నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

29 -  తిథ్యాదినిర్ణయః

సనకమహర్షి పలికెను :- తిథి నిర్ణయమును ప్రాయశ్చిత్త విధిని చెప్పెదను. ఓ మునిశ్రేష్టా ! దీనివలన కర్మ సిద్ది కలుగును. కావున వినుము. శ్రాతస్మార్తవ్రతదానాదికములు వైదికములగు కర్మలు తిథి నిర్ణయము జరుగనిచో ఫలించజాలవు. ఏకాదశి, అష్టమి, షష్టి, పూర్ణిమ, చతుర్దశి, తృతీయ, ఈ తిథులు ఉపవాసవ్రతాదులందు తరువాతి తిథితో విద్దమైనచో ప్రశస్తములగును. పూర్వతిథితో కూడినవి గ్రహించదగినవి కావు. నాగవిద్దయగు షష్టి శివ విద్దయగు.  సప్తమి, ఏకాదశీ విద్ధయగు దశమి ఉపవాసమునకు యోగ్యములు కావు. అమావాస్య, పూర్ణిమ సప్తమి పితృవాసరము పూర్వ తిథి విద్దమైన దానిని ఆచరించినచో నరకమును చెందును. కృష్ణపక్షమును సప్తమి, చతుర్దశి, తృతీయ నవమి పూర్వతిథి విద్దమైనచో ప్రశస్తమని కొందరు చెప్పేదరు. అన్ని వ్రతములకు శుక్లపక్షము ప్రశస్తము. అపరాహ్ణము కంటే పూర్వాహ్ణము శ్రేష్ఠం. ప్రతాదులకు పూర్వాహ్ణకీ తిథి కుదురనిచో సూర్యోదయము తరువాత రెండు ముహూర్తముల కాలమున గ్రహించవలయును. సూర్యుడస్తమించు నక్షత్రమును తిథితో కూడియున్నదానిని విహితకర్మలలో స్వీకరించవలయును. ప్రదోషకాలవ్యా పిని యగు తిథిని గ్రహించవలయును. అట్లు కానిచో నిష్పలమగును. నక్షత్రమున విధించిన ప్రతి విషయమున అర్థరాత్రము తరువాత నక్షత్ర వ్యాప్తిని యగు తిథిని స్వీకరించవలయును. రెండు అర్ధరాత్రములలో నక్షత్రము వ్యాపించియున్నచో తిథియుక్తమైన నక్షత్రమును గ్రహించవలయును. తిథి నక్షత్రములు రెండర్థరాత్రములలో క్షయమునకు పూర్వము వృద్ధికి ఉత్తరము ప్రశస్తము. నక్షత్రముతో కూడిన తిథి అర్ధరాత్ర ద్వయ వ్యాప్త మైనచో ప్రసవృద్ది శూన్య మైనచో పూర్వమును పరమును కూడా గ్రహించవచ్చును. జేషానక్షత్రముతో కూడినమూల, కృత్తికతో కూడిన రోహిణి, అనూరాధతో కూడిన జ్యేష్ఠ సంతానాది వినాశిని యగును. కర్మానుష్టానమునకు పగటి తిథులు ప్రశస్తములు. రాత్రివ్రతము లన్నిటిలో రాత్రియోగము ప్రశస్తము. ఏ నక్షత్రముతో కూడియున్న ఏ తిథి పవిత్రముగా పేర్కొన బడినదో ఆ తిథిలో ఆ వ్రతమును చేయవలయును. శ్రవణ ద్వాదశీ వ్రతమున ఉదయ వ్యాపినీ తిథిని గ్రహించవలయును. సూర్య చంద్ర గ్రహణములు ఉన్నంతవరకే జపాదులతో స్వీకరించవలయును. అన్ని సంక్రమణములలో పుణ్యకాలము విశేషించిన  అక్షయ ఫలము లభించును. కర్కాటక సంక్రమణమున దక్షిణాయన పుణ్య కాలము సంక్రమించును.

