నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

35 - జ్ఞాననిరూపణమ్

సనక మహర్షి పలికెను :- ఓ నారదా ! చదువువారికి వినువారికి సర్వపాపములను నశింపచేయు దేవదేవుడైన శ్రీహరి మహాత్మ్యమును ఇంకనూ చేప్పెదను. శాంతులు అరిషడ్వర్గమును జయించిన వారు యోగముచే అహంకారమును త్యాగము చేసినవారు జ్ఞానరూపుడగు శ్రీహరిని జ్ఞానయజ్ఞముచే పూజింతురు. పుణ్యతీర్థస్నానములచే వ్రతదానతపోయాగములచే విశుద్ధులైన వారు సర్వధాతయగు అచ్యుతుని కర్మయోగముచే పూజింతురు. లోభులు వసనశీలురు జగన్నాధుని పూజించరు. ఆజ్ఞులగు నరకీటకములు మూడులై అజరామరులవలె భావించుకొనుచుందురు. మెరుపువలె చంచలమైన సంపదచే మదించి వృధాహంకారదూషితులై సర్వ శ్రేయోవిధాయకుడగు జగన్నాధుని పూజించరు. హరిధర్మరతులు శాంతులు హరిపాదపద్మ సేవకులు లోకానుగ్రహతత్పరులు దైవవశమున ఏ కొందరో ఈ భూలోకమును పుట్టెదరు. మనోవాక్కాయములచే భక్తితో శ్రీహరిని సేవించువారు లోకములన్నిటిలో ఉత్తమలోకమగు పరమపదమును పొందెదరు. ఇచటనే ఒక పురాతనమైన ఇతిహాసమును ఉదాహరింతురు. ఈ ఇతిహాసమును చదువువారికి వినువారికి సర్వపాప నాశము జరుగును. అట్టి యజ్ఞమాలిసుమాలుల చరితమును చేప్పెదను. ఈ చరితమును వినినచో అశ్వమేధ యాగఫలము లభించును.

పూర్వము రైవతప్రాంతమున వేదవేదాంగపారగుడగు వేదమాలియను ప్రసిద్దుడగు బ్రాహ్మణుడుండెను. సర్వభూ తములయందు దయాపరుడు హరిపూజాపరాయణుడుగా ఉండెను. పుత్రమిత్రకలత్రాది పోషణే ధనార్జన పరుడాయెను. అమ్మ కూడని వస్తువులను, రసములను అమ్మసాగేను. చండాలాదులచే సంభాషించుట, వారి నుండి దానములను స్వీకరించుట తపస్సును వ్రతములను విక్రయించుట,, ఇతరుల కొఱకు తీర్థయాత్రాగమనము మొదలగు వాటిని కలత్రపోషణకు చేయసాగెను. కొంతకాలమునకు అతనికి ఇద్దరు పుత్రులు కవలలు కలిగిరి చారు ఆత సుందరు. యజ్ఞమాలి సుమాలి అను పేరు కలవారు. అపుడు వేదమాలి తన పుత్రులను మిక్కిలి స్నేహముతో వాత్సల్యములో బహువిధోపొయములచే పోషించసాగెను. వేదమాలి పలు వుపాయములచే ధనమును సంపాదించి సంపాధించిన ధనమెంత యున్నదో తెలియుటకు లెక్కించసాగెను. కొన్ని వేల కోట్ల నిధులు కోట్లు కోట్లుగా ఉన్న ధనమును లెక్కించి సంతోషమును ఆశ్చర్యమును పొందెను. దుర్జనులనుండి దానమును స్వీకరించుటచే, అమ్మ కూడని వాటిని అమ్ముటచే, తపోవ్రతాది విక్రయములచే నేనీ ధనమును సంపాదించితిని. అయిననూ ఇప్పటికి నా ఆశ శాంతించలేదు. మేరుపర్వతప్రమాణము గల బహుసువర్ణ రాశులను కోరుచున్నది. అన్ని కష్టములను తొలగించుకొనుట చాలా కష్టము. అన్ని కోరికలు తీరినను మరల కొన్నిటిని కోరును. వార్ధక్యమున శరీరము జీర్ణముగా కేశములు దంతములు నేత్రములు శ్రోత్రములు జీర్ణించును. కాని ఆశ మాత్రము తారుణ్యముతో విలసిల్లు చుండును. వార్థక్యముచే నా ఇంద్రియములన్నియు మందములైనవి. బలము తగ్గినది. కాని ఆశా బలము మాత్రము పెరిగినది. ఆశ కలవాడు పండితుడైనను విద్వాంసుడైనను కాంతుడైనను బుద్ధిమంతుడైనను కోపిష్టి మూడుడు అగును. మానవులకు ఆశ భంగమును కలిగించును. జయింపశక్యము కానిది శత్రుతుల్యము. కావున శాశ్వతానందమును కోరు ప్రాజ్ఞుడు ఆశను పరిత్యజించలయును. బలమును, తేజస్సును, కీర్తిని, విద్యను, అభిమానమును, వార్థక్యమును సత్కులజాతత్వమును ఆశ చాలా త్వరగా భంగపరచును. ఆశాభిభూతులైన మానవులకు కొంచెమిచ్చువాడు చండాలుడైనను ఎంతో గొప్పవానిగా కనిపించును. ఎంత ఆశ్చర్యము ! ఆశాభిభూతులగు మానవులు మహామోహముతో మహాగర్వముతో అవమానాదికమును దుఃఖమును పరిగణించరు. శరీరము జీర్ణమైనది. వార్థక్యముచే బలము తగ్గినది. కావున ఇక నుండి పరలోకము కొఱకు ప్రయత్నించేదను. ఇట్లు నిశ్చయించుకొని ధర్మమార్గపరుడాయెను. వెంటనే ఆ ధనమునంతటిని నాలుగు భాగములుగా విభజించెను. తాను రెండు భాగములను స్వీకరించి మిగిలిన రెండు భాగములను ఇద్దరు పుత్రులకిచ్చెను. తాను సంపాదించుకొనిన పాపములను నశింపచేయగోరి చలివేంద్రములను, తటాకములను, ఉద్యానములను, చాలా దేవాలయములను గంగాతీరమున అన్నదానములను చేసెను. ఇట్లు హరిభక్తి చే సమస్త ధనమును దానము చేసి తపమునాచరించుటకు నరనారాయణాశ్రమమునకు వెళ్ళెను.

