నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

66 - అధ్యాయము

సనత్కుమార మహర్షి పలికెను :- తరువాత శ్వాసానుసారముగా భూమి మీద పాదము నుంచి సముద్రములు మొలనూలుగా ధరించి పర్వతములను స్థనమండలము గల విష్ణుపత్నీ ! నీకు నమస్కారము. నా పాదస్పర్శను క్షమించుము అని భూమిని ప్రార్థించి యథావిధిగా తిరుగవలయును. తరువాత గ్రామమునకు నైఋతి దిక్కునకు వెడలి ఈ మంత్రమును పలుకవలయును. ఋషులు దేవతలు పిశాచములు గుహ్యములు పితృభూత గణములందరూ ఇట నుండి వెళ్ళుడు. నేను మలమోచనమును చేతును. అని మూడుమార్లు చప్పట్లు కొట్టి తలకు  వస్త్రమును చుట్టి రాత్రి అయినచో దక్షిణా ముఖముగా, పగలు ఉత్తరాభిముఖముగా కూర్చొని మల విసర్జనగావించి మట్టిచే నీటిచే శౌచమునాచరించవలయును. లింగమున ఒకసారి మట్టి, గుదమున మూడుమార్లు వామకారమును పదిమార్లు, చేతులకు ఏడుమార్లు, పాదములకు మూడూమూర్లు గండూషమునాచరించవలయును. తరువాత ఈ మంత్రముచే వనస్పతిని ప్రార్థించవలయును. ఆయుష్యమును, బలమును, యశమును, వర్చస్సును, సంతానమును, పశువులను, ధనమును, శ్రీని, ప్రజ్ఞను, మేధస్సును నీవు నాకిమ్ము. ఇట్లు ప్రార్థించి పన్నెండు అంగుళములు కల దంతకాష్ఠమును తీసుకొని మంత్రమును పొందినవాడు. కామమంత్రముచే సావధానుడై కామదేవపదము సర్వజనప్రియము హృదయాంతరమున కామబీజాడ్యము నుండు దంతములను ఈ కాష్టముచే శోధించవలయును. వాగ్భవమగు మూలముచే నాలుకను గీచుకొని ముఖ ప్రక్షాలనమును గావించవలయును. తరువాత దేవాలయమునకు వెళ్ళి నిర్మాల్యమును తీసివేసి శుద్ధవస్త్రమును ధరించి మంగళహారతి నీయవలయును. అస్త్రముచే పాత్రను ప్రోక్షించి మూలమంత్రముచే జ్వలింప చేయవలయును. చక్కగా పూజించి పాత్రను తీసుకొని లేచి ఘంటానాదమును చేయవలయును. మంచి ఆవు నెయ్యితో వెలిగించిన దీపమును అంతటా త్రిప్పి సుందరమును వాద్యగీతములచే దేవునికి ఆరతీయ వలయును. ఇట్లు నీరాజనమును చేసి తన ఇష్టదేవతను ప్రార్థించి, దేవతాగుణములను కీర్తించుచు నదీ ప్రాంతమునకు స్నానమునకు వెళ్ళవలయును. అట్లు వెళ్ళి తీర్థమునకు  నమస్కరించి స్నానీయపాత్రను ఉంచి, మూలమంత్రముచే మంత్రించబడిన మట్టిని తీసుకొని కటీ ప్రాంతము నుండి పాదముల వరకు వ్రాసుకొని తీర్ధజలముచే క్షాలనము చేయవలయును. తరువాత అయిదు మార్లు మట్టిలో పాదములను కడిగి జలాంతర్భాగమున ప్రవేశించి నాభిమాత్రమున వామహస్తమునను, మణి బంధమున, అరచేతిలో, చేతిముందు భాగమున అంగుళులచే గంగామృత్తికను వ్రాసి దానిని అస్త్రముచే మరల తన మీద చుట్టి వదలవలయును. అరచేతిలో ఉన్నదానిని షడంగముల యందు ఆ మంత్రములచే వ్రాయవలయును. మునిగి చక్కగా క్షాలన చేయవలయును. దీనిని మలస్నానమందురు. ఇట్లు ఇష్టమయముగా భావించి ఆంతర స్నానమును ఆచరించవలయును. అనంతాదీత్య సంకాశుడు, నిజభూషాయుధములతో కూడియున్న మంత్రమూర్తియగు ప్రభువును స్మరించి తత్పాదోదకసంభవయగు ధారను బ్రహ్మా రంధ్రముచే తన శరీరమున ప్రవేశించుచున్న జలముచే దేహాంతర్గతమగు మలమునంతటిని క్షాళన చేయవలయును. ఇట్లు చేసినచో మంత్రమును పొందినవాడు వెంటనే దుమ్ము తొలగినవాడై స్పటికము వలె అగును. తరువాత శ్రాతోక్త విధిచే సావధానముగా స్నానము చేసి మంత్ర స్నానమునాచరించవలయును. ఆ విధానమును ఇప్పుడు చెప్పుచున్నాను.

దేశకాలములను కీర్తించి, ప్రాణాయామమును చేసి షడంగన్యాసము గావించి, ముష్టిముద్రచే అర్కమండలము నుండి తీర్థమునాహ్వానించ వలయును. బ్రహ్మండోదరమునుండి మకరములచే స్పృశింపబడిన తీర్థమున ఓ దివాకరా సత్యముతో నాకిమ్ము. ఓ గంగా ! యమునా ! గోదావరీ ! సరస్వతి ! నర్మదా ! సింధూ ! కావేరీ ! మీరందరూ ఈ జలములో నిలువుడు. అని జలమున ఆవాహన చేసి సుధాబీజముతో యోగము చేయవలయును. గోముద్రచే అమృతమును చేసి కవచముచే అవగుంఠనము చేసి అస్త్రముచే రక్షగావించి చక్రముద్రను చూపవలయును. అచట సూర్యచంద్ర అగ్నిమండలములను ధ్యానించవలయును. ఆ జలమును సూర్యమంత్రముచే సుధాబీజముచే మంత్రించవలయును. మూలమంత్రముచే పదకొండుమార్లు మంత్రించి భావించవలయును. ఆ మధ్య భాగమున పూజాయంత్రమును స్థాపించి స్వాంతమునుండి దేవతనావాహించి స్నానము చేయించి మానసోపచారములచే పూజించవలయును. సింహాసనముననున్న ఆ దేవతను నమస్కరించి, ఆ జలమునకు నమస్కరించవలయును. సర్వభూతములకు ఆధారములు సాటిలేని తేజస్సుగల విష్ణువునుండి పుట్టినవి, విష్ణురూపములు ఆయిన జలములను  నేను నమస్కరించుచున్నాను. ఇట్లు నమస్కరించి ఆరాధించి సప్త చిత్రములను సాధకుడు ఏర్పరిచి ఆ జలములో మునిగి మూలమగు దేవాకృతిని స్మరించవలయును. మునిగి లేచి. బ్రహ్మ ముద్రచే శిరస్సు పై జలమును చల్లవలయును. తన శరీరమును మూడు మార్లు మూలమంత్రముచే, నాలుగు సార్లు మంత్రములచే అభిషేకము చేయవలయును. ఆ నాలుగు మంత్రములు ఇచట చెప్పుచున్నాను.

