నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

41 - నామమాహాత్మ్యమ్

నారద మహర్షి పలికెను :- తత్త్వార్థములు తెలిసిన ఓ మహామునీ ! మీరు నేనడిగిన దానినంతయు చెప్పితిరి. ఇపుడు యుగముల స్థితిని లక్షణమును వినగోరుచున్నాను.

సనక మహర్షి పలికేను :- ఓ మునీ ! నీవు లోకోపకారకుడవు, మహాప్రాజ్ఞుడవు, బాగుగా ప్రశ్నించితివి. అన్ని లోకములకు ఉపకరించు యుగధర్మములను చెప్పెదను. ఈ భూలోకమున ఒక సమయమున ధర్మము వృద్ధి పొందును. ఒక సమయమున క్షీణించును. కృత త్రేతా ద్వాపర కలులను నాలుగు యుగములు, పన్నెండు దివ్యవత్సరములచే సంధ్యా సంధ్యాంశయుక్తములుగా యుగములు సమములుగా నుండును. తత్త్వదర్శులు ఈ యుగములను కాలముచే తెలియవలయునని చెప్పిరి. మొదటిది కృతయుగము, రెండవది త్రేతాయుగము, మూడవది ద్వాపరయుగము, నాలుగవది కలియుగము. కృతయుగమున దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసఫన్నగులు లేకుండిరి. అందరూ దేవసములుగా నుండిరి. అందరూ తుష్టి పుష్టి కలవారు. ధర్మ మార్గ పరాయణులు. కృతయుగమున క్రయవిక్రమయులు లేకుండెను. వేదవభాగము కూడా కృతయుగమున లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్వాచారపరులుగా నుండిరి. ఎపుడూ నారాయణ పరాయణులు, తపోధ్యాన పరాయణులు కామాది దోష రహితులు, శమాది గుణ సంపన్నులు. ధర్మసాధన చిత్తులు, అసూయారహితులు, దంభాచారము లేనివారు, సత్యవాక్యరతులు, నాలుగు ఆశ్రమ ధర్మములనాచరించువారు, వేదాధ్యయనసంపన్నులు సర్వశాస్త్ర విచక్టణులు, నాలుగు ఆశ్రమములను తగిన కర్మలనాచరించుచు కాలానుగుణముగా కోరకనే ఫలములను పొంది ఉత్తమగతిని పొందెదరు. కృతయుగమున శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణుడు సునిర్మలుడు. ఇక త్రేతాయుగ ధర్మములను చెప్పెదను వినుడు. ఓ ముని సత్తమా ! త్రేతాయుగమున ధర్మము పాండుర వర్ణమును పొందును. శ్రీహరి రక్తవర్ణుడగును. జనులు కొంచెము కష్టములను పొందెదరు. అందరూ క్రియాయోగరతులు యజ్ఞకర్మనిషులు, సత్యవ్రతులు, ధ్యానపరులు, ఎప్పుడూ ధ్యాన పరాయణులుగా నుందురు. ద్వాపరయుగమున ధర్మము రెండు పాదములుండును. హరి పీత వర్ణుడగును. వేదవిభాగము జరుగును. ద్వాపరయుగమున కొందరు ద్విజులు అధర్మ నిరతులగుదురు. బ్రాహ్మణాదివర్ణములలో కొందరు రాగాది దుర్గుణములు కలవారగుదురు. స్వర్గాపవర్గముల కొఱకు కొందరు బ్రాహ్మణ యజ్ఞముల నాచరింతురు. కొందరు డనాదికమును కోరువారు కొందరు. కల్మషచితులుగా నుందురు, ద్వాపరయుగమున ధర్మాధర్మములు సమముగా నుండును. అధర్మ ప్రభావముచే ప్రజలు క్షయమునొందెదరు. కొందరు అల్పాయుష్యము కలవారగుదురు. కొందరు పుణ్యమార్గముననుసరించు వారిని చూచి అసూయ చెందెదరు. ఇక కలియుగ స్వరూపమును చెప్పేదను వినుము. కలియుగమున ధర్మము ఒక పాదముతో నుండును. తామస యుగము కావున శ్రీహరి కృష్ణ వర్ణమును పొందును. ఎవరో ఒకరు. ధర్మాత్ముడు యజ్ఞాచారపరుడగును. ఎవరో ఒక పుణ్యాత్ముడు క్రియాయోగపరుడగును. ధర్మపరుని - చూచి ! అందరూ అసూయ చెందెదరు. వ్రతాచారములు జ్ఞానయజ్ఞాదులు నశించి పోవును. అధర్మము ప్రవర్తించుటచే ఉపద్రవములు సంభవించును. అందరూ అసూయాపరులు, దంభాచార పరాయణులు అల్పాయుష్కులు కలియుగమున ఉందురు.

