నారద మహా పురాణము - పూర్వార్థము
60 - అధ్యాయము
సనందన మహర్షి పలికెను :- పైలాదిబ్రాహ్మణులు పర్వతము నుండి దిగి వెళ్ళిన తరువాత వ్యాసభగవానుడు పుత్రసహాయముతో ఏకాంతమున ధ్యానపరుడై ఊరకనే కూర్చొని యుండెను. అంతలో అశరీరవాణి పుత్రునితో కూడియున్న వ్యాసమహర్షి ని గూర్చి ఇట్లు పలికెను. ఓ వసిష్ఠ కులసంభవా ! మహరీ ! వేదఘోష జరుగుట లేదు. ఒక్కడివే ధ్యానపరుడవై యున్నావు. ఏమాలోచించుచున్నావు? వేదఘోష లేనిచో ఈ పర్వతము శోభించదు. కావున జ్ఞానియగు పుత్రునితో కలిసి వేదాధ్యయనమును గావించుము. అట్లు అశరీరవాణి మాటలను వినిన వ్యాస మహర్షి పుత్రునితో కలిసి వేదాభ్యాసమును గావించసాగెను. ఇట్లు వారిద్దరు వేదాభ్యాసమును చేయుచుండగా చాలాకాలము గడిచెను. అంత సముద్రవాయువుతో పేరేపించబడిన వాయువు అతిమాత్రముగా వీచేను. అపుడు వ్యాసుడు ఇది. అనధ్యయన కాలమనీ శుకమహర్షిని వారించెను. ఆట్లు వారించబడిన శుకమహర్షి కౌతూహలముతో ఈ వాయువిట్లు ఏలవీచెనని తండ్రి నడిగెను. ఈ వాయు చేష్టనంతటిని నాకు తెలుపుము అని ప్రార్థించెను. ఇట్లు శుకమహర్షి మాటలను వినిన వ్యాసమహర్షి మిక్కిలి ఆశ్చర్యమును పొందినవాడై అనధ్యాయము కావున ఇట్లు పలికెను. నీకు దివ్యజ్ఞానము కలిగినది. నీ మనసు స్వస్థముగా నిశ్చలముగా నున్నది. తమోరజగుణముల నుండి విడువడి సత్యమార్గమున నీ మనసున్నది. ఆ మనసులో బుద్ధిచే వేదములను తెలుసుకొని ధ్యానించుము. వాయువు దేవయానము పితృయానమని రెండు విధములు. ఈ రెంటిలో పితృయానము తామసము. ఈ రెండు భూమ్యాకాశములలో సంచరించుచుండును. దీని వలననే పృథివ్యంతరిక్షములలో వాయువు తిరుగుచుండును. ఈ వాయు మార్గములు ఏడుండును... వాటిని తెలుసుకొనుము. ఈ వాయువు నుండియే దేవగణములు సాధ్యులు మహాబలశాలురుగా పుట్టిరి. వారికి సమానుడగు పేరుగల పొయువు పుట్టెను. ఈ సమాన వాయువు జయింపశక్యముకానిది. సమానునకు పుత్రుడుగా ఉదోనవాయువు, ఉదోనునకు వ్యాసుడను పుత్రుడు కలిగెను. వ్యానవాయువు నుండి అపానుడు, ఆపానుని నుండి ప్రాణవాయువు కలిగెను. ఈ ప్రాణవాయువు శత్రుమర్ధనము చేయగలది, ఇతరులచే అణచలేనిది మరియు సంతానము లేనిదిగా నుండెను. ఇపుడు ఆ వాయువుల కర్మలను విడివిడిగా చేప్పెదను. వాయువు ప్రాణులలో అన్ని చేష్టలను కలిగించును. అందరినీ ప్రీతులను చేయును. కావున ప్రాణమను పేరు కలిగినది. ధూమము వలన పుట్టు, ఊష్మ వలన పుట్టు మేఘసంఘాతములను పొయువే పేరేపించును. మొదటి మార్గమున మొదటి వాయువు పేరు ప్రవహము. ఈ వాయువు ఆకాశమున స్నేహామాత్రల నుండి, మెరుపుల నుండి ఉత్తమకాంతి గలిగియుండును. రెండవ వాయువు ఆవహమనునదీ అంతటా ధ్వనించుచు సంచరించుచుండును. ఈ వాయువే చంద్రుడు మొదలగు నక్షత్రములను ఉదయింపచేయును. బుద్ధిమంతులు ప్రాణుల దేహములలో నుండు దానిని ఉదానమని యందురు. నాలుగు సముద్రముల జలమును ఈ వాయువు ధరించును. వనముననున్న వాయువు సముద్రముల నుండి జలమును తీసుకొని మేఘములకీచ్చును. మేఘములను నీటితో కూర్చి పర్జన్యునకీచ్చును. ఇక మూడవవాయువు ఉద్వహమనునది ఇది సద్గతి. చాలా పెద్దది. ఈ వాయువుచే గొనిపోవబడు మేఘములు వర్ణించుటకు ఆరంభించును. ఈ వాయువే దేవవిమానములను ఆకాశమున ధరించును. నాలుగవ వాయువు సంవహము. ఈ వాయువు పర్వతములను మర్ధించును. ఈ వాయువేగముచే ప్రాణులు. రోగములు కలవారౌదురు. ఈ వాయువుచే చెట్ల నుండి రసమేర్పడును. అయిదవ వాయువు మహావేగము కలది వివహమను పేరు కలది. ఈ వాయువు నందు దివ్యజలములు ప్రవహించుచుండును. ఈ వాయువు వలననే ఆకాశగంగా జలము నిలిచియుండును. ఈ వాయువు నందు సూర్యుడు ప్రతిహతుడై ఏకరశ్మి గలవాడగును. వేయి కిరణములు గల సూర్యుడు భూమిమీదికి చేరుట ఈ వాయువు చేతనే. ఈ వాయువు వల్లనే అమృతనిధియగు చంద్రుడు తడుపబడును. ఆరవ వాయువు పరీవహామనునది. ఇది ప్రాణులకు చాలా శ్రేష్ఠమయినది. ప్రాణధారులందరి ప్రాణములను అంతకాలమున ఈ పోయువే తోలగించును. మృత్యువు, యముడు ఇద్దరు ఈ వోయుధర్మముననే అనువర్తించుచుందురు. చక్కగా చూడగలిగిన, అధ్యాత్మనిత్యమగు బుద్దిచే చేయబడు ధ్యానాభ్యాసాభిరామములకు అమృతత్త్వమును కల్పించునది ఈ వాయువే. ఈ వాయువు వేగముచే దక్షప్రజాపతి పుత్రులు పదివేలమంది దిగంతములకు చేరిరి. ఈ వాయువుచే పరాభూతమగు జలము వృషిచే మరొక దిశకు మరణును. ఏడవవాయువు పరీవహమనునది ఉత్తమమగు వాయువు. దీనిని ఎవరు అతిక్రమించజాలరు. ఇట్లు ఏడుగురు వాయువులు దిలీపుత్రులు. అత్యాశ్చర్యకరులు. ఆద్యంతములు లేనివారు ప్రతిదానిలోపల నుండువారు. అంతట వెళ్ళగలవారు. అంతట సంచరించువారు. ఇది చాలా ఆశ్చర్యమును కలిగించు విషయము. ఓ హిమవత్పర్వము ఈ పోయువుచే కంపించబడినది. ఈ వాయువు విష్ణువు యొక్క నిశ్వాసముతో వెలువడి వేగము కలదగును. అపుడు ఒకేసారి బయలు వెడలును. దానిచే జగత్తు కోభించును. కావున అతివోయువు వీచినపుడు వేదజ్ఞులు వేదాధ్యయనమును గావించరు. వాయువువలన కలుగు వోయుభయమును చెప్పితిని. ఈ భయముచే వేదము పీడించబడును. ఇట్లు పరాశరసుతుడగు వ్యాసుడు ఇంతమాత్రము చెప్పి పుత్రుని అధ్యయనము చేయమని ఆకాశగంగకు వెళ్ళేను. అట్లు వ్యాసమహర్షి స్నానము చేయుటకు వెళ్ళగా బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడగు శుకమహర్షి వేదవేదాంగపారగుడు కావున స్వాధ్యాయమును చేసెను.