ఇవి నాలుగు మంత్రములు. అఖిల ప్రపంచమును సృష్టించు ప్రజాపతికి శుక్రరూపము, సర్వభూతములకు మాతృస్వరూపములైన ఆపోదేవులు నన్ను పవిత్రుని చేయుగాక. సర్వ భూతములలో మలరూపముగా నున్న అ లక్ష్మిని స్పర్శమాత్రముచే క్షాళనము చేయు ఆపోదేవులు నన్ను పవిత్రుని చేయుగాక. నా కేశములలో, సీమస్తమున, శిరస్సున, లలాట మున,కర్ణములలో నేత్రములలో నున్న దౌర్భాగ్యమును జలములు నశింపచేయుగాక. అట్టి జలములకు నమస్కరించుచున్నాను. అని పై మంత్రముల కర్థము. ఆయుష్యమును ఆరోగ్యమును, ఐశ్వర్యమును, శత్రునాశమును, శుభమును, సంతోషమును, శాంతిని, ఆస్తీక్యమును, విద్యను నాకు ప్రసాదించు జలములకు నమస్కారము. బ్రాహ్మణపొదజలమును పానము చేసిన తరువాత శాలగ్రామశిలాజలమును పానము చేయవలయును. విపరీతముగా నాచరించరాదు. ఇది నియతవిధి. భూమి మీద నున్న సర్వతీర్థములు బ్రాహ్మణోత్తముని దక్షిణపొదమున నుండును. మంత్రమును పొందినవాడు మార్తాండమండలమున స్వేషదైవమును ఉద్వాసన చేసి తీరమున కొత్త వస్త్రమును ప్రయత్నముచే శుద్ధి చేసుకొని, వస్త్రములను ధరించి బుద్ధిమంతుడు సంధ్యాదికము నోచరించవలయును.రోగాదులచే శక్తి లేని వాడు అఘమర్షణము నోచరించవలయును.లేనిచో భస్మస్నానమును కానీ రజస్నానమును కొని చేయవలయును. తరువాత శుభాసనమున కూర్చుండి సంధ్యాదికము నాచరించవలయును. కేశవ నారాయణ మాధవ నామములతో జలప్రోశనము గావించి, గోవింద విష్ణునామములతో కరప్రకొలనము గావించి, మధుసూదన త్రివిక్రమ నామములతో ఓష్ఠములను మార్జన చేయవలయును. వామన శ్రీధర నోమములతో ముఖమును, హస్తములను స్పృశించవలయును. దామోదరనామముతో మూర్థను, సంకర్షణ నామముతో ముఖమును, వాసుదేవ ప్రద్యుమ్న నామములతో నాసికలను స్పృశించవలయును. అనిరుద్ద పురుషోత్తను సొమములతో నేత్రములను స్పృశించవలయును. అధోక్షజ నృసింహనామములతో శ్రవణములను స్పృశించవలయును. అచ్యుత నామములతో భుజములను స్పృశించవలయును. దీనిని వైష్ణవాచమనమందురు. ప్రణవాదిగా నమోంతముగా కేశవాది నామములతో ప్రదేశినీతో ముఖమున నొపికలలో, అనామికతో , నేత్రకర్ణములయందు, కనిష్టతో నాభిదేశమున, ఇతర ప్రదేశములలో అంగుష్ఠముతో యోజన చేయవలయును. స్వాహాంతములైన శివతత్త్వములతో చేయునది శైవాచమనము. దీర్ఘత్రయేందుయుక్ వ్యోమపూర్వకముగా జలపానము చేయవలయును. శివతత్త్వములచేతనే స్వాహాంతములుగా శైవము