నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

47 -  అధ్యాయము

సనందన మహర్షి పలికెను :- కేశిధ్వజుడు చెప్పిన అధ్యాత్మజ్ఞానమును అమృతమునిస్వాదించునట్లు ఖాండిక్యుడు విని కేశిధ్వడుని పొగడుచు మరల ఇట్లు పలికెను.

ఖాండిక్యుడు పలికెను :- ఓ మహానుభావా ! ఈ నిమి వంశమున నీవు యోగశాస్త్రార్ధమును బాగుగా తెలిసిన వాడవు కావున నాకు యోగమును తెలియజేయుము.

కేశిధ్వజుడు పలికెను :- ఓ ఖాండిక్యా ! నేను యోగ స్వరూపమును చేప్పెదను వినుము. యోగమున నున్నవాడు బ్రహ్మమున లీనమగును.భ్రష్టుడు కొజాలడు. మానవుల బంధమోక్షములకు మన సే కారణము. మనసును విషయసంగమును చేసిన బంధము, నిర్విషయము చేసిన మోక్షము లభించును. విజ్ఞాన స్వరూపుడగు జీవుడు జ్ఞానముచే మనసును విషయముల నుండి మరలించి మోక్షము కొఱకు బ్రహ్మ స్వరూపుడగు పరమేశ్వరుని చింతించవలయును. అట్లు బ్రహ్మను ధ్యానించుచు మనస్సును ఆత్మలో నిలుపవలయును. ఆత్మ శక్తిచే మనస్సును లోహమును అయస్కాంతముచే ఆకర్షింపచేయవలయును. మనోగతి విశిష్టమై ఆత్మ ప్రయత్నసో పేక్షమైనచో, అట్టి అ పేక్షను బ్రహ్మయందు సంయోగము చేయుటయే యోగమనబడును. ఇట్లు అత్యంత వైశిష్ట్యయుక్త ధర్మోప లక్షణమగు యోగము గలవాడే యోగి ముముక్షువు అనబడును. మనసును ఆత్మలో యోగము చేయునపుడు మొదట యోగియనబడును. సమాధి నిష్పన్నమగుచో పరబ్రహ్మ లభించును. మనో యోగసమయమున అంతరాయముచే మనసు దుష్టము. కానిచో జన్మాంతరాభ్యాసముచే ముక్తి లభించును. సమాధి నిష్పన్నమగుచో ఆ జన్మ లోనే ముక్తి లభించును. యోగాగ్నిచే కర్మములు దగ్ధములై యోగి మోక్షమును పొందును. బ్రహ్మ చర్యమును, అహింసను సత్యమును, అస్తేయమును, అపరిగ్రహమును నిష్కామముతో యోగి ఆచరించవలయును. స్వాధ్యాయమును, శౌచమును, తపస్సును, నియమములను, యమములను పరబ్రహ్మయందు మనసును లగ్నము చేసి ఆచరించవలయును. ఈ నియమములు అయిదు, యమములు అయిదుగా చెప్పబడుచున్నవి. సకొములకు విశిష్ట ఫలముల నిచ్చును. నిష్కాములకు ముక్తి నొసంగును. ఇట్లు భద్రాసనొదులగు ఆసనముల నధిష్టించి గుణవంతుడై యమనియమములతో యతియే మనో యోగమును చేయవలయును. ప్రాణవాయువును ఆధారము చేసి నియమించినచో ప్రాణాయామమనబడును. ఈ ప్రాణాయామము సబీజము అబీజమని రెండు విధములు. ప్రాణాపొనములు ఒకదానినొకటి సద్విధానముతో నియమించినచో మూడవ యమమగును. ఈ యమము కూడా స్థూలముగా ప్రాణాయామము వలె నుండును. వాయువునకు ఆత్మసౌధారము చేసుకొనుటయే యోగాభ్యాసమనబడును. యోగవీత్తు శబ్లాది విషయములందు అనురక్తములగు ఇంద్రియములను నిగ్రహించి ప్రత్యాహార పరాయణుడై చిత్తానుకారిణులనుగా చేయవలయును. ఇట్లు చేసినచో ఉత్తమమగు ఇంద్రియవశ్యత సిద్ధించును. ఇంద్రియములను వశము చేసుకొనక యోగి యోగసాధకుడు కాజాలడు. ప్రాణాయామముచే వాయువులను, ప్రత్యాహారములచే ఇంద్రియములను వశము చేసుకొని మనసును శుభాశ్రయము చేయవలయును.