అట్లు స్వాధ్యాయమును అధ్యయనము చేయుచున్న వ్యాసపుత్రుడగు శుకుని ఏకాంతమున మహానుభావుడగు సనత్కుమారుడు సమీపించెను. వ్యాసపుత్రుడగు శుకమహర్షి లేచి సత్కరించగా వేదజ్జులలో శ్రేష్ఠుడగు సనత్కుమారుడు , " ఓ వ్యాసపుత్రా ! మహాతేజశ్శాలీ ! ఏమి చేయుచున్నావు అని అడిగెను.
శుక మహర్షి పలికెను :- ఓ బ్రహ్మ పుత్రా ! ఇపుడు నేను స్వాధ్యాయమున ప్రవర్తించుచుంటిని. నా సుకృత విశేషమున మీ దర్శనమును పొందగలిగితిని. మోక్షార్ధ సాధనమగు తత్త్వమును మిమ్ముల నడుగగోరుచున్నాను. నాకు మోక్షార్థ జ్ఞానము కలుగునట్లు నాకు తత్త్వమును తెలియజేయుము.
సనత్కుమార ఉవాచ:-
సనత్కుమార మహర్షి పలికెను:- విద్యతో సమానమగు నేత్రము మరొకటి లేదు. విద్యా సమమగు తపస్సు వేరొకటి లేదు. రాగసమమగు దుఃఖము, త్యాగసమమగు సుఖము మరొకటి లేదు. పాపకర్మ నివృత్తి, సర్వదా పుణ్యశీలత, సద్వృత్తి, సముదోచారము ఇదియే సాటిలేని శ్రేయస్సు. దుఃఖకారకమైన మానవత్వమును పొంది, సంగమును అలవర్చుకొనువాడు మోహమును పొందును. అట్టివాడు దుఃఖమునుండి విముక్తిని పొందజాలడు. సంగమనడా దుఃఖ లక్షణమే. సక్తుడగువానికి మోహ జాలమును పెంచు బుద్ధి కలుగును. మోహ జాలావృతుడు ఇహపరములలో దుఃఖమునే పొందును. శ్రేయస్సును కోరువాడు సర్వోపాయములతో 'కామక్రోధములను నిగ్రహించుకొనవలయును. కామక్రోధములు శ్రేయస్సును భంగపరచ ప్రయత్నించుచుండును. తపస్సును క్రోధము నుండి శ్రీని మాత్సర్యము నుండి, విద్యను మానావమానముల నుండి, ఆత్మను ప్రమాదము నుండి కాపొడుకొనవలయును. ఎదుటి వారి యందు దయకలిగియుండుట పరమధర్మము. కమ పరమ బలము. ఆత్మజ్ఞానమే ఉత్తను జ్ఞానము. సత్యమే పరమహితము. సర్వసంగ పరిత్యాగమును చేసినవాడే విద్వాంసుడు. పండితుడు. ఇంద్రియార్థములనుండి ఇంద్రియములను స్వాధీనము చేసుకొని తిరుగువాడు, సంగరహితుడు, శాంతమనస్కుడు, వికారమును పొందనివాడు, సావధాన మనస్కుడు ఆత్మ భూతములచే కలిసికాని, కలియక కాని అతదూతుడు, నిజముగా విముక్తుడగును. త్వరలో శ్రేయస్సును పొందగలడు. ప్రాణులతో దర్శన స్పర్శన సంభాషణములు చేయనివాడు ఉత్తమ శ్రేయస్సును పొందగలడు. ఏ ప్రాణిని హింసించరాదు. అన్ని ప్రాణుల యెడ మైత్రీ భావమున నుండవలయును. మానవ జన్మను పొందినవాడు ఎవనితోను వైరమును చేయరాదు. . ఆకీంచన్యము, సంతోషము కలవాడై కోరికలు చాపల్యము లేని వాడై యుండుట జితేంద్రియుడగు ఆత్మ జ్ఞానికి ఉత్తమ శ్రేయస్సు. ఇతరుల నుండి పరిగ్రహమును పరిత్యజించి జితేంద్రియుడవు కమ్ము. ఇహలోకమున పరలోకమున శోకరహిత