నారద మహా పురాణము - పూర్వార్థము
32 - భవాటవీనిరూపణమ్
సనకమహర్షి పలుకుచున్నాడు :- ఇట్లు కర్మపాశముచే నియమించబడు జంతువులు స్వర్గాది పుణ్యస్థానములలో పుణ్యభోగముల ననుభవించి యాతనాలోకములందు మిక్కిలి దుఃఖకరమగు పాపఫలము ననుభవించి క్షీణించగా మిగిలిన కర్మలచే ఈ భూలోకమునకు వచ్చి అన్నిభయములతో విహ్వలములగు, మృత్యబాధాయుతములై స్థావరాదులలో పుట్టెదరు. వృక గుల్మలతా వల్లీ గిరి తృణములు మహోమోహసమాకృతములగు స్థావరములుగా పేర్కొనబడును. స్థావరత్వమును పొందుటకు భూమిలో విత్తిన బీజములు నీటిలో తడిసిన వెంటనే సంస్కారసామగ్రీ వశమున లోని వేడితో పక్వములై ఉబకి మూలభావమును పొంది, మూలమునుండి అంకురత్వమునొంది, అంకురమునుండి ఆకులు కాండములు నాలములు కలిగి, కాండములనుండి మొగ్గలు తొడిగి పూవులగును. ఆ పూవులలో కొని ఫలరహితములు, మరికొన్ని ఫలసహితములు అగును. ఆ పూవులు బాగుగో వృద్ధిపొందినపుడు ఆ పుష్పమూలములనుండి తుషా (పొట్టు) పుట్టును. ఆ పొట్టులో అనుభవించదగిన ప్రాణుల సంస్కారసామగ్రీ వశమున చంద్రకిరణ స్పర్శచే చంద్రకిరణములలోని ఓషథులులోన ప్రవేశించి కీరభావమును పొందును. కాలవశమున పొట్టులో తండులాకారమేర్పడును. ప్రాణుల భోగసంస్కారవశమున సంవత్సరములో ధాన్యముగా ఉండును. స్థావరమును పొందియు చాలాకాలము వానరాదులచే భుజింపబడుచు ఛేదన దవాగ్నిదోహ శీతాతపాది దుఃఖముల ననుభవించి మరణించును. తరువాత క్రీములుగా పుటి ఎలపుడూ దుఃఖబాహుల్యము కలిగి ఒకక్షణమో సగము కణమో బ్రతుకుచు, అరకణములో మరణించుచు బలవత్రాణి పీడలను నివారించుకోజాలక శీతవాతాణములో మరణించుచు బలవత్రాణి పీడలను నివారించుకోజాలక శీతవాతాది క్లేశబాహుల్యము కలవే ఎపుడూ ఆకలిచే పీడించబడుచు మలమూత్రాదులలో సంచరించుచు దుఃఖముననుభవించుచుండును. తరువాత పశుజన్మను పొంది, బలవంతుల బాధలచే ఉద్వేగమును పొంది వ్యర్దోద్వేగ బాహుల్యము కలవారై ఆకలిచే పీడించబడుచు నిత్యము వనచౌరులై తల్లియందు కూడా విషయభోగపరాయణులై శీతమౌతోతపాది కేశబాహుల్యము కలిగి కొన్ని జన్మలలో తృణాహారమును, మరికొన్ని జన్మలలో మాంసాదికమును మేఢ్యమును ఆహారముగా తీసుకొనుచు, మరికొన్ని జన్మలలో కందమూల ఫలాశనులై దుర్బలప్రొణులను పీడించుచు దుఃఖము ననుభవించుచుందురు. అండజములుగా పుట్టినను గొని మాంసాద్య మేధ్యములను తినుచు పర పీడాపరాయణులై నిత్యము దుఃఖబాహుల్యము కలిగియుందురు. గ్రామ పశుజన్మను పొందినను స్వజాతీ వియోగము, బరువును మోయుట, పాశములచే బంధించబడుట, కొట్టబడుట, నాగలి మొదలగు వాటిని లాగుట మొదలగు సర్వవిధదుఃఖములను అనుభవించుచుండును. ఇట్లు నానా జన్మమలలో తిరిగి తిరిగి క్రమముగా మానవజన్మను పొందెదరు. కొందరు పుణ్యవిశేషములచే కూడా మానవ జన్మను పొందెదరు.
