నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

68 - గణేశ మంత్ర విధాన నిరూపణమ్

శ్రీ సనత్కుమార మహర్షి పలికెను :- సకలాభీష్టదాయకములగు గణేశ మంత్రములను ఇపుడు చెప్పెదను. ఈ మంత్రములను ఉపాసన చేసి సాధకుడు భుక్తి ముక్తులను పొందును. అవ్యయుడు, లక్ష్మి, పార్వతి, మన్మధుడు, స్మృతి,చంద్రుడు, మనువు సహితయైన దేవత చంద్ర శేఖర జేస్తము గణపతి, తోయము, భుజంగుడు, వరణి . అని సర్వాంతమున జనమునుచ్చరించి తరువాత నావశమునకు తెమ్ము ఈ మంత్రము ఇరువది యెనిమిది అక్షరములు కలది. ఈ మంత్రములకు ముని గణకుడు. గాయత్రీ ఛందస్సు గణేశుడు దేవత. షష్ణ శక్తి బీజము. శ్రీ మన్మహాగణపతి ప్రీతికి వినియోగము. శిరస్సున ఋషిని వక్రమున ఛందస్సు, హృదయమున దేవతను, గుహ్యమున బీజమును, పాదములయందు శక్తిని న్యాసము చేయవలయును. షడ్జీర్జాడ్య బీజముతో 'యం'ను బీజాదిచే జాతియుక్తములగు షడంగములను న్యాసము చేయవలయును. షడంగములయందు శైవ షడంగముద్రను ఉంచవలయును. మొదట భూలోకమును గామాదీగా నాభ్యన్తముగా పాదములయందు ఉంచవలయును. గీం ఆదిగా భువర్లోకమును నాభినుండి కంఠాంతము వరకుంచవలయును. గూం ఆదిగా స్వర్లోకమును కంఠాదిమస్త కొవధిగా నుంచవలయును. వ్యాపకమును మూలమంత్రముచే న్యాసము చేయవలయును. ఈ న్యాసమును భువనన్యాస మందురు. మూలమంత్రము నుచ్చరించి మాతృకావర్ణమునుచ్చరించవలయును. తగంతమున మరల మూలమంత్రముండవలయును. మాతృకాస్థలమున నమోంతముగా పలుకవలయును. మూలమంత్రముచే కాంతముగా నయాసము చేసి వ్యాపకమును రచించవలయును. దీనిని వర్ణన్యాసమందురు. ఇక పదన్యాసమును చెప్పెదను. పంచ, త్రి, బాణ, వహీన్లు చంద్రాకి నిగమములతో క్రమముగా విభాగము చేసి మూలగాయత్రిచే హృదంతముగా అష్టపదములతో ఫాలదేశమున, ముఖమున కంఠమున, హృదయమున, నాభిలో, ఊరువులలో జానువులలో, పాదములలో నుంచి మూలమంత్రముచే వ్యాపకమును ఆచరించవలయును. “తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్” ఇది సర్వ సిద్ధి ప్రదాయిని యగు మూలగాయత్రి. ఇట్లు న్యాసవిధిని పూర్తి చేసి, దేవుని హృదయపద్మమున ధ్యానము చేయవలయును. ఉదయంచు సూర్యుని కాంతిగల, లోకరక్టోసంహార కారణుడగు, శక్తితో కూడియున్న, భూషణ ధారియగు, శంఖచక్రాద్యాయుధములను ధరించిన దేవుని ధ్యానించవలయును. ఇట్లు ధ్యానము చేసి మంత్రమును నాలుగు లక్షల ఇరువది నాలుగు వేల మార్లు జపించవలయును. తరువాత అష్టద్రవ్యములతో దశాంశము సంస్కరించిన అగ్నిహోత్రమున హోమము చేయవలయును. ఇకువు, సకు, అరటిపండ్లు, చిపీటములు, తీలలు, మోదకములు, నారీ కేలములు, పేలాలు అనునవి అష్టద్రవ్యములు. పీఠమును, ఆధారశక్తినుండి పరతత్త్వాంతము వరకు అర్పించవలయును.

