భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

71. బ్రహ్మ ప్రోక్తమగు సూర్యనామ వర్ణనము

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “సూర్య దేవుడే నామములతో తనను స్తోత్రము చేసిన సంతుష్టినొందునో వానిని మొదటి నుండీ క్రమముగా కీర్తించుచున్నాను. 'ఓం సూర్యాయ నమః, నిత్యాయనమః, రవయే నమః, కార్యభానవేనమః, భాస్కరాయనమః, మతంగాయనమః, మార్తాండాయ నమః, వివస్వతే నమః-2. ఆదిత్యాయ నమః, ఆది దేహాయ నమః, రశ్మిమాలినే నమః, దివాకరాయనమః, దీప్తాయ నమః, అగ్నియే నమః, మిహిరాయ నమః-3. ప్రభాకరాయ నమః, మిత్రాయ నమః, అదితి సంభవాయ నమః, గోపతయే నమః దిశాంపతయే నమః-4.. ధాత్రే నమః, విధాత్రే నమః, అర్యమే నమః, వరుణాయ నమః, పూ షే నమః, భగాయ నమః, మిత్రాయ నమః, పర్జన్యాయ నమః, అంశవే నమః-5. హితకృతే నమః, ధర్మాయ నమః, తపనాయ నమః, హరయే నమః, హరితాశ్వాయ నమః, విశ్వస్య పతయే నమః-6. విష్ణవే నమః, బ్రహ్మణే నమః, త్ర్యంబకాయ నమః, ఆత్మనే నమః , సప్తలోకేశాయ నమః, సప్త సప్తయే నమః-7. ఏక స్మై నమః, తుభ్యం నమః, , ఏకచక్ర రధాయ నమః, జ్యోతిషాంపతయే నమః, సర్వ ప్రాణ భృతే నమః-8. సర్వ భూత హితాయ నమః, శివాయ నమః, ఆర్తి హరాయ నమః, పద్మప్రబోధాయ నమః, వేదాది మూర్తయే నమః-9. కాధిజాయ నమః, తారా సుతాయ నమః, భీమ జాయ నమః, పావకాయ నమః-10, ధిషణాయ నమః, కృష్ణాయ నమః, నిత్యదాయ నమః, ఆదిత్య పుత్రాయ నమః, లక్ష్యాయ నమః.

తా॥ఈ సూర్య నామములను సర్వ కాముడనైన నేను సూర్య దేవుని ఆరాధనము కొఱకు పూర్వము చెప్పియుంటిని-12. ఈ నామములను ప్రాతస్సోయం సమయములందు శుచియై ఏకాగ్ర మనస్కుడై పఠించువాడు, నేను పూర్వము నా కోరికలన్నింటిని బడసినట్లు సఫలమనో రధుడగును-13. మహాత్ముడైన భాస్కర దేవుని ప్రసాదమువలన ధనమును కోరువాడు ధనమును పొందును. ధర్మము కావలసినవాడుధర్మమును పొందును-14. వ్యాధితో బాధపడువాడు ఆరోగ్యవంతుడగును. బదుడు బంధ ముక్తుడగును. రాజ్యము కోరువాడు రాజ్యమును పొందును. కామార్థి కామమును పొందును-15. ఈ సొమావళిని రహస్యముగ జపింపవలెను. ఇది సంధ్యో పొసనమే యగుచున్నది. దీనిని జపించిన మాత్రమున మనుష్యుడు పాపము నుండి ముక్తుడగును-16.

శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పము నందు బ్రహ్మ ప్రోక్తమగు సూర్య నామ వర్ణనమను డెబ్బది యొకటవ అధ్యాయము సమాప్తము.