నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

65 - అధ్యాయము

సనత్కుమారమహర్షి పలికెను. గురువు శిష్యుని పరీక్షించి మన్తశోధనమును చేయవలయును. తూర్పు పడమర దక్షిణము ఉత్తరము నాలుగు దిక్కులలో అయిదు సూత్రముల నుంచవలయును. నాలుగు మూలలో నాలుగుంచ వలయును. మొదటి దిక్కులోని మొదటి దిక్కులోని మొదటి సూత్రములో మొదటి దానిని, రెండవ మొదటి దానిలో రెండవ దానిని, మూడవ మొదటి దానిలో మూడవ దానిని నాలుగవ మొదటి దానిలో నాలుగవ దాని నుంచవలయును. ప్రతీ సూత్రములోని ఆగ్నేయ కోష్టమున ఆయా అయిదవ అక్షరమునుంచ వలయును. ఇట్లు లిఖించి క్రమముగా ధీమంతుడై శోధించవలయును. నామాద్యక్షరము మొదలుకొని మంత్రోద్యకరము వరకు వ్రాయవలయును. చతుష్కములో సౌమాక్షరముండు ప్రదేశము సిద్ది చతుష్కకమగును. ప్రదక్షిణ క్రమమున రెండవది సౌధ్య చతుష్కకమగును, మూడవది సిద్దము, నాలుదవది అరియగును. రెండింటి ఒకే కోషమున రెండు వర్ణములున్న చో సిద్ధ సిద్ద మనబడును. ఆ రెండవ మంత్రాక్షరమున సిద్ధ సాధ్యము, మూడవ దానిలో సుసిద్దము, నాలుగవ దానిలో సిద్దారి యగును. నామాక్షరములతో నుండు మరియొక చతుష్కము లుండు రెండవ మస్త్ర వర్ణములో చతుషమున అయినచో మొదట నామాక్షరమున్న చోట ఆయా కోషమునారంభించి మొదటి వలెనే క్రమముగా లెక్కించ వలయును. సాధ్య సిద్ధము, సాధ్యసాధ్యము, సాధ్యసుసిద్దము, సాధ్యంపువు అని లెక్కించవలయును. మూడవ నామాక్షరములోని చతుష్కకమున మంత్ర వర్ణమున్నచో మొదటి వలెనే క్రమము ననుసరించి లెక్కించవలయును. సుసిద్ధ సిద్ధము, సుసిద్ధ సాధ్యము, తత్సు సిద్ధము, తదృష్టి అని తెలియవలయును. నాలుగవ నామాక్షరములోని చతుష్కమునన మంత్రాక్షరమున్నచో ఇట్లే లెక్కించ వలయును. అరి సిద్ధము, అరిసాధ్యము, తత్సు సిద్ధము, తద్రుష్టివ అని తెలియవలయును. మొదట చెప్పిన విధముగా ద్విగుణము కంటే సిద్ధ సిద్దము సిద్ద సాధ్యకము అగును. సిద్దము, సుసిద్దము, అర్ధముగా  సిద్దారియున్నచో వంశీయులను చంపును. ద్విగుణము కంటే సాధ్యము సుసిద్ధమగుచో సాధ్యారి బాంధవులను చంపును. సుసిద్ధ సిద్ధము అర్ధముగా ద్విగుణము కంటే తత్సాధ్యము, తత్సు సిద్ద ప్రాప్తి మాత్రమున సుసీద్దారి కుటుంబమును హరించును. తత్సు సిద్దము కలత్రమును చంపును. ఆరీ సాధకుని హరించునని శాస్త్రము. ఈ విషయము ఇతర విధానములు కూడా చాలా కలవు. అన్నిటిలో ముఖ్యమగు కధహమను పద్దతిని నీకు వివరించితిని. ఇట్లు గురువు తగిన దేశమున, తగిన కాలమున మంత్రమును శుద్ధపరిచి శిష్యుని దీక్షాయుతుని చేయవలయును. ఆ విధానమును చెప్పెదను, వినుము.