షట్కోణము లోపల త్రికోణమును, బయట అష్టదళమును లిఖించవలయును. దాని వెలుపల భూపురము నేర్పరిచి అచట గణేశునని పూజించవలయును. తీవ్రా, జ్వలిని, నందా, భోగదా, కామరూపిణి, ఉగ్రా, తేజోవతీ, సత్యా, విఘ్ననాశినీ అని తొమ్మిది శక్తులు. సర్వాది శక్తి కమలాసనాయ హృదయాంతీకః” అనునది పీఠమంత్రము. ఈ మంత్రముచే ఉత్తమాసనమునర్పించవలయును. ఆ ఆసనము పై గణేశుని ఆవాహించి, మధ్యభాగమున ప్రయత్నపూర్వకముగా పూజించవలయును. త్రికోణ బహిర్భాగమున క్రమముగా పూర్వాదిదిక్పతుష్టయమున అర్పించవలయును. లక్ష్మీదేవిని, లక్ష్మీపతిని, పార్వతిని, పార్వతీ పతిని, రతిని, రతీపతిని, మహాదేవిని, పోత్రిని క్రమముగా బిల్వవట, అశ్వత్త, ప్రియంగు వృక్షముల క్రింద ఆర్పించవలయును. లక్ష్మీదేవి రెండు పద్మములను ధరించి, శ్రీహరి శంఖ చక్రములను ధరించి, పార్వతి దేవి పాశాంకుశములను ధరించి. శివుడు టంకశూలములనుధరించి, రతి పద్మమును మన్మధుడు పుష్పబాణ చాపములను, భూమి శూక ద్రోహులను, పోత్రి చక్రగదలను ధరించి యుండును. దేవాగ్ర భాగమున లక్ష్మీసహితమగు వినియకుని పూజించవలయును. ఆరుకోణములయందు ప్రియాసహితులగు ఆమోదాదులను పూజించవలయును. సిద్దితో కూడి యున్న ఆమోదుని మొదట పూజించవలయును. ఆగ్నేయ కోణమున సమృద్ధి సహితుడగు ఆమోదుని పూజించవలయును. ఈశాన్యకోణమున కీర్తి సహితుడైన సుముఖుని పూజించవలయును. పశ్చిమభాగమున మదనోవతితో కూడియున్న దుర్ముఖుని, నైఋతి దిగ్పాగమున మదద్రపోయుతుడగు విఘ్నుని, వాయవ్యభాగమున ద్రావిణితో కూడిన విఘ్నకర్తను పూజించవలయును. పాశాంకుశ అభయకరులను, తరు భాస్కర సమతేజులను, గండస్థలములనుండి స్రవించుచున్న మదజలమునందలి ఆశతో వచ్చు తుమ్మెదలచే శోభించు వారిని పూజించవలయును. షట్కోణమునకు రెండు పార్శ్వములందు క్రమముగా నిజశక్తులతో కూడియున్న శంఖపద్మ నిధులను పూజించవలయును. కేశరములందు షడంగములను, పత్రములందు అష్టమాతృకలను ఇంద్రాదులను వజ్రాదులను భూగృహమునందు పూజించవలయును. ఇట్లు విఘ్నేశుని ఆరాధించి తన మనోరధములను సాధించుకొనవలయును. గజముఖుని నాలుగు వందల నలభై నాలుగు మార్లు శుద్ధ జలములతో తర్పణ చేయవలయును. పద్మములతో రాజులను, వారి పత్నులను కలువలతో, కుముదములతో మంత్రులను, శుభకరములగు అశ్వత్తసమిధలచే సేనానాయకులను వశము చేసుకొనవలయును. మేడి సమిధలచే రాజులను, జువ్విసమిధలచే వైశ్యులను, మజ్జి సమిధలచే అంత్యజులను వశము చేసుకోనవలయును. నేతితో హోమము చేసినచో సంపదలను, తేనెతో చేసినచో సువర్ణము, ఆవుపాలతో గోవులు, పెరుగుతో చేసిన చో సర్వసమృద్దులు కలుగును. అన్నహోమముచే అన్నము, వేతస సమిధలచే జలము, కుసుంభ కుసుమములచే హోమము చేసినచో వస్త్రములు లభించును.

