నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

27 - గృహస్థవానప్రస్థయతి ధర్మనిరూపణమ్

సనకమహర్షి పలికెను :- ఓ మునిసత్తమా ! ఇపుడు గృహస్థుని సదాచారమును చెప్పెదను. సదాచారము కలవానికి సర్వపాపములు నశించితీరును. సంశయముతో పనిలేదు. బ్రాహ్మముహూర్తమున శయ్యనుండి లేచి ధర్మార్థకామమోక్షములకు విరుద్దము కానీ జీవికను ఆలోచించవలయును. కేశములను చక్కగా ముడుచుకొనవలయును. రెండు సంధ్యలలో చెవికి యజ్ఞోపవీతములను తగిల్చుకొని ఉత్తరాభిముఖముగా మూత్రమలోత్సర్జనము చేయవలయును. రాత్రి పూట దక్షిణాముఖముగా చేయవలయును. శిరమునకు వస్త్రమును చుట్టుకొని గడ్డితో భుమిని కప్పి చేతితో ఒక కాష్ఠమును ధరించి మౌనముగా ఉత్సర్జనము చేయవలయును. మార్గమాధ్యమున, గోషమున, నదీతీరమున, తటాకగృహసమీపమున వృక్షచ్ఛాయలో అరణ్యమున, అగ్ని సమీపమున, దేవాలయమునో, ఉద్యానమున, దున్నిన భూమిలో, నాలుగుదారుల కూడలిలో బ్రాహ్మణ గోగురు స్త్రీ సమీపమున, పొట్టుమీద, బొగ్గుల మీద, కపాలములందు, మలమూత్రవిసర్జన చేయరాదు తరువాత శౌచము కొరకు యత్నము చేయవలయును. ద్విజునకు శౌచమే మూలము. శౌచాచారవిహీనుని సర్వకర్మలు నిష్పలములగును. బాహ్యము ఆభ్యన్తరము అని శౌచము రెండు విధములు. మట్టిలో నీటితో బాహ్యశుద్ది, భావశుద్ది ఆంతరము. శిశ్నమును గ్రహించి శౌచము కొరకు  మట్టిని తీసుకొనవలయును. ఎలుకలు తవ్విన మట్టిని, నాగలిచే దున్నినమట్టిని, పాపీ కూపతటాకాదుల మృత్తికను తీసుకొనరాదు. పవిత్రమైన మట్టితో శౌచము నాచరించవలయును. లింగమునకు ఒకమారు, రెండు పార్శ్వములకు రెండుమార్లు మట్టితో శుద్ది చేయవలయును. మూత్రవిసర్జనకు ఇది. శౌచపద్దతి అని పండితులు చెప్పెదరు. లింగమున ఒకమారు, గుదమున అయిదుమార్లు పదిమార్లు వామభాగమున, అట్లే ఇరుప్రక్కల పాదములను ఏడుమార్లు పదిమార్లు వామభాగమున, అట్లే ఇరుపక్కల పాదములను ఏడుమార్లు మూడుమార్లు, మట్టిచే శుద్ధి చేయవలయును. ఇది మల విసర్జన తరువాత చేయు శౌచపద్ధతి. ఇది గృహస్థునకు శౌచపద్దతి. రెండింతలు బ్రహ్మ చారికి, వానప్రస్తులకు మూడింతలు యతులకు నాలుగింతలుండును. స్వగృహమున పూర్ణశౌచము నాచరించవలయును. మార్గమున అర్థశౌచమును చేయవలయును. రోగాది పీడితులకు, ఆపదలో నున్నవారికి ఈ నియమములేదు. దుర్గంధము తొలగునంత శౌచము నాచరించిన సరిపోవును. స్త్రీలకు అనుపనీతులకు కూడా గంధలేపక్షయము వరకే శౌచమునాచరించవలయును. వ్రతమును స్వీకరించినవారు యతివలై శౌచమును చేయవలయును. విధవా స్త్రీలకు కూడా ఈ నియమము వర్తించును. ఇట్లు శౌచమును నిర్వహించి సావధానమైన మనస్సుతో తూర్పుముఖముగా కాని ఉత్తరాభిముఖముగా కొని ఇంద్రియ నిగ్రహముతో ఆచమనమును చేయవలయును. వాసన, నురుగులేని జలమును మూడు నాలుగుమార్లు ఆచమనము చేయవలయును. అరచేతిలో రెండుమార్లు కపోలములను పెదవులను శుద్ధిచేయవలయును. అంగుషానామికలతో వరుసగా చక్తుశోత్రములను స్పృశించవలయును. ద్విజుడు కనిష్టాంగుష్ఠయోగముతో నాభిని స్పృశించవలయును. అరచేతితో వక్షస్థలమును అంగుల్యగ్రములతో కాని భుజములను తాకవలయును. అరచేతిలో కొని అంగుల్యగ్రములతో కాని భుజములను తాకవలయును. ఇట్లు ఆచమనము చేసినచో ద్విజుడు శుద్ది పొందును. తరువాత బెరడుతో నున్న, ప్రశస్తవృక్షముయొక్క దంతకాష్ఠమును నమలవలెను.