దక్షిణాయన పుణ్యకాలమున మొదటి ముప్పది ఘటికలు పుణ్యకాలమని పండితులు చెప్పెదరు. వృషభ వృశ్చిక సింహ కుంభ సంక్రమణములలో స్నాన జపాదులకు మొదటి ఎనిమిది ముహూర్తములను గ్రహించవలయును. తులా మేష సంక్రమణులలో మొదటి, చివరి పది ఘటికలు పుణ్యకాలముగా తెలియ వలయును. కన్యా మిథున మీన ధనుస్సంక్రమణములలో తరువాతి పదునారు ఘటికలు పుణ్యకాలము. మకర సంక్రమణము ఉత్తరాయణ పుణ్యకాలమందురు. తరువాత ముప్పది ఘటికలు, మొదటివలే నలుబదీ ఘటికలు ప్రశస్తములు. సూర్య చంద్రులు గ్రహణముతో అస్తమించిన యెడల మరునాడు శుద్ధ మండలమును చూచి స్నానము చేసి భుజించవలయును. ధర్మమును పొందగోరు విద్వాంసులు సీనివాలీ కుహూ అను పేర్లచే అమావాస్య రెండు విధములని చెప్పిరి. చంద్రుడు కనబడిన అమావాస్య సినీవాలీ అని, కనపడని అమావాస్య కుహూ అని సిద్ధాంతము. సాగ్నిహోత్రులగు విప్రులు శ్రాద్ధకర్మలో సినీవాలినే గ్రహించవలయును. స్త్రీలు శూద్రులు అనగ్నిహోత్రులు కుహూను స్వీకరించవలయును. అమావాస్య తిథి అపరా వ్యా పీని అయినచో క్షయమునకు (మృతాహము) పూర్వమును, వృద్ధికి అపరమును గ్రహించవలయును. మధ్యా హ్నము తరువాత అమావాస్య ప్రతీయమానమగుచో శాస్త్ర విశారదులగు సజ్జనులు భూతవిద్దా అందురు. అమావాస్య అత్యన్త క్షీణమై రెండవరోజు అపరాహ్లా వ్యా పని కానిచో సాయాహ్నవ్యా పిని యగు సినీవాలినే గ్రహించవలయును. రెండవరోజు క్షీణించినచో సాయాహ్నవ్యా పినిగాయున్నచో తరుచాత నున్న సినీవాలిని గ్రహించవలయును. అమావాస్య అత్యంతవృద్ధిగా నున్నచో భూతవిద్ధను పరిత్యజించవలయును. పితృకర్మలో అపరాష్ట్ర వ్యాపినియగు కుహూను స్వీకరించవలయును. రెండవ దినమున వృద్ధియైనచో భూతవిద్దను విడువవలయును. రెండవ దీనము పరాహ్లావ్యాపిని అయినచో కుహూను గ్రహించవలయునని పండితులు చెప్పెదరు. రెండు మధ్యాహ్నములలో అమావాస్య వ్యాపించియున్నచో యధేష్టముగా మొదటి దానిని కాని రెండవదానిని కాని స్వీకరించవచ్చును. ఇక ఇపుడు సంపూర్ణ పర్వలో అన్వాధానమును (పితృయజ్ఞము)చెప్పెదను. ప్రతిపద్దినమున యాగమును చేయవలయును. పర్వలోని నాలుగవ అంశము ప్రతిపత్తు లోని మొదటీమూడు ఘటికలు ప్రశస్తములు ఈ సమయమే యాగకాలమని తెలియవలయునని పండితులు నిర్ణయించిరి. అమావాస్య కాని పూర్ణిమ కాని రెండు మధ్యాహ్నములలో ఉండెనేని రెండవదినమే సద్యఃకాలముగా గ్రహించవలయును. పూర్వద్వయమైనచో పరసంగమున్న రెండవదినమునే గ్రహించవలయును. తిథిక్టయమున్నచో సద్యఃకాలము రెండవదినమే అగును. దశమీ విద్ధకొని ఏకాదశినే అందరూ గ్రహించవలయును. దశమీ విద్దయగు ఏకాదశి జన్మత్రయ సంచితమగు పుణ్యమును నశింపచేయును. ద్వాదశీ తిథియందు ఏకాదశి కలామాత్రముగా నున్ననూ, త్రయోదశి తిథిలో ద్వొదశి కలామాత్రమున్ననూ అది చాలా శ్రేష్ఠము. శుద్దమైన సంపూర్ణేకొదశి ద్వాదశి తిథియందు కూడా ప్రతీతియగుచో, రాత్రి చివర త్రయోదశీ ప్రతీతయున్నచో అచటమొదటి దానిని గృహస్థులు, రెండవ దానిని యతులు స్వీకరించవలయును. గృహస్థులు ఫలసిద్ధిని యతులు మోక్షమును కోరెదరు కదా ! ద్వొదశీ తిథిని కలామాత్రము కూడా పారాణాకాలము లభించినచో దశమీ విద్దయగు ఏకాదశి అయిననూ ఉపవసించవలయును. శుక్లపక్షమున కాని కృష్ణపక్షము కాని కృష్ణపక్షమున కానీ ఏకాదశీ ద్వయము వచ్చినచో గృహస్థులు మొదటి దానిని, యతులు రెండవదానిని గ్రహించవలయును దశమీ సంయుతమగు ఏకాదశి ద్వాదశీ తిథిను కూడా కొంచెమున్న చో దినక్షయమున అందరూ రెండవ దానినే స్వీకరించవలయును. రెండవదినమున ద్వాదశి లేనిచో దశమీ విద్ద అయిననూ ఏకాదశిని గ్రహించవలయును. రెండవదినమున ద్వాదశియున్నచో విద్దలేకున్ననూ మొదట ఏకాదశిని విడువలయును. ఏకాదశి ద్వాదశి రాత్రి శేషముగా త్రయోదశి ఉన్న చో ద్వాదశీ తిథిన ఉపవాసముండి త్రయోదశిన పారణ చేయవలయును. ద్వాదశీ దినమున కలామాత్రము ఏకాదశియున్నను, త్రయోదశిన ద్వాదశియున్ననూ లేకున్ననూ దశమీ విద్దయగు ఏకాదశిని గృహస్థులు, యతులు రెండవదానినే స్వీకరించవలయును. సంపూర్ణేకాదశి ద్వాదశినాడే మాత్రములేక, త్రయోదశిన ద్వాదశి కొంచమున్న చో మొదటి దానిని గృహస్థులు రెండవదానిని యతులు స్వీకరించవలయును. రెండవదినమునే ఉపసించవలయునని కొందరి మతము, ఏకాదశీ దశమీ విద్ద అయి ద్వాదశిన ప్రతీతికానిచో, ద్వాదశీ తిథి త్రయోదశిన వ్యాపించియున్నచో అచటనే వ్రతమునుచేయవలయునని మరికొందరి మతము. శుద్ధ ద్వాదశీ తిథిననే అందరూ ఉపవసించవలయునని సిద్ధాంతము. కొందరు మొదటి దినమునే ఆచరించవలయునందురు కాని అది సమంజసము కాదు.

సంక్రమణమున ఆదివారమున వ్యతీపాత్తున గ్రహణకాలమున పుత్రవంతుడగు గృహస్థుడు పారణమును కాని వుపవాసమును కాని చేయరాదు. అమావాస్యనాడు పగలు పూర్ణిమారాత్రిన చతుర్దశీ అష్టములలో పగలు, ఏకాదశి పగలు రాత్రులు భుజించెనేని చాంద్రాయణ వ్రతము నాచరించవలయును. సూర్యగ్రహణము ప్రాప్తించునపుడు ముందుగా మూడు రూములు భుజించరాదు. భుజించెనేని సురాపానసమపాపము కలుగును. అన్వాధానయోగ మధ్య కాలమున చంద్రసూర్యగ్రహణము వచ్చినచో యాజ్ఞికులు ప్రాయశ్చిత్తమును చేయవలయును. చంద్రగ్రహణసమయమున ‘దశమే సోమ’ అను ఋక్కుచే యాగమును చేయవలయును. ‘ఆప్యాయస్వ’ అను ఋక్కుచే ‘సోమపాస్త’ అను మంత్రముచే చేయవలయును. సూర్యగ్రహణకాలము “ఉదుత్యం జాతవేదసం” “ఆసత్యేన” అను మంత్రములచే హోమమును చేయవలయును. ఇట్లు పండితులు స్మృతిమార్గముచే తిథిని నిశ్చయించి ప్రతాదులనాచరించినచో అక్షయఫలము లభించును. ధర్మము వేదప్రణిహితము. ధర్మముచే శ్రీహరి సంతోషించును. కావున ధర్మపరులు శ్రీ విష్ణువుయొక్క పరమపదమును చేరెదరు. ధర్మమునాచరించదలచువారు సాక్షాత్తు శ్రీకృష్ణస్వరూపులు. కావున ధర్మా చారపరులను సంసారవ్యాధి తాకజాలదు.

ఇది శ్రీ బృహాన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున తిథ్యాధినిర్ణయమను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.