భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
62. దిండ్యాదిత్య సంవాద వర్ణనము
దిండీరువాచ :
తా॥ సుముంతుముని యిట్లనెను. “ఇఁక నిప్పుడు సర్వపాపములను నశింపజేయగల ‘దిండి-సూర్యుల మధ్య జరిగిన ఒక రహస్యమైన సంవాదమును గూర్చి చెప్పెదను-1. మహాతపస్వియైన దిండి పూర్వమొకప్పుడు బ్రహ్మహత్యాపాతకము తగుల్కొనినవాడయ్యెను. ఆ పాపము నుండి విముక్తుడగుటకాతడు. సూర్యభగవానుని సూర్యభగవానుడా స్తోత్రమును సార్ధముగ విని మిక్కిలి సంతోషించెను. ఋషిగణనాయకుడైన దిండికి భగవానుడు ప్రత్యక్షమై యిట్లనెను. (3) ఆదిత్యుడిట్లు పలికెను. “ఓ దిండి మహరీ! భక్తితో నీవు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడనైతిని. ధర్మజ్ఞా! నీ మనస్సుననున్న వరమును కోరుకొనుము-4. దీండి యిట్లనెను దేవా! తాము నా సమీపమునకు వచ్చి దర్శనమిచ్చుటయే నాకు గొప్ప వరము. పాపాత్ములకు మీ దర్శనము స్వప్నమునందైనను లభింపదు గదా?-5. లోక గర్షితమైన బ్రహ్మహత్యాపాపమునకు సంభవించినది. అందజీ హృదయములందలి భావములను మీరు గ్రహింపగలుగుదురు-6. మీ యనుగ్రహము వలన నా యీ రచురితము నశించిపోవలెను. ఇంకను లోక నింద్యములగు పాపములేవి యున్నను అవియును నాశము పొందవలెను-7. ఓ భగవాన్! నేను కోరినవి సఫలములగునట్లను గ్రహింపుడు. ఈ ఊహతోడనే మిమ్ముస్తోత్రము చేసి ప్రార్థించితిని-8. ఎంతటి సుఖసంతోషములతో జీవించువాడైనను, ఎంతటి ఔన్నత్యముతో వెలిగిపోవువాడైనను సూర్యభగవానుడు ప్రసన్నుడు కానిచో నాతని మైశ్వర్యము లన్నియు వ్యర్థములగునని నాకు తెలియును-9. అగాథమైన సంసారమునందు మునిగిపోయిన నన్నుద్దరింపుడు. ఈ సంసార సుఖములు అంతమున దుఃఖమునే కలిగించును. అందుచేనవి నిజమునకు సుఖములుకావు.
తా॥ ముందు కాలమున ఎప్పుడెట్టి దుఃఖము కలుగునో, అది యెవడనుభవించుట వలన శమించునో తెలియదు. ఓ జగత్పతీ! అందువలన నన్ననుగ్రహింపుడు-11. భవార్ణవమును దాటింపగల జ్ఞానమునుపదేశింపుడు. “ఇట్లు దిండియడిగిన మీదట యోగవిత్తముడైన సూర్యభగవానుడు-12. అతనికి భవదుఃఖమున కౌషధమగు నిర్బీజయోగమునుపదేశించెను. నిష్కలమగు నా నిర్బీజ యోగమును విని యాతడు పరవశుడై ప్రకాశించెను -13. మహాతేజస్వీయగుదిండి సూర్యదేవునకు ప్రణమిల్లి యిట్లు బలికెను. “తమో విధ్వంసకా! దేవదేవా! మీరునుడివిన యీ యోగమును సాధించుటకు నాకుగాని, జితేంద్రియులుకాని వారగునితర మానవులకు గాని శక్యము కాదు-14. ఎల్లప్పుడును ఇంద్రియముల నాకర్షించేడు ‘విషయములు' జయింపరానివి. బలీయములైన యింద్రియములను జయించువాడెవడు?-15. అహంకార మమకార విఖ్యాతి గల మనస్సు చంచలమైనది. దానిని జయించుట దుస్సాధ్యము, అటులే వందల జన్మములెత్తినను రాగద్వేషాదులు వదలి పెట్టుటకు సాధ్యముకాదు.-16. దేవా! అటుల రాగాదులను విడిచి పెట్టలేనివారు, ఇంద్రియములను జయింపజాలనివారు, తమయనుగ్రహమున క్షీణపాపులై ఎట్లు మోక్షము నందగలరో తెలియగోరుచున్నాను”-17. దిండి వాక్యములను విని సూర్యదేవుడిట్లనెను. “గణనాథా నీవు మోక్షప్రాప్తిని కోరుచున్నయెడల సమస్త క్లేశములను నశింపజేయగల క్రియా యోగమును వినుము-18. నాకు భక్తుడవై నాయందే మనస్సు నిలుపుము. నన్నే పూజింపుము. నాకే నమస్కరింపుము. నిన్ను నీవు నాకు సమర్పించుకొనుటచే నన్నే పొందగలవు-19. నా భావనగలవారై, నన్నే యజించువారై నాకు భక్తులై, నన్నే పూజించు మానవులు నా యందే లయమును పొందుచున్నారు.