నారదమహర్షి పలికెను :- ఓ ముని సత్తమా? తాము యుగధర్మములను సంగ్రహముగా చెప్పితీరి. ధర్మవిదులైన మీరు. కలియుగ ధర్మమును వివరముగా తెలుపుడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఏ ఆహారమును తీసుకొందురు? ఏ ఆచారమును అవలంబించెదరు?

సనకమహర్షి పలికెను :- సర్వలోకోపకారమును చేయగోరు మునిశ్రేష్టా ! ఉన్నవి. ఉన్నట్లుగా విస్తరముగా. కలి ధర్మములను చేప్పెదను. వినుము. శ్రీహరి కృష్ణవర్ణమును పొందగా అన్నిధర్మములు నశించును. కావున కలియుగము సర్వ పొతక సంకరమగు మహాఘోరముగా తెలియుము. ఘోరమైన కలియుగమున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరు ధర్మ పరాఙ్ముఖులుగా, బ్రాహ్మణులు వేదపరాఙ్ముఖులగుదురు. అందరూ కపటములో ధర్మరతులవలె కనపడుదురు. అసూయాపరులగుదురు. పండితులు వ్యర్థముగా అహంకారము కలవారై సత్య హీనులగుదురు. నేనే అందరిలో అధికుడనని అందరూ వాదింతురు అందరూ. అధర్మ లోలుపులు, వితండులు అగుదురు. కావుననే కలియుగమున అందరూ అల్పాయుషులగుదురు. అల్పాయువులగుటచే విద్యాభ్యాసమును చేయజాలరు. విద్యాభ్యాసము లేనందున అధర్మము ప్రవర్తించును. పాపతత్పరులై ప్రజలు విపరీతముగా (పెద్దలముందు చిన్నలు) మరణింతురు. బ్రాహ్మణాది వర్ణసంకరము జరుగును. కామక్రోధపరులు, మూఢులు, వృధాసంతాప పీడితులుగా మారి కలియుగమున అన్నివర్ణముల వారు శూద్రతుల్యులగుదురు. ఉత్తములు నీచులగుదురు. నీచులు ఉత్తములుగా పరిగణింపబడుదురు. రాజులు ద్రవ్యము నార్జించుట యందు ఆసక్తులై అన్యాయవర్తనులై ఎక్కువ పన్నులు వేసి ప్రజలను పీడింతురు. ద్విజులు శూద్రుల శవవాహనులగుదురు. జార ధర్మమునవలంబించి భర్తలు ధర్మ స్త్రీల సంగమమును చేతురు. తండ్రిని పుత్రుడు, భర్తను భార్య ద్వేషించును. అందరూ పరస్త్రీ సంగమాసక్తులు పరద్రవ్యాపహరకులగుదురు. మత్స్యమాంసమును అమ్ముదురు, దూడలేని గోవులకు పాలు పిండి అమ్మీ బ్రతుకుదురు. ఘోరమగు కలియుగమున అందరూ పాపరతులౌదురు. అసూయపరులై సజ్జనులను పరిహసింతురు. నదీతీరములలో గడ్డపారలతో త్రవ్వి చెట్లను నాటెదరు. పృధివి నిస్సారమగును. బీజములు ఫలములు నశించును. స్త్రీలు వేశ్యలవలె అలంకరించుకొనుటయందాసక్తులౌదురు. బ్రాహ్మణులు ధర్మమును, స్త్రీలు భగమును అమ్ముకుందురు. మరి కొందరు శూద్రాచారపరులే వేదములనమ్ముకుందురు. సాధువుల ధనమును, విధవల ధనమును అపహరింతురు. ద్రవ్యము పై ఆశ కలిగి బ్రాహ్మణులు వ్రతములనాచరించరు. ధర్మా చరణమును వదిలి వృధావాదముననే ఆయాసమును