నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

78 - అధ్యాయము

సనత్కుమార మహర్షి పలికెను : ఓ మునీశ్వరా నీకు కార్తవీర్యకవచమును చెప్పితిని. ఇక ఇపుడు మోహవిధ్వంసకము జయప్రదమగు హనుమత్కవచమును వినుము. ఈ కవచమును ధరించిన వెంటనే అన్ని ఉపద్రవములు నశించును. భూత ప్రేత శత్రువుల వలన కలిగిన దుఃఖములు నశించును. నేను ఒకప్పుడు ఆనందింప చేయువారిలో ఉత్తముడు, ఆనందవననివాసి స్వాత్మపదమును ధ్యానించుచునన్న రాముని చూచుటకు వెళ్ళితిని. అచట రమాకాంతుడు దేవపూజితుడగు రామచంద్రుని నమస్కరించి అతను చూపిన ఆసనమున కూర్చుంటిని. అచట రావణవధ వృత్తాంతమును నేనడుగగా శ్రీరామచంద్రుడు ఆదరముతో చెప్పెను. ఆ వృత్తాంతము చివర శ్రీరాముడు నాకు మారుతి కవచమనిచ్చెను. ఆ కవచమును నేను నీకు చెప్పెదను. ఈ కవచమును అంతటా అందరికి తెరుపరాదు. ఇది ముందుజరుగబోవునది చెప్పబడెను. భుక్తి ముక్తి ప్రదమగు ఈ ఆంజనేయకవచమును శ్రీరాముడు చేప్పెను. తూర్పు దిక్కున హనుమంతుడు, దక్షిణమున పవనాత్మజుడు, పశ్చిమమున అక్షఘాతకుడు ఉత్తరమున సాగరతారకుడు కాపాడుగావుత, ఊర్ధ్వభాగమున కపిశ్రేషుడు, కేసరి ప్రియనందనుడు, అధోభాగమున విష్ణుభక్తుడు, మధ్యభాగమున 'పావని కాపాడు గావుత. అన్ని వేళలా అన్ని ఆపదలనుండి లంకా దాహకుడు కాపాడు గోవుత. మస్తకమును సుగ్రీవసచివుడు, వాయునందనుడు పాలమును, మహావీరుడు భూమధ్యమును, నేత్రములను ఛాయాపహర్షి ప్లవ గేశ్వరుడు కాపాడుగావుత. కపోలములను, కర్ణమూలమున శ్రీరామకింకరుడు, నాసాగ్రమును అంజనాసూనుడు, వక్తమును హరీశ్వరుడు, కంఠమును దైత్యారి, స్కంధమును రాక్షసజిత్, భుజములను మహాతేజస్కుడు, కరములను చరణాయుధుడు నఖములను నఖాయుధుడు, కుక్షిని కపీశ్వరుడు, వక్షసులమును ముధాపహారి, పార్శ్వములను భుజాయుధుడు కాపాడు గావుత. పృష్ట దేశమును లంకావిభంజకుడు, నాభిని శ్రీరామ భక్తుడు, కటిని అనిలాత్మజుడు, గుహ్యమును మహాప్రాజ్ఞుడు, సక్తులను అతిథిప్రియుడు, ఊరువులను, జానువులను లంకాహ్రసాదభంజనుడు, జంఘలను కపిశ్రేష్ఠుడు, గుల్పములను మహాబలుడు, పాదములను అచలోద్ధారకుడు, అంగములను భాస్కర సన్నిభుడు, పాదాంగుళులను సత్తాడ్యుడు కాపాడు గౌవుత. ముభాంగములను మహాశూరుడు, రోమములను ఆత్మవంతుడు, దివారాత్రములలో త్రిలోకములలో సదాగతిసుతుడు కాపాడు గావుత. నిలుచున్నవానిని, నడచుచున్న మౌనిని, కూర్చొని' యున్నవానిని, తినుచున్నవానిని కపీ కాపాడుగావుత. లోకోత్తర గుణుడు, శ్రీమంతుడు, త్ర్యంబకసంభవుడు, ప్రమత్తుని, అప్రమత్తుని, నిద్రించువానిని. అరణ్యమున, జలమున, స్థలమున, అంతరిక్షమున, అగ్నియందు, పర్వతమున, సాగరమున, వృక్షములలో, సంగ్రామమున, మౌరసంకటమునందు, విరాడ్రూపధరుడు కాపాడుగావుత. డాకినీ శాకినీ మారీ కాలరాత్రి మరీచికలనుండి నిద్రించుచున్న నన్ను పిశాచోరగరాక్షసులనుండి విభువు కాపాడుగావుత. నన్ను అంతట దివ్య దేహధరుడు, ధీమంతుడు, సర్వసత్త్వభయంకరుడు, సాధకేంద్రావనుడు నన్ను అంతటా కాపాడుగావు. భయానకసత్వములు చూచి భయపడు సర్వరూపములను ధరించువాడు, సర్వజ్ఞుడు, సృష్టి స్థితికరుడు కాపాడుగావుత. స్వయం బ్రహ్మ, స్వయం