తా॥ ఎవని చేత నీవు 'కర్త వై యుంటివో అట్టి ఈశ్వరుడనైన నన్ను సర్వభూతముల యందు దర్శించుచు పాపముల నుండి ముక్తుడవు కాగలవు-21. చరాచరములయందు అంతట నేనేయున్నానని తెలిసి, రాగద్వేషములు నశించుట చేత కృతకృత్యత సిద్ధించును-22. మనస్సు ఒకచోట నిలువనేరక చంచలమై యుండినచో మిక్కిలి భక్తిప్రేమలతో నాయందు నిలిపి నా మూర్తినీ సిద్దము చేసికొనుము-23. బంగారముతో, వెండితోగాని, శిలతోగాని, మట్టితోగాని, కఱ్ఱతోగాని లేక చిత్తరువు ద్వారా గాని నా స్వరూపమును సిద్ధపఱచి వివిధములైన పూజా నైవేద్య సమర్పణలతో ముక్కంటినైన నన్ను పూజింపుము-24. ఎల్లప్పుడు ఆమూర్తియందే మనస్సునుంచి, దానినే ఆశ్రయించుకొని సర్వాత్మనా భక్తితో పూజించుచు, ధ్యానించుచుండినచోనుపకారకము కాగలదు-25., పోవుచు, నిలుచుచు, పరుండుచు, తినుచు, ముందట, వెనుక, పైన, క్రింద, ప్రక్కన తన్మయుడవై అతనినే (నన్నే) భావించుచు-26. తీర్ధోదక స్నానములచేత, అందమైన పూలచేత, గంధపుంబూతలచేత, వస్త్రములచేత, భూషణములచేత, భక్ష్యభోజ్యాదులచేత, ఆహ్లాదకరములైన గీతములచేత, వాద్యముల చేత-27. భోజ్యాది పదార్థములతో నీకిష్టమైన రెల్ల, ఏ కొంచెమైనను భక్తి వినయములు గలవాడవై నాకు (నా యాకృతికి) సమర్పించుచు నన్ను సంతోషింపజేయుము-28. ఒక వేళ రాగముచే గాన మాకర్షించినచో నా యందే బుద్దిని నిలిపి నా కథను గానము సేయుము-29. నీ మనస్సు కథతోనానందించు నేడ నా స్వరూపములను గుఱించిన ఆయా కథలను ప్రీతితో గూడి వినుము.
తాII ఇట్లు మనోబుద్ధులను నాకర్పించి, హేయములైన పాపములను విడిచి సుఖముగా నుండుము-31, రాగద్వేషములు నశింపని వాడవైనను, నా ప్రేమకు పాత్రుడవై పరమపదమునుపొందుదువు. భయపడకుము. మనస్సు నాయందు లగ్నము చేయుము-32. అన్నియును నాయందు వదలి ప్రయత్నశీలుడవు కమ్ము, నా కొఱకే కర్మలను చేయుము. ధర్మవిరుద్ధముగ ప్రవర్తింపకుము-33. ఈ విధముగనే బ్రహ్మహత్యాది పాపములనన్నింటిని నశింపజేసికొని ముక్తినందెదవు. ఇటులనీ కంతయిఁ జెప్పితిని-34. మనస్సు నాయందే నిలిపి క్రియా యోగ పరుడవు కమ్ము"-34. సూర్యభగవానుని ఈ ఉపదేశము విని దిండి యిట్లనెను. “జగన్నాథా! నా హితమును కోరి క్రియా యోగామృతము నింకను విస్తరించి చెప్పుడు. నాయెడ ప్రసన్నులుకండు. హే జగద్గురూ! మీరు తప్ప దీనిని గూర్చి చెప్పగల సమర్థులింకేవరు గలరు? రహస్యము, పవిత్రమునైన ఈ యోగమును ఇంకను వివరించి నన్ననుగ్రహింపుడు"-37, సూర్యభగవానుడిట్లనెను. “ నిర్వికల్పమునైన నదియంతయు నీకు వివరింపబడగలదు. “ఇట్లు చెప్పి సర్వలోక ప్రదీపకుడగు సూర్యుడంతర్షిడయ్యెను-38. మహాతేజుడైన దిండియు వెంటనే ఆకాశమార్గమున పయనించెను-39.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున దండ్యాదిత్య సంవాద వర్ణనమను అటువది రెండవ అధ్యాయము సమాప్తము.
