నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

3 - మూడవ అధ్యాయము - సృష్టి భరతఖండ ప్రాశస్త్యం భూగోలవర్ణనమ్

నారదుడు పలికెను :- మొదట ప్రభువు ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు బ్రహ్మదులనెట్లు సృజించెను ? నీవు సర్వజ్ఞుడవు కావున నొకు అంతయూ నేరిగింపుము.

శ్రీ సనక మహర్షి చెప్పెను :- అంతము, నాశము లేనివాడు, అంతటా వ్యాపించియుండువాడు దేనితో సంబంధములే నివాడు అయిన శ్రీమన్నారాయణుడు స్థావరజంగమాత్మ కమగు ఈ జగత్తునంతటినీ వ్యాపించియున్నాడు. జగత్స్వరూపుడు, స్వయంప్రకాశుడు అగు మహావిష్ణువు ఆది సృష్టిలో సత్త్వరజస్తమోగుణముల భేదములను ఆధారముగా చేసుకొని విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు అను మూర్తిత్రయమును సృష్టించేను. శ్రీమన్నారాయణుడు జగత్సృష్టి కొరకు పూర్వము తన దక్షిణశరీరము నుండి బ్రహ్మను, శరీరమధ్యభాగము నుండి జగదంతకరుడగు రుద్రుడను పేరుగల ఈశ్వరుని, . చామశరీర భాగము నుండి జగత్పాలనకొఱకు విష్ణువును సృష్టించెను. ఆది దేవుడు జన్మజరాది రహితుడు అగు శ్రీమన్నారాయణుడు. కొందరు శివుడందురు. కొందరు విష్ణువందురు. మరికొందరు బ్రహ్మ అనేదరు. జగత్తును ప్రవర్తింపచేయు శ్రీమహావిష్ణువు శక్తి అన్నిటికంటే పరమైనది. ఆ శక్తి భావస్వరూపమని, అభివస్వరూపమని, విద్య అని అవిద్య అని, కీర్తించబడును. ఈ ప్రపంచము మహావిష్ణువు కంటే వేటుగా తోచినపుడు దుఃఖ సాధనమైన ఆవిద్య సిద్దించును. తెలియునది, తెలియువాడు అను ఉపాధి నశించినపుడు అంతా ఒక టే మహావిష్ణుమయమను బుద్ధికలుగునపుడు దానిని విద్య అందురు. ఇట్లు మహావిష్ణువు మాయయే భిన్న రూపముగా సంసారమునిచ్చును. ఆభేద బుద్దిచే చూచినచో ఆ మాయయే సంసారమును నశింపచేయును.

ఈ చరాచరజగత్తంతయు విష్ణుశక్తి వలన పుట్టినదే. చలించునది, చలించనిది అయిన ఈ జగత్తంతా విష్ణువు కంటే భిన్నముగా కనబడుచున్నది. ఘటపటాద్యుపొధులచే ఎట్లు ఆకాశము భిన్నముగా తోచునో అట్లే అవిద్యోపాధి భేదముచే ఈ జగత్తు భిన్నముగా తోచును. విష్ణువు జగత్తునంతటిని వ్యాపించి యున్నట్లు అతని శక్తి కూడా జగత్తును వ్యాపించి యుండును. అగ్నిలో ఉన్న దొహశక్తి అగ్న్యాశ్రయమును వ్యాపించి యుండునుకదా. ఈ శక్తిని కొందరు ఉమ అని, మరీ కొందరు లక్ష్మియనీ, ఇతరులు భారతీయని, కొందరు గిరిజ, అంబికయని అందురు. కొందరు.. దుర్గ, భద్రకాళి, చండి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఐస్ట్రి, శాంభవి, బ్రాహ్మి, విద్య, అవిద్య, మాయ అని అందురు. పరమర్దులు మాత్రము దీనిని ప్రకృతియని పరొయని అందురు. విష్ణువుయొక్క ఈ శక్తి అన్నిటికంటే పరమైనది. ఇదియే జగత్సృష్టి స్థితిలయములను చేయును. ఈ శక్తియే వ్యక్తరూపముతో, అవ్యక్తరూపముతో జగమును వ్యాపించియుండును. ఈ శక్తియే ప్రకృతి, పురుషుడు, కొలము అని మూడు విధముల వస్తు స్థితి ఉండి సృష్టి స్థితిలయములకు కారణమగుచున్నది. ఈ జగత్తును సృష్టించిన బ్రహ్మరూపధరుని కంటే పరతరుని నిత్యుడు అందురు. ఈ జగత్తును రక్షించు దేవుని నిత్యుడందురు. అన్ని జగత్తులను రక్షించువాడు అందరి కంటే పరుడైనవాడు పురుషుడు. అతని కంటే పరుడే అవ్యయుడు పరముడు అందురు.