పొందెదరు. ద్విజులు దంభము కొఱకు పితృశ్రాద్ధాదికము నాచరింతురు. నరాధములు అయోగ్యులకే దానములు చేతురు, పాలమీది ఆశతో ఆవుల యెడ ప్రీతిని చూ పెదరు. బ్రాహ్మణులు స్నానశాచాదికములనాచరించరు. ద్విజాధములు అకాలమున కర్మల నాచరింతురు. సాధునిందా పరులు విప్రనిందాపరులుందురు. ఏ ఒక్కని మనస్సు విష్ణుభక్తి పరము కాదు. యాగము చేయు బ్రాహ్మణులనే ధనము కొఱకు రాజకింకరులు కొట్టెదరు. ఘోరమైన కలియుగమున నరులందరు దాన హీనులగుదురు. ద్విజులు పతితులనుండి కూడా దానములను స్వీకరించెదరు.

కలియుగమున ప్రధమ పాదమున కూడా మానవులు శ్రీహరిని నిందింతురు. కలియుగాంతమున ఒక్కడు కూడా శ్రీహరి నామమును పలుకడు. శూద్ర స్త్రీ సంగమమున విధవా సంగమమున ఆసక్తులౌదురు. శూద్రాన్నమును భుజించుటయందు ఆసక్తులౌదురు. బ్రహ్మ చర్యగృహస్థాదీ ఆశ్రమ చతుష్టయమును నిందించుచు వేదవిహిత సన్మార్గమును వదిలి దురాచారమును దుర్మార్గము ను అనుసరించుచు పొషండులగుదురు. శూద్రులు ద్వీజులను సేవించరు. పాషండులు చండాలులు ద్విజధర్మములను స్వీకరించెదరు. కాషాయవస్త్రములను ధరించి జటా ధారులై భస్మమును ధరించిన శూద్రులు ధర్మములను బోధించెదరు. కూటయక్తి పరాయణులగుదురు. ద్విజులు స్వాచారమును విడిచి పరపొకొన్నమును భుజించుచుందురు. శూద్రులు దురాత్ములై పరివ్రాజకులౌదురు. కలియుగమున లజ్జావిహీన జీవనమును గడుపుదురు. ధర్మ హీనులగు పొషండులు, కాపాలులు, అధములగు భిక్షువులు కలియుగమున ఉత్కచ జీవులగుదురు. ఓ బ్రాహ్మణోత్తమా ! ధర్మమును నశింపచేయు స్వభావము గల ద్విజులకు శూద్రులు ఉత్త మాసనమునధిరోహించి ధర్మ ప్రవచనమును చేతురు. వీరు ఇతరులు నగ్నముగా రక్తవస్త్రులుగా పాషండులు వేద దూషకులుగా తిరుగుచుందురు. మానవులు గీత వాద్యములలో కుశలులై కుద్రధర్మములనాశ్రయించుచు ధర్మ విధ్వంసకులగుదురు. అస్వధనులు వ్యర్థలింగులు వ్యర్ణాహంకారదూషితులు పరద్రవ్యాపహారకులగుదురు. నిత్యము ప్రతిగ్రహశీలురు జగత్తును చెడుదారిలో పయనింప చేయువారుగా ఆత్మస్తుతీపరులు పరనిందాపరులుగా అందరూ ఉందురు. నమ్మినవారిని చంపువారు ధయాధర్మవిహీనులు క్రూరులగుదురు. కలియుగమున మానవులు అధర్మ బంధువులగుదురు. కలియుగాంతమున మానవులకు పరమాయువు పదునారుసంవత్సరములుండును. స్త్రీలు అయిదు సంవత్సరముల వయసులో ప్రసవింతురు. ఏడెనిమిది సంవత్సరముల వయసు వరకే యువకులుగా నుందురు. ఆ తరువాత వృద్దులగుదురు. అందరూ స్వకర్మను త్యాగము చేయుదురు. కృతఘ్నులు ఇతరవృత్తుల నాశ్రయించువారగుదురు. కలియుగమున