భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

132. సాంబోపాఖ్యానమున సూర్యప్రతిమా లక్షణ వర్ణనము

తా॥ నారదుడిట్లనెను. “సాంబా! నీకిపుడు సర్వదేవతల శ్రేష్టప్రతిమల లక్షణములను ముఖ్యముగా సూర్యభగవానుని ప్రతిమలక్షణమును గూర్చి చెప్పెదను-1. సూర్యభగవానుని ప్రతిమ, ఒకటిగాని, రెండుగాని, మూడుగాని, మూడున్నరగాని హస్తములప్రమాణముగ నుండుట శుభప్రదము-2. లేక ప్రాసాదముననుసరించి, ద్వారము ననుసరించిగాని ప్రమాణమును కల్పించి శ్రేయసొముడు ప్రతిమను నిర్మింపజేయవలెను-స, ఏక హాసప్రమాణములు గల ప్రతిమ 'సోమ'యని హసదయపమాణముగలది. 'ధనధాన్యప్రద' యనియు, త్రిహస్తప్రమాణముగలది' సర్వకామప్రద' యనియును చెప్పబడును-4. మూడున్నర హస్తముల ప్రమాణము గలది సుభిక్షమును, క్షేమమును కలిగించును. పైభాగమున, మధ్యభాగమున, అడుగుభాగముననంతట నొకే విధముగ సమముగను కుదురుగను, నున్న ప్రతిమ 'గాంధర్వి'యని తెలియవలెను. అట్టిది ధనధాన్యములను వృద్ధి నొందించును-5. దేవాలయ ద్వారమున నెనిమిదవ వంతునకు సమానముగ ప్రతిమ యగునట్లు నిర్మింపవలెను-6. ప్రతిమ యొక్క పొడవు వెడల్పుల గుణితము ఎనుబదినాలుగంగుళములకు సమానముగ నుండవలెను. అందు పన్నెండంగుళలముల పరిమితిగ ముఖముండవలెను-7. ముఖమునకంటే మూడేసి వంతుల చొప్పున చుబుకము (గద్దువ),ముక్కు నొసలు (నుదురు) ఉండవలయును. చెవులు నాసికతో సమానముగ నుండవలయును. రెండు చెవుల పొడవునకు తగ్గకుండ (హెచ్చునట్లు) పాదములుండవలెను-8. కన్నులు రెండంగుళములు, అందు మూడవ భాగము కంటినల్లగ్రుడుండవలెను-9 నుదురు, తల సమానమైన పొడవు కలిగియుండవలెను. శిరస్సు వైశాల్యము ఇరువది రెండంగుళములుండవలెను.

తా॥ ముక్కుతో సమానముగ మెడ, ముఖముతో సమానముగ హృదయ ప్రదేశము, (ముఖమునకు హృదయమునకు నడిమిచోటు) అటుపిమ్మట, ముఖమాత్రస్థలమును వదలి నాభి, అంతమాత్రమే స్థలమును వదలి మగగుటీ, ముఖవైశాల్యము ననుసరించి వక్షఃస్థలము, అందుసగము నడుముండవలెనని చెప్పబడినది-11. బాహువులు ప్రవాహ సదృశములై యుండవలెను. తొడలు, పిక్కలు బాహువులతో సమానములైయుండవలెను. కడుపునకు సరిగా క్రిందుభాగమున నాలుగంగుళములయెత్తుగ పాదములుండవలెను -12. పాదవిస్తృతి మొత్తముగానాఅంగుళములుండవలెను దానికి సరిపోవునట్లు బొట్టనవ్రేలు, జుట్టనవ్రేలు, తక్కిన మూడువ్రేళ్లును గోళ్లతోగూడ నుండవలెను-(13) పాదపు నిడివి పదునాల్డంగుళములుగ నుండవలెను. ఈ లక్షణములుగల ప్రతిమయే పూజకు యోగ్యమైయుండును-14. మూఁపులు, తొడలు, నుదురు, ముక్కు, సరిగానున్న కన్నులు, చెక్కిళ్ళు ఇవి యుబ్బెత్తుగ నుండునట్లు తీర్చవలెను-15. కన్నులు విశాలములై, తెలుపువన్నెగలిగి, సుందరములై అందమైన జెప్పలతో నిడుపులై యుండవలెను. చిఱునవ్వుతో దీపించు మోము దామరకు దొండ పండ్ల వంటి పెదవుల మరియుండవలెను-16. రత్నఖచితములై కాంతులీనేడు కిరీటము, కటకములు, (కడియములు) కేయూరములు, (బాహుపురులు) హారములు మున్నగు నాభరణములతో సూర్యమూర్తి శోభాయమానుడై ప్రకాశించుచుండవలెను. నిపుణముగ చెక్కబడిన పాదములు, నడుము మున్నగు నవయవములును మనోజ్ఞములగు నాభరణములచేఁగూర్పబడి యండవలెను-17. చెవులకు నైగనిగ్యముతో మెఱయుచున్న, మండలాకృతిగ సుందరములైన విచిత్ర మణికుండలముల నమర్పవలెను. ఒక చేత సువర్ణమాల మఱియొక చేత తామర పువ్వు ధరింపజేయవలెను-18. ఇట్లు మనోవాంఛాసిద్ధిప్రదమైన, సలక్షణమైన ప్రతిమను నిర్మింపజేయవలెను. భానుదేవుడు ప్రజలకెల్లవేళల శుభమును, ఆరోగ్యమును, అభయమును ఇచ్చుచు కాపాడుచుండును-19. ప్రతిమ అల్పాంగములు గలదైనచో రాజులకు భయము. అంగములలోటుపాట్లు గలదైనచో దారిద్ర్యము. కడుపులోఁతుగనున్నచో ఆఁకలి బాధ. కృశించియున్న యెడల లేమియు సంభవించును-20. ప్రతిమ యొంటిపై గాయములు, గాట్లుపడియున్నచో శస్త్రముల వలన భయము, పగుళ్ళువారి యున్నచో మృత్యుప్రదము. దక్షిణ దిశగా వంగియున్నచో నాయుఃక్షీణము-21. ఉత్తరమునకు వంగియున్నచో వియోగము కలుగుట నిశ్చయము. ప్రత్యక్ష పరోక్ష స్థితులందెల్ల వేళల ప్రతిమను కాపాడు చుండుట ప్రశస్తము.