బిల్వ, అసన, ఉత్తరేణి వేప, మామిడి మందార వృక్షశాఖల కాషమును గ్రహించి జలముచే శుద్ధి చేసి ఈ మంత్రముచే అభిమంత్రణ చేయవలయును. “ఆయుర్బలం యశో వర్చః ప్రజా పశువస్తూని చ, బ్రహ్మ ప్రజ్ఞాం చ మేథాం చ త్వం నో దేహి వనస్పతే” అను మంత్రమును అనుసంధానము చేయవలయును. (“ఓ వృక్షరాజమా ! ఆయుష్యమును బలమును యశమును, తేజస్సును, పశువులను, సంతానమును, ధనములను, వేదములను, ప్రజ్ఞలను, మేథస్సును నాకు ప్రసాదింపుము” అని యర్థము). బ్రాహ్మణుడు కనిషాంగులి పరిమితము దశాంగులకాష్ఠమును చర్వణ చేయవలయును. క్షత్రియుడు తొమ్మిది అంగులముల కొషమును, వైశ్యుడు ఎనీమిదంగులముల కొషమును, శూద్రుడు స్త్రీలు నాలుగంగులముల. కాష్ఠమును చర్వణ చేయవలయును. . దంతకాషములు లభించినచో పన్నెండుమార్లు గండూషములతో తృణపత్రములతో ముఖశుద్ధి చేసుకొనవలయును. దంతకాష్ఠమును వామహస్తముచే గ్రహించి వామభాగదంష్ట్రలచే చర్వణచేయవలయును. గో దోహకాలము దంతములను ఘర్షణ జరిపి దంతకొషమును ప్రక్షాళనము చేసి రెండుగా చీల్చవలయును. ఆ రెండు భాగములతో నాలుకను గీచుకొని ఇంద్రియ నిగ్రహముతో ప్రక్షాళను చేసి దూరముగ విసరివేయువలయును. మరల మొదటి వలె ఆచమనమును చేయవలయును. తరువాత మద్యాదుల పవిత్ర జలముతో స్నానమును చేయవలయును. తీరమును శుద్ధి చేసి దర్భలను పరచి నీటిలో ప్రవేశించవలయును. అచట జలమునకు నమస్కరించి రవి మండలమునుండి ఆ వాహనముచేసి గంధాదులతో మండలము నేర్పరిచి జనార్ధన దేవుని ధ్యానము చేసి మంత్రమును పుణ్యతీర్థములను స్మరించుచు స్నానమును చేయవలయును. “గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి ! నర్మదే సింధు కావేరీ జలేస్మిన్సన్నిధిం కురు, పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యాస్సరితస్తదా ఆగచ్ఛంతు మహాభాగా స్నానకాలే సదా మమ. అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవస్తీ కా పురీ ద్వారవతీ జైయా స పై తే మోక్షదాయికాః” అనుమంత్రములను పఠించవలయును. “ఓ గంగా ! యమునా ! సరస్వతీ !  గోదావరీ ! నర్మదా ! సింధూ, కావేరీ ! మీరందరు నేను స్నానము చేయు ఈ జలములో వచ్చి చేరుడు. పుష్కరాది తీర్దములు గంగాది నదులు నేను స్నానము చేయు సమయమున నా సన్నిధికి చేరుగావుత. అయోధ్యా మధురా మాయా కాశీ, కాంచీ, అవంతికా ద్వారము అను నీ యేడు క్షేత్రములు పుణ్యప్రదములు” అని పై మంత్రమున కర్ధము. తరువాతా ఆఘమర్షణ జపముచేసి ప్రాణాయామముతో నీటిలో మునుగవలయును, స్నానాంగముగా