నారద మహా పురాణము - పూర్వార్థము
67 - అధ్యాయము
సనత్కుమార మహర్షి పలికెను :- సాధకునికి అభీష్టసిద్ధిని ప్రసాదించు దేవపూజను ఇప్పడు చెప్పెదను. దేవోగారమున వామ భాగమున త్రికోణాకారముగా కాని చతురస్రాకారముగా కొని వేదిక నేర్పరిచి, చక్కగా పూజించి అస్త్రముచే సంక్షాళనము గోవించి హృదోధారము నుంచి, అచట అగ్ని మండలమును కొని పాత్రను కొని అస్త్రముచే ప్రక్టోళనము గావించి, ఆధారమున నమస్సునుంచి, రవిమండలమున తరువాత చంద్రమండలమును పూజించి మొదట చెప్పిన విధముగా సర్వతీర్థములను ఆవాహనగావించి, గోముద్రచే అమృతమును చేసి, కవచముచే అవగుంఠమును చేయవలయును. ప్రణవమును అస్త్రముచే సంక్షోళనము చేసి ప్రణవము మీద ఎనిమిది మార్లు జపముగావించవలయును. ఇదియే నరులకు సర్వసిద్ది ప్రదోయకనుగు సామాన్యాక్టము. ఆ జలమును కొద్దిగా తీసుకొని సాధకుడు ప్రోక్షిణితో వేరు వేరుగా తనను యాగవస్తువులను సంప్రోక్షణ గావించవలయును. తనకు వామాగ్రభాగమున షట్కోణాంతమును దానిలో త్రికోణమును ఏర్పరచవలయును. చతురస్రముతో చుట్టి, అర్ఘ్యాదకముచే చక్కగా క్షాళనము గావించి సాధకుడు శంఖముచే స్తంభనము గావించవలయును. ఆగ్నేయాది కోణచతుష్టయమున హృదయా చతుష్టయమును అంగన్యాసమును గావించవలయును. త్రికోణ మధ్యభాగమున నున్న ఆధారశక్తిని మూలఖండత్రయముచే చక్కగా పూజించి అస్త్రసంక్జాలితమగు దానిని హృదయముచే ప్రతిష్టించి, ఈ మంత్రముచే త్రిపదికను పూజించవలయును. దశకలాత్మకుడగు వహ్నిమండలాంతర్వర్తియగు వానికి మం అను బీజమును, అముక్తార్ష్యమని పొత్రాతమున, అంతిమమున సనాప హృదయముగా ఆధోరొర్చన యందు మంత్రము ఇరువది నొలుగు వర్ణములు కలిగి యుండును. సమంత్రక్షాళితమగు శంఖమును స్థాపించి పూజించవలయును. కర్మమహాత్వము కల నీకు తారము, జలచరునికి వర్మ, ఫట్ హృదయమును, పొంచజన్యమునకు హృదయము మనువు. అచట ద్వొదశాంతమున కళాత్మకుడగు అర్కమండలమునకాని, అముకొర్ఘ్యమని పాత్రాంతమున, నమోంతముగా త్ర్యక్టీవర్ణము గలదిగా పూజించి క్రమముగా ద్వాదశార్కకలలను పూజించి, శుద్ధజలముచే మూలమంత్రమును విలోమమాతృకగా పఠించి, శంఖమును పూరించవలయును. ఈ మంత్రముచే పూజించవలయును. షోడశాంతమున కలాత్మకుడగు సోమ మండలమునకు అముకొర్ధ్యామృతమునకు అర్ఘ్యపూజనమున హృదయమంత్రము, అచట పదునారు చంద్రకలలను పూజించవలయును. తరువాత పూర్వము వలే “గంగేచ” ఇత్యాది మంత్రముచే తీర్థములను ఆవాహన గావించి, గోముద్రచే అమృతమును గావించి మత్స్యముద్రచే ఆచ్ఛాదించవలయును. కవచముచే అవగుంఠనముగావించి మరల అస్త్రముచే కక్ష గావించవలయును. ఇష్టదేవుని ధ్యానించి ముద్రలను ప్రదర్శించవలయును. శంఖమౌశలచక్రముద్రలను