ఖాండిక్యుడు పలికెను :- ఓ మహానుభావా ! చిత్తమునకు శుభాశ్రయమనగానేమియో తెలుపుము. శుభాశ్రయమునాధారము చేసుకొనియే సమస్త దోషములు నశించును.

కేశిధ్వజుడు పలికెను :- చిత్తమునకు ఆశ్రయము స్వరూపముతో ద్వివిధము మూర్తము, అమూర్తము, పరము అపరము అని భావన త్రివిధ రూపముగా నుండును. ఈ ప్రపంచము మూడు విధములుగా నుండును. బ్రహ్మరూపము కర్మరూపము ఉభయ రూపము అని. భావభావన కూడా కర్మ భావనో, బ్రహ్మ భావనా ఉభయభావన అని మూడు విధములు. ఓ జ్ఞానీ సనకాది మహర్షులు సర్వకాలములలో బ్రహ్మ భావనతో యుందురు. దేవాదులు స్థావర జంగమములు కర్మ భావనతో నుందురు. హిరణ్య గర్బాదులలో బ్రహ్మ కర్మభావన యుండును. అధికార జ్ఞానము కలవారికి భావభావన యుండును. సమస్తములైన విశేష జ్ఞానకర్మలు క్షయము నొందనపుడు భిన్నదృష్టి గలవారై ఈ ప్రపంచము వేరు పరలోకము వేరు అని భావించదరు. అన్ని భేదములు తొలగి, వాక్కులకు గోచరము కాక ఆత్మ మాత్రవేద్యమై సత్తామాత్రముగా భాసించు జ్ఞానమే బ్రహ్మ జ్ఞానమనబడును. రూపరహితుడు జన్మరహితుడగు విష్ణువునకదే పరరూపము. పరమాత్మ కు విశ్వస్వరూపముగా వైరూప్యముగా గోచరించుటయే లక్షణము. యోగమును సాధన చేయువారు పరమాత్ముని రూపరహితునిగా చూడజాలరు. ధ్యానించ జాలరు. కావున చకురోచరమగు శ్రీహరి యొక్క స్థూలరూపమును చింతన చేయవలయును. భగవానుడగు హిరణ్యగర్భుడు, ఇంద్రుడు, ప్రజాపతి, మరుత్తులు, వస్తువులు, రుద్రులు, భాస్కరులు, తారకలు, గ్రహములు, గంధర్వులు, యక్షరాక్షసులు, సకల దేవతలు, మనుష్యులు, పశువులు, పర్వతములు, సముద్రములు, నదులు, వృక్షములు, అశేషభూతములు, భూత హేతువులు. ప్రధానము మొదలుకొని విశేషాంతము వరకు గల చేతనాచేతసొత్మకమగు విశ్వము. ఏకపాదము ద్విపాదము, బహుపాదము ఆపాదకము, భావనాత్రితయాత్మకమగు నీ ప్రపంచమంతయు శ్రీహరి స్థూలరూపమే. చరాచరమగు సమస్త జగత్తు, ఈ ప్రపంచమంతయు పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీమహావిష్ణువు యొక్క శక్తి సమన్వితమే విష్ణుశక్తి పర అని, క్షేత్రజ్ఞుని అపర అని, అవిద్యో కర్మ యనునది మూడవ శక్తి యని చెప్పేదరు. క్షేత్రజ్ఞశక్తి గలవోరు కర్మలవలన చేష్టలు చేయుదురు. అది సారము లేని సంసారమున నుండును. దానివలననే సమస సంసారతాపములను పొందును. అశకి చే తిరోహితమగు శక్తియే క్షేత్రజ్ఞశక్తి యనబడును. ఈ క్షేత్రజ్ఞశక్తి అన్ని ప్రాణుల యందు తరతమభేదములచే నుండును. ప్రాణములేని వాటియందు స్వల్పముగా నుండును. స్థావరములందు మరి కొంత యధికముగా నుండును. సర్పాదులందు కొంత అధికముగా అంతకంటే ఎక్కువగా పక్షులలో, పక్షులకంటే అధికముగా మృగములలో, మృగములకంటే పశువులలో, పశువులకంటే మనుజులలో, మనుజులలో కూడా స్త్రీల కంటే పురుషులలో, వారికంటే