భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

30. చతుర్థీ కల్పమున వినాయక పూజా విధి

 తా॥ సుమంతుముని ఇట్లనెను. " బొట్టన వ్రేలి కణుపు పరిమాణముగా వేప కఱ్ఱతో గణపతిని చేసి నిత్యమును ధూపగంధాదులతో పూజించి కనబడకుండ దానిని తలమీద కట్టుకొనిపోవలేను. సర్వజనులకు ప్రియమైనవాడగును. తెల్లజిల్లేడు వేరుతో బొట్టన వేలంత గణపతిని చేసి ధూపాదులతో పూజించినచో అన్ని వర్ణములవారు వశమగుదురు. తెల్లచందనముతో బొట్టనవేలంత గణపతిని చేసి పుష్పగంధాదులతో పూజించి శుక్ల చతుర్థినాడు లేక అష్టమినాడు బలిచేయవలెను. ఎనిమిదివేలు పర్యాయములు పెరుగు పాయసముతో హవనము చేయవలెను. రాజును వశీకరించును. ఎఱ్ఱచందనముతో బొట్టన వేలంత గణపతిని చేసి భూత బలియిచ్చి పెరుగు తేనే నేయి ఆహుతులతో ఎనిమిది వేలు గణపతికి హవనము చేయవలెను. కోరినవారిని వశముచేయును. ఎట్టి గన్నేరు వేరుతో బొట్టనవ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేయింపవలెను. ఎఱ్ఱని పువ్వులు గంధము నైవేద్యములతో పూజింపవలెను. నువ్వులు, ఉప్పు, నేయితో ఎనిమిదివేల ఆహుతులీయవలెను. పది యూళ్లను వశము చేయును. తెల్లగన్నేరుతో బొట్టన వ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేసి, నువ్వుల పిండి, పెరుగు, నేయి, పాలు, పసుపు ఒక్కచోటకలిపి దానిని ఎనిమిదివేల ఆహుతులీయవలెను. వేశ్యను వశీకరింపగలుగును. రావి వేరుతో బొట్టనవ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేసి గంధపుష్ప ధూపబలిని సమర్పించి నూలుమార్లాహుతి చేయగా శత్రువు వశుడగును. జిల్లేడు వేరుతో నంతే పరిమాణమున గణపతిని చేసి గంధపుష్ప ధూప బలి ఇచ్చి నూలు తుమ్మిసమిధలతో ఆహుతి చేయవలెను. శత్రువు వశీభూతుడగును. మారేడు వేరుతో అంగుష్ఠపర్వమాత్రముగా గణపతిని చేసి గంధపుష్పధూపములతో నర్చించి త్రిమధువులతో కూడిన ఆహుతులు ఎనిమిదివేలిచ్చినచో రాజులను మంత్రులను వశముచేయును. తల పై ధూపములను ధరించి రాజద్వారము కడకుపోవలెను. యుద్దమున జయము కలుగును. ఏనుగు దంతముతో బొట్టన వ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేయింపవలెను. గంధపుష్ప ధూపార్చన చేసి బహుళచతుర్ధినాడు నగ్నముగా పూజింపవలెను. నిత్యము ఏడుమారులు జపము చేయవలెను. స్త్రీలకు సుందరుడగును. ఎద్దుకొమ్ముతో బొట్టన వేలంత గణపతిని చేయింపవలెను. గంధపుష్పార్చన చేసి గుగ్గులు ధూపము వేయవలెను. గొల్ల (పల్లె) పెద్దను వశమునకు దిచ్చును. ఇక పుట్టమన్నుతో బొట్టనవ్రేలి కణుపు పరిమాణమున గణపతిని చేయించి సొంటిపిప్పలి మిరియముల నూనెను ప్రతిమకు రాయవలెను. ఉమ్మెత్త కఱ్ఱలతో అగ్నిని రగిల్చి నువ్వులు ఆవాల మిశ్రమముతో ఎనిమిదివేల పర్యాయములు వ్రేల్చవలెను. అన్నివిధముల ధూపమువేసి సొంటి పిప్పలి మిరియాలు లేపనము చేయవలెను. అగరు ధూపము వేయవలెను. ఇట్లు చేసిన రాజువశమగును. ఇతరులకు ప్రేమ పాత్రుడగును. ఎఱ్ఱచందనముతో తాను పొగవేసికొనవలెను. సౌభాగ్యవంతుడగును. “ఓం గణపతయే వక్రతుండాయ గజదంతాయ గులగులేతి నినాదాయ చతుర్భుజాయ త్రినేత్రాయ ముశలపాశ వజ్రహస్తాయ సర్వభూతదమనాయ సర్వలోకవశంకరాయ సర్వ దుష్ణోపఘాత జననాయ సర్వశత్రు విమర్ధనాయ సర్వరాజ్య సమిహనాయ రాజానమీప వశమానయ హనహన పచ పచ వజ్రాంకుశేన గణేశఫట్ స్వాహా” “ఓం గం గీం గూం గైం గౌం గః స్వాహానమ:” ఇది మూలమంత్ర హృదయము. ఓం కః శిరః, ఓంఖః శిఖా, ఓం గః హృదయమ్, ఓం గుః వక్రమ్, ఓంగైంనేత్రం, ఓం ఘః కవచమ్ ఓం జం ఆవాహనం ఇవి హృదయం యొక్క ఆవాహనాంగములు. “ఓం నమః మూలమంత్ర హృదయము. “ఓం గాః శిరః, ఓంగైః నమః శిఖా ఓం గౌః నమః కవచమ్, ఓం గం నమఃనేత్రే ఓం గః ఫట్ అస్త్రమ్॥ ‘ఓం అంగుషోల్కాయ స్వాహా' హృదయము యొక్క ఆవాహనము, 'స్వాహా' హృదయము యొక్క విసర్జనము, "ఓం గంధోల్కాయ స్వాహా' ఇది గంధమునకు మంత్రము. 'ఓం ధర్మభూతోల్కాయ స్వాహా'. ఇది పుష్పమంత్రము. దుర్జయాయపూర్వేణ (తూర్పు) ఓం ధూర్జటయే దక్షిణేన (దక్షిణము) ఓం లంబోదరాయ పశ్చిమతః (పడమర) ఓంగణపతయే ఉత్తరత: (ఉత్తరదిశ) ఓం గణాధిపతయే ఐశాన్యాం (ఈశాన్యము) ఓం మహాగణపతయే ఆగ్నేయ్యామ్ (ఆగ్నేయమున) ఓం కూశ్మాండాయనైరృత్యామ్ (నైరృతియందు) ఓం ఏకదంత త్రిపుర ఘాతినే త్రినేత్రాయ వాయవ్యామ్ (వాయవ్యమున) ఓం మహాగణపతయే విద్మహే! వక్రతుండాయ ధీమహి! తన్నోదంతిః ప్రచోదయాత్॥ ఇది గణపతి గాయత్రీ మంత్రము. 1. పద్మ, 2. దంష్ట్రా 3. మాలా 4. ప్రకర్షణీ 5. పరశు 6. అంకుశ 7. పాశ 8. పటహ నామములు గల ఎనిమిది ముద్రలు చూపి అప్పుడు కర్మలు చేయింపవలెను. నల్లని నవ్వులతో ఎనిమిదివేల ఆహుతులీయవలెను. రాజును వశముగావించును. ఆవాహనమొదలుకొని నైవేద్యాంతము క్రమముగా పదకొండు ముద్రలు ప్రదర్శింపవలెను. ఏ విధిచేత త్రినేత్రుడు, శూలియునైన హరుని పూజింపవలెనో అదే విధిచేత విఘ్నేశ్వరుడైన గణపతిని పూజింపవలెను.

