నారద మహా పురాణము - పూర్వార్థము
77 - కార్యవీర్యకవచకథనమ్
నారద మహర్షి పలికెను :
ఓ సర్వ తంత్ర విశారదా !మహాప్రాజ్ఞా ! మీరు నాకు తంత్ర రహస్యమును చెప్పితిని.
ఓ మహానుభావా " కృపానిధీ ! ఇపుడు" కార్యవీర్య కవచమును హనుమత్కవచమును వినగోరుచున్నాను. కావున చెప్పుము.
సనత్కుమార మహర్షి పలికెను : ఓ నారదా పరమాశ్చర్యకరమైన కార్తవీర్యుని కవచమును చెప్పెదను వినుము. ఈ కవచముచే కార్తవీర్యార్జునుడు ప్రసన్నుడై కార్య సిద్ధిని ప్రసాదించును. సహస్ర సూర్యసన్నిభము, నానోరత్నసముజ్జ్వలము, ప్రకాశించు ధ్వజపతాకయుతము దశసహస్ర తురగ భూషితము ప్రళయకాల సముద్ర భయంఘోష వలె ధ్వనించునది, మహాఛత్రములచే వితానముగా చేయబడిన ఆకాశముగలది, సోనాయుధ విరాజితము అగు మహారథవరమున చక్కగా కూర్చొని యున్నవాడు, వీపులోదారుడు, సహస్రభుజమండితుడు వామ బాహువులచే ఉద్దండమగు కోదండములనను, దక్షిణ బాహువులచే శరములను ధరించియున్నవాడు, కిరీటహారముకుట కేయూర వలయాంగదముద్రికోదరబంధాదులచే, మౌంజీనూపురజాదులచే భూషితుడు, వివిధ కల్పములు భాస్వరములు అగు మహాధనములచే ఆబద్ధకవచుడు, వీరుడు. సుప్రసన్నాననొంబుజుడు ధనుర్ద్యా సింహనాదములచే జగత్తయమును. కంపింపచేయుచున్నవాడు, సర్వశత్రక్షయకరుడు, సర్వసంపత్సదాత, విజయశ్రీని షేవితుడు, సర్వసౌభాగ్యప్రదుడు, భద్రుడు, భక్తాభయవిధాయి, దీవ్యమాల్యాను లేపాడ్యుడు, సర్వలక్షణసంయుతుడు, రధగజ అశ్వపోదాతబృందమధ్యగతుడు, ఈశ్వరుడు. వీరదుడు, చక్రవర్తి, సర్వలోకైక పాలకుడు, సమానోదిత సాహస్ర దివాకర సమప్రభుడు, మహాయోగ భవైశ్వర్య ర్యాక్రాంత జగయుడు, శ్రీహరి చక్రాంశగా అవతరించిన వాడు, అగు కార్తవీర్యార్జునుని చక్కగా ఆత్మాధిభేదముచే ధ్యానించి రక్షను పలుకవలయును. కార్తవీర్యార్జునుని అయిదు అంగమూర్తులు స్పటికోజ్జ్వలులు నన్ను రక్షింతురు గావుత. ఆగ్నేయ ఈశాన్యనైబ్రుతి వాయవ్య కోణములందు హృదయాదికములు, అంతట అస్త్రజ్వలద్రూపులు శంఖ చర్మ ఖడ్గపాణులు ఆవ్యాహత బలైశ్వర్య శక్తి సామర్థ్య విగ్రహులు కాపాడుదురు గావుత. క్షేమంకరీ శక్తియుతుడు చోరగర్వభంజకుడు, బాణధనుర్ధారియగు కార్తవీర్యార్జునుడు తూర్పు దిక్కున నన్ను కాపాడు గౌవుత. శ్రీకరీశక్తిసహితుడు మారీ భయవినాశకుడు, శరచాపధరుడు శ్రీమంతుడు సర్వశత్రు వినాశకుడు మ హేషుచాపధరుడు పశ్చిమ దిక్కును కాపాడుగావుత, యశఃకరీయుతుడు, దైత్యసంఘవినాశకుడు ఆగ్నేయకోణమును కాపాడు గోవుత, విద్యాకరీ సమాయుక్తుడు మహద్దుఃఖనాశకుడు, చాపపాణియగు ఈశ్వరుడు నైఋతదిక్కును కాపాడుగావుత. ధనకరీ సమాయుతుడు మహాదురిత నాశకుడు ధనుర్బాణధారి వాయవ్యదిశను కాపాడుగావుత. ఆయుఃకరీయుతుడు శ్రీమంతుడు, మహాభయవినాశకుడు చా పేషుధరుడు