నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

48 - అధ్యాయము

నారద మహర్షి పలికెను :- ఓ మహానుభావా! తాపత్రయచికిత్సను నేను చక్కగా వింటిని. అయిననూ నా మనసు భ్రాంతిని చెందుచునే యున్నది. ఫైర్యమును పొందుట లేదు. ఓ బ్రాహ్మణోత్తమా ! ఆత్మకు విరుద్ధముగా దుర్జనులాచరించు దానిని మానవులు సహించు టెట్లు ? ఈ విషయమును నాకు తెలుపుము.

సూతమహర్షి పలికెను :- నారదుడు పలికిన మాటలను వినిన బ్రహ్మపుత్రుడగు. సనందన మహర్షి ఆనందముతో భరతుని కర్మను స్మరించుచు ఇట్లు పలికెను.

సనందన మహర్షి పలికెను :- ఇచట నీకు ఒక ప్రాచీనమైన ఇతిహాసమును చెప్పెదను. ఈ కథను వినినచో మనశ్సాంచల్యమును వీడి స్థిరత్వమును పొందెదవు. ఓ మునిశ్రేషా ! పూర్వకాలమున భరతుడను పేరు గల మహారాజు ఉండేను. ఋషభుని పుత్రుడతడు. అతని పేరు వలననే ఈ ఖండమునకు భారత ఖండమును పేరు కలిగినది. భరత మహారాజు తండ్రి తాతలు పాలించిన రోజ్యమును క్రమమున పొంది ప్రజలను తండ్రివలే ఆనందింప చేయుచు ధర్మబద్ధముగా పరిపాలించేను. భగవంతుడగు శ్రీమన్నారాయణుని పలు యజ్ఞములచే పూజించెను. సర్వదేవాత్మకుడగు శ్రీహరియందే మనసును నిలిపి సత్కర్మల నాచరించెను. తరువాత వివాహము చేసుకొని పుత్రులను పొంది విషయభోగములందు విరక్తిని చెంది, రాజ్యమును విడిచి పులస్త్యపులహ మహర్షుల ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ ఆశ్రమమే శాలగ్రామమను పేరుతో విఖ్యాతమైనది. మోక్షమును కోరువారు సేవించు ఆశ్రమమది. ఆయాశ్రమమున భరతమహారాజు దొరికిన పూజాద్రవ్యములతో భక్తి భావముచే తాపసుడై శ్రీమహావిష్ణువు నారాధించేను. ప్రతిదినము ప్రాతఃకాలమున పవిత్రజలములలో స్నానమాడు చుండెను. అక్షరమైన పరబ్రహ్మను కీర్తించుచు సూర్యోప స్థానమును చేయుచుండెను. తరువాత ఆశ్రమమున తాను స్వయముగా కూర్చుకొనిన సమిధలు, దర్భలు, మట్టి, ఫలములు, పుష్పములు, పత్రములు, తులసి, పవిత్రజలములు మొదలగు ద్రవ్యములచే వినయముతో భక్తి భావములో మునిగి శ్రీహరిని పూజించుచుండెను. ఒకపుడు భరత మహారాజు ప్రాతఃకాలమున చక్రనదిలో స్నానమాచరించి నదిలోనే జపము చేయుచు మూడు ముహూర్తముల కాలము నిలుచుండెను. ఆ సమయము ప్రసవకాలము సమీపించిన ఒక లేడి దప్పిగొని నీరు త్రాగుటకు ఆ నదికి వచ్చెను. ఆ లేడి నదిలో నీరును త్రాగుచుండగా సర్వప్రాణీ భయంకరమగు సింహగర్జన వినిపించెను. సింహగర్జనను