తర్పణమునిచ్చి సూర్యునకు ఆర్ఘ్యమునీయవలయును. తరువాత సూర్యుని ధ్యానము చేసి జలమునుండి బయటకు వెడలి శుభ్రమైన వస్త్రమును ధరించి మరియొక వస్త్రమును పైన కప్పుకొని దర్భాసనమున కూర్చుండి సంధ్యావందనమాచరించవలయును ఈశానాభిముఖముగా నుండి గాయత్రిచే ఆచమనము చేసి “ఋతం” ఇత్యాది మంత్రమును పఠించి మరల ఆచమనమును చేయవలయును. తరువాత జలమును తను చుట్టూ తిప్పి ప్రోక్షణ చేసి ప్రణవాంతమున సంకల్పముచేసి ఋషి ఛందస్సులను దేవతలను స్మరించవలయును. భూరాది సప్తవ్యాహతులతో శిరమును ప్రోక్షించి విడిగా అంగన్యాసకరన్యాసములను చేయవలయును. తారస్వరముతో భూః అని ఉచ్చరించి శిరమున, భువః అనీ శిఖలో, స్వః అని కవచమున, భూర్భువః అని నేత్రములలో భూర్భువః స్వః అని ‘అస్త్రాయ ఫట్’ అని దిక్కులలో తాలత్రయ న్యాసమును చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున పద్మా సమున నున్న సంధ్యను ఆవాహన చేయవలయును. “ఆగచ్ఛ వరదే దేవి త్ర్యక్షరే బ్రహ్మ వాదిని గాయత్రి ఛందసాం మాతర్బ్రహ్మయోనే నమోస్తు తే” అను మంత్రముతో ధ్యానము చేయవలయును. “అక్షరత్రయాత్మకమగు బ్రహ్మ వాదినీ ! వరదాత్రి ! ఛందోమాతా ! బ్రహ్మయోనీ ! గాయత్రీ! ఇచ్చటికి రమ్ము నీకు నమస్కారము అని పై మంత్రమున కర్థము) మధ్యాహ్న కాలమున వృషభవాహనారూఢను శుక్లాంబరధారిణిని రుద్రవాదిని రుద్రయోని యగు సావిత్రిని ఆవాహన చేయవలయును. సాయంకాలము గరుడారూఢ పీతాంబరధారిణి విష్ణువాదిని విష్ణుయోని యగు సరస్వతిని ఆవాహన చేయవలయును. సప్తవ్యాహృతులను తారస్థాయిలో త్రిపదను ఉచ్చరించవలయును. శిరమున శిఖాపూరణముచేసి కుంభక రేచకమును ఆచరించవలయును. ప్రాణాయామమున పొమ మధ్య భాగమున క్రమముగా వాయువును నియమించవలయును. తరువాత రెండు మార్లు ఆచమనముచేసి ప్రాతః కాలమున “సూర్యశ్చ మామన్యుశ్చ” అను మంత్రముతో, మధ్యాహ్నమున “ఆపః పునంతు పృథివీం” అను మంత్రముతో, సాయంకాలము  “అగ్నిశ్చ మామన్యశ్చ” అను మంత్రముతో ధ్యానము చేసి ఆచమనము చేయవలయును. ‘ఆపో హి షా మయో ఇత్యాది మంత్రత్రయముచే మార్జన చేయవలయును.’ సుమిత్రయాన ! అను మంత్రముచే నొసా భాగమును స్పృశించిన జలముచే ద్విషడ్వర్గమును సముత్సారణచేసి ‘ద్రుపదాదివ’ అను మంత్రముచే శిరమున జలము ప్రోక్షణ చేయవలయును. “ఋతం చ సత్యం” అను మంత్రముచే అఘమర్షణ జపము చేయవలయును. అంతశ్చరసీ’ అను మంత్రముచే ఒకమారు జలపానము చేయవలయును. తరువాత సూర్యునికి యథావిధిగా గంధపుష్పములను జలాంజలిని సమర్పించి లేచి