చెప్పబడినది. వాగ్లజ్జా శ్రీముఖములుగా స్వాహాంతములుగా శాక్తా చమనము చెప్పబడినది. వాగ్లజ్జశ్రీ ముఖములుగా ద్విజాచనము అర్థప్రదమని చెప్పబడినది. తరువాత ఫాల భాగమున గదాకారముగా చక్కగా తిలకధారణచేయవలయును. హృదయమున నందకాకారముగా, భుజద్వయమున శంఖచక్రములను, మస్తకమున శార్జబాణములను, క్రమముగా నుంచవలయును. కర్ణమూలములందు, పార్శ్వభాగములలో, పృష్ఠ భాగమున, నాభియందు, కకుద్భాగమున తీర్దోద్భవాదులకు మృత్తికలతో వైష్ణవుడు తిలకధారణ చేయవలయును. శైవులు అగ్నిహోత్రోద్భవమగు భస్మమును “కింవాగ్ని” అనుమంత్రముచే పంచమంత్రములచే అభిమంత్రణము చేసి, క్రమముగా తత్పురుష అఘోర, సద్యోజాతాని నామములచే అయిదు ఫౌల, అంస, ఉదర హృదయములలో త్రిపుండ్రములను ధరించవలయును. శైవుడు శాకుడు త్రికోణాకారముగాని, నొరీవలేకాని పుండ్రమును ధరించవలయును. వైదికసంధ్యావందనమాచరించిన తరువాత తాంత్రిక విధినొచరించవలయును. వీధోనోక్తముగా ఆచమనమును గావించి, మొదటి దానివలే తీర్ధములనావాహన చేసిన తరువాత భూమి పై మూడుమార్లు దర్భతో నీరుచల్లవలయును. ఏడుమార్లు ఆ జలముతో శిరస్సున చల్లుకొనవలయును. తరువాత ప్రాణాయామమును చేసి షడంగన్యాసమును చేసి ఎడమచేతిలో నీరు తీసుకొని కుడిచేతితో కప్పి ఆకాశవాయు అగ్నిజలభూ బీజములతో అభిమంత్రించి మూలమంత్రముచే తత్త్వముద్రలో ఆ జలబిందువులను ఏడుమార్లు శిరస్సున చల్లుకొనవలయును. అట్లు చల్లుకొనగా మిగిలిన జలమును నొసిక సమీపములకు తేవలయును. తేజోమయమైన ఆజలమును ఇడామార్గము ద్వారా నాసికలోనికి ఆకర్షించి దానితో నాసికాంతర్గతకల్మషమును ప్రక్షాళన చేసి మరల ఆజలమును పింగలమార్గముతో బయటికి విడువవలయును. తరువాత కల్పించబడిన కులిశోపలముమీద ఆ జలమును అస్త్రముచే విడువ వలయును. దీనినే సర్వపాపహరమగు అఘమర్షణమందురు. తరువాత. హస్తప్రక్షాళనము గావింప మొదటివలె ఆచమనమును గావించి, లేచి మంత్రజ్ఞుడై తామ్రపొత్రమున పుష్పాదీకమునుంచి మూలాంతములచే మంత్రమునుచ్చరించును రవిమండలాంతర్వర్తియగు దేవునికి అర్ఘ్యమును కల్పించవలయును. అట్లు అర్ఘ్యప్రదొనమును గావించి మూడుమార్లు ఈ మంత్రముచే దేవుని స్మరించవలయును. తరువాత స్వకల్పోక్తప్రకారముగా అష్టోత్తరశతపర్యాయము గాయత్రీ మంత్రజపమునాచరించవలయును. లేనిచో ఇరువై ఎనిమిది మార్లు జపించవలయును. తరువాత ‘గుహ్య’ అనుమంత్రముచే అర్పణ చేయవలయును.

