నారద మహా పురాణము - పూర్వార్థము
52 - అధ్యాయము
సనందన మహర్షి పలికెను :- ఓ నారదా ! ఇపుడు నీకు సంక్షేపముగా వ్యాకరణమును చెప్పెదను. ఈ వ్యాకరణము సిద్దరూపప్రబంధముగా వేదమునకు ముఖముగా నిర్ణయించబడినది. సుబన్తము తొజనము పదమనబడును. సుపులలో ఏడు విభక్తులున్నవి. సు, ఔ, జస్ అనునవి ప్రథమావిభక్తి ప్రత్యయములు. ఈ ప్రత్యయములకు ముందున్న ప్రకృతి ప్రాతిపదికమనబడును, ఎదుటివారిని ఉద్దేశించి మాట్లాడదలచినపుడు చేయు సంబోధనలో, స్త్రీ పుం నపుంసక లింగములలో కర్మ కర్త చెప్పబడినపుడు ధాతువు ప్రత్యయము కాక అర్ధవంతమగు శబ్దస్వరూపము ప్రాతిపదికమనబడును. అమ్, ఔట్, శస్ అనునవి ద్వితీయావిభక్తి ప్రత్యయములు. చేయబడుదానిని కర్మయందురు. కర్మ విషయమున ద్వితీయావిభక్తిని చెప్పుకొనవలయును. అంతరా, అంత రేణ అను శబ్దములు ప్రక్కనున్నపుడు కూడా ద్వితీయా విభక్తిని చెప్పుకొనవలయును. టా, భ్యాం, భిస్ అనునవి తృతీయా విభక్తి ప్రత్యయములు. కరణార్థమున కర్తర్ధమున తృతీయా విభక్తిని చెప్పుకొనవలయును. దేనిచే చేయబడునో అది కరణమనబడును. చేయునది కర్తయగును. జే, భ్యాం, భ్యస్ అనునవి చతుర్థి విభక్తి ప్రత్యయములు. సంప్రదొనకొరకమున చతుర్థి విభక్తిని చెప్పుకొనవలయును. ఎవరి విషయమున దొనము చేయవలయునను కోరిన కలుగునో వాడు, ఎవరి విషయమున, లేదో ఏ వస్తువు విషయమున రుచియుండునో వాడు అది సంప్రదానమనబడును. జసి, భ్యాం, భ్యస్ అనునవి పంచమీ విభక్తి ప్రత్యయములు. అపొదొన కొరక వివక్షలో పంచమీ విభక్తిని చేప్పుకొనవలయును. దేనినుండి విడివడునో, దేని నుండి స్వీకరించునో, దేని నుండి తొలగిపోవునో అది అపొగొనమనబడును. జస్, ఓస్, ఆమ్ అనునవి షష్ఠీ విభక్తి ప్రత్యయములు.” స్వస్వామి భావసంబంధమున షషీ విభక్తిని చెప్పుకొనవలయును. జీ, ఓస్, సుప్ అనునవి సప్తమీ విభక్తి ప్రత్యయములు. అధికరణ కారకమున సప్తమీ విభక్తిని చేప్పుకొనవలయును. ఆధారమును అధికరణమందురు. రక్షార్ధ ప్రయోగములలో ఈప్పితమున, అనీప్సితమున (ఇష్టాఇష్టములలో) నుండు దానిని కూడా అదానమందురు. పరి, అప, ఆజ్ అను ఉపసర్గలతో సంబంధమున్నపుడు పంచమీ విభక్తి వచ్చును. ఇతర బుత, అన్య, దిబ్ముఖ శబ్దములతో కర్మ ప్రవచనీయకములచే యోగమున్నపుడు ద్వితీయా విభక్తి వచ్చును. లక్షణ ఇత్తంభూతార్ధములలో అభి అను ఉపసర్గను చెప్పవలయును. విభాగము