక్కులమధ్యనున్న మత్స్యములచే విదిక్కులను కూడా గుర్తించవలయును. మధ్యభాగము నుండి వెడలిన సూత్రములచే బయటికి చతురస్రమును చేయవలయును. భుజ సూత్రాంగులములచే దత్తమగునది ఇష్టపభయనబడును. తూర్పు, పశ్చిమములనాశ్రయించిన రేఖ సమమండలమనబడును. నక్షత్రమండలము కూడా విషువు వలె నుండునని చెప్పబడినది. తూర్పు పశ్చిమములలో నున్న 'రేఖకు విషువువలె నక్షత్రాగ్ర భాగముగా సాధించవలయును. ఇష్టచ్చాయ విషువత్తుల మధ్యనున్నది అగ్రాయనబడును. శంకుచ్ఛాయా కృతిచే కూడిన దాని మూలము యవర్గనుండి కర్ణభాగమగును. శంకును పరిశుద్ధి చేసినపుడు మూలమని, శంకు విపర్యయము వలన ఛాయయని వ్యవహరించబడును. నక్షత్రచక్రము యుగమున ముప్పది భాగములుగా తూర్పుభాగమున వ్రేలాడును. దానిని గుణించుట వలన నక్షత్రదినములతో విభజించుట వలన ఆకాశ భాగమున లభించు భాగము రెంటిలో మూటితో పదితో కొట్టివేయబడినపుడు ఆయనమేర్పడును. దానిని చక్కగా విభజించినపుడు కాంతి ఛాయలేర్పడును. ఇవియే శుక్లకృష్ణపక్షములు. త్రిజ్యము శంకు ఛాయచే కొట్టబడినపుడు విషువత్ కర్కభాగము చేయబడినపుడు లంబాక్టజ్యా భాగములు వాటి ఛాయలగును. లంబాక్షములు ఎపుడూ దక్షిణమున నుండును. సాక్షాత్తు సూర్యునిచే కాని అపక్రమముగా కాని కలిసియున్నది దిక్సామ్యమగును. లేనిచో భేదమేర్పడును. మిగిలినవి సూర్యాంశలు. ఇవియే భుజ జ్యా కోటి భాగముల వలన ఏర్పడునవి. శంకుమానమును అంగులములచే రెట్టింపు చేసి యథాక్రమముగా భుజములను త్రిజ్యమును సాధించవలయును. కోటి జ్యాభాగములచే విభజించగా లభించిన దానియందు బయటిదలమున ఛాయా కర్ణము ఏర్పడును. స్వాక అర్కనత భాగములకు దిక్సామ్యము, ఇతరత్ర భేదమును గుర్తించవలయును. దిగేదోపక్రమము శేషమగును. త్రిజ్యముచే కొట్టబడినది జ్యా భాగమగును. పరమోపక్రమమున జ్యా భాగమున పొందిన చాపమున సూర్యుడు మేషాది రాశి గోచరుడగును. సంశుద్ధి చేసిన చక్రార్ధ భాగమువలన కర్కాది. రాశి గోచరుడగును. నక్షత్రార్ధసంయుతి వలన తులాది గోచరుడగును. సంశుద్ధి చేయబడిన చక్రమువలన మృగాది నక్షత్రములలో మధ్యాహ్న సూర్యుడు స్పుటముగా గోచరుడగును. ఆభాగము మందమైనను, చాలాసార్లు వామమైనను దివాకరుడు మధ్యమున నున్నడని ఫలము. ప్రాణహతులు గ్రహోదయమును తెలుపును. 1, 1, 8 సంఖ్యలచే కొట్టబడి గతిని తెలుపును. చక్రాసువులు లబ్దముతో కలిసి అహోరాత్రాసువులు గా పేర్కొనబడును. మూడుమార్లు నక్షత్రాంశముచే ఆకాశాంశముచే కర్ణభాగమున అర్థభాగగుణములు అహోరాత్రార్థభాగముచే విభజించబడును. విడిగా ఒకటి, రెండు, మూడు సంఖ్యలచే విభజించబడి వేరు వేరు చాపములుగా నుండును.
మేషరాశి నుండి లంబోదయాసువులను క్రిందుగా శోధించి 8, 4, 2, 3 లతో విభజించి, 5, 3, 1 లుగా శేషము లంభించిన చంద్రలిప్తలని తెలియవలయును. తమ ప్రదేశభాగమున చరించుభాగమున కంటే తక్కువగా నున్నచో ఇషోదయాసువులగును. వ్యస్తములచే అవ్యస్తములచే కూడినవై కర్కటాదులగును. ఈ ఆరే ఉతమముగా తులాదులగును. స్వేషాంశలగు భాస్కరాంశలను భోగ్యాసువులను తీసివేయవలయను. తమ తమ ఉదయమునుండి చక్కగా కొట్టివేయబడి విభజించబడి, భోగ్యములను విడిగా విభజించి తమ తమ మానముననుసరించి అభీష్టఘటికాసువులనుండి భోగ్యాసువులను శుద్ధిచేయవలయును. ఇట్ల ఏష్యలగ్నాస్తువులను కూడా శుద్ధిచేయవలయును. ఇట్ల క్రమముగా వ్యాప్తి చెందును.