నక్షత్రయుక్తమైన ఆకాశమున ఉదయించుచున్న సూర్యునికాంతి గల, పుస్తకాక్షమాలలు చేతి యందు ధరించి యున్న, కృష్ణాజినాంబరయగు సరస్వతిని ధ్యానించవలయును. మధ్యాహ్నమున వరదయగు పార్వతీదేవిని స్మరించవలయును. ఈ పార్వతీదేవిని, శుక్లాంబరవృషారూఢ, త్రినేత్ర కవిబింబగత, శ్రేష్టముగు పొశమును శూలమును, కపాలమును ధరించిన దేవిగా స్మరించవలయును. సాయంకొలనున రత్నభూషాడ, పీతకౌశేయనస్త్ర, శ్యామర, చతుర్లస, శంకచక్రధారిణీ, గదాపద్మ దొరికి, సూర్యాసనకర్యాశ్రయయగు దేవిని స్మధించవలయును. తరువాత నిధానమును తెలిసినవారు  దేవతలను, ఋషులను, పితృదేవతలను తృప్తిపరిచి, తన ఇష్టదేవతకు తర్పణము చేయవలయును, తరువాత గురు పరంపరను పూజించి సాయుధుడగువైనతేయునీ తప్పుని గోవించవలయును. నారదుని, పర్వతుని, జిష్ణుని, నిశరుని, ఉద్ధవదొరుకులను, విష్వక్సేనుని, శైతేయుని వే విష్ణుభక్తులు పూజించవలయును. తర్పణము చేయవలయును. ఇట్లు తర్పణములను గావించి సూర్యునికీ ఆర్యమునిచ్చి, పూజాకారమునకు వచ్చి పొదప్రక్షాళనమును గావించి ఆచమనమును చేయవలయును. అగ్నిహోత్రశాలలో నున్న అగ్న్యుపస్థానమును గావించి హోమములు చేసి, పూజాస్థలముమకొచ్చి ద్వారపూజ నోచరించవలయును. ఊర్ధ్వభాగమున గణేశుని, దక్షిణ భాగమున మహాలక్ష్మిని, వామభాగమున సరస్వతిని, దక్షిణ భాగమున విఘ్నేశ్వరుని, వామభాగమున యమునా నదినీ, దక్షిణ భాగమున ధాతను, వామభాగమున విధాతను, వామభాగమున శంఖమును, దక్షిణ భాగమున పద్మవిధినీ, తరువాత ఆయా కల్పములలో చెప్పబడిన ద్వారపాలకులను పూజించవలయును. నందుడు, సునందుడు, చండుడు. ప్రచండుడు, ప్రచలుడు, బలుడు, భద్రుడు, సుభద్రుడు మొదలగు వోరు విష్ణుద్వారపాలకులు. నంది, భృంగి, రిటీ, స్కందుడు గణేశుడు, ఉమా మహేశ్వరుడు, వృషభుడు, మహాకాలుడు వారు శైవద్వారపాలకులు. బ్రాహ్మి మొదలగు అష్టమాతృదేవతలు, స్వయముగా శక్తి రూపముగా ద్వార దేశముననుందురు. తరువొత శుచియై ఆసనమున కూర్చుండి ఇంద్రియనిగ్రహము కలవాడై దివ్య, అంతరీక్ష, భౌమవిఘ్నములను తొలగించుకొని, విష్ణుభక్తాగ్రేసరులు కేశవాని మాతృకలను న్యాసము చేయవలయును. కేశవుడు కీర్తితో కలిసియుండును. నారాయణుడు కాంతితో, మాధవుడు తుష్టితో, గోవిందుడు పుష్టితో, విష్ణువు ధృతితో మధుసూదనుడు శాంతితో, త్రివిక్రముడు క్రియతో, వామనుడు దయితతో, శ్రీధరుడు మేధతో, హృషీ కేశుడు హర్షతో, పద్మనొభుడు శ్రద్ధతో, దామోదరుడు లజ్జతో, వాసుదేవుడు