మనుష్యజన్మలో కూడా చర్మ కార, చండాల, వ్యాధ, నాపిత, రజక, కుంభకార, లోహకార, స్వర్ణకార, తంతువాయ, సౌచిక, జటిల, సిద్ధి, ధావన, లేఖన, భృతక, శాసనహరి, నీచభృత్య, దరిద్ర, హీనాంగ, అధికొంగత్వాది భేదములచే దుఃఖబహులములగు జ్వరతాప, శీత, శ్లేష్మ, హస్తిపాద, నేత్రశీరో, గర్భ పొర్శ వేదానాది దుఃఖముల ననుభవించుచుందురు. మనుష్య జన్మలో కూడా స్త్రీ పురుష సంగమసమయమున రేతస్సు గర్భకోశమును ప్రవేశించునపుడు కర్మవశమున ప్రాణి శుక్రముతో కలిసి జరాయువును ప్రవేశించి శుక్రశోణితసమ్మేలనరూపఘనపదొర్ణముగా మారును. ఆ వీర్యమున జీవుడు ప్రవేశించుట వలన అయిదు దినములలో ఘనపదార్థముగా మారి, పక్షమున మాంస పిండరూపమును పొంది, మాసమున ప్రాదేశమాత్రమగును. అప్పటినుండి చైతన్యము లేకున్ననూ పోయువశమున మాతృగర్భమున దుస్సహతాప క్లేశములుండుటచే ఒకచోటనుండ శక్యము కాక తిరుగుచుండును. రెండవమాసమునిండిన వెంటనే మానవాకార మాత్రమును పొందును. మూడవమాసము నిండగనే కరచరణాద్యవయవ భావము లభించును. నాలుగు నెలలు గడిచినచో గోళ్ళ చివురులేర్పడును. నాభీసూత్రముచే పోషించబడుచుండును. మలమూత్రములచే పూయబడిన శరీరము కలవాడై మావీచే బంధించబడి రక్త ఆస్టిక్రియ వసామజ్ఞాస్నాయు కేశాదులచే దూషితమైన శరీరమున నివసించుచు, తాను కూడా ఇట్టి శరీరము కలవాడై, తల్లి భుజించు కారము పులుపు ఉప్పు అత్యుష్ణ పదార్థములచే దహ్యమానశరీరుడగుచు, తన శరీరమును చూచుకొని జీవుడు పూర్వజన్మస్మరణానుభవముచే పూర్వమున అనుభవించిన నరకదుఃఖములను స్మరించుటచే అంతర్దుఃఖముచే దహించబడుచు మాతృదేహములోని మూత్రాద్యుష్ణములచే దహింపబడుచు తన మనసులో ఇట్లు పరితపించును.
అయ్యో ! నేనెంత పాపిని. పూర్వజన్మలో భృత్యమిత్రకళత్రపుత్రగృహ క్షేత్ర ధనధాన్యాలయందు వ్యామోహముచే భార్యాపుత్రులను పోషించుటకై పరధన క్షేత్రాదులయందు దృష్టినుంచి పలు ఉపాయములచే హరించి కామాంధకారముచే పర స్త్రీ గమనాది పొతకముల నాచరించి, ఆ పొతకములచే నేనొక్కడినే బహువిధనరకములననుభవించి, మరల స్థావరాదిరూపములతో మహాదుఃఖము ననుభవించి, ఇపుడు మావిచే కప్పబడి అంతఃర్డుఃఖముచే నేనొక్కడినే బహువిధనకరముల ననుభవించి, మరల స్థావరాదిరూపములతో మహాదుఃఖము ననుభవించిపోవుచున్నాను. నేను పోషించిన దారాపుత్రాదులుకెంత దుఃఖము ! పుత్రమిత్ర కళాత్రాది పోషణ కొఱకు పరద్రవ్యముల నపహరించితిని. ఆ పాపముచే నిపుడు మావిచే కప్పబడియుంటిని. పూర్వము ఇతరుల సంపదను చూచి ఆసూయచే దహించిపోతిని. ఇపుడు ఇచట గర్భాన్ని చే దహించి పోవుచుంటిని. మనోవాక్కాయములచే పరపీడన మాచరించితిని. ఆ పాపముచే ఇపుడు నేనొక్కడినే మిగుల దుఃఖముచే దహించిపోతిని.. ఇట్లు గర్భస్థజీవుడు పలువిధములుగా విలపించి తనను తానే ఓదార్చుకొని పుట్టిన తరువాత సత్సంగముచే శ్రీమహావిష్ణుచరిత్రశ్రవణముచే విశుద్దమనస్కుడనే సత్కార్యముల నాచరించి అఖిల జగదంతరాత్మ సత్యజ్ఞానానందమయుడు, శక్తి ప్రభావముచే స్వర్గాదులను సృజించినవాడు లక్ష్మీపతి అయిన నారాయణుని సకల సురాసుర యక్షగంధర్వ రాక్షస పన్నగముని కిన్నర సమూహములచే పూజింపబడిన పొదపద్మములను భక్తిచే పూజించి, దుస్సహమైన సంసారమును ఛేధించుకు కారణభూతుడు, వేదరహస్యోపనిషత్తులచే స్పష్టముచేయబడిన వాడు అయిన సకలలోకపరాయణునీ హృదయమున నిలుపుకొని ఈ దుఃఖమును సంసారమును దాటెదనని మనసున భావించును.