విని భయపడిన ఆ యాడలేడి నదిని దాటుటకు ప్రయత్నించెను. ఎత్తు ప్రాంతమునకు ఆరోహించుట వలన గర్భము నదీ ప్రవాహములో పడెను. తరంగముల వేగముచే కొట్టుకొని వచ్చిన లేడి పిల్లను భరతుడు పట్టుకొనెను. గర్భపాత దుఃఖము వలన ఉన్నత ప్రదేశమును అధిరోహించుట వలన కలిగిన శ్రమచే ఆ లేడి పడిపోయి మరణించెను. ఆ లేడి మరణించుటను చూచిన భరతుడు లేడి పిల్లను తీసుకొని ఆశ్రమమునకు వచ్చెను. భరతుడు ప్రతిదినము ఆ లేడి పిల్లను పోషించుచుండెను. ఇట్లు భరతునిచే పోషించబడు లేడిపిల్ల పెరిగి పెద్దదాయెను. ఆశ్రమప్రాంతారణ్యమున తృణ భక్షణమును చేయుచుండెను. కొంతదూరము వెళ్ళి శార్దూలాది క్రూరమృగముల భయముచే మరల ఆశ్రమమునకు వచ్చుచుండెను. ప్రాతఃకాలమున చాలాదూరము వెళ్ళిననూ సాయంకాలమున ఆశ్రమమకు చేరుచుండెను. మరల భరతుని కుటీరములో నివసించుచుండెను. అట్లు లేడి దూరముగా వెళ్ళినపుడు దగ్గరలో ఉన్నపుడు కూడా భరతుని మనసు ఆ లేడి యందే ఆసక్తమై యుండెను. రాజ్యమును పుత్రులను సమస్త బంధువులను విడిచిన భరతుడు ఆ లేడి పిల్లయందు మమకారమును పెంచుకొనెను. లేడి పిల్ల ఆశ్రమమునుండి దూరముగా వెళ్ళి వచ్చుటకు ఆలస్యమైనచో తోడేలో, పెద్దపులియో, సింహమో భక్షించియుండునా అని మనసున విచారించుచుండెడివాడు. సమీపమున నున్నపుడు ప్రీతుడై యుండెడివాడు. ఇట్లు మమకారముచే ఆకర్షించబడిన మనసు గలవాడైనందున భరతునికి సమాధి భంగము జరిగెను. కొంతకాలమునకు భరతుడు తండ్రిని పుత్రుడు చూచునట్లు లేడిపిల్ల కన్నీటిచే చూచుచుండగా మృతి చెందెను. భరతుడు కూడా మరణించునపుడు లేడిపిల్లను చూచుచునే ప్రాణములను వీడెను. లేడిపిల్లనే తలచుచు మరణించినందున మరల లేడిగా పుట్టెను. అయిననూ పూర్వజన్మ జ్ఞానముండుటచే సంసారమునకు భయపడి తల్లిని విడిచి శాలగ్రామ క్షేత్రమునకు వెళ్ళెను. ఎండిన గడ్డితో ఆకులతో దేహమును పోషించుకొనుచుండెను. అట్లు విరక్తి చెందియున్నందున మృగజన్మము వచ్చుటకు కారణమైన పాపమునకు నిష్కృతి లభించేను. తరువాత కొంతకాలమును దేహమును విడిచి పూర్వజన్మజ్ఞానముతో బ్రాహ్మణునిగా సదాచారము గల శేషులైన యోగుల కులమున పుట్టెను. సమస్త విజ్ఞానము కలవాడుగా సర్వ శాస్త్రార్ధములు తెలిసిన వాడుగా నుండెను. తన ఆత్మను ప్రకృతికం టే వేరుగా చూడగలిగేను. ఆత్మజ్ఞానము కలవాడగుటచే దేవాదిసమస్త జీవులను అభేదముగా చూడసాగేను. ఉపనయనము అయిననూ గురువు