ఈశాన్య దిక్కును కాపాడుగావుత. విజయ శ్రీయుతుడు చక్రధారి, విభువు, సర్వదుష్టభయంకరుడు ఊర్ద్వదిక్కును కాపాడు గావుత. సుమహాశక్తి సంయుతుడు, శంఖధారి అధర దిక్కును కాపాడుగావుత. మహాయోగ సమాయుక్తుడు సర్వదిక్బక్రమండలుడు, మహాయోగీశ్వరుడు, పద్మధారి అంతటా : కాపాడు గావుత. ఈ మూర్తులు రక్తవర్లులు రక్తమాల్యాంబరధారులు, ప్రధానదేవతారూపులు విడిగా రథమున నుందురు. శక్తులు పద్మహస్తులు నీలేన్జీవర సన్నిభులు శుక్లమాల్యాంబరధారులు చక్కగా అలదిన చందనము కలవారు, వారి పారదేశ్వరులు స్వస్వవాహన ఆయుధ భూషణధారులు, తమ తమ దిక్కులలో ఉన్నవారు మహాబలులగు ఇంద్రాదులు నన్ను కాపాడు గావుత. వీరందరు కార్తవీర్యార్జునుని ఆవరణ దేవతలు. సర్వశక్తి సమన్వితులు అంతటా అన్ని వేళలా నన్ను కాపాడుగావుత.. హృదయమున, ఉదరమున, నాభియందు, గుహ్యమండలమున "తేజోరూపులుగానుండు అభీష్ట కల్పవృక్షములు కాపాడు గోవుత. మహావర్లులు మన్త్ర రూపులు మహోజ్జ్వలులు వ్యాపకముగా ఆపాదతల మస్తకముగా నన్ను కాపాడు గౌవుత. కార్తవీర్యుడు శిరమును, హైహయేశ్వరుడు. లలాటమును, సుముఖుడు ముఖమును, వ్యాప్త జగత్తయుడు కర్ణములను కాపాడుగావుత. సుకుమారుడు హనువును. భ్రూయుగమును ధనుర్ధరుడు, నయనమును పుండరీకాక్షుడు నాసికను గుణాకరుడు, అధరోషమును బ్రహ్మజేయుడు, దంతములను కవి , కాపాడుగావుత. సర్వశాస్త్రకళాధరి జిహ్వను, అవ్యయుడు చిబుకమును, సర్వార్థదుడు కరములను, జగతియుడు కరాగ్రములను, రేవాంబులీలాదృప్పుడు జఠరమును, 'వీరుడు శూరుడు . నాభిని, సర్వదుష్టహరుడు పార్శ్వములను కాపాడుగావుత. సహస్రభుజధరుడు పృష్టమును, సప్తద్వీపాధిపతి కటిని, ఊరువులను మాహిష్మతీనాధుడు, జానువులను భూవల్లభుడు, వీరాధిపుడు జంఘములను, పాదములను మనోజవుడు, సర్వాయుధధరుడు సర్వాంగములను సర్వమర్మములందు కాసాడుగావుత. ధాత్వష్టకసహిత కలేవరమును సర్వాదుష్టాంతకుడు, ప్రాణాదీశజీవేశులను సర్వశి షేష్టదుడు, జితేంద్రియుడు సర్వేంద్రియములను, ఇంక్గా చెప్పని స్థానములను శరీరాంతర్బహిర్బాగములను సర్వలోక నాగేశ్వరేశ్వరుడు కాపాడుగావుత. ఈ కవచముచే ఆవృతమైన ఈ శరీరము వజ్రము కంటే సారతరము బాధాశత వినిర్ముక్తమగు గావుత. భయరహితమగు గావుత. ఇట్లు అభేద్యమగు కార్తవీర్యార్జునుని కవచమును ధరించి దివారాత్రములు నిర్భయమగు అంతరాత్మతో తిరుగు చున్నాను. రాజమార్గమున, మహాదుర్గమున, చోరనం కులమగు "మార్గమున, విషమారణ్యమున, హోర దవాగ్నియందు, గిరిగుహలందు, సంగ్రామమున, శస్త్ర సంఘాతమున, సింహవ్యాఘని షేవితమగు గుహలందు, సర్వ సంకీర్ణమగు సంధ్యా కాలమున, నృపాలయమున, వివాదమున, విపులావర్తములుగల సముద్రమున, నదీతటమున, పరిపుంధిజనాకీర్ణమగు