నిలబడి స్వస్తి కొంజలిని సమర్పించవలయును. యథాక్రమముగా మూడుకొలములలో ఊర్ధ్వబాహువుగా ఆధబాహువుగా “ఉదుత్యం”  “చిత్రం” “తచ్చక్షు” అను మంత్రములను జపించవలయును. తరువాత సూర్యమంత్రములను, శైవమంత్రములను, విష్ణుమంత్రములను, ఇతర మంత్రములను జపించి సూర్యతేజమును ‘తేజోసి’ ‘గాయత్ర్య సి’ అను మంత్రములచే ప్రార్థన చేయవలయును. తరువాత బ్రహ్మంగములను మూడమార్లు ఆవృత్తి చేసుకొని ఆధ్యాత్మికలగు మూడు శక్తులను ఇట్లు ధ్యానము చేయవలయును. మొదట బ్రహ్మాణి చతురానగా అక్షవలయా చేతులతో కలశమును, సుకువములను ధరించునది, బాలచంద్రకాంతిగల ముఖము కలది. ఋక్స్వరూపిణి బాలికా రూపమును ధరించినది హంసారోహణ సమయమున కాల అందెలఖణ్ ఖణ్ ధ్వని చేయుచుండునది, వివిధాభరణములచే భూషించబడునది అయిన గాయత్రి మాచే ధ్యానించబడినదై సంపత్సమృద్దిని కలిగించుగావుత. మధ్యాహ్న కాలమున రుద్రాణి, నవయౌవన, త్రినయన వ్యాఘ్రచర్మాంబరధారిణి ఖట్వాంగత్రికి ఖాక సూత్రవలయ విద్యుతకోశము కల జటాకలాపములచే ప్రకాశించుదేహము గలదై, బాలేందుమౌలి తెల్లని దేహకాంతిగలది, వృషభవాహాన యజుస్స్వరూపిణి అగు సావిత్రి మాకు అభయమును సంపదను కలిగించు, గావుత. సాయంకాలమున భగవతి, పీతాంబరాలంకృత, శ్యామదేహ, వృద్ధభావ భాసిత తనుకాంతిగలది, వైష్ణవి, గరుడవాహన, మణినూపురాంగదగ్రెవేయాది భూషణకాంతిశోభిత, హస్తములందు శంఖచక్రగదా పద్మములను ధరించినది అయిన సరస్వతి మాకు సంపదనిచ్చుగావుత. ఇట్లు ప్రాతఃకాల  మధ్యాహ్న సాయంకాలములలో భక్తితో ధ్యానము చేయవలయును. సాయంకాలమున నిలిచి చేయవలయును. ఇట్లు త్రిపదయగు గాయత్రిని సహస్ర పర్యాయములు జపించుట ఉత్తమము. శతపర్యాయములు మధ్యమము. దశపర్యాయములు అధమము. బ్రహ్మ చారి ప్రతి గాయత్రీ జపమును మొదట ఓం భూః భువః అను మూడు వ్యాహృతులను ఆద్యంతరములలో సంపుటీకరణము చేయవలయును. గృహస్థునకు సంపుటీకరణముతో పనిలేదు. అనగా ఆదిలో మాత్రమే చేయవలయును. ఇట్లు యథాశక్తి గాయత్రీజపమును చేసి సూర్యునికి సమర్పించి గాయత్రికి సూర్యునికి  అంజలి ద్వయమును అర్పించవలయును. తరువాత ‘ఉత్తరే శిఖరే’ అను మంత్రముచే గాయత్రిని “బ్రహ్మరుద్రవిష్ణువులచే అనుజ్ఞాతవై సాగరముగా వెళ్ళుము” అని విసర్జించవలయును. దిక్కులకు దిగ్ధేవతలకు చేతులు జోడించి నమస్కరించి ప్రాతఃకాలమునుండి చేయవలసిన పనులను ఆచరించవలయును.గృహస్థుడు ప్రాతఃకాల మధ్యాహ్నములలో స్నానమాచరించవలయును. వానప్రస్థుడు యతి మూడువేళలా స్నానమాచరించవలయును.