ద్వొరా శాస్త్రమును పఠించలేదు. కర్మలనాచరించలేదు. శాస్త్రములను స్వీకరించలేదు. ఎన్నియో ఎదుటివారు పలికినచో జడునివలె మాటలాడసాగెను. ఆమాటలు కూడా సంస్కారరహితముగా గ్రామ్యభాషతో నుండెడివి. దుమ్ము కొట్టుకొని పొయిన శరీరముతో మురికి పట్టిన వస్త్రములను ధరించి దంతధావనము చేయక అపరిశుభ్రముగా నుండెడి భరతునీ సొగరికులు పరొభవించుచుండెడిపోరు. నాగరికులు సమ్మానము చేసినచో యోగవృద్దికి హాని జరుగునని భరతుడు తెలియును. సొగరీకులు అవమానించినపుడే యోగము సిద్ధించునని తెలిసినవాడు. కావున యోగియైనవాడు సజ్జన ధర్మమునకు భంగము కలుగకుండగా ప్రవర్తించవలయును. జనులు అవమానించునట్లే మెలగవలయును కాని వారితో సహవాసము చేయరాదు అని చెప్పిన హిరణ్యగర్భుని వాక్కును ఆలోచించి మహామతియగు భరతుడు తనను జడుని వలే ఉన్మత్తుని వలె జనులకు చూపసాగెను. శాకములను వన్యములను, కణములను భుజించుచుండెను. ఆయాకాలములలో లభించుధోనినే భుజించెడివాడు. తండ్రి మరణించిన తరువాత, సోదరులు, పెద్దతండ్రి బాంధవులు చెడిపోయిన ఆహారమును పెట్టుచు పొలము పనులను ఇంటిపనులను చేయించుచుండిరి. భరతుడు మాత్రము చూడ శక్యముకాని కాంతితో పుష్టిచెందిన అవయవములచే జడుని వలే పనులను చేయుచు, ఆహారమునిచ్చువారందరికి పనులను చేయుచుండెడివాడు. ఇట్లు సంస్కారహీనునిగా విప్రాకారముతో నున్న భరతునీ సౌవీరరాజు పల్లకిని మోయుటకు తగినవానినిగా తలచేను. ఆ రోజు పల్లకినెక్కి ఇళ్లుమతీ నదీ తీరమున నున్న కపిలాశ్రమమునకు దుఃఖమయమైన ఈ సంసారమున మానవులకు పదిహితము అని, మోక్షధర్మములను తెలిసిన కపిల మహర్షిని అడుగుటకు వెళ్ళదలచెను. ఆరోజు ఆజ్ఞచే భరతుడు ఆతని పల్లకిని మోయసాగెను. పల్లకి మోయువారందరిలో భరతుడు మధ్యన నుండేను. సర్వజ్ఞానము కల భరతుడు తాను చేసిన పాపము క్షీణించుటకు ఆ రాజుపల్లకిని మోయసాగెను. పల్లకిదండమునే చూచుచు పల్లకిని మెల్లగా మోయుచుండెను. మిగిలిన వారు మాత్రము వేగముగా నడువసాగిరి. ఇట్లు కొందరు వేగముగా ఒకడు మెల్లగా నడుచుటచే పల్లకిలో సమానత్వము భంగమాయెను. అట్లు విషమగతిని చూచిన రోజు ఏమిటిది? సమానముగా వెళ్ళుడు అని పలికెను. అయిననూ పల్లకి అట్లే వెళ్ళుటను చూచి రాజు నవ్వుచూ మీరి ప్లెందుకు నడుచుచున్నారని మరల అడిగెను. ఇట్లు రాజు పలుమార్లు పలుకగా పల్లకిని మోయువారు ఇతను మెల్లగా నడుచుచున్నాడు అని పలికిరి.