నాశరహితుడు, గుణరహితుడు, శుద్దుడు, పరిపూర్ణుడు, సనాతనుడు, పరము కంటే పరుడు యోగులచే ధ్యానించదగిన వాడు కాలనామము కలవాడు  పరమాత్మ, పరానన్దుడు ఉధులేవీ లేనివాడు, జ్ఞానముతో మాత్రమే తెలియదగినవాడు పరముడు సచ్చిదానన్ద స్వరూపుడు పరమాత్మ శుద్దుడైనను అహంకారముతో సంబంధముచేత దేహి (జీవుడు) అని అనబడుచున్నాడు. అజ్ఞానప్రవృత్తి వింత కదా ! అన్నిటికంటే పరముడైన ఆ యాదిదేవుడు సత్త్వరజస్తమోగుణ భేదముల వలన సృష్టి స్థితిలయములను చేయు విష్ణు బ్రహ్మ శివాఖ్యములగు మూడు మూర్తుల రూపమును పొందెను. జగత్తును సృష్టించిన బ్రహ్మ ఎవని నాభి కమలము నుండి పుట్టనో అతనే ఆనంద స్వరూపుడు పరమాత్మ. అతని కంటే భినుడింకొకడు లేడు. ఆ పరమాత్మయే అన్తర్యామిగా జగత్తును వ్యాపించి యుండును. సర్వసాక్షి అయిననూ దేనితో సంబంధములేని వాడు. ఈ పరమేశ్వరుడే (జగజ్జీవాదులకంటే) భిన్నరూపముతో అభిన్నరూపములో నుండును. ఈ పరమాత్మ శక్తియగు మహామాయయే జగత్స్వరూపమును ధరించును. ప్రపంచము పుట్టుటకు మూలకారణము కావున పండితులు ఈ మాయను ప్రకృతి అందురు. మహావిష్ణువు ఆదిసృష్టిలో లోకములను సృజించుటకు , సంకల్పించి ప్రకృతి, పురుషుడు, కాలము అని మూడువిధములాయెను. ఆత్మ స్వరూపమును తెలిసినవారు ఇతనినే బ్రహ్మ అని అందురు. పరిశుద్ధమైన ఈ పరంధామమే పరమపదమని పిలువబడును. ఈ పరమాత్మ పరిశుద్దుడు అక్షరుడు, అనస్తుడు, కాలరూపి, మహేశ్వరుడు, గుణరూపి, గుణములకు ఆధారము, జగత్తును మొదట సృజించినవాడు. జగత్తులకధిపతి.