రోగపీడితులకు బాటసారులకు ఒకమారు స్నానము విహితము.  తరువాత దర్భపాణియై బ్రహ్మయజ్ఞమును చేయవలయును. పగలు చేయవలసిన కర్మలను ప్రమాదవశమున చేయజాలనిచో రాత్రి మొదటి రూములో యథాక్రమముగా నాచరించవలయును. ఆపదలేని సమయమున కూడా ధూర్త బుద్దియే సంధ్యోపాసన చేయనివాడు సర్వధర్మ బహిష్కృతుడై పొషండుడగునని తెలియును. కపటయుక్తులతో సంధ్యాదికర్మలను విస్తరించినవాడు మహాపాతకులలో శేషుడగును. సంధ్యాది కర్మలను వదిలి సంభాషించువారు సూర్యచంద్రతారకలుండువరకు నరకమున నివసింతురు. తరువాత దేవతార్చన సలిపి యథావిధిగా వైశ్వదేవమును చేయవలయును. ఆ సమయమున అచటనున్న అతిథిని చక్కగా అన్నొదులతో పూజించవలయును అభ్యాగతుల విషయమున మృదు మధురముగా మాటలాడవలయును. జలాన్న కందమూలాది దానములచే, గృహదానముచే పూజించవలయును. అతిథీ నిరాశచెంది ఇంటినుండి వెడలినచో తన పాపమును గృహస్థునకు ఇచ్చి అతని పుణ్యమును తీసుకొని వేళ్ళును. గోత్రనామములు తెలియనివాడు, మరియొక గ్రామమునుండి వచ్చినవాడు, అతిథి అని పండితులు చెప్పెదరు. అట్టి అతిథిని శ్రీ మహావిష్ణువుగా భావించి పూజించవలయును, తన గ్రామమున నుండువాని నొకని, శ్రోత్రియుని, విష్ణుతత్పరుని, ప్రతిదినము పితరులనుద్దేశించి అన్నాదులచే తృప్తి పరచవలయును. పంచయజ్ఞములను పరిత్యజించినవాడు బ్రహ్మ ఘాతకుడని పండితులు చెప్పుదురు. కావున ప్రతిదినము ప్రయత్నముచే పంచయజ్ఞముల నాచరించవలయును. దేవయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, నృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము అనునవి పంచయజ్ఞములు. భృత్యమిత్రాదులతో కూడి తాను మౌనముగా భుజించవలయను, ద్విజులకు భోజనమీయవలయును. తినదగినవారిని ఎవ్వరినీ విడువక అందరికీ భోజనము నుంచవలయును. ఆసనమున పాదములనుంచి తినువానిని, అర్థవస్త్రమును ధరించి తినువానిని, నోటినుండి వెలుపలకి వచ్చినదానిని తినువానిని సురాపి (మద్యపానము చేసినవాడు) అందురు. సగము తిని వదిలిన మోదకములను ఫలములను మరల తినినవాడు, సాక్షాత్తుగా లవణమును తినువాడు గోమాంసాశనము చేసినవానితో తుల్యుడు. జలపానము చేయునపుడు ఆచమనము చేయునపుడు పదార్థములను తినునపుడు ధ్వని చేయరాదు. అట్లు చేసినచో నరకమును పొందును. విహితమైన అన్నమునే నిందించక తినవలయును. మౌనముగా భుజించవలయును. మొదట ‘అమృతోపస్తరణమసి’ అనీ జలమును స్వీకరించవలయును. భోజనానమున ‘అమృతాపిధానమపి’ అనుమస్త్రముతో ఒకసారి జలమును పానము చేయవలయును. ప్రాణాహుతులనిచ్చి ఆచమనముచేసి భోజనము చేయవలయును. భోజనము తరువాత ఆచమనము చేసి శాస్త్ర చింతన చేయవలయును. రాత్రిపూట కూడా యథాశక్తిగా ఆసన శయనభోజనోదుల నాచరించవలయును. ఇట్లు గృహస్థుడు ప్రతిదినము సదాచారపరుడు కావలయును. సదాచార పరిత్యాగముచేసినవాడు ప్రాయశ్చిత్తియగును.