పల్లకిని కొద్దిదూరమే మోసితివి కదా? అపుడే అలిసిపోతివా? కష్టమును సహించలేకుంటివా? పుష్టిగా కనపడుచున్నావు కదా? అని రాజు పలికెను.

బ్రాహ్మణుడు పలికెను :- నేను పుష్టిగా లేను. నీ పల్లకిని నేను మోయుట లేదు. నేనలసి పోలేదు. ఆయాసమూ లేదు. నీ పల్లకిని మోయువాడు ఇతరుడే.

రాజు పలికెను :- ప్రత్యక్షముగా పుష్టిగా కనపడుచున్నావు. పల్లకి నీభుజము మీదనే యున్నది. బరువును మోయునపుడు దేహధారులకు శ్రమ కలుగును.

బ్రాహ్మణుడు పలికెను :- ఓ రాజా ! నీవు ప్రత్యక్షముగా దేనిని చూచితివో చెప్పుము. బలమున్నది బలములేనిది అను విశేషణములను తరువాత చెప్పుము. నీవు పల్లకీని మోసితివి.. ఇపుడు కూడా నీమీది పల్లకి యున్నది అనుమాట కూడా మిధ్యయే. నా మాటను వినుము. భూమి పై పాదములు, పొదముల పై పిక్కలు, పిక్కల పై తొడలు, తోడల పై నడుము, నడుము పై వక్షస్థలము, వక్షస్థలము పై భుజములు బాహనులు, భుజము పై పల్లకి యున్నది. వీటిలో నాకాధారమేదియో తెలుపుము. నేను దేనికాధారమో చెప్పుము. ఏయంశము వలన ఆధారమును నిర్ణయించవలయును. పల్లకిలో నీవుగా గుర్తింపబడు దేహమున్నది. అచట నీవు ఇచట నేను అనునదంతయూ మిధ్యయే. నీవు నేను ఇతరప్రాణులు భూతములచే ధరింపబడును. ఈ ప్రాణిసముదాయమంతయూ గుణ ప్రవాహములో పడి కొట్టుకొని పోవును. ఈ గుణములు కర్మవశ్యములు. అన్ని ప్రాణులలోనూ అవిద్యా సంచితమగు కర్మయుండును. ఆత్మ శుద్దము, అక్షరము (నశించనది) శాంతము, నిర్గుణము, ప్రకృతి కంటే పరము, సమస్త ప్రాణులలో నుండు ఆత్మ కు వృద్ది క్షయములు లేవు. ఆత్మకు వృద్ది క్షయములు లేనపుడు నీవు పుష్టిగానుంటివి అని ఏ యుక్తిచే పలికితివి? భూమి, పొదములు, పిక్కలు, తొడలు, నడుము, కడుపు వక్షస్థలము భుజములు మొదలగు వాటిలో భుజము పైనున్న ఈ పల్లకి బరువు నీకు నాకూ సమానమే. కావున పల్లకిని నేను మోయుచున్నాను ఇతరులు మోయుటలేదు అని ఎట్లు చెప్పగలవు? పర్వత వృక్షగృహములనుండి వచ్చునది, పృథివి నుండి పుట్టునది అన్నియు ప్రకృతి సంభవములు మాత్రమే. ప్రాకృతములైన ఇంద్రియముల కంటే జీవుడు వేరైనపుడు నేను నీ ఏ భారమును మోయవలయును? ఈ పల్లకి ఏర్పడిన ద్రవ్యముల చేతనే ప్రాణి సమూహము ఏర్పడినది. కావున నీకు నాకు భారము సమముగానేయున్నది. సమముగానే పెరుగును.

సనందన మహర్షి పలికెను :- ఇట్లు బ్రాహ్మణుడు పలికి మౌనముగా పల్లకిని మోయుచుండెను. ఆరోజు బ్రాహ్మణుని మాటలను విని భూమిమీదికి దికీ ఆ బ్రాహ్మణుని పాదములను పట్టుకొనెను.

రాజు పలికేను :- ఓ బ్రాహ్మణోత్తమా ! పల్లకిని విడిచి నాయందు దయచూపుడు. ఇట్లు భిక్షురూపములో నున్న మీరెవరో చెప్పడు. మీరెవరు ? ఎవరి పుత్రులు ? ఏ కారణమున ఇటకు వచ్చితిరి? దీనినంతటిని మీమ్ములను సేవించగోడు నాకు తెలుపుడు.

బ్రాహ్మణుడు పలికెను :- ఓ రాజా ! వినుము. నేనెవరో చెప్పజాలను. ఆంతటా ఆగమనకొరణము ఉపయోగము మాత్రమే సుఖదుఃఖానుభవమే దేహాదులను ఒసంగునది. ధర్మాధర్మముల వలన కలిగిన పాపపుణ్యములననుభవించుటకే ప్రాణి దేహాదులను పొందును. అంతటా అన్ని ప్రాణుల రాకకు ధర్మాధర్మములే కారణము. కావున రాకకు కారణమెందుకడి గెదరు?

రాజు పలికెను :- అన్ని కార్యములకు ధర్మా ధర్మములే కారణమనుటలో సందేహము లేదు అనుభవించుట కొఱకే ఒక దేహము నుండి మరియొక దేహమును పొందుటయనునది కూడా నిజమే. కాని ఆత్మ విషయమున నేనెవరినీ అని చెప్పజాలను అని మీరు చెప్పితిరి కదా? ఎందుకు చెప్పశక్యము కాదో వినవలయునని కోరుచున్నాను. ఎవరున్నారో ఎవరు నేనో ఎందుకు చెప్పజాలము? ‘అహం’(నేను) అను శబ్దమును ఆత్మ విషయమున ఉపయోగించుట దోషము కాదు కదా?