ఇపుడు సర్వాభీష్టప్రదమగు చతురావృత్తితర్పణవిధానమును చెప్పెదను. మొదట మూలమంత్రముచే ఒక్కోదానికి నాలుగుమార్లు తర్పణమును చేయవలయును. పూర్వమంత్రాక్షరములచే స్వాహాంత మంత్రములచే నాలుగు నాలుగుమార్లు, మూలమంత్రములచే నాలుగుమార్లు తర్పణము గావించి, తరువాత మిధునాదులను పూర్వమువలె తర్పణము గావించవలయును. దేవునితో కూడియున్న శక్తిని, శక్తి చే కూడి యున్న దేవుని ఇట్లు ఇరువది యారు విధములుగా మిధునములగును. తన నామాద్యాకర బీజములను క్రమముగా తర్పణము గావించవలయును. ఇట్లన్నియూ కలిసి నాలుగు వందల నలుబదినాలుగు యగును. ఇట్లు సంతర్పణముగావించిన తరువాత పూర్వము వలే ఉపచారములతో సర్వాభీష్టప్రదుడగు దేవుని నమస్కరించి ఉద్వాసన గావించవలయును. భాద్రపద బహుళ చతుర్థి నుండి ప్రతిమాసమున ఏమరుపాటు లేక సూర్యోదయమున ప్రారంభించి చంద్రోదయము వరకు, భూమి పై కూర్చొనక ఇంద్రియజయముకలవాడుగా సావధాన మనస్కునిగా నుండవలయును. చంద్రోదయమైన తరువాత గణనాయకుని పూజించవలయును. పూర్వోక్తవిధి ననుసరించి నానాపుషోపహారములతో పూజించి ఇరువది యొకటి మోదకములను నివేదన చేయవలయును. తరువాత ఇరువది యెనిమిది వేలమార్లు మంత్రమును జపించవలయును. తరువాత కర్పూర కాశ్మీర పుష్ప చందనములచే గణపతికి మూలాంతమున జేన్తమున అర్ఘ్యమునీయవలయును. ఇదమర్యం కల్పయామి హృదంత? అనునది అర్ఘ్యమంత్రము. ఇట్లు స్తోత్రము గావించి నమస్కరించి తరువాత చంద్రుని పూజించవలయును. తరువాత గురువును పూజించి నాలుగుమార్లు అర్యము నీయవలయును. నివేదన చేసిన మోదకములలో సగము మోదకములను బ్రాహ్మణుల కీయవలయును. తాను జితేంద్రియుడై, బ్రహ్మ చర్యముతో మిగిలిన సగము మోదకములను భుజించవలయును. ఇట్లు ఒక సంవత్సరము వ్రతము నాచరించువాడు పుత్ర పౌత్రులను, సుఖమును, ధనమును, ఆరోగ్యమును పొందును. సూర్యోదయము నుండి చేయగల శక్తి లేనిచో సూర్యాస్తమయమున ప్రారంభించి చంద్రోదయము వరకు పూర్వోక్త విధిననుసరించి ప్రతము నాచరించవలయును. ఇట్లు చేసినను పూర్వోక్తఫలము లభించును. ఏనుగు దంతముతో కాని, బంగారముతో కాని, యేనుగు భంగపరిచిన నింబముతో కాని, చెండితోకాని గణేశప్రతిమను చేసి, ప్రాణప్రతిష్ట చేసి గణేశుని ఆవాహించి విధి విధానముగా పూజించి చంద్రగ్రహణ సమయమున నిరాహారుడై స్పంచి శిఖలో ధరించినచో ద్యూతమున, వివాదమున, యుద్ధమున వ్యవహారమున జయము లభించును. వరాహబీజము బిందుసహితములగు మన్వింద్వాన్నములు కళలు, స్మృతి, మా సేందు, మన్వాగ్రములు గర్లోచ్చిష్ట గణమున చెప్పబడవలయును. బకస్పదీర్ఘపవనో మహాయకాయ యం బలి?” అనునది ఐటీ మంత్రము. ఇట్లు లేనిచో వర్ణము అఖిలేష్టదముకాదు. ప్రణవము భువనేశ్వరి, స్వఓజాంతమున నవాక్షరి హస్తి పిశాచి అగ్ని సుందరి అని వ్రాయవలయును. ఈ నవాక్షరమంత్రము సేవించు వారికి సర్వాభీష్ట ప్రదము. పదములతో సమగ్ర మంత్రముతో పంచాంగములను కల్పించవలయును. మిగిలినదంతయూ పూర్వ మంత్రముతో సమానముగా నుండును. ఇపుడు సాటిలేని వక్రతుండ విధానమును చెప్పెదను.