పురుషుడను పేరుగల జగద్గురువునందు క్షోభ (కదలిక) చెందిన ప్రకృతినుండి మహత్తత్త్వమను బుద్ది పుట్టెను. మహత్తత్త్వమునుండి అహంకారము పుట్టెను. అహంకారమునుండి సూక్ష్మములైన పంచతన్మాత్రలు, ఇంద్రియములు పుట్టెను. ఈ జగత్సృష్టి కొఱకు తన్మొత్రలనుండి పంచభూతములు పుట్టెను, ఆకాశము, పొయువు, అగ్ని, జలము, భూమి అను పంచభూతములు వరుసగా ఒక్కొక్కదానికి కారణములగును. అనగా ఆకాశమునుండి పోయువు, వోయువునుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి పుట్టినవని భావము. తరువోత జగత్తును సృష్టించు బ్రహ్మ తమోగుణ భూయిష్టములైన తిర్యగ్జంతువులగు పశుపక్షిన్సుగాదులను సృష్టించేను. అది తన కార్యసాధనము కొదని భావించిన బ్రహ్మ దేవతలను సృజించెను. పిమ్మట మానుషసృష్టిని గావించెను. తరువాత సృష్టిని సాధించుటయందు తత్పరులైన దక్షాది పుత్రులను సృష్టించేను. దేవదానవమానవాత్మకమగు ఈ ప్రపంచమంతయు ఈ పుత్రులచే వ్యాపించబడెను. భూలోకము భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అను ఏడు లోకములు ఉపరిభాగమున నున్నవి. అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలను, రసాతలము, సౌతొలము అనునవి ఏడు క్రింది భాగమున నున్న పాతాల లోకములు. ఈ అన్ని లోకములందును- లోకనాథులను కూడా స్పష్టించెను. ఆయా లోకములలో నివసించువొరికొజకు కుల పర్వతములను నదులను కూడో సృష్టించేను. ఆయా లోకములలో నివసించువారికి యోగ్యముగా ప్రవర్తన మొదలగు వాటిని కూడా ఏర్పరిచేను.

భూమండలమున మధ్యభాగమున దేవతలందరికి ఆశ్రయమైన మేరుపర్వతమున్నది. భూమి చివర లోకాలోక పర్వతమున్నది. భూమి మధ్యభాగమున ఏడు సముద్రములు కలవు. ఓ బ్రాహ్మణోత్తమా ! ఈ భూమండలమున ఏడు ద్వీపములు కలవు. ప్రతి ద్వీపమున కులాచలములు కలవు. ఈ భూమండలమున చక్కని ప్రవాహములు కల నదులు కలవు. ఇచటి జనులు దేవతాసములు. జమ్బూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, ఆశోకద్వీపము, పుష్కరద్వీపము అను ఏడు ద్వీపములు దేవనివాసములు. ఈ ఏడు ద్వీపములు ఏడు సముద్రములచే చుట్టబడియున్నవి. లవణసముద్రము, ఇక్షు సముద్రము, సురాసముద్రము, సర్పిసముద్రము, దధిసముద్రము, క్షీరసాగరము, జలసముద్రములు అని ఏడు సముద్రములు. లోకాలోకపర్వతము వరకు ఈ ఏడు ద్వీపములు, సముద్రములు మొదటి దానికంటే రెండవది ఈ విధముగా రెట్టింపు విస్తారము కలవి. ఉప్పు సముద్రము కంటే ఉత్తర భాగమున హిమాద్రికి దక్షిణ భాగమున భారత వర్షము కలదు. ఈ భారతవర్షము అన్ని కర్మల ఫలము నిచ్చునది. ఓ సొరదా ! ఈ భారతవర్షమున మూడు విధములైన కర్మలను (కాయిక వాచిక మానసిక) చేతురు. ఆ కర్మల ఫలమును భోగరూపముగా భూరూపముగ్రో ధనరూపముగా వరుసగా అనుభవింతురు. భారతవర్షమున చేయు శుభాశుభ కర్మల ఫలమును ప్రాణులు మరొకచోట అనుభవింతురు. ఇప్పటికీ దేవతలు భారతభూమిలో పుట్టవలయునని కోరుచుందురు. ఈ భూమి పై సంపొదించిన పుణ్యము, అక్షయము అమలము శుభమగును. భారతవర్ష భూభాగమున ఎపుడు పుట్టదమా! ఎపుడు గొప్ప పుణ్యముతో పరమపదమును చేరెదమా ! అని దేవతలు ఆశింతురు.