స్థితిని పొందుము. ఆశలేనివారు శోకించరు. కావున మనసు నుండి కోరికలను విడువుము, కోరికలను విడిచిన వాడు దుఃఖవిముక్తుడగును. ఎప్పడు తపమును అంతరింద్రియ నీగ్రహము కలవాడై, మౌనమునవలంబించి, మనసును నిగ్రహించుకొని సంగములయందు సంగతిని విడిచినవాడు జయించరానీ సంసారమును జయించగలడు. గుణసంగములందు ఆసక్తి లేనివాడై ఎప్పుడూ ఏకచ్యూరతుడు కోవలయును. బ్రహ్మ జ్ఞానము కలపోడు త్వరలోనే ఉత్తమానందమును పొందగలడు. సుఖదుఃఖాది ద్వంద్వములలో ఆనందించు ప్రాణులలో మూర్ఖుడు సంతోషించగలడు. కొంచెము ప్రజ్ఞానముచే తృప్తినందినవాడు, జ్ఞానతృప్పుడు దుఃఖించడు. శుభకర్మలచే దేవత్వమును, శుభాశుభమిశ్ర కర్మలచే మానవత్వమును, అశుభకర్మలచే అధోగతిని పొందును. ఆ నీచ జన్మలో జరా, దుఃఖము మృత్యువులచే నిండియున్న సంసారమును చూచును. ఆ విషయమునేట్లు తెలియకున్నావు? హితము కాని దానిని హితమని, నిత్యము కాని దానిని నిత్యమని అనర్ధమును అర్థముగా భావించుచు నిజము నేల తెలియకున్నావు? ఆత్మ భవములగు పలు మోహతంతువులచే చుట్టబడియు సాలెపురుగు వలే తనను తాను చుట్టబడినట్లు తెలియజాలడు. పరిగ్రహించుటను మానుము. పరిగ్రహము దోషయుక్తము. సాలె పురుగు స్వపరిగ్రహము వలననే బంధించబడుచున్నది. ప్రాణులు దారా పుత్రకుటుంబముల యందు బంధించబడి దుఃఖించుచుందురు. బురద యున్న కొలనులో బంధించబడిన యేనుగుల వలె నుందురు. మోహజాలముచే ఆకర్షించబడి దుఃఖించుచున్న ప్రాణులను చూడుము. కుటుంబము, దారాపుత్రులు, శరీరము, ద్రవ్య సంపాదన ఇవియన్నియున పరలోకమున నిలుచునవి కావు. కేవలము సుకృత దుష్కృతములు మాత్రమే నిలుచును. అన్నిటిని విడిచి తప్పని సరిగా పరాధీనుడవై వెళ్ళవలసియున్నపుడు అనర్థమునందు ఎందుకు తగిలియున్నావు. నీ యర్థమును ఎందుకనుసరించవు? విశ్రాంతి, ఆధారము, దొరిబత్తెము, ఆవాసము లేని, చీకటి అలుముకొని యున్న మార్గమున ఒక్కడివే ఎట్లు వెళ్ళగలవు? అట్లు వేళ్ళుచున్న నీవెంట ఏ ఒక్కడూ రాజాలడు. కేవలము సుకృతదు, అష్కృతములుమాత్రమే నీవెంటవచ్చును. విద్య, కర్మ, శౌర్యము, విస్తృతమగు జ్ఞానము అర్ధసాధనకు బాధపడుచుండును. సిద్దార్దుడు మాత్రము ముక్తిని పొందగలడు. గ్రామమున ఉండుటలో ప్రీతి కలిగియుండుట బంధించు త్రాడు వంటిది. సుకృతులు ఈ రజ్జవును ఛేదించివెళ్ళగలరు. దుష్కృతులు వెళ్ళజాలరు. నీతో సమానమగు జాలు, వయస్సు, రూపము గల వారు మృతులగుట చూచుచున్నావు కదా ! అయిననూ నీలో వైరాగ్యము కలుగుట లేదు. నీ హృదయము లోహమయమా? మనస్సు అను ప్రవాహము, రూపము