ఆ నరనారాయణస్థానమున పుష్పఫలసంచయములచే కూడిన వృక్షరాశులచే శోభితము, బహుముని సేవితము, పరబ్రహ్మను ధ్యానించువారు శాస్త్రార్థ చింతనము చేయువారు, పరిచర్యాపరులు, వృద్ధులు అగు మునులతో కూడియున్నదీ అయిన ఆశ్రమమును చూచెను. ఆ ఆశ్రమమున శిష్యులచే పరివృతుడు, పరబ్రహ్మోపాసకుడు, తేజోరాశియగు జాననీ అను పేరు గల మహర్షిని చూచెను. జానన్తమహర్షిశమాది గుణయుతుడు, రాగద్వేషరహితుడు రాలిపడిన ఆకులను భుజించువాడు. అట్లున్న జానన్త మహర్షిని చూచిన వేదమాలి నమస్కరించెను. జానప్తి మహర్షి ఆగంతకుడు వేదమాలికి అతిథి మర్యాద చేసెను. నారాయణ బుద్దిచే కందమూలఫలాదుల నర్పించి పూజించెను. ఇట్లు మహర్షిచే అతిథి మర్యాదను పొందిన వేదమాలి చేతులు జోడించి వినయముతో నమ్రుడై ఇట్లు పలి కెను. శమాది గుణరాశీ ! మహానుభావా ! నా కల్మషములన్నియూ మీ దర్శనముచే నశించినవి. ఓ పండితుడా జ్ఞానమును ప్రసాధించి నన్నుద్దరించుము.' వేదమాలి ఇట్లు పలుకగా వాగ్మియగు జాన మహర్షి చిరునవ్వుతో గుణవంతుడగు వేదమాలిని చూచి ఇట్లు పలికెను.

జానన్తి మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! సాధన చేయనివారికి దుర్లభం సంసారచ్చేదకారణము అగు జ్ఞానమును సంగ్రహముగా చెప్పెదను వినుము. పరుడు నిత్యుడుగు శ్రీమహావిష్ణువును సేవించుము. ప్రభువగు నారాయణుని స్మరించుము. పరాపవాదమును, కొండెములు చెప్పుటను ఎప్పుడూ చేయకుము. ఎపుడూ పరోపకార నిరతుడవు కమ్ము. మూర్భ సమాగమును వదిలి హరి పూజ పరుడవు కమ్ము. కామక్రోధలోభ మోహమదమాత్సర్యములను విడిచి లోకమును ఆత్మ సమముగా చూచి శాంతిని పొందుము. అసూయను పరనిందను ఎపుడూ చేయకుము. దంభాచారమును అహంకారమును కాఠిన్యమును విడిచి పెట్టుము. ప్రాణులయందు దయను చూపుము. సత్పురుషులను సేవించుము. అడుగువారికి నీవు చేసిన ధర్మములను తెలుపకుము. అసోచారపరులను చూచి శక్తి మేరకు ఉపేక్షించకుము. నీ కుటుంబమునకు విరోధము కాని విధముగా అతిథిపూజను సలుపుము. అనాచార పరులను చూచి శక్తి మేరకు ఉపేక్షించకుము. నీ కుటుంబమునకు విరోధము కాని విధముగా అతిథి పూజను సలుపుము. పత్రపుష్పఫలములతో దూర్వాంకురములచే పల్లవములచే నిష్కామముగా జగన్నాథుడగు నారాయణుని పూజించుము. యథావిధిగా దేవర్షి పిత్సగణములను తృప్తి పరచుము. విధిననుసరించి అగ్ని పరిచర్యను చేయుము. ప్రతి నిత్యము దేవాలయమున సమ్మార్జనమును చేయుము. సావధానముచే దేవాలయమును అలుకుము. దేవాలయమున శీర్ణమైన వాటిని శిధిలమైన వాటిని సంధానము చేయుము. విష్ణ్వాలయమున మార్గమును అలంకరించుము. దీపములను వెలిగించుము. కందమూల ఫలములతో నిత్యమూ మాధవుని పూజింపుము. ప్రదక్షిణ నమస్కారములతో స్తోత్రపాఠములచే శ్రీహరిని ఆరాధించుము. శక్తి ననుసరించి ప్రతినిత్యము పురాణ శ్రవణమును పురాణ పఠనమును వేదాంత పఠనమును చేయుము. ఇట్లు చేసినచో నీకు ఉత్తమోత్తమజ్ఞానము సిద్ధించును. జ్ఞానము వలన సమస్త పాపనాశము జరుగును. ఇట్లు జానల్లి మహర్షిచే బోధించబడిన వేదమాలి ఆ మార్గముననుసరించి కొంత జ్ఞానమును పొందెను.