దేశమున, చోరగణావృతమగు దేశమున, సర్వస్వహరణము సంభవించునపుడు, ప్రాణ సంకటము సంభవించినపుడు, నానారోగజ్వరావేశమున, పిశాచ పేత యాతనలు సంభవించినపుడు, మారీదుస్స్వప్న పీడలందు, క్లిష్టసమయమున, విశ్వాసఘాతకులు ఎదురైనపుడు, శారీర దుఃఖము, మానస దుఃఖము మహాజ్వరము సంభవించినపుడు, ఆధివ్యాధి భయములుత్పన్నమైనపుడు, విఘ్నజ్వాలోపద్రవములు సంభవించినపుడు కూడా కవచములో బద్దుడైన వానికి ఏ భయము కలుగదు. మాకు రాబోవు ద్రవ్యాపహారకులను మహారధుడు బాపుసహస్రములచే నివారించు గావుత. కార్తవీర్యార్జునుడు తమ చేతులలోని పోశములచే బంధించి దుర్జయుల గతిసామర్థ్యము నరికట్టి గౌవుత. బాణసాహస్రముచే ఛేదించు గావుత. రాజచూడామణి నా శత్రువులను ఖడ్గ సహస్రములచే "ఛేదించు గావున, చోరాది దుష్టప్రాణీ సమూహములను ముసలసహస్రములచే భేదించు గావుత. అట్లే స్వశంఖనాదముచే సహస్ర బాహువు చక్రధారి భయ పెట్టు గౌవుత. సాక్షాత్తు శ్రీహరి యవతారమగు కార్తవీర్యుడు నా సమస్తిమును కాపాడుగావుత. ఓ కార్తవీర్యా ! మహావీర్యా ! సర్వదుష్ట వినాశన ! అన్ని వేళలా అంతటా దుష్టులను చోరులను నశింపచేయుము.
నీవు నిద్రపోవుచున్నావా ? ఓ దుష్టనాశకా ? ఏల నిలుచుంటివి ? ఎందుకాలసించుచుంటివి ! రెమ్ము మమ్ములను నీ పుత్రులవలె సర్వభయములనుండి కాపాడుము. చోరులు ధనాపహారకులు, శత్రువులు, హింసకులు, సొధుభీతికరులు, దుష్టఛద్మకులు, దురాశయులు, దుష్టహృదయులు, దుష్టరాజులు, దుష్టమంత్రులు, పాపులు, కార్యలోపమును చేయువారు, ఖలులు, పరిపంధులు, సర్వస్వహారకులు, పంచమాయావులు, మహా క్లేశకరులు, మ్లేచ్చులు, దొంగలు,వృషలులు, అగ్నిదులు, గరదులు, వంచకులు, శస్త్రపాణులు, పాపాత్ములు, దుష్టకర్ములు, దుఃఖప్రదులు, దుష్టబుద్దులు, కపటులు, దుర్మార్గచారులు, నానాభయప్రదులు, ఛిద్రాన్వేషణతత్పరులు, ఎప్పుడూ మమ్ములను భాధించ నుద్యమించువారు, వీరందరు కార్తవీర్యుని మహాశంఖనాదముచే హతులై త్వరగా నశింతురుగావుత. దూరము నుండి మాయామోహితులగుదురుగావుత. దానవులు, దైత్యులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, మహాసత్త్వులు, భుతబ్రహ్మరాక్షసులు, అపస్మారగ్రహములు, పిశితాశన గ్రహము , మహారక్త భోజనులు, భేతాలురు, గుహ్యకులు, గంధర్వులు, అప్సరసలు, సిద్దులు, దేవతలు, డాకినులు, పేతములు, క్షేత్రపాలురు, వినాయకులు, మహావ్యాఘములు, మహామేఘములు, క్షేత్రపాలురు, వినాయకులు, మహావ్యాఘములు, మహామేఘములు, మహాతురగరూపులు మహాగజములు, మహా సింహములు, మహా మహిష జాతులు, ఋక్షవారాహ శునక వానర ఉలూకమూర్తులు, మహోష్ట్ర ఖరమార్జార సర్పగోవృషమస్త కులు, నానారూపులు, మహాసత్త్వులు, నానాక్లేశసహస్రముల నిచ్చు