లేనపుడు అను, పరి, ప్రతి ఆను నుపసర్గలను చెప్పవలయును. అంతరార్థమున, సహార్థమున, హీనార్థమున ఉప అను ఉపసర్దను చెప్పవలయును. చేష్టార్లములో గతి కర్మలో ద్వితీయా చతుర్థి విభక్తులను చెప్పవలయును. ప్రాణి భిన్న వాచకములలో రెండు విభక్తులుండును. మన్యధాతువునకు కర్మ విషయమున, అనాదరార్థమున కూడా ఈ రెండు విభక్తులను చెప్పవలయును. నమః, స్వస్తి, స్వాహా, స్వధా, అలం, వషట్ అను పదములతో సంబంధమున్నపుడు తాదర్యమున, భావవాచకమగు తుమున్నద్ధమున కూడా చతుర్థివిభక్తిని ప్రయోగించవలయును. సహ అను పదముతో యోగమున్నపుడు కుత్సితాంగ విశేషణమున తృతీయా విభక్తిని ప్రయోగించవలయును. కొలార్గమున భావార్థమున, సప్తమీ విభక్తిని ప్రయోగించవలయును. కాల భావవాచకములతో సంబంధమున్నపుడు షషీ . విభక్తిని కూడా ప్రయోగించవచ్చును. స్వామి, ఈశ్వర, అధిపతి, సాక్షి దాయాద సూతక శబ్దార్థముల విషయమున, శబ్దముల విషయమున నిర్ధారణార్ధమున సప్తమీ షషీ విభక్తులను ప్రయోగించవచ్చును. హేతు శబ్దవిషయమున షష్ఠీ విభక్తిని ప్రయోగించవలయును. స్మృత్యర్ధ కర్మలో, కరోతి ధాతువునకు యత్నార్థమును చెప్పునపుడు, హింసార్ధక శబ్దములను ప్రయోగించినపుడు, కృతి కర్మలో, కృతికర్తలో పైన చెప్పిన రెండు విభక్తులను ప్రయోగించవలయును. నిషాదులను తెలియచేయు షష్ఠీ విభక్తి కర్తృకర్మల విషయమున ప్రయోగించరాదు. ఇట్లు సుబా విభక్తులలో ఇవి రెండు విధములుగా నుండును. భూ, వా మొదలగు తిజస్తములందు పది లకారములుండును. తిప్, తస్, అంత అనునవి ప్రధమ పురుష ప్రత్యయములు. సిప్, థస్, థ అనునవి మధ్యమ పురుష ప్రత్యయములు. మిప్, వస్, మస్ అనునవి ఉత్తమ పురుష ప్రత్యయములు. ఈ తొమ్మిది ప్రత్యయములు పర స్మెపదమున చెప్పబడినవి. ఇక ఆత్మనే పదమున త, ఆతే, అంతే అనునవి ప్రధమ పురుష ప్రత్యయములు. సే, ఆధే, ధ్వే అనునవి మధ్యమ పురుష ప్రత్యయములు. ఏ, వ , మ హే అనునవి ఉత్తమ పురుష ప్రత్యయములు. ఈ పద్దెనిమిది లకారములకు ఆదేశములుగా వచ్చును. నామవాచక శబ్దమును ప్రయోగించునపుడు ప్రధమ పురుషను చెప్పవలయును. యుష్మ చ్చబ్ద ప్రయోగసమయమున మధ్యమ పురుషను, అస్మ చబ్దప్రయోగమున ఉత్తమ పురుషను చెప్పవలయును. భూ, వా మొదలు వాటిని ధాతువులందురు. తరువాత సనాది ప్రత్యయాంతములుండును. వర్తమాన కాలమున -లట్ అను లకారమును చెప్పవలయును.