నిత్యానందస్వరూపుడు, శుద్దుడు, జగదీశ్వరుడైన శ్రీహరిని పలువిధములైన దానములచేత కాని, యజ్ఞములచేత కాని, తపములచేత కాని ఆరాధించి ఎప్పటికైన అతనిని చేరగలమా అని దేవతలు కోరుకొనుచుందురు. భారత భూమిలో పుట్టి విష్ణుపూజారకుడైనచో వానితో సాటివచ్చువాడు మూడులోకములలో మరియెవడుండడు. హరిని కీర్తించు స్వభావము కలవాడు కాని, హరిభక్తులకు ప్రీతిపాత్రుడుకొని, మహాత్ములను సేవించువాడు కాని దేవతలచే కూడా నమస్కరింపదగినవాడగును. హరిని పూజించుటయందు ఆసక్తి గలవాడు, హరిభక్తులను పూజించగోరువాడు, హరిభక్తులు తినగా మిగిలిన అన్నమును తినువాడు శ్రీమహావిష్ణువు నివసించు పరమపదమును చేరును. నారాయణ కృష్ణ వాసుదేవ అని శ్రీహరిని కీర్తించువాడు అహింసను ఆశ్రయించి శాంతుడుగా ఉండువాడు దేవతల చేత కూడా నమస్కరించదగినవాడగును. శివా, నీలకంఠా, శంకరా అని కీర్తించువాడు సర్వప్రాణుల హితమునుకోరువాడు దేవతల పూజలందదగినవాడగును. గురువు యందు భక్తి కలవాడు, శివుని ధ్యానించువాడు తన ఆశ్రమాచారములయందు ఆసక్తుడు, అసూయలేనివాడు, పవిత్రుడు, సమర్థుడు అయినవాడు కూడా దేవతలచే పూజించదగినవాడు. బ్రాహ్మణులకు హితమును చేయువాడు, వర్ణధర్మములయందు శ్రద్ధకలవాడు ఎల్లపుడు వేదాధ్యయనమునం దోసక్తి కలవాడు ఎల్లపుడు పంక్తిపావనుడే. నారాయణ శివ రూపములతోనున్న ఆదిదేవుని అభేదమును చూచువాడు ఎల్లపుడు చతుర్ముఖబ్రహ్మ చేతగూడ నమస్కరింపదగినవాడగును. ఇక మన విషయమేమి. చెప్పగలము! ఓతృతీయోధ్యాయః నారదా ! ఆవులయందు క్షమాశీలుడు, బ్రహ్మ చారి, పరనిందను వదిలినవాడు ఎవరినుండి దేనిని గ్రహించనివాడు దేవపూజ్యుడు. చౌర్యము మొదలగు దోషములయందు విముఖుడు, కృతజ్ఞుడు, సత్యమును మాత్రమే మాట్లాడువాడు, పరిశుద్దుడు, పరోపకారమునందు ఆసక్తి కలవాడు దేవదానవులందరిచే పూజించదగినవాడగును. వేదార్ధములను వినుటయందు, పురాణములను వినుటయందు, సజ్జనసాంగత్యమునందు ఆసక్తి కలవాడు కూడా దేవతలచేకూడా పూజించదగినవాడగును. ఇటువంటి పనులను అనేకములను శ్రద్ధతో భారతవర్షములో చేయుచు ఋషులతో సంబంధము నేర్పరచుకొనినవాడు ఉత్తముడు. భారతవర్షములో పుట్టి శ్రద్దతో ఇట్టి పనులు చేయువాడు మనకు నమస్కరింపదగినవాడు. పైన చెప్పిన పనులలో ఏ ఒక్క పనిని కూడా చేయనివాడు మహాపాపి. మూర్ఖుడు కూడ. అతని కంటే అజ్ఞాని మరియొకడుండడు. భారతవర్షములో పుట్టి కూడా మంచికర్మలయందు ఆసక్తి లేనివాడు అమృతకలశమును వదిలి పెట్టి విషభాండము నాశ్రయించినవాడగును. శ్రుతి స్మృతులచే చెప్పబడిన ధర్మములతో తనను పవిత్రుని చేసుకోననివాడు ఆత్మఘాతీ, పాపులలో మొదటివాడగును. కర్మభూమిలో పుట్టి కూడా ధర్మము నాచరించనివాడు అందరిలో అధముడుగా వేదజ్ఞులచే చెప్పబడును. శుభకర్మలను వదిలి చెడుపనులను చేయువాడు కామధేనువును వదిలి జిల్లేడు పాలను వెతుకువాడగును. ఇట్లు బ్రహ్మాదిదేవతలు తమ భోగము క్షీణించును అను భయముచే. భారత భూభాగమును ప్రశంసించెదరు.