తల్లి ప్రసూతి సమయమున గర్భస్థుడగు దేహి వాయువుచే పరిపీడితుడై తల్లికి కూడా దుఃఖమును కలిగించుచు కర్మపాశముచే బలముగా యోని మార్గమునుండి బయలు వెడలుచు సకలయాతన అనుభవమును ఒకే సమయమున అనుభవించును. ఆట్లు అతి క్లేశముతో యోని యంత్రపీడితుడై గర్భమునుండి నిష్క్రమించి సంజ్ఞను కోల్పోవును. అట్టి శిశువును, బాహ్యపోయువు నురల బ్రతికించును. బాహ్యవాయు స్పర్శకోలముననే పూర్వమున అనుభవించిన సమస్త దుఃఖాదుల స్మృతి నశించును. వర్తమాన దుఃములను కూడా జ్ఞానము లేనందున తెలియజాలక, అత్యంత దుఃఖము ననుభవించును. ఇట్లు బాలత్వమును పొందిన జంతువు అచట కూడా తన మలమూత్రాదులను శరీరమున పూసుకొని ఆధ్యాత్మికాది తాపత్రయములచే పీడించబడుచున్నను చెప్పజాలక ఆకలిదప్పులచే పీడించబడుచు బిగ్గరగా ఏడ్చును, అప్లైడ్వగా స్తన్యమీవలయునని భావించి తల్లి ఆ ప్రయత్నమును చేయును. ఇట్లు అనేక దేహాభోగములను అన్యోధీనముగా ననుభవించుచు కీటకములు కరచుచున్ననూ వారింపజాలడు. బాల్యభావమును పొంది తల్లితండ్రులచే, ఉపాధ్యాయులచే తాడనములను పొందుచు ఇటునటు తిరుగుచు దుమ్ము, బూడిద, బురద మొదలగు వాటియందాడుచు ఎప్పుడూ కలహా స్వభావమును అపవిత్రతను పొంది బహువ్యాపారభ్యాస కార్యనియతుడగుచు ఆ పని చేయలేక ఆధ్యాత్మికాది తాపత్రయములచే దుఃఖములననుభవించును.
పిమ్మట యౌవనమును పొంది ధనమును సంపాదించుచు సంపాదించిన ధనమును రక్షించుచు, ధనము నష్టమైనను, వ్యయమైనను మిక్కిలి దుఃఖించుచు మాయామోహితులై కామ క్రోధాదులచే చెడిన మనసుగలవారై, ఎపుడూ అసూయపరులై పరులధనమును, పరస్త్రీలను హరించు ఉపాయములను ఆలోచించుచు, పుత్ర మిత్ర కలత్రాదులను పోషించు ఉపాయములను విచారించుచు వ్యర్థమగు అహంకారముచే దూషితులై, పుత్రాదులు వ్యాధిపీడితులైనపుడు అన్ని వ్యాపకములను వదిలి, రోగాలదులచే పీడించబడువారి సమీపమున స్వయముగా ఆధ్యాత్మి కాది దుఃఖములచే పీడించబడుచు ఇట్లు చింతించెదరు. ఇల్లు పొలము మొదలగు స్థిరాస్తిని గూర్చి ఏ మాత్రమాలోచింకపోతిని. ఇంత పెద్దకుటుంబమెట్లు పోషించబడును. నాకు మూలధనములేదు. వర్షముకూడా కురియుటలేదు. గుఱ్ఱములేటు పారిపోయినవో, గోవులు ఇంకనూ ఇల్లు చేరలేదు. నా భార్యకు చిన్నచిన్న వయసు గల పిల్లలున్నారు. నేను వ్యాధిగ్రస్తుడనైతిని. ధన హీనుడను. ఆలోచించనందున వ్యవసాయము నశించినది. పుత్రులెప్పుడూ రోదించుచున్నారు. నా ఇల్లు భగ్నమైనది. బంధువులు దూరములోనున్నారు. బ్రతుకు తెరువు లభించుటలేదు. రాజబాధ దుస్సహముగానున్నది. శత్రువులు బాధించుచున్నారు. నేనెట్లు శత్రువులను గెలిచెదను. ప్రయత్నశూన్యుడనైతిని. వ్యాధులన్నీ ఒకేసారొచ్చినవి. ఇట్లు మిక్కిలి దుఃఖాకులుడై తన దుఃఖములను నివారించ జాలక ఈ విధి నన్నెందుకు భాగ్య హీనుని చేసెను, అని దైవము నాక్షేపించును.