అధికముగా, నాగగంధర్వ యక్షదేవతాదులలో నుండును. దేవతలందరి కంటే అధికశక్తి కలవాడు ఇంద్రుడు. ఇంద్రుని కంటే ప్రజాపతి, ప్రజాపతులకంటే అధికుడు హిరణ్యగర్భుడు అధిక శక్తి కలవాడు. ఈ సమస్త రూపములు ఆ శ్రీహరి రూపములే. ఆకాశముతో కూడియున్నట్లు ఈ రూపములన్నియూ పరమాత్మ శక్తితో కూడి యున్నవే. విష్ణువు యొక్క రెండవరూపము యోగులచే మాత్రమే ధ్యానించదగినది. దానినే అమూర్తమందురు. అమూర్త మగు విష్ణురూపమునకే సత్తని పేరు. ఈ సమస్త శక్తులు ప్రతిష్టించబడి యున్న శ్రీహరి స్వరూపరూపమే మూడవ మహద్రూపము. ఆరూపమే సమస్త శక్తిరూపములనేర్పరచును. శ్రీహరిలీలచే దేవతిర్యజ్మునుష్యాదులు చేష్టలు కలవారగుదురు. శ్రీహరి చేష్ట సర్వవ్యా పిని, ఇతరనిమిత్తముగా విధించబడునది కాదు. విశ్వరూపుని ఆరూపమునే యోగసాధన చేయువారు చింతన చేయవలయును. ఆరూప చింతనమే ఆత్మ శుద్దిని కలిగించి సర్వపాపములను నశింపచేయును. జ్వాలలచే కూడిన అగ్ని వాయువుతో కలిసి అరణ్యమును దహించునట్లు చిత్తమున నున్న శ్రీహరి యోగుల సర్వపాపములను దహించి వేయును. కావున సమస్త శక్తుల కాద్యంతములగు శ్రీహరిశక్తిని చక్కగా హృదయమున నిలుపుకొనవలయును. దానిని శుద్ద లక్షణమందురు. ఇదియే చిత్తమునకు శుభాశ్రయము. సర్వవ్యా పియగు ఆత్మకు కూడా ఇదియే శుభాశ్రయము. ఇదియే త్రిభావభావనాతీతము. యోగులముక్తికి హేతువు, కర్మ హేతువులగు దేవాదులగు సమస్తాశ్రయములు చిత్తమునకు అశుభములు అపరిశుద్ధములు కొవున అశుభాశ్రయములే యగును. అన్నిటిని ఆశ్రయించక విడిచి భగవంతుని సాకారమగు రూపమునందు చిత్తమును ధరించినచో దానిని ధారణయందురు. ఈ ధారణలో శ్రీహరి రూపమును ఎట్లు చింతించవలయనో చెప్పెదను వినుము. నిరాధారముగా ధారణ కుదురదు కావున ఒకరూపమును ఆధారము చేసుకొనవలయును. ప్రసన్నమగు సుందరవదనము, పద్మపత్రముల వంటి విశాలనేత్రములు చక్కని కపోలములు, విశాలమగు ఫాలభాగముచే శోభితము సమమగు కర్ణములందు ధరించిన ఆభరణములు గల దానిని, శంఖము వంటి కంఠము, విశాలము శ్రీవత్సశోభితమగు వక్షస్థలము, త్రివళులచేలోతైన నాభిచే కూడిన ఉదరము, దీర్ఘములైన అష్టభుజములు కలదిగా కాని నాలుగు భుజములు కలదిగా దాని ఎక్కువ తక్కువలు కాక సమముగా నున్న 'ఊరు జఘనములు, సుస్థిరమైన కరచరణఆంబుజములు, పరిశుద్ధమైన పీతాంబరమును ధరించిన దానిని, కిరీట కేయూర కటకాది భూషణములను ధరించిన దానిని, శార్ణశంఖగదా ఖడ్గ చక్రాద్యాయుధముల ప్రకాశములతో శోభించునది అగు శ్రీహరిరూపమును మనసున నిలిపి ఆత్మచే ధ్యానము చేయవలయును. ఇట్లు శ్రీహరిరూపమునందు దృఢమగు వరకూ ధారణను చేయవలయును మాటలాడుచున్ననూ, నిలుచున్నను, స్వేచ్ఛతో ఏపని చేయుచున్నను ధారణతొలగనిచో ధారణ సిద్ధించినదని భావించవలయును.