ద్విజులు నిత్యము యాచకులగుదురు. ఇతరులనవమానించుటలో ఆసక్తి కలవారు, పరావమానముతో ఆనందించువారు, ఇతరుల గృహనివాసులు వారు, అచటి వారిని నిందించుపొరు, వ్యర్థముగా గర్వించువారు నిత్యము మాతాపితరులను గురువులను నిందించువారు అయి ఉందురు. నోటితో ధర్మమునుచెప్పుచు మనసులో పాపములనాలోచింతురు. దనవిద్యాబోవనాదులచే మత్తులై అన్నిదుఃఖములచే వ్యాకులులౌదురు. వ్యాధి తస్కర దుర్భిక్షములచే పీడించబడుదురు. అతివంచకులౌదురు. తాము చేయుచున్న పాపములనాలోచించకనే వ్యర్థముగా తమను తాము పోషించుకొనుచుందురు. పాపాత్ములు ధర్మ మార్గప్రవర్తకులను దూషింతురు. ధర్మ కార్యరతులను పరిహసింతురు. కలియుగమున మ్లేచ్చజాతులవారు ప్రభువులౌదురు. శూద్రులు భిక్షాటనమును చేతురు. ద్విజులు శూద్రులను సేవింతురు. కలియుగమున వర్ణసంకర ర్పడి శిష్యుడు గురువు, తండ్రి, కొడుకు, భార్య, భర్త ఎవ్వరూ ఉండరు. కలియుగమున ధనవంతులు కూడా యాచకులగుదురు. ద్విజులు రసవిక్రయిలౌదురు. ద్విజులు ధర్మమను కవచమును కప్పుకొని, మునివేషమును ధరించి అమ్మ రాని వాటిని అమ్ముచు సంగమించరాని స్త్రీలను సంగమించుచు, వేదములను ధర్మ శాస్త్రములను నిందించుచు శూద్రవృత్తిచే జీవించుచు నరకార్ణులగుదురు. అనావృష్టి ఏర్పడగా ఆకాశమువైపు చూపులను నిలుపుచు కలియుగమున మానవులందరూ ఆకల భయముచే దీనులౌదురు. కరువుచే మిక్కిలి పీడించబడుచు కందమూల ఫలహారములతో తమను తాము పోషించుకొందురు. కొమార్తులు, స్వదేహులు, లోభులు, అధర్మతత్పరులుగా నుందురు. కలియుగమున ఇంచుమించు అందరు అల్పభాగ్యులు బహుసంతానవంతులౌదురు. స్త్రీలు తమను తాము పోషించుకొందురు. వేశ్యలు సౌందర్యమును పెంచుకొనుటకు ప్రయత్నింతురు. స్త్రీలు భర్తమాటను లెక్కించక ఎప్పుడూ ఇతరుల ఇండ్లలో నుండుటలో ఆసక్తిని చూపుదురు. దుశ్శీలురై దుశ్శీలురతో స్నేహమును చేతురు. పురుషుల విషయమున కులస్త్రీలు అసద్వ్యవహారమునాచరింతురు. చోరుల భయముచే కట్టెలతో తలుపులు యంత్రములను సిద్ధము చేసుకుందురు. కరువుచే పన్నుల బాధలచే మిక్కిలి పీడితులై గోధుమలు యవలు పుష్కలముగా పండు ప్రదేశములకు వలస వెళ్ళేదరు. మనసులో అకార్యములను ఆలోచిస్తూ శుభకార్యములను పలుకుచుందురు. కలియుగమున మానవులు తమకార్యము సిద్ధించువరకు బంధుత్వమును కలుపుకొందురు. భిక్షువులు కూడా మిత్రాది స్నేహసంబంధముచే బంధితులగుదురు. సన్యాసులు ఆన్నోపొదినిమిత్తమున శిష్యులను కూర్చుకొందురు. స్త్రీలు రెండుచేతులతో తలను గోకుచుందురు. పెద్దల