అనద్యతన భూతకాలమున, మా, స్మ అనువాటితో యోగమున్నపుడు ధాతువునకంటే పరముగా లబ్ లకారమును చెప్పవలయును. ఆశీర్వాదార్దములో ధాతువున కం టే పరముగా లోట్ లకారమును చెప్పుకొనవలయును. విధ్యాద్యర్థములలో ఆశీర్వాదార్థములో లిజ్ లకారముండును. అనధ్యతన భూతమున పరోక్షార్ధమున లిట్ లకారమును చెప్పుకొనవలయును. అద్యతన భవిష్యత్కాలమున లుట్ లకారముండును. అనధ్యతన భవిష్యత్కాలమున బ్ళట్ లకారముండును. భూతకాలమున లుజ్లకారముండును. క్రియార్థమున లజ్లకారముండును. అన్నిసంధులు వచ్చి పరిపూర్ణ రూపము ఏర్పడిన దానిని సిద్ధోదాహరణముగా తెలియుము. దండాగ్రం, దధీదం, మధూదకం, హోతృకారః అనునవి సవర్ణదీర్ఘసంధికి సిద్దోదాహరణములు. పిత్రర్షభః, సేయం, గంగోదకం, తవల్కారః అనునవి గుణసంధికి ఉదాహరణములు. ఇట్లే ఆయా సంధులేర్పడిన సిద్దోదాహరణములను కొన్నింటిని చూ పెదను. “ఋణార్ణం, గీతార్తః, సేన్దః, సౌకార, వధ్వాసనం, పిత్రర్థః, నాయకః, లవణం,” త ఆద్యా, విష్ణవే, తస్మా అర్ఘ, గురా అఘః, హరేఽవ, విష్ణోఽవ, శారీ ఏతో,విష్ణు ఇమౌ, దుర్గే ఆమూ నో అర్జునః, అను నొలుగు రూపములు ఆ ఏవం అనునది కూడా ఏ సందీగాక ప్రకృతి భావముతో నుండునని తెలియవు. షడత్ర, షణ్మాతగః, నొక్ఛూర, నాగదీః, హరి శ్శేతే, విభుశ్చిన్త్యః, తచ్ఛేషః, యచ్ఛరః, ప్రశ్నకి, హరిప్షష్ఠః, కృష్ణ షీకతే, భవాన్ షష్ణకి, షట్సన్తః, షట్ తే, తల్లేపః చక్రింశిని, భకోణ్చారీకి, భవాన్ శౌరిః, సమ్యక్ జనక్తః, అంగచ్చాయా, కృష్ణం వన్డే, తేజాంపి, మంస్యతే, హరి శ్ఛే, అమర శ్శివః రామ కామ్యః, కృష్ణ పూజ్యః, హరిః పూజ్యః, రామో దృష్టః, అబలా అత్ర, పుప్తా ఇష్టా, విష్ణురమ్యః, రవిరయం, గీగఫలం, ప్రాతరచ్యుతః, భక్తోర్వంద్యః వంద్యోంఽతరాత్మా, భో భో ఏషః, ఏష హరిః, ఏష శార్టీ, సైష ధామః, ఈ రూపములందున్న సంధులను “సం హితాయందురు. ఇపుడు విభక్తి ప్రయోగములకు ఉదాహరణములను చూపుచున్నారు. రామేణాభిహితం కరోమి (తృతీయా) రామం భజే (ద్వితీయా) రామేణా పప్పతం (తృతీయా, సంహిత) రామాయ తుభ్యం నమః (చతుర్ద) రామే రంజతే (సప్తమీ) రామాన్ముక్తిః (పంచమీ) కొమస్య దాసోఽస్మి (షష్ఠీ విభక్తి) హేరాను (సంబోధన) ఇక ఇపుడు సంధిలేని కేవల శబ్దవులను కొన్నింటిని చెప్పుచున్నొను. సర్వాది శబ్దములు, గోషా, సఖో, పతీ, హరి, సుశ్రా, భాను, స్వయంభూః, క, . గౌ, అనడ్వాన్, గోధుక్, లిట్, ద్వే, త్రయః, చత్వారః, రోజా, పంథాః, దండీ, బ్రహ్మ హా, పంచ, అష్ట, అష్టా, అయం, సమ్రాట్, చిభృత్ , ద్వీటా, వపుః, మనః, ప్రత్యజ్, ఫుమాన్, మహాన్, ధీనన్, విద్వాన్, షట్, పిపరీ, దోః, ఉశనా, అసౌ ఈ శబ్దములు పుంలింగములో ఉండును. రాధా, సర్వా, గతిః, గోసీ, స్త్రీ, శ్రీః, ధేనుకి, వధూళి, స్వసా, గౌ, నౌ, ఉపొనత్, ద్యౌః, గో, కుత్, కకుత్, సంవీత్, రుక్, విట్, భాః అనునవి లింగ శబ్దములు తపః, కులం, సోమపం, అక్షి, గ్రామణీ, ఖలపు, కర్త, తను, సనడుత్, విమలం, ద్యు, హౌః, చత్వారి, ఇదం, ఏతత్ , బ్రహ్మ , దండి, అన్యత్, కించిత్ , త్యదోది శబ్దములు ఏతత్, ద్వే, చిత్, గవాక్, గవాజ్, గోఅక్, గోజ్, గోక్, తిర్యక్, యకృత్, శక్సల్, దదత్, భవత్, పచల్, తుదత్, దీవ్యత్, ధనుః అనునవి నపుంసకలింగరూపములు. పిపరీః పయోదః అనునవి పుంలింగములో కూడా ఉండును. గుణద్రవ్య క్రియా యోగముచే శబ్దములు మూడులింగములలో నుండునని కొందరందురు. శుక్ల డీలాలప, శుచి, గ్రామణీ, సుధీ, పటు, స్వయం భూ, కర్తా, మాతా, పితా, నొ, సత్య ఈ శబ్దములు పుంలింగమున నుండును. మత, భ్రమర, దీర్ఘపాత్, ఘన, సోమ, గర్ణ, అని, గ్రంధ, స్వర్ణ, బహు, శబ్దములు రెండు లింగములలో నుండును. సర్వ, విశ్వ, ఉభయ, ఉభ, అన్య, అంతర, ఇతర, ఉత్తర, ఉత్తమ, నేమ, సర్వార్ధకమ సమ శబ్దము, ఇష, పూర్వ, ఉత్తర, దక్షిణ, ఉత్తర, అధర, అపర, చతుర, ఏతత్, యావత్, తత్, కిం, అసౌ, ద్వి, యుష్మత్, అస్మత్, ప్రథమ, చరమ, అల్ప, నోర, కతిపయ, ద్వి, త్రి, శుద్ధాది శబ్దములు, మూడు లింగములలో నుండును. స్వ, ఇక, ఆభు, గోధ, పరి, విపర్యయ శబ్దములు అవ్యయములు.
అపత్యార్థమున తద్దితప్రత్యయములు అణాదులొచ్చినపుడు, పాండవాః, శ్రీధరః గార్గ్యః, నాడాయనః, ఆత్రేయః, గాంగేయః, పైతృష్వసీయః, అనురూపములు ఏర్పడును. దేవత అను నర్థమున, ఇదమను అర్ధమున ఐన్స్టం (హవిః) బ్రాహ్మం (హవిః) అను రూపము లేర్పడును. కర్మ కర్తలకు క్రియా యోగార్ధమున ధౌరేయః, కౌంకుమం అనురూపములేర్పడును. ‘భవ’(పుట్టుట) మొదలగు అర్ధములలో కానీనః (కన్యకు పుట్టినవాడు) కత్తియః, వైదికః స్వకః అనురూపములు ఏర్పడును. స్వార్థమున చౌరః అని, తుల్యార్థమున చంద్రవత్ ముఖమ్ అనీ రూపమేర్పడును. భావార్థమున బ్రాహ్మణత్వం, బ్రాహ్మణతా, బ్రాహ్మణ్యం అను రూపము లేర్పడును. అస్తి అను నర్థమున గోమాన్ ధనీ ధనవాన్ అనురూపములు సిద్ధించును. ప్రత్యర్ధమున (కొలత) కియాన్ అని ఏర్పడును. జాతార్ధమున తుందిలః, శ్రద్దాలుః అని, ఔన్నత్యార్ధమున (ఎత్తు) దంతురః అని ఏర్పడును. అస్త్యర్ధమున ణినిష్క్రయము రాగా స్రగ్వీ, తపస్వీ, మేధావీ, మాయావీ ఇత్యాది రూపములు సిద్దించును. బహుభాషణము కుత్సిత భాషణము అను నర్థమున వాచాలః, "వాచోటః అనురూపము లేర్పడును.