మిగిలిన దానిని 30 తో వ్యస్తమగుదానిని శుద్ధిచేయబడని దానిచే విభజించి భాగయుక్తమును, భాగహీనమును వ్యయనాంశమును వేరుచేసి,. కుజతనుక్రీగా గుర్తించవలయును. తూర్పుపశ్చిమములలో నినతనాడుల నుండి, అట్లే లంకోదయాసువులచే సూర్యునిలో క్షయ ధన భాగములనేర్పరిచినపుడు మధ్యలగ్న మేర్పడును. భోగ్యాసువులు తక్కువగానుండి, భుక్తాసువులధికముగా నున్నచో అంతరలగ్నాస్తువులను చక్కగా శోధించి కాలమును సాధించవలయును. రాహువులేని సూర్యభుజాంశములున్నచో చంద్రగ్రహమున ఇంద్రాల్పములగును. వాటిని పదకొండుచే కొట్టివేసి ఏడును కలిపి 5, 10 చే విభాగముచేసి అంశములను తెలియవలయును. సూర్యుని చంద్రుడు, చంద్రుని కుజుడు కప్పివేయును. ఛైద్య ఛాదక మానారమునకు అయిదు తగ్గించి గ్రాహ్యవర్జితముగా దానిని స్వచ్ఛన్నమును చేసి మానైక్యార్ధాంశములో ఆరవభాగమును అందానిని మూలముగా ఛన్నఘ్నమును స్వాంగోనముగా చంద్రతను హారమును నిలుపుటకు ఘటికాదులుపయోగించును. ఇవి కూడా వ్యంగములైన భుజాంశసమ్మితములచే చేయబడును. ఇపుడు ఇష్టఫలములచే తక్కువగా నున్నదానిని సూర్యుని భాగములో ఆరుగుణములగును. ఒకవేళ ఎక్కువగా నున్నచో దానిలోనే భాగములేర్పరుచవలయును. ఇట్లు సుఖాంత్యభాగము స్పష్టమగును. గ్రాసము స్వాహతమైన దానిలో, ఛాద్యమానమానములో విశోషకములేర్పడును. ఇచ్చట పూర్ణాంతము మధ్యమమగును. దశాంతమున మూడు నక్షత్రములు తక్కువగా నుండును. విడిగా ఆయాక్రాంతి అక్షభాగములచే సంస్కరించినపుడు నతాంశములేర్పడును. వీటిని రెంటితో కొట్టివేసినచో వచ్చిన అంశకృతులలో రెంటిని తగ్గించి సగము సూర్యాంశలతో కలిపి హారము చేయవలయును. మూడు నక్షత్రములతో తేలిన అంగాంశములనుండి సూర్యాంశలను విడదీసి వచ్చిన అంశలకంటే తక్కువ అంశలతో కొట్టివేసినచో ఇంద్రలిప్తలగును. తీసివేయగా పొందిన అంశలను ఆలంబనముగా చేసుకొని సూర్యాంశలకంటే అధికమా న్యూనమా చూచి విశ్వఘ్నలంబనకలల కంటే తక్కువగా నున్నచో తిథులగును. అయిదు అంశలకంటే తక్కువగా ఉండి మొత్తము భాగమును ఆరుచే కొట్టివేసినచో ఆలవలలో తక్కువగా నున్నవి నక్షత్రాంశములగును. నతాంశములు వాటివలన కలిగిన అంశములు ప్రాధృతమగును. ప్రాధృతవర్షితమైనపుడు ఆరు చంద్రలిప్తలచే విభజించబడినవి నతాంశములు దిక్కును సూచించును. ఆ రెంటిలో భిన్నత్వమును చూచి ఒకదిక్కు స్పుటత్వమును పొందును. అపుడు కప్పివేసిన స్థితి పక్షమును సాధించదలిచినపుడు స్త్రీత్యర్ధముచే ఆరింటిచే మూడింటిచే అంశలను కనుగొని ఆయంశలచే జంటలుగా నున్న నక్షత్రాంశములను రెండింట ఉంచి వేరుచేయుట మొదటివలెనే అని తెలియవలయును. ఇట్లు సంస్కరించినచో వాటినుండి స్త్రీత్యర్ధములు స్పుటమగును. వాటితో హీనమగునపుడు మధ్యదర్శము. కాలములుగా ముఖాంతగములగును. సూర్యుని కంటే తక్కువగా నున్న విశ్వ ఈశాంశములు నవపంచదంశాంశకములే యగును. కాలాంశల కంటే తక్కివ అంశలతో సూర్యుడు కూడియున్నపుడు చంద్రుని అస్తోదయములగును. మొదట సూర్యబింబమును చూచి ఉచ్చవీక్షణమున లంబమును చూచి లంబ పాపబింబాంతర దృష్టులు సూర్యుని వ్యాపించు నక్షత్రములచే కొట్టబడినపుడు అస్తమయమునందు సావయవములు ఏష్యములేని తిథులు ఉండునని పండితులు తెలియవలయును. వ్యస్తముగా నున్నపుడు వ్యుత్కాంతి భాగములచే ద్విఘ్నతిథులతో ఆహృతములు స్పుటముగా తెలియవలయును. సంస్కారాది వలంబనము అంగులాద్యముగా కలుగును. అయిదంశలకన్నా తక్కువైనవై శుక్లపక్షము తిథులను తెలియవలయును. అట్లు కానిచో చంద్రునికి నాశోన్నతముగా గుర్తించవలయును. అంగులలేఖనమున శృంగమును వేరు ప్రదేశమున ఉన్నతముగా చూపవలయును. అయిదు అంశలున్నపుడు పది హేను అంశలు శేషకర్లప్పతములను వేరుగా చూపవలయును. శ్రవణా నక్షత్రము త్రిజ్యము కంటే అధికము కాని న్యూనము కాని అయినపుడు కుజుని వలన తను భాగములు హరించబడును. ఋజు ఋజు భిన్నముల వివరమును గత్యంతరముచే విభాగము చేయబడి వక్ర ఋతువులు విషయమున గతియోగామమును గమ్యము అతీతమైనచో దినాదికమని తెలియవలయును. దక్షిణోత్తర భేట వివరము మానైక్యమున అల్పముగా నున్న చో, భేదలంబనము మొదటున్నపుడు స్పుటమును తెలియుటకు సూర్యుని విషయమున మొదట చేసినట్లే చేయవలయును. సూర్యచంద్రులు ఒకే అయనమున నున్నచో విషమముగా నున్నపుడు క్రాంతిమండలములని, సమముగా నున్న చో ధృతమని తెలియవలయును. సూర్యచంద్రులు విపరీతాయనమున నున్న చో క్రాంతిలిప్తలుగా తెలియవలయును. సూర్యచంద్రులు సములైనచో వ్యతీపాతమనీ, భగణార్గమున తపోయుతులుగా తెలియవలయును. సూర్య చంద్రులు భచక్రాంతచక్రార్ధమున నున్న చో దక్కలముచే సాధించబడిన అంశములతో కూడియున్నచో అపక్రమములని తెలియవలయును. చంద్రుడు ఉచ్చపదమున సూచించబడినపుడు క్రాంతి విక్షేప సంస్కృతమై సూర్యుని కంటే అధికముగా నున్నచో క్రాంతి పాతమగునని తెలియవలయును. న్యూనమైనచో వామభావిగా తెలియవలయును. చంద్రక్రాంతి విడిగా యుండి క్షేపముచే శుద్ధి పొందినచో క్రాంతి ఉర్టలు త్రిజ్యముతో భాగించబడి పరమాయక్రమోద్దతములై చాప మధ్యభాగమున జ్యాభాగములో సూర్యచంద్రులున్నపుడు చంద్రునినుండి గతమగు పాతము సూర్యగతి తాడితమగుచో శోధించవలయును. సూర్యునిలో చంద్రభుక్తిచే లిప్తాదులు హృతమైనపుడు చంద్రుని వలెనే ఫలమును తెలియవలయును. ఇట్లే విపర్యయముగా చంద్రపొతఫలమును తెలియవలయును. ఇట్లు ఇద్దరి క్రాంతులు సమముగా వచ్చువరకు ఇట్లు చాలామార్లు చేయుచుండవలయును. ఇట్లు రెండు క్రాతులు సమములైనపుడు చంద్రుడు ప్రక్షిప్తాంశకు తగ్గినపుడు పాతమును తెలియవలయును. పొతములేనపుడు అర్థరాత్రికాఘాతమగును. అధికమైనపుడు తాత్కాలికాఘాతమగును. అర్థరాత్రార్ధములు స్థిరముగా చేసినపుడు సూర్య చంద్రుల వివరలిప్తలుగా తెలియవలయును. చంద్రుని భుక్తముకాని షష్టిపాతకాలనాడికలు. సూర్యచంద్రుల మానయోగము కొఱకు షష్టిచే గుణించి విభజించవలయును. ఇద్దరి భుక్ష్యంతరముతో పొందిన అర్ధ స్థితిని నాడికలవలే తెలియవలయును. మధ్యభాగము స్పుటము పాతకాలమగును. ఈ పాతకాలము స్థిత్యర్థ వర్షితమైనపుడు పాతకాలసంభవకాలమగును. ఆ సంయోగము పైన చెప్పిన సంజ్ఞ కలదగును. ఈ ఆద్యంతకాలములు మధ్యకాలము అతిభయంకరమైన కొలమని తెలియుము. ఈ కాలము భగభగమండుచున్న అగ్నిహోత్రము వంటిది కావున అన్ని కర్మలయందు ఈ కాలమును పరిత్యజించవలయును. ఇట్లు గణితభాగము కొంచెము సంక్షేపముగా చెప్పితిని. ఇక ఇపుడు రాశిసంజ్ఞాపూర్వకముగా జాతకభాగమును చెప్పెదను.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున జ్యోతిషవర్ణనమను బది నాలుగవ అధ్యాయము సమాప్తము.