చూపి పరమీకరణమును గొవించవలయును. బుద్ధిమంతుడు క్రమముగా మహాముద్రను యోనిముద్రను చూపవలయును. గారుడీ గాలినీ ముద్రలు ముఖ్యములు. దేవతాస్మరణాపూర్వకముగా గంధ పుష్పాదులచే పూజించవలయును. శంఖమునకు దక్షిణభాగమున ప్రోక్టణీ పాత్ర నుంచవలయును. ప్రోక్షిణి యందు ఆ జలమును కొంచెముగా నుంచి, తనను మూడుమార్లు ప్రోక్షించుకొని ఆత్మ తత్త్వాత్మకు హృదయమును, విద్యాతత్త్వాత్మ కునికి నమస్కారము, శ్రీవత్త్వాత్మకునకు హృదయము అని మంత్రములచే మూడుమార్లు ప్రోక్షణగావించవలయును. విధి విదానముగా మండలమును పుష్పాక్షతలచే కాని మూలగాయత్రిచే కాని పూజాద్రవ్యములను ప్రోక్షించవలయును. పాద్య అర్ఘ్య ఆచమనీయము కొరకు మధుపర్కము కొఱకు ముందు భాగమున ఆధారయుక్తముగా పాత్రలను స్థాపించవలయును. శ్యామాక, దూర్వ, అబ్ద విష్ణుక్రాంత జలములచే పాద్యము, పుష్ప, అక్షతయవలచే, కుశ, అగ్నితిల సర్షపములచే అర్ఘ్యమును, గంధదూర్వాదలములచే ఆచమనీయము చెప్పబడినది. జాతిఫలము, కంకోలము, జలాన్వితముగు లవంగము, తేనే, నేయి, పెరుగులతో కలిపిన దానిని మధుపర్కమందురు. ఒకదానియందుకాని, పాత్రయందుకాని పాద్యాదులను కల్పించవలయును. శంకరుని, సూర్యుని పూజించునపుడు శంఖమునుపయోగించుట ప్రశస్తము. శ్వేత, కృష్ణ, అరుణ, పీత, శ్యామ, రక్త, సిత, అసితలుగా రక్తాంబరాభయకరులుగా పీఠశక్తులను ధ్యానించవలయును, స్వర్ణాది లిఖిత యంత్రమున కాని, శాలగ్రామమున, మణియందు కాని, విధిగా స్థాపించిన ప్రతిమ యందు పూజించవలయును. అంగుష్ఠ పరిమాణము నుండి వితస్త్రీ పరిమాణము వరకు స్వర్ణోద్ధాతువులచే నిర్మించబడిన ప్రతిమలు గృహమున పూజించుటకు ప్రశస్తములు. వక్రముగా నున్న, దగ్డమైన, ఖండితమైన భిన్న మూర్థము, భిన్న నేత్రమును, అంత్యజాదులచే స్పృశించబడిన ప్రతిమను పూజించరాదు. సర్వలక్షణలక్షితయగు బాణాదిలింగమున కూడా పూజించవచ్చును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి యథాప్రకారముగా దేవుని ధ్యానించి, ఆవాహన గోవించి పరివార గణములతో కూడియున్న దేవుని ఆ మూర్తియందు పూజించవలయును. శాలగ్రామమును ప్రతిష్టించినచో ఆవాహనవిసర్జనలతో పని లేదు, పుష్పాంజలిని తీసుకోని ధ్యానించి మంత్రమునుచ్చరించవలయును. ఆత్మ స్థితుడు అజుడు శుద్దుడు యగునిన్ను, అరణియందు అగ్నినీవలే మూర్తియందు ఆవాహించుచున్నాను. ఈ మహామూర్తి నీదే. ఆ మూర్తియందు సర్వగతుడవగు, భక్తి స్నేహ సమాకృష్ణుడవగు నిన్ను దీపము వలె ప్రతిష్టింతును. ఓ దేవా సర్వబీజమయుడవు, సర్వోంతర్యామిని, శుభకరుడవు స్వాత్మస్థుడను అగు నీకు పరిశుద్ధమగు ఆసనమును