అట్లే వృద్ధత్వమును పొంది బలముడిగి, వార్ధక్యముచే ముడతలు పడిన దేహము కలవాడై తెల్లబడిన కేశములు కలిగి మురికి పట్టిన శరీరముచే వ్యాధులచే బాధించబడుచు వణుకుచున్న అవయవములతో ఊపిరి పీల్చరాక ఆయాసముచే కనులు తీరుగగా చూడదగిన దానిని చూడజాలక కంఠమున శ్లేష్మము నిండి భార్యపుత్రాదులచే చీదరించబడుచు ఎపుడు మరణించెదనా అని చింతించుచు, నేను మరణించినచో నేను సంపాదించిన గృహక్షేత్రాదికములను నా పుత్రు రెట్లు కాపాడెదరో, ఎవరికీ చెందునో ? నా సంపదను ఇతరులపహరించినచో నా పుత్రాదులెట్లు బ్రతికెదరు ? అని మమకారముచే దుఃఖముచే గాఢముగా నిట్టూర్చి తాను భవనములో చేసిన పనులను మాటిమాటికి తలచుకొనుచు, అంతలోనే మరచుచు మరణము సమీపించగా వ్యాధి పీడితుడై, మానసిక సంతాపముచే ఆర్తుడై కొంత సేపు అటునిటు తిరుగుచు ఆకలిదప్పులు పీడించగా, కొంచెము నీరిమ్మని అతిదీనముగా యాచించుచు, అక్కడున్నవారు జ్వరము వచ్చినవారికి నీరీయకూడదని చెప్పుచుండగా వారిని మనసులో ద్వేషించుచు తెలివి తప్పుచుండును. తరువాత కాలుచేతులు కదల్చలేక రోదించు బంధుజనులతో కూడినవాడై, ఏమియూ చెప్పజాలక తాను సంపాదించిన ధనాదికమెవరి పాలగునో అని చింతించుచు నీరు నిండిన కనులతో కంఠమున ఘరఘర ధ్వని వచ్చుచుండగా శరీరమునుండి ప్రాణములు పోవుచుండగా యమదూతలు బెదిరించుచు పాశముచే కట్టగా మొదటచెప్పిన విధముగా నరకాదులననుభవించును.
ధాతువులు మలక్షయము వరకు అగ్నిలో దాహమగునట్లు జీవులు కర్మక్షయమగువరకు సంసారాగ్నిలో దహింపబడుదురు. కావున సంసారదావాగ్ని తాపార్తుడగు మానవుడు పరమజ్ఞానము నభ్యసించవలయును. జ్ఞానమువలన మోక్షము లభించును. జ్ఞానశూన్యులగు మానవులు పశువలనబడుదురు. కావున సంసారవిముక్తికి పరమజ్ఞానము నభ్య సించవయును. అన్ని కర్మలను చక్కగా నిర్వహించగల మానవత్వమును పొంది శ్రీహరిని సేవించుకున్న అతనికన్నా అజ్ఞాని ఎవడుండును ? అన్ని కోరికలను తీర్చు. శ్రీహరి యుండగా మానవులు నరకమునకు వెళ్ళుట ఎంత విచిత్రము ? ఎంత విచిత్రము. ఇది గొప్ప వింతయే. జగన్నాథుడు సర్వకర్మఫల ప్రదుడగు అగు నారాయణుడున్ననూ మానవులు జ్ఞానశూన్యులై నరకములో చుందురు. మూత్రపురీషములు స్రవించునశ్వరమైన శరీరమును మాయామోహావిష్ణులగు అజ్ఞానులు నిత్యమని భావింతురు. రక్తమాంసములచే దూషితమగు శరీరమును పొందిన మానవుడు సంసారమును చేదించు విష్ణువును భజించనిచో మహాపాపియగును. మూర్ఖత్వము చాల కష్టములను కలిగించును. హరి ధ్యానపరుడగు చండాలుడు కూడా ఆనందించును. తన దేహమునుండి వెలువడు మలమూత్రాది కిల్బిషమును చూచిన మానవులు ఉద్వేగము నెట్లుపొందకుందురు ? మానవజన్మ పరమదుర్లభము. దేవతలు కూడా ఈ జన్మ కై ప్రార్థనలు చేతురు. అట్టి మానవజన్మను పొంది పరలోకము కొరకు వివేకము కలవాడు ప్రయత్నించవలయును. అధ్యాత్మ జ్ఞానము కలగి హరిపూజా పరాయణులైన వారు పునరావృత్తిదుర్లభమగు పరమపదమును పొందెదరు. ఈ ప్రపంచము ఎవరివలన పుట్టనో, ఎవరివలన చైతన్యమును పొంది ఎవరిలో లీనమగునో అతనే సంసారమునుండి విముక్తిని ప్రసాదించును. నిర్గుణుడైనను గుణవంతునివలె భాసించు శ్రీహరిని చక్కగా పూజించి సంసారమునుండి విముక్తుడగును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున భవాటనీనిరూపణమను ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