జలము బ్రహ్మ అగ్నితో చంద్రునితో శ్రీహరి, సదీరడగు దారకుడు, వాయువు వర్మాంతముగా నుండునది ఇది ఆరక్షరములు కలది. ఈ మంత్రములకు మునీ భార్గవుడు. అనుష్టుప్ ఛందస్సు. దేవత గణాధిపుడు. వక్రతుండనామక బీజము. వం అనునది శక్తి కవచము. తార హృదయ మధ్యగతములగు చంద్ర భూషితములగు మంత్ర వర్ణములచే షడంగన్యాసము చేసి మన్తవర్ణములను భ్రూమధ్యమమున, కంఠమున, హృదయమున, నాభియందు, లింగమునందు, పదమునందుంచి, అబలముచే వ్యాపకము నాచరించవలయును. ఉదయుంచుచున్న సూర్యకాంతి గల, హస్తములందు పాశాంకుశవరాభయములను ధరించియున్న, రక్తభూషాంబరుడు అగు గజవక్తుని సేవించవలయును. దశాంశను అష్టద్రవ్యములచే బోమము చేయవలయును. తీవ్రాదులతో కూడియున్న పీఠమున అర్చించవలయును. మూర్త ముచే మూర్తిని సంకల్పించి ఆ మూర్తియందు ఆవాహన చేసి పూజించవలయును. షట్ కోణములందు షడంగములు, పత్రములందు అష్ట శక్తులుండును. విద్యను విధాత్రిని, భోగదము, విప్రఘాతినిని, నిధిప్రదీపను, పాపఘ్సిని, పుణ్యను, శశిప్రభను, పూజించవలయును. దళాగ్రములందు వక్రతుండ, ఏకదంష్ట్ర,మహోదర, గజాస్య, లంబోదర, వికటి, విఘ్నరాట్ ధూమ్రవర్లులను పూజించవలయును. తరువాత బాహ్యభాగమున ఆయుధ దారులగు లోకపాలకులను పూజించవలయును. ఇట్లు ఆవరణములలో పూజించి అయిదుగురిలో గణనాయకుని పూజించినవారు వక్రతుండుని అనుగ్రహమువలన అన్ని కోరికలను తీర్చుకొనగలుగుదురు. దీక్షాసంస్కార పూర్వకముగా గురు ముఖముగా మంత్రమును పొంది, బ్రహ్మచారియై, హవిస్సును మాత్రమే భుజించుచు, సత్యవాక్కు, జితేంద్రియుడుగానుండి పన్నెండుచేలు ఆరు నెలలు హోమము చేయుచు జపించవలయును. అట్లు చేసినచో దారిద్ర్యము తొలగిపోయి కుబేరుడంతటి ధనవంతుడు కాగలడు. చతుర్థి నుండి చతుర్థి వరకు ఆదరముతో పది వేలు జపించవలయును. ప్రతిదినము అష్టోత్తరశతము హోమము చేయవలయును. ఇట్లు చేసిననూ పూర్వము వలె ఫలము లభించును. శుక్ల కృష్ణపక్షములలోని చతుర్దతిథిలో నూరు పర్యాయములు హోమమును అపూపములతో ఒక సంవత్సరము హోమము చేసినచో సర్వసమ్పద్దులు లభించును. అంగారకచతుర్దిన విధివిధానముగా దేవుని పూజించి హవిస్సును, పాయసాన్నమును నివేదన చేసి, తరువాత గురువును పూజించి హవిస్సును, పాయసాన్నమును నివేదన చేసి, తరువాత గురువును పూజించి భోజనము చేయించవలయును. నివేదిత ద్రవ్యముతో వేయి హోమమును గావించవలయును. ఇట్లు ఒక సంవత్సరము చేసినచో గొప్పసంపదలను పొందును. ఇపుడు లోకముల హితమును కోరి మరియొక సాధకమును చెప్పెదను.