శిష్యుడు నిత్యకృత్యములను పూర్తి చేసుకొని గురుపాదములకు నమస్కరించి ఆదరముతో గురువును మంత్రమును ప్రసాదించమని ప్రార్థించవలయును. గురువును వస్త్రాలంకరణో సువర్ణాదులతో పూజించ వలయును. గురుస్వస్తి వాచనమును చేసి మండలాదుల నేర్పించి, సంతోషముచే శిష్యునితో కలిసి గురువు పరిశుద్దుడై యాగశాలను ప్రవేశించవలయును. ద్వారమును అస్త్రముతో సామాన్య్యా దకముతో సంప్రోక్షించి దివ్యములైన విఘ్నములను పారదోలి, నభస్థనిఘ్నములను జలముతో పొలదోలి, పార్థిఘాతములతో భూసంబంధ విఘ్నములను పారదోలి, తరువాత కర్మ నారంభించవలయును. శాస్త్ర విధానముతో ఆయావర్ణములతో సర్వభద్రమండలమును కల్పించి ఆమండలమున వహ్నిమండలమును వహ్నికళలను పూజించి, శక్తి ననుసరించి నిర్మించిన కుంభమును . జలముచే నింపి అస్త్రముచే ప్రక్షాళనమును చేసి, ఆ కుంభమున చంద్రకళలను విధానముచే పూజించవలయును. ధూమ్రార్చి, ఉష, జ్వలిని, జ్వాలినీ, విస్ఫులింగినీ, సుశ్రీ, సురూపా, కపిలా, హవ్యవహా, కవ్యవహా అని పది వహ్నికళలు, చెప్పబడినవి. ఇక సూర్యకళలను చెప్పెదను వినుము. తపినీ, తాపిని, ధూమ్రా, మరీచి జ్వూలినీ, రుచి, సుషుమ్రా, భోగదా, విశ్వా, బోధినీ, ధారిణీ, క్షమా, అనునది సూర్యకళలు. ఇట్లే అమృతా, మానదో, పూషా, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశినీ, చంద్రికా, కాంతి, జ్యోత్స్నా, శ్రీ, ప్రీతి, అంగదా, పూర్ణ, పూర్ణామృతా, అనునవి చంద్రకళలు. కుంభమును వస్త్రయుగ్మముతో చుట్టి కుంభమున అన్ని ఓషధులను వేయవలయును. నవరత్నముల నుంచి, పంచపల్లవములనుంచవలయును. పనస, ఆమ, వట, అశ్వద్దకుళ పల్లవములు  పంచపల్లవములు. ముత్యము, మాణిక్యము, వైడూర్యము, గోమేదము, వజ్రము, పగడము, పద్మరాగము, మరకతము, నీలము అను నవరత్నములనుంచి, కుంభమున ఇష్టదేవతను ఆవహించి విధానముతో పూజించి, చక్కగా అలంకరించుకొనిన శిష్యుని వేదిక పై కూర్చుండ బెట్టి ప్రోక్షణీ జలముచే ప్రొక్షించి, శిష్యుని శరీరమున భూత శుద్యొదికమును ఆచరించి న్యాలజాలముచే శోధించి శిరస్సున పల్లవముల నుంచి నూటా ఎనిమిది మార్లు మాలమంత్రముచే మంత్రించిన జలముచే హృదయమున జపించుచు ప్రియశిష్యుని అభి షేకము చేయవలయును. అంతట శిష్యుడు శిష్టాదకముచే ఆచమును చేసి, వస్త్రధారణ చేసి, విధిననుసరించి గురువునకు నమస్కరించి, పరిశుద్దుడై గురువుముందు కూర్చొనవలయును. అంతట గురువు శిష్యుని శిరమున హస్తమునుంచి ఉపదేశించవలసిన మంత్రమును అష్టోత్తరశతమును జపించవలయును. తరువాత శిష్యునికి “సమోస్తు” అను అక్షరములనీయవలయును. అపుడు శిష్యుడు గురువు నర్చించవలయును. అంతట గురువు చందన