లక్ష్మితో, సంకర్షణుడు సరస్వతితో, ప్రద్యుమ్నుడు ప్రీతితో, అనిరుద్ధుడు రతితో, చక్రి జయతో, గదీ దుర్గతో, శార్జీప్రభతో, ఖడ్గసత్యతో, శంఖి చండతో, హాలి వాణితో, ముసలి విలా సీనితో, శూలి విజయతో, పొశి విరజితో, కూకి విశ్వతో, ముకుందుడు వినతతో, నందజుడు సునందతో, నంది స్మృతితో, నరుడు వృద్ధితో, నరకజిత్తు సమృద్ధితో, హరిశుద్దితో కూడియుండును. కృష్ణుడు బుద్ధితో, సత్యుడు భుక్తితో, సాత్వతుడు ముక్తీతో, సౌరి క్షమతో, సూరమతో, జనార్థనుడు ఉమతో, భూధరుడు శ్లేదినితో, విశ్వమూర్తి క్లిన్నతో, వైకుంఠుడు వసుధతో, పురుషోత్తముడు వసువుతో, బలి పరతో, బలానుజుడు పరాయణతో, బాలుడు సూక్ష్మతో, వృషఘ్నడు సంధ్యతో, వృషుడు ప్రజ్ఞతో, హుసుడు ప్రభతో, వరొపుడు నీశతో, విమలుడు ధోరతో, నృసింహుడు విద్యుత్ తో కూడియుండును. కేశవాది మాత్సకలకు నారాయణముని చేప్పబడెను. గాయత్రీ ఛందస్సు, విష్ణువు దేవత, చక్రాద్యాయుధములతో కూడియున్న కుంభఆదర్శధరుడగు, లక్ష్మీసహితుడు, విద్యున్సీభుడు, బహుభూషాయుతుడగు శ్రీహరిని భజించవలయును. ఇట్లు ధ్యానించి శ్రీకామపుటితాక్షరయగు శక్తిని న్యౌసము చేయవలయును. ఆ విష్ణు శక్తులతోప్రణవాదికమును హృదయముకు చెప్పవలయును. త్వక్, అస్పక్ మాంస, మేదో, అస్థి, మజ్జ, శుక్రోద్యస్తువులను చెప్పవలయును. ప్రాణమును, క్రోధమును, మదమును, మొదలగు వాటిని దిక్కులలో నుంచవలయును. మౌళియందు ఒకటి, ముఖమున ఒకటి, నేత్రములలో రెండు, చెవులలో రెండు, నాసికలలో రెండు, కపోలములయందు రెండు, దంతములలో రెండు, ఓష్ఠములలో రెండు, రసనామూలమున ఒకటీ, కంఠమున ఒకటి, ఉంచవలయును. దక్షిణ బాహవున కవర్గను, వామబాహువున చవర్గము, టతవర్గలను పొదములలో, పఫలను కుక్షిలో వుంచవలయును. పృష్ణవంశమున అనుదానిని, నాభిలో ఛంను, హృదయమున మంను, యాది సప్తధాతువులను హంను ప్రాణమున, ఆత్మలో లంను, క్రోధమున క్షంను, క్రమముగా నుంచి విష్ణుపూజాయోగ్యుడగును.

ఇక ఇపుడు శైవశక్తులను మాతృకలను చెప్పుచున్నాను. శ్రీకంఠుడు పూర్ణోదరితో అనంతుడు వీజరతో, సూక్ష్మేశుడు శాల్మలితో, త్రిమూతకుడు లోలాక్టితో మహేశ్వరుడు వర్తులాక్టితో అధీశుడు దీర్ఘఘాణతో, భారభూతి దీర్ఘముఖితో, తిధీశుడు గోముఖితో యుండును. దీర్ఘ జిహ్వతో స్థావరేశుడు, కుండోదరితో హరుడు, ఉర్ధ్వకేశితో ఘంటీశుడు, వికృతాస్యతో భౌతికుడు, సద్యుడు జ్వాలాముఖితో, ఉల్కాముఖితో అనుగ్రహుడు, ఆస్యతో అక్రూరుడు, విద్యతో మహా