వారు, సొనారోగకరులు, కుద్రులు, మహావీర్యులు, మహాబలులు, వితీకములు, పైత్తికములు, మౌరులు, శ్లేష్మికములు, సన్నిపాత రోగములు, మా హేశ్వరములు, వైష్ణవములు, బ్రాహ్మములు అగు మహాగ్రహములు, స్కాందములు, వైనాయకములు, క్రూరులు, ప్రమధగుహ్యకులు, మహాశత్రుగ్రహములు, రౌద్రములు, మహామారీమ సూరికలు, ఏకాహికములు, ద్వాహికములు, త్ర్యా హికములు చాతురర్థికములు, పాక్షికములు, మాస్యములు, షాణ్మాసికములు, సాంవ త్సరములు దుర్నివార్యములగు జ్వరములు, పరమదారుణ జ్వరములు, స్వాప్నికమహోత్పాతములు, దుస్స్వాప్నికగ్రహములు, కూష్మాండములు, జంభికలు, భౌమములు, ద్రోణులు, సాన్నిధ్యవంచకులు, భ్రమికలు, ప్రాణహర్తలు, బాలగ్రహాదులు, మనోబుద్దీన్జియహరులు, స్పోటకములు, మహాగ్రహములు, మహాశనులు, బలిభుజులు, మహాకుణపభోజనులు, దివాచరులు, రాత్రిచరులు, సంధ్యా చరులు, దొరుణగ్రహములు, ప్రమత్తులు, అప్రమత్తులు, బాధించుటకు ప్రయత్నించువారు. వీరందరు కార్తవీర్యుని ధనువు నుండి వెలువడిన బాణములచే కొట్టబడినవారై సత్త్వబలోద్యమములు భగ్నములై నశించుగావుత. సర్పములు, మహానాగులు, మహాగిరి బలేశయములు, కొలవ్యాలములు, మహాదంష్ట్రలు, మహాజగరములు, అనంతశూలికాదులు, దంష్ట్రావిషమహా భయములు. అనేక శత శీర్షములు, ఖండపుచ్చములు, దారుణములు, మహావిషజలౌకములు, వృశ్చికములు, రక్తపుచ్చకములు, ఆశీవిషములు, కొల కూటములు, మహాహాలాహాలములు, జలసర్పములు, జలవ్యాళములు, జలగ్రాహములు, కచ్ఛపములు, మత్స్యములు, కృత్రిమములు, మహావిషములు, గుప్తరూపులు, గుప్త విషులు, మూషికములు, ఇంటి బల్లులు. నానా విషములు, ఘోరములు, మహావిషసంజ్ఞకములు, ఇవి మమ్ములను శరీరప్రాణనాశముచేసి బాధించదలచినవి కార్తవీర్యుని ఖడ్గ సహస్రములచే ఖండితములై ఇంద్రియ సాహసములు నశించి దూరము నుండే ఖండితములై ఇంద్రియ సాహసములు నశించి దూరము నుండే నశించుగావుత. మనుష్యులు, పశువులు, భల్లూకములు, వానరములు, వనగోచరులు, సింహవ్యాఘవరాహములు, మహిషములు, మహాన్పుగములు, గజములు, అశ్వములు,గవయములు, రాసభములు, శరభములు, వృకములు, శునకములు, పెద్ద పులులు, శ్వభ్రములు, మార్జారములు, బిలము లందుండునవి, శృగాలములు, శశకములు, డేగలు, గరుడపక్టులు, ఇతర పక్షులు, గండభేరుండములు, కాకులు, గద్దలు, హంసాదిపక్షి జాతులు, ఉద్భిజ్జిములు,
అండజములు, స్వేదజములు, జరాయుజములు నానా భోదకులజాతములు, నానాభేదములు, వేరు వేరు జాతులు, సంధ్యాకాలములలో, పగలు, రాత్రి మమ్ముల బాధించ గోరునవన్నియు కార్తవీర్యుని సహస్రగదలచే భిన్నములై గతి పౌరుషములు నశించి దూరము నుండే నశించు గావుత. క్షేమమును తొలగించునవి, కూటమాయావులు, మారణ, ఉత్పాదన, ఉన్మూలన, ద్వేష, మోహనకారకములు, విశ్వాస ఘాతకములు, దుష్టులు, స్వామి ద్రోహులు, ఆతతాయులు, పాపులు, గోప్యహరులు, దోహ, ఉపఘాత, గరల, శస్త్రపాత, అతి దుఃఖములనిచ్చునవి, క్షేత్రవిత్తాదిహారులు బంధనాది భయప్రదులు, వివిధాకారములగు ఈతి బాధలు, ఇతర దుషజాతులు, ఎల్లప్పుడు పీడాకరములు, ఛిద్రాన్వేషకులు, వీరందరు కార్తవీర్యుని సహస్రచక్రములచే ఖండితులై బలసాహసములుడిగి దూరము నుండియే నశింతురుగావుత. మేఘములు, మహావర్షములు, మహావాతములు, విద్యుత్తులు, మహాశనులు, నిర్జాతములు, దారుణములు, ఉల్కాపాతములు, ఘోరములగు మహాంద్రాయుధాదులు, సూర్యచంద్రకుజబుధగురుశుక్ర శని రాహు కేతువులు. నక్షత్రములు, రాశులు, తిధులు, సంక్రమణములు, మాసములు, వత్సరములు, యుగములు, యుగాధిపతులు, మన్వంతరాధిపులు, సిద్దులు, ఋషులు, యోగీ సిద్దులు, నిధులు, బుగ్యజుస్సామాధర్వణ వేదములు. అగ్ని హోత్రములు, ఋతువులు, లోకపాలులు, పితృదేవతలు, దేవతాగణములు, చతుష్టష్టి విద్యలు, భువనత్రయగతములన్నియు, ఇచ్చట చెప్పబడినవి, చెప్పబడనివి, అన్నియు యోగేంద్రుడు అమితద్యుతియగు కార్తవీర్యార్జునుని యాజ్ఞచే మాయెడ సౌమ్యములు సుఖప్రదములు అగుగావుత. కార్తవీర్యార్జునుడు, ధన్వి, రాజేస్తూడు, హైహయేశ్వరుడు, దశాస్యదర్పహంత, రేవాలీలాదృప్పుడు, సుదుర్జయుడు, దుఃఖహా, చోరదమనుడు, రాజరాజేశ్వరుడు, ప్రభువు, సర్వజ్ఞుడు, సర్వప్రదుడు, శ్రీమంతుడు, సర్వశి షేష్టదుడు, కృతీ, రాజచూడామణి, యోగి, సప్తద్వీపాధి నాయకుడు, విజయి, విశ్వజిత్, వాగ్మి, మహాగతి, అలోలుపుడు, యజ్వ, విప్రప్రియుడు, విద్వాన్, బ్రహ్మజేయుడు, సనాతనుడు, మాహిష్మతీ పతి, యోధా, మహాకీర్తి, మహాభుజుడు, సుకుమారుడు, మహావీరుడు, మారీఘ్నుడు, మదిరేకణుడు, శత్రుఘ్నుడు, శాశ్వతుడు, శూరుడు, శంఖభృత్, యోగివల్లభుడు, మహాభాగవతుడు, ధీమంతుడు, మహాభయవినాశకుడు, అసాధ్యుడు, విగ్రహుడు, దివ్యుడు, భావుడు, వ్యాప్తజగత్తయుడు, జితేంద్రియుడు, జితారాతి, స్వచ్ఛందుడు, అనన్త్ర విక్రముడు, చక్రభృత్, పరచక్రఘ్నుడు, సంగ్రమ విధిపూజితుడు, సర్వశాస్త్రకళాధారీ, విరజస్కుడు, లోకవందితుడు, వీరుడు, విమలసత్వాడ్యుడు, మహాబలపరాక్రముడు, విజయశ్రీమహామాన్యుడు, జితారి, మంత్రనాయకుడు,ఖడ్గభృత్, కొమదుడు, కాంతుడు, కాలఘ్నుడు, కమలేక్షణుడు, భద్రవాద ప్రియుడు, వైద్యుడు, విబుధుడు, వరదుడు, వశి, మహాధనుడు, నిధిపతి, మహాయోగి, గురుప్రియుడు, యోగాఢ్యుడు, సర్వరోగఘ్నుడు, రాజితాఖిలభూతలుడు, దివ్యాస్త్రభృత్, అమేయాత్మా, సర్వగోప్తా, మహోజ్వలుడు, సర్వాయుధధరుడు, అభీష్టప్రదుడు, పరపురంజయుడు, యోగసిద్దుడు, మహాకాయుడు, మహాబృన్దశతాధిపుడు, సర్వజ్ఞాననిధి, సర్వసిద్ధి దానకృతోద్యముడు, అని ఇవి అష్టోత్తరనామములు. దశమూర్తులు దిక్కులలో, మార్గము నందు, వ్యాపించి నన్నెపుడూ కాపాడుగాత. సర్వేంద్రియములు స్వస్థములగుగావుత. నాకెప్పుడు శాంతి ఉండుగాత. శేషాది అష్టామూర్తులు విక్రమముచే భాస్వరములై" అగ్ని నిర్ఋతి, వాయు, ఈశదిక్పాలురు " నన్ను ఎల్లపుడూ కాపాడుగావుత. నాకు బాధలేని సౌఖ్యము, ఆరోగ్యము, జయము, దుఃఖహాని, విఘ్ననాశము, ప్రజావృద్ధి, సుభోదయము, ఇష్టప్రాప్తి, అతికళ్యాణము, అద్వేషము, ఆరోగము, అనాలస్యము, అభీష్టము, మృత్యుహాని, బలోన్నతి, భయహాని, కీర్తి కాంతి, విద్యా బుద్ధి, మహాసంపదలు, అనష్టద్రవ్యత, నష్టపునరాగములు, దీర్ఘాయుష్యము, మనోహర్షము, సౌకుమార్యము, అభీప్సితము, అప్రధృష్యతమత్వము, మహాసామర్ధ్యము, ఇవి అన్నియు హైహయేన్జూడగు కార్తవీర్యుని నామకీర్తనము వలన కలుగుగావుత.
ఇట్లు పుణ్యవర్ధనము, సర్వపాపప్రశనము, సర్వోపద్రవనాశనము సర్వశాంతికరము, గుహ్యము, సమస్త భయనాశనము, విజయార్టప్రదము సర్వసంపతరము శుభము అగు కార్తవీర్యార్జునకవచమును వినిననూ, చదివినమూ సర్వాభీష్టములను పొందును. పశ్వాదిధనము చోరులచే అపహరించబడినచో రాత్రిపూట పశ్చిమాది జ్ముఖుడై ఏడుమార్లు ఏడురోజులు కవచమును జపించినచో అపహరించబడినవి తిరిగి లభించును. ప్రాజ్ముఖుడై ఇరువది ఏడుమార్లు జపించినచో దేవాసురసములగు శత్రువులను కూడా జయించును. వివాదమున, ఘోరకలహమున, అయిదు - మార్లు పఠించినచో విజయమును పొందును. పరాజయమును పొందడు. సర్వరోగాది పీడలలో మూడుమార్లుకొని అయిదుమార్లుకొని చదివినచో రోగమృత్యుభేతాళ భూత పేతములచే బాధించబడడు. బంధముక్తి కొఱకు రాత్రిపూట చక్కగా పన్నెండుమార్లు పఠించవలయును. మూడు దినములలో బంధముక్తుడగును. ఈ విధానముచే సర్వసాధనకర్మలలో ఏడు దినములు చదివినచో అసాధ్యమగు కార్యమును కూడా సాధించగలుగును. ప్రయాణకాలమున ఈ కవచమును చదివి పయనించినచో మార్గమున దుష్టచోర వ్యాఘాదులు భయము కలుగదు. ఈ కవచమును జపించుచు అంజలిచే జల సేచనము చేసుకొనినచో విషకృత్యాది రోగస్పోటములచే బాధింపబడడు. కార్తవీర్యుడు, ఖలద్వేషి, కృతవీర్యసుతుడు, బలీ, సహస్రబాహువు, శత్రుఘ్నడు, రక్తవాసుడు, ధనుర్ధరుడు, రక్తగంధుడు, రక్తమాల్యుడు, రాజు స్మారకాభీష్టప్రదుడు అని ఈ పన్నెండు కార్తవీర్యుని నామములను పఠించువానికి సర్వసంపదలు కలుగును. సర్వజనులు వశులగుదురు. శ్రీచక్రావతారమును సర్వదా సేవించువాడు సర్వకాలములలో శ్రీమహావిష్ణుచక్రముచే కాపాడ బడుచుండును. నేనీ కవచమును దత్తాత్రేయముని వలన విని నీకు చెప్పితిని. అఖిలాభీష్టప్రదమగు ఈ కవచమును ధరించుము.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున కార్తవీర్యకవచకథనమను డెబ్బది యేడ - అధ్యాయము సమాప్తము.