కావున భారతవర్షము అన్నిటికంటే ఉత్తమము, పరమ పవిత్రము, అని తెలియుము. అట్లే అన్ని విధముల కర్మల ఫలములనిచ్చునది. దేవతలకు కూడా లభించ శక్యము కానిది. ఈ భారత భూభాగమున మంచి పనులను చేయ సమకట్టిన వానితో సమానుడు మరియొకడుండడు. ఈ భారత భూభాగమున పుట్టి కర్మలను క్షీణింపచేయదలచిన మానవుడు మానవరూపముతో నున్న శ్రీహరియే. ఈ విషయమున సందేహముతో పనిలేదు. పరలోక ఫలమును పొందగోరువాడు కూడా సోమరితనమును విడిచి కర్మలను చేయవలయును. చేసిన కర్మలను శ్రీహరికి సమర్పించినచో ఆ ఫలము తరగని దగును. కర్మఫలములలో ఆశలేనివాడుకూడా సత్కర్మల నాచరించి శ్రీహరి ప్రీతి చెందుగాక అని సుకృతములను శ్రీమన్నారాయణునకు సమర్పించవలయును. బ్రహ్మలోకము వరకున్న లోకములన్నియు పునర్జన్మ నిచ్చునవే. కర్మఫలముల నాశించనివాడు పునర్జన్మ లేని పరమపదమును పొందును. పరమేశ్వరుని ప్రీతికొరకు తన ఆశ్రమానుగుణముగా వేదవిహిత కర్మల నాచరించవలయును. కర్మ ఫలములను వదిలినవాడు. పరమపదమును పొందును. కోరికలున్నవాడైనను లేనివాడైనను శాస్త్రము ననుసరించి కర్మలనాచరించియే తీరవలయును. తన ఆశ్రమాచారముల ననుసరించని వానిని పండితులు పతీతుడందురు. సదాచారపరుడైన బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సుతో వృద్ధి చెందును. భక్తియుక్తుడైన వానికి శ్రీహరి సంతుష్టుడగును. ఓ నారద మహర్షి ! భారతవర్షమున పుట్టి ఆత్మను తరింపచేసుకోననివాడు సూర్యచంద్రులుండువరకు నరకము ననుభవించుచుండును. ధర్మము వాసుదేవ స్వరూపము. తపస్సు వాసుదేవ స్వరూపము. జ్ఞానము వాసుదేవుని తెలుపునదే. వాసుదేవుని చేర్చునదే ఉత్తమగతి. స్థావరజంగమాత్మకమగు ఈ ప్రపంచమంతయు వాసుదేవ స్వరూపమే. బ్రహ్మ నుండి స్తంబమువరకున్న ఈ ప్రపంచము సర్వము వాసుదేవాత్మకమే. శ్రీహరి కానిదేదీలేదు. శ్రీహరియే బ్రహ్మ. శ్రీహరియే విష్ణువు. దేవదానవ యజ్ఞరూపము లన్నియూ శ్రీహరియే. ఈ బ్రహ్మాండమంతయూ శ్రీమన్నారాయణుడే. శ్రీహరి కానిది శ్రీహరికంటే వేరైనది ఏదియును లేదు. శ్రీహరి కంటే గొప్పది, తక్కువది ఏదియును లేదు. శ్రీహరి కంటే పెద్దది చిన్నది కూడా ఏది లేదు. ఈ చిత్ర విచిత్రమైన ప్రపంచమందంతటనూ శ్రీమన్నారాయణుడు వ్యా పించి యున్నాడు. కావున చక్కగా స్తుతించదగిన శ్రీమన్నారాయణునికి నమస్కరించవలయును.

ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సృష్టి, భరతఖండ ప్రాశస్త్యము భూగోళ వర్ణనము అను మూడవ అధ్యాయము ముగిసినది.