వేదమాలి ఒకపుడు తనకు కలిగిన జ్ఞానలేశముచే నేనెవరిని ? నా పనేమిటి ? అని తనలో తానే ఆలోచించుకొనెను. నా కెట్లు జన్మ కలిగెను ? నా స్వరూపమెట్టిది ? ఇట్లు రేయింబవళ్ళు చింతాపరుడై ఏ నిశ్చయము చేయజాలక బ్రాహ్మణోత్తముడగు వేదమాలి మరల జానని మహర్షిని సమీపించి నమస్కరించి ఇట్లు పలికెను.

వేదమాలి పలికెను :- బ్రహ్మజ్ఞానశ్రేషా ! గురువర్యా ! నా చిత్తము మిక్కిలి భ్రమించుచున్నది. నేనెవరిని ? నా పనేమిటి ? నాకు జన్మ ఎట్లు కలిగెను. తెలుపుము.

జానన్తి మహర్షి పలికెను :- “ఓ మహానుభావా ! నీ మాటముమ్మాటికీ నిజమే. మనసు భ్రమించుట నిశ్చితమే, అవిద్యోనిలయమగు చిత్తము సద్భావము నెట్లు పొందును ? నాది అని చెప్పుట కూడా భ్రాంతియే యగును. ఓ పండితుడా ! అహంకారము మనోధర్మము కాని ఆత్మధర్మము కాదు. అయినను నీవు నేనెవరిని అని అడిగితివి. జాత్యాదిశూన్యమైన అహమునకు నేనెట్లు నామకరణము చేతును ? సాటిలేని స్వభావము కలది గుణరహితము పరాత్మ రూపరహితము, అప్రమేయమైన ఆత్మకు నామకరణమెట్లు చేతును ? పరంజ్యోతి స్వరూపము, పరిపూర్ణము, అవ్యయాత్మ, అవిచ్చిన్న స్వభావము అయిన ఆత్మ క్రియను ఎట్లు చెప్పగలను ? స్వప్రకాశ స్వరూపము నిత్యము, అనంతమును అయిన పరమాత్మకు జన్మను క్రియను ఎట్లు చెప్పగలను ? జ్ఞానైకవేద్యము, అజరము సనాతనము, పరిపూర్ణము, పరానందము అయిన పరమాత్మ కంటే భిన్నమీజగత్తున మరొకటి లేదు. ‘తత్వమసి’ మొదలగు వాక్యములను తెలియ ఓ మోక్షసాధనము. జ్ఞానము కొట్టబడనపుడు జగత్తంతయూ బ్రహ్మమయమే యగును.” ఇట్లు జానప్తి మహర్షి బోధించగా వేదమాలి ఆత్మలో ఆత్మస్వరూపమగు ఆచ్యుతుని సాక్షాత్కరించుకొని ఆనందించెను. పరబ్రహ్మ ఉపాధిరహితము స్వయంప్రకాశము, నిరంజనము, అయినది నేనే అని నిశ్చయించుకొని పరమశాంతిని పొందెను. తరువాత లోకాచారము కొఱకు చేదమాలి గురువగు జానప్తికి నమస్కరించి ధ్యానపరుడాయెను. చాలాకాలము గడిచిన తరువాత వేదమాలి వారాణసీ పురమునకు వెళ్ళి మోక్షమును పొందెను. ఈ అధ్యాయమును సావధానముగా చదివిననూ వినిననూ కర్మపాశవిచ్చేదమును పొంది

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున జ్ఞాననిరూపణమను ముప్పదిఅయిదవ అధ్యాయము సమాప్తము.