గణపతిని అటుకులచే పొయసాపూపమోదకములచే హోమము చేసి నానాఫలములతో కూడా యజించి తరువాత మంత్రము తెలిసిన వాడు పసుపును ఉప్పును శుద్ధిచేసి ప్రసృతీయందు చూర్ణము చేసి, మంత్రాక్షరముల సంఖ్యలో సగభాగమును కాని, దానిలో సగభాగమును కొని మంత్రమును జపించవలయును. చూర్ణమును గోమూత్రమున నుంచవలయును. అట్లు ఉంచిన దీనిని వేయిసార్లు ప్రయత్నముతో మంత్రములో మంత్రించి, ఋతుదినమున స్నానము చేసి పరిశుద్ధురాలై శుక్లాంబరధర, శుభయగు స్త్రీని గణేశుని ముందు కూర్చుండ బెట్టి ఆ యౌషధమును త్రాగించవలయును. అట్లు చేసినచో గొడ్రాలు కూడా కొడుకును పొందును.మరియు పరమాద్భుతము పరమరహస్యమగు మరియొక సాధనమును చెప్పెదను వినుము. గోచర్మమాత్రమును భూమిని శ్రద్దగా అలికి దాని పై ధాన్యజాలమును చల్లి, అచట ఘటము నుంచవలయును. ఆ ఘటమును శుద్దోదకముతో నింపవలయును. ఆ ఘటము పై కొత్తది శుభకరమగు మూకుడును (మట్టిచిప్ప) కపిలగోవు నేతితో నిండుగా నుంచీ, షడక్షర మంత్రముతో కాని అష్టాక్షర మంత్రముతో కాని దీపమును వెలిగించవలయును. ఆ దీపమున గణేశుని ఆవాహన చేసి గంధపుష్పాదులతో పూజించవలయును. స్నానము చేసిన కుమారిని కాని, కుమారుని కొని పూజించవలయును. కుమారిని లేదా కుమారుని దీపము ముందు కూర్చుండబెట్టి, గణేశుని ధ్యానించి మస్త్రమును జపించవలయును. దీపము నుంచిన తరువాత గణేశుని ద్విజరూపునిగా చూడవలయును. అడిగినపుడు సంపదలో కొని, నశించిన దానిని లభించని దానిని గూర్చి, కుమారి కాని కుమారుడు కాని ఇట్లు చెప్పవలయును. షడక్షరము హదంతమైనచో అష్టాక్షరమగును. గణేశ తంత్రమున ఇతర మంత్రములు కూడా కలవు. కాని మూడు లోకములలోని సాధకులకు సాధ్యము కాని ఇరువది యెనిమిది అక్షరముల, షడక్షరముల మంత్రములను ఎపుడూ చూడరాదు. ఇట్లు గణేశ మన్త విధానమును చెప్పితిని. శఠులకు, పరశిష్యులకు వంచకులకు దీనిని చెప్పరాదు. ఇట్లు సర్వసిద్ధిప్రదుడగు గణేశుని సేవించువాడు ఇహమున సకల భోగములను పొంది అంతమును మోక్షమును పొందును.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున గణేశమంత్రవిధాననీరూపణమను ఆరువది ఎనిమిద - అధ్యాయము