నారద మహా పురాణము - పూర్వార్థము
26 - గృహస్థధర్మస్య నిరూపణమ్
సనకమహర్షి పలికెను :- వేదాధ్యయనము చేయువరకు గురువునకు శుశ్రూష చేయవలయును. గురువుగారి అనుమతినిపొంది అగ్నిపరిగ్రహమును చేయవలయును. వేదములను, వేదాంగములను ధర్మశాస్త్రములను చక్కగా అధ్యయనము చేసి గురువుగారికి దక్షిణ సమర్పించి ఇల్లును చేరవలయును. తరువాత రూపలావణ్య సంపన్నురాలు గుణవతి సత్కులోద్భవ, సుశీల ధర్మ చారిణి అయిన కన్యను వివాహమాడవలయును. తల్లివంశమునుండి అయిదవ తరమునకు, తండ్రినుండి ఏడవ తరమునకు సంబంధించని కన్యను వివాహము చేసుకొనవలయును. అట్లుకానిచో గురుతల్పగతపాపము సంభవించును. (అనగా మేనత్త, మేనమామ, బావమరిది మొదలగువారి పుత్రికలను వివాహమాడరాదని భావము). ఎపుడూ రోగముతో నుండు కన్యను, తిరుగుడు కనులదానిని, రోగములున్న కులమున పుట్టిన దానిని అతి కేశను, అకేశను, వదరుబోతును, కోపిషురాలిని, పొట్టిదానిని, చాలాపొడగరిని, విరూపేణిని, న్యూనాంగిని, అధికాంగిని, ఉన్మత్తురాలిని, కొండెములు చెప్పుదానిని, వివాహమాడరాదు. స్థూలగుల్బను (లావు మడిమలు కలదానిని) పొడుగు పిక్కలు కలదానిని, పురుషాకారముతో నున్నదానిని, మువ్వన్నెలు కలదానిని వివాహమాడరాదు. వృధాహాస్యముఖిని, ఎపుడూ ఇతరుల ఇండల్లో ఉండుదానిని, వివాదశీలను, భ్రమించుదానిని, కఠినురాలిని, వివాహమాడరాదు. అతిగా భుజించుదానిని, పెద్దదంతములు కలదానిని, లావు పెదవులు కలదానిని ఘర్షురధ్వని కలదానిని, అతికృష్ణవర్లను, రక్తవర్ణము, ధూర్తురాలిని వివాహమాడరాదు. ఎపుడూ ఏడుస్వభావము కలదోనినీ, పాండుదేహమును, కుత్సితురాలిని, కాస శ్వాసమొదలగు వ్యాధులు కలదానిని నిద్రకీలను వివాహమాడరాదు. అనరభాషిణిని, లోకద్వేషపరాయణను పరాపవోదనిరతను, చోరస్వభావను వివాహమాడరాదు. పొడు. కపటశీలను శరీరమంతటా రోమములు గలదానిని, గర్వితురాలిని, బకవృత్తిని (వంచనాపరను) ఎపుడూ వివాహమాడరాదు. బాల్యమున తెలియక వివాహమాడినను ప్రగల్పురాలుగా గుణరహితురాలుగా తెలిసినచో విడిచి పెట్టవలయును. భర్త విషయమున సంతాన విషయమున సర్వదా కఠినముగా ప్రవర్తించుదానిని, పరానుకూలురాలిని సర్వధా పరితా చేయవలయును. బ్రాహ్మము మొదలగు వివాహములు ఎనిమిది విధములు. వీటిలో మొదటివి శేషములు. మొదటివి లేనపుడు తరవాతవి శ్రేష్ఠములు. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని ఎనిమిది విధములు. బ్రాహ్మణుడు ఎప్పుడూ బ్రాహ్మవివాహమునే చేసుకొనవలయును. దైవము కాని ఆర్షమును కాని చేసుకోవచ్చునని కొందరి మతము. ప్రాజాపత్యము మొదలగు అయిదు వివాహములు ద్విజులకు నింద్యములు. పూర్వములు వీలుకాని పక్షమున పరములను చేసుకొనవచ్చును. రెండు యజ్ఞోపవీతములను ఉత్తరీయమును, బంగారుకుండలములను, ధౌతవస్త్రద్వయమును ధరించవలయును. చందనాద్యను లేపనము చేసుకొనవలయును. కేశనఖాదికృంతనము గావించుకొని శుచిగా నుండవలయును. వెదురు దండమును, ఉదకముతో నిండిన కమండలమును, తలపాగాను తెల్లని ఛత్రమును. పాదుకలను, ఉపానహములను, సుగంధపుష్పమాల్యములను ధరించవలయును. పరాన్నమును పరవాదమును పరిత్యజించవలయును. తాను ఒక పొదముతో మరొకపాదమును కండూయనము చేయరాదు. పూజ్యులకు దేవాలయముకు అపసవ్యముగా