సహితహస్తమును శిష్యును శిరసున ఇంచి, శిష్యుని చెవిలో మంత్రమును ఎనిమిది మారులు చెప్పవలయును. అట్లు మంత్రమును పొందిన శిష్యుడు గురువుల పాదముల పై బడవలయును. అంతట గురువు వత్సా! లెమ్ము! ముక్తుడవైతివి. సదాచారపరుడవు కమ్ము. కీర్తి శ్రీకాంతీపుత్ర ఆయుష్యబలారోగ్యములు నీకెప్పుడు ఉండనిమ్ము అని పలుకవలయును. అపుడు శిష్యుడు లేచి గంధాదులచే గురువునర్చించవలయును. దక్షిణను సమర్పించవలయును. ధన విషయమున లోభిత్వమును ప్రదర్శించరాదు. ఇట్లు గురువునుండి మంత్రమును పొంది, అప్పటి నుండి ధనదేహపుత్రకలత్రాదులచే  గురు సేవాపరుడు కావలయును. తరువాత పుష్పాంజలిని సమర్పించి మధ్యన తన ఇష్టదేవతను పూజించవలయును. అగ్నిని నైఋతిని, బ్రహ్మను క్రమముగా పూజించవలయును.  మధ్యన విష్ణువును పూజింఔహచవలయును. మధ్యన విష్ణువును పూజించిననో బాహ్యాది స్థానములలో వినాయకుని, సూర్యుని పార్వతీ పరమేశ్వరులను పూజించవలయును. మధ్యన శంకరుని పూజించినచో బాహ్యాది స్థానములలో సూర్యుని, గణేశుని, పార్వతిని, విష్ణువును పూజించవలయును. మధ్యన పార్వతిని పూజించినచో బాహ్యాది స్థానములలో శంకరుని, విఘ్నేశుని, సూర్యుని, విష్ణువును పూజించవలయును. మధ్యలో వినాయకుని పూజించినచో బాహ్యస్థానములలో పార్వతీ పరమేశ్వరులను, సూర్యుని విష్ణువును పూజించవలయును. సూర్యుని మధ్యన పూజించినచో బాహ్యప్రదేశములలో గణేశుని, విష్ణువును, పార్వతిని, శివుని యథాక్రమముగా పూజించవలను. ఇట్లు ప్రతినిత్యము దైవపంచకమును పూజించవలయును. బ్రాహ్మీముహూర్తమున లేచి నిత్యకృత్యములను ముగించుకొని, సందేహములు లేనివాడై శయ్యమీదనైనను తన శిరస్సులో సహస్ర దళములు కలిగిన తెల్లని  పద్మము యొక్క వర్ణకలో నున్న ఇందుమండలమున, కధాదికానీ త్రికోణమునమునున్న వరాభయంకరుడగు గురువును స్మరించవలయును. రెండు నేత్రములు, రెండు భుజములు కలవానిని శుక్లగంధమాల్యానులేపుని, వామ భాగమున శక్తిచే కూడి యున్న వానిని మానసోపచారములచే ధ్యానించి, పూజించి పాదు కామంత్రమును పదిమార్లు జపించవలయును.

ఇది శ్రీపాదుకామంత్రము. ఈ నులత్రము సర్వసిద్ది ప్రదము. ఇట్లు మంత్రముచే గురువునకు నమస్కరించి ఈ మంత్రములచే గురువును ధ్యానించవలయును. చరాచరజగత్తును వ్యాపించి అఖండమండలాకారముగా నున్న పరమాత్మ పదమును చూపిన శ్రీ గురువునకు నమస్కారము. జ్ఞానాంజన శలాకచే అజ్ఞానతిమిరాంధత్వమును తొలగించి కనులు తెరిపించిన గురువునకు నమస్కారము. ఇష్టదేవస్వరూపుడగు గురువునకు నమస్కారము. సంసారమను విషయమును హరించ గల వాగమృతమును అందించిన గురువునకు నమస్కారము. ఇట్లు నమస్కరించి ఈ స్తోత్రమును చదవవలయును. . తరువాత ఓ భగవన్ నాథా! గురురూపుడగు శివునకు నమస్కారము విద్యావతారసం సిద్ధి కొరకు అనేకకారములను ధరించినవాడా నవాయతనరూపా పరమార్తెకరూపొ సర్వాజ్ఞాన తమమును భేదించు సూర్యుడా? చిద్ఘన స్వరూపొ స్వతంత్రా! దయాక్లుప్త విగ్రహా! శివస్వరూపా! భక్తపర తంత్రా! భవ్యులకు భావరూపీ! వివేకులకు వివేకరూపా విమర్శకులను విమర్శరూపొ ప్రకాశములకు ప్రకాశమా జ్ఞానులకు జ్ఞానరూపమా నీకు ముందు ప్రక్కన, పృష్టభాగమున పై భాగమున, క్రింది భాగమున నమస్కారము. ఎపుడూ సచ్చిత్స్వరూపముతో ఆసనమును విధించుము. ఓ దేవీ నీ అనుగ్రహముచే నేను అంతటా కృతకృత్యుడనైతిని. అని స్తోత్రము చేసి అంతటిని గురువునకు  నివేదించవలయును. ప్రాతః కాలమునుండి సాయంకాలము వరకు, సాయంకాలమునుండి ప్రాతఃకాలము వరకు నేను చేయునదంతయూ నీ పూజయగుగాక తరువాత గురుపాదాబ్జముల నుండి స్రవించు అమృత ధారచే తనను ప్రక్షాళన చేయబడి నిర్మలుడైనట్లుగా భావించవలయును. మూలము నుండి బ్రహ్మరంధ్రము వరకు మూలవిద్యను భావించవలయును. మూలాధార చక్రమునుండి అధోభాగమున వర్తులాకారముగా వాయుమండలముండును. అచటనున్న వాయుబీజము నుండి ఉద్భవించిన వాయువుచే దాని పై భాగమున త్రికోణాకారముగా వహ్నిమండలముండును. ఆ వహ్నిమండలమున నున్న వహ్నిబీజమునుండి పుట్టిన అగ్నిచే మూలాధారమున విగ్రహా స్వరూపముచే పడుకొనియున్న పాము వంటి ఆకారము గలిగి స్వయముగా భూలింగవేష్టిని యగు, బిసతంతువు వంటి వర్ణము కలిగి కోటి విద్యుత్తుల కాంతిగల, సూక్ష్మముగానున్న కులకుండలినిని ధ్యానము చేసి కూర్చచే ఉత్థాపనము చేయవలయును. సుషుమ్నామార్గమున షట్చక్రక్రమమును భేదించుమండలిని గురూపదిష్ట విధానముచే బ్రహ్మరంధ్రమునకు గొని పోవలయును. బ్రహ్మరంధ్రమున నున్న అమృతముచే మునిగి పోయిన వానినిగా తనను భావించు కొనవలయును. బ్రహ్మరంధ్రములోని ప్రకాశజాలముచే వ్యా పించబడిన పరిశుద్ధుడగు చిత్స్వరూపుడగు పరుని దర్శించవలయును. మరల  కుండలిని స్వస్థానమున చేర్చి హృదయమున ఆదిదేవుని చింతించుచు, దర్శించి మానస ద్రవ్యములచే ఈ మంత్రముతో ప్రార్ధించవలయును. “త్రైలోక్యచైతన్యమయాదిదేవ శ్రీనాథ విష్ణో భవదాఙ్ణయైవ, ప్రాతస్సముత్థాయ తవ ప్రియార్ధం సంసారయాత్రాం త్వనువర్తయిష్యే” అని అనగా మూడులోకములను చైతన్యమును కలిగించు ఓ ఆదిదేవా శ్రీనాథ! విష్ణూ ! నీ ఆజ్ఞచేతనే ప్రాతఃకాలమున లేచి, నీ ప్రీతి కొఱకు సంసారయాత్రను అనువర్తించుచున్నాను. “అని యర్థము ఈ మంత్రమున ‘విష్ణో’ అని ఉన్నచోట తన ఇష్టదైవమును ఎవరినైనా చెప్పుకొనవచ్చును. తరువాత సర్వ సిద్ధి కొఱకు అజపానివేదనమును చేయవలయును.