సేనుడు, మహాకాళితో క్రోధీశుడు, సరస్వతితో చండేశుడు, సిద్దగౌరితో పంచాంతకుడు, త్రైలోక్యవిద్యతో ఓరోత్తముడు, ఏకరుద్రకుడు మంత్రశక్తితో యుండును. కూర్మేశుడు కమఠితో, ఏకనేత్రుడు భూతమాతతో, చతుర్వకూడు లంబోదరితో, అజేశుడు ద్రావిణితో, సర్వేశుడు నాగరితో, సోమేశుడు ఖేచరితో, లాంగలీశుడు మర్యాదతో, దొగు కేశుడు రూపిణీతో, అర్థనారీశుడు వారుణితో, ఉమాకాంతుడు కాకోదరితో, ఆషాఢ పూతనతో యుండును. దండేశుడు. భద్రకాలితో, అత్రీశుడు యోగినితో, శంఖినితో మీనేశుడు, తర్జనితో మే షేశుడు, కొలరాత్రితో లోహితుడు, కుజనితో శిఖీశుడు, కపర్దినితో ఛలగండుడు, వజ్రతో ద్విరుడేశుడు, జయతో మహాబలుడు, సుముఖేశ్వరితో బలీశుడు, రేవతితో భుజంగుడు, మాధవితో పినాకి కలిసియుండును. ఖడీశుడు పొరుణితో, బకేశుడు వాయవితో, శ్వేతోరస్కుడు వీదొరిణితో, భృగువు సహజతో, లకులీశుడు లక్ష్మితో, శివేశుడు వ్యాపినితో, సంవర్తకుడు మహామాయతో యుండును. వీరందరు శ్రీకంఠమాతృకలు. పోరి ఈశులుగా చెప్పబడిరి. ఈశ పదము చెప్పని ప్రదేశమునంతట ఈశపదమును చేర్చవలయును. ఈ మాతృకలను ముని దక్షిణామూర్తి గాయత్రీ ఛందస్సు చెప్పబడినది. అర్థనారీశుడు దేవత. అఖిలప్రాప్తి కొరకు వినియోగము, హలము బీజములు స్వరములు శక్తులుగా చెప్పబడినవి. షడ్డీరములతో కూడిన భృగుస్థాకాశముతో అంగన్యాసమును చేయవలయును. బంధూక స్వర్ణవర్ణంగుడు, వరాక్ష అంకుశ పొశధారి, త్రినేత్రుడు దేవవంద్యుడు అగు - అర్రేన్దు శేఖరుని చింతించవలయును. ఇట్లు హృదయాంతమున నాలుగు విధములుగా శివశక్తులను ధ్యానించి మాతృకాస్థలమున సౌబీజమాతృకాపూర్వమున మాతృకాన్యాసమును చేయవలయును. విఘ్నేశ్వరుడు హీతో, విఘ్నరాజు శ్రీతో, వినాయకుడు పుష్టితో, శివోత్తముడు శాంతితో, విఘ్నకొరకుడు స్వస్తితో, విఘ్నహర్త సరస్వతీతో, గణనాధుడు స్వాహాదేవితో, ఏకదంతుడు సుమేధతో, ద్విదంతుడు కాంతితో, గజవక్తూడు కామినితో, నిరంజనుడు మోహినితో కపర్ది నటితో, దీర్ఘజిహ్వుడు పొర్వతితో, శంకుకర్లకుడు జ్వాలినీతో కలిసి యుండును. వృషధ్వజుడు నందతో, గణనాయకుడు సురేశితో, గజేంద్రుడు కామరూపిణీతో, శూర్పకర్ణుడు ఉముతో, విరోచనుడు తేజోవతితో, లంబోదరుడు సత్యతో, మహానందుడు విఘ్నేశితో, సదాశివుడు కోమదతో, ఆమోదుడు మద జిహ్వాజో, దుర్ముఖుడు భూతితో, సుముఖుడు భౌతికితో, ప్రదుడు సీతతో, ఏకపాదుడు ధమతో, ద్వీజిహ్వుడు మహిషీతో శూరనామకుడు జంఖనితో కలిసియుండును. వీరుడు