అసమాప్త్యర్ధమున, ఈషత్ అర్థమున కల్పప్ దేశీయ ప్రత్యయములొచ్చును. కవికల్పః, కవిదేశ్యః అనురూపములు, ప్రకారము అను అర్ధమున పటుజాతీయః అని, నిందార్దమున వైద్యపాశః అని, ప్రశంసార్ధమున వైద్యరూపః అని, భూతపూర్వార్ధమున దృష్టచరః అని సిద్ధించును. ప్రాచుర్యాద్యర్ధములలో అన్నమయః, మృణ్మయః స్త్రీమయః అనురూపము లేర్పడును. జాతార్ధమున లజ్జిత అని, అత్యర్ధమున శ్రేయాన్, శ్రేష్ఠః అను రూపములు సిద్దించును. కృష్ణతరః, శుక్లతమః కీమ అనునవేర్పడును. కింతరాం, అతితరాం, అభి, హి, ఉచ్చేస్తరిం అనునవి అవ్యయములు. పరిమాణార్థమున జానుదఘ్నం, జానుద్వయసం అని రూపము లేర్పడును. నిర్ధారణార్ధమున జానుమాత్రం అనురూపమునేర్పడును. చాలామందిలో, ఇద్దరిలో ఒకనిని చెప్పునపుడు వరుసగా కతమః, తరః అనురూపములుండును. లెక్క పెట్టదగిన వస్తువును చెప్పునపుడు ద్వితీయః తృతీయ, చతుర్దశి, పంచమః, షష్ఠః ఏకాదశః, కతిపయః, కతిధః, కతి అనురూపము లేర్పడును. ఇట్లే వింశః, వింతితమః, శతతమః మొదలగు రూపములుండును. సంఖ్యాప్రకారమును చెప్పునపుడు ద్విధా, ద్వేధా, ద్వేధా అనురూపములుండును. ఒకే పనిని ఎక్కువ మార్లు చేయునపుడు, పంచకృత్వం, ద్విః, త్రిః, బహుశః, ద్వితయం, త్రితయం అనురూపము లేర్పడును. సంఖ్యార్థమున ద్వయం, త్రయం అనురూపములు సిద్ధించును. అల్పార్థమున కుటీరః (చిన్న ఇల్లు, గుడి సె) శమీరః, శుండారః అనురూపములు సిద్ధించును. అట్లే సైణం పౌంస్నకి, తుండిభ, వృందారకః, కృషీవలః, మలినః, వికటః, గోమీ, భౌరీకీ అనురూపములు సిద్ధించును. అవటీటః, అవనాటః అనునవి నిబిడార్థములో నుండును. నిబిరీ, సమేషుకరీ అనురూపములు సిద్ధించును. విత్త, చణ అనురూపములు సామర్ధ్యార్ధమున నుండును. బహుతిధం, చంచుః, అనునవి సిద్దించును. శృంగిణ, పర్వతః అనురూపములు పర్వతార్థమున నుండును. పర్వత శిఖరములను చెప్పుటలో ఉపత్య కొ, అధిక్యకా అనురూపములేర్పడును. చిల్లః, , చిపీటం, చిక్వం, కాతూలః, కుతపః, వల్ల, హిమోలుః, కహోడు, ఉపడక, ఊర్ణాయుః, మరూత, ఏకాకీ, చర్మణ్వతీ జ్యోతా, తమిస్రా, కజ్జీవత్, యర్మణ్వతీ, ఆసందీవత్, చక్రీవత్, తూషీకా, జల్పతకీ ఇవియన్నియు విశేషరూపములు. ఇట్ల, కంభః, కంయుకె, కంబః, కేతిః, కంతుః, కంతః, కంపః శంవః, శంతః, శంతిః, శంయః, శంత, శంతి, శంయః, శంతః అనురూపములు విశేషార్ధములలో నుండును. హ్వయు శబ్దము శంభు శబ్దమువలె చెప్పవలయును. ఇక ధాతు రూపములను చెప్పుచున్నారు.
మొదట భాదిగణమున భూ సత్తాయాం అను ధాతువునకు పది లకారములలో భవతి, బభూవ, భవతా, భవిష్యతి, భవతు, అభవల్, భవత్, భూయాత్, అభూత్, అభవత్ అభవిష్యత్ అనురూపములు సిద్ధించును. ఇట్ల భ్వాదిగణములలోని ఇతర ధాతురూపములను ఊహించుకొనవలయును. అదాది గణమున అద భక్షణే అను ధాతువునకు పది లకొరములలో అత్తి, జఘాస, అత్తా, అత్యతి, అత్తు, ఆదత్ , అద్యాత్, అఘసత్, ఆత్స్యత్ అనురూపము లేర్పడును. జుహోత్యాదిగణమున జుహోతి, జుహావ జుహవాచకొర, హోతా, హోష్యతి, జుహోతు, అజుహోత్, జుహుయాత్, హూయాత్ , అహౌషీత్, అహోష్యత్ అను రూపములు సిద్దించును. దీవాది గణమున దీవ్యతి, దిదేవ, దేవితా, దేవిష్యత, అదీవ్యత్, దీవ్యేత్, దీవ్యాత్, అదేవీత్, అదేవిష్యత్ అనురూపములేర్పడును. స్వాదిగణమున సునోతి, సుషావ, సోడా, సోష్యతి, సున్తు, అసున్త్, సునుయాజ్, సూయాత్ , అసావీత్, అసోష్యత్ అను రూపములు ఏర్పడును. తుదాదిగణమున తుదతి, తుతోద, తోల్తా, తోత్సృతి, తుదతు, అతుదత్, తుదేత్, తద్యాత్, అతాతీత్, అతోత్స్యత్ అను రూపములు ఏర్పడును. రుధాది గణమున రుణద్ది, రురోద, రోహ్లి, రోత్స్యతి, రుణద్దు, అరుణత్, రుధ్యాత్, అగౌత్సిత్, అరోత్స్యత్ అను రూపములేర్పడును. తనాది గణమున తనోతి, తతాన, తని, తనిష్యతి, తనోతు, అతనోత్, తనుయాత్, అతనీత్, ఆతానీత్, అతనిష్యత్ అనురూపములు సిద్ధించును. క్ర్యాది గణమున క్రీజాతి, చిక్రయ, క్రేతా, శ్రేష్యతి, క్రీణాతు, ఆక్రీణాత్, క్రీణీయాత్, క్రీయాత్, అక్రెషీత్, ఆక్రోష్యత్ అనురూపములు సిద్ధించును. చురాది గణమున చోరయతి, చోరయామాస, చోరయితా, చోరయిష్యతి, చోరయతు, అచోరయత్, చోరయేత్, చోర్యాత్, అచూచురల్, అచోరిష్యత్ అనురూపములు సిద్ధించును.
ఇవి పదిగణములలోని మొదటి ధాతువులోని ప్రధమ పురుష ఏకవచనములోని రూపములు. ద్వివచనాది రూపములు ఇతర ధాతు రూపములు వ్యాకరణ శాస్త్ర గ్రంధములలో చూడవలయును.
ప్రయోజనార్థమున ధాతువున కంటే పరముగా ణిచ్ ప్రత్యయమువచ్చినచో భూధాతువులో లట్ రూపము భావయతి అని యగును. ఇచ్ఛార్థమున సన్ ప్రత్యయము వచ్చినపుడు బుభూషతి అనియగును. క్రియాసమభిహారార్థమున యజ్ ప్రత్యయమువచ్చినపుడు బోభూయతే అని యగును. యజ్ లుక్ ప్రకరణమున బోభవీతి అనియగును. తనలో ఇచ్చ అని అర్ధమున (“పుత్రం ఆత్మన ఇచ్చతి”) (పుత్ర ఇవ ఆచరతి) ఆచారార్ధమున పుత్రీయత (క్యచ్ ప్రత్యయాన్తము) అను రూపమేర్పడును. అనుదాత్తము ఇత్తుగాగల ధాతువునకం ఓ పరముగా జిత్తునకంటే పరముగా, క్రియా వినిమయాద్యర్ధమున, నివీశాదులకు ఆత్మ నే పదమొచ్చును. ఇతర ధాతువులకంటే సరముగా కర్తార్గమున పర స్మెపద మొచ్చును. ఇ కారణము ఇత్తుగా కల ధాతువున కంటే పరముగా, స్వగీతము ఇత్తుగా గల దౌతువున కంటే పరముగా పర సేపదము, ఆత్మనే పదము రెండు వచ్చును. భావ కర్మరూపొర్ధమున యక్ ప్రత్యయమొచ్చును. సౌకర్యాతిశయమును తెలియచేయుటకు కర్తవ్యాపారమును చెప్పదలచినపుడు కర్మయే కర్తయగును. అపుడు “పచ్యతే ఓదన స్వయమ్” (అన్నము స్వయముగా ఉడుకుచున్నది) అసిశ్చినత్తి (కత్తియే ఛేదించుచున్నది) స్థాలీ పచతి (స్థాలియే వండుచున్నది) ఇత్యాది ప్రయోగములుండును. సకర్మకమైన ధాతువునకం టే పరముగా భావార్థములో కర్మార్గములో కూడా లకారములు వచ్చును. అకర్మకమైన ధాతువునకంటే పరముగా భావార్థమున కర్తార్ధమున లకారములొచ్చును. ఫలము వ్యాపారము ఒకేదానిలో ఉన్నపుడు ధాతువు అకర్మ కమగును. ఆ ఫలవ్యాపారములకు ధర్మి భేదమున్నపుడు సకర్మ కధాతువగును. కర్మగౌణమైనపుడు, ద్రుహ్యాది ధాతువులు, ప్రధానమైనపుడు నీ హృ కృ మొదలగు ధాతువులు బుద్ది భక్షణార్థములలో, శబ్దకర్మక ధాతువులు వివక్షననుసరించి సకర్మ కములు అకర్మకములుగా మారును. ప్రయోజ్యకర్మ విషయమున ఇతర ణ్యంతములకు పరముగా లకోరాదులు రావచ్చును. ధాతువు ఫలచ్యాపారార్థములను చెప్పును. తాజ్ ఫలాశ్రయమగు కర్మను, వ్యాపారాశ్రయమగు కర్తను చెప్పును. ఫల వ్యాపారములలో వ్యాపారము ప్రధానము. తిజర్దము విశేషణమగును. కృత్యప్రత్యయములొచ్చినపుడు ఏధితవ్యం, ఏధనీయం అనురూపములేర్పడును. కృత్యప్రత్యయములు భావార్ధమున కర్మార్గమున వచ్చును. కృత్య యములు కర్తార్ధమున వచ్చును. కర్తా కారక అనునవి దృష్టాంతములు. భూతకాలమున భూత పదము వాడబడును. గమ్యాదులలో గమ్యాదులే నిర్దేశించబడును. మిగిలినదంతయూ అద్యతనమగును, అధి స్త్రీ యథాశక్తి మొదలగు రూపములు అవ్యయీభావసమాసములో నుండును. తత్పురుష సమాసమున రామాశ్రితః, ధాన్యార్ధః, యూపదారు, వ్యాఘభీః, రాజపురుషః, అక్షశాండః అనురూపములుండును.
పంచగవం, దశగ్రామీ, త్రిఫలా అనునవి ద్విగుసమాసమున నుండును. తుల్యార్ధమును చెప్పు కర్మధారయసమాసమున నీలోత్పలం మొదలగు రూపములుండును. “అబ్రాహ్మణః” అనునది నజ్ఞ తత్పురుష సమాసము. కుంభకొరః మొదలగు రూపములుండును. సమాసములో ఉన్న పదార్ధములు కాక అన్యపదార్థప్రధానమగు బహువ్రీహిసమాసమున “ప్రాప్తోదకో గ్రామః” పంచగు, రూపవద్భార్యః, ససుతః మొదలగు రూపములేర్పడును. సముచ్చయార్థమున గురుం చ ఈశం చ భజ అను ప్రయోగము, అన్వాచయార్ధమున “భిక్షామట, గాం చానయ” అను ప్రయోగములుండును. ఇతరేతరయోగ ద్వంద్వసమాసమున రామకృష్ణా ఇత్యాది ప్రయోగములుండును. రామకృష్ణులు అనగా ఇద్దరు, బ్రహ్మ అనగా ఏకరూపముగా ఉపాసించబడుదురు.
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వీతీయపాదమున వ్యాకరణ నిరూపణమను యాబది రెండవ అధ్యాయము సమాప్తము.