అను తీరములు, స్పర్శమను దీవులు రసమగు వేగము, గంధమను " బురద, శబ్దమను జలము, స్వర్గమార్గమును అధిరోహించజాలని నదిని క్షమారిత్రము, సత్యమయము, ధర్మ ఫైర్యములను కరములు (తెడ్డులు) - కలది త్యాగమను వాయువును అనుసరించి పోగల బుద్దీ నావ మాత్రమే దాటగలదు. ధర్మమును అధర్మమును, సత్యమును, అసత్యమును త్యజించుము. సంకల్పించక ధర్మమును, హింసించక అధర్మమును విడువవలయును. సత్యాసత్యములను తెలిపి పరమనిశ్చయమును బుద్దిలో నిలుపుము. అస్థి అను స్థూణము కలది (స్తంభము) స్పాయుయుతము, మాంస శోణితలేపనము, నరములచే బంధించబడినది. దుర్గంధ భూయిష్టము, మూత్రపురీషములతో పూర్ణము, జరాశోక సమావిష్టము, రోగాలవాలము, అస్థిరము రజోయుతము, అనిత్యము అయిన ప్రాణాధారమగు శరీరము నందు మమకారమును విడువుము. ఈ ప్రపంచము, సర్వజగత్తులు, జగద్భిన్నములు, అంతయు పంచమహాభూతాత్మకమే. దీని కంటే పరము పరమాణువులు గలది. పంచేంద్రియములు సత్త్వరజస్తమోగుణాత్మకములు అనునవి పది హేడు అవ్యక్తమనబడును. ఇంద్రియార్థములన్నింటితో వ్యక్తావ్యక్తలతో కూడియున్నదే ఈ జగము. ఈ వ్యక్తావ్యక్తి స్వరూపములు గల సమూహమున పంచవింశతి తత్త్వములుండును.
వీటన్నిటితో కలిసి యున్నది అనిత్యమనబడును. ఇచట త్రివర్గము, సుఖదుఃఖములు, జీవితము మరణము అనుగొనిని తెలిసినవాడు సృష్టి ప్రళయములను తెలియగలడు. ఇంద్రియములచే గ్రహించబడునదంతయూ వ్యక్తమనబడును. ఇంద్రియాతీతము లింగమాత్రగ్రాహ్యమైనది అవ్యక్తమనబడును. జీవుడు నియతములగు ఇంద్రియములచే ధారలతో వలె తృప్తి పొందును. తనను లోకమున, లోకమును తనలో ఇమిడ్చియుంచబడినదని తెలియును. పరావరములను చూచువారు చూడగలశక్తి జ్ఞానపు చివరిహద్దును చూడజాలరు. అన్ని భూతములను అన్ని వేళలలో అన్ని అవస్థలలో చూచువాడు జ్ఞానావధిని చూడజాలడు. బ్రహ్మభూతునికి అశుభముతో సంబంధము కలుగదు. దేహము వలన కలిగెడు క్లేశముల నుండి నివృత్తి లభించదు. లోకబుద్ధి కలిగియున్నంతవరకు లౌకిక మార్గము నశించదు. జీవుడు ఆద్యంతములు లేనివాడు, ఆత్మలో ఉండువాడు, క్షయము లేనివాడు, కర్త కాడు, మోహమును పొందడు, అని తీర్ధజ్ఞుడగు భగవంతుడు చెప్పియున్నాడు. జీవుడు తాను చేసిన ఆయాకర్మలచే నీత్యదుఃఖితుడగు చున్నాడు. తన దుఃఖమును, తొలగిచుకొనుటకు బహువిధములుగా హింసించుచున్నాడు. హింసవలన మరల కొత్తది, చాలా కర్మను స్వీకరించుచుండును. మరల ఆ కర్మచే బహువిధములుగా పరితపించుచుండును, రోగి అపధ్యముతో పరితపించునట్లు దుఃఖములను సుఖములుగా భావించి ఎప్పుడూ మోహితుడగు