కేశములు తెల్లపడుట, శరీరము ముడతలు పడుట మొదలగు దోషములను శరీరమున జూచిన వెంటనే భార్యను పుత్రులకప్పగించికాని, వెంటతీసుకొని కాని వనమునకు వెళ్ళవలయును. వనమున మూడు వేళలా స్నానము చేయవలయును. నఖములను జటలను మీసములను గడ్డములను ధరిచి యుండవలయును. క్రిందపరుడవలయును. బ్రహ్మ చర్యమును పాటించవలయును. పంచయజ్ఞముల నాచరించవలయును. బ్రహ్మ చర్యమును పాటించవలయును. పంచయజ్ఞముల నాచరించవలయును. ప్రతినిత్యము ఫలమూలమును భుజించుచు స్వాధ్యాయ నిరతుడు  కాలవయును. సర్వప్రాణుల యందు దయకలవాడై నారాయణ పరాయణుడు కావలయును. గ్రామములోని పూవులను పండ్లను గ్రహించరాదు. ఎనిమిది ముద్దలు మాత్రమే అన్నమును తినవలయును. రాత్రిపూట భోజనము చేయరాదు. వానప్రస్థాశమువాసి తైలమును పూర్తి గా విడువలయును. స్త్రీ సంగమును, నిద్రను సోమరితనమును పరిత్యజించవలయును. శంఖచక్రగదాపాణియగు నారాయణుని స్మరించుచుండవలయును. తను నాచరించుచుండవలయును. చోద్రాయణాదివ్రతముల నాచరించవలయును. శీతతాది బాధలను సహించవలయును. అగ్ని పరిచర్య చేయుచుండవలయును. అన్ని వస్తువుల విషయమున మనసులో వైరాగ్యము కలిగిన పిమ్మటనే సన్య సించవలయును. లేనిచో పతితుడగను. శాంతుడు దాంతుడు, జితేంద్రిడుయు, వేదాంతా భ్యాస నిరతుడు కావలయును. సుఖదుఃఖాదీ ద్వంద్వరహితుడుగా అహంకార మమకారరహితుడుగా సర్వదా ఉండవలయును. ద్విజుడుగు యతి నగుడుగా వాని జీర్ణ కౌపీనుడుగా గాని ఉండవలయును. మానావమానములో, శత్రుమిత్రులలో సముడుగా నుండవలయును. గ్రామమున ఒకరాత్రి, నగరమున మూడు రాత్రులుండవలయును. నిత్యము భిక్షాన్నముతో జీవికను గడుపవలయును. ఒక ఇంటి అన్నము తినరాదు. నిందితుడు కాని ద్విజునింట్లో అగ్నిని చల్లార్చిన తరువాత, భోజనసమయము కానివేళ, వివాదములు లేనిచోట యతి భిక్షాటనమును చేయవలయును. త్రికాలమున స్నానమును చేయవలయును. నారాయణ పరాయణుడు కావలయును. నిత్యము ప్రణవమును జపించవలయును. ఇంద్రియ జయము కలిగియుండవలయును. యతి ఒకే ఇంట అన్నమును కోరినచో తినినచో పదివేల ప్రాయశ్చిత్తములు చేసిననూ నిష్కృతి లభించదు. యతి లోభముచే శరీర పోషణపరుడైనచో చండాలసముడుగను. వర్ణాశ్రమ ధర్మపరుల నిందకు పాత్రుడగును. ఎపుడూ ఆత్మానందమగ్నుడై వికారరహితుడు అద్వితీయుడు నిర్మము, శాంతుడు, మాయాతీడుడు, మాత్సర్యరహితుడు, అవ్యముడుడు, పరిపూర్ణడు, సదాన్ దైక విగ్రహుడుడు, జ్ఞానస్వరూపుడు, నిర్మలుడు పరభ్యోస్వరూపుడు, సనాతనుడుగా ఆద్యంతరహితుడు జగచ్చేతన్య కారణుడు నిర్గుణుడు పరాత్పరుడు పరముడా అయిన పరమాత్మమయగు నారాయణుని ధ్యానించవలయును. ఉపనిషద్వాక్యములను పఠించవలయును. వేదాన్తోర్థల చింతన చేయవలయును. జితేంద్రియుడై సహస్రశీర్షడగు నారాయణ దేవుని ధ్యానము చేయవలయును. ఇట్లు మాత్సర్యమును వీడి ధ్యానపరుడైనచో సనాతనుడు పరంజ్యోతి యగు పరమానంద స్వరూపమును పొందును. ఇట్లు ఆశ్రమాచారములను యథాక్రమముగా ఆచరించిన మరల తిరిగిరాని పరమపదమును పొందుదురు. వర్ణాశ్రమాచారపరులు సర్వపాపవివర్జితులై నారాయణ పరులై శ్రీ మహావిష్ణు నిలయమైన పరమ పదమును పొందెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున  పూర్వభాగమున ప్రథమపాదమున సదాచారమున గృహస్థవానప్రస్థయతి ధర్మనిరూపణమను ఇరువది యేడవ అధ్యాయము సమాప్తము.