తా॥ కాబట్టి యిహపరములలో శ్రేయస్సున పేక్షించు సూర్యభక్తుడు సూర్యుని ప్రతిమను మిక్కిలి యాదరముతో చూచుకొను చుండవలెను. ఏలయన సంపదలన్నియు తదధీనములే.-23. తల, తొడలు, చెక్కిళ్లు, ముఖము, ఇతరములగు నవయములన్నియు సలక్షముగ నున్న ప్రతిమయే శుభప్రదమగును-24. ముక్కు, నుదురు, పిక్కలు, తొడలు, లింగము, జొమ్ము, గుహ్యము పాదములు, కడుపు-ఇవియన్నియు సూర్యమూర్తికి కుదురుగ నుండవలెను-25. తామర పువ్వులోపలి వన్నెవంటి వన్నేతో ప్రకాశించువాడును, సన్నని వస్త్రముతోఁగప్పబడిన (కట్టబడిన) అధోభాగము గలవాడును, ప్రసన్నమైన ముఖము గలవాడును, ఎఱ్ఱగలువల కాంతిని బోలు పరివేషములచే నలకంకరింపబడిన ముఖముగలవాడును, వ్రేలాడుచున్నహారములు గలవాడును, భార్యలచే గూడియున్నవాడునునైన ఆ దేవదేవుడు మేలు కలిగించును. ప్రతిమ వికలాంగమయ్యెనేని కర్తకు రాజువలన భయము కలుగును. హీనాంగమయ్యని కర్తజీవితమసమగ్రమగును-27. కడుపు గుల్లగా నుండెనేని యాకలిభయము, అంగములు కృశించినట్లుండెనేని ధననాశము, ప్రతిమ పైన గాట్లుండెనేని కర్తకు శస్త్రపాతము వలన మరణము సంభవించుననియు నిర్దేశింపనగును-28. ఎడమవైపునెత్తుగను కుడివైపునకు వంగినట్లుండిన, భార్యకును, తనకును ఆయువు క్షీణింపజేయును. చూపు, పైయెసగనున్న, గ్రుడ్డితనము, క్రిందుచూపున్నచో, చింతను కలిగించును-29. ప్రతిమలన్నీంటి విషయమునను శుభాశుభఫలములిట్లు స్వయముగ సూర్యభగవానుని చేతనే చెప్పబడినవి. బ్రహ్మదేవుని మూర్తీ, చేత కమండలము కలిగి, నాలుగు ముఖములతో నొప్పారుచు, తామరపువ్వు పై కూర్చుండియుండినట్లు నిర్మింపవలేను-30. కుమారస్వామి విగ్రహము కౌమారదశను స్ఫురింపఁజేయు రూపముతో నుండి, చేతిలో శక్త్యాయుధము ధరించి మయూర ధ్వజముతోఁగూడి యుండవలెను. ఇంద్రుడు వజ్రాయుధపాణియై, నాలుగు దంతములుగల తెల్లని మైరావతమను ఏనుగు నధిరోహించియుండవలెను. అడ్డముగను, నిలువుగను ఉన్న నుదుటిపై మూడవ కన్ను గుర్తుగాగలిగి దిండియుండవలెను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సాంబోపాఖ్యానమునందలి సూర్యప్రతిమలక్షణ వర్ణనమను నూట ముప్పదిరెండవ అధ్యాయము సమాప్తము.