భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

37. పంచమీ కల్పాంతర్గత భాద్రపదిక నాగపంచమీ వ్రత వర్ణనము

తా॥  సుమంతు ముని యిట్లనెను. “అబులే భాద్రపదమాసమున శుక్లపక్ష పంచమినాడు, భక్తి శ్రద్ధలతో నలుపు, లేక తత్తుల్య వర్ణములతో ద్వారమున కిరువైపుల నాగులను చిత్రించి, గంధ పుష్పములతోను, నేయి, పాయసము, గుగ్గలుతోను పూజింపవలెను. అట్లు పూజించు వానికి తక్షకుడు మొదలగు సర్పములు సంతోషమును కలిగించును. అతనికి ఏడు తరముల వఱకును సర్పభయము కలుగకుండును. అందుచే బుద్ధిమంతుడు సర్వప్రయత్నములతో నాగపూజ నాచరించవలెను.

శతార్ధ సాహస్ర సంహిత యగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున పంచమీ కలాంతర్గత భాద్రపదిక నొగపంచమీ వ్రత వర్ణనమను పేరు గల ముప్పది యేడవ అధ్యాయము సమాప్తము.