విష్ణువు, స్వయం సాక్షాత్తుగా మహేశ్వరుడు సూర్యమండలగతుడు, శ్రీప్రదుడు నన్ను కాలత్రయమున కాపాడుగావుత. హనుమంతుని ధ్వనిని విని దైత్యదానవరాక్షసులు దేవతలు మనుష్యులు తిర్యగ్జంతువులు, స్థావర జంగమములు భయము కలవి భయము తొలగినవి యగును. ప్రతి కల్పమునందు హనుమంతుని అనేక కథలు పవిత్రములు వినబడుచుండును. అట్టి రామపరాయణుడు సాధక శేషుని కాపాడు గావుత. వైధాత్రధాతు ప్రభృతులుగా ఈ ప్రపంచమున కనపడునదంతయు కేశరూపముచే వ్యాపించబడియున్నది. ఆ ప్రభువు నేను, ఈ నేను స్వీయుడను, స్వయముగా అణువు, బృహత్, ఋగ్యజుస్సామరూపుడు ప్రణవము, త్రివృత్, అధ్వరము, ఆస్వరూపుడు, సర్వరూపుడగు కపీశ్వరునికి ఆత్మ సమాధిచే నమస్కరించుచున్నాను. అనేకానన్త్ర బ్రహ్మాండ ధారి, బ్రహ్మ స్వరూపీ, సమీర స్వరూపి, ఆత్మ స్వరూపి యగువానికి నమస్కారము. హనుమంతునికి, మారుత పుత్రునకు నమస్కారము. శ్రీరామ భక్తునకు శ్యామునకు, మహాత్మునకు నమస్కారము. వానరవీరునకు, సుగ్రీవసఖ్య కారకునకు, లంకావిదాహకునకు, మహాసాగర తారకునకు, సీతాశోక వినాశకునకు, రామముద్రాధరునకు రావణాంతనీదానమునకు సర్వోత్తరాత్మకు నమస్కారము. మేఖ నామద ఖధ్వంసకారణునకు, అశోకవనవిధ్వంసకారికి, జయదాయికి, వాయుపుత్రునకు, వీరునకు, ఆకాశోదరగామికి, వనపాల శిరశ్చేత్తకు, లంకాప్రాసాద భంజకునకు నమస్కారము. జ్వలత్కాంచన వర్లునకు, దీర్ఘలాంగూలధారికి, సౌమిత్ర జయదాతకు, రామదూతకు నమస్కారము. అక్షవధకారికి, బ్రహ్మాస్త్ర నివారకునకు, లక్ష్మణాంగ మహాశక్తి జాత క్షత వినాశికి, రక్షోఘ్ననకు, రిపుఘ్నునకు, భూతఘ్నునకు నమస్కారము. ఋక్షవానరవీరౌఘ ప్రాసాదునకు పర సైన్యబలఘ్నునకు, శస్త్రాస్త్రఘ్నునకు, విషఘ్నునకు, ద్విషఘ్నునకు, భయఘ్నునకు నమస్కారము. మహారీపుభయఘ్ననకు, భక్తత్రాణేకకారికి, పర పేరితమంత్ర యంత్రస్తంభకారికి, పయఃపాషాణ తరణకారణునకు, బాలార్కమండలగ్రాసకారికి, దుఃఖహారికి నమస్కారము. నఖాయుధునకు, భీమునకు, దంతాయుధునకు, విహంగమునకు, శైవునకు, వజ్రదేహునకు, ప్రతిగ్రామ స్థితునకు, భూత ప్రేత పధార్ధికి, కరస్థ శైలశస్రునకు రామశర్ఖునకు నమస్కారము. కౌపీనవాససునకు, రామభక్తిరతునకు, దక్షిణాశాభాస్కరునకు, సజ్జనులకు చంద్రోదయ స్వరూపునకు, కృత్యాక్షతవ్యధఘ్నునకు, సర్వ క్లేశహరునకు, స్వామ్యాజ్ఞాపార్ధసంగ్రామ సఖ్యసంజయ కారికి, నమస్కారము. దివ్యవాదములందు, సంగ్రమములందు భక్తులకు జయమును కలిగించువానికి, కిలారావకరునికి, మౌరశబ్ధకరునకు, సర్వాగ్నివ్యాధిసంస్తంభకోరికీ, భయహారికి, సదావనఫలాహార సంతృపునకు, మహార్ణవశిలాబద్ధ సేతు బంధువుడవగు నీకు నమస్కారము. ఇట్లు శుభకరముగు హనుమత్కవవచమును నీకు చెప్పితిని. ప్రతివారికీయరాదు. ప్రయత్నముచే రక్షించవలయును. అష్టగంధములచే వ్రాసి కంఠమున కాని, దక్షిణబాహువున కాని ధరించిన వానికి ప్రతిక్షణమున జయమే కలుగుచుండును. ఇంకా ఏమి చెప్పవలయును. ఆదరముచే ఈ కవచమును లక్ష జపించిన వానికి అసాధ్యమంటూ ఉండదు. ప్రతిదానిని సాధించగలడు.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున హనుమత్కవచనిరూపణమను డెబ్బది యెనిమిద - అధ్యాయము సమాప్తము