తా॥ మండల మదియే, అంగన్యాసమదియే, పూజయందలి మంత్రములివియే. అంతయు సమానమే-2. ఏకదంతుడు, పార్వతీపుత్రుడైన విఘ్నేశ్వరుని పూజించువానికి వీఘ్నములు నశించును. ఏ సమయమునను అశుభము కలుగదు-3. చతుర్థినాడు ఉపవాసముచేసి గణపతిని పూజించువాని పనులన్నియును సిద్ధించును. సందేహము లేదు-4. శివకుమారా! విఘ్నేశ్వరునకు అనుగ్రహపాత్రుడైన వానికి అన్ని పనులయందును జగత్తు అంతయును అనుకూలముగనుండును-5. అందువలన భక్తి శ్రద్దా సమన్వితుడే కుంకుమ అరుగుదూషము ఉండాళహారము, నూనులసిండి (మాంసాహారములు జాబి (ఉసిరికాయలు. జాబి ఉమ్మెత్త పువ్వులు మొదలగువానిచే గణపతిని పూజింపవలెను-6. శుక్లపక్ష చతుర్ధినాడు ఈ విధిచేత పూజింపవలెను. అట్లు పూజించువానికి నిర్విఘ్నముగ సర్వకార్యములు సిద్ధించును. సందేహములేదు-7. ఏకదంతుడు, జగన్నాథుడు, అయిన గణేశుడు తృప్తిపడినచో పితృదేవతలు, దేవతలు, మనుష్యాది సర్వభూతములు తృప్తిపడగలవు-8. అందుచేనితనిని భక్తి పురస్సరముగ కర్ణలేపములు, తునకలు, లడ్డువములు మొదలైన వానిచేత ఎప్పుడును పూజింపుచుండవలెను.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున చతుర్ధికల్పమునందు వినాయక పూజావిధి నిరూపణమను ముప్పదియవ అధ్యాయము సమాప్తం.