ఆజ్ఞను భర్త ఆజ్ఞను ఉల్లంఘింతురు. బ్రాహ్మణులు పొషండులు చూచలను పలుకును, షండులతో స్నేహమును గగపునప్పుడు కలివృద్ధి చెందును, ప్రజలు యజ్ఞమలను ఆచరించనపుడు, బ్రాహ్మణులు హోసుమును చేయనపుడు కలిపిద్ధి చెందినదనీ వివేకులు ఊహించవయుసు. ధర్మ ను వృద్ధిచెందును. బాలురు కూడా మృతి చెందుదుడు, అన్ని ధర్మములు నశించగా జగత్తు సంపద్రహితమగును. ఓ బ్రాహ్మణోత్తమా ఇట్లు కలి స్వరూపమును నీకు వివరించితిని. హరిభక్తిపరులను మాత్రము కలి బాధించజాలదు.

కృతయుగములో తపము, త్రేతాయుగములో ధ్యానము, ద్వాపరయుగములో యజ్ఞము కలియుగములో దానము కత్తమములు. కృతయుగములో పది సంవత్సరములలో త్రేతాయుగములో ఒకసంవత్సరములో, ద్వాపరయుగములో ఒక మాసములో చేయుదానిని కలియుగములో ఒకదినములో చేయవచ్చును. కృతయుగములో ధ్యానము చేయుచు, త్రేతాయుగములో యజ్ఞముల చేయుచు, ద్వాపరయుగములో అర్చించుచు పొందు దానిని కలియుగమున శ్రీహరి నామసంకీర్తనచే పొందవచ్చును. రాత్రింబవళ్ళు హరినామమున కీర్తించు మానవులు హరిని పూజించు మానవులు కలి బాధలకు దూరముగా నుందురు. నిష్కాములు కాని సకొములు కాని నమో నారాయణాయ అని కీర్తించినచో వారిని కలి బాధించదు. ఘోరమగు కలియుగమున హరినామపరులు మాత్రమే కృతకృత్యులు. వారిని కలి బాధించజాలదు. హరి పూజాపరులు హరినామపరాయణులు శివతుల్యులే. ఈ విషయమున ఆలోచించవలసిన పనిలేదు. ఘోరమైన కలియుగమున సమస్త జగదాధారుడు పరమార్థ స్వరూపుడు అగు విష్ణువును ధ్యానించిన బాధలపొలు కారు. సర్వధర్మ వర్షితమగు కలియుగమున ఒకమారు కేశవుఔహనర్చించువారు భాగ్యవంతులు. కలియుగమున వేదోక్త కర్మలు న్యూనాతిరిక్తములైనచో శ్రీహరిస్మరణము మాత్రమే పరిపూర్ణత్వమును లభింపచేయును. హరే, కేశవ ! గోవిన్ద ! వాసుదేవ ! జగన్మయ ! అని నిత్యము స్మరించువారిని కలి బాధించదు. శివశంకర ! రుద్ర ! ఈశ ! నీలకంఠ ! త్రిలోచన ! అని కీర్తించువారిని కూడా కలి బాధించ జాలదు. మహాదేవ ! వీరూపొక ! గంగాధర ! మృడవ్యయ అని స్మరించు పోరు కలియుగమున కృతార్థులు. జనార్దన ! జగన్నాథ ! పీతాంబరధర ! అచ్యుత !అని స్మరించువారిని కలి భయము కలుగదు. ఘోరమైన కలి యుగమున సంసారమున పుత్రధార ధనాదులు సులభములు. కానీ హరిభక్తి మాత్రము దుర్లభము. కర్మ శ్రద్దా విహీనులు, పాఖండులు, వేదనిందకులు, అధర్మనిరతులైనను హరిస్మరణము చేసినచో నరకార్డులు కారు. వేద మార్గ బాహ్యులు పాప కర్ములు, మనశ్శుద్ధివిహీనులు అయిన జనులకు హరినామమొక్కటే నిష్కృతి. స్థావర జంగమాత్మ కమగు ఈ ప్రపంచమంతయు దైవాధీనము. కావున దైవ పేరణ ఎట్లున్నచో అట్ల చేయును. కలియుగమున వేద విహితములైన కర్మలను శక్తి మేరకు ఆచరించి నారాయణపరాయణుడై శ్రీమహావిష్ణువునకు అర్పించవలయును. పరమాత్మ యగు శ్రీమహావిష్ణువునకు అర్పించబడిన కర్మలు హరిస్మరణ మాత్రమున పరిపూర్ణములగును. హరిభక్తిరతులకు పాపబంధము సంభవించదు. కావుననే దుర్జనులకు హరిభక్తిరతులకు పాపబంధము సంభవించదు. కావుననే దుర్జనులకు హరి భక్తి దుర్లభము. ఘోరము భయంకరమగు కలియుగమున శ్రీహరి భక్తిపరులు సత్సంగర హితులైననూ భాగ్యవంతులే. హారిస్మరణనిషులకు శివనామరతాత్ములకు సమస్త కార్యములు పరిపూర్ణత్వమును పొందును. హరిభక్తి పరుల భాగ్యమే భాగ్యము. వారు దేవతల పూజలను కూడా అందుకొందురు. ఇంక ఇతరమునేల చేప్పవలయును. కావున - సమస్త లోకవాసులకు హితమును చెప్పుచున్నాను. హరినామస్మరణమును చేయువారిని కలి బాధించదు. శ్రీహరి నామము మాత్రమే నాకు జీవనము. కలియుగమున హరినామము తప్ప మరియొక గతి లేనేలేదు.

సూత మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తములారా !ఇట్లు సనకమహర్షిచే ప్రబోధితుడగు నారద మహర్షి పరమానందమును పొంది మళ్ళీ ఇట్లు పలికెను.

నారద మహర్షి పలికెను :- పూజ్యుడా ! సర్వశాస్త్రజ్ఞుడా !. దయానిధివైన నీవు సనాతనము జగజ్జ్యోతి యగు పరబ్రహ్మ స్వరూపమును తెలియజేసితివి. ఇదియే ఉత్తమ పుణ్యము. ఇదియే ఉత్తమ తపము. సర్వపాప వినాశకుడగు పుండరీకాక్షుని స్మరించుటయే ఉత్తమయజ్ఞము. ఓ మహర్షీ ! బహువిధమగు ఈ జగత్తంతయూ ఒకే చిత్తు చే ప్రకాశితమని దృష్టాంతము లేకనే ఎట్లు విశ్వసించవలయును ? కొవున దేనిచే ఎట్లు ఏ బోధచే తెలియునో చింతించు చిత్తము ఫైర్యము నేట్లు పొందునో ఆ విధమును కూడా తెలియజేయుము. ఇట్లు మహానుభావుడైన నారదుడు పలికిన మాటలను విన్న సనక మహర్షి పరమాత్మయగు నారాయణుని స్మరించుచు ఇట్లు బదులు పలికెను.

సనక మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! నేను ధ్యానములో నిమగ్నుడనగుచున్నాను. నీవు కోరిన విషయములను సనందనమహర్షిని ప్రశ్నించుము. ఆర్యవంద్యుడగు సనందన మహర్షి వేదాంతశాస్త్రమున కుశలుడు నీ సందేహమును తీర్చగలడు. ఇట్లు సనకమహర్షి పలికిన మాటలను వినిన నారదమహర్షి సనందనమహర్షిని మోక్షధర్మములను అడుగ - సంకల్పించేను.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున నామమాహాత్మ్యమను నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము మొదటిపాదము ముగిసినది.