బ్రాహ్మణుడు పలికెను :- నేను అను శబ్దము ఆత్మలో వాడుట తప్పుకాదు. నిజమే. కాని ఆత్మ కాని దానిని ఆత్మయను కొనుట దోషము శబ్దము వినబడునది మాత్రమే. దంతములు, ఓష్ఠములు, తాలువులచే కూడిన జిహ్వ ‘అహం’ అని పలుకును. కావున అహం అని చెప్పబడు వారందరు వాక్కుచే వ్యవహరించుటకు మాత్రమే హేతువులు. ఈ వాక్కు ఏ హేతువులచే ‘అహం’ అని స్వయముగా పలుకుచున్నది! అయిననూ పలుకుచున్నది. ఇట్లు పలుకుట తగదు. తల, కాలు, చేయి మొదలగు వాటితో కూడియున్న మాంసపిండము జీవునకంటే భిన్న మేకదా ! కావున 'అహం'అని ఎక్కడ వాడవలయును? నాకంటే వేరుగా ఈ శరీరము కంటే భిన్నముగా వేరొకడున్నపుడు నేను అనీ నేనేకాక నన్ను ఇతరులు కూడా నేను అని అనవచ్చును కదా? అన్ని శరీరములలో ఒకే జీవుడు ఉన్నపుడు నీవెవరు? నేనెవరిని? ఈ మాటలే వ్యర్థములు కదా? రోజువగు నీవు, ఇది పల్లకి, మేము ముందునడుచు పల్లకి మోయు నాగము, ఇది నీ లోకము ఇదియంతయు ఉన్నది కాదు. చెట్టునుండి చెక్క, చెక్క నుండి పల్లకి, పల్లకీలో నీవు, ఇపుడు ఈ పల్లకిని వృక్షమని కాని చెక్కఅని కాని అనవచ్చునా? అట్లు అనినచో మహారాజు చెట్టునెక్కియున్నాడనవలయును. కాని ఈ నీ జనము ఆట్లనుట లేదే? పోనీ చెక్క మీద రాజున్నొడని అనుచున్నారా? లేదే? పల్లకిలో ఉన్నాడను చున్నారు. చెక్కల సమూహముచే ఏర్పడిన పల్లకిని పల్లకి అను పేరుచే పిలుచుచున్నాము. ఇపుడు నీకానందము నిచ్చు పల్లకి దేనిలో ఉన్నదో వెతుకుము. ఇట్లే గొడుగు లోహపు శీలాకములచే ఏర్పడును. శీలాకముల కంటే విడిగా ఛత్రముండునా? ఛత్రము పుట్టినదేనట? ఈ న్యాయమే నీ విషయమున నా విషయమున కూడా వర్తించును. పురుషుడు, స్త్రీ, గోవు, మేక, గుజ్జము, ఏనుగు, పక్షి, చెట్టు మొదలగు కర్మ హేతువులగు దేహములందు లోకము చేసిన సంజ్ఞలిని. కాని నాస్తవముగా దేవుడుకాడు, నరుడుకోడు, పశువుకాదు, వృక్షము కాదు. ఇవియన్నియు కర్మ 'హేషనుగా గల శరీరాకృతి భేదములే. రోజు అనుట రాజభటులు అనుట అట్లే ఇతర వ్యవహారములన్నియు కల్పనోమయములే. సత్యములు కొవు. కోంత కొలమునకు నాశము చెందునది, పరిణామాదుల వలన కలుగునది ఇదీయంతయు వస్తువు సంజ్ఞ దియో చెప్పుము. నీవు ఈ లోకమునకు రోజువు. తండ్రికి పుత్రునివి, శత్రువునకు శత్రువువు భార్యకు భర్తవు, పుత్రునికి తండ్రివి, ఇపుడు నిన్ను ఎవరిని పిలువవలయును? అసలు నీవు అనగా ఏమి? నీ శిరస్పా? ఉదరమా? శిరస్సు ఉదరములు నీని కొని నీవు కొదుగదా? తత్త్వమిట్లుండగా నేను నాచేత అని భావించుటకు కరచరణాదులచే ఏర్పడిన మాంసండమెట్లు యోగ్యమగును?

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బహదుపాఖ్యానమున ద్వితీయ పాదమున నలుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.