తరువాత శంఖ చక్ర గదా శార్ణాది రహితము ప్రశాంతము అకసూత్ర సహితమగు భనవద్రూపమును ధ్యానము చేయవలయును. ఈ ధారణ స్థిరమైన తరువాత కిరీట కేయూర కటకాది భూషణ రహితమగు రూపమును ధ్యానము చేయవలయును. తరువాత ఏకావయవరూపమును స్మరించవలయును. తరువాత అవయవిని మాత్రమే ధ్యానించవలయును. ఇట్లు అవయవియందు దృఢ ప్రత్యయము కలిగిన తరువాత ఇతర స్పృహ వీడవలయును. ఇట్లు ప్రాథమికములగు షడంగములచే ధ్యనము సిద్ధించును అపుడు కల్పనా హీనమగు స్వరూపమును గ్రహించగలుగును. కేవలము మనసుచే ధ్యానముచే నిష్పన్నమగు దానిని సమాధి యందురు. ప్రాప్యమగు పరబ్రహ్మను పొందించు విజ్ఞానముచే అశేష భావనలను క్షీణింపచేసి ఆత్మను పొందించవలయును. దీనినే క్షేత్రజ్ఞుని చేయు జ్ఞానము సాధనమగును. ఈ సాధనముచే ధ్యానము సిద్దించును. ఇట్లు ధ్యాన సిద్ధి కలిగినచో ముక్తి కార్యమును నిష్పన్నము చేసి కృతకృత్యుడగును. అపుడు అన్నిటినుండి నివర్తించును. ఇట్లు పరబ్రహ్మభావభావనను పొంది ఈ జీవుడు పరమాత్మతో ఐక్యమును పొందును. అజ్ఞానముచే భేదమును పొందును. ఇట్లు విబేదమును కలిగించు జ్ఞానము ఆత్యంతక నాశమును పొందిన తరువాత ఆత్మకు పరమాత్మ చే అభేదమును తెలియగలడు. ఓ ఖాండిక్యా ! నీవడిగిన యోగమును సంగ్రహముగా విస్తరముగా సమగ్రముగా వివరించితిని. ఇంకనూ ఏమి చేయవలయునో చెప్పుము.

ఖాండిక్యుడు పలికెను - యోగము గూర్చి చక్కగా తెలిపి నా కెంతయో హితమును చేసితివి. నీ ఉపదేశము వలన నా మనో మాలిన్యము నశి చినది. నాది అని నేను చెప్పినదంతయూ అసత్తే (లేనిదే) వేరు కాదు. జ్ఞానులు కూడా వేరుగా చెప్పజాలరు. నేను నాది అనుట అవిద్య. ఈ వ్యవహారము కూడా అవిద్యకృతమే. పరమార్థము చెప్పశక్యము కానిది. వాగ్గోచరము కానిది. కావున ! ఓ కేశిధ్వజా నీవు నా మేలునకే దీనినంతటినీ చేసితివి. అవ్యయమగు, విముక్తి పరమగు యోగమును చెప్పితిని. కావున ఇక వెళ్ళుము.

సనందన మహర్షి పలికెను :- అపుడు ఖాండిక్యుడు తగిన విధముగా కేశిధ్వజుని పూజించెను. తరువాత కేశిధ్వజుడు తన నగరమునకు వచ్చెను. ఖాండిక్యుడు కూడా తన పుత్రుని రాజుగా చేసి యోగ సిద్ది కొఱకు శ్రీహరియందు మనసునుంచి విశాలాప్రాంతమునకు వెళ్ళేను. అచట ఏకొంతికుడై యమాదిగుణయుక్తుడై విష్ణువను పేరుగల నిర్మలుడగు పరబ్రహ్మ యందు లీనమాయెను. కేశిధ్వజుడు కూడా మోక్షము కొఱకు తన కర్మలను క్షీణింప చేయగోరి విషయముల ననుభవించెను. సంగద హితముగా కర్మనాచరించెను. ఇట్లు శుభానుభవములచే శుభకర్మలచే పాపములు నశించి శుద్ధుడై తాపత్రయనాశకమగు సిద్ధిని పొందెను. ఇట్లు నీవడిగిన విధముగా తాపత్రయ చికిత్సనంతటిని చెప్పితిని. ఇంకనూ ఏమి చెప్పవలయును?

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయ పాదమున నలుబది ఏడవసర్గ సమాప్తము.