రాత్రి పగలు ఆరువందలు, ఇరువది యొకవేలు అజ పాయను పేరుగల గాయత్రిని జీవుడు సర్వదా జపించును. ఈ మంత్రమునకు ఋషి హంస,  ఆవ్యక్తము, గాయత్రీ ఛందస్సుగా చెప్పబడినది. పరమహంసదేవత ఆద్యంతమున బీజశక్తి కలది. తరువాత ఆరు అంగములుగా చేయవలయును. సూర్యుడు, చంద్రుడు, నిరంజనుడు, నిరాభాసుడు, ధర్ముడు, జ్ఞానము అని ఆరుగా చెప్పవలయును. వీరందరిని హంసపూర్వులుగొ, ఆత్మ నే పద పశ్చిమములుగా జాతయుక్తులను సాధకేంత్ర షడంగములందు నియోగించవలయును. వీటిలో హ కారము సూర్యునితో సమానమగు తేజస్సు కలది బయట సంగమించును. సకారము కూడా అటువంటిదే కావున ప్రవేశ సమయమున ధ్యానము చెప్పబడినది. ఇట్లు ధ్యానించి అగ్ని సూర్యులలో విభాగముగా అర్పింపచవలయును. వకారము నుండి సకారము వరకు బీజములచే యుక్తమగు చతుర్థలములు గల దాని యందు, బంధూక పుష్పకొంతిగల దానియందు, స్వశక్తిసహితమగు దానికి, పాశాంకుశ ధూపొదిక్రమోదకములచే ప్రకాశించు హస్తములు గల గణేశునకు, వాగధీశునకు అరునూర్లు అర్పించవలయును. పగడపుకాంతి గల స్వాధిషానమున వోదీలాంత పర్ణయుక్తమున వామాంగశక్తి యుతుసకు విద్యోధిపతికీ, స్రువ, అక్షమాలలచే ప్రకాశించు చేతులుగల పద్మజన్ముడగు హంసారూఢుడగు బ్రహ్మకు ఆరువేలు అర్పించవలయును. విద్యుత్ తో కూడున మేఘకాంతి గల, డాబి సొంతవర్ణములు గల పత్రము గల, మణి పూరముగల, శంఖ చక్ర గదా పంకజధారి, శ్రీ సహితుడగు విష్ణువునకు ఆరువేలు నివేదించవలయును. కొట్టుబడని అర్కపత్రమున కోదీ లాంతవర్ల సంయుతమగు, శుక్ల వర్ణముగల, శులాభయవరసుధాకలశ ధారియగు, హవాంగశక్తి యుక్తుడు, విద్యాధిపతి, వృషారూఢుడు అగు రుద్రునకు ఆరు వేలు నివేదించవలయును. విశుద్ధము షోడశదలయుతము, స్వరసంయుతము, శుక్లవర్ణయుతము, మహాజ్యోతి ప్రకాశముగల ఇంద్రియాధిపతికి ప్రాణశక్తిచే కూడి యున్న ఈశ్వరునికి సహస్రమును అర్పించవలయును. హక్షయుక్తమగు అజ్ఞాచక్రమున ద్విదళములు గల అబ్బమున సహస్రమర్పించవలయును. హక్షయుక్తమగు అజ్ఞాచక్రమునన ద్విదళములు గల అబ్బమున సహస్రమర్పించవలయును. పరాశక్తియుతుడు గురువు అగు సదాశివునకు, సహస్రారమగు మహాపద్మమున నాద బిందు ద్వయాన్వితమున మాతృకావర్ల విలసిసమున వరాభయకరుడగు పరమాద్యుడగు గురువునకు సహస్రమునర్సించ వలయును. చుళుకమున జలమును ధరించి స్వభావ సిద్ధమగు ఇరువది యొకవేల ఆరునూర్లుగల జపమును విభాగము చేయక అజపొదేనికి అర్పంచవలయును. సంకల్పము చేతనే మోక్షము నిచ్చు విష్ణువు నా యెడ ప్రీతుడగుగాక ఇతని సంకల్పమాత్రముననే మహాపాపములు తొలగిపోవును. నేను బ్రహ్మనే సంసారినికాను. నిత్యముక్తుడనే దుఃఖినిగాను నేను సచ్చిదానన్ద స్వరూపుడను అని తనను తాను భావించవలయును. తరువాత దేహకృత్యములనాచరించి దేవార్చనను చేయవలయును. దేవార్చనా విధానమును సదాచారలక్షణమును ఇపుడు చెప్పెదను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున ఆరువది అయిద - అధ్యాయము సమాప్తము.