కల్పించుచున్నాను. ఓ ప్రభూ! ఈ నీ మూర్తి శక్తి నీకంటే వేరుగాదు. కావున భక్తానుగ్రహకారకుడవగు నీవు ఆ మూర్తిలో నిలువుము. అజ్ఞానము వలన గాని, మదించియుండుట వలన కాని, సాధన వైకల్యము వలన కానీ కల్పము అసంపూర్ణమైనను నీవు అభిముఖుడవుకమ్ము. యజ్ఞశాలయందు అమృతమును వర్షించు నీ దృష్టిని పూరించుచు యజ్ఞసంపూర్తి కొరకు మూర్తియందు నిలిచి యుండుము. భక్తులుకొని వొరి వాజ్మనశ్చకుశోత్రములకు అందని ప్రకాశముకలవాడా! నీ తేజఃపుంజముతో అంతటా పరివేష్టితుడవు కమ్ము. దేవతలు కూడా తమ అభీష్టసిద్ది కొఱకు దర్శనమభిలషించు పరమేశుడవగు నీకు స్వాగతము. నాకు కూడా స్వాగతము. నేను కృతార్థుడనైతిని. అనుగ్రహించబడితినని. నా జన్మ సఫలమైనది. దేవేశుడవగు నీవు వచ్చితివి. నీకు మరల సుఖాగమనము. కొద్ది భక్తి సంపర్కము వలననే పరమానందము సంభవించు నీపాదపద్మమునకు పొద్యమును కల్సించుచున్నాను. వేదములకు వేదము, దేవతలకు దేవతవు, శుద్దుల శుద్ధికి హేతువగు నీకు ఆచమనమును కల్పించుచున్నాను. తాపత్రయరుడవు, దివ్యుడను, పరమానన్దలక్షణుడవు అగు నీకు పాపనిర్ముక్తి కొఱకు నీకు అర్ఘ్యమును కల్పించుచున్నాను. సర్వకాలుష్య రహితుడవు, పరిపూర్ణగుణాత్ముడవగు నీకు మధుపర్కమును కల్పించుచున్నాను. ఉచ్చిష్టుడు కొననీ, అశుచియైనను స్మరణమాతరముచేతనే శుద్ధిని ప్రసాదించు నీకు మరల ఆచమనమును సమర్పంచు చున్నాను. ఓలోకనాధా! మహాశయా, స్నేహమునర్పంచుచున్నాను. ఈశ్వరో పరమానంద బోట్లలో నిమగ్నుమగు మూర్తీగల నీకు సాం గోపొంగముగా స్నానమును కల్పించుచున్నాను. యథాశక్తి గా, ఆదరముగా సహస్రమును కాని శతమును కాని గంధపుష్పాదులచే మంత్రముచే అభి షేకమును చేయవలయును. మాయ అను చిత్రపటముచే కప్పబడియున్న రహస్య ప్రకాశము కలవొడవు, ఆవరణములేని విజ్ఞానము కలిగియున్న నీకు నేను వస్త్రమును కల్పించుచున్నొను. మహామాయ నీ ఆశ్రయము వల్లనే జగత్తును మోహింప చేయుచున్నది. అట్టి పరమేశుడవగు నీకు ఉత్తరీయమును కల్పించుచున్నాను. శక్తి అర్క విఘ్నేశ్వరులకు రక్త వస్త్రమును, విష్ణువునకు పీతవస్త్రమును, శివునకు శ్వేతవస్త్రమును, అర్పించవలయును. శైలాదిదూషితమగు, జీర్ణమగునది, ఛిద్రములు కలిగియున్న, మలినమైన వస్త్రమును అర్పించరాదు. ఎవని శక్తిత్రయముచే సకల జగత్తు ప్రీతి చెండుచున్నదో అట్టి యజ్ఞ సూత్రస్వరూపునకు యజ్ఞసూత్రమును అర్పించుచున్నాను. స్వభావముచేతనే సుందరాంగుడు, నానాశక్త్యాశ్రయుడు అయిన నీకు విచిత్రభూషణములనర్పించుచున్నాను. పరమానందసౌరభ్యపరిపూర్ణ దిగంతరములు కల నీకు పరమగంధమును కల్పించుచున్నాను, కృపతో స్వీకరించుము. తురీయవనసంభూతమగు నొసాగుణమనోహరమగు, అధికసౌరభయుక్తమగు నీ పుష్పములను స్వీకరించుడు, జపాపుష్పమును, అక్షతలను, జిల్లేడుని, ఉమ్మెంతపుష్పములను శ్రీమహావిష్ణువునక్పంచరాదు. శక్తికీ దూర్వ అర్క మందోరములను, గణేశునకు తులసిని అర్చించరాదు. సరోజినీ దమనకములను, మరుబకమును, కుశములను, విష్ణుక్రాంత, నాగవల్లి, దూర్వ, ఆపామార్గ, దాడిమ, పుష్పములను ధాత్రీమునియుతులగు దేవతలకు పత్రములచే అర్చనమును చేయవలయును.
కదలి, బదరి, ధాత్రి, తింత్రిణీ,బీజ పూరకము, ఆమ్లము, దొడిమ, జంబీరము, జంబు, పనస వృక్షముల ఫలములతో దేవపూజనము గావించవలయును. ఎండిన పత్ర పుష్పఫలములతో పూజించరాదు. ధాత్రీ ఖదీర బిల్వతమాలదళములు భిన్నములైనను ఛిన్నము లైనను దోషము లేదని పండితులు చెప్పిరి. పద్మము, ఆమలకము మూడు దీనములు శుద్ధముగా నుండును. తులసీదళములు మారేడు దళములు సర్వ కొలములలో శుదములే. పలాశ, కోశకుసుమ తులసీ దలములు, ధాత్రీదలములు, దూర్వా వీటిచే జగదంబికను అర్చంచరాదు. పత్ర పుష్ప ఫలములను తలక్రిందులుగా దేవుని కర్పించరాదు. పత్ర పుష్పాదులు చెట్టు ఎట్లుండునో అట్లే అర్పించవలయును. దివ్యము, సుగంధభరితము, సుమనోహరము అయిన వనస్పతీరసమును భక్తిచే సమర్పించుచున్నాను. ఆ ధూపమును ఆఘ్రాణించుము. సర్వదో చీకటిని హరింపచేయు చక్కని ప్రకాశము కల నేతివత్తితో కూడియున్న దీపమును స్వీకరించుము. రుచిగలది షడ్రసోపేతము అగు సొలుగు విధముల అన్నమును ఆనందమునిచ్చు నైవేద్యముగా స్వీకరించును. పూగ ఖదిర చూర్ణముతో కూడియున్న నాగవల్లీ దళమును కర్పూరాది సుగంధభరితమును నేనిచ్చిన దానిని స్వీకరించుము. తరువోత పుష్పాంజలినిచ్చి ఆవరణార్చనగావించవలయును. ఏ దిక్కునను అభిముఖుడై దైవపూజగావించునో ఆ దిక్కు తూర్పుదిక్కుగా తెలియవలయును. ఇతర దోశలు పది విదిశలగును. కేశరములందు అగ్నికోణాదిగా హృదయాదులను పూజించవలయును. అగ్రభాగమున నేత్రమును, దిక్కులందు అస్త్రమును యథాక్రమముగా అంగమంత్రములచే శుక్ల శ్వేత సీతశ్యామ కృష్ణ రక్త వర్ణములు గల, వరాభయకరలైన ఆయా దీగంగ శక్తులను ధ్యానము చేయవలయును. ఈ ఆవరణాంతమున ఈ దేవతయని చెప్పవలయును. తరువాత సాలంకారులను, సపరిచారికలను, సపోహనులను, సాయుధులను సర్వోపచారములతో చక్కగా పూజించి తృప్తి పరిచి వరదులగుదురుగాక అని చెప్పవలయును. మూలాంతమున ఉచ్చరించి దేవతకు నివేదించవలయును. ఓ శరణాగతవత్సలా నాకు అభీష్ట సిద్ధిని కలిగించును. భక్తితో నీకు ఈ ఆవరణార్చనను సమర్పించుచున్నాను. అని పలికి దేవమస్తకమున పుష్పాంజలిని సమర్పించవలయును. తరువాత కల్పోక్తావరణలను యథాక్రమముగా అర్చించవలయును. తరువాత సాయుధులైన ఇంద్రాదులను వారి వారి దిక్కులందు పూజించవలయును. ఇంద్రుడు వహ్ని, యముడు, వైబ్రుతి, వరుణుడు, వాయువు, ఈశ్వరుడు, బ్రహ్మ అధోభాగమున ఆది శేషుడు వీరు దిగీశులు, ఐరావతము, మేషము, మహిషము, పేతము, తిమి, మృగము, అశ్వము, వృషభము, హంస, కూర్మము, ఇవి వారి వాహనములు. వజ్రము, శక్తి, దండము, ఖడ్గము, పొశము, అంకుశము, గద, త్రిశూలము, పద్మము చక్రము ఇవి క్రమముగా వారి ఆయుధములు. ఆవరణార్చనను పూర్తి గావించి దేవతారార్తికమును గావించవలయును. శంఖ జలమును చుట్టు జల్లి చేతులు పైకెత్తి భూమి మీద పడవలయును. దండము వలె పడిలేచి తన ఇష్టదైవమును ప్రార్ధించి, దక్షిణ భాగమున స్థండిలము నేర్పరిచి అచట సంస్కారమును ఆచరించవలయును. మూలమంత్రముతో నేత్రమును, అస్త్రముచే ప్రోక్షణమును, మరల తొడనమును, దర్భలచే కవచమును ప్రోక్షించి అచట వసువు నుంచవలయును. ప్రదోపనము గావించి హోమమును చేయవలయును. ఇష్టదేవతను ధ్యానించి సమస్తములగు మహావ్యాహృతులచే చతుష్టయమును నేతితో కొని, తిలలచే కాని, పాయసము చే కాని నేతిని కలిపి ఇరువది మార్లు హోమమును గావించవలయును. మరల వ్యాహృతులచే, హోమమును గావించి గంధాదులచే అర్చించవలయును. మూర్తియందు దేవుని సంయోజన చేయవలయును. అపుడు అగ్నిని విసర్జన చేయవలయును. ఓ మహాశక్తి గల అగ్నిహోత్రమా, సర్వ కర్మ ప్రసాధకా! మరియొక కర్మ వచ్చినపుడు సాన్నిధ్యము నిమ్ము. ఇట్లు విసర్జన గావించి అగ్నికి ఆచమనమును సమర్పించవలయును. మిగిలి హవిస్సును గంధపుష్పాక్షతలతో కలిపి దేవతా ద్వారపొలకులకు పూర్వోక్తులకు బలినీయవలయును. రౌద్రులు, రౌద్రకర్ములు, రౌద్రస్థాన నివాసులు, యోగినులు, ఉగ్రరూపులు, గణాధిపులు, ఇతరులగు విఘ్నభూతులు దిక్కులలో విదిక్కులలో ఉన్న వారందరు ప్రీతితో కూడిన మనసు గలవారై ఈ పూజను స్వీకరింతురుగాత. ఇట్లు అష్టదిక్కులలో నుంచి మరల భూతబలిని గావించవలయును. గోముద్రచే జలమును అమృతమును గావించి దేవతా హస్తమున మగల ఆచమనీయమునీయవలయును. మూర్తిస్తుడగు దేవతను ఉద్వాసన గావించి, మరల అచటనే యోజన చేయవలయును. తరువాత వారి వారి ఉచ్చిష్ట భోజులకు నైవేద్యము నర్పించవలయును. మహేశ్వరునికి చండేశుడు, శ్రీహరికి విష్వక్సేనుడు, సూర్యునికి చండాంశువు, గణేశునికి వక్రతుండుడు, శక్తికి , చండాలి ఉచ్చిష్టభోజులు. తరువాత ఋష్యాదికమును స్మరించి మూల షడంగ న్యాసమును గావించి యథాశక్తిగా మంత్రమును జపించి దేవతకు నివేదించవలయును. గుహ్యాతిగుహ్యా గోప్తవగు నీవు మాచే చేయబడిన జపమును స్వీకరించుము. నీ అనుగ్రహము వలన నీయందున్న సిద్ది నాకు కలుగును. తరువాత అర్షమును పరాజ్ముఖముగా చేసి పుష్పములచే పూజించవలయును. బాహువులచే, పొదములచే, మోకాళ్ళచే, వక్షస్థలముచే, శిరస్సుచే, నేత్రములచే, మనస్సుచే వాక్కుచే అని ప్రణామము అష్టాంగముగా చెప్పబడినది. బాహువులచే జానువులచే శిరస్సుచే వాక్కుచే, మనస్సుచే పంచాంగప్రణామము కూడా చెప్పబడినది. దైవ పూజలో ఈ రెండు ఉత్తమములే. మంత్రానుష్టానము చేయువాడు దండవత్రణామములాచరించి ప్రదక్షిణముల నాచరించవలయును. తరువాత భక్తిపూర్వకముగా స్తోత్రాదికమును పఠించవలయును. ఇప్పటి నుండి పూర్ణముగా ప్రాణ బుద్ధి దేహ ధర్మాధికారములవలన జాగ్రత్స్వప్నసుషుష్యవస్థలలో మనసుచే, వాక్కు, హస్తములచే, పాదములతో, ఉదరముతో, అక్కడి నుండి శిరస్సువంచి తలచినది, పలికినది, చేసినది అంతయూ బ్రహ్మర్పణమగు గాక. నన్ను, నాదైన సమస్తమును విష్ణువునకు సమర్పించుచున్నాను. తార స్వరముతో “తత్సదతో బ్రహ్మర్పణమస్తు” అనునది మంత్రము ప్రణవము ఆదియందుగ అష్టాక్షరములు గల ఈ మంత్రముతో ఆత్పార్పణమును గావించవలయును. అజ్ఞానము వలన కాని ప్రమాదము వలన కాని సాధన వైకల్యము వలన కొని ఎక్కువ తక్కువలున్నచో దాని నంతను క్షమించవలయును. ద్రవ్య హీనము, క్రియాహీనము, మన్త హీనముగాకాని, మరొకవిధముగా కానీ నేనాచరించిన దానిని దయానిధివగు నీవు దయచే క్షమించుము. జాగ్రత్స్వప్నసుషుప్తి కర్మలలో నేను చేయు పనులన్నియూ నీ పూజయే అయ్యి నాకు సంపదలను వృద్ధిపరచనీ, భూమిమీద కాలు జారిన వానికి భూమియే ఆధారమగునటుల నీయందు అపరాధము చేసిన వారికి నీవే రక్షణము కావలయును. ఇతరములైన రక్షకము లేవియూ లేవు. నీవే నాకు రక్షణము. కావున కొరుణ్యభావముతో నన్ను క్షమించుము. నేను రాత్రింబవళ్ళు అపరాధసహస్రముల నాచరించుచున్నాను. ఓ జగత్పతి నన్ను నీదాసునిగా భావించి క్షమించుము నేను ఆవాహనమును తెలియను, విసర్జనమును తెలియను. పూజను తెలియను. కావున నీవే గతివి ఇట్లు ప్రార్థించి మూలాంతమున శ్లోకమును పఠించవలయును. గచ్చ గచ్చ పరం స్థానం జగదీశ జగన్మయ, యన్న బ్రహ్మదయో దేవ జానర్తి చ సదాశివః” అనునది శ్లోకము. ఓ జగదీశా జగన్మయా బ్రహ్మాది దేవతలు సదాశివుడు కూడా తెలియని నీ పరస్థానమునకు వెళ్ళుము అని అర్థము. ఇట్లు పుష్పాంజలినిచ్చి సంహారముద్రచే తన హృదయ పద్మమునందు సాంగముగా దేవుని ఉంచి సుషుమ్లామార్గముతో పుష్పమునాఘ్రాణించవలయును. శంఖ చక్ర శిలా లింగ విఘ్నేశ సూర్యద్వయమును, శక్తిత్రయమును ఒకేచోట పూజించరాదు. పూజించినచో దుఃఖకారణమగును. శుభములను కలిగించు శ్రీ విష్ణుపాదోదకము అకాలమృత్యుహరణము, సర్వ వ్యాధి నివారణము. సర్వపాపక్షయకరము. ఆయాదేవతల భక్తులచే వారి వారికి సమర్పించిన నైవేద్యమును స్వీకరించవలయును. శివనిర్మాల్యమును పత్ర పుష్ప ఫలజలములను గ్రహించరాదు. శాలగ్రామశీలాస్పర్శవలన అన్నియూ పవిత్రములగును. ఈ విషయమున పూజ అయిదు విధములుగా చెప్పబడినది. ఆతురీ, సౌతికీ, త్రాసీ, సాధనా భావినీ, దౌర్బోధి యని వాటి పేర్లు. ఇపుడు క్రమముగా వీటి లక్షణములను వినుము.
రోగాదులు వచ్చినవారు స్నానము చేయరాదు. జపము చేయరాదు. పూజించరాదు. దేవ పూజను చూచి, మూర్తిని కాని, సూర్యమండలమును కాని చూచి నమస్కరించి, మస్త్రమును స్మరించుచు పుష్పాంజలిని సమర్పించవలయును. రోగము తగ్గిన తరువాత స్నానము చేసి గురువునకు నమస్కరించి పూజించవలయును. ఓ జగత్పూజ్యా! దయానిధీ! నీయనుగ్రహమువలన నాకు పూజావిచ్చేద దోషము కలుగకుండు గావు అని దైవమును ప్రార్థించవలయును. బ్రాహ్మణులను కూడా పూజించి శక్త్యనుసారము సంతోషింప జేసి, వారి నుండి ఆశీర్వాదములను పొంది తరువాత మొదటి వలె దేవ పూజను గ్రావించవలయును. ఇది ఆతురీపూజ యనబడును. ఇపుడు సౌతికీపూజను చేప్పెదను. సూతకము రెండు విధములు. జాతసూతకము, మృతసూతకము అని. ఈ సూతకములలో స్నానము చేసి మానసిక సంధ్యా వందనమాచరించి, మనసుతోనే దైవపూజ గావించవలయును. మనసులోనే మంత్రమును జపించవలయును. సూతకము తొలగిపోయిన తరువాత, మొదటివలె గురువును, బ్రాహ్మణులను పూజించి, వారి ఆశీర్వచనములను పొంది, తరువాత నిత్యకృత్యములను నిత్యకర్మనాచరించవలయును. దీనిని సౌతిక పూజయందురు. ఇపుడు త్రా సీపూజను చేప్పెదను. దుర్జనులవలన భయము కలిగినపుడు లభించిన ద్రవ్యములచే కొని. మానసిక ద్రవ్యములచే కాని దైవపూజ గావించవలయును. ఇదియే త్రాసీ అనబడును. పూజాసాధన వస్తువులను కూర్చుకొను సామర్థ్యము లేనపుడు పత్ర పుష్ప ఫలములతో కాని మానసికముగా కాన దైవపూజ గావించుటయే సాధనా భావినీ పూజ యనబడును. స్త్రీలు వృద్దులు బాలులు, మూర్తులు వారికి తోచిన క్రమముచే తెలిసినంతలో చేసిన పూజ దౌరోధియగును. సాధకుడిట్లు ఏదో విధముగా పూజము చేయించవలయును. దేవపూజావిహీనుడు నరకమునకు వెళ్ళును. వైశ్వదేవాదికమును చేసి బ్రాహ్మణులకు భోజనమును అర్పించవలయును. తరువాత దైవనివేదికమును చేసి బ్రాహ్మణులకు భోజనమును అర్పించవలయును. తరువాత దైవనివేదితమైన దానిని స్వగణముచే భుజించవలయును. ఆచమనము చేసి ఆనన శుద్ధిగావించుకొని క్షణములుండవలయును. స్వజనులతో కలిసి పురాణమును కాని ఇతిహాసమును కాని వినవలయును. సర్వకల్పములలో అనుకల్పము నాచరించువాడు దుర్మతి యగును. కల్పఫలమును పొందజాలడు.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున దేవ పూజా నిరూపణమను అరువది యేడ - అధ్యాయము సమాప్తము.