వెళ్ళరాదు. దేవార్చనలో, ఆచమనములో, స్నానములో వ్రతశ్రాద్ధాదిక్రియలలో కేశములు విరబోసుకొనియుండరాదు. ఏకవస్త్రమును ధరించియుండరాదు. ఒం మీద ఆరోహించరాదు. శుషవాదమును చేయరాదు. పరస్త్రీ సంగమమును చేయరాదు. కొండెములు చెప్పరాదు. లుబ్దత్వమును వీడవలయును. గోవుకు రావిచెట్టుకు, అగ్నికి పర్వతమునకు అపసవ్యముగా వెళ్ళరాదు. నాలుగు దారుల కూడలికిదేవతా వృక్షమునకు, దేవాలయమునకు అపసవ్యముగా నడువరాదు. రాజునకు అపసవ్యముగా నడువరాదు. అసూయను, మాత్సర్యమును పగటి నిద్రను వీడవలయును. ఇతరుల పాపములను తన పుణ్యమును బయలు పరచరాదు. తన పేరును నక్షత్రమును గౌరవమును రహస్యముగా నుంచవలయును. దుర్జనులతో కలిసియుండరాదు. శాస్త్రవిరుద్ధమైనదానిని వినరాదు. బ్రాహ్మణుడు మధుపానమునందు, ద్యూతమునందు, గీతమునందు ఆసక్తి చూపరాదు. పచ్చి ఎముకను, ఉచ్చిష్టమును శూద్రుని, పతితుని, సర్పమును, శ్వానమును స్పృశించినచో సచేలముగా స్నానము చేయవలయును. చితిని, చితికాషమును, యూపమును, చండాలుని, దేవలకుని స్పృశించినచో సచేలస్థానము నాచరించవలయును. దీపమును, మంచమును, నీడను, కేశమును, వస్త్రమును, కటోదకమును, మేకను, మార్జనధూళిని మార్గారమును స్పృశించినచో శుభములు తొలగును. చేటగొలిని, పేతధూమమును శూద్రాన్న భోజనమును, శూద్రస్త్రీపతి సంసర్గమును, దూరమునుండియే వీడవలయును. అసత్ శాస్త్రార్థములను మననము చేయరాదు. నఖ కేశములను భేదనము చేయరాదు. నగ్నముగా శయనించరాదు. శిరమునకు అలమగా మిగిలిన తైలమును ఇతర శరీరాంగములకు నలదరాదు. అపరిశుద్దుడుగా ఉన్నప్పుడు అగ్నిని గురువును దేవతలను సేవించరాదు. ఒకే వామహస్తములో కాని, కేవలము నోటితో కొని జలపానము చేయరాదు. గురువుగారి నీడను, ఆజ్ఞను దాటరాదు. యోగులను, బ్రాహ్మణులను, ప్రతులను యతులను నిందించరాదు. బ్రాహ్మణుడు పరస్పర రహస్యములను ప్రకటించరాదు. పూర్ణిమా అమావాస్యలలో ద్విజుడు యథావిధిగా యాగమును చేయవలయును. ద్విజులు ప్రాతఃకాలమున సాయంకాలమున హోమమును దేవోపాసనము చేయవలయును. ఉపాసనను పరిత్యజించినవాడు సురాపానము చేసినవానితో సముడని పండితులు భావింతురు. గృహస్తుడైన బ్రాహ్మణుడు అయనకాలమున, విషువకొలమున యుగాదికాలములలో అమావాస్యలో పితృపక్షమున శ్రాద్ధమును చేయవలయును. మన్వాది కాలమున మృతాహమున, అష్టమతిథిన కొత్త ధాన్యము ఇంటికొచ్చినపుడు గృహస్తుడు శ్రాద్ధము నాచరించవలయును, శ్రోత్రియులు ఇంటికొచ్చినపుడు, చంద్రసూర్యగ్రహణములలో, పుణ్య క్షేత్రములలో, పుణ్యతీర్థములలో గృహస్థుడు శ్రాద్దము నాచరించవలయును. ఊర్ధ్వపుండ్రధారణచేయక చేసిన యజ్ఞదాన తపోహోమ స్వాధ్యాయ పితృతర్పణములు వ్యక్తమగును. ఊర్ధ్వపుండ్రమును, తులసిని కొందరు శ్రాద్దమున అంగీకరించరు. కాని శ్రేయస్సును కోరువారు వ్యర్ధాచారములను విడువలయును. ఇట్లు ద్విజులు స్మృతిమార్గ ప్రచోదితములు సర్వకర్మఫలప్రదములు అయిన ధర్మములను ఆచరించవలయును. సదాచారపరలకు విష్ణువు ప్రసన్నుడగును. విష్ణువు ప్రసన్నుడైనచో సాధించరానిదేమున్నది ?
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమునపూర్వభాగమున ప్రథమపాదమున స్మార్తధర్మములలో వేదాధ్యయనాది గృహస్థధర్మనిరూపణమను ఇరువదియారవ అధ్యాయము సమాప్తము.