వీకర్లతో, షణ్ముఖుడు భృకుటితో, వరదుడు లజ్జతో, వామదేవేశుడు దీర్ఘఫణతో, వక్రతుండుడు ధనుర్ధరితో, ద్విరుడుడు యామీనితో, సేనాని రాత్రితో, కామాంధుడు గ్రాముతో, నుశుడు శశిప్రభతో, విముడు లోల నేత్రతో, మత్త వాహుడు చంచలతో, జటిదీప్తితో, ముండి సుభగతో, ఖడ్డి దుర్బగవో, పదేణ్యుడు శివతో, ప్పష కేతనుడు భగతో, భక్ష్య ప్రియుడు భగినీతో, గణేశుడు భగినీతో, మేస్తునోధుడు సుభగతో, హ్యాపీ కొలత్రితో కలిసి యుండును. గణేశ్వరుడు కాలికతో ఉండును. వీరందరూ విఘ్నేశ మాతృకలుగా చెప్పబడిది. ఈ గణేశమాతృకాగణము మునులచే చెప్పబడినది. ఈ గణమునను త్రివృద్గాయత్రీ ఛందస్సు. శక్తి గణేశ్వరుడు దేవత. ఘర్షీర్ఘబీజముతో అంగన్యాసము చేసి స్మరించవలయును. పాశాంకుశాభయవరములను ధరించువాడు, కంజహస్తు యగు పత్నిచే కూడియున్నవాడు రక్త తనువు త్రినేత్రుడు గణాధిపతియగును. ఇట్లు ధ్యానించి స్వీయ బీజుపూర్వోకరాన్వితముగా న్యాసమును చేయవలయును. నివృత్తి ప్రతిష్ట, విద్యా, శాంతి, ఏధికి, దీపికా, చికా, చిర, పలా, సూక్ష్మా, అసూక్ష్మా, అమృతా, జ్ఞానామృత, ఆప్యాయనీ, వ్యా పినీ, వ్యోమదూపో, ఆనంతో, సృష్టి, సమృద్ధితో, స్మృతి, మేధా, కాంతి, లక్ష్మి, ధృతి, స్థిరా, స్థితి, సిద్ధి, జరా, పాలీనీ, క్షాంతి, ఈశ్వరి, రతి, కామిక, వవరదా, హోదినీ, ప్రీతి సంయుతా, దీర్ఘా, తీక్షా, రౌద్రా, నిద్రా, తంద్రికా, కుథొ, క్రోధినీ, క్రియాకారీ, సమత్యుకా, పీత, శ్వేతా, అరుణా, అపీతో, అసంలో, అనువొరు కలామాతృకలు. ఆయా మాత్సర్టులో చోరి చోరిని పూజించవలయును. కలామాతృకలకు ముని ప్రజాపతి. గోయత్రి ఛందస్సు. శారద దేవత హ్రస్వదీర్ఘాంతర తారలతో షడంగన్యాసమును చేయవలయును. పద్మ చక్ర, గుణ, ఏణములను ధరించునది, త్రిలోచన, పంచవక్త, ముక్తాభూషయగు భారతిని భజించవవలయును. ఇట్లు తాగపూర్వముగా భోగతిని ధ్యానించి కన్వితముగా జన్హన్యాసము చేయవలయును. తరువోత మూలమంత్రమునకు షడంగన్యాసమును చేయవలయును. హృదయాది చతుర్థ్యంతముగా జాతిసంయోజనము గోవించి న్యాపము గావించవలయును. నమః, స్వాహా, వషట్, హుం, పౌషట్, ఫట్, అనునవి జాతులుగా చెప్పబడినవి. తరువాత తమ ఇష్టదైవమును భూషాఆయుధ సమన్వితముగా ధ్యానించి, ఇష్టదేవతామూర్తి లో షడంగన్యాసమును చేసి పూజనోరంభించవలయును.

ఇది శ్రీ బృహన్నొరదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయసాదమున సంధ్యాదినిరూపణమను అరువది ఆర - అధ్యాయము సమాప్తము.