నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

1 - పురాణమాహాత్మ్యకథనమ్

ఆది ఋషియైన నారాయణ మహర్షిని, ఉత్తమ మానవుడైన నరమహర్షిని సరస్వతీదేవిని నమస్కరించి జయమును పలుకవలయును.

 బృందావనములో కూర్చొనియున్నవాడు, లక్ష్మీదేవి ఆనందమునకు నివాసభూతుడు, గాఢమైన దయకలవాడు పరముల కంటే పరుడు, అన్ని ఆనందముల కంటే ఉత్తమానంద స్వరూపుడు అయిన ఉ పేన్జనకు (శ్రీకృష్ణునకు) నమస్కారము. లోకములను కాపాడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఎవని అంశరూపులో అట్టి జ్ఞాన స్వరూపుడు పరిశుద్దుడు పరముడు అయిన ఆదిదేవుని సేవింతును.

మహానుభావులు, ఋషులు, వేదాధ్యయనపరులు, ఇంద్రియములను జయించినవారు, ఆహారనియమము కలవారు, సత్పురుషులు, సత్యబలులు, అసూయలేనివారు, అన్ని ధర్మములు తెలిసినవారు, లోకములను అనుగ్రహించుట యందు ఆసక్తి కలవారు, అహంకారమమకారములు లేనివారు, పరమాత్మయందే. మనసును నిలిపినవారు, కోరికలను విడిచిన వారు, పాపరహితులు, శమదమాథిగుణములు కలవారు, జింకచర్మమును ధరించినవారు, జడలను ధరించి బ్రహ్మ చర్యము నాచరించువారు, సూర్యునితో సమానమైన తేజస్సు కలవారు అయిన శౌనకుడు మొదలగు మహర్షులు ధర్మశాస్త్రార్థతత్త్వమును తెలిసినవారై నైమిశమను పేరుగల అరణ్యమున శ్రీమహావిష్ణువును ఆరాధించుచు తపమును చేయుచుండిరి. మోక్షమును. కోరుచు కొందరు యజ్ఞపతిని గూర్చి యాగములను చేయుచుండిరి. కొందరు జ్ఞానస్వరూపుని జ్ఞానముతో, మరికొందరు ఉత్తమభక్తి తో శ్రీమన్నారాయణుని పూజించు చుండిరి.

మహానుభావులు, ఆత్మస్వరూపము తెలిసినవారు, గొప్పతేజస్సు కలవారు, రాగద్వేషములు లేనివారు, లోకములను అనుగ్రహించదలచినవారు అయిన ఆ శౌనకాది మహామునులు ఇరువది ఆరువేల మంది. వారి శిష్యులను, ప్రశిష్యులను. లెక్కించలేము. ఒకనాడు జితేంద్రియులైన వారందరు ధర్మార్థకామమోక్షములను పొందుటకు ఉపాయములను తెలియగోరి ఒకచోట సమావేశమైరి. ఈ భూలోకమున ఏవి పుణ్య క్షేత్రములు ? ఏవి పుణ్యతీర్థములు ? తాపత్రయములచే వేతలను పొందుచున్న మానవులు ఏ సాధనముచే మోక్షమును పొందగలరు ? శ్రీమన్నారాయణుని యందు చలించని భక్తి ఎట్లు కలుగును ? కొయిక వాచిక మానసిక కర్మల ఫలము లభించు సాధనమేది? అని తనను అడుగుటకు సిద్ధపడిన మునులను చూచి శౌనక మహర్షి విద్వాంసుడు కావున వినయముతో చేతులు జోడించి ఇట్లు పలికెను.

శౌనకమహర్షి చెప్పెను

 పవిత్రమైన సిద్దాశ్రమములో పౌరాణికోత్తముడైన సూతుడు విశ్వరూపుడైన జనార్దనుని పలువిధములైన యజ్ఞములతో పూజించుచూ ఉన్నాడు. వ్యాసభగవానుని శిష్యుడు, మహాముని, శాంతుడు అయిన సూతమహర్షి ఈ విషయములన్నియు చక్కగా తెలిసినవాడు. పురాణములన్నిటిని చెప్పువాడు కూడా. ప్రతియుగమునందు ధర్మములు క్షీణించుటను చూచిన శ్రీమన్నారాయణుడు వేదవ్యాసావతారముతో వేదవిభాగమును చేసెను. వేదవ్యాసభగవానులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని అన్ని శాస్త్రములు చెప్పుచుండగా వినుచుంటిమి. సూతమహర్షి అట్టి వ్యాసభగవానులవద్ద విద్యలనభ్య సించినవాడు. ఇట్లు వేదవ్యాసమహర్షి వద్ద బాగుగా అధ్యయనము చేసిన సూతమహర్షి అన్ని పురాణములను చక్కగా తెలిసినవాడు. ఈలోకమున సూతమహర్షి కంటే చక్కగా పురాణములు తెలిసినవారు మరొకరు లేరు. సూతమహర్షి పురాణములు బాగుగా తెలిసినవాడు, సర్వజ్ఞుడు, బుద్ధిమంతుడు, శాంతుడు, మోక్షధర్మములు తెలిసినవాడు, కర్మ భక్తుల వివరములను సాంగోపాంగములతో తెలిసినవాడు. వేదముల, వేదాంగముల శాస్త్రముల సారమునంతటిని లోకముల హితము కొఱకు వేదవ్యాసభగవానుడు పురాణములలో చెప్పియున్నాడు. జ్ఞానసాగరుడైన సూతమహర్షి ఆ పురాణముల తత్త్వార్థమునంతయూ చక్కగా తెలిసినవాడు. కావున మనమందరము వెళ్ళి ఆ సూతమహర్షినే అడిగెదము అని శౌనకుల వారు పలికిరి.

శౌనకమహర్షి మాటలను వినిన ఋషులందరూ మాటలాడువారిలో నేర్పరియైన శానకమహర్షిని ఆలింగనము చేసుకొని సంతుష్టాంతరంగులై బాగు బాగని అభినందించిరి. తరువాత ఆ మునులందరు మృగముల సమూహములతో మునులతో కూడియున్న, సుందరమైన వృక్షములతో తీగెలతో పూవులతో ఫలములతో శోభించుచున్న, స్వచ్ఛమైన నీరుగల సరస్సులుకల, అతిధులతో, ఆతిధ్యములతో సంకులమైన పవిత్రమైన సిద్దాశ్రమమునకు వెళ్ళిరి. ఆ ఆశ్రమమున అననుడు అపరాజితుడు అయిన శ్రీమన్నారాయణుని అగ్నిష్టోమయాగముచే పూజించుచున్న సూతమహర్షిని చూచిరి. ప్రసిద్ధమైన తేజస్సు గల మునులు సూతమహర్షిచే పూజించబడి అవభృథస్నానము కొఱకు నిరీక్షించుచుండిరి. నైమిశారణ్య వాసులగు మునులు అవభృథస్నానము చేసి సుఖాసీనుడైయున్న పౌరాణికోత్తముడైన సూతమహర్షిని ఇట్లు అడిగిరి.

ఋషులు పలికిరి. ఆతిథ్యమును పొందదగిన అతిథులము మేము వచ్చితిమి. జ్ఞానమును దానము చేసి శాస్త్రోక్తముగా మమ్ములను పూజించుము. దేవతలు చంద్రకళను అమృతమును త్రాగి జీవింతురు. నీ ముఖమునుండి వెలువడు జ్ఞానామృతమును గ్రోలి బ్రాహ్మణులు జీవింతురు. ఈ ప్రపంచమంతయూ ఎవనిచే పుట్టినది ? ఈ ప్రపంచమునకు ఆధారమెవరు ? ఇది అంతయు ఎవరి స్వరూపము ? ఎవనిలో నిలిచియున్నది ? ఎవనిలో లయము చెందును ? విష్ణువు ఏమి చేసినచో ప్రసన్నుడగును ? మానవులు ఎట్లు పూజింతురు ? - వర్ణాశ్రమాచారములెట్లుండును ? అతిథినేట్లు పూజించవలయును ? చేసిన పనీ ఎట్లు సఫలమగును ? మానవులు మోక్షమును పొందు ఉపాయమేది ? భక్తి చే మానవులు పొందునదేది ? ఆ భక్తి ఎటువంటిది ? ఓ మునిశ్రేషా ! సూతమహర్షీ ! మా సంశయములు తొలగునట్లు ఈ విషయమంతయు తెలియజేయుము. నీ అమృత వాక్కులను వినుటకు ఎవనికి శ్రద్ధ కలుగదు ?

సూత మహర్షి పలికెను.

ఓ ఋషులారా ! మీకిష్టమైనదానిని చెప్పెదను వినుడు. పూర్వము సనకాదులు నారదమహర్షికి చెప్పిన దానిని మీకు చెప్పెదను. దీనికి నారదపురాణమని పేరు. ఈ నారదపురాణము వేదొర్ణముతో సమానము. అన్ని పాపములను నశింపచేయునది. దుష్టగ్రహములను నివారించును. దుఃస్వప్పములను నశింపజేయును. ధర్మమును బోధించును. భోగఫలమును మోక్ష ఫలమును ఇచ్చును. నౌరాయణకథలతో కూడియున్నది. అన్ని శుభములకుమూలకారణమిదియే. ధర్మార్థకామమోక్షములకు కారణమైన మహాఫలము నొసంగును. ఇదివరకెప్పుడూ లభించని పుణ్యఫలమునిచ్చు నీ సొరదపురాణమును సావధానముగా వినుడు. మహాపాపములు కలవాడైనను, ఉపపాతకములు కలవాడైనను ఋషిప్రోక్తము, దివ్యము అయిన ఈ నారదపురాణమును విని పరిశుద్దుడగును. ఈ 'నారదపురాణములో ఒక అధ్యాయమును చదివినచో అశ్వమేధయాగమును చేసిన ఫలమును పొందును. రెండు అధ్యాయములను చదివినచో రాజసూయయాగ ఫలమును పొందును. జ్యేష్ఠమాసమున, పూర్ణిమాతీథి' యందు మూలానక్షత్రమున సావధానుడైన మానవుడు యమునానదిలో స్నానమాడి, మధురలో ఉపవాసముచేసి శ్రీకృష్ణుని పూజించిన కలుగు ఫలితము మూడు అధ్యాయములను చదివినచో కలుగును. ఆ నారదపురాణమును నేను చెప్పేదను. చక్కగా వినుడు. మానవుడు కోటీ కులములలో, వేల జన్మలతో సంపాదించిన పొపములను నశింపచేసుకొని బ్రహ్మ లోకమును చేరి అక్కడే స్థిరనివాసమేర్పరచుకొనును. భక్తి భావముతో ఈ నారదపురాణములో పది అధ్యాయములను చదివి నిర్వాణ మోక్షమును పొందును. ఈ విషయమున సంశయించ వలసిన పనిలేదు. అన్ని శ్రేయస్సులలో ఉత్తమమైన శ్రేయస్సు సాటిలేని పవిత్రత కలది ఈ నారదపురాణము.

దుస్స్వప్నములను నశింపచేయు పవిత్రమైన ఈ నారదపురాణమును ప్రయత్నముతో వినవలయును. శ్రద్ధతో మానవుడు ఒక శ్లోకమును, సగము శ్లోకమునైనను చదివినచో వెంటనే మహాపాతకముల నుండి ముక్తుడగును. పరమ రహస్యమైన ఈ నారదపురాణమును సజ్జనులకు మాత్రమే చెప్పనలయును. పుణ్య క్షేత్రమున బ్రాహ్మణుల సమీపమున శ్రీమన్నారోయణుని ముందు చదివించవలయును (చేప్పవలయును). ఈ నారదపురాణమును బ్రహ్మ ద్రోహులకు, బూటకపు ఆచారమును నటించువారలకు, కొంగలవలె వంచనచే బ్రతుకును కొనసాగించువారలకు చెప్పరాదు. మోక్షసాధనమైన ఈ నారదపురాణమును కామాదిదోషములను వదిలి విష్ణుభక్తియందలి ప్రీతికలిగిన మనసుకల సదాచారపరులకు మాత్రమే చెప్పవలయును.

తనను స్మరించువారి బాధలను తొలగించువాడు, సద్భక్తి యందు వాత్సల్యము కలవాడు, అందరు దేవతల రూపములతో నుండువాడు అయిన శ్రీమహావిష్ణువు భక్తి చే మాత్రమే సంతోషించును. మరియొకదానితో సంతోషించడు. శ్రీహరినామమును అశ్రద్ధతోనైనను కీర్తించినను, తలచినను మానవుడు అన్నిపాపములనుండి విముక్తుడై నాశములేని మోక్షపదమును పొందును. సంసారమను భయంకరమైన అరణ్యమునకు దావాగ్నియైన శ్రీమహావిష్ణువు తనను స్మరించువారి పాపములను వెంటనే ప్రథమోధ్యాయః నశింపచేయును. ఈ నారదపురాణను ఈ యర్థమునే తెలియజేయునది. కావున ఉత్తమమైన ఈ పురాణము తప్పక వినదగినది. ఈ పురౌణమును వీనినను, చదివిననూ అన్నిపాపములు నశించును. ఈ నారదపురాణమును వినవలయునని భక్తితో సంకల్పము కలగిన మానవుడే కృతకృత్యుడు. అతనే అన్ని శాస్త్రార్థములు తెలిసిన విద్వాంసుడు. అతను చేసిన తపస్సు, సంపాదించిన పుణ్యము సఫలము, తపము పుణ్యము లేనిచో ఈ నారదపురాణమును వినవలయుననెడు బుడ్డ కలుగదు. జగద్గతమునుకోరు సజ్జనులు మాత్రమే సత్కథలను వినుటకు సంకల్పింతురు.

 దుర్జనులు పాపములయందొసక్తి కలవారై నిందించుటయందు, కలహించుటయందు ఆసక్తులై ఉందురు. అర్ణవాదములు (లేని గుణములను పొగడి చెప్పునవి) అని చెప్పు నరాధములు సంపాదించిన అన్ని కర్మలను నిర్మూలించుటకు సాధనములైన పుణ్యములను కోల్పోవుదురు. పురాణములు అర్థవాదములు మాత్రమే అని చెప్పువాడు నరకమును పొందును. ఇతర కార్యములను శాస్త్రవీధిననుసరించి ఆచరించువారు పురాణములను కూడా సాధించేదరు. మోహితులు సాధించజాలరు. ఈ లోకమున ఎక్కువకష్టము లేకుండా పుణ్యములను సంపాదించవలయునని కోరినచో భక్తి భావముతో పురాణములను వినవలయును. పురాణములను వినవలయునను కోరిక కలవానికి పూర్వము సంపాదించిన పాపములన్నీయు నశించితీరును. సంశయమవసరములేదు. పురాణప్రవచనము జరుగుచుండగా పొపపాశముచేత బంధించబడినవాడై ఇతరకథలయందు ఆదరమును ఆసక్తిని చూపినచో అధఃపతనము కలుగును. సజ్జనులసంగమునందు దేవార్చనయందు సత్కథలయందు హితోపదేశమునందు ఆసక్తి కల మానవుడు దేహావసానమున విష్ణువుతో సమానమైన తేజస్సు కలవాడై శ్రీమన్నారాయణుని పరమపదమును పొందును.

కావున ఓ బ్రాహ్మణోత్తములారా ! పవిత్రమైన ఈ నారదపురాణమును వినుడు. దీనిని వినినచో మానవుడు శ్రీమన్నారాయణునియందు మనసు కలవాడై జన్మ జరాది బాధలు లేనివాడగును. శ్రేష్ఠుడు, శ్రేష్ఠతముడు, వరముల నిచ్చువాడు పురాణపురుషుడు తన సంకల్పముచే అన్ని లోకములను సృజించినవాడు కోరిన వాటినిచ్చువాడు, ఆదిదేవుడు అగు శ్రీహరిని స్మరించి మానవుడు మోక్షమును పొందును. ఓ బ్రాహ్మణులారా! శ్రీమన్నారాయణుడు బ్రహ్మ, శివుడు, విష్ణువు అను పేర్లతో శరీరభేదమును పొంది ఈ ప్రపంచమును సృజించును, నశింపచేయును, పొలించును. ఈశ్వరులకు ఈశ్వరుడగు ఆ యాదిదేవుని మనసున నిలుపుకొనిన మానవుడు ముక్తిని పొందును, పేరు జాతి మొదలగునవి లేనివాడు పరులందరికి పరుడు, పరమున కం టే పరముడు, వేదాన్త వేద్యుడు, తనభక్తులకు మాత్రమే తెలియువాడు అగు శ్రీమన్నారాయణుడు అన్ని పురాణములచే వేదములచే స్తుతింపబడుచున్నాడు. కావున జగన్నాథుడు, మోక్షమునిచ్చువాడు పుట్టుకలేనివాడు అగు ఆ మురారియే సేవించదగినవాడు. పరమరహస్యము అన్నీ పురుషార్థములకు మూలకారణము అయిన శ్రీహరిని స్మరించినచో మానవుడు సంసారసాగరమును దాటును.

శ్రద్దగా వినువారికి ధార్మికులకు చెప్పవలయును. కోరికలు లేనివారికి, మోక్షమును కోరువారికి, యతులకు చెప్పవలయును. పవిత్రమైన ప్రదేశములో, సభలో, దేవాలయములో, పుణ్య క్షేత్రములలో, పుణ్యతీర్థములలో, దైవసన్నిధిలో బ్రాహ్మణ సన్నిధిలో చెప్పవలయును. అపవిత్రమైన ప్రదేశములలో ఈ నారదపురాణమును చెప్పువారు ప్రళయకాలము వరకు నరకమున పడియుందురు. మూరుడు, కపటి, భక్తి లేనివాడు, వినినట్లు నటించినవారు కూడా నరకమును పడును. సత్కథ చెప్పుచున్నపుడు మరియొకనితో మాట్లాడువారు కూడా ఘోరనరకమును పొందును. కావున చెప్పువారు, వినువారు సావధానమనస్కులై యుండవలయును. ఇదియే సనాతనధర్మము. సావధానమనస్కుడు కానివాడు ఏ కొంచెము కూడా తెలియలేడు. కావున ఏకాగ్రమనస్సుతో హరికథామృతమును గ్రోలవలయును. వ్యాకులమనస్సు కలవాడు హరికథలోని రసమును ఎట్లు ఆస్వాదించును ? వ్యాకులమైన మనసు కలవాడు ఏ ఆనందమునూ పొందలేడు. కావున దుఃఖసాధనమైన అన్ని కామనలను వదిలి పెట్టి ఏకాగ్రమనస్సులో శ్రీహరిని ధ్యానించవలయును. పాపములు చేసినవాడైనను ఏదో ఒకవిధముగా అవ్యయుడైన నారాయణుని స్మరించినచో శ్రీహరి ప్రసన్నుడగును. జగన్నాథుడు, అవ్యయుడు అయిన శ్రీమన్నారాయణునియందు భక్తి కలవాని జన్మ సఫలమగును. మోక్షము అతని చేతిలో ఉండును. ఓ బ్రాహ్మణోత్తములారా! హరిభక్తి పరులకు ధర్మార్థకామమోక్షములు సిద్ధించుటలో ఎట్టి సంశయము లేదు.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సూతఋషిసంవాదమను